పెళ్లి చేసుకోవడమే ఆలస్యం.. ఇంతలోనే షాకిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ! | Pavitra Punia Makes Shocking Statement Amid Breakup Rumours with Eijaz Khan | Sakshi
Sakshi News home page

Pavitra Punia: ఏడాది కింద నటుడితో నిశ్చితార్థం.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిన బ్యూటీ

Published Fri, Dec 22 2023 12:49 PM | Last Updated on Fri, Dec 22 2023 1:12 PM

Pavitra Punia Makes Shocking Statement Amid Breakup Rumours with Eijaz Khan - Sakshi

బుల్లితెర జంట పవిత్ర పూనియా- ఇజాజ్‌ ఖాన్‌ విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలాకాలంగా ఈ రూమర్స్‌పై నోరు విప్పని పవిత్ర తొలిసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా అభిమానులతో నేనెప్పుడూ టచ్‌లోనే ఉంటాను. అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నా.. దయచేసి దీని(బ్రేకప్‌ రూమర్స్‌) గురించి ఎవరూ మాట్లాడొద్దు. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. నన్ను, అలాగే ఇజాజ్‌ను కూడా సపోర్ట్‌ చేయండి. మా మధ్య ఏదైతే జరిగిందో బహుశా ఏదో ఒక కారణం వల్లే అది జరిగుండొచ్చు.

పెళ్లికి నో.. ఆ వార్తలు నిజమే!
ఇప్పుడు నేను నా కెరీర్‌ పైనే ఫోకస్‌ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యే నా తండ్రిని కోల్పోయాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. కానీ అతడు నన్ను తల్లిగా చూస్తాడు. నేను తనను చిన్నపిల్లాడిగా చూసుకుంటాను. ఇప్పుడు నా కుటుంబానికి నా అవసరం ఎంతో ఉంది. నా కోసం, నా కుటుంబం కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. అది మీరు ప్రేమతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంతకంటే ఏం చెప్పలేను. నా ఫ్యామిలీ బాధ్యతలు నేను భుజాన ఎత్తుకున్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. మా రిలేషన్‌ గురించి ఏదైతే ప్రచారం జరుగుతుందో అది నిజమే!' అంటూ బ్రేకప్‌ వార్తలు వాస్తవమేనని ధ్రువీకరించింది నటి.

బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదలైన లవ్‌
కాగా పవిత్ర పూనియా.. లవ్‌ యూ జిందగీ, యే హై మొహబ్బతే, నాగిన్‌ వంటి సీరియల్స్‌లో నటించింది. అలాగే హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లోనూ పాల్గొంది. ఇజాజ్‌ ఖాన్‌ విషయానికి వస్తే.. ఈ నటుడు గతంలో అనిత హస్సనందానీతో డేటింగ్‌ చేశాడు. కొంతకాలానికే ఆమెకు బ్రేకప్‌ చెప్పి కెనడియన్‌ సింగర్‌ నటలై డి లుసియోతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి వీరి బంధం ముక్కలైంది. బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో పాల్గొన్నప్పుడు నటి పవిత్ర పూనియాతో పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. వీరు గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకులోపే బ్రేకప్‌ చెప్పుకుని అభిమానులకు షాకిచ్చారు.

చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి.. జీవితాంతం ఈ చేయి విడవనంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement