తెలుగు సినిమాలో టాప్ కమెడియన్ ఎవరంటే బ్రహ్మానందం అని టక్కున చెప్పేస్తారు. అలాగే బాలీవుడ్‌లో బడా కమెడియన్ అనగానే చాలామందికి రాజ్‌పాల్ యాదవ్ గుర్తొస్తారు. 25 ఏళ్లుగా హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న అతడు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అప్పుడు రోజులు ఎలా ఉండేవంటే.. 20 ఏళ్లకే మన చేతిలో ఉద్యోగం ఉందంటే చాలు.. జనాలు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉండేవారు. మా నాన్న వారి మాటలు విని నాకు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశాడు. నా మొదటి భార్య నాకు ఓ బిడ్డను ప్రసాదించి చనిపోయింది.
నా చేతులతో ఆమె శవాన్ని..
నేను ఇతర పనులతో బిజీగా ఉండటంతో ప్రసవమైన మరునాడు ఆమెను వెళ్లి చూద్దామనుకున్నాను. ఇంతలోనే ఆమె మరణించిందన్న కబురు అందింది. ఈ చేతులో ఆమె శవాన్ని మోశాను. తనను హత్తుకుని ఏడ్చాను. అయితే నా కుటుంబం నా కూతురికి తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచింది. 2003లో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. తన ఊరికి వెళ్లినప్పుడు ఆమె వారి సాంప్రదాయం ప్రకారం తన ముఖం కనిపించకుండా ఓ వస్త్రాన్ని కప్పుకుని ఉంది. ఆమె చాలా తొందరగా మా యాసభాషను నేర్చుకుంది. నేను మా అమ్మతో ఎలా మాట్లాడతానో తను కూడా తనతో అలాగే మాట్లాడేది.
నా రెండో భార్యకు 5 భాషలు వచ్చు
నువ్వు చీర కట్టుకోవాలి లేదంటే ఇలాంటి డ్రెస్‌లే వేసుకోవాలని నా భార్యకు నేనెప్పుడూ ఆంక్షలు పెట్టేవాడిని కాదు. తనకు ఐదు భాషలు వచ్చు. నా తల్లిదండ్రులు, గురువు తర్వాత నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తి నా భార్యే! నా కూతుర్ని కూడా తన కూతురిలా కంటికి రెప్పలా చూసుకుంది. నా కూతురిప్పుడు పెళ్లి చేసుకుని లక్నోలో సెటిలైంది. తను సంతోషంగా ఉంటోందంటే అందుకు కారణం నా కుటుంబం, నా భార్యే! నేను చేసిందేమీ లేదు, వాళ్లవల్లే ఇదంతా సాధ్యమైంది' అని చెప్పుకొచ్చాడు రాజ్‌పాల్ యాదవ్. కాగా ఇతడు ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న 'సత్యప్రేమ్ కీ కథ', ఆయుష్మాన్ ఖురానా 'డ్రీమ్ గర్ల్ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు.
చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేశ్?
Comments
Please login to add a commentAdd a comment