సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కష్టాలు తప్పవు. బిగ్‌బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మునావర్ ఫరూఖి తన జీవితంలో ఎదుర్కొన్న ఓ పెద్ద సమస్యను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. మునావర్ మాట్లాడుతూ.. నా కొడుడు మైఖేల్‌కు ఏడాదిన్నర వయసున్నప్పుడు కవసాకి అనే అరుదైన వ్యాధి సోకింది. దీనివల్ల రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది.
అరగంటపాటు షాక్‌లో
అలాగే గుండెకు సైతం హాని జరిగే ప్రమాదం ఉంది. వాడి పరిస్థితి గురించి చెప్పగానే అరగంటపాటు షాక్‌లో ఉండిపోయాను. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.25,000 ఉంటుందన్నారు. నా దగ్గర చూస్తే రూ.700 మాత్రమే ఉన్నాయి. నా గర్వాన్ని పక్కనపెట్టి ముంబై వెళ్లా.. అందరి దగ్గరా చేతులు చాచి సాయమడిగాను. ట్రీట్‌మెంట్‌కు అవసరమైన డబ్బును మూడుగంటల్లో సమకూర్చి హాస్పిటల్‌లో కట్టేశాను. కానీ ఆ డబ్బు సేకరించడం కోసం పడ్డ కష్టం, వేదన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.
నా ముఖంలో సంతోషం లేదు
అలాగే హాస్పిటల్‌లో డబ్బు కట్టేశాక కూడా నా ముఖంలో సంతోషం లేదు. ఎందుకంటే అది నా డబ్బు కాదు కదా! ఆరోజే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా మునావర్ గతంలో జాస్మిన్‌ను పెళ్లాడాడు. వీరికి పుట్టిన సంతానమే మైఖేల్. ఇటీవలే మునావర్.. మెజబీన్ కోట్‌వాలా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment