బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఇటీవల ఢిల్లీలో ఓ పెళ్లికి హాజరయ్యాడు. వధూవరులతో ముచ్చటించడంతో పాటు స్టేజీపై డ్యాన్స్ కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పెళ్లికూతురి మేకప్ ఆర్టిస్ట్ అమృత కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కాగా పెళ్లికూతురు ఎంతో అదృష్టవంతురాలని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.
అతిథిగానా? లేదా..
ఓ వ్యక్తి.. వివాహ వేడుకకు వచ్చేందుకు షారూఖ్ ఎంత తీసుకున్నాడు? అని అడగ్గా అతడు ఫ్యామిలీ ఫ్రెండ్ అని అమృత బదులిచ్చింది. అతడు అతిథిగా వచ్చాడా? లేదా స్టేజీపై పర్ఫామ్ చేయడానికి వచ్చాడా? అని మరొకరు ప్రశ్నించగా అఫ్‌కోర్స్.. స్టేజీపై సందడి చేసేందుకే వచ్చాడని అమృత రిప్లై ఇచ్చింది.
సినిమా
సినిమాల విషయానికి వస్తే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారూఖ్ కూతురు సుహానా కూడా భాగం కానుంది. అలాగే ముఫాసా: ద లయన్ కింగ్ అనే యానిమేటెడ్ సినిమాలో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment