వీడియో లీక్‌పై స్పందించిన హీరోయిన్‌.. జీవితం నాశనం చేస్తారా? | Pragya Nagra Strong Reaction on Private Video Leaks | Sakshi
Sakshi News home page

Pragya Nagra: ఇంత దారుణానికి ఒడిగడతారా? మీ చెత్త ఆలోచనలతో..

Published Sat, Dec 7 2024 4:05 PM | Last Updated on Sat, Dec 7 2024 4:26 PM

Pragya Nagra Strong Reaction on Private Video Leaks

హీరోయిన్‌ ప్రగ్య నగ్ర ప్రైవేట్‌ వీడియో లీకైందంటూ నిన్నటినుంచి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రియుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఇది చూసిన హీరోయిన్‌ ప్రగ్య నగ్ర షాక్‌కు గురైంది. టెక్నాలజీని వాడుకుని తనను దారుణంగా చిత్రీకరించారని వాపోయింది. ఈమేరకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది.

పీడకల అయితే బాగుండు
ఇప్పటికీ నమ్మలేకున్నాను. ఇదంతా ఒక పీడకల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సాయపడాలే కానీ మన జీవితాల్ని నాశనం చేయకూడదు. దరిద్రపుగొట్టు ఆలోచనలు ఉన్న దుర్మార్గులు ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) సాయంతో చెత్త వీడియో సృష్టించారు. దాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఎవరికీ ఇలా జరగడకూదు
ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్నవారికి చాలా థాంక్స్‌. ఏ అమ్మాయికీ ఇలాంటి దారుణ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను​. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి అని రాసుకొచ్చింది. దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌ పోలీసులను ట్యాగ్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు నీ ధైర్యాన్ని కోల్పోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమా
వరళరు ముఖ్యం అనే తమిళ సినిమాతో 2022లో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది తమిళంలో ఎన్‌4, మలయాళంలో నదికళిల్‌ సుందరి యమున సినిమాలు చేసింది. ఈ ఏడాది లగ్గంతో తెలుగువారిని పలకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement