విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాబోయే మార్చిలో రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ఇతడి తండ్రి స్వయంగా మాట్లాడటినట్లు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ టాపిక్ అసలు ఎందుకొచ్చింది?
(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామంది రష్మిక అని అంటారు. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజులుగా రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇది నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఓ టూర్‌కి కలిసి వెళ్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎంత చర్చ నడిచినా కిక్కురుమనరు.
తాజాగా విజయ్ తండ్రి గోవర్దన్‌ని కొడుకు పెళ్లి గురించి అడిగితే.. విజయ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడని, గౌతమ్ సినిమా జరుగుతోందని, సంక్రాంతి తర్వాత మైత్రీ మూవీస్ నిర్మాణంలో సినిమా ఉంటుందని, అనంతరం కొన్నాళ్లకు దిల్ రాజు నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పారు. అందుకే కాస్త వీలు చూసుకుని, విజయ్‌కి టైమ్ కుదిరినప్పుడే పెళ్లి ఆలోచన చేస్తామని అన్నారు. దీనికి మరో ఆరు నెలల నుంచి ఏడాది పట్టొచ్చని చెప్పారు. అంటే ఇప్పట్లో విజయ్ పెళ్లి లేనట్లే!
(ఇదీ చదవండి: నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్)
Comments
Please login to add a commentAdd a comment