తిరుమలలో నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ దర్శకుడు | Colour Photo Movie Director Sandeep Raj Marriage At Tirumala, Wedding Photo Trending On Social Media | Sakshi
Sakshi News home page

Sandeep Raj Marriage: తిరుమలలో నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ దర్శకుడు

Published Sat, Dec 7 2024 11:18 AM | Last Updated on Sat, Dec 7 2024 4:16 PM

Colour Photo Director Sandeep Raj Marriage At Tirumala

టాలీవుడ్‌ దర్శకుడు సందీప్ రాజ్ తిరుమలలో వివాహం చేసుకున్నారు. 'కలర్ ఫోటో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చకున్న ఆయన తన తొలి మూవీలో చిన్న పాత్ర చేసిన చాందిని రావుతో కలిసి ఏడడుగులు వేశారు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి.

షార్ట్‌ ఫిల్మ్‌లతో కెరీర్‌ ప్రారంభించిన సందీప్‌ రాజ్‌ .. కలర్‌ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తిరుమల వేదికగా నేడు చాందిని రావుతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడం ఆపై మూడు ముళ్ల బంధం వరకు సాగడంతో వారు చాలా సంతోషంగా కనిపించారు. పెద్దల అంగీకారంతోనే జరిగిన ఈ వేడుకలో కలర్‌ ఫోటో సినిమాలో నటించిన హీరో సుహాస్‌, వైవా హర్ష పాల్గొన్నారు.

'కలర్ ఫోటో' సినిమా ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. చిరంజీవి వంటి స్టార్స్‌ కూడా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. సందీప్‌ రాజ్‌ ప్రస్తుతం సుమ- రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌తో 'మోగ్లీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement