Munawar Faruqui
-
ఇటీవలే రెండో పెళ్లి.. భార్యతో కేక్ కట్ చేసిన బిగ్‌బాస్ విన్నర్!
బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫారూఖీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నారు. గతేడాది బిగ్‌బాస్ సీజన్-17లో విజేతగా నిలిచిన మునావర్ మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజబీన్ కోట్వాలాను పెళ్లాడారు. పెళ్లయిన పది రోజుల తర్వాత ముంబయిలో రిస్పెప్షన్ వేడుక కూడా నిర్వహించారు.తాజాగా మునావర్.. తన భార్య మహ్జబీన్ కోట్వాలాతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరలవుతున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కోట్వాలాను సీక్రెట్‌గా వివాహం జరిగిన విషయం అత్యంత సీక్రెట్‌గా ఉంచారు. ఈనెల 26న ఆదివారం ముంబయిలోని ఐటీసీ మరాఠాలో రిసెప్షన్‌తో ఈ విషయం బయటకొచ్చింది. ఈ వేడుకలో నటి హీనా ఖాన్ సందడి చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఫోటోను పంచుకున్నారు.కాగా.. మునావర్‌కు గతంలోనే వివాహం జరిగింది. అతనికి మొదటి భార్యతో ఓ కుమారుడు ఉన్నాడు. మరోవైపు మెహజబీన్కు కూడా 10 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by MunawarXTabish (@munawar___faruquiiii) -
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ విన్నర్!
బిగ్‌బాస్ సీజన్-17 విన్నర్ మునావర్ ఫారూఖీ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. స్టాండ్ అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మునావర్ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్- 17 విన్నర్‌గా నిలవడంతో మరింత ఫేమ్ దక్కించుకున్నారు.అయితే తాజాగా మునావర్ ఫరూఖీ రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ముంబైలోని ప్రముఖ ఐటీసీ హోటల్లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మునావర్ తన పెళ్లి ఫోటోలను ఇప్పటి వరకు షేర్ చేయలేదు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజ్బీన్ కోట్వాలా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మునావర్ దాదాపు 10-12 రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముంబయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.అతని వివాహానికి అత్యంత సన్నిహితురాలు అయిన నటి హీనా ఖాన్ హాజరైనట్లు కూడా తెలుస్తోంది. 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఆమె సెల్ఫీని కూడా పంచుకుంది. కాగా.. బిగ్ బాస్ 17లో మునావర్ తన మాజీ ప్రేయసి అయేషా ఖాన్ మోసం చేశాడని ఆరోపించింది. అతని మాజీ స్నేహితురాలు నజీలా సితాషి కూడా అతను పెద్ద మోసగాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ అరెస్ట్, ఆపై విడుదల
ముంబై: ప్రముఖ స్టాండప్ కమెడియన్, బిగ్‌బాస్ 17 విన్నర్ మునావర్ ఫరూకీపై కేసు నమోదైంది. ఆయనతోపాటు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ఓ హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడి సందర్భంగా వీరిని అరెస్ట్ చేశారు. దాడి జరిగిన సమయంలో ఫరూకీ హుక్కా బార్లో ఉన్నారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఫరూకీపై సిగరెట్స్ ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు అనంతరం మునావర్‌ను విడుదల చేసినట్లు బుధవారం ముంబై పోలీసులు వెల్లడించారు. హుక్కా పార్లర్లో పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ వాడుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో పోలీసులు రూ. 13,500 విలువైన 9 హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. చదవండి: Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు -
బిగ్‌బాస్ విన్నర్ చేతిలో ఔటైన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
థానే వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) తొట్టతొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ లీగ్ ప్రారంభ వేడుకలలో సెలబ్రిటీలు, క్రికెటర్లు సందడి చేశారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మెగా పపర్ స్టార్ రాంచరణ్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తమిళ నటుడు సూర్య, భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, సురేష్ రైనా ఈ వేడుకల్లో భాగమయ్యారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహకులు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుపడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన మంచి ఊపు మీద కన్పించిన సచిన్.. స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన సచిన్.. మరో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ విషయానికి వస్తే.. ఇది టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్‌తో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి. రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. .@ispl_t10 is poised to amaze us all, much like Munawar did by dismissing the 𝐌𝐚𝐬𝐭𝐞𝐫 𝐁𝐥𝐚𝐬𝐭𝐞𝐫 👀 🤯 #SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo pic.twitter.com/801LO25ilh — Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024 -
జైలు జీవితం నుంచి 'బిగ్ బాస్' విన్నర్‌గా నిలిచిన కమెడియన్
హిందీ, కన్నడ బిగ్ బాస్ సీజన్స్ రియాల్టీ షోలు ఒకే రోజు ముగిశాయి. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 విజేతగా కార్తీక్ మహేష్ నిలుస్తే.. హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ట్రోఫీని స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా నటుడు అజయ్ దేవగన్ హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్‌కు హాస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. పోటీలో చివరిగా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ అభిషేక్ కుమార్, మునావర్ ఫారూఖీల చేతులు పట్టుకుని స్టేజీపైకి సల్మాన్ వచ్చారు. ఎంతో ఉత్కంఠతకు దారితీసిన ఫైనల్ ఎపిసోడ్లో 'విజేత' మునావర్ ఫరూఖీని సల్మాన్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విజేతగా నిలిచిన మునావర్ ఫరూఖీకి రూ.50 లక్షల డబ్బుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. ఆకర్షణీయమైన ట్రోఫీని అందుకున్న మునావర్ ప్రేక్షకుల వైపు చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్ విన్నర్ అతనే అని చాలామంది అభిప్రాయపడ్డారు. అందరూ అనుకుంటున్నట్లే ఆయన విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. జైలు జీవితం నుంచి బిగ్ బాస్ విజేతగా పయనం మునావర్ ఒక కార్యక్రమంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ గతంలో బీజేపీ ఎంపీ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్‌కు చెందిన మునావర్ ఫరూఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయన చివరకు బెయిల్ మీద విడుదల అయ్యాడు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో 'లాక్ అప్' 2022 సీజన్లో మునావర్ ఫరూఖీ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా ఆయన బిగ్‌బాస్ సీజన్లో కూడా విన్నర్‌గా గెలవడంతో ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. ఈ సీజన్లో కామెడీతో పాటు చమత్కారంతో ప్రేక్షకులను మెప్పించిన మునావర్.. 17 మందిలో విజేతగా నిలిచాడు. ఐదో స్థానంలో హైదరాబాద్ యూట్యూబర్ బిగ్ బాస్ 17వ సీజన్లో హైదరాబాద్ యువకుడు అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి ఐదో స్థానంలో నిలిచి మెప్పించాడు. శ్రీకాంత్ యూట్యూబర్‌గా రానిస్తున్నాడు. సీజన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఇతగాడు బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. The moment #MunawarFaraqui𓃵 became the winner Of #BB17 🎉🔥 even He also Shared His trophy with #AbhishekKumar 😍💞 Dosti ho Toh #MunAbhi jaisa MUNAWAR THE DEFINITE WINNER HBD KING MUNAWAR Follow Me 🙏 #BB17Finale #MunawarFaraqui𓃵 #BB17 #MKJW #MunwarKiJanta pic.twitter.com/wClV3YSt6j — LiveKhabri❄ (@theLiveKhabri) January 28, 2024 -
Munawar Faruqui: స్టాండప్ కమెడియన్‌కి ఊరట
ఢిల్లీ: స్టాండప్ కమెడియన్, ర్యాపర్ మునావర్ ఫరూకీకి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో దేశవ్యాప్తంగా మునావర్‌కి వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని ఇండోర్(మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాని సోమవారం కోర్టు ఆదేశాలు జారీచేసింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఓ షోలో మునావర్ వ్యాఖ్యలు చేశాడని, మతపరమైన మనోభావాలు దెబ్బతీశాడని దేశవ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారం పెను దుమారమే రేపింది. ఈ మేరకు బెయిల్ మీద బయట ఉన్న మునావర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. మునావర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను ఇండోర్‌కు బదిలీ చేయాలని బెంచ్ ఆదేశించింది. అంతేకాదు.. ఫరూకీకి కల్పించిన మధ్యంతర బెయిల్‌ను మరో మూడు వారాలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2021, జనవరి1వ తేదీన ఇండోర్‌లోని 56 దుకాణ్ ఏరియాలోని ఓ కేఫ్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మునావర్ ఓ కామెడీషో నిర్వహించాడు. ఈ షోలోనే మునావర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు ఆ సమయంలో ఉన్న కరోనా ఆంక్షలను సైతం ఉల్లంఘించి మరీ షోను నిర్వహించినట్లు తేలింది. దీంతో మునావర్‌పై పలు చోట్ల ఫిర్యాదు వెళ్లాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు మునావర్‌కు బెయిల్ తిరస్కరించగా.. సుప్రీం కోర్టు మాత్రం 2021, ఫిబ్రవరి 5వ తేదీన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. -
Munawar Faruqui: మునావర్ ఫారుఖీ షోకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: మునావర్ ఫారుఖీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే షో కోసం మునావర్ ఫారుఖీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఢిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావించడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫారూఖీ షో ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: (చర్లపల్లి జైలులో రాజాసింగ్.. పీడీ యాక్ట్ రివోక్‌పై ప్లాన్ ఫలిస్తుందా?) -
Hyderabad: పరేషాన్లో పాతబస్తీ.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్!
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం వారం, పదిరోజులుగా నిత్యం ఏదో ఒక విషయంతో జాతీయ స్థాయి వార్తల్లో ఉంటోంది. మునావర్ కామెడీ షో అనౌన్స్మెంట్ మొదలు తాజాగా జరుగుతున్న రాజాసింగ్ ఇష్యూ వరకు ప్రతి రోజూ నగరానికి సంబంధించిన విషయాలు వేడి పుట్టిస్తున్నాయి. నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు పహారా పెంచడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో ఆంక్షలు విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకసారి ఈ మొత్తం ఘటనలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మునావర్ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గతంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన మునావర్ షోకు అనుమతి ఎలా ఇస్తారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షోను అడ్డుకుంటామని చెప్పారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్‌ను దగ్దం చేస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితులు నడుమ రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకొని హౌజ్ అరెస్ట్ చేశారు. ఉత్కంఠతో మొదలై.. ప్రశాంతంగా ముగిసిన మునావర్ షో ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రిక్తత, అరెస్టుల నడుమ మునావర్ ఫారూఖీ ఆగస్టు 20న హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టి కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఒకటి తర్వాత మరొకటి నగరంలో సోమవారం రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కె.కవిత ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతల అరెస్టులు జరుగుతుండగానే... ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదల వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. దీనిపై పెద్ద స్థాయిలో నిరసనలు, కేసులు, అరెస్టు తదితరాలతో నగరం రణరంగంగా మారింది. దీనికితోడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై సోమవారం బీజేపీ నాయకులు దాడి చేశారు. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు, కార్యకర్తలపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు, అరెస్టులపై బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి వరకు ఆందోళనలకు దిగాయి. ఇది సద్దుమణగక ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. దీంతో నగర వ్యాప్తంగా నిరసనలు జరగడంతో పాటు ఆందోళనకారులు బషీర్‌బాగ్ పాత కమిషనరేట్ వద్దే ఆందోళనకు దిగారు. ఆపై రాజాసింగ్‌పై వరుస ఫిర్యాదులు, కేసుల నమోదు మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్లపల్లిలోని రైల్వే టెర్మినల్ సందర్శన సైతం రద్దయింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా నగరంలోని అనేక సంస్థలు, వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా అన్నట్లు మంగళవారం రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీంతో సోమవారం నుంచి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో నగర ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. పాత కమిషనరేట్ వద్ద నిరసన ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ఓ పక్క బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఆందోళనకారులు బషీర్‌బాగ్‌కు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు 3 వేల మంది ఆందోళనకారులు బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్దకు వచ్చారు. రాజాసింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే అక్కడకు వచ్చిన ప్రత్యేక బలగాలు పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నాయి. కేసుల మీద కేసులు రాజాసింగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ దక్షిణ మండలంలోని డబీర్‌పుర ఠాణాలో మొదటి కేసు నమోదైంది. ఆపై మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, బాలానగర్ సహా ఆరు చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలోని మరికొన్ని పోలీసుస్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. 10 నిమిషాల 27 సెకన్ల నిడివితో ఉన్న రాజాసింగ్ వీడియోకు సంబంధించి మంగళ్‌హాట్ ఠాణాలో ఐపీసీలోని 153–ఎ, 295–ఎ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉద్రిక్తత మధ్య అరెస్టు మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ధూల్‌పేట్‌లోని రాజాసింగ్ ఇంటికి మంగళ్‌హాట్ పోలీసులతో పాటు నగర టాస్క్‌ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. వీరిని రాజాసింగ్ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో పోలీసులు, రాజాసింగ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ రాజాసింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని, వెనక్కి తగ్గేదిలేదని అన్నారు. తన వీడియో రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల చేస్తానన్నారు. అతికష్టమ్మీద రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు. నేరుగా బొల్లారం ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్ద నుంచి ఆందోళనకారులు వెళ్లిపోయారు. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ మంగళవారం ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ నెలలో నూపుర్ శర్మ ఉదంతంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, రాజాసింగ్ వీడియోను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. పార్టీకి నష్టం జరగకుండా చూసే క్రమంలో ఎమ్మెల్యేపై చర్యలకు దిగింది. కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనల అనంతరం.. పోలీసుల వినతిని తిరస్కరించారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌ను మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. రాజాసింగ్ కోర్టులో ఉన్న సమయంలో ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా అనేకమంది కోర్టు వద్దకు చేరుకున్నారు. ఓ దశలో పరిస్థితి అదుపుతప్పేలా కన్పించింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్ పరిసరాల్లోని చిరు వ్యాపారులతో దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలిపారు. వదంతులు నమ్మొద్దు ‘రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశాము. చర్యలు తీసుకున్నాము. ఈ కేసులో ఓ లీగల్ అడ్వైజర్‌ను ఏర్పాటు చేశాం. ఎవరూ వదంతులు నమ్మవద్దు. ముందస్తు చర్యల్లో భాగంగా సెన్సిటివ్ ఏరియాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పెట్టాము. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దు అనీ విజ్ఞప్తి చేస్తున్నాము. పాతబస్తీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. పాతబస్తీ అంత కూడా ప్రశాంతంగా ఉంది. పరిస్థితులు కంట్రోల్లో ఉన్నాయి' అని సౌత్‌జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. దూసుకొచ్చిన ఆందోళనకారులు శాలిబండ చౌరస్తాలో రాజా సింగ్‌కు వ్యతిరేకంగా బుధవారం మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకారులు దూసుకొచ్చారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ.. నిరసన తెలుపుతూ శాలిబండ చౌరస్తా నుంచి చార్మినార్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమూహాన్ని శాలిబండ చౌరస్తాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనాలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పాతబస్తీలో హైటెన్షన్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాలిబండ, మొగల్‌పూర ఘటనలపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇప్పటికే మతపెద్దలతోనూ చర్చించారు. మరోసారి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు. పాతబస్తీలో 14 సున్నిత ప్రదేశాల్లో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. సీఎం కేసీఆర్ రివ్యూ పాతబస్తీ అలజడిపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 7గంటలలోపు షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్‌తో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాతబస్తీలో దుకాణాలను పోలీసులు మూసివేయించారు. పలుచోట్ల పెట్రోల్ బంక్‌లు బంద్ చేయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఓల్డ్‌సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సిటీలో ఆందోళనలపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా పోలీసుల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. -
నో కాంట్రవర్సీ కామెంట్స్.. ఆద్యంతం నవ్వులు పండించిన మునావర్
సాక్షి, మైదరాబాద్: ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రి క్తత, అరెస్టుల నడుమ ప్రముఖ స్టాండప్ కమెడియ న్ మునావర్ ఫారూఖీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీ హెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శిల్పకళా వేదికను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల సమయంలో బీజేవైఎం, బీజేపీకి చెందిన 80 మంది శిల్పకళా వేదిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ కారిడా ర్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. చదవండి: మునావర్ కామెడీ షో: శిల్పకళా వేదిక వద్ద టెన్షన్.. టెన్షన్ షోను అడ్డుకునేందుకు ఎస్ఓటీ పోలీస్ డ్రెస్‌లో వచ్చిన బీజేపీ కార్యకర్తను కొడుతున్న పోలీసులు అరగంట ముందే ప్రారంభం... షో తిలకించేందుకు వచ్చిన వారిని సాయంత్రం 4:30 నుంచి లోపలకు అనుమతించారు. సెల్ఫోన్ల లో టికెట్ క్యూఆర్ కోడ్‌ను చూపడంతోపాటు వ్యక్తి గత ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేశాకే లోపలికి అనుమతించారు. మంచినీళ్ల సీసాలనూ తీసుకెళ్లనీ యలేదు. శిల్పకళా వేదిక లోపల సైతం పోలీసులు కాపలా ఉన్నారు. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు స్టేజీ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయించిన సంస్థలు సాయంత్రం 6:30కి షో ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ 35 నిమిషాల ముందే మొదలైంది. 2,080 టికెట్లు అమ్ముడయ్యాయి. మునావర్ శిల్పకళా వేదికను ఆనుకొని ఉన్న ట్రైడెంట్ హోటల్ లో బస చేసి అక్కడి నుంచి మధ్యాహ్నం 3కే బుల్లెట్ ప్రూఫ్ కారులో శిల్పకళా వేదికకు చేరుకున్నారు. నవ్వులు పండించిన మునావర్: ‘డోంగ్రీ టు నోవేర్’ ఆద్యంతం నవ్వులు పండించింది. శిల్పకళా వేదిక హాస్యప్రియుల హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ఇద్దరు స్నేహితులు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడం, అక్కడ వారికి ఎదురైన అనుభవాలను హాస్య రూ పంలో మునావర్ వివరించడం సభికులను ఆకట్టు కుంది. ఢిల్లీ నుంచి ముంబై తిరిగి రావడం, వచ్చాక చోటుచేసుకున్న ఘటనలను వ్యంగ్యాస్త్రాలతో వర్ణించడం రెండు, మూడు ఘటనలను గంటన్నర పాటు వివరిస్తూ కడుపుబ్బ నవ్వించారు. ఎక్కడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. షో ను ఆస్వాదించినట్లు అభిమానులు తెలిపారు. -
ప్రశాంతంగా కామెడీ షో (ఫొటోలు)
-
మునావర్ కామెడీ షో: శిల్పకళా వేదిక వద్ద టెన్షన్.. టెన్షన్
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మునావర్ షో విషయంలో అలర్ట్ అయిన పోలీసులు.. షోను గంట ముందే ప్రారంభించేలా ప్లాన్ చేశారు. దీంతో, శిల్పకళా వేదికలో మునావర్ షో సాయంత్రం 5 గంటలకే ప్రారంభమైంది. శిల్పకళా వేదికలో మునావర్ షో ముగిసింది. దాదాపు గంటన్నరపాటు షో కొనసాగింది. ఇక, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు విడతలవారీగా శిల్పకళా వేదిక వద్దకు తరలివస్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అక్కడ బందోబస్తు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. మునావర్ ఫరూఖీ కామెడీ షో కోసం.. దాదాపు 2083 మంది శిల్పకళావేదికలో టికెట్ బుక్ చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అక్కడికి వస్తున్న నేపథ్యంలో దాదాపు 200 మంది పోలీసులు మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మునావర్ కామెడీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వల్లే మునావర్ షో చేస్తున్నారు. మా కార్యకర్తలను కొట్టి అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్లో మా సైన్యాన్ని బంధించారు అని అన్నారు. -
మునావర్ కామెడీ షో: ప్రోగ్రామ్ 5 గంటలకే ప్రారంభం.. నో సెల్ ఫోన్స్
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. షో విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మునావర్ కామెడీ షోను నిర్వాహకులు శనివారం సాయంత్రం 5 గంటలకే శిల్పకళా వేదికలో ప్రారంభించారు. కాగా, శిల్పకళా వేదిక గేట్లు సాయంత్రం 4:45కే మూసివేశారు. అలాగే, మునావర్ షోకు వచ్చే వారు షో టికెట్‌తో పాటుగా తమ వెంట ఆధార్ కార్డును కూడా తీసుకు రావాలని సూచించారు. కాగా, షోకు ఆహార పదార్ధాలు, వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్ అనుమతిని నిరాకరించారు. ఇక, శిల్పకళా వేదిక వద్ద పోలీసులతో కొందరు వాదనకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో చలాన్ల బాదుడు.. వామ్మె ఇన్ని వేల కోట్లా? -
‘మునావర్ కామెడీ షోను అడ్డుకుంటాం’.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునావర్ ఫారూఖీ స్టాండప్ కామెడీ షో హైటెన్షన్ రాజేస్తోంది. ఇప్పటికే మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను బయటకు రావొద్దని చెప్పినా వినలేదని దీంతో ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేసినట్లు గోషామహల్ పోలీసులు వెల్లడించారు. కాగా మునావర్ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపు(శనివారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక మునావర్ షోకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు ఇంత వరకు మునావర్ షోకు అనుమతినివ్వలేదు. అనుమతిపై పోలీసులు నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మునావర్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. రేపు శిల్పకలా వేదికలో ఏమైనా జరగవచ్చని ఎమ్మెల్యే హెచ్చరించారు. మునావర్‌ను వెంటపడి కొడతామమని బెదిరించారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్ డీసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చదవండి: మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్.. రాజాసింగ్ వార్నింగ్ ఇదే.. -
స్టాండ ప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోపై రాజాసింగ్ ఫైర్
-
మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్.. రాజాసింగ్ వార్నింగ్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పాలిటిక్స్ హీటెక్కాయి. మునావర్ ఫరూకీ కామెడీ షో కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, రేపు(శనివారం) హైటెక్స్ కామెడీ షోను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మునావర్ కామెడీ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు జరగబోయే షోను అడ్డుకుంటామని అన్నారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్‌ను దగ్దం చేస్తామని కూడా రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: దూకుడు పెంచిన కాంగ్రెస్.. మునుగోడులో రేవంత్ ప్లాన్ ఫలిస్తుందా..? -
కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్
Lock Up Show Runner Payal Rohatgi Fires On kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్‌గా వ్యవహరించిన షో లాక్ప్ షో విన్నర్‌గా నటుడు మునావర్ ఫరూఖీ నిలవగా.. నటి, కంటెస్టెంట్ పాయల్ రోహత్గీ రన్నర్‌గా నిలిచింది. అయితే పాయల్ ఈ షో విన్నర్ అవుతుందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. పాయల్ కూడా తానే ఈ షో విన్నర్ అని గట్టిగా నమ్మింది. అయితే చివరకు తమె రన్నర్‌గా నిలవడాన్ని పాయల్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఈ షో టీంతో పాటు హోస్ట్ కంగనాపై సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శ వ్యాఖ్యలు చేసింది. లాకప్ గేమ్‌లో భాగంగా ‘పాయల్ ఈ ఎపిక్ టెస్ట్ పాసవుతుందా?’ అనే గతంలోని పోస్ట్‌ను ఆమె రీషేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. చదవండి: వాళ్లకు నా ఇంటి గడప తొక్కే అర్హత లేదు: కంగనా ఈ సందర్భంగా పనిపాట లేని కొందరు సెలబ్రెటీలు తనని టార్గెట్ చేస్తున్నారని, బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో బాండింగ్ తర్వాత కంగనా లాకప్ విన్నర్‌ను ప్రకటించిందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘నిజానికి ఆట ఆడకుండా, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వ్యక్తి విన్నర్ అవ్వడమే ఈ లాకప్ షో థీమ్ అనుకుంట. అలాంటి వారి కోసమే ఈ షోను పెట్టారు. అయితే లాకప్ ఫైనల్ ఎపిసోడ్ జరిగే వారానికి ముందు కంగనా అర్పిత ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరి) ఈద్ పార్టీలో పాల్గొన్న కంగనాకు బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్‌తో మంచి పరిచయం ఏర్పడింది. అప్పుడే తాను లాకప్ విన్నర్ ఎవరనేది నిర్ణయించుకుంది. అందుకే వారికి సంబంధించిన వారినే లాకప్ షో విన్నర్‌గా ప్రకటించుకున్నారు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఓటీటీలో జెర్సీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ఇక విన్నర్ మునావర్ ఫరూఖీ గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లై పిల్లలు ఉన్న అతడు షోలో మరో అమ్మాయితో రొమాన్స్ చేశాడు. అంతేకాదు అతడు మిగత ప్లేయర్స్‌ను కూడా మెంటల్‌గా అటాక్ చేశాడు. ఇక ఆ పనిపాట లేని సెలబ్రెటీలు ఇది చూసి నిజం అనుకున్నారు. ఇది వారికి వినోదంగా అనిపించేందోమో. కానీ వారందరిని చూస్తుంటే నాకిప్పుడు బాధేస్తోంది’ అంటూ పాయల్ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అనంతరం హాస్ట్, నటి కంగనాను అన్‌ఫాలో చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు తన సినిమాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పాయల్. View this post on Instagram A post shared by Team Payal Rohatgi (@payalrohatgi) -
సంచలనాల 'లాకప్' షో విన్నర్ గెలుచుకుంది ఎంతో తెలుసా ?
Lock Up Show Winner Munawar Faruqui Got 20 Lakh Prize Money: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఓ పక్క సినిమాలతో మరోవైపు హోస్ట్‌గా సక్సేస్ఫుల్గా ముందుకు సాగుతోంది. ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించిన విభిన్నమైన రియాల్టీ షో 'లాకప్' గురించి తెలిసిందే. ఇందులో పార్టిస్పేట్ చేసిన కంటెస్టెంట్ నుంచి వారు చెప్పిన సీక్రెట్స్ వరకు అన్ని హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ షో చివరిదశకు చేరుకుంది. ఈ షోలో ఫైనల్ విన్నర్‌ను శనివారం (మే 7) ప్రకటించింది హోస్ట్ కంగనా రనౌత్. కాంట్రవర్సీ రియాల్టీ షో లాకప్ సీజన్ 1 బాడ్యాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అని కంగనా ప్రకటించింది. మరోవైపు రన్నరప్‌గా నటి పాయల్ రోహత్గీ నిలిచింది. 'లాకప్' షో విజేత మునావర్ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకోవడంతోపాటు రూ. 20 లక్షల చెక్కు, మారుతీ సుజుకి ఎర్టిగా కారు, ఇటలీకి ఫ్రీ ట్రిప్‌ను అందుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేలో మునావర్ ఫరూఖీ ఇతర నలుగురు ఫైనలిస్టులైన పాయల్ రోహత్గి, అంజలి అరోరా, అజ్మా ఫల్లా, శివమ్ శర్మలను ఓడించాడు. ఈ ట్రోఫీ గెలవడంపై మునావర్ ఫరూఖీ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ మే 7న ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీలో ప్రసారమైంది. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ MUNAWAR FARUQUI IS 'LOCK UPP' WINNER... And the winner of the first season of #LockUpp is #MunawarFaruqui... The show - which debuted in Feb 2022 - was aired on #MXPlayer and #ALTBalaji... #KanganaRanaut hosted the first season.@MXPlayer @altbalaji pic.twitter.com/ONxIaR9VZZ — taran adarsh (@taran_adarsh) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లైంగికంగా వేధించారు.. అందుకే 'గే' అయ్యావా అన్నారు..
Lock Upp: Saisha Shinde Reveal Secret Says This Is Why You Are Gay: బాలీవుడ్ వివాస్పద బ్యూటీ కంగనా రనౌత్ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్ స్పెషల్ ఎపిసోడ్లో మునావర్ ఫరూఖీ తన లైఫ్ సీక్రెట్‌ను చెప్పాడు. తన ఆరేళ్ల వయసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత కంగనాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పి షాక్‌కు గురి చేసింది. అయితే వీరి తర్వాత ఎవిక్షన్ నుంచి సేవ్ అయిన సైషా షిండే తను ఎలాంటి వేధింపులను ఎదుర్కుందో లాకప్ వేదికగా తెలియజేసింది. 'ఇది నా మొదటి సీక్రెట్. మీకు (మునావర్ ఫరూఖీ, కంగనా రనౌత్) జరిగిన లైంగిక వేధింపులను మీరు పంచుకోవడం చూశాక, అది విని ప్రజలు ఎలా రియాక్టయ్యారో చూశాక నాకు జరిగింది గుర్తుకు వచ్చింది. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది వ్యక్తులు 'ఇందుకేనా నువ్ స్వలింగ సంపర్కురాలివి అయ్యావా (గే)' అని అన్నారు. అలా అన్నాక ఇక ఎవ్వరికీ ఈ విషయం గురించి చెప్పే సాహసం చేయలేదు.' చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ View this post on Instagram A post shared by S A I S H A S H I N D E (@officialsaishashinde) సైషా తాను స్వప్నిల్ షిండేగా ఉన్న సమయం గురించి పలుసార్లు తెలిపింది. ఆ సమయంలో తనను తాను స్వలింగ సంపర్కాలు (గే) అని నమ్మిందట. సైషాగా మారాలని నిర్ణయించుకునేంత వరకు మానసికంగా ఎలా పోరాడిందో తరచుగా చెప్పేది. దీపికా పదుకొణె, కరీనా కపూర్ ఖాన్, కత్రీనా కైఫ్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, సన్నీ లియోన్, తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్, హీనా ఖాన్‌లతో సహా టాప్ ఎ-లిస్ట్ బాలీవుడ్ నటులతో ప్రముఖ డిజైనర్ స్వప్నిల్ షిండేగా పనిచేసింది. చదవండి: పెళ్లయ్యాక పరాయి వ్యక్తిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_921254769.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్
Lock Upp: Kangana Ranaut Sexually Assaulted As Child: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఓ పక్క సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సక్సెస్ఫుల్ హోస్ట్‌గా దూసుకుపోతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన లాకప్ రియాల్టీ షోకు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ తమ జీవితంలో జరిగిన అనుభవాలను చెప్పి ప్రేక్షకులను షాక్‌కు గురి చేశారు. తాజాగా ఈ షోలోని కంటెస్టెంట్‌తోపాటు తనకు కూడా జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది కంగనా. జడ్జిమెంట్ డే స్పెషల్ ఎపిసోడ్లో కంటెస్టెంట్ మునావర్ ఫరూఖీ తన చిన్నతనంలో తను అనుభవించిన లైంగిక వేధింపుల గురించి తెలిపాడు. 'నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగిక వేధించారు. నాకు ఆరేళ్లప్పుడు ఈ లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. సుమారు నాలుగైదేళ్లు నరకం చూశాను. ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు.' అంటూ ఎమోషనల్ అయ్యాడు మనావర్ ఫరూఖీ. ఇలాంటి చేదు సంఘటనను ధైర్యంగా ఇలాంటి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై షేర్ చేసుకోవడంతో మునావర్‌పై కంగనా ప్రశంసలు కురిపించింది. తర్వాత తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తెలిపింది. చదవండి: షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్ 'ఈ సమాజంలో చాలా మంది చిన్న పిల్లలు ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పిల్లల పెంపక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా నా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యాను. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా గ్రామంలో ఉండే ఒక అబ్బాయి మాతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతను మాకంటే నాలుగేళ్లు మాత్రమే పెద్దవాడు. మేము మా స్నేహితులతో కలిసి ఆడుకునేప్పుడు అతను వచ్చి మమ్మల్ని ఇబ్బందికరంగా తాకేవాడు. మేము అప్పుడు లైంగికంగా బాధింపబడుతున్నామని మాకు తెలియదు.' అని కంగనా రనౌత్ పేర్కొంది. చదవండి: నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్ View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన వివాదాస్పద కమెడియన్
తరచూ వివాదాల్లో నానుతూ ఉండే స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ. ప్రస్తుతం ఇతడు కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లాకప్ షోలో ఓ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఈ మధ్యే తోటి కంటెస్టెంట్ అంజలి అరోరా ఇతడికి ఐ లవ్యూ చెప్పగా తెగ సిగ్గుపడిపోయాడు మునావర్. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైందో లేదో అప్పుడే పెద్ద బాంబు పేల్చాడు కమెడియన్. స్క్రీన్‌పై బ్లర్ ఫొటో పెట్టి దాని గురించి నిజాలు చెప్పమంటూ కంగనా అడగ్గా తనగురించి ఎవరికీ తెలియని ఓ షాకింగ్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. తనకు ఇదివరకే పెళ్లైందన్న విషయాన్ని వెల్లడించాడు. భార్యతో పాటు ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలిపాడు. కాకపోతే తమ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోందని పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని తన కొడుకు కోసమే ఈ షోకు వచ్చానన్నాడు. కాగా గుజరాత్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ... దేశంలోనే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చిన వివాదాస్పద స్టాండప్ ఆర్టిస్ట్. హాస్య ప్రదర్శనల్లో మునావర్ ఎంచుకునే అంశాలన్నీ రాజకీయ సమకాలీన అంశాల చుట్టే ఉంటాయి. గుజరాత్ అల్లర్ల సమయంలో తన కుటుంబం పడిన ఇబ్బందుల్ని కూడా కామెడీగా మార్చి బీజేపీపై సెటైర్లు వేశాడితడు. తన షోస్‌లో కుబేరులైన అంబానీ, అదానీపై కూడా పంచ్‌లు వేస్తుంటాడు. గతంలో ఎన్ఆర్సీ, ఢిల్లీ గొడవలపై ఆయన చేసిన కామెడీ సాంగ్ కూడా వివాదాస్పదమైంది. హిందూ దేవతలపై, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడని గతేడాది జనవరి 1న ఇండోర్ పోలీసులు మునావర్‌ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను మరింత వివాదాస్పద సెలబ్రిటీ అయ్యాడు. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) u can remove ur emotions frm ur face,hide it through expression. Bt u nvr remove or hide any emotions frm ur precious eyes We are with you always @munawar0018 No matter what happened in ur past, Or wht will b the consequences. We'll be always with u MUNAWAR OWNING LOCKUPP pic.twitter.com/FNxJteuY9K — 💜MOMO⁷💜 (@MOMO_love_lov) April 10, 2022 The same picture shown in a #LockUpp How blindly fans were saying tht she's his sister, but #munawarfaruqui accepted tat she's his wife n kid Now who's news is fake? I feel munawar faked his personality in #LockUpp & his fans are blind pic.twitter.com/sSEgSmnUje — Chetana🌼No Diplomacy (@Chetana_CND) April 9, 2022 చదవండి: బ్రహ్మాస్త్ర లవ్ పోస్టర్.. అలియా-రణ్‌బీర్‌ల పెళ్లికి హింట్ ! అదో పెద్ద స్కామ్.. హృతిక్‌పై కంగనా సంచలన కామెంట్స్! -
హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ షో.. తగ్గేదెవరో.. నెగ్గేదెవరో?
Munawar Faruqui Hyderabad Show: నూతన సంవత్సరం మొదలవక ముందే కొత్త వివాదాన్ని వెంటబెట్టుకు వస్తోంది. జనవరి 9న నగరంలో జరగనున్న కామెడీ షో... సెంటరాఫ్ పాలిటిక్స్‌గా మారి సీరియస్ రంగు పులుముకుంది. వివాదాలకు కేరాఫ్ లాంటి ఆ స్టాండప్ కమెడియన్ సిటిజనులను నవ్విస్తాడా.. గొడవలకు తావిస్తాడా? అనేది తేలాల్సిందే. - సాక్షి, హైదరాబాద్: ‘సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనుమతించినా.. విధ్వంసమే గెలిచింది. కళాకారుడు ఓడిపోయాడు. ఇక సెలవు’ అంటూ పోస్ట్ చేశాడు స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ. తాజాగా తన బెంగళూర్ షో రద్దయిన తర్వాత అతని స్పందన ఇది. ఈ స్పందనే అతడిని హైదరాబాద్‌లోని కొందరికి చేరువ చేసింది. నగరానికి రా రమ్మంటూ ఆహ్వానించేలా పురిగొల్పింది. నవ్వులా... నువ్వు రా.. తన షో రద్దవడంపై ఫారూఖీ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో హైదరాబాద్ రావాలంటూ నెటిజనులు అతడిని ఆహ్వానించారు. అదే సమయంలో కామెడీ షోలను సీరియస్‌గా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదనీ, రాజకీయ కారణాల వల్ల మేం మునావర్ షో వంటివి క్యాన్సిల్ చేయలేమని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వంపై ఎవరు చేసే విమర్శలనైనా స్వాగతిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌కు రావాలనీ తమది అచ్చమైన కాస్మొపాలిటన్ సిటీ అని స్పష్టం చేశారు. దీంతో మునావర్ సిటీలో షో నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. బెంగళూర్‌లో ముగిసిన వివాదం నగరంలో మొదలైంది. చదవండి: కేటీఆర్ కౌంటర్ ట్వీట్ కామెడీ నుంచి కాంట్రావర్సియల్ దాకా.. గుజరాత్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ... దేశంలోనే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చిన అత్యంత వివాదాస్పద స్టాండప్ ఆర్టిస్ట్. హాస్య ప్రదర్శనల్లో మునావర్ ఎంచుకునే అంశాలన్నీ రాజకీయ సమకాలీన అంశాల చుట్టే ఉంటాయి. గుజరాత్ అల్లర్ల సమయంలో తన కుటుంబం పడిన ఇబ్బందుల్ని కూడా కామెడీగా మార్చి బీజేపీపై సెటైర్లు వేస్తాడితడు. గతంలో ఎన్ఆర్సీ, ఢిల్లీ గొడవలపై ఆయన చేసిన కామెడీ సాంగ్ కూడా వివాదాస్పదమైంది. హిందూ దేవతలపై, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడని గత జనవరి 1న ఇండోర్ పోలీసులు మునావర్‌ని అరెస్ట్ చేశారు. నెల రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. తన షోస్‌లో కుబేరులైన అంబానీ, అదానీపై కూడా పంచ్‌లు వేస్తుంటాడు. జర్నలిస్టుల్నీ వదలని మునావర్.. సుశాంత్ రాజ్‌పుత్ కేసులో రిపబ్లిక్ టీవీ కథనాలపై, అర్నాబ్ గోస్వామిపైనా సెటైర్లు వేశాడు. ఈ నేపథ్యంలో హిందూ దేవతల్ని బీజేపీ నాయకుల్ని కించపరుస్తున్నాడని ఆ పార్టీ అనుబంధ సంస్థలు దండెత్తడంతో.. గడిచిన 2 నెలల్లో 12 కామెడీ షోలు రద్దయ్యాయి. గతంలోనూ సిటీలో షో మునావర్ గతంలో కూడా నగరానికి వచ్చాడు. తన హాస్య ప్రదర్శనల ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చివరి సారిగా గత డిసెంబర్ 20న మునావర్ నగరంలో షో నిర్వహించాడు. ఆ షో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇండోర్‌లో షో నిర్వహించిన మునావర్... అక్కడ అరెస్ట్ అయి నెల రోజులు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత అతను మరింత వివాదాస్పద సెలెబ్రిటీ అయ్యాడు. తాజాగా బెంగళూరు షో క్యాన్సిల్ అయిన తర్వాత తీవ్ర నిర్వేదానికి లోనైన మునావర్ ఇక తాను స్టాండప్ కామెడీకి గుడ్ బై చెప్తున్నా అని ప్రకటించాడు. అయితే నగరంలోని అభిమానుల నుంచి వెల్లువెత్తిన మద్దతు మరీ ముఖ్యంగా కేటీఆర్ ప్రసంగం మునావర్‌ను సిటీలో కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు స్పూర్తినిచ్చాయి. అగ్గి ‘రాజ’కుంది.. గుజరాత్లో పొమ్మంటే మునావర్ ఇక్కడకి వస్తున్నాడు అన్నారు సిటీ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే తాము అతడిని తరిమికొట్టడానికైనా రెడీ అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్పందించారు. హిందూ వ్యతిరేకులను తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమన్నారు. తమ యువమోర్చా కార్యకర్తలు మునావర్‌ని అడ్డుకుని తీరతారని స్పష్టం చేశారు. ఓ వైపు ప్రభుత్వం షో నిర్వహణకు అనుకూలంగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షం అడ్డుకుంటామంటున్న నేపథ్యంలో నిరసనలకు తలొగ్గి మునావర్ వెనుకంజ వేస్తాడా? లేక నగరంలో షో చూపిస్తాడా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా... నగరంలో ఈ నవ్వుల ప్రదర్శన సృష్టించిన వివాదం ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకు దారి తీయకుండా ముగిసిపోవాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు. వాస్తవంలోనుంచే హాస్యం.. ట్రూత్ అనే ఆంగ్ల పదంలో ఉండే హెచ్ అక్షరం హ్యూమర్‌ని ప్రతిబింబిస్తుంది. చుట్టూ జరుగుతున్న వాస్తవిక సంఘటనల నుంచే హాస్యం పుడుతుంది. కళను కళగానే చూడాలి. హైదరాబాద్ నుంచి వెళ్లి, ఇండోర్‌లోని మా సొంత ఊరిలో రెండో ప్రదర్శన నిర్వహించిన రోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మేం కూడా కొంత టెన్షన్ పడ్డాం. ఇలాంటి భయాందోళనలు కళకు, కళాకారులకు మంచిది కాదు. క్యాస్టిజమ్, సెక్సిజమ్, బాడీ షేమింగ్, వెర్బల్ వయొలెన్స్, హోమో ఫోబియా, ట్రాన్స్ ఫోబియా తదితర సంకెళ్ల నుంచి కళను విముక్తం చేయాలి. – శశి అండ్ మాన్సి (స్టాండప్ కామెడీ కళాకారులు)