ఇటీవలే రెండో పెళ్లి.. భార్యతో కేక్‌ కట్‌ చేసిన బిగ్‌బాస్ విన్నర్! | Munawar Faruqui all smiles as his wife Mehzabeen Coatwala cut cake goes viral | Sakshi
Sakshi News home page

Munawar Faruqui: రెండో పెళ్లిని సెలబ్రేట్‌ చేసుకున్న మునావర్!

Published Wed, May 29 2024 9:58 PM | Last Updated on Thu, May 30 2024 10:16 AM

Munawar Faruqui all smiles as his wife Mehzabeen Coatwala cut cake goes viral

బిగ్‌బాస్‌ విన్నర్‌ మునావర్ ఫారూఖీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నారు. గతేడాది బిగ్‌బాస్‌ సీజన్‌-17లో విజేతగా నిలిచిన మునావర్‌ మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. మేకప్ ఆర్టిస్ట్‌ అయిన మెహజబీన్ కోట్‌వాలాను పెళ్లాడారు. పెళ్లయిన పది రోజుల తర్వాత ముంబయిలో రిస్పెప్షన్ ‍వేడుక కూడా నిర్వహించారు.

తాజాగా మునావర్‌.. తన భార్య మహ్జబీన్ కోట్‌వాలాతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరలవుతున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కోట్‌వాలాను సీక్రెట్‌గా వివాహం జరిగిన విషయం అత్యంత సీక్రెట్‌గా ఉంచారు. ఈనెల 26న ఆదివారం ముంబయిలోని ఐటీసీ మరాఠాలో రిసెప్షన్‌తో ఈ విషయం బయటకొచ్చింది. ఈ వేడుకలో నటి హీనా ఖాన్ సందడి చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఫోటోను పంచుకున్నారు.

కాగా.. మునావర్‌కు గతంలోనే వివాహం జరిగింది. అతనికి మొదటి భార్యతో ఓ కుమారుడు ఉన్నాడు. మరోవైపు మెహజబీన్‌కు కూడా 10 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement