బిగ్‌బాస్ సీజన్-17 విన్నర్ మునావర్ ఫారూఖీ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. స్టాండ్ అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మునావర్ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్- 17 విన్నర్‌గా నిలవడంతో మరింత ఫేమ్ దక్కించుకున్నారు.
అయితే తాజాగా మునావర్ ఫరూఖీ రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ముంబైలోని ప్రముఖ ఐటీసీ హోటల్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మునావర్ తన పెళ్లి ఫోటోలను ఇప్పటి వరకు షేర్ చేయలేదు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజ్బీన్ కోట్వాలా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మునావర్ దాదాపు 10-12 రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముంబయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
అతని వివాహానికి అత్యంత సన్నిహితురాలు అయిన నటి హీనా ఖాన్ హాజరైనట్లు కూడా తెలుస్తోంది. 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఆమె సెల్ఫీని కూడా పంచుకుంది. కాగా.. బిగ్ బాస్ 17లో మునావర్ తన మాజీ ప్రేయసి అయేషా ఖాన్ మోసం చేశాడని ఆరోపించింది. అతని మాజీ స్నేహితురాలు నజీలా సితాషి కూడా అతను పెద్ద మోసగాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment