
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఓ మ్యూజిక్ కన్సర్ట్‌కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్‌కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్‌గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్‌కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
నేహా కక్కర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను మెల్‌బోర్న్ కన్సర్ట్‌ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్‌కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్‌పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్‌కు హాజరైన కొంతమంది కక్కర్‌పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.
అభిమానులకు కృతజ్ఞతలు..
అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది.