
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ఇటీవల మెల్‌బోర్న్‌లో ఓ మ్యూజిక్ కన్సర్ట్‌కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్‌కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్‌తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్‌కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.