Music Concert
-
మోదీ మెచ్చిన సింగర్.. కోట్లల్లో రెమ్యునరేషన్!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దొసాంజ్పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించడంతో ఇప్పుడా ఆ పేరు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సంగీత ప్రియులను అలరించే దిల్జిత్.. తన టాలెంట్‌కు తగ్గట్టే భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడు. దిల్-లుమినాటి టూర్ పేరుతో ఈ పంజాబీ సింగర్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రత్యేక మ్యూజిక్ కాన్సర్ట్‌లను నిర్వహిస్తుంటాడు. ఈ సింగర్ మ్యూజిక్ కాన్సర్ట్కి మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడ సంగీక కచేరి నిర్వహించిన వేలల్లో జనాలు హాజరవుతుంటారు.(చదవండి: పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ)భారీ రెమ్యునరేషన్దిల్జిత్ సింగర్ మాత్రమే కాదు.. ఇడియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే పర్ఫార్మల్లలో ఒకడు. ప్రైవేట్ ఈవెంట్స్‌కి ఈ సింగర్ భారీగా పారితోషికం తీసుకుంటాడు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో దిల్జిత్ సంగీత కచేరి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కి దాదాపు రూ. 4 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అలాగే సాధారంగా నిర్వహించే మ్యూజిక్ కాన్సర్ట్కి దాదాపు కోటి రూపాయాల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. చిన్న ఈవెంట్ అయితే రూ. 50 లక్షల వరకు తీసుకుంటాడట. అయితే దిల్జిత్ పాటలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆయన పాటలను ఇష్టపడేవాళ్లు టికెట్ రేట్ ఎంత పెంచినా కాన్సర్ట్కి మాత్రం హాజరవుతారు. అందుకే నిర్వాహకులు దిల్జిత్‌కి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఇక సినిమా పాటలకు అయితే దాదాపు 10-15 లక్షల వరకు తీసుకుంటాడట. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సింగర్లో దిల్జిత్ ఒకరు.A fantastic start to 2025 A very memorable meeting with PM @narendramodi Ji.We talked about a lot of things including music of course! pic.twitter.com/TKThDWnE0P— DILJIT DOSANJH (@diljitdosanjh) January 1, 2025తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు..మోదీ ప్రశంసలుగతేడాది నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కన్సర్ట్ జరిగింది. అయితే ఈ కచేరీలో మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని దిల్జిత్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు అందించింది. దీని పట్ల దిల్జిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు కచేరిలో తాను పాడాల్సిన పాట లిరిక్స్‌ని కూడా మార్చిపాడరు. ఒక ఆర్టిస్టు ఇంత దూరం వచ్చి అభిమానులను అలరించే సంగీత విభావరిలో పాల్గొని మంచి పాటలు పాడితే ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేయడం తప్పు అని అన్నారు. అప్పుడు కూడా దిల్జిత్ పేరు నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే దిల్జిత్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం గమనార్హం. Let’s start Dry Nation Movement 🙏🏽Ahmedabad 🪷 pic.twitter.com/K5RfuSn2Kx— DILJIT DOSANJH (@diljitdosanjh) November 17, 2024 -
విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్
తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి ఈ ఏడాది మేలో విడిపోయారు. బాల్య స్నేహితులైన వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడన్‌గా విడిపోవడానికి సిద్ధపడటం అభిమానులను షాక్‌కు గురి చేసింది. విడాకులు తీసుకున్నజంట11 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతూ ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించారు. మలేషియాలోని ఓ సంగీత కచేరీలో పాల్గొన్న జీవీ ప్రకాశ్, సైంధవి జంటగా పాటలు ఆలపించారు. అది చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కచేరీ కోసం జీవీ ప్రకాశ్ రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా సైంధవి.. తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించింది.మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, హీరోగా..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా, హీరోగానూ ఫామ్‌లో ఉన్నాడు. సైంధవితో కలిసి తమి ఎన్నో పాటలు పాడాడు. ఈయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కథానాయకుడు, యుగానికి ఒక్కడు, పందెం కోళ్లు, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, రాజా రాణి, ఆకాశమే నీ హద్దురా.., సార్, టైగర్ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్, మట్కా.. ఇలా పలు సినిమాలకు సంగీతం అందించాడు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ప్రస్తుతం జీవీ ప్రకాశ్ చేతిలో మ్యూజిక్ డైరెక్టర్‌గా పదికి పైగా సినిమాలున్నాయి. హీరోగా ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించిన జీవీ ప్రస్తుతం కథానాయకుడిగా మరో మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. Omg ❤️🥺 bt the professionalism btwn them is! 🥹#GVPrakash #gvprakashconcert #GVPrakashKumar #Saindhavi pic.twitter.com/jgarTEbmY9— Mr.D 🤍 ᵈⁱˡˡᵘ (@dilson_raj) December 9, 2024 உங்களுக்கு என்ன நா Rights இருக்கு 🥲🥲😭 எங்க அழ வைக்க @gvprakash #GVPrakash #GVPrakash @singersaindhavi #Saindhavi pic.twitter.com/RCXgse4wFO— 𝕽𝖔𝖇𝖎𝖓 𝕮𝖍𝖗𝖎𝖘 😈🛡️🗡️ (@robinthebadguy) December 8, 2024Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024 Thanks #Malaysia kuala lampur for making my live in concert a BLOCKBUSTER hit …. @dmycreationoffl pic.twitter.com/SUigJNaVwK— G.V.Prakash Kumar (@gvprakash) December 8, 2024 చదవండి: టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా.. -
అలాంటి పాటలు పాడొద్దు.. ప్రముఖ సింగర్‌కు తెలంగాణ అధికారుల నోటీసులు
మత్తు పదార్థాలు ప్రోత్సహించే విధంగా పాటలు ప్రదర్శించకూడదని ప్రముఖ సింగర్ దిల్జిత్ దోశాంజ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ(నవంబర్ 15) హైదరాబాద్‌లో దిల్జిత్ కన్సర్ట్ జరగనుంది. ఈ ఈవెంట్లో ఆయన తన గాత్రంతో పలు పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే గతంలో దిల్జిత్ నిర్వహించిన కన్సర్ట్‌లో డ్రగ్స్, మద్యాన్ని ప్రేరేపించే విధంగా పాటలు ఆలపించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమయ్యారు. మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని నోటీసులు అధించారు. చండీగర్‌కు చెందిన ప్రొఫెసర్ పండిత్రావ్ ధరేనవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్జిత్‌కు నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా, గత అక్టోబర్‌లో ఢిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో పాటియాలా పెగ్, పంజ్ తారలా వంటి పాటలు దిల్జిత్ పాడారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత వ్యాపించడం అందరినీ కలిచివేసింది. అక్కడ చెత్త కుప్ప చూసి షాక్ అయ్యారు. మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేశారు. రన్నింగ్ ట్రాక్‌పై కుళ్లిపోయిన ఆహారం, కుర్చీలు విరిగిపోయి కనిపించాయి. దిల్జిత్ నిర్వహించే ప్రతి సంగీత కచేరీలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమై దిల్జిత్‌కు న నోటీసులు అందించారు. కాగా, హైదరాబాద్‌లో దిల్జిత్ సంగీత కచేరీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యూజిక్ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వహకులు తెలిపారు. -
లైవ్ కన్సర్ట్‌లో లవ్ ప్రపోజల్.. ఇలా ఉన్నారేంట్రా?
ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ తాజాగా కోల్‌కతాలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో తన మధురమైన వాయిస్‌తో పాటలు పాడి అలరించారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో పెద్దఎత్తున అభిమానులు హాజరయ్యారు.అయితే లైవ్ కన్సర్ట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రేయా ఘోషల్ కచేరీ జరుగుతుండగా ఓ వ్యక్తి లవ్ ప్రపోజ్ చేసి తన ప్రియురాలికి సర్ప్రైజ్ ఇచ్చాడు. మోకాళ్లపై నిలబడి తన ప్రియురాలికి ప్రేమను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.అంతకుముందు అతను 'శ్రేయా ఘోషల్..యూ ఆర్ మై సెకండ్ లవ్' అనే ప్లకార్డును ప్రదర్శించాడు. ఇది చూసిన సింగర్ మ్యూజిక్ కాసేపు ఆపేసి నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటూ అతన్ని ప్రశ్నించింది. దీంతో అతను తన పక్కనే ఉన్నా అమ్మాయిని చూపిస్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత వెంటనే అందరిముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు.pic.twitter.com/hb7incZSLs— Oindrila💌 (@_pehlanasha_) October 20, 2024 -
హైదరాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో.. ఎప్పుడంటే?
సింగర్స్, పాప్ సింగర్స్ చాలామంది దేశంలో వివిధ ప్రాంతాల్లో మ్యూజిక్ షోలు పెడుతుంటారు. వాటికి జనాల నుంచి ఆదరణ నుంచి కూడా అలానే ఉంటుంది. బయట నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇలాంటి కాస్త తక్కువనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. హైదరాబాద్‌లో లైవ్ షోలో ఫెర్ఫార్మెన్స్ చేయబోతున్నడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)దేశవ్యాప్తంగా మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నానని చెప్పిన దేవిశ్రీ.. హైదరాబాద్ నుంచే దీన్ని మొదలుపెడతానని చెప్పాడు. అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఆన్లైన్లో ప్రస్తుతం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్) -
నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది: సుకుమార్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే పుష్ప పుష్ప అంటూ ఫ్యాన్స్‌ను ఊపేసే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ షూ స్టెప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప-2 త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే సుకుమార్- తబిత దంపతులకు సుకృతి వేణి అనే ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమెకు ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. గాంధీ తాత చెట్టు అనే చిత్రానికి ఈ అవార్డ్ దక్కించుకున్నారు. అయితే సుకృతి సింగర్ కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో సాంగ్ పాడిన వీడియోను సుకుమార్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకున్నారు. నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ సుకుమార్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా సుకృతి పాడిన యూట్యూబ్ లింక్‌ను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం సుకృతి పాడిన సాంగ్ సంగీత ప్రియులను అలరిస్తోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. -
Picture of the Year award: అమానుష ఫొటోకు అవార్డా!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడి ఘటనలో ఒక యువతిని అపహరించి అర్ధనగ్నంగా ఊరేగించిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫొటోలో యువతిని బ్లర్ చేయకుండానే ఇంటర్నెట్లో పెట్టడంతో అవార్డుల సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న సంగీత విభావరిపై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడం, దాదాపు 360 మందిని చంపేయడం తెలిసిందే. జర్మనీకి చెందిన 22 ఏళ్ల పర్యాటకురాలు షానీ లౌక్తో పాటు పలువురిని కిడ్నాప్ చేశారు. ఆమెను అపహరించి అర్ధనగ్నంగా గాజా వీధుల్లో ఊరేగిస్తుండగా ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ పలు ఫొటోలు తీసింది. నాటి దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందంటూ ఈ ఫొటోకు ‘ టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ కింద ప్రథమ బహుమతి ప్రకటించారు. అమెరికాలోని కొలంబియాలో ఉన్న మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విభాగమైన డొనాల్డ్ రేనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును ప్రకటించింది. ఊరేగింపు ఘటన జరిగిన కొద్ది రోజులకు గాజాలో షానీ లౌక్ పుర్రె భాగం ఇజ్రాయెల్ బలగాలకు దొరికింది. దీంతో హమాస్ మూకలు ఈమెను చిత్రవధ చేసి చంపేశాయని ఇజ్రాయెల్ అక్టోబర్ 30న ప్రకటించింది. ఆమె మృతదేహం ఇంకా గాజాలోనే ఉంది. నాటి నరమేధానికి బలైన అభాగ్యురాలిని ఇలా అవార్డు పేరిట అవమానిస్తారా? అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ తీయలేదని, హమాస్ మిలిటెంట్లలో ఒకరు తీసిన ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించిందని కొందరు వ్యాఖ్యానించారు. -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్‌కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్‌తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
అభిమానితో సింగర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్
సాధారణంగా సినీ సెలెబ్రెటీలను అభిమానించేవారు ఎక్కువగా ఉంటారు. నటీనటులతో పాటు సింగర్స్‌ని కూడా అమితంగా ఇష్టపడేవారు ఉంటారు. కొంతమంది గాయకుల లైవ్ ఫర్ఫార్మెన్స్ని చూసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటి వారిలో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ కొడుకు ఆదిత్య నారాయణ కూడా ఒకరు. తండ్రికి ఉన్న గుర్తింపు చేత ఆదిత్యకు పేరొచ్చింది. అతను మ్యూజిక్కాన్సెర్ట్ ఏర్పాటు చేస్తే జనాలు ఎక్కువగానే వెళ్తుంటారు. అయితే తనకోసం వచ్చిన అభిమానులతో ఆదిత్య మాత్రం తరచు గొడవపడుతుంటాడు. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు. వీడియో తీస్తున్న ఫ్యాన్ ఫోన్‌ని లాక్కొనే దూరంగా పడేశాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోని రుంగ్తా కాలేజీలో ఆదిత్య కచేరీ నిర్వహించారు. ఫ్యాన్స్‌తో పాటు సంగీత ప్రియులు పెద్ద ఎత్తున ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్లో భాగంగా ఆదిత్య.. షారుఖ్ నటించిన ‘డాన్’ మూవీలోని ‘ఆజ్ కీ రాజ్’ సాంగ్‌ని ఆలపించడం ప్రారంభించారు. పాట పాడుతూ అభిమానుల మధ్యలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని తన మొబైల్లో ఆదిత్య పాటను రికార్డు చేస్తూ కనిపించాడు.. వెంటనే ఆదిత్య వచ్చి చేతిలో ఉన్న మైక్‌తో అతన్ని కొట్టి..ఫోన్ లాక్కొని దూరంగా విసిరివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆదిత్య ప్రవర్తించిన తీరును నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ‘అతను చేసిన తప్పేంటి?..ఓ అభిమానితో ఇలానే ప్రవర్తిస్తారా?’, ఇప్పటికీ తండ్రి పేరుతో బతుకుతున్న ఆదిత్యకు అంత పొగరు ఎందుకు? ’ అని కామెంట్ చేస్తున్నారు. What is this #adityanarayan 🥲 pic.twitter.com/Gqy7fRo3F6 — Bollywood World (@bwoodworld) February 11, 2024 -
బేఏరియాలో అలరించిన సిద్ శ్రీరామ్ మ్యూజిక్ కాన్సర్ట్
-
ఆ వార్తల్లో నిజం లేదు.. పరువు నష్టం దావా వేస్తా: విజయ్ ఆంటోని
తమిళసినిమా: సంగీత దర్శకుడు నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడమ్ చిత్రం ఫేమ్ సిఎస్ అముదమ్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ బి. పంకజ్ బోరా కలిసి నిర్మిస్తున్నారు. నటి రమ్య నంబీశన్, మహిమ నబియార్, నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని, గోపీ అమర్నాథ్ అందిస్తున్నారు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రత్తం అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సీఎస్ అముదమ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని తాను చదువుకున్న రోజుల్లోనే మిత్రులందరికీ, ఓకే కళాశాలలో చదువుకున్నామని చెప్పారు. ఆయన హీరోగా ఓ చిత్రం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నానని ఈ రత్తంతో అది కుదిరిందని చెప్పారు. ఇది మీడియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. చిత్రంలో మత రాజకీయాలు కూడా ఉంటాయని, అయితే ఇందులో ఇంతకుముందు వచ్చిన ఏ చిత్ర ఛాయలు ఉండవని చెప్పారు. దర్శకుడు అముదమ్ చెప్పిన కథ కొత్తగా ఉండటంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు విజయ్ ఆంటోని చెప్పారు. కాగా ఇటీవల ఏఆర్ రెహమాన్ నిర్వహించిన సంగీత కచేరీ వ్యవహారంలో నటుడు విజయ్ ఆంటోని హస్తం ఉన్నట్లు ఒక యూట్యూబ్‌లో ఛానల్లో ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన విజయ్ ఆంటోని ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, తాను ఆ యూట్యూబ్ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఇప్పటికే ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు. -
'మీ అభిమానిగా మేం సిగ్గుపడుతున్నాం.' ఏఆర్ రెహమాన్‌పై ఫ్యాన్స్ ఫైర్!
బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం చెన్నైలో పర్యటించారు. ఓ సంగీత కచేరీలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదిత్యరామ్ ప్యాలెస్‌లో 'మరాకుమా నెంజమ్' అనే పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. అయితే కచేరీకి ఒక్కసారిగా ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ కచేరీకి దాదాపు 50,000 మంది వచ్చినట్లు సమాచారం. దీంతో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్గనైజర్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇది రెహమాన్ కెరీర్లోనే అత్యంత చెత్త కచేరీ అని అభిమానులు మండిపడుతున్నారు. ఆర్గనెజర్స్ పరిమితికి మించి టికెట్స్ విక్రయించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొంటే తీవ్ర నిరాశకు గురయ్యామని వెల్లడించారు. ఈవెంట్ నిర్వహించే తీరు ఇదేనా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొన్నామని వాపోయారు. ఇది ఒక ఫేక్ ఈవెంట్ అంటూ మండిపడ్డారు. ఈ కచేరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతున్నాయి. తమ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. ఇదొక పెద్దస్కామ్ అంటూ ఆరోపిస్తున్నారు. స్పందించిన రెహమాన్ ప్రియమైన చెన్నై అభిమానులారా.. మీలో టిక్కెట్లు కొనుగోలు చేసి.. దురదృష్టకర పరిస్థితుల కారణంగా ఈవెంట్లో పాల్గొనలేకపోయారు. దయచేసి మీ టిక్కెట్ కొనుగోలు కాపీని మీ ఫిర్యాదులతో పాటు మెయిల్‌కి షేర్ చేయండి. మా బృందం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. Dearest Chennai Makkale, those of you who purchased tickets and weren’t able to enter owing to unfortunate circumstances, please do share a copy of your ticket purchase to arr4chennai@btos.in along with your grievances. Our team will respond asap🙏@BToSproductions @actcevents — A.R.Rahman (@arrahman) September 11, 2023 ఇన్‌స్టాగ్రామ్‌లో తన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఏఆర్ రెహమాన్ రాస్తూ..'కొంతమంది నన్ను G.O.A.T(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తున్నారు. ఈసారి నన్ను త్యాగం చేసే మేకగానే ఉండనివ్వండి . చెన్నై ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో వర్ధిల్లాలి. టూరిజంలో పెరుగుదల, నిబంధనలను పాటించేలా ప్రేక్షకులను మెరుగుపరచడం .. పిల్లలు, మహిళలకు సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. People are saying #ARRahmanConcert is scam of the year, listen to this gentleman.#ARRahman | #ARRConcert | #MarakkumaNenjam pic.twitter.com/3VybS9eEsN — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 11, 2023 మండిపడుతున్న నెటిజన్స్ అయితే రెహమాన్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. మీ పోస్ట్‌లో క్షమాపణ ఎక్కడ ఉంది? సిగ్గుపడండి సార్.. ప్రజలు మిమ్మల్ని చూడటానికి వస్తారు. మీరు క్షమాపణ చెప్పడం మీకు నిజంగానే కష్టంగా కనిపిస్తోంది.' అంటూ విమర్శించారు. మరొకరు రాస్తూ.. “మేము ఎల్లప్పుడూ మీ అభిమానులమే...కానీ దీనికి చెన్నై మౌలిక సదుపాయాలను నిందించవద్దు... ఇది పెద్ద స్కామ్... కెపాసిటీ కంటే 10 రెట్లు ఎక్కువ టికెట్స్ అమ్ముకున్నారంటూ రాసుకొచ్చారు. మరో అభిమాని రాస్తూ..'ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించడానికి చెన్నై అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఆర్గనైజింగ్ టీమ్ ఈవెంట్ సామర్థ్యం గురించి పట్టించుకోలేదు. నిన్నటి దాకా మీ అభిమానులం అయినందుకు మేం బలి మేకలం. మీ పోస్ట్ చదివిన తర్వాత నేను మీ అభిమాని అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా.' అంటూ రెహమాన్‌పై మండిపడుతున్నారు. It was worst concert ever in the History #ARRahman #Scam2023 by #ACTC. Respect Humanity. 30 Years of the Fan in me died today Mr. #ARRAHMAN. #MarakkumaNenjam Marakkavey Mudiyathu, . A performer in the stage can’t never see what’s happening at other areas just watch it. pic.twitter.com/AkDqrlNrLD — Navaneeth Nagarajan (@NavzTweet) September 10, 2023 HORROR Story of a family who paid 30K RS for #ARRahmanConcert : “If I had stood for 2 more min, they would have squeezed & killed my child, we would have died, Are they even human beings” - Affected Family#ARRahman #marakumanenjam #Arr pic.twitter.com/nAaqREoFtx — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 10, 2023 -
'అబ్బో ఎంత ప్రేమో'.. వేదికపైనే ముద్దులు పెట్టిన ప్రియాంక!
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఫ్యాన్స్ అత్యంత ఇష్టపడే సెలబ్రిటీ జంటలలో ఒకరు. ఆమె భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో నిక్ జోనాస్ ప్రదర్శన ఇస్తున్నారు. తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి ఈవెంట్లో పాల్గొన్నారు. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) తాజాగా ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. వేదికపై భర్తను ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ సందడి చేసింది. యాంకీ స్టేడియంలో ఒక సంగీత కచేరీలో ప్రియాంక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో వేదిక పక్కనే ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే సంగీత కచేరీకి హాజరైన ప్రియాంక తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. కాగా.. 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీకి స్వాగతం పలికారు. ప్రియాంక.. జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే! ) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. (ఇది చదవండి: చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలీదు: ఆర్జీవీ) అయితే తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ సంగీత కచేరిలో పాల్గొన్నారు. అతని సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి శనివారం జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చారు. అయితే ఆ వేదికపై నిక్ జోనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. నిక్ జోనాస్ ఎంతో ఉత్సాహంగా పాట పాడుతున్న సమయంలో వేదికపైకి మహిళల లో దుస్తులను విసిరేశారు. ఇది చూసిన నిక్ జోనాస్ అవేమీ పట్టించుకోకుండా పాట పాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ ఆర్టిస్ట్‌ను ఇలా అవమానించడం ఏంటని నిలదీస్తున్నారు. విశేషమేమిటంటే ఈ సంఘటన జరిగినప్పటికీ కచేరీ సజావుగా కొనసాగింది. కాగా.. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో ఇటీవల జరిగిన జోనాస్ బ్రదర్స్ కచేరీలో ఈ సంఘటన జరిగింది. ఊహించని సంఘటనతో ఈ కచేరీని కొద్దిసేపు నిలిపేసి మళ్లీ కొనసాగించారు. అయితే ప్రదర్శనను కొనసాగించడాన్ని చూసి నిక్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి చర్యలు కళాకారుల గౌరవాన్ని దెబ్బతీస్తాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలని అంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివీ సింగర్స్ సవాలుగా మారాయని.. అభిమానుల తీరు తీవ్ర అంతరాయం కలిగించేలా ఉందని అంటున్నారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
మహిళా అభిమాని దురుసుతనం.. స్టార్ సింగర్‌కు గాయం!
బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్సింగ్తో ఓ మహిళా అభిమాని దురుసుగా ప్రవర్తించింది. స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంతో అతని చేయి పట్టుకొని గట్టిగా కిందకు లాగింది. దీంతో అతని చేయి బెణికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్జిత్ సింగ్ సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ సాంగ్స్, కాన్సర్ట్ నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్‌మార్క్‌లో అర్జిత్ సింగ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అర్జిత్ పలు పాటలు ఆలపిస్తూ అందరిని అలరించాడు. అలాగే మధ్య మధ్యలో స్టేజికి దగ్గరగా ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూ వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చారు. (చదవండి: 'ఆదిపురుష్' ట్రైలర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్) ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అర్జిత్కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ చేతిని గట్టిగా కిందకు లాగింది. దీంతో అర్జిత్ అదుపు తప్పి కిందపడబోయాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అతని చేయికి గాయమైంది. దీంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు సున్నితంగా హెచ్చరించారు. (చదవండి: నా జీవితంలో సామ్‌తో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం: నాగచైతన్య) ‘మీరు చేసిన పనికి నా చేతులు వణుకుతున్నాయి. మీరు మీ సమయాన్ని సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చారు. నేను ప్రదర్శన ఇవ్వకపోతే మీకు ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది. మీరు నన్ను లాగారు. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నేను చేయిని కదపలేకపోతున్నాను’ అని అన్నాడు. దీంతో సదరు మహిళ ఆర్జిత్కు క్షమాపణలు చెప్పింది. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగులో అర్జిత్ ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘హుషారు’, ‘ఉయ్యాల జంపాల’, ‘భలే మంచి రోజు’ తదితర సినిమాల్లో పాటలు పాడారు. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsinghliveupdates) -
ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. పూణెలో నిర్వహించిన మ్యూజిక్షోను అర్ధాంతంరగా అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం రాత్రి పుణెలో ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక రెహమాన్ తన బృందంతో కలిసి హుషారైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చదవండి: (బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి) ఎంతో ఉత్సాహాంగా ఈవెంట్ జరుగుతుండగా పోలీసులు స్టేజ్‌పైకి వెళ్లి ప్రోగ్రాంను మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి 10గంటల వరకే షోకు అనుమతి ఉందని, సమయం మించిపోవడంతో ప్రోగ్రాంను ఆపేయాలంటూ రెహమాన్ టీంను కోరారు. రెహమాన్ చివరిగా ఓ పాట పాడి కార్యక్రమాన్ని ముగించారు. కాగా ఈ విషయంపై పూణె పోలీసులు వివరణ ఇస్తూ.. రెహమాన్ మేం వెళ్లే సమయానికి చివరి పాట పాడుతున్నారు. డెడ్‌లైన్ ముగియడంతో షోను ఆపేయాలను కోరాం. ఆయన కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు అంటూ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై రెహమాన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం షోను ఆపేయాలంటే నిర్వాహకులతో మాట్లాడాలి.. అంతేకానీ ఇలా స్టేజ్‌పైకి ఎక్కి అవమానించకూడదు అంటూ కామెంట్స చేస్తున్నారు. చదవండి: (రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్) Pune! Thank you for all the love and euphoria last night! Was such a roller coaster concert! No wonder Pune is home to so much classical music! We shall be back soon to sing with you all again! #2BHKDinerKeyClub @heramb_shelke @btosproductions EPI pic.twitter.com/UkBn09FwLj — A.R.Rahman (@arrahman) May 1, 2023 Extremely disappointing of #PunePolice to shut down #ARRahman ‘s concert in #Pune at 10.14PM. While the rule of 10pm cutoff is understood, this is nt how a visiting artist of his stature should hav been treated. He was almost on his finale song when this happened👇🏻cc @CPPuneCity pic.twitter.com/HYEor4wiYX — Irfan (@IrfanmSayed) April 30, 2023 Pune police stop AR Rahman concert midway citing court-mandated 10 pm deadline Read More: https://t.co/syWW1efdqq pic.twitter.com/jSZYm7chZt — Express PUNE (@ExpressPune) May 1, 2023 -
మ్యూజిక్ కాన్సర్ట్‌లో సందడి చేసిన సమంత (ఫొటోలు)
-
జస్టిన్ బీబర్ మ్యూజిక్ కన్సర్ట్ వద్ద కాల్పుల కలకలం
అమెరికా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే అతడి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువే. ఇక అతడి మ్యూజిక్ కన్సర్ట్ అంటే వేలల్లో, లక్షల్లో అభిమానులు హజరవుతారు. ఈ నేపథ్యంలో అమెరికాలో రీసెంట్గా నిర్వహించిన జస్టిన్ బీబర్ కన్సర్ట్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిన రెస్టారెంట్ బయట కాల్పులు కలకలం సృష్టించింది. అక్కడి వచ్చిన పలువురి మధ్య ఘర్షణ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికి మీడియా సమాచారం. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ ది నైస్ గై రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి లిజెత్ లోమెలి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అక్కడ ఇద్దరు బాధితులను గుర్తించారని, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో రాపర్ కోడాక్ బ్లాక్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి ఎటువంటి సమాచారం లేదని, ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: Krithi Shetty: మాటిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ‘బేబమ్మ’ కానీ జస్టిన్ బీబర్ మ్యూజిక్ కన్సర్ట్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ఈ ఘటనపై పలు అనుమానులు కూడా తలెత్తున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. డ్రేక్, లియో డికాప్రియో, కెండల్ జెన్నర్, కోల్ కర్దాషియాన్ వంటి పలువురు ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. సంగీత కచేరీ అనంతరం కొడాక్ బ్లాక్, గున్నా , లిల్ బేబీ బయటికి వచ్చారని, అప్పుడే గొడవ జరిగిందని ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం. కొందరు వ్యక్తులు కారుపైకి ఎక్కడంతో గొడవ మొదలైందని.. కొంతసేపటికి బుల్లెట్ల శబ్ధం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. -
Thaman:అల అమెరికాపురములో..తమన్ లైవ్ కాన్సర్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అమెరికాలో జరగనున్న మ్యూజికల్ కార్నివాల్ ‘అల అమెరికాపురములో..’లో పాల్గొననున్నారు. హంసిని ఎంటర్టైన్మెంట్ ఈ మ్యూజికల్ కార్నివాల్‌ని ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఏర్పాటు చేయనుంది. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్‌లో తమన్ తన బృందంతో కలిసి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కాన్సర్ట్‌కు టాలీవుడ్‌కి చెందిన ఓ టాప్ డైరెక్టర్‌తో పాటు ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హంసిని ఎంటర్టైన్మెంట్ వారు గతంలో ఏఆర్ రెహమాన్‌తో ‘ఏఆర్ఆర్ లైవ్ ఇన్ కాన్సర్ట్ 2017 లండన్’, అనిరుద్‌తో ‘అనిరుధ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ లండన్ అండ్ ప్యారిస్ 2018’ వంటి భారీ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. చదవండి: హన్సిక సినిమా విడుదలపై నిషేధం విధించలేం రూ.26 కోట్ల మోసం! సంగీత దర్శకుడిపై కేసు కొట్టివేత -
వీళ్లకి అల్జీమర్సా.. అమేజింగ్ వీడియో
-
Alzheimer: అల్జీమర్సా..ఈ వీడియో చూస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద వయసు వారిన ఎక్కువగా బాధించే వ్యాధుల్లోఅల్జీమర్స్. మెదడులో కణాలు చనిపోవడంతో సంభవించే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బతింటాయి. బాగా సన్నిహితంగా ఉండేవారిని తప్ప కుటుంబ సభ్యులను కూడా మర్చిపోతారు. దీంతో ఈ అల్జీమర్స్‌కు గురైనవారితోపాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి సంగీతం మంచి సాధమని ఇదివరకే పరిశోధనలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో అల్జీమర్స్ బారిన పడిన కొంతమంది సంగీత సాధనలో, లయబద్ధంగా, శృతి తప్పకుండా ఏ మాత్రం తడబడకుండా ఆయా వాయిద్యాలను వాయించడంలో అద్భుతంగా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. తమ వారిని తలుచుకొని కొంతమంది భావోద్వేగానికి లోనవుతోంటే.. వారి ప్రతిభకు మేని పులకరించిందంటూ మరి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. సంగీతం మానవజాతి విశ్వ భాష అంటూ సీజీఓ జావా, జుబిన్ మెహతాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ ఆర్కెస్ట్రా కండక్టర్, సంగీత దర్శకుడు జుబీన్ మెహతా, అమెరికా ఆర్కెస్ట్రా కండక్టర్, సీజీ ఓజావా ఈ సంగీత కార్యక్రమానికి నేతృత్వం వహించడం విశేషం. హారున్ రషీద్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. స్వయంగా అల్జీమర్స్ బాధితుడైన సీజీ ఓజావా సంగీతాన్ని ఏమాత్రం మర్చిపోలేదంటూ కమెంట్ చేశారు. అయితే 2016 నాటి వీడియో ఇదనీ, సీజీ ఓజావాకు అల్జీమర్స్ వ్యాధిలేదనీ, క్యాన్సర్‌తో బాధపడుతున్నారని మరో యూజర్ వివరణ ఇచ్చారు. -
ఆన్లైన్లో కచేరి
సాధారణంగా కాన్సర్ట్ అంటే వేల మంది జనం, భారీ మ్యూజిక్, పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా డిజిటల్ కాన్సర్ట్ (ఆన్ లైన్ లోనే కాన్సర్ట్)ను ప్లాన్ చేశారు హాలీవుడ్ సింగర్ లేడీ గాగా. ప్రస్తుతం కరోనా వైరస్‌తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఈ పోరాటానికి స్ఫూర్తి నింపేందుకే ‘వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్’ పేరుతో ఈ డిజిటల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఎవరింట్లో వారు ఉండి ఆన్ లైన్లోనే ఈ సంగీత కచేరీని వీక్షించవచ్చు. ఏప్రిల్ 18న జరిగే ఈ కాన్సర్ట్ కరోనాపై పోరాటానికి ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఈ ప్రోగ్రామ్‌లో హాలీవుడ్ టాప్ సింగర్స్ జెన్నీఫర్ లోపెజ్, ఆడమ్ లాంబెర్ట్, ఓప్రా విన్ ఫ్రె, టేలర్ స్విఫ్ట్ వంటి ప్రఖ్యాత సింగర్స్ పాల్గొననున్నారు. మన దేశం నుంచి షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లేడీ గాగా యాంకర్‌గా వ్యవహరించనున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన కోసం ముందు వరుసలో పోరాడుతున్న ఆరోగ్య శాఖ వారికి గౌరవంగా ఈ కాన్సర్ట్‌లో నేను కూడా భాగం అవుతున్నాను’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. -
అమెరికాలో ఘనంగా ‘సంగీత గాన విభావరి’
వాషింగ్టన్ : దివ్యాంగుల సహాయార్థమై వేగేశ్న ఫౌండేషన్ వారు.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న ‘సంగీత గాన విభావరి’ కార్యక్రమాన్ని కూచిపూడి ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ ఫంక్షన్ హాలులో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేగేశ్న ఫౌండేషన్ స్థాపకుడు డా. వంశీ రామరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కీ.శే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. వేగేశ్న ఫౌండేషన్ మీ ఎన్నారైల ప్రాజెక్ట్ అని, దీనిని సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించామని తెలిపారు. దీనికి డా. అక్కినేని నాగేశ్వరరావు సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారంటూ ఆయన సేవలను కొనియాడారు. అలాగే ఈ సంగీత గాన విభావరి కార్యక్రమాన్ని అమెరికాలోని వివిధ నగరాల్లో ఘంటసాల, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీతోత్సవాల పేరిట సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గాయకుడైన ఘంటసాల బాల కామేశ్వరరావు, గాన కోకిల ఆకునూరి శారదలతో పాలు పలువురు గాయనీ, గాయకులు ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల పాటలైన రాముని అవతారం.. రవికుల సోముని అవతారం, చిటపట చినుకులు పడుతూ వుంటే.. వంటి పాత పాటలను పాడి అందరిని అలరించారు. నాగి వడ్డమన్నాటి, శారదలు ‘మంచుకురిసే వేళలో, లేత చలిగాలిలో హాయ్...’ పాడిన పాటలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. కార్యక్రమం అనంతరం డా. వంశీ రామరాజును గాయనీ శారద ఆకునూరి, ఘంటసాల బాల కామేశ్వరరావుతో పాటు టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యపు వీర్నపు తదితరులు శాలువా కప్పి, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. తర్వాత వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. రామరాజు చేస్తున్న సేవలను కొనియాడి, దివ్యాంగుల కోసం చేస్తున్న స్వచ్చంద సేవలో సంస్థను భాగస్వామిగా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు డా. ఉరిమిడి నరసింహారెడ్డి, సీఆర్ రావు, చంద్రహాస్ ముద్దుకూరి, అనంత్ మల్లవరపులతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ఆ కల నిజమయ్యింది!
తన చిరకాల కోరిక నెరవేరిందన్న ఆనందంలో తేలిపోతున్నారు నటి శ్రుతీహాసన్. సినిమాల్లోకి రాక ముందు నుంచే శ్రుతి సంగీత కళాకారిణి అన్న విషయం తెలిసిందే. తన తండ్రి కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘ఉన్నైపోల్ ఒరువన్’ చిత్రానికి ఆమె సంగీత దర్శకురాలిగా పని చేశారు. ఆరేళ్ల ప్రాయం నుంచే సంగీత సాధన చేస్తోన్న శ్రుతి ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, సంగీత కళాకారిణిగా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవల సినిమాల నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నా.. మళ్లీ నటనపై దృష్టి సారించారు శ్రుతి. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తున్న శ్రుతీహాసన్ మరో వైపు సంగీతంపై కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకూ 100కు పైగా సంగీత ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటుకున్న శ్రుతి.. ఇటీవలే లండన్‌లో సంగీత కచేరి చేయాలన్న తన కలను నిజం చేసుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత ‘ట్రవ్‌బడూర్’ అనే ప్రాంగణంలో సంగీత కచేరిని నిర్వహించారు శ్రుతి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం విడుదల కావాల్సిన తన చిత్రాల్లోని పాటలను పాడి లండన్‌వాసులను అలరించారు. 1954లో కాఫీ హౌస్‌గా ప్రారంభమైన ట్రవ్‌బడూర్ ప్రస్తుతం ప్రపంచ ఖ్యాతి గాంచిన సంగీత ప్రాంగణంగా అవతరించింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంగీతదర్శకులైన బాబ్ డిలన్, ఎల్టన్ జాన్, అదేలి, ఎడ్ షీరన్ వంటి ప్రముఖులు ఈ వేదికపై సంగీత ప్రదర్శనలను ఇచ్చారు. ఈ వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వాలని కలలు కన్న శ్రుతి.. దాన్ని నిజం చేసుకున్నారు. అదే విధంగా గత ఏడాది ఆగస్ట్ 15న న్యూయార్క్‌లోని మెడిషన్ అవెన్యూలో ‘ది ఇండియన్ డే పేరడే’ పేరుతో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో శ్రుతీహాసన్ వందేమాతరం ప్రదర్శనను ఇచ్చి ఆ దేశ పత్రిక హెడ్‌లైన్స్‌లో నిలవడమే కాక.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇదేకాక సెప్టెంబర్‌లో లండన్‌లోని ‘ది నెడ్’ ప్రాంతంలో నిర్వహించిన మరో సంగీత కచేరి కూడా అక్కడి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సంగీత కార్యక్రమాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతూ సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తున్నాయి. -
సంగీతానికి కూడా సంకెళ్లా ‘కృష్ణా’!