ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దొసాంజ్‌పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించడంతో ఇప్పుడా ఆ పేరు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సంగీత ప్రియులను అలరించే దిల్జిత్.. తన టాలెంట్‌కు తగ్గట్టే భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడు. దిల్-లుమినాటి టూర్ పేరుతో ఈ పంజాబీ సింగర్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రత్యేక మ్యూజిక్ కాన్సర్ట్‌లను నిర్వహిస్తుంటాడు. ఈ సింగర్ మ్యూజిక్ కాన్సర్ట్‌కి మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడ సంగీక కచేరి నిర్వహించిన వేలల్లో జనాలు హాజరవుతుంటారు.
(చదవండి: పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ)
భారీ రెమ్యునరేషన్
దిల్జిత్ సింగర్ మాత్రమే కాదు.. ఇడియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే పర్ఫార్మల్లలో ఒకడు. ప్రైవేట్ ఈవెంట్స్‌కి ఈ సింగర్ భారీగా పారితోషికం తీసుకుంటాడు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో దిల్జిత్ సంగీత కచేరి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కి దాదాపు రూ. 4 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అలాగే సాధారంగా నిర్వహించే మ్యూజిక్ కాన్సర్ట్‌కి దాదాపు కోటి రూపాయాల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడట. చిన్న ఈవెంట్ అయితే రూ. 50 లక్షల వరకు తీసుకుంటాడట. అయితే దిల్జిత్ పాటలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆయన పాటలను ఇష్టపడేవాళ్లు టికెట్ రేట్ ఎంత పెంచినా కాన్సర్ట్‌కి మాత్రం హాజరవుతారు. అందుకే నిర్వాహకులు దిల్జిత్‌కి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఇక సినిమా పాటలకు అయితే దాదాపు 10-15 లక్షల వరకు తీసుకుంటాడట. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సింగర్‌లో దిల్జిత్ ఒకరు.
A fantastic start to 2025
A very memorable meeting with PM @narendramodi Ji.
We talked about a lot of things including music of course! pic.twitter.com/TKThDWnE0P— DILJIT DOSANJH (@diljitdosanjh) January 1, 2025
తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు..మోదీ ప్రశంసలు
గతేడాది నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కన్సర్ట్ జరిగింది. అయితే ఈ కచేరీలో మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని దిల్జిత్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు అందించింది. దీని పట్ల దిల్జిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు కచేరిలో తాను పాడాల్సిన పాట లిరిక్స్‌ని కూడా మార్చిపాడరు. ఒక ఆర్టిస్టు ఇంత దూరం వచ్చి అభిమానులను అలరించే సంగీత విభావరిలో పాల్గొని మంచి పాటలు పాడితే ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేయడం తప్పు అని అన్నారు. అప్పుడు కూడా దిల్జిత్ పేరు నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే దిల్జిత్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం గమనార్హం.
Let’s start Dry Nation Movement 🙏🏽
Ahmedabad 🪷 pic.twitter.com/K5RfuSn2Kx— DILJIT DOSANJH (@diljitdosanjh) November 17, 2024
Comments
Please login to add a commentAdd a comment