మత్తు పదార్థాలు ప్రోత్సహించే విధంగా పాటలు ప్రదర్శించకూడదని ప్రముఖ సింగర్ దిల్జిత్ దోశాంజ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ(నవంబర్ 15) హైదరాబాద్‌లో దిల్జిత్ కన్సర్ట్ జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఆయన తన గాత్రంతో పలు పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే గతంలో దిల్జిత్ నిర్వహించిన కన్సర్ట్‌లో డ్రగ్స్, మద్యాన్ని ప్రేరేపించే విధంగా పాటలు ఆలపించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమయ్యారు. మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని నోటీసులు అధించారు.
చండీగర్‌కు చెందిన ప్రొఫెసర్ పండిత్రావ్ ధరేనవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్జిత్‌కు నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా, గత అక్టోబర్‌లో ఢిల్లీలోని జవహర్‌లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో పాటియాలా పెగ్, పంజ్ తారలా వంటి పాటలు దిల్జిత్ పాడారు.
అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత వ్యాపించడం అందరినీ కలిచివేసింది. అక్కడ చెత్త కుప్ప చూసి షాక్ అయ్యారు. మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేశారు. రన్నింగ్ ట్రాక్‌పై కుళ్లిపోయిన ఆహారం, కుర్చీలు విరిగిపోయి కనిపించాయి. దిల్జిత్ నిర్వహించే ప్రతి సంగీత కచేరీలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమై దిల్జిత్‌కు న నోటీసులు అందించారు. కాగా, హైదరాబాద్‌లో దిల్జిత్ సంగీత కచేరీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యూజిక్ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment