Diljit Dosanjh
-
అలాంటి పాటలు పాడొద్దు.. ప్రముఖ సింగర్‌కు తెలంగాణ అధికారుల నోటీసులు
మత్తు పదార్థాలు ప్రోత్సహించే విధంగా పాటలు ప్రదర్శించకూడదని ప్రముఖ సింగర్ దిల్జిత్ దోశాంజ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ(నవంబర్ 15) హైదరాబాద్‌లో దిల్జిత్ కన్సర్ట్ జరగనుంది. ఈ ఈవెంట్లో ఆయన తన గాత్రంతో పలు పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే గతంలో దిల్జిత్ నిర్వహించిన కన్సర్ట్‌లో డ్రగ్స్, మద్యాన్ని ప్రేరేపించే విధంగా పాటలు ఆలపించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమయ్యారు. మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని నోటీసులు అధించారు. చండీగర్‌కు చెందిన ప్రొఫెసర్ పండిత్రావ్ ధరేనవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్జిత్‌కు నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా, గత అక్టోబర్‌లో ఢిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో పాటియాలా పెగ్, పంజ్ తారలా వంటి పాటలు దిల్జిత్ పాడారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత వ్యాపించడం అందరినీ కలిచివేసింది. అక్కడ చెత్త కుప్ప చూసి షాక్ అయ్యారు. మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేశారు. రన్నింగ్ ట్రాక్‌పై కుళ్లిపోయిన ఆహారం, కుర్చీలు విరిగిపోయి కనిపించాయి. దిల్జిత్ నిర్వహించే ప్రతి సంగీత కచేరీలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫథ్యంలో తెలంగాణ అధికారులు ముందే అప్రమత్తమై దిల్జిత్‌కు న నోటీసులు అందించారు. కాగా, హైదరాబాద్‌లో దిల్జిత్ సంగీత కచేరీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యూజిక్ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని నిర్వహకులు తెలిపారు. -
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!
హీరోయిన్ ఆలియా భట్, నటుడు–గాయకుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ ఎనిమిదేళ్ల తర్వాత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేదంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వంలో కరణ్ జోహార్, ఆలియా భట్, అపూర్వ మెహతా, షాహీన్ భట్, సౌమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం!)ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 11న విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు దిల్జీత్ సింగ్ వర్క్ చేస్తున్నట్లుగా ఇన్‌స్టా వేదికగా ఆలియా భట్ పేర్కొన్నారు. అయితే దిల్జీత్ సింగ్ ఓ పాట పాడనున్నారా లేక పాటతో పాటు గెస్ట్ రోల్ కూడా చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2016లో వచ్చిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో ఆలియా భట్, దిల్జీత్ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించగా, షాహిద్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఒక్క టికెట్ రూ.25 వేలా? డబ్బు వెనక పరిగెడతాడనుకోలేదు!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ త్వరలో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో సంగీత కచేరి నిర్వహించనున్నాడు. 'దిల్ లుమినటి టూర్' పేరిట నిర్వహించబోతున్న ఈ కన్సర్ట్కు సంబంధించి లక్ష టికెట్లను సెప్టెంబర్ 10న అమ్మకానికి పెట్టగా కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఆ టికెట్ రేట్లు మధ్య తరగతి జనాలకు అందుబాటులో లేవని కమెడియన్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్య సాహ్ని ఫైర్ అయింది.అంత డబ్బు ఎక్కడిది?సంగీత కచేరిలో ఒక్క టికెట్ రూ.20-25 వేలా? ప్రేక్షకుల దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పైగా ఎక్కువమంది నిరుద్యోగులే! మన భాషలో ఒకరు అద్భుతంగా పాడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు.. కానీ టికెట్ రేట్లు ఆ రేంజ్లో ఉంటే దాన్ని కొనడం మధ్య తరగతి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? పైగా పిల్లలతో కలిసే కుటుంబాలు కచేరీకి వెళ్తుంటాయి.బాగానే సంపాదిస్తున్నారు కదా!ఎలాగో విదేశాల్లో కచేరీలు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు కదా! అలాంటప్పుడు కనీసం మనవాళ్ల దగ్గరైనా తక్కువ వసూలు చేయొచ్చుగా.. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఒక్క టికెట్ దాదాపు రూ.10 వేలకే అమ్ముతారు. అలాంటిది నువ్వు రూ. 15 వేలు, రూ.20-25 వేలకు టికెట్స్ అమ్మడమేంటో నీకే తెలియాలి' అని వీడియోలో మండిపడింది.రూ.500 పెట్టడమే ఎక్కువఈ వీడియో చూసిన నెటిజన్లు సౌమ్య అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. 'ఒక్క టికెట్‌కు రూ.500 పెట్టడమే ఎక్కువ. నేనైతే ఆ కచేరీని యూట్యూబ్‌లో చూస్తాను', 'మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి దిల్జిత్ ఇలా డబ్బు, పేరు వెనక పరిగెడతాడని అస్సలు ఊహించలేదు', 'అతడు కావాలనుకుంటే ఒక్క సిటీలోనే పలు షోలు చేయొచ్చు, కానీ అభిమానుల కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు' అని కామెంట్లు చేస్తున్నారు. ఆరోజే కచేరీ ప్రారంభంకాగా దిల్జిత్ కచేరీ అక్టోబర్ 26 ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్, చంఢీగర్ వంటి నగరాల మీదుగా ఈ కచేరీ టూర్ సాగనుంది. View this post on Instagram A post shared by Saumya Sahni (@mrsholmes221b) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Diljit Dosanjh: కల్కి సింగర్ వాచ్ ధర తెలిస్తే కంగుతినడం ఖాయం..!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఇక దిల్జిత్ దోసాంజ్ పాటలే గాక మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. ప్రతి పాటకు అందుకు తగ్గ డిజైనర్ డ్రెస్‌లతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంటాడు. బహుశా ఈ ఆహార్యమే అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందేమో.!. ఇక ఇటీవల జిమ్మీపాలన్ ది టునైట్ షోలో దిల్జిత్ దోసాంజ్ ధరించి వాచ్ అందర్నీ ఆకర్షించింది. ఆయన ఆ షోలో పంజాబీకి చెందిన గోట్ లిరిక్స్, బోర్న్ టు షైన్ వంటి మంచి హిట్ పాటలతో ప్రేక్షకులనూ ఉర్రూతలు ఊగించాడు. ఈ షోలో ఆయన పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణతో పాటలు పాడారు. అలాగే అందుకు తగ్గట్లు తన సంస్కృతిని తెలియజెప్పేలా గోట్ లిరిక్స్‌లో మంచి హిట్ పాటలతో అలరించారు. ఈ షోలో ఆయన పాడుతూ.. లయబద్ధంగా డ్యాన్స్‌లు చేశారు. ఆ షోలో అందరి దృష్టి ఆయన చేతికి ధగ ధగ మెరుస్తూ కనిపిస్తున్న వాచ్‌పైనే పడింది. విలాసవంతమైన వస్తువుల కలెక్షన్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండే దిల్జిత్ ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ సెల్ఫ్వైండింగ్ బ్రాండ్ వాచ్‌ని ఈ షోకి ఎంపిక చేసుకున్నారు. ఈ వాచ్ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ లింక్‌లతో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ బ్రాస్లెట్తో రూపొందించారు. అంతేగాదు ఈ వాచ్ ఇండెక్స్ అవర్ మార్క్‌లో సిల్వర్ డయల్ ఉంటుంది. దీన్ని జైన్ ఆభరణాల వ్యాపారులు రూపిందించారట. ఈ వాచ్ మెరిసిపోయేలా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఎంత దూరం నుంచి చూసినా వాచ్ చేయిపై మిరుమిట్లు గొలిపే కాంతితో కూడిన ఒక ఆభరణంలా కనిపిస్తుంది. ఇంత లగ్జరీయస్ వాచ్ ధర వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్ముతాయి. దిల్జిత్ ఈ లగ్జరీయస్ బ్రాండెడ్ వాచ్‌ని ఏకంగా రూ. 1.2 కోట్లుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by The Tonight Show (@fallontonight) (చదవండి: ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!) -
ఫైనల్లీ 'కల్కి' సాంగ్ వచ్చేసింది.. అదే కాస్త డిసప్పాయింట్!
మరో పది రోజుల్లో ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD' థియేటర్లలోకి రాబోతుంది. కానీ ఇప్పటికే ప్రమోషన్స్ ఊసే లేదు. ఈ క్రమంలోనే భైరవ ఏంథమ్ సాంగ్ వచ్చేస్తుంది అంటూ గత మూడు రోజుల నుంచి ఉదరగొట్టారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తాజాగా దీన్ని రిలీజ్ చేశారు. మరి ఇది ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)ఆదివారం సాయంత్రం 8 గంటలకు 'భైరవ ఏంథమ్' సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఏమైందో ఏమో సోమవారం ఉదయం 11 గంటలకు అన్నారు. ఇక్కడ కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో తెలుగు లిరిక్స్‌తో పాటు హిందీ లిరిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. దీంతో వింటున్నది తెలుగు పాట? హిందీ లేదా పంజాబీ పాట అనేది అర్థం కాలేదు.అయితే ఈ ప్రమోషనల్ సాంగ్.. తెలుగు ప్రేక్షకుల కోసం కాకుండా ఉత్తరాది ఆడియెన్స్‌ని ఎట్రాక్ట్ చేయడం కోసమే రూపొందించినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పాటలో కనిపించిన ప్రభాస్ మనకు తెలుసు. కానీ దిల్జీత్ దోసాంజే మాత్రం మనలో చాలామందికి తెలియదు. మరి ఈ పాట ఎంతలా కనెక్ట్ అవుతుందనేది ఒకటి రెండు రోజులు ఆగితే తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్ మామూలోడు కాదు.. రెమ్యునరేషన్ వింత కండీషన్స్!) -
ప్రభాస్ 'కల్కి' సాంగ్ రిలీజ్ ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. మరో రెండు వారాల్లో అంటే జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా భైరవ యాంథమ్ పేరుతో ఓ సాంగ్ రెడీ చేశారు. ఫుల్ సాంగ్ ఆదివారం రానుండగా, తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజేతో కలిసి ప్రభాస్.. ఈ ప్రమోషనల్ పాటలో కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ సాంగ్.. కథలో అంతర్భాగంగా ఉంటుందని, అందుకే ప్రమోషన్ కోసం స్పెషల్‌గా ఈ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ లుక్ మాత్రం మంచి స్టైలిష్‌గా ఉంది.(ఇదీ చదవండి: పుష్ప 2 ప్లేసులోకి 'ఇస్మార్ట్'.. వాయిదా పడినట్లేనా?) -
సీక్రెట్‌గా ప్రముఖ సింగర్ వివాహం.. !
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం పరిణీతి చోప్రాతో కలిసి అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దిల్జీత్ దోసాంజ్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దిల్జీత్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు అతని స్నేహితుడు ఒకరు వెల్లడించారు. ఇండియా మూలాలున్న అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అంతే కాదు వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని భార్య, కుమారుడు అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పారు. దిల్జీత్ తల్లిదండ్రులు మాత్రం పంజాబ్‌లోని లుథియానాలో ఉన్నారని అన్నారు. కాగా.. గతంలో గుడ్ న్యూజ్ మూవీ ప్రమోషన్స్‌లో కియారా అద్వానీ అనుకోకుండా దిల్జిత్‌కు ఒక కొడుకు ఉన్నాడని వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం దిల్జిత్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ' నా ఫ్యామిలీకి ఏదైనా చెడు జరిగితే తట్టుకోలేను. నా కుటుంబం పట్ల కించపరిచేలా లక్ష్యంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ట్రోల్స్, మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా. నా తప్పుల కారణంగా నా కుటుంబం బాధపడకూడదని నేను కోరుకుంటా.' అని అన్నారు. కాగా.. పరిణీతి చోప్రా, దిల్జీత్ జంటగా నటించిన అమర్ సింగ్ చమ్కిలా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతోంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, అర్జున్ కపూర్‌తో నో ఎంట్రీ- 2 చిత్రంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) -
11 ఏళ్లకే ఇంట్లో నుంచి పంపించేశారు: నటుడు
బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అతడు నటించిన అమర్ సింగ్ చంకీలా (అమర్ సింగ్ చంకీలా బయోపిక్) సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. ఒక్కమాటైనా అడగలేదు '11 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నా తల్లిదండ్రులను, ఊరిని వదిలేసి మా మామతో లూథియానాకు వెళ్లిపోయాను. అతడు నన్ను తనతో పంపించమని అడగ్గానే అమ్మానాన్న నాకు మంచి ఫుడ్, షెల్టర్ దొరుకుతుందన్న ఆశతో వెంటనే తీసుకెళ్లిపోమని చెప్పారు. వెళ్లడం ఇష్టమేనా? అని నన్ను ఒక్క మాటైనా అడగలేదు. అక్కడికి వెళ్లాక ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడిని. టీవీ ఉండేది కాదు. అప్పుడు ఫోన్లు కూడా లేవు. అలా నా కుటుంబానికి నేను పూర్తిగా దూరమయ్యాను. నేను ఏ స్కూల్లో చదువుతున్నానని కూడా నాన్న అడిగేవారు కాదు. అందరితో నా సంబంధాలు తెగిపోయాయి. అమ్మ మాటలు వింటే.. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడల్లా కాల్ కట్ చేసేముందు అమ్మ నన్ను ఆశీర్వదించేది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవించగానే అన్ని టెన్షన్లు ఎగిరిపోయేవి. ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించేది. తన మాటలతో నాపై ప్రేమవర్షం కురిపించేది. ఆ దేవుడి కంటే కూడా నాకు మా అమ్మే ఎక్కువ' అని చెప్పుకొచ్చాడు. దిల్జిత్ ఇటీవల క్య్రూ సినిమాలో కనిపించాడు. చదవండి: ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. విలన్‌గా అది తప్పదన్న నటుడు -
కిల్లర్ బామ్మ.. మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే
మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఓ నంబర్ మాత్రమే అంటారు చాలా మంది. కలలు సాకారం చేసుకోవాలనుకువారు.. ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే వారు వయసును పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను మళ్లీ అందిపుచ్చుకుంటారు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని పట్టించుకోరు. తమ మనసుకు నచ్చిన పని చేస్తూ.. సంతోషంగా ఉంటారు. ఇలాంటి వారికే త్వరగా గుర్తింపు దక్కుతుంది. ఇందుకు ఉదాహరణలు మన చుట్టు కొకొల్లలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా సోషల్ మీడియా ఓ బామ్మను ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మార్చింది. 60 ఏళ్ల రవి బాల శర్మ అనే ఈ బామ్మ డ్యాన్స్‌కు నెటిజనులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తన హవభావాలు, డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో అదరగొడుతున్నారు బామ్మ. ప్రస్తుతం ‘‘డ్యాన్సింగ్ దాదీ’’ పేరుతో ఈ బామ్మ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతియాజ్ అలీ, దిల్జిత్ దోసాంజ్ వంటి వారు బామ్మ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ అయ్యారు. ఈమె డ్యాన్స్ వీడియోలు చూసిన వారంతా ‘‘బామ్మ మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రవి బాలా శర్మ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అవకాశం దొరికితే చాలు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని డ్యాన్స్ చేసేదాన్ని. కానీ దానిలో రాణించే అవకాశం లభించలేదు. ఇలా ఉండగానే వివాహం అయ్యింది. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో సరిపోయింది. దాంతో డ్యాన్స్ ప్రాక్టీస్ మూలన పడింది’’ అంటూ చెప్పుకొచ్చారు. ‘‘ఇలా ఉండగానే నా భర్త మరణించారు. ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాను. డిప్రెషన్లోకి వెళ్లాను. నన్ను మాములు మనిషిని చేయడం కోసం నా పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టమని బలవంతం చేశారు. నన్ను గొప్ప డ్యాన్సర్‌గా చూడాలని నా భర్త కోరుకునేవాడు. ఆయన కల నేరవేర్చడం కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాను’’ అంటూ చెప్పుకొచ్చారు. ‘‘ఈ క్రమంలో నా సోదరి ఓ సారి నన్ను ఆడిషన్‌కి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. ఆశ్చర్యం చాలా మంది నన్ను ప్రశంసించారు. బాగా చేశానని మెచ్చుకున్నారు. వారి ప్రశంసలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుండేదాన్ని. ఓ వీడియోకు ఏకంగా ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు’’ అన్నారు. ‘‘నా కల నిజం అవుతుందని కానీ.. ఈ వయసులో ఇంత పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తానని కానీ నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ప్రోత్సాహిస్తున్నవారందరికి ధన్యవాదాలు. వయసు మీద పడిందని బాధ పడకండి. అది కేవలం ఓ నంబర్ మాత్రమే. కలలను సాకారం చేసుకోవడానికి వయసుతో పని లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు ఈ బామ్మ. చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి View this post on Instagram A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma) -
విషం తాగితే పట్టించుకోరు.. కానీ
న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై రైతులు, రైతు సంఘాలు అవిశ్రాంత పోరాటం చేస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరించి, తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం, దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ నటులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతల డిమాండ్లు నెరవేర్చకపోతే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఛలో ఢిల్లీ పేరిట రైతు ఆందోళనలు మొదలైన నాటి నుంచి బాలీవుడ్ నటుడు, సింగర్ దిల్జిత్ దోసాంజ్ వారికి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. హర్యానా- ఢిల్లీ సరిహద్దులో సింఘూ వద్ద నిరసనలో పాల్గొని ప్రసంగం చేశాడు. ‘‘రైతుల డిమాండ్లు నెరవేర్చండి. కేంద్రానికి ఇదే మా ఏకైక అభ్యర్థన. ఇక్కడ ప్రతి ఒక్కరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దేశం మొత్తం వీరి వెంటే ఉంది. ఇది రైతులకు సంబంధించిన ఆందోళన’’ అని అన్నదాతల తరఫున గళం వినిపించాడు. ఈ క్రమంలో నటి కంగనా రనౌత్ వంటి వారి నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వెనకడుగు వేయక రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు.(చదవండి: నేడు రైతు సంఘ నేతల నిరాహారదీక్ష) ఈ క్రమంలో రైతులు పిజ్జా తింటున్న దృశ్యాలు షేర్ చేస్తూ వారి నిరసనను కించపరిచేవిధంగా మాట్లాడుతున్న వారికి దిల్జిత్ ట్విటర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘రైతులు విషం తాగితే ఎవరూ పట్టించుకోరు. కానీ రైతులు పిజ్జా తింటే మాత్రం అది పెద్ద న్యూస్ అవుతుంది. శభాష్!’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఆందోళనలో పాల్గొన్న రైతుల కోసం కొంతమంది పిజ్జాలు పంచిపెట్టగా, మరికొంత మంది, కాలినడకన వస్తున్న వారి కోసం మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై స్పందించిన కొంతమంది నెటిజన్లు.. ‘‘పిజ్జాలు ఉచితంగా పంచుతున్నారు. మసాజ్ చెయిర్లు కూడా. ఇది ఆందోళనా లేదా ఫైవ్ స్టార్ స్పానా? వారి బిల్లులు ఎవరు కడుతున్నారు’’అంటూ విషం చిమ్ముతున్నారు. Free pizzas for protesting farmers, massage chairs, is this a protest or a five-Star spa? And who is paying for all this?#farmersProtestHijacked pic.twitter.com/n0OmxE0j9M — SRINIVAS BAJHRANGI (@SRINIVASBAJHRA1) December 12, 2020 -
రైతు దీక్షలు.. సింగర్ కోటి సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని నడిబొడ్డున రైతులు చేపట్టిన దీక్షలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నెల 8న తలపెట్టన భారత్ బంద్‌కు ఇప్పటికే విపక్ష పార్టీతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం మద్దతు ప్రకటించారు. పదిరోజులుగా ఢిల్లీ నడిరోడ్డుపై చలిలో దీక్షలు నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. న్యాయబద్ధమైన రైతుల డిమాండ్స్‌ను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రైతులకు అండగా బియ్యం, దుస్తులు, కూరగాయలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రైతుల దీక్షలకు మద్దతు ప్రకటించిన పంజాబ్ నటుడు, ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసంజ్ మరోసారి వారికి అండగా నిలిచారు. చలిలో గత పదిరోజులుగా నిరసన తెలుపుతున్న రైతులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. రైతులకు మద్దతుగా ప్రజాసంఘాలు, నాయకులు ముందుకు రావాలని కోరారు. (రైతుల దీక్షకు సీఎం కేసీఆర్ మద్దతు) కాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై దిల్జిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము యూపీ వాలా కాదని, పంజాబ్ రైతులమని గట్టి కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దమరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగింది. మరోవైపు రైతులతో కేంద్రం జరిపిన ఐదో విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో దీక్షలను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్త బంద్‌కు విపక్షాలతో పాటు ప్రజాసంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. (చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు) -
దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కంగనకు, నటుడు, సింగర్ దిల్జిత్ దోసంజ్‌కి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. అతడిని కరణ్ జోహర్ పెంపుడు జంతువు అంటూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన.. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు మహిళను ఉద్దేశించి.. షాహీన్ బాగ్ దాదీలలో ఒకరైన బిల్కిస్ బానుగా భావించి.. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తప్పుగా ట్వీట్ చేయడంతో నెజిటనులు కంగనపై విరుచకుపడ్డారు. వెనకా ముందు చూసుకోకుండా.. ట్విట్ చేస్తే ఇలానే అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, సింగర్ దిల్జత్ దోసంజ్ క్వీన్ హీరోయిన్ని ఉద్దేశించి ‘కంగన.. బిల్కిస్ బానుగా ట్వీట్ చేసిన మహిళ ఈమె.. పేరు మహిందర్ కౌర్. కంగన టీమ్ ఈ నిజం వినండి. ఎవరూ ఇంత గుడ్డివాళ్లలా ఉండకూడదు. ఆమె(కంగన) ఏమైనా చెప్తూనే ఉంటారు’ అంటూ మహీందర్ కౌర్ మాట్లాడిన వీడియోను కూడా ట్వీట్ చేశారు దిల్జిత్. దీనిపై కంగనా మండిపడ్డారు. దిల్జిత్‌ని కరణ్ పెంపుడు జంతువు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దిల్జిత్ ట్వీట్‌పై స్పందిస్తూ కంగన.. ‘ఓ కరణ్ జోహర్ పెంపుడు జంతువు.. షాహీన్ బాగ్‌లో తన పౌరసత్వం కోసం నిరసన చేసిన దాదీ.. ఇప్పుడు రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తోన్న ఆందోళనలో కేవలం వంద రూపాయల కోసం వచ్చి కూర్చున్నది. మహీందర్ కౌర్ జీ ఎవరో నాకు తెలియదు. మీరంతా ఏం డ్రామాలు ఆడుతున్నారు.. వెంటనే ఆపేయండి’ అంటూ విరుచుకుపడ్డారు కంగనా. (చదవండి: కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!) Ooo Karan johar ke paltu, jo dadi Saheen Baag mein apni citizenship keliye protest kar rahi thi wohi Bilkis Bano dadi ji Farmers ke MSP ke liye bhi protest karti hue dikhi. Mahinder Kaur ji ko toh main janti bhi nahin. Kya drama chalaya hai tum logon ne? Stop this right now. https://t.co/RkXRVKfXV1 — Kangana Ranaut (@KanganaTeam) December 3, 2020 ఇక ఎంఎస్ మహీందర్ కౌర్‌ని చూసి బిల్కిస్ బాను అనుకోని కంగనా ట్వీట్ చేసినందుకు లీగల్ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్ చెక్' అనే ఆన్లైన్ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు. -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
కరణ్ మెచ్చిన కియార
నెట్‌ఫ్లిక్స్‌లో హల్చల్ చేసిన ‘లస్ట్ స్టోరీస్’లో ఓ పార్ట్‌లో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ నటించిన విషయం నెటిజన్లకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మరోసారి కరణ్ జోహార్ సినిమాలో కనిపించనున్నారీ భామ. అయితే ఈసారి కరణ్ డైరెక్టర్ కాదు. ప్రొడ్యూసర్ మాత్రమే. కరీనా కపూర్, అక్షయ్ కుమార్ జంటగా కరణ్ జోహార్ నిర్మించనున్న ఓ చిత్రాన్ని రాజ్ మెహతా డైరెక్ట్ చేయనున్నారు. రెండు జంటలు, వాళ్ల లైఫ్‌లో జరిగే జర్నీగా ఈ చిత్ర కథ ఉండబోతోందట. ఆల్రెడీ ఒక జంటగా అక్షయ్, కరీనా ఉండగా మరో జంటగా దిల్జిత్ దోషాన్జ్, కియారా అద్వానీని ఎంపిక చేశారట కరణ్. ‘లస్ట్ స్టోరీస్’లో కియారా నటనకు దర్శకుడిగా కరణ్ ఫిదా అయిపోయారట. అందుకే తాను నిర్మించనున్న తాజా చిత్రానికి ఆమెను తీసుకున్నారట. -
స్పూఫ్ ఆఫ్ బాలీవుడ్
‘వెలకమ్ టు న్యూయార్క్’... ఐఫా అవార్డ్స్ మీద వచ్చిన స్పూఫ్ అని చెప్పొచ్చు. వెంకటేష్, కమల్‌హసన్ నటించిన ‘ఈనాడు’ సినిమా దర్శకుడు చక్రి తోలేటి నిర్దేశకత్వంలో వచ్చిన చిత్రం వెల్కమ్ టు న్యూయార్క్. నిజానికిది పారిస్ ఫ్యాషన్ వీక్ మీద రాబర్ట్ అల్ట్మన్ తీసిన ‘ప్రెట్ ఎ పోర్టర్’ సినిమాకు రీమేక్ లాంటిదని చెప్పొచ్చు. ఫ్యాషన్ వీక్ చోట ఐఫా అవార్డ్ ఫంక్షన్ ఉంది అంతే. కథ.. సోఫియా (లారా దత్తా) ఐఫా అవార్డ్స్ ఈవెంట్‌ను నిర్వహించే సంస్థ ఎంప్లాయి. గ్యారీ (బొమన్ ఇరానీ) ఆమె బాస్. పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా అహోరాత్రులు కష్టపడి ఆ సంస్థను నిలబెడుతుంది. అంత కష్టపడ్డా తనకు రావల్సిన వాటా ఇవ్వడు గ్యారీ. ఈసారి జరగబోయే ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ ఫెయిల్ చేసి కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ఇండియాలో టాలెంట్ సెర్చ్ పెట్టి జీనల్ పటేల్ (సోనాక్షి సిన్హా), తేజి (దిల్జిత్)లను ఎంపిక చేస్తుంది. వాళ్లు గొప్ప ప్రతిభావంతులని కాదు.. ఎందుకూ పనికిరారని. ఇంతకీ ఆ ఇద్దరికున్న టాలెంట్ ఏంటీ? జీనల్ పటేల్.. యాంబిషియస్ గుజ్జి గర్ల్. డ్రెస్ డిజైనర్. గొప్ప డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలని.. ఎలాగైనా సరే బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారాలని కలలు కంటుంది.. కష్టపడుతుంటుంది. తేజీ విషయానికి వస్తే.. రికవరీ ఏజెంట్. యాక్టింగ్ అంటే పిచ్చి. అద్దాన్ని చూస్తే అతనిలో ఉన్న నటుడు నిద్రలేస్తాడు. బాలీవుడ్‌లోని నటులను అనుకరిస్తూ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. జీనల్ డ్రెస్ డిజైనింగ్, తేజ్ నటనతో పంపిన వీడియోలను ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ చేసేస్తారు. తన బాస్ మీద రివేంజ్ తీసుకోదల్చిన సోఫియా వాటిని ఏరి ఓకే చేస్తుంది. న్యూయార్క్‌లో జరగబోయే ఐఫా అవార్డ్స్‌కు టికెట్స్, హోటల్ గదులు బుక్ చేసి వాళ్లకు ఆహ్వానం పంపుతుంది. ఇంకో వైపు.. ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు యాంకర్స్‌గా కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్‌లను పిలుస్తారు. కరణ్‌జోహార్.. ఫ్యాషన్ ఫ్రీక్.. బ్రాండ్స్ అంటే పడి చస్తుంటాడు. అయితే కరణ్‌కు ఓ కవల సోదరుడు ఉంటాడు. అతని పేరు అర్జున్. న్యూయార్క్‌లో అతనో గ్యాంగ్‌స్టర్. కరణ్ జోహార్ తీసిన కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ వంటి సినిమా అభిమానులు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్, మ్యాన్ హటన్ లాంటి వీథుల్లో అర్జున్ తిరుగుతుంటే జనాలు భయపడకపోగా.. కరణ్.. కరణ్ అంటూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం వెంటపడుతుంటారు. ఇది అర్జున్‌కు చాలా కోపం తెప్పిస్తుంది. తన దందాను పాడు చేస్తున్నాడు అని కరణ్ మీద చిరాకు కలుగుతుంది. ఎలాగైనా కరణ్‌ను చంపాలనుకుంటాడు. ఐఫా అవార్డ్స్‌కు న్యూయార్క్ వస్తున్నాడని తెలుసుకొని ఆ టైమ్‌ను వినియోగించుకోవాలనుకుంటాడు. కాని కథ అడ్డం తిరిగి అర్జున్ ప్లాన్ పాడవుతుంది. అతను కటకటాల్లో చిక్కుకుంటాడు. కరణ్, రితేష్‌తో కలిసి హోస్ట్ చేసి ఐఫా అవార్డ్ ఫంక్షన్‌ను హిట్ చేస్తాడు. ఆ షోను వరెస్ట్ షోగా చూపించాలనుకున్న సోఫియా కుట్రను అర్థం చేసుకున్న జీనల్, తేజీలు అలా కానివ్వకుండా నిజంగానే తమ టాలెంట్‌ను చూపిస్తారు. సల్మాన్‌కు డ్రెస్ డిజైన్ చేసి జీనల్, షోలో తన అభినయ కౌశలం చూపించి తేజీలు తమలో ప్రతిభ ఉందని రుజువు చేస్తారు. టీవీ షోకి కొనసాగింపుగా.. సినిమా అవార్డుల ప్రదానోత్సవ వేడుకల వెనక ఉన్న డ్రామా, డబ్బు వంటి విషయాలను హాస్యరసప్రధానంగా తెరకెక్కించే ప్రయత్నమే వెల్కమ్ టు న్యూయార్క్. కరణ్ జోహార్ తన సినిమాల మీద తానే సెటైర్ వేసుకుంటుంటాడు. బాలీవుడ్ స్టార్స్ మీద వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. అయితే ఈమాత్రం టీవీ షోల్లో, టీవీల్లోనే ప్రసారమయ్యే స్టాండప్ కామెడీ షోలో చాలా కనపడుతున్నాయి. దీన్ని సినిమాగా తీస్తున్నప్పుడు చక్రీ తోలేటి ఇంకాస్త పకడ్బందీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను పెట్టుకుంటే బాగుండేది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి తెలుగువారికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. – శరాది -
అడ్డుకుంటారు... ఆగొద్దు
‘‘లైఫ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే సక్సెస్ విలువ తెలుస్తుంది. ఫెయిల్యూర్స్ నుంచే కాదు సక్సెస్ నుంచి కూడా ఒక మంచి పాఠం నేర్చుకున్నప్పుడే లైఫ్ మరింత మెరుగవుతుంది’’ అంటున్నారు కృతీ సనన్. లైఫ్ గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ – ‘‘జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కష్టానికి కంగారు పడకూడుదు. సక్సెస్‌కు సంబరపడిపోకూడుదు. పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. నాకు టీమ్ నచ్చితేనో లేక సినిమాలో నా క్యారెక్టర్ నచ్చినప్పుడు మాత్రమే యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాను. లేకపోతే లేదు. ఎవరికైనా లైఫ్‌లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కామనే. కాకపోతే ఈ జర్నీలో కొత్తగా ఏం నేర్చుకున్నామన్నదే ఇంపార్టెంట్. నీ చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు నిన్ను నిరుత్సాహపరచడానికి రెడీగా ఉంటారు. నీ కలను అడ్డుకోవడమే వారి పని. అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆగకండి. మీ పనిని మీరు ఎంత బాధ్యతగా, ప్రేమగా చేస్తున్నారన్నదే ముఖ్యం’’ అని చెప్పారు. ఇక ఇండస్ట్రీ వాతావరణం గురించి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ముఖ్యంగా మనపై మనకు నమ్మకం ఉండాలి. మంచి జాబ్ ఆఫర్స్ వదులుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను నేను. మొదట్లో మోడలింగ్, టీవీ కమర్షియల్స్ చేశాను. ఆ తర్వాత నాపై నమ్మకంతో యాక్టింగ్ వైపు అడుగులు వేశా. కష్టపడ్డాను. ఇప్పుడు హీరోయిన్గా నటిస్తున్నాను. నీ పనికి ఎంత కష్టాన్ని ఇవ్వగలవో అంత ఎక్కువ ప్రతిఫలాన్ని నువ్వు పొందగలవు’’ అని చెప్పుకొచ్చారామె. ప్రస్తుతం రోహిత్ జుగరాజ్ దర్శకత్వంలో దిల్జీత్ హీరోగా రూపొందుతున్న ‘అర్జున్ పాటియాలా’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబు ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు కృతీ సనన్. -
కట్ చేశారా
‘మెటీరియల్ సెలెక్ట్ చేశారా? లెంగ్త్ సరిగ్గా చూసుకున్నారా? జాగ్రత్తగా... కరెక్ట్‌గా కట్ చేయండి!’ సినిమాల్లోకి రాకముందు తన గ్రూప్‌తో సోనాక్షీ సిన్హా ఇలాంటి మాటలే మాట్లాడేవారు. ఎందుకంటే తను అప్పుడు ఫ్యాషన్ డిజైనర్. సినిమాల్లోకి వచ్చాక వేరే డిజైనర్స్‌తో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేయించుకుంటున్నారీ బ్యూటీ. ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్ డిజైనర్ అవతారం ఎత్తారు. అదీ సినిమా కోసమే. ‘వెల్కమ్ టు న్యూయార్క్’ అనే సినిమాలో సోనాక్షి ఈ పాత్రను చేస్తున్నారు. ఇందులో దిల్జిత్ హీరో. ‘‘రియల్ లైఫ్‌లో ఫ్యాషన్ డిజైనర్ స్టూడెంట్‌ని. ఇప్పుడు రీల్‌పై ఆ పాత్ర చేస్తున్నాను. కట్టింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ వంటి అంశాలపై నాకు గ్రిప్ ఉంది. అప్పట్లో మా బ్యాచ్‌లో టాపర్ నేనే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది నాకు’’ అన్నారు సోనాక్షి. సో.. ఈ పాత్రలో జీవించేస్తారన్నమాట. పైగా ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. ఈ చిత్రానికి మన తెలుగు కుర్రాడు చక్రి తోలేటి దర్శకుడు. కమల్‌హాసన్ ‘ఈనాడు’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యారు చక్రి. ఆ తర్వాత అజిత్ ‘బిల్లా 2’కి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నయనతార ‘కొలైయుదిర్ కాలమ్’కి, అదే చిత్రం హిందీ వెర్షన్ ‘కామోషీ’కి దర్శకత్వం వహిస్తున్నారు. -
బై బై.. సెర్బియా
సొంత గడ్డపై మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇక విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు వెళ్లారు హీరోయిన్ తాప్సీ. ఇంతకీ...తాప్సీ ప్రజెంట్ ఏ గేమ్ ప్లేయర్ అంటే..‘హాకీ’ అని ఇట్టే ఊహించే ఉంటారు. బీ టౌన్ డైరెక్టర్ షాద్ అలీ దర్శకత్వంలో హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూర్మ’. సందీప్ రోల్‌ను హిందీ యాక్టర్ దిల్జీత్‌సింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తాప్సీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్‌ను చత్తీస్‌ఘడ్‌లో చిత్రీకరించారు. నిన్నటి వరకు సెర్బియాలో ఒక షెడ్యూల్‌ను చిత్రీకరించారు. అక్కడ కీలకమైన సీన్స్‌లో పాల్గొన్నారు తాప్సీ. ఈ సినిమాను జూన్ 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదండోయ్.. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... తాప్సీ త్వరలోనే ముంబైలో ఓ ఇల్లు కొనాలనుకుంటు న్నారని, సమ్మర్లో గృహప్రవేశం చేయాల నుకుంటున్నారని బాలీవుడ్ టాక్. మరి.. తాప్సీ కొత్త ఇంటి అడ్రెస్ ఎక్కడ? అంటే.. ఆశ..దోశ.. అప్పడం.. వడ.. చెప్పేస్తారేంటి? -
గోల్ కొట్టేస్తా.. హిట్ పట్టేస్తా..!
తాప్సీ గోల్ ఇప్పుడు ఒకటే. హాకీ స్టిక్‌తో బాల్ని గోల్‌పోస్ట్‌లోకి కొట్టడమే. అందుకే హాకీ ఆట గురించి ఆమె ఫుల్‌గా తెలుసుకున్నారు. ఇక చెప్పేదేముంది? హాకీ గేమ్ కిట్‌తో గ్రౌండ్లో దిగిపోయారు. వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. తాప్సీ ఎంతో ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్లా ప్రాక్టీస్ చేస్తున్నారట. ఆమె కాన్సన్ట్రేషన్ చూస్తుంటే షాట్ గురి తప్పదేమో అన్నట్లు ఉందట. ఇదంతా ఓ సినిమా కోసమేనండోయ్. ఇండియన్ హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ బయోపిక్‌ను షాద్ అలీ తెరకెక్కిస్తున్నారు. ‘జూమ్ బరాబర్ జూమ్, కిల్ దిల్, ఓకే జాను’ వంటి హిందీ చిత్రాలను తెరకెక్కించా రాయన. ఈ సినిమాలో దిల్జిత్ దేశాంగ్, తాప్సీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. సందీప్ పంజాబీ కాబట్టి, కీలక సన్నివేశాలను అక్కడ తీయడానికి ప్లాన్ చేశారు. ‘‘నా లైఫ్‌లో స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. ఇండియాలో నా ఫేవరెట్ ప్లేస్ పంజాబ్. అక్కడ జరగబోయే ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నాను. ఆల్రెడీ కొన్ని హాకీ సెషన్స్‌ను కంప్లీట్ చేశాను. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు తాప్సీ. -
ప్రైవేటు విమానాన్ని కొన్న హీరో!
‘ఉడ్తా పంజాబ్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన దిల్జిత్ దోసాన్జ్ తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు ఫిలింఫేర్ అవార్డును సైతం అతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అనుష్క శర్మ తెరకెక్కించిన ‘ఫిల్హౌరి’ సినిమాలోనూ దిల్జిత్ అలరించాడు. ఇక అసలు విషయానొకొస్తే దిల్జిత్ తాజాగా ఓ ప్రైవేటు జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘ ప్రైవేటు జెట్‌తో సరికొత్త ఆరంభం మొదలైంది’ అంటూ అతను ట్వీట్ చేశాడు. దిల్జిత్ త్వరలోనే తన టీమ్‌తో కలిసి ప్రపంచమంతటా సంగీత కచేరిలు (కాన్సర్ట్స్) నిర్వహించబోతున్నాడు. త్వరలో వాంకోవర్, ఎడ్మంటన్, విన్నిపెగ్, టోరంటోలో అతను ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. అతను పెట్టిన కొత్త విమానం ఫొటోలు, వీడియోలు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి. New Beginning Starts With Private Jet -
సినిమాపై కేసు.. 5 లక్షల ఫైన్
తమ సినిమా స్క్రిప్టును కాపీ కొట్టి హిందీ సినిమా తీశారని, అందువల్ల ఆ సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరుతూ కోర్టుకెక్కిన గుజరాతీ నిర్మాతలకు బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. అనుష్కా శర్మ సహనిర్మాతగా వ్యవహరించి.. సరదా దెయ్యంగా నటించిన 'ఫిల్లౌరీ' సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించడమే కాక, విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గుజరాతీ సినిమా మంగళ్ ఫేరా నిర్మాతలకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. గాయత్రీ సినీ ప్రొడక్షన్ ప్రతినిధులు గాయత్రి, దర్శన్ రాథోడ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మంగళ్ ఫేరా సినిమాను తొలుత గుజరాతీలోను, ఆ తర్వాత భోజ్‌పురి, బెంగాలీ భాషల్లోను నిర్మించారు. తమ సినిమాలో ఓ మహిళ చెట్టును పెళ్లి చేసుకుంటుందని, కానీ ఆ చెట్టుమీద ఉన్న దెయ్యం ఆమెను ఇష్టపడి తన భార్యగా భావిస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఫిల్లౌరి సినిమాలో హీరో దిల్జీత్ దోసంజ్ తన దోషాన్ని పరిహరించుకోడానికి ఇలా ఓ చెట్టును పెళ్లాడతాడు. ఆ చెట్టుమీద ఉండే దెయ్యమైన అనుష్కాశర్మ అతడిని ఇష్టపడి.. నువ్వే నా భర్త అంటుంది. అప్పటినుంచి జరిగే సరదా సన్నివేశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంటుంది. ఫాక్స్ స్టార్‌తో కలిసి అనుష్కా శర్మ ఈ సినిమాను స్వయంగా నిర్మించింది. ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల అవుతోంది. -
క్షమాపణ చెప్పిన హీరో
ముంబై: డిజిలిత్ దోసాన్ జహ్ గురించి చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో హర్షవర్థన్ కపూర్ క్షమాపణ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు డిజిలిత్ ను బాధ పెట్టివుంటే క్షమించాలని కోరాడు. ‘డిజిలిత్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటనను అభిమానిస్తాను. నేనేదైనా తప్పుగా మాట్లాడివుంటే మన్నించాల’ని ట్వీట్ చేశాడు. డిజిలిత్ కు ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇవ్వడాన్ని అంతకుముందు హర్షవర్థన్ తప్పుబట్టాడు. ‘తొలి ఉత్తమ నటుడి అవార్డు కొత్తగా సినిమాలు చేసిన వారికి ఇస్తారు. వేరే భాషల్లో సినిమాలు చేసి హిందీలో మొదటి చిత్రంలో నటించిన వారిని డెబ్యూ అవార్డులకు ఎంపిక చేయడం శోచనీయం. వంద ఇంగ్లీషు సినిమాల్లో నటించినా హిందీలో తొలి చిత్రం చేస్తే నాకు డెబ్యూ కేటగిరిలో అవార్డులకు అర్హత ఉంటుంది. లియొనార్డో డికాప్రియో ఆస్కార్ అవార్డు అందుకున్నా.. బాలీవుడ్ లో సినిమా చేస్తే అతడికి కూడా డెబ్యూ పురస్కారం ఇస్తారేమోన’ని హర్షవర్థన్ వ్యంగంగా కామెంట్లు చేశాడు. అనిల్ కపూర్ తనయుడైన 26 ఏళ్ల హర్షవర్థన్ ‘మీర్జ్యా’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.