కియారా అద్వానీ
నెట్‌ఫ్లిక్స్‌లో హల్‌చల్ చేసిన ‘లస్ట్ స్టోరీస్’లో ఓ పార్ట్‌లో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ నటించిన విషయం నెటిజన్లకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మరోసారి కరణ్ జోహార్ సినిమాలో కనిపించనున్నారీ భామ. అయితే ఈసారి కరణ్ డైరెక్టర్ కాదు. ప్రొడ్యూసర్ మాత్రమే. కరీనా కపూర్, అక్షయ్ కుమార్ జంటగా కరణ్ జోహార్ నిర్మించనున్న ఓ చిత్రాన్ని రాజ్ మెహతా డైరెక్ట్ చేయనున్నారు. రెండు జంటలు, వాళ్ల లైఫ్‌లో జరిగే జర్నీగా ఈ చిత్ర కథ ఉండబోతోందట. ఆల్రెడీ ఒక జంటగా అక్షయ్, కరీనా ఉండగా మరో జంటగా దిల్జిత్ దోషాన్జ్, కియారా అద్వానీని ఎంపిక చేశారట కరణ్. ‘లస్ట్ స్టోరీస్’లో కియారా నటనకు దర్శకుడిగా కరణ్ ఫిదా అయిపోయారట. అందుకే తాను నిర్మించనున్న తాజా చిత్రానికి ఆమెను తీసుకున్నారట.
Comments
Please login to add a commentAdd a comment