Koffee With Karan 7: Kiara Advani Hesitate By Karan Johar Questions - Sakshi
Sakshi News home page

Kiara Advani: బెడ్‌రూమ్‌లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్‌

Published Thu, Aug 25 2022 3:46 PM | Last Updated on Thu, Aug 25 2022 5:59 PM

Koffee With Karan 7: Kiara Advani Hesitate By Karan Johar Questions - Sakshi

కాఫీ విత్‌ కరణ్‌.. సెలబ్రిటీల పర్సనల్‌ విషయాలు లాగడమే ఈ షో లక్ష్యంగా తయారైంది. ఏ సెలబ్రిటీ వచ్చినా వారి బెడ్‌రూమ్‌ విషయాలు లేదంటే రిలేషన్‌షిప్‌ గురించి ఏ మాత్రం మొహమాటం లేకుండా కూపీ లాగుతుంటాడు హోస్ట్‌ కరణ్‌ జోహార్‌. ఇటీవల సిద్దార్థ్‌ మల్హోత్రా ఈ షోకి రాగా తాజాగా సిద్దార్థ్‌ ప్రేయసి కియారా అద్వానీ కాఫీ విత్‌ కరణ్‌లో ప్రత్యక్షమైంది. ఆమెతో పాటు హీరో షాహిద్‌ కపూర్‌ కూడా గెస్ట్‌గా విచ్చేశాడు. ఇక వాళ్లిద్దరినీ సోఫాలో కూచోబెట్టిన కరణ్‌.. తన వాడివేడి ప్రశ్నలతో కియారాకు చెమటలు పట్టించాడు. 

నువ్వు బెడ్‌రూమ్‌లో దొంగా పోలీసు వంటి ఆటలు ఆడలేదా? అని అడిగాడు. దీనికామె కొంత ఇబ్బందిగా చూస్తూ మా అమ్మ ఈ ఎపిసోడ్‌ చూస్తుంది అని బదులిచ్చింది. అయినా వెనక్కు తగ్గని హోస్ట్‌.. అయితే ఏంటట? మీ అమ్మ నువ్వింకా కన్యవనే అనుకుంటుందా, ఏంటి? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి కియారా నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా అని ఆన్సరిచ్చింది. సిద్దార్థ్‌తో నువ్వు రిలేషన్‌లో లేవా? అన్న ప్రశ్నకు అవుననీ చెప్పను, కాదనీ చెప్పను అని తెలివిగా ప్రశ్నను దాటవేసింది. అయితే మీరు క్లోజ్‌ ఫ్రెండ్సా? అని అడగ్గా.. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కంటే కూడా ఎక్కువే! అని తెలిపింది. కాగా కియారా అద్వానీ ప్రస్తుతం సత్య ప్రేమ్‌ కీ కథ అనే సినిమా చేస్తోంది. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలుకానుంది.

చదవండి: విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ ఎలా ఉందంటే...
'ది ఫ్యామిలీ మ్యాన్‌' తరహాలో..  మరోసారి డేర్‌ చేస్తున్న సామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement