
కరీనా కపూర్
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మరోసారి కరణ్ జోహార్ చిత్రంలో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కరణ్ జోహార్ దర్శకత్వంలో 2001లో వచ్చిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా కపూర్ తొలిసారి కరణ్ దర్శకత్వంలో నటించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, కాజోల్ కూడా ఆ చిత్రంలో నటించారు.
ఆ తర్వాత నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో కరణ్ నిర్మించిన ‘కల్ హో నా హో’ చిత్రంలో ప్రీతి జింతా స్థానంలో తొలుత కరీనాను సంప్రదించారట. అయితే, ఆమె భారీ రెమ్యునరేషన్ అడగటంతో ఆ ప్రాజెక్టు మిస్ చేసుకున్నారని బాలీవుడ్ టాక్. తాజాగా కరణ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో కథానాయికగా కరీనా నటించనున్నారని బీ టౌన్ ఖబర్. అంటే.. దాదాపు 17ఏళ్ల తర్వాత కరణ్–కరీనా కలిసి పనిచేయనున్నారన్నమాట. ధర్మా ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రూపొందనుంది.
Comments
Please login to add a commentAdd a comment