Karan Johar Calls Shahid Kapoor as Kareena Kapoor Ex-Husband In Koffee With Karan - Sakshi
Sakshi News home page

Kareena Kapoor: మీ మాజీ భర్త షాహిద్‌ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్‌ చూశారా?

Published Fri, Aug 5 2022 3:47 PM

Karan Johar Calls Shahid Kapoor as Kareena Kapoor Ex Husband In Koffee With Karan - Sakshi

బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ చేస్తున్న టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’. ఈ షో ఎంతటి క్రేజీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వచ్చిన సినీ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో చిక్కు ప్రశ్నలు అడిగి ఇబ్బందుల్లో పడేస్తుంటాడు కరణ్‌. అలా వారి నుంచి ఆసక్తిర విషయాలను బయటపెట్టిస్తూ ఈ టాక్‌ షోను సక్సెస్‌ ఫుల్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ సీజన్‌లో తొలిసారి మన తెలుగు హీరోయిన్‌ సమంత, హీరో విజయ్‌ దేవరకొండలు సందడి చేశారు.

చదవండి: బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్‌ రివ్యూ.. ఏమన్నాడంటే

దీంతో కాఫీ విత్‌ కరణ్ 6వ సీజన్‌కు నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో లెటేస్ట్‌ ఎపిసోడ్‌లో లాల్‌ సింగ్‌ చద్దా హీరోహీరోయిన్లు అయిన ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ సందడి చేశారు.  ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌, కరీనాను అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రాపిడ్ ఫైర్ రౌండ్‌లో హోస్ట్ కరణ్ కరీనాను కజిన్ రణ్‌బిర్ కపూర్, షాహిద్ కపూర్ పార్టీ చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు అని అడగ్గా.. ‘రణ్‌బిర్ కజిన్ కాబట్టి ఆహ్వానిస్తాడు. కానీ షాహిద్ కపూర్ మాత్రం ఆహ్వానించకపోవచ్చు’ అని వివరించింది.

చదవండి: పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ

ఆ తర్వాత గతంలో ఈ షోలో బేబో ఎన్నోసార్లు పాల్గొంందని,  పెళ్లికి ముందు ఒకసారి, పెళ్ల అనంతరం తన భర్త సైఫ్‌తో.. మాజీ భర్త షాహిద్‌.. అంటూ  వ్యాఖ్యానించాడు. దీంతో షోకు వచ్చినవారంత ఒక్కసారిగా షాకయ్యారు. కరణ్‌ మాటలకు కరీనా సైతం అవాక్కైంది. తన తప్పును వెంటనే సవరించుకున్న కరణ్‌.. కరీనాను క్షమాపణలు కోరాడు. కాగా కరీనా, షాహిద్‌లు జంటగా నటించిన  జబ్ వి మెట్ మూవీ సమయంలో వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లకు ప్రేమకు బ్రేకప్‌ చెప్పుకున్న వీరిద్దరు. ఆ తర్వాత కరీనా.. సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా.. షాహిద్‌ మిరా రాజ్‌పుత్‌ను వివాహమాడాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement