
గతేడాది క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై గౌరీఖాన్ తొలిసారి స్పందించింది. ప్రముఖ పాపులర్ టీవీ షో కాఫీ విత్ కరణ్ షోకి మహిప్ కపూర్, భావనా పాండేతో కలిసి హాజరైన ఆమె తొలిసారి కొడుకు అరెస్ట్‌పై మాట్లాడింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు మీ కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డార. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డారు.
ఆ కష్టసమయం గురించి ఏమని చెబుతారు అని కరణ్ ప్రశ్నించాడు. దీనికి గౌరీఖాన్ బదులిస్తూ.. అవును. 'మా కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డాం. తల్లిగా అంతకంటే భయంకరమైన అనుభవం ఇంకోటి ఉండదు. కానీ ఆ సమయంలో అందరూ మాకు కుటుంబంలా నిలబడ్డారు. ఏమాత్రం పరిచయం లేని వాళ్లు కూడా మెసేజ్‌లు, కాల్స్ ద్వారా నన్ను ఓదార్చారు. ఆ సమయంలో మాకు ఎంతో ప్రేమ లభించింది. మాకు అండగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని చెబుతూ గౌరీఖాన్ ఎమోషనల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment