Ahead Of Shah Rukh Khan Birthday Mannat Decorated With Lights - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: సెలబ్రిటీలను ఇంటికి రావొద్దని కోరిన షారుక్‌!

Published Tue, Nov 2 2021 8:38 AM | Last Updated on Tue, Nov 2 2021 12:21 PM

Ahed Of Shah Rukh Khan Birthday Mannat Decorated With Lights - Sakshi

Shah Rukh Khan Birthday Mannat Decorated With Lights: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇల్లు మన్నత్‌ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మన్నత్‌కు బహుమతులు పంపారు. ప్రతీ ఏటా దీపావళి సహా పండగలు, బర్త్‌డే వంటి స్పెషల్‌ అకేషన్స్‌ నాడు మన్నత్‌ను మరింత సుందరంగా ముస్తాబు చేస్తారు.

అయితే కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ జైళ్లో ఉండటంతోషారుక్‌ భార్య గౌరీ ఖాన్‌ పుట్టినరోజు సహా దసరా వేడుకలు కూడా జరుపుకోలేదు. అయితే ఇటీవల ఆర్యన్‌కు బెయిల్‌ రావడంతో బాద్‌షా కుటుంబంలో సంతోషం రెట్టింపయ్యింది. దీంతో షారుక్‌ 56వ బర్త్‌డేతో పాటు దీపావళి కూడా వస్తున్న నేపథ్యంలో మన్నత్‌ను అందంగా అలంకరించారు. 

అయితే ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్‌ ఖాన్‌ నిర్ణయించుకున్నారట. దీంతో సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని, ఆర్యన్‌ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని షారుక్ వారితో చెప్పినట్లు సమాచారం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement