Gauri Khan Instructs Not To Cook Sweets until Aryan is Released - Sakshi
Sakshi News home page

Gauri Khan : 'కొడుకు ఇంటికి వచ్చేవరకు స్వీట్లు వండటానికి వీల్లేదు'

Published Tue, Oct 19 2021 11:42 AM | Last Updated on Tue, Oct 19 2021 3:47 PM

Gauri Khan Instruct Staff Not To Cook Kheer And Sweets Till Aryan Gets Bail - Sakshi

Gauri Khan Says No kheer in Mannat till Aryan Gets Bail : డ్రగ్స్ కేసులో కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అవడంతో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌, గౌరీ ఖాన్‌ తీవ్ర మనోవేధనకు గురవతున్నట్లు తెలుస్తుంది. తిండి, నిద్ర లేకుండా ఆర్యన్‌ కోసమే ఎదురుచూస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌ అయితే ప్రతిరోజూ దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు తన స్నేహితులను కూడా భగవంతుడ్ని ప్రార్థించాలంటూ వేడుకుంటుందట. నవరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి కొడుకు బెయిల్‌ కోసం  గౌరీ ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం.

మప్రతీ పండుగకి షారుక్‌ నివాసం ఎంతో అందంగా ముస్తాబయ్యేది. కానీ ప్రస్తుతం ఆర్యన్‌ జైలులో ఉండటంతో పండుగ సెలబ్రేట్‌ చేసుకునే ఆసక్తి లేదని, ఆర్యన్‌ ఇంటికి వచ్చేవరకు మన్నత్‌లో ఖీర్‌, స్వీట్లు ఏవీ చేయకూడదని గౌరీ ఖాన్‌ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు టాక్‌. ఆర్యన్‌ బెయిల్‌ నుంచి వచ్చేవరకు ఎలాంటి స్వీట్లు వండొద్దని స్టాఫ్‌కు తెలిపింది. కాగా ఇప్పటికే ఆర్యన్‌కు ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్‌ నిరాకరించిన కోర్టు బుధ‌వారం మరోసారి విచారణ చేపట్టనుంది.


చదవండి: ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్‌ ఖాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement