sweets
-
కర్బూజా– కాజు, అవిసె గింజలతో హెల్తీ స్నాక్స్ చేసుకోండిలా..!
కర్బూజా– కాజు స్వీట్కావలసినవి: కర్బూజా– 1 (తొక్కలు, గింజలు తీసి, ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలను మిక్సీలో వేసుకుని, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)పంచదార– సరిపడాజీడిపప్పు గుజ్జు– పావు కప్పుకొబ్బరి కోరు– పావు కప్పు పైనే (గార్నిష్‌కి కూడా వాడుకోవచ్చు)తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక కళాయిలో కర్బూజా గుజ్జు వేసుకుని, చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత పంచదార వేసుకుని దగ్గరపడే వరకు తిప్పుతూ ఉండాలి.అనంతరం జీడిపప్పు గుజ్జు, పావు కప్పు కొబ్బరి కోరు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న స్వీట్స్‌లా చేసుకుని, కొద్దికొద్దిగా కొబ్బరికోరుతో అందంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.అవిసె గింజల నేతి లడ్డూ..కావలసినవి: అవిసె గింజలు– 1 కప్పు, జీడిపప్పు, నువ్వులు– 1 టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పౌడర్లా చేసుకోవాలి), వేరుశనగలు– అర కప్పు (దోరగా వేయించి, మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి), బెల్లం కోరు– అర కప్పు, బాదం గింజలు–10 (దోరగా వేయించి పొడి చేసుకోవాలి), నెయ్యి– సరిపడా, ఏలకుల పొడి– కొద్దిగాతయారీ విధానం: ముందుగా అవిసె గింజలను దోరగా వేయించి, చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో బాదం పొడి, ఏలకుల పొడి, జీడిపప్పు మిశ్రమం వేసుకుని నెయ్యి పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. అప్పుడు ఆ ముద్దను, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిపై జీడిపప్పు లేదా బాదం ముక్కలను ఒత్తుకుని.. సర్వ్ చేసుకోవచ్చు.(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు
సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లలో సంబరాలు మొదలవుతాయి. ఉపాధి కోసం దేశ విదేశాలకు తరలిపోయిన పిల్లలంతా రెక్కలు కట్టుకొని మరీ సొంత ఊరిలో వాలిపోతారు. పిండివంటలు, కొత్తబట్టలు, గొబ్బెమ్మలు.. ఇలా సంకురాత్రి సంబరాలతో పల్లెలన్నీ మురిసి పోతాయి. మరి అరిసెలు లేని సంక్రాంతిని అస్సలు ఊహించగలమా. అందులోనూ ఈ చల్లని వేళ, శ్రేష్టమైన నువ్వులద్దిన అరిసెలు తింటూ ఉంటే... పంటికింద నువ్వులు అలా తగులుతుంటే.. ఆహా అని మైమరిచిపోమూ. ఆరోగ్యం, ఆనందం రెండింటినీ అందించే అరిసెలు, అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన, మరో ముఖ్యమైన స్వీట్ కజ్జికాయలను సులువుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి! నువ్వుల అరిశెలుకావలసినవి: బియ్యం – ఒక కిలో; బెల్లం పొడి – 800 గ్రా.; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి – కేజీతయారీబియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. పిండి గాలికి పొడిబారకుండా ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. ఇప్పుడు పాకం సిద్ధం చేసుకోవాలి. మందపాటి పాత్రలో ఒక గ్లాసు నీరు పోసి బెల్లం పొడి వేసి పాకం వచ్చేదాకా తెడ్డుతో కలుపుతూ మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా తెడ్డుతో కలపాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని గసాలు, నువ్వులలో అద్ది పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నెయ్యిలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నెయ్యి కారిపోయేటట్లు వత్తాలి. గమనిక: అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే ముదురు పాకం పట్టాలి. ఈ అరిశెలు పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. నువ్వుల కజ్జికాయలుకావలసినవి : మైదా లేదా గోధుమ పిండి – కేజి; నువ్వులు – కేజి; బెల్లం పొడి – 800 గ్రా.; ఏలకులు– 10 గ్రా. జీడిపప్పు– వందగ్రాములు; నూనె– కేజీ;ఇదీచదవండి : సోషల్ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరితయారీ:పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లం పొడి, యాలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. గోధుమ పిండిని చిన్న గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచా (కజ్జికాయ చేసే చెక్క మౌల్డ్) లో పరిచి ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచా మూత వేయాలి. సాంచాలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి. ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి. -
Diwali 2024 మోతీ చూర్ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!
ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యంహిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:రెండు కప్పుల సెనగపిండి రెండు కప్పుల పంచదారయాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్మిస్ బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,కర్పూరం పొడితయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.పంచదార పాకంఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.బూందీ తయారీస్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్కిన్పై ఉంచాలి.తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి. -
Diwali 2024 : దివ్యంగా వండుకోండిలా
దీపావళి వస్తోంది...ఇల్లంతా వెలుగులతో నిండిపోతుంది.పిల్లల ముఖాల్లో మతాబులు వెలుగుతాయి.మరి... వంటిల్లు బోసిపోతే ఎలాగ?ఫ్రిజ్‌లోంచి బ్రెడ్... క్యారట్ తీయండి.స్టవ్ వెలిగించండి... చక్కెర డబ్బా మూత తీయండి. దివ్యంగా వండండి! షాహీ తుకడాకావలసినవి: బ్రెడ్ స్లయిస్‌లు –5; నీరు – టీ స్పూన్; పాలు– 3 కప్పులు; జీడిపప్పు– గుప్పెడు; పిస్తా– గుప్పెడు; బాదం – గుప్పెడు; యాలకులు – 2 (పొడి చేయాలి); నెయ్యి – అరకప్పు; చక్కెర – అర కప్పు; కుంకుమ పువ్వు – 6 రేకలు;తయారీ: బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి పక్కన పెట్టాలి. అడుగు మందంగా, వెడల్పుగా ఉన్న పెనంలో చక్కెరలో నీటిని పోసి సన్న మంట మీద మరిగించాలి. చక్కెర కరిగిన తరవాత అందులో కుంకుమ పువ్వు రేకలు వేయాలి. చక్కెర తీగపాకం వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టాలి. ఒక పాత్రలోపాలు పోసి మరిగించాలి. మధ్యలో గరిటెతో అడుగు పట్టకుడా కలుపుతూ పాలు చిక్కబడి పావు వంతుకు వచ్చే వరకు మరిగించి యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత పైన తయారు చేసి సిద్ధంగా ఉంచిన చక్కెరపాకంలో నాలుగవ వంతు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. ఇది రబ్రీ. బ్రెడ్ స్లయిస్‌లను అంచులు తీసేసి త్రికోణాకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ∙మరొక పెనంలో నెయ్యి వేడి చేసి బ్రెడ్ ముక్కలను అన్ని వైపులా దోరగా కాల్చాలి. పెనం మీద నుంచి తీసిన వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం తర్వాత తీసి వెడల్పుగా, అంగుళం లోతు ఉన్న ప్లేట్లో అమర్చాలి. ఇలా అన్ని స్లయిస్‌లను వేయించి, చక్కెర పాకంలో ముంచి తీసి ప్లేట్లో సర్దాలి. ఇప్పుడు ప్లేట్లో ఉన్న బ్రెడ్ స్లయిస్ల మీద రబ్రీ పోసి, ఆ పైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను చల్లాలి.గమనిక: పాలను రబ్డీ చేసే సమయం లేకపోతే కండెన్స్డ్ మిల్క్ వాడవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు తినాలంటే చక్కెర బదులుగా మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ లేదా స్టీవియాలను వాడవచ్చు. క్యారట్ బర్పీకావలసినవి: క్యారట్ – అర కిలో; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు పాలు – కప్పు; చక్కెర – అర కప్పు; యాలకుల పొడి– అర టీ స్పూన్; పిస్తా – గుప్పెడు (తరగాలి);తయారీ: క్యారట్‌ను కడిగి చెక్కు తీసి తురమాలి. మందపాటి బాణలిలో రెండున్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో క్యారట్ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి మంట తగ్గించి సన్నమంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యారట్ తురుములో పాలు పోసి కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాల సేపు ఉడికించాలి. క్యారట్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చక్కెర కరిగేకొద్దీ మిశ్రమం ద్రవంగా మారుతుంటుంది. కొద్ది సేపటికి తిరిగి దగ్గరవడం మొదలవుతుంది. అప్పుడు మిశ్రమం అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ బాగా దగ్గరయ్యే వరకు ఉంచాలి. ఈ లోపు ఒక ట్రేకి నెయ్యి రాసి క్యారట్ మిశ్రమంపోయడానికి సిద్ధం చేసుకోవాలి. క్యారట్ పాకం గట్టి పడిన తరవాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి రాసిన ట్రేలో పోసి సమంగా సర్ది పిస్తా పలుకులను అద్దితే క్యారట్ బర్ఫీ రెడీ. బర్ఫీ వేడి తగ్గిన తర్వాత చాకుతో గాట్లు పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బర్ఫీ ముక్కలను ప్లేట్ నుంచి సులువుగా వేరు చేయవచ్చు.గమనిక: క్యారట్ మిశ్రమాన్ని ఎప్పుడు ట్రేలోపోయాలనేది స్పష్టంగా తెలియాలంటే... స్పూన్‌తో కొద్దిగా తీసుకుని చల్లారిన తరవాత చేత్తో బాల్‌గా చేసి చూడాలి. తురుము జారిపడకుండా బాల్ గట్టిగా వస్తే అప్పుడు మంట మీద నుంచి దించేయవచ్చు. -
స్వీటుతో చేటే!
సాక్షి,హైదరాబాద్: చిన్నాచితకా వాటి నుంచి పేరున్న బడా షాపుల దాకా ఒకటే తీరు. సాధారణ హోటల్ నుంచి స్టార్ హాటళ్ల వరకూ అదే వరస. ప్రజలు తినే తిండితో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చివరకు ప్రజలు శుభకార్యాల్లో, సంతోష సమయాల్లో తినే.. దీపావళి పండగ సందర్భంగా బంధుమిత్రులకు పంపిణీ చేసే స్వీట్స్ దాకా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ప్రజలు ఎగబడి క్యూలు కట్టే దుకాణాల్లోనూ అదే పరిస్థితి. గత కొన్ని నెలలుగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా, ఆయా దుకాణాల నిర్వాకాలు బట్టబయలవుతున్నా ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ఒకసారి తనిఖీ చేసిన వాటిల్లోనూ తిరిగి అలాంటి ఘటనలే పునరావృతమవుతున్నాయంటే చర్యలపై వాటికి ఎంతటి లెక్కలేనితనం ఉందో అంచనా వేసుకోవచ్చు. డొల్లతనం వెల్లడైంది ఇలా.. 👉 జనసమ్మర్థం ఎక్కువగా ఉండే నగరంలోని అమీర్‌పేటలో కొన్ని స్వీటు ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో డొల్లతనం వెల్లడైంది. నిబంధనలు బేఖాతరు చేయడం దృష్టికొచ్చింది. కనీసం ట్రేడ్ లైసెన్సులు లేకుండా రిజి్రస్టేషన్లతోనే దర్జాగా వ్యాపారాలు నిర్వహిస్తుండటం తెలిసింది. ఆయా వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. 👉 నిబంధనల మేరకు ఆహార విక్రయ దుకాణాల్లో ప్రజలకు కనిపించేలా ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)సరి్టఫికెట్ ప్రదర్శించాల్సి ఉండగా, ‘ఆగ్రా స్వీట్స్’లో అది కనిపించలేదు. లైసెన్సు లేకుండానే కేవలం రిజి్రస్టేషన్ మాత్రం చేయించుకొని వ్యాపారం చేస్తుండటం దృష్టికొచ్చింది. డస్ట్బిన్లకు ఎలాంటి మూతలు లేకుండా కనిపించాయి. సిబ్బంది తలలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేవు. 👉 సగం తయారైన వంటకాలు ఫ్రిజ్‌లో సవ్యంగా ఉంచకపోవడం, లేబుల్ లేకపోవడం కనిపించాయి. కొన్ని సరుకులు ఎక్స్పైర్ డేట్వి ఉండటం అధికారుల దృష్టికొచి్చంది. ‘ఢిల్లీ మిఠాయి వాలా’ దుకాణంలో సిబ్బంది మెడికల్ ఫిట్నెస్ సరి్టఫికెట్లు, నీటి విశ్లేషణ నివేదికలు లేవు. శిక్షణ పొందిన సూపర్వైజర్ లేకపోవడం గుర్తించారు. క్రిమి కీటకాలు చొరబడకుండా తలుపులు, కిటికీలకు ప్రూఫ్ స్క్రీన్స్ లేవు. నేలపై అడ్డదిడ్డంగా చక్కెర బ్యాగ్స్, స్టోర్‌రూమ్ ర్యాక్స్‌లో ఎలుక పెంటికలు, మూతలు లేని డస్ట్బిన్లు కనిపించాయి. హోమ్ ఫుడ్స్‌లోనూ అదే తంతు.. వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్‌లో కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కనిపించలేదు. కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకున్నట్లు గుర్తించారు. స్టోర్‌రూమ్‌లోని సిబ్బంది తలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేకుండానే ఉండటాన్ని, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సరి్టఫికెట్స్ కానీ, పెస్ట్ కంట్రోల్రికార్డులు కానీ లేకపోవడం అధికారుల దృష్టికొచి్చంది. తినడానికి సిద్ధంగా ఉన్న సేవరీలు, పచ్చళ్లకు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వాటికి లేబుళ్లు లేకపోవడాన్ని గుర్తించారు. ‘వినూత్న ఫుడ్స్’లోనూ దాదాపుగా అవే పరిస్థితులు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సరి్టఫికెట్ సైతం గడువు ముగిసిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారో రికార్డులు లేవు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు తగిన స్టోరేజీ సదుపాయం కూడా లేకపోవడం గుర్తించారు. ఇలా.. ఎక్కడ తనిఖీలు జరిగినా లోపాలు బట్టబయలవుతున్నాయి. చర్యలు లేకే.. తగిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బయట తినే బదులు ఇంట్లో చేసుకునే చిక్కీ అయినా మేలని అంటున్నవారూ ఉన్నారు. ‘అయ్యో.. నేనెప్పుడు అక్కడే కొంటుంటాను. ఇకనుంచి మానేస్తాను’ అని సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్న వారూ ఉన్నారు. -
స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ
ఈ ఫొటోలో ఉన్నవి ఏంటో చెప్పండి చూద్దాం.. చాలా కాన్ఫిడెంట్‌గా టపాసులు అనుకుంటున్నారు కదా! అయితే మీరు..తప్పులో కాలేసినట్లే..! అవి టపాసుల్లాంటి టపాసులు..కానీ టపాసులు కాదు.. ఎందుకంటే ఈ పటాసులతో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. పొగ రాదు. నిప్పు రవ్వలు అసలే ఎగసి పడవు. మరి అవన్నీ రాకపోతే అవి పటాసులు ఎందుకు అవుతాయి? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అక్కడికే వస్తున్నాం.. మీకొచ్చిన డౌటనుమానం కరెక్టే. ఎందుకంటే అవి నిజమైన టపాసులు కావు. అవి చాక్లెట్స్.. అరరే.. చూస్తే టపాసుల్లా భలే ముద్దుగా ఉన్నాయే అనుకుంటున్నారా..? స్వీట్స్‌ను టపాసుల్లాగా చేయాలన్న ఆలోచనతో ఇలా వినూత్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీటిని తయారు చేస్తున్నారు. దీపావళి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. స్వీట్లు, టపాసులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. స్నేహితులు, బంధువులకు స్వీట్లు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటుంటారు. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రెండింటినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు గజ్జల హరితారెడ్డి, లిఖితారెడ్డి. ఇద్దరు అక్కా చెల్లెళ్లూ అనుకున్నదే తడవుగా ఇలా టపాసులను తయారు చేశారు. అదేనండీ టపాసుల్లాంటి చాక్లెట్లు.కాస్త భిన్నంగా ఉండాలని.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వీరిద్దరూ ప్రిపరేషన్ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇలా ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలా అలా.. వీరు చేస్తున్న చాక్లెట్లు, కుకీలకు మంచి ప్రశంసలు వస్తుండటంతో డీమెల్ట్ పేరుతో చిన్నపాటి క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీపావళికి ఏదైనా వినూత్నంగా తయారుచేయాలని ఆలోచించగా.. ఈ ఐడియా వచి్చందని, ఈ స్వీట్స్ చూసి ముందు టపాసులు అనుకుంటున్నారని, అసలు విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని హరితారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది. -
Diwali 2024 పండగొస్తోంది.. ఈజీగా చేసుకునే స్వీట్లు, కుకీస్!
పండుగ వస్తోందంటే గృహిణులకు ఒకటే పని. ఇంటి శుభ్రంనుంచి పిండి వంటల దాకా ఎడతెగని పనులతో బిజీగా ఉంటారు. పెద్దగా హడావిడిగా లేకుండా, సులభంగా, ఆరోగ్యంగా తయారు చేసుకునే కొన్ని వంటల్ని ఇపుడు చూద్దామా.రాగి కుకీస్ కావలసినవి: రాగిపిండి – కప్పు; గోధుమపిండి – కప్పు; చక్కెర పొడి – కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – 15 టేబుల్ స్పూన్లు; పాలు – 4 టేబుల్ స్పూన్లు (అవసరమైతేనే వాడాలి).తయారీనెయ్యి కరిగించి పక్కన పెట్టాలి. వెడల్పు పాత్రలో రాగిపిండి, గోధుమ పిండి, చక్కెర పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి అన్నీ సమంగా కలిసేటట్లు గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసి మళ్లీ కలపాలి. చపాతీల పిండిలా ముద్దగా వస్తుంది. తగినంత తేమలేదనిపిస్తే పాలు కలపాలి. ఈ పిండి మీద మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒవెన్‌ను 170 డిగ్రీలు వేడి చేయాలి. పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీసి పెద్ద నిమ్మకాయంత గోళీలు చేయాలి. ఒక్కో గోళీని అరచేతిలో వేసి వత్తాలి. ఫోర్క్‌తో నొక్కి గాట్లు పెట్టి బేకింగ్ ట్రేలో సర్దాలి ∙ట్రేని ఒవెన్‌లో పెట్టి 12 నిమిషాల సేపు ఉంచాలి. కుకీ మందంగా ఉందనిపిస్తే మరో నిమిషం అదనంగా ఉంచాలి ∙ఒవెన్ లేక పోతే ప్రెషర్ కుకర్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. కుకర్‌లో ఉప్పు చల్లి గాస్కెట్, వెయిట్ తీసేసి మూత పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత కుకీలను అమర్చిన ట్రేని జాగ్రత్తగా కుకర్‌లో పెట్టి సన్న మంట మీద 15 నిమిషాల సేపు ఉంచాలి. అయితే కుకర్‌లో ఒకేసారి అన్నింటినీ బేక్ చేయడం కుదరక పోవచ్చు. కుకర్ సైజ్, ట్రే సైజ్‌ను బట్టి నాలుగైదు సార్లుగా చేయాలి ఈ బిస్కట్లను గాలి చొరబడని బాటిల్లో నిల్వ చేస్తే మూడు వారాల పాటు తాజాగా ఉంటాయి. మిల్క్ బర్ఫీకావల్సిన పదార్ధాలుపాలపొడి – రెండున్నర కప్పులుపంచదార – ముప్పావు కప్పుపాలు – కప్పునెయ్యి – పావు కప్పుపిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లుతయారీ విధానంగిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి.స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి.10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి.ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తా పలుకులు వేసి మరోసారి వత్తుకోని, గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి.రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. -
గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్..
దేశంలో వినాయక చతుర్థి సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ గణేష్ చతుర్థికి.. వినాయక విగ్రహాల విక్రయాలు ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'జెప్టో' గణాంకాల ప్రకారం.. వినాయక విగ్రహాలు మాత్రమే కాకుండా రెడీమేడ్ మోదకాలు గంటకు 1500 అమ్ముడైనట్లు.. మోదకాల అచ్చులు కూడా గంటకు 500 అమ్ముడయ్యాయని సమాచారం. ప్రధాన నగరాల్లో ఎక్కువ స్వీట్ ఆర్డర్స్ పొందిన నగరంగా బెంగళూరు రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి.ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జెప్టో.. భారతదేశం అంతటా 10,000 పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాలను విక్రయించింది. వంద శాతం పర్యావరణ అనుకూల విగ్రహాలను అందించడానికి జెప్టో 100 మందికిపైగా స్థానిక కళాకారులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ గత 24 గంటల్లోనే జెప్టో 70,000కు పైగా స్వీట్లను విక్రయించింది. మోదకాలు అమ్మకాలలో ముంబై ముందంజలో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్‌లలో లడ్డూల ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే.. మోదకాలు అమ్మకాలు ఐదు రెట్లు, లడ్డూల విక్రయాలు 2.5 రెట్లు, మిఠాయిలు అమ్మకాలు రెండు రెట్లు, పూజా సామాగ్రి రెండు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. -
చాక్లెట్లో పళ్ల సెట్.. కంగుతిన్న టీచర్
పుట్టిన రోజు సందర్భంగా పిల్లలు ఇచ్చిన చాక్లెట్లు తిన్న ఓ రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు తీపు కబురు కాస్త పీడకలగా మారింది.మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్లో మాయాదేవి గుప్తా స్కూల్ ప్రినిపాల్‌గా రిటైరయ్యారు. ప్రస్తుతం ఓ ఎన్జీవోలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీవోలో పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుగుతుంటాయి. ఎప్పటిలాగే ఆ ఎన్జీవోలో పిల్లల పుట్టిన రోజులు ఘనంగా జరిగాయిపుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఓ విద్యార్ధి మాయాదేవికి చాక్లెట్ ఇచ్చాడు. అయితే, ఎంతో ఆనందంతో ఆ చాక్లెట్లు తినేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఏమైందంటే ‘విద్యార్ధి నాకు ఒక పాపులర్ బ్రాండ్‌కి చెందిన కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ ఇచ్చాడు. చాక్లెట్ తిన్నాక ఏదో కరకరలాడే చాక్లెట్ ముక్కలా అనిపించింది. మరోసారి నమలడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యపడలేదు. వెంటనే చాక్లెట్‌ను పరీక్షించగా అందులో నాలుగు దంతాల పళ్ల సెట్ చూసి కంగుతిన్నాను.’అని తెలిపారు.వెంటనే ఖర్గోన్‌లోని జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్కు మాయాదేవి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పిల్లలు చాక్లెట్లు కొనుగోలు చేసిన దుఖాణం నుంచి అధికారులు చాక్లెట్ నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్ఎల్ అవాసియా ఈ నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సంక్రాంతి మాధుర్యం మన వంటింట్లోనే..
'కాలం మారింది.. అరిశె కోసం జనవరి వరకు ఎదురు చూడక్కర్లేదు. స్వగృహ ఫుడ్స్ ఏడాదంతా అందిస్తున్నాయి. అయినా సరే.. సంక్రాంతి వస్తోందంటే ఇంట్లో బెల్లం కాగాల్సిందే. పాకం వాసనకు పక్కింటి వాళ్ల నోరూరించాల్సిందే. కాలం ఎంత మారినా సరే.. అసలైన అరిశె రుచి అంటే.. మన వంటింటి అరిశె రుచే. మరి అవేంటో చూద్దాం!' పూతరేకులు.. కావలసినవి: బెల్లం పొడి – కేజీ; సగ్గుబియ్యం– ముప్పావు కేజీ; జీడిపప్పు, పిస్తా – పావుకేజీ (చిన్న పలుకులు చేయాలి); ఏలకుల పొడి– 5గ్రా.; నెయ్యి– 100 గ్రా. తయారి.. సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాలి. పూత రేకు చేయడానికి మంద పాటి నూలు వ్రస్తాన్ని నలుచదరంగా కత్తిరించి సిద్ధం చేసుకోవాలి. కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత వ్రస్తాన్ని సగ్గుబియ్యం గంజిలో ముంచి కుండ మీద అతికించినట్లు పరిచి వ్రస్తాన్ని తీసేయాలి. గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది. ఆ పొర చిరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి. ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి. రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఒకపాత్రలో బెల్లం పొడి, జీడిపప్పు, పిస్తా పలుకులు, ఏలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యి రాయాలి. ఆ తర్వాత బెల్లం పొడి, జీడిపప్పు పలుకులు, ఏలకుల పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెల్లపు అరిశెలు కావలసినవి: బియ్యం – ఒకటింపావు కిలో; బెల్లం – కిలో; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి లేదా నూనె– కాల్చడానికి సరిపడినంత తయారి.. బియ్యాన్ని ముందు రోజు రాత్రి శుభ్రంగా కడిగి, మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి. జల్లించేటప్పుడు పిండి ఆరి΄ోకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలికి ఆరకుండా ఎప్పటికప్పుడు ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి. పెద్దపాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్లుగా తీసుకుని గోళీ చేసి గసాలు లేదా నువ్వులలో లేదా రెండింటిలోనూ అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. ఆ పిండిని పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నూనె కారిపోయేటట్లు వత్తాలి. అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు వత్తేయవచ్చు. గమనిక: అరిశె నొక్కులు పోకుండా వలయాకారంగా అంతా ఒకే మందంలో రావాలంటే చేతితో అద్దడానికి బదులుగా పూరీ ప్రెస్సర్ వాడవచ్చు. అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముదరు పాకం పట్టాలి. ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. జారిపోకుండా రౌండ్ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు. ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ పాకం బాల్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా మరగనివ్వాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్న సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా వస్తాయి. ఒవెన్ ఉంటే తినే ముందు ఒక మోస్తరుగా వేడి చేసుకుంటే అప్పుడే చేసిన అరిశెల్లాగా తాజాగా ఉంటాయి. చక్కెర అరిశెలు చేయాలంటే బెల్లం బదులు చక్కెరతో పాకం పట్టాలి. కొబ్బరి బూరెలు కావలసినవి: బియ్యప్పిండి– అరకేజీ; బెల్లం – 300గ్రా.; పచ్చికొబ్బరి– ఒక చిప్ప; ఏలకులపొడి – ఒక టీ స్పూను; నెయ్యి– టేబుల్ స్పూన్; నూనె – కాలడానికి సరిపడినంత. తయారి.. బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరిసెలకు చేసుకున్నట్లే తడిబియ్యాన్ని దంచుకోవాలి. జల్లించి పిండి ఆరిపోకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి. పచ్చికొబ్బరిని తురిమి సిద్ధంగా ఉంచాలి. బెల్లాన్ని పాకం పట్టాలి. బూరెలకు పాకం ముదరకూడదు. లేతపాకం సరిపోతుంది. పాకం వచ్చిన వెంటనే కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి కలిసిన తరువాత మూడు – నాలుగు గుప్పెళ్ల బియ్యప్పిండి వేసి మంట మీద నుంచి దించేయాలి. ఇప్పుడు ఏలకుల పొడి, మిగిలిన బియ్యప్పిండిని వేసి ఉండలు కట్టకుండా సమంగా కలిసే వరకు కలిపి పైన నెయ్యి వేసి అద్ది మూత పెట్టాలి. కొబ్బరి బూరెల పిండి సిద్ధం అన్నమాట. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఈ లోపుగా బూరెల పిండి చిన్న గోళీ అంత తీసుకుని అరచేతిలో కాని పాలిథిన్ పేపరు మీద కాని అరిసెలాగా వేళ్లతో ఒత్తి కాగిన నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా వేగిన తరువాత తీయాలి. తీసిన పదినిమిషాలకు వేడి తగ్గి బూరె రుచి ఇనుమడిస్తుంది. ఇవి చదవండి: మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్‌కి కారణమా? -
దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్ ట్రై చేయండి!
దెహరోరిలు తయారు చేయడానికి కావలసినవి: బియ్యం – కప్పు నీళ్లు – పావు కప్పు పెరుగు – పావు కప్పు నెయ్యి – అరకప్పు పంచదార – రెండు కప్పులు యాలకుల పొడి – రెండు టీస్పూన్లు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన బియ్యంలో నీటిని తీసేసి సూజీ రవ్వలా బరకగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు అసలు పోయకూడదు∙ రవ్వలా గ్రైండ్ చేసిన బియ్యంలో పెరుగు వేసి చేతులతో బాగా కలపాలి∙ చేతులు వేడెక్కిన తరువాత కలపడం ఆపేసి మూతపెట్టి రాత్రంతా ఉంచేయాలి∙ మరుసటిరోజు పంచదారను గిన్నెలో వేయాలి. పంచదార మునిగేన్ని నీళ్లుపోసి మంట మీద పెట్టాలి∙ సన్నని మంట మీద సిరప్‌ను తయారు చేయాలి∙ పాకం తయారైందనుకున్నప్పుడు యాలకుల పొడి వేసి కలిపి, దించేయాలి∙ ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి చక్కగా కాగనివ్వాలి∙ రాత్రి కలిపి పెట్టుకున్న బియ్యం రవ్వ మిశ్రమాన్ని కుడుముల్లా చేసుకుని నెయ్యిలో డీప్‌ఫ్రై చేయాలి∙ కుడుము రెండువైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసేసి టిష్యూ పేపర్ మీద వేయాలి∙ ఐదు నిమిషాల తరువాత టిష్యూపేపర్ మీద నుంచి తీసి పంచదార పాకంలో వేయాలి∙ బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులతో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా దెహరోరిలు పదిరోజులపాటు రుచిగా ఉంటాయి . -
స్వీట్లతో చంపేస్తారా? అన్నం పెట్టరా?
-
బాబు అరెస్ట్.. స్వీట్లు పంచిన టీడీపీ నేత
సాక్షి, కృష్ణా: స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రధాన సూత్రధారుడు, ఈ కేసులో ఏ1 నిందితుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అవినీతి కేసులో అరెస్ట్కావడంతో.. సోషల్ మీడియాలోనూ కరెప్షన్ కింగ్ పేరుతో చంద్రబాబు ఆటాడేసుకుంటున్నారు. అయితే ఓవైపు పార్టీ అధినేత కోసం ఆందోళనకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే.. ఓ నేత మాత్రం స్వీట్లు పంచుతూ వేడుక చేశారు. శనివారం మధ్యాహ్నాం విజయవాడ కోర్టు వద్ద ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. టీడీపీ నేత చంద్రబాబునాయుడును అరెస్టు చేసినందుకు విజయవాడ కోర్టు వద్ద స్వీట్స్ పంచి పెడుతూ కనిపించారు టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర రావు. ఈ క్రమంలో ఆయన్ని అంతా విచిత్రంగా చూశారు. అయితే ఈ చర్య టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండడంతో.. ఆయన్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆకుల వెంకటేశ్వరరావు తనను చంపేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నారంటూ ఈ మధ్యే ఆరోపణలు గుప్పించారు. ‘పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న. జూబ్లీ హిల్స్ లో 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే ఎల్. నారాయణ లాకున్నారు. న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడంలేదు. నన్ను వాడుకొని వదిలేశాడు. నాకు చంద్రబాబు అన్యాయం చేశారు. పార్టీ లేదు, ఏమీ లేదు అని వ్యాఖ్యానించిన అచ్చెనాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేశారు’ అని ఆ సమయంలో ఆకుల వెంకటేశ్వరరావు వాపోయారు. సంబంధిత వార్త: నాకు లోకేష్ నుంచి ప్రాణహాని ఉంది -
వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..
కృష్ణుడు వెన్న దొంగ ఎందుకయ్యాడు ?..అంటే వెన్న... రుచి మాములుగా ఉండదు. అది అందర్నీ దొంగల్ని చేస్తుంది. దీంతో చేసే స్వీట్లు అన్ని ఇన్నీ కావు. వాటి రుచే వేరు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఆ చిన్న కృష్ణుడి కోసం పాలు... పెరుగు... వెన్న... మీగడలు సిద్ధం చేసుకోండి. పాత్ర పెట్టండి...స్టవ్ వెలిగించండి. వండే లోపు వెన్న మాయవుతుందేమో! జర జాగ్రత్త! ఆ చిన్ని గోపాలుడి కంటపడకుండా..ఆయన ఇష్టంగా ఆరగించే గోపాల్కాలాని పెరుగుతో ఇలా చకచక చేసేయండి. గోపాల్కాలాకి కావలసినవి: అటుకులు – కప్పు పెరుగు – అర కప్పు కీర ముక్కలు – కప్పు తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు అల్లం తురుము – టీ స్పూన్ పచ్చి మిర్చి – 1 (తరగాలి) తరిగిన కొత్తిమీర – అర కప్పు దానిమ్మ గింజలు – టేబుల్ స్పూన్ కిస్మిస్ – టేబుల్ స్పూన్ ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం: వెన్న – టేబుల్ స్పూన్ ఆవాలు – అర టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ కరివేపాకు – 2 రెమ్మలు, పచ్చి మిర్చి – 1 (తరగాలి), ఇంగువ – చిటికెడు (టీ స్పూన్ లో ఎనిమిదో వంతు) తయారీ విధానం: అటుకులను నీటిలో వేసి కడిగి వెంటనే తీసి మరొక పాత్రలో వేసుకోవాలి. అందులో అడుగున చేరిన నీటిని కూడా పూర్తిగా వంపేయాలి. ∙శుభ్రం చేసిన అటుకులు, కీర ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తరుగు, దానిమ్మ గింజలు, కిస్మిస్, కొత్తిమీర అన్నింటినీ పెద్ద పాత్రలో వేసి గరిటతో కలపాలి. అందులో పెరుగు, ఉప్పు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.∙పెనంలో వెన్న వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. ఈ పోపును అటుకుల మిశ్రమంలో వేసి కలిపితే గోపాల్‌కాలా రెడీ. (చదవండి: పన్నీర్ పాడవ్వకుండా ఉండాలంటే..ఇలా చేయండి!) -
మెత్తని మిఠాయి..ప్రపంచం మెచ్చిందోయి!
తీపి పదార్థాలు అంటే చాలా మంది చెవి కోసుకుంటారనేది సామెత. నిజంగా చెవి కోసుకోవడం ఏమోగానీ.. ముందు పెడితే చాలు జామ్మంటూ లాగించేస్తుంటారు. అందులోనూ మైసూర్ పాక్ అనగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. అలా దేశవిదేశాల్లో ఆహార ప్రియుల నోరూరిస్తున్న మైసూర్ పాక్.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో 14వ స్థానంలో నిలిచింది. – మైసూర్ టాప్–50 స్వీట్లపై సర్వేలో.. ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ఆన్లైన్లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మే మిఠాయిల్లో ప్రజాదరణ పొందినవి ఏవి అన్న అంశంపై ఓటింగ్ నిర్వహించింది. అందులో మైసూర్‌పాక్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. దీనికి స్వీట్ ప్రియుల నుంచి ఏకంగా 4.4 రేటింగ్ వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన డోనట్స్ టాప్ ప్లేస్.. మన దేశానికే చెందిన కుల్ఫీ 24వ స్థానంలో, గులాబ్జమూన్ 26వ స్థానం సంపాదించాయి. రాజు కోసం వండిన మిఠాయి మైసూర్ పాక్ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మైసూర్ రాజు అంతఃపురం వంటశాలలో మైసూర్ పాక్ పుట్టిందనే కథ. సుమారు 90 ఏళ్ల కింద మైసూర్ రాజు ఒడయార్ అంతఃపురంలో ముఖ్యమైన వంటగాడిగా మాదప్ప ఉండేవారు. అప్పటి రాజు కృష్ణరాజ ఒడయార్ భోజనం చేస్తున్న సమయంలో.. అక్కడ ఎలాంటి మిఠాయి లేదని మాదప్ప గుర్తించాడు. వెంటనే చక్కెర, నెయ్యి, శనగపిండి మిశ్రమంతో ఓ పాకం వంటి వంటకాన్ని తయారు చేశాడు. రాజు భోజనం చివరికి వచ్చేసరికి పాకం చల్లారి మెత్తటి ముద్దగా మారింది. మాదప్ప దాన్ని ముక్కలుగా కోసి వడ్డించగా.. రాజు తిని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇదేం మిఠాయి అని రాజు అడిగితే.. మైసూర్ పాకం అని మాదప్ప బదులిచ్చారు. అదే కాస్త మార్పులతో మైసూర్ పాక్‌గా మారింది. అంతఃపురం నుంచి అంగళ్లకు, ఇళ్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పాక్‌ను తయారు చేసి అమ్ముతున్నా.. మన దేశంలో చేసినంత బాగా మరెక్కడా రుచిగా రాదని మిఠాయి ప్రియులు చెప్తుంటారు. -
నోరూరించే కోనసీమ రుచుల ప్రత్యేకతలు ఇవే..
-
డయాబెటీస్ ఉన్న వాళ్లు ఇవి తిన్నా ముప్పే!
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీసే ప్రధాన కారకాల్లో చక్కెర ఒకటి. అందుకే మధుమేహులు తాము తినే ఆహారాల్లో ఎంత చక్కెర ఉందని చెక్ చేస్తుంటారు. అయితే ఒక్క చక్కెర మాత్రమే కాదు.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరిగేందుకు దారి తీసే పదార్థాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే ఈ ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ప్యాక్ చేసిన స్నాక్స్: ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా డయాబెటీస్‌కు దారితీస్తాయి. ఎందుకంటే వీటిని శుద్ధి చేసిన పిండితో తయారు చేయడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుతాయి. అందువల్ల వీటి జోలికి వెళ్లకుండా ఉండటం మేలు. అంతగా తినాలనిపిస్తే.. వీటికి బదులుగా గింజలు లేదా మొలకలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్: పండ్లలో ఎక్కువ మొత్తంలో తీపి ఉంటుంది. ఎండిన పండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎండు ద్రాక్షల్లో 115 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఇది మామూలు ద్రాక్షలో కంటే చాలా ఎక్కువ. ఒకవేళ ఎండు పండ్లను తినాలనుకుంటే చక్కెర తక్కువగా ఉండే పండ్లను తినడం మంచిది. ఆల్కహాల్ పానీయాలు: ఆల్కహాలిక్ పానీయాల్లో చక్కెరతోపాటు పిండిపదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు బీర్, వైన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని నిపుణుల సలహా. మధుమేహులు ఆల్కహాలిక్ పానీయాలు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. పండ్ల రసం: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా. పండ్ల రసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పండ్ల రసాలలో బయటినుంచి కలిపే చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. అందువల్ల పండ్లరసాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ..వీటిని తగిన మోతాదులోనే తీసుకోవడం మంచిది. వేపుళ్లు: వేయించిన ఆహారాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అలాగే కొవ్వులు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ టైంపడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు: వైట్బ్రెడ్, పాస్తా, మైదాతో చేసిన ఆహారాలన్నీ శుద్ధి చేసిన పిండితో తయారు చేసినవే. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. పోషకాలు అసలే ఉండవు. మధుమేహులు వీటిని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయులు బాగా పెరుగుతాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తినడం చాలా మంచిది. -
Recipe: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా!
రొటీన్ స్వీట్స్ బోర్ కొడితే మైదాపిండితో కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మైదాపిండి – 2 కప్పులు ►పంచదార పొడి – 1 కప్పు ►వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్ ►బేకింగ్ సోడా – 1 టీ స్పూన్ చొప్పున ►ఉప్పు – అర టీ స్పూన్ ►మజ్జిగ – ముప్పావు కప్పు ►గుడ్లు – 2 ►కిస్మిస్ – 1 కప్పు (నానబెట్టి మిక్సీ పట్టి, మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) ►నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ►అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, మజ్జిగ, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, కిస్మిస్ గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►డోనట్స్ మేకర్‌కి కొద్దిగా నూనె పూసి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకోవాలి ►ఓవెన్లో వాటిని బేక్ చేసుకోవాలి. ►అభిరుచిని బట్టి చాక్లెట్స్ క్రీమ్, డ్రైఫ్రూట్స్‌తో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో మరమరాల పకోడా! Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Recipe: రాఖీ స్పెషల్.. దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా!
సోదరీ సోదరుల మధ్య ఉన్న ఆత్మీయత, అనురాగ బంధాలకు గుర్తుగా జరుపుకునే పండుగే రాఖీ. ఈ రోజు అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించడం మన సంప్రదాయం. ఈ సందర్భంగా బయట నుంచి కొనితెచ్చే స్వీట్లు కాకుండా.. నోరూరించే స్వీట్లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... కలాకండ్ లడ్డు కావలసినవి: పనీర్ తరుగు – వందగ్రాములు పాలు – లీటరు పంచదార – కప్పు నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్ – గార్నిష్‌కు సరిపడా. తయారీ: మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నని మంట మీద పాలు సగమయ్యేంత వరకు మరిగించాలి. పాలు మరిగాక పనీర్ తరుగు, నెయ్యి, పంచదార వేసి తిప్పుతూ మరికొద్దిసేపు మరిగించాలి పనీర్ నుంచి నీరు వస్తుంది. ఈ నీరంతా ఆవిరైపోయి పాల మిశ్రమం మొత్తం దగ్గరపడిన తరువాత స్టవ్ ఆపేసేయాలి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత లడ్డులా చుట్టుకుని డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. దాల్ బనానా ఖీర్ కావలసినవి: పచ్చిశనగపప్పు – కప్పు అరటిపళ్లు – రెండు! కుంకుమ పువ్వు – చిటికడు యాలకులపొడి – టేబుల్ స్పూను పంచదార – రెండు కప్పులు కండెన్స్డ్ మిల్క్ – రెండు కప్పులు పాలు – మూడు కప్పులు ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్,జీడిపప్పు పలుకులు – కప్పు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: కిస్మిస్ జీడిపప్పు,ఎండుకొబ్బరి ముక్కలను నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి జీడిపప్పు వేయించిన బాణలిలో శనగపప్పు వేయాలి. దీనిలో పాలుకూడా పోసి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి ఉడికిన పప్పును మెత్తగా చిదుముకోవాలి. ఇప్పుడు దీనిలో కండెన్స్డ్ మిల్క్, కుంకుమపువ్వు, పంచదార, యాలకులపొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ ఉడికించాలి చివరిగా అరటిపళ్ల తొక్కతీసి సన్నని ముక్కలు తరిగి వేయాలి అరటిపండు ముక్కలు కూడా మగ్గిన తరువాత, వేయించిన కిస్మిస్, జీడిపలుకులు కొబ్బరి ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. వేడిగానైనా, చల్లగానైనా ఈ ఖీర్ చాలా బావుంటుంది. -
Tolichowki: మినర్వా స్వీట్లో మోడల్స్ సందడి (ఫోటోలు)
-
Diwali Special: స్వీట్ ఫ్రిట్టర్స్, మూంగ్ హల్వా ఇలా తయారు చేసుకోండి..
దీపావళి పర్వదినాన ఈ స్వీట్లతో మీ నోరు తీపిచేసుకోండి..! స్వీట్ ఫ్రిట్టర్స్ కావల్సిన పదార్థాలు బియ్యం – కప్పు అరటి పండ్లు – రెండు (తొక్కతీసి ముక్కలుగా తరగాలి) యాలకులు – మూడు, బెల్లం – ముప్పావు కప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి – టేబుల్ స్పూను ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు సొంఠి పొడి – పావు టీస్పూను నువ్వులు – టీస్పూను బేకింగ్ సోడా – టీస్పూను ఉప్పు – చిటికడు ఆయిల్ లేదా నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానం ►ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ►నానిన బియ్యాన్ని నీళ్లు తీసేసి, మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దీనిలో అరటిపండు ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►బెల్లం సిరప్‌ను వడగట్టి, గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమంలో వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ►చిన్న పాన్ పెట్టి టీస్పూను నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను నెయ్యితోపాటు పిండిలో వేయాలి. నువ్వులు, సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ►ఇప్పుడు మౌల్డ్స్‌లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక బ్యాటర్‌ను వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ►మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్కలర్లోకి మారేంత వరకు వేయించితే ఉన్ని అప్పం రెడీ. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! మూంగ్ హల్వా కావల్సిన పదార్థాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి) నీళ్లు – రెండు కప్పులు నెయ్యి – అరకప్పు గోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – ముప్పావు కప్పు ఫుడ్ కలర్ – చిటికెడు యాలకుల పొడి – పావు టీస్పూను జీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి. ►తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ►పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి. ►పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి. ►ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ►స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. చదవండి: Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు తప్పక వెలిగించాలట..! -
పండుగ రుచులు.. కరాచీ హల్వా, ఛెన పొడ ఇలా తయారు చేసుకోండి..
దీపావళి పండుగకు ఈ కొత్త రుచులతో మీ ఇంటి అతిధులకు పసందైన విందు ఇవ్వండి. కరాచీ హల్వా కావల్సిన పదార్థాలు కార్న్‌ఫ్లోర్ – కప్పు, నీళ్లు – ఒకటింబావు కప్పు, పంచదార – ఒకటి ముప్పావు కప్పు యాలకులపొడి – అర టీస్పూను నెయ్యి – ముప్పావు కప్పు పిస్తా, జీడి పప్పు, బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ ఫుడ్ కలర్– చిటికెడు తయారీ విధానం ►గిన్నెలో కార్న్‌ఫ్లోర్ ఒకటింబావు కప్పు నీళ్లు , ఆరెంజ్ కలర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కనబెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి వేడెక్కిన తరువాత పంచదార, ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ►సుగర్ సిరప్ తీగపాకం వచ్చాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి తిప్పుతూ 15 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడిన తరువాత నెయ్యి, డ్రైఫ్రూట్స్వేసి తిప్పాలి. ►నెయ్యి పైకి తేలి, బాణలీకి అంటుకోకుండా ఉండకట్టినప్పుడు బాణలి నుంచి తీసి నెయ్యిరాసిన పాన్‌లో వేయాలి. రెండు గంటలు ఆరాక ముక్కలు కట్ చేసుకుంటే కరాచీ హల్వా రెడీ. ఛెన పొడ కావల్సిన పదార్థాలు పాలు – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – పావు కప్పు సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు – మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి – టీస్పూను, బాదం, జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్ స్పూన్లు, కిస్మిస్ – రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – పావు టీస్పూను తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, తరువాత నిమ్మరసం వేసి తిప్పాలి. ►విరిగిన పాలను వడగట్టి పాల మిశ్రమాన్ని తీసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి. తరువాత పంచదార, రవ్వ వేసి, పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ►ఇప్పుడు కొద్దిగా నీళ్లుపోసుకుని కేక్ బ్యాటర్లా కలపాలి. ►తరువాత టీ స్పూను నెయ్యి, బాదం, జీడిపలుకులు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ►ఇప్పుడు ఒక పాత్రకు అడుగుభాగంలో నెయ్యిరాసి ఈ బ్యాటర్‌ను దానిలో పోయాలి. ►స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి, అడుగు భాగంలో సాల్ట్‌వేసి పైన చిన్న స్టాండ్ పెట్టి కేక్ బ్యాటర్ గిన్నె పెట్టాలి. కుకర్ మూతకున్న గ్యాస్కటర్, విజిల్ తీసి కుకర్ మూతపెట్టి అరగంట పాటు మీడియం మంటమీద ఉడికించాలి. ►ఒవెన్ ఉన్నవారు 180 డిగ్రీల సెల్సియస్‌లో 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ►అరగంట తరువాత మూత తీసి పాత్రను చల్లారనిచ్చి ముక్కలు చేస్తే ఛెనపొడ రెడీ. చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా..
వెలుగునిచ్చే దీపాలు, మిరుమిట్లుగొలిపే క్రాకర్స్, నోటిని తీపిచేసే∙స్వీట్లలోనే దీపావళి సందడంతా కనిపిస్తుంది. ఏటా చేçసుకునే మిఠాయిలు కాకుండా, ఆయిల్ వాడకుండా పాలతో ఆరోగ్యకరమైన స్వీట్లను సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బొప్పాయిహల్వా కావల్సిన పదార్ధాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు – ఒకటి (తొక్కసి తురుముకోవాలి) పంచదార – పావు కప్పు బాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – టీ స్పూను కోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టీస్పూన్లు. తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ►నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. మిల్క్ బర్ఫీ కావల్సిన పదార్ధాలు పాలపొడి – రెండున్నర కప్పులు పంచదార – ముప్పావు కప్పు పాలు – కప్పు నెయ్యి – పావు కప్పు పిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి. ►స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి. ►10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి. ►ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తాపలుకులు వేసి మరోసారి వత్తుకోని,ట్రేను గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. మలై లడ్డు కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కండెన్సెడ్ మిల్క్ – ముప్పావు కప్పు యాలకుల పొడి – పావు టీస్పూను. కోవా నెయ్యి – అరటీస్పూను పాలు – పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు పాల పొడి – ముప్పావు కప్పు తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, నిమ్మరసం వేసి పన్నీర్‌లా చేసుకోవాలి. ►బాణలి వేడెక్కిన తరువాత అరటీస్పూను నెయ్యి, పావు కప్పు పాలు పోసి వేయించాలి. ఇవన్నీ బాగా కలిసిన తరువాత ముప్పావు కప్పు పాలపొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ►బాణలి నుంచి ఈ పాలమిశ్రమం గట్టిపడి ఉండలా చుట్టుకునేటప్పుడు దించేస్తే పాలకోవ రెడీ. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని..ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్, కోవా వేసి సన్నని మంట మీద తిప్పుతూ వేయించాలి. ►మిశ్రమం మృదువుగా మారాక ముప్పావు కప్పు కండెన్స్డ్ పాలు పోసి కలపాలి. కండెన్స్డ్ పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పంచదార వేయకూడదు. ►మిశ్రమం దగ్గరపడ్డాకా.. యాలకులపొడి వేసి మరో ఐదునిమిషాలు వేయించి దించేయాలి. ►గోరువెచ్చగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టుకుంటే మలై లడ్డు రెడీ. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
బీట్రూట్ పాప్ కార్న్ ఎప్పుడైనా తిన్నారా? మరీ బెల్గావి స్వీట్.. ఇంట్లోనే ఈజీగా
ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ ఆరోగ్యానికి మేలు చేయడమేకాకుండా డబ్బును ఆదా చేస్తుంది. వెరయిటీగా ఈ వంటకాల తయారీని ప్రయత్నించి చూద్దాం.. బెల్గావి స్వీట్ చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు. కావల్సిన పదార్థాలు ►వెన్నతీయని పాలు – కప్పు ►పంచదార – అర కప్పు ►కోవా – ముప్పావు కప్పు ►పెరుగు – టేబుల్ స్పూను ►జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్ స్పూన్లు ►యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానం ►స్టవ్ మీద నాన్‌స్టిక్ బాణలి పెట్టి పంచదార వేయాలి. ►మీడియం మంట మీద పంచదార బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►రంగు మారగానే మంట తగ్గించి పాలు పోయాలి. ►ఇప్పుడు మీడియం మంట మీద పాలు కాగనివ్వాలి. పాలుకాగాక, పెరుగు వేసి తిప్పాలి. పాలు విరిగినట్లుగా అవుతాయి. అప్పుడు కోవా వేసి బాగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరి దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు, యాలకుల పొడి వేసి తిప్పితే బెల్గావి రెడీ. బీట్రూట్ పాప్ కార్న్ కావల్సిన పదార్థాలు ►బీట్రూట్ – 1 (ముక్కలు కట్ చేసుకుని, ఒక గ్లాసు వాటర్ కలిపి, మిక్సీ పట్టి, వడకట్టుకుని రసం తీసుకోవాలి) ►పంచదార – అర కప్పు ►మొక్కజొన్న గింజలు – 1 కప్పు ►యాలకుల పొడి – కొద్దిగా ►రెయిన్బో స్ప్రింకిల్స్ – 1 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి) ►నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాత్రలో పంచదార, బీట్రూట్ జ్యూస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈలోపు మరో స్టవ్ మీద కుకర్‌లో నూనె వేసుకుని, మొక్కజొన్న గింజలు వేసుకుని పాప్‌కార్న్ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార, బీట్ రూట్ జ్యూస్ మిశ్రమాన్ని వేసి, పాప్ కార్న్‌కి బాగా పట్టించాలి. చివరిగా రెయిన్బో స్ప్రింకిల్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
నా కొడుక్కి బెయిల్ వచ్చేవరకు స్వీట్లు వండొద్దు! : గౌరీ ఖాన్
Gauri Khan Says No kheer in Mannat till Aryan Gets Bail : డ్రగ్స్ కేసులో కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవడంతో బాలీవుడ్ బాద్షా షారుక్, గౌరీ ఖాన్ తీవ్ర మనోవేధనకు గురవతున్నట్లు తెలుస్తుంది. తిండి, నిద్ర లేకుండా ఆర్యన్ కోసమే ఎదురుచూస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. షారుక్ భార్య గౌరీ ఖాన్ అయితే ప్రతిరోజూ దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు తన స్నేహితులను కూడా భగవంతుడ్ని ప్రార్థించాలంటూ వేడుకుంటుందట. నవరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి కొడుకు బెయిల్ కోసం గౌరీ ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. మప్రతీ పండుగకి షారుక్ నివాసం ఎంతో అందంగా ముస్తాబయ్యేది. కానీ ప్రస్తుతం ఆర్యన్ జైలులో ఉండటంతో పండుగ సెలబ్రేట్ చేసుకునే ఆసక్తి లేదని, ఆర్యన్ ఇంటికి వచ్చేవరకు మన్నత్‌లో ఖీర్, స్వీట్లు ఏవీ చేయకూడదని గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. ఆర్యన్ బెయిల్ నుంచి వచ్చేవరకు ఎలాంటి స్వీట్లు వండొద్దని స్టాఫ్‌కు తెలిపింది. కాగా ఇప్పటికే ఆర్యన్‌కు ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టనుంది. చదవండి: ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్ -
Quick Sweet Recipes: నోరూరించే కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ ఇలా..
స్వీట్లు చూస్తే ఆగలే.. బజార్లో దొరికే స్వీట్లలో నాణ్యతలేని పదార్థాలు కలుపుతారు.. తింటే ఆరోగ్య సమస్యలు. ఇంట్లోనే మీకిష్టమైన స్వీట్లు తయారు చేస్తే.. కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ విధానం మీకోసం.. కిస్మిస్ లడ్డూ కావలసిన పదార్థాలు: ►కిస్మిస్ పేస్ట్ – 1కప్పు (మిక్సీ పట్టుకోవాలి) ►కొబ్బరి పాలు, తేనె, పీనట్ బటర్ – 4 టేబుల్ స్పూన్ల చొప్పున ►ఓట్స్ – పావు కప్పు ( వేయించి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి) ►బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకు ►కొబ్బరి తురుము – కొద్దిగా (అభిరుచిని బట్టి) తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, కొబ్బరిపాలు, తేనె, పీనట్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, కిస్మిస్ పేస్ట్ కూడా వేసుకుని ముద్దలా కలుపుకుని, చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను దొర్లిస్తే సరిపోతుంది. కస్టర్డ్ ఆపిల్ హల్వా కావలసిన పదార్థాలు: ►సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్) – 1 కప్పు (బాగా మగ్గిన సీతాఫలాలను పైతొక్క తొలగించి, వడకట్టే తొట్టెలో వేసుకుని, దాని కింద గిన్నె పెట్టుకుని, చేత్తో నలిపి గింజలన్నీ ►తొలగించి గుజ్జు తీసుకోవాలి) ►నెయ్యి, సుజీ రవ్వ – అర కప్పు చొప్పున ►పంచదార – పావు కప్పు, చిక్కటి పాలు – 1 కప్పు ►జాజికాయ పొడి – పావు టీ స్పూన్ ►కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలు – ►అర టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం ముందుగా కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసి తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార, పాలు పోసుకుని దగ్గర పడే వరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అనంతరం సీతాఫలాల గుజ్జు, జాజికాయ పొడి, నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలూ వేసి తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ.. -
Navratri Special: ఉడిపి హయగ్రీవ మద్ది, ధార్వాడ్ పేడా స్వీట్స్ ఎలా తయారుచేయాలంటే..
దసరా నవరాత్రులు సందర్భంగా మీ అతిధులను ఈ వెరైటీ స్వీట్లతో ఆహ్వానించండి.. ఉడిపి హయగ్రీవ మద్ది కావల్సిన పదార్థాలు: ►పచ్చిశనగపప్పు – రెండు కప్పులు ►నీళ్లు – ఆరు కప్పులు ►బెల్లం – రెండు కప్పులు ►లవంగాలు – ఎనిమిది ►నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు ►జీడి పలుకులు – ఇరవైధార్వాడ్ పేడా, ఉడిపి హయగ్రీవ మద్ది ►కిస్మిస్ – నాలుగు టేబుల్ స్పూన్లు ►యాలకుల పొడి – అరటేబుల్ స్పూన ►పచ్చికొబ్బరి తురుము – కప్పు తయారీ విధానం.. ►ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి ఆరు కప్పుల నీళ్లుపోసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన తరువాత నీటిని వేరు చేసి శనగపప్పుని పక్కనబెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాణలి పెట్టి శనగపప్పు, బెల్లం, లవంగాలు వేసి కలపాలి. సన్నని మంటమీద బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ►స్టవ్ మీద మరో పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కిన తరువాత జీడిపప్పు కిస్మిస్లను దోరగా వేయించాలి. ►శనగపప్పు మిశ్రమం దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలిపి ఐదునిమిషాలు మగ్గనిస్తే హయగ్రీవ మద్ది రెడీ. ధార్వాడ్ పేడా కావల్సిన పదార్థాలు: ►పాలు – 4 లీటర్లు ►నిమ్మరసం – నాలుగు టేబుల్ స్పూన్లు ►నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు ►పంచదార – 12 టేబుల్ స్పూన్లు ►యాలకులపొడి – అరటేబుల్ స్పూను. తయారీ విధానం.. ►ముందుగా పాలను మీడియం మంట మీద కాయాలి. తరువాత నిమ్మరసం వేసి తిప్పితే పాలు విరిగినట్టుగా మారి నీళ్లు వేరుపడతాయి. ►నీటిని వంపేసి పన్నీర్ మిశ్రమాన్ని గుడ్డలో వేసి సాధారణ నీళ్లుపోసి వడగట్టాలి. ►పన్నీర్ మిశ్రమాన్ని సన్నని మంట మీద తేమ పోయేంత వరకు వేయించి, తరువాత నెయ్యి, టేబుల్ స్పూను పాలు, పంచదార వేసి తిప్పుతూ ఉండాలి. అడుగంటినట్టుగా ►అనిపిస్తే మధ్యలో టేబుల్ స్పూను పాలను వేసి కలుపుతూ ఉండాలి. ►పంచదార కరిగేంతవరకు సన్నని మంట మీద వేయించి, పన్నీర్ బ్రౌన్ కలర్లోకి మారాక దించేసి చల్లారాక, పొడిచేసుకోవాలి. ►ఇప్పుడు బాణలిలో ఈ పొడిని వేసి మూడు టేబుల్ స్పూన్ల పాలు పోసి ముదురు బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి, యాలకులపొడి దించేయాలి. చల్లారాక, మిశ్రమాన్ని సిలిండర్ ఆకారంలో చుట్టుకుని పంచదార అద్దితే ధార్వాడ్ పేడా రెడీ. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
Navratri Special: నోరురించే స్వీట్స్ పనియారం, ఆలూకా హల్వా తయారీ విధానం ఇలా..
దసరా పండగ వేళ.. రొటీన్‌కు కాస్త భిన్నంగా సరికొత్త, ఘుమఘుమలాడే వంటకాలను బంధువులు, స్నేహితులు, ఇంట్లో వాళ్లకు రుచి చూపిద్దాం... స్వీట్ పనియారం కావల్సిన పదార్థాలు: ►గోధుమ పిండి – కప్పు ►అరటిపళ్లు – రెండు ►బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►బెల్లం – అరకప్పు ►నీళ్లు – అరకప్పు ►యాలకులపొడి – అరటీస్పూను ►నెయ్యి – టీస్పూను తయారీ విధానం.. ►అరకప్పు నీటిని వేడి చేసి, దానిలో బెల్లం వేసి కరిగించి పక్కనబెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో రెండు అరటిపళ్లను తొక్కతీసి గుజ్జులా చేసుకోవాలి. ►ఇప్పుడు అరటిపండు గుజ్జులో బెల్లం సిరప్‌ను వడగట్టి పోయాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి తురుము, యాలకుల పొడి, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా, ►దోశ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవచ్చు. ►ఇప్పుడు పొంగనాలు లేదా ఇడ్లీ పాత్రకు కొద్దిగా నెయ్యిరాసి, పిండి మిశ్రమాన్ని వేసి, మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించిన తరువాత, మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికిస్తే స్వీట్ పనియారం రెడీ. ఆలూ కా హల్వా కావల్సిన పదార్థాలు: ►ఉడికించి తొక్కతీసిన బంగాళ దుంపలు – ఆరు (తురుముకోవాలి) ►నెయ్యి – అరకప్పు ►పాలు – కప్పు ►పంచదార పొడి – ఒకటిన్నర కప్పు ►యాలకుల పొడి – టీ స్పూను ►డ్రైఫూట్స్ పలుకులు – అరకప్పు తయారీ విధానం.. ►స్టవ్ మీద మందపాటి బాణలిని పెట్టి, వేడెక్కిన తరువాత కొద్దిగా నెయ్యి వేసి బంగాళ దుంపల తురుము వేసి దోరగా వేయించాలి. ►తురుము వేగాక పాలు, పంచదార పొడి వేసి కలపాలి. ►పంచదార పొడి పూర్తిగా కరిగిన తరువాత, మిగతా నెయ్యి వేసి తిప్పుతుండాలి. ►నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించి, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ పలుకులు వేస్తే పొటాటో హల్వా రెడీ. చదవండి: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా.. -
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల మిఠాయి
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల తియ్యటి పండుగ.. సోదరుడి నోరు తీపి చేయటానికి సోదరి ఆప్యాయతను కలబోసి తినిపించే మిఠాయిల పండుగ తనకు రక్షణగా ఉండమని సోదరుడిని భరోసా కోరే రక్షాబంధన్ పండుగ.. 1. దూద్ పాక్ కావలసినవి: చిక్కటి పాలు – 5 కప్పులు; కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; బాస్మతి బియ్యం – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; గార్నిషింగ్ కోసం: బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; పిస్తా పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ ఒక చిన్న పాత్రలో టేబుల్ స్పూను పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, నెయ్యి జత చేసి పక్కన ఉంచాలి. పాలను మరిగించాక, నెయ్యి జత చేసిన బియ్యం అందులో పోసి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ, ఉడికించాలి. పంచదార, కుంకుమ పువ్వు జత చేసిన పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ ఆరేడు నిమిషాలు ఉంచి, దింపేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచి బయటకు తీయాలి. బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పుల తరుగుతో అలంకరించి, అందించాలి. చదవండి: రొయ్యల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసా? 2. కాజు కోప్రా షీరా కావలసినవ: జీడి పప్పుల పొడి – అర కప్పు (రవ్వలా ఉండాలి); కొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ చిన్న గ్లాసులో కొద్దిగా నీళ్లు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడి పప్పు పొడి, కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద మూడు నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఒక పాత్రలో పావు కప్పు నీళ్లలో పంచదార వేసి కరిగించి, వేయించిన జీడి పప్పు మిశ్రమానికి జత చేసి, బాగా కలపాలి. కుంకుమ పువ్వు నీళ్లను జత చేసి మరోమారు కలపాలి. ఏలకుల పొడి జత చేసి, కలిపి, దింపేసి, చల్లారాక అందించాలి. 3. కేసర్ మలై కుల్ఫీ కావలసినవి: కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – నాలుగున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. చిన్న పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నటి సెగ మీద మధ్యమధ్యలో కలుపుతూ మరిగించాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లు, పంచదార జత చేసి సన్నటి మంట మీద సుమారు అరగంట సేపు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి దింపేయాలి. మిశ్రమం బాగా చల్లారాక కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి జత చేయాలి. తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి పోసి, డీప్ ఫ్రీజర్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచాక తీసుకుని తినాలి. – వైజయంతి పురాణపండ చదవండి: బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసా? -
‘మిఠాయి దౌత్యం’.. స్వీట్లు పంచుకున్న భారత్, పాక్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇరు దేశాల భద్రతా సిబ్బంది కలిసిపోతారు. ప్రత్యేక దినాల్లో ఇరు సైనికులు స్నేహాభావంతో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. తాజాగా బక్రీద్ పర్వదినం సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా పండుగ చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందంలో మునిగారు. పూంచ్- రావల్కోట్ సరిహద్దు వద్ద ఉన్న భారత్ పాక్ సైనికులు ‘మిఠాయి దౌత్యం’ నిర్వహించారు. ఇటు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ఇరు దేశాలు సైనికులు మిఠాయి దౌత్యం చేపట్టారు. ఇక పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని మిఠాయి దౌత్యం నిర్వహించామని పూంచ్‌లోని భారత లెఫ్టినెంట్ కమాండర్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మిఠాయిలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రెసిడెంట్లు మార్చుకున్నట్లు వివరించారు. ఇలాంటి వాటితో రెండు దేశాల మధ్య స్నేహం, విశ్వాసాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి మిఠాయి దౌత్యం నిర్వహించారు. పూంచ్ జిల్లాలోని సరిహద్దులో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటున్న ఇరు దేశాల సైనికులు (ఫొటో: హిందూస్తాన్ టైమ్స్) -
లాక్డౌన్: స్వీట్లు కొనుక్కోవడానికి వెళ్తున్న సార్!
కోల్‌కతా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. మహమ్మారి కట్టడి కోసం యావత్ దేశం మళ్లీ లాక్డౌన్లోకి వెళుతోంది. అన్ని రాష్ట్రాల్లో కఠినతరమైన ఆంక్షలు విధిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు మాత్రం లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా చిన్న కారణాలతో అనవసరంగా బయకు వస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో ఓ వ్యక్తి గోధుమ పిండి కోసం బయటకు వచ్చానని చెప్పిన వీడియో అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా పశ్చిమ బెంగాల్లోనూ ఓ వ్యక్తి అచ్చం ఇలాంటి కారణంతోనే పోలీసులకు చిక్కాడు. బెంగాల్ ప్రజలకు స్వీట్లు అంటే ప్రాణం. దీంతో లాక్‌డౌన్‌లోనూ అక్కడి ప్రభుత్వం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్వీట్ల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి లాక్డౌన్లో స్వీట్లు కొనడానికి బయటకు వచ్చాడు. దీనికితోడు తన మెడలో ‘స్వీట్లు కొనడానికి వెళ్తున్నా’ అని రాసి ఉన్న బోర్డును మెడకు తగిలించుకుని మరీ రోడ్డు మీద తిరుగుతున్నాడు. సదరు వ్యక్తిని గమనించిన పోలీసులు అతన్ని ఆపి రోడ్డు మీదకు ఎందుకు వచ్చావ్ అని సీరియస్‌గా అడిగారు. ఇందుకు అతను తన మెడలో బోర్డును చూపిస్తూ ‘స్వీట్లు కొనడానికి వెళ్తున్నా’ అని అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడయోను ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. This guy seems to be highly sorted 🙂 Only in #WestBengal: The note on the guy reads — ‘Going to buy sweets.’#Lockdown pic.twitter.com/g3S1oY6i9h — Rahul Basu (@raahulbasu) May 17, 2021 చదవండి: Lockdown: మాస్కులు లేకుండా తిరిగిన వారినుంచి రూ. 31 కోట్లు లాక్డౌన్: తెగ తిరుగుతున్నారు! -
అమృత సంధ్య ఇదీ జీవితం
‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌లోని శివకుమార్. నోరూరించే ఉపాధి ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది. ‘మార్కెట్లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది. వ్యక్తి వికాస పాఠం ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది. -
అమ్మ చేతి తీపి రుచి
పిల్లల బాధ్యతలు తీరాక అమ్మలకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అది బాగా డబ్బు ఉన్నవారికైనా, మధ్యతరగతి జీవితంతో నెట్టుకొస్తున్నవారికైనా. ఆ విశ్రాంత సమయాన్ని కొందరు మాత్రం ఉపయుక్తంగా, తమ కలలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తుంటారు. వారిలో నీలూ భండారి ఒకరు. 64 ఏళ్ల వయసులో ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో ఆర్గానిక్ స్వీట్లు తయారుచేస్తూ దేశ విదేశాల నుంచి ఆర్డర్లు పొందుతూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం నీలూ భండారీ స్వీట్లు అంటే మక్కువ చూపుతుంటారు. ఐదేళ్లుగా ఆమె చేస్తున్న స్వీట్ జర్నీ గురించి అంతే స్వీట్‌గా చెప్పుకోవచ్చు. స్వీట్లు తయారుచేసే సమయంలో నీలూ భండారీని చూస్తే ఆమె మోముపై ఓ మెరుపు ఉంటుంది. ఆమె పెదవులు దైవ నామం జపిస్తూ ఉంటాయి. స్వీట్ల ద్వారా ఎంతో మందికి చేరవయ్యే అవకాశం ఆ భగవంతుడే తనకు కల్పించాడని, ఆ విధంగా తాను దైవానికి దగ్గరవుతున్నాను అని ఆమె నమ్ముతారు. కమ్మని వాసనల వంటకాలు ‘పిల్లలు బేకరీలలో లభించే జంక్ ఫుడ్‌ని ఇష్టపడుతుంటారు. కానీ, ఆ ఆహారం వల్ల వారి శరీరం బోలుగా తయారవుతుంది. ఊబకాయం వంటి సాధారణ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ఏ వ్యాధి అయినా వారిని సులభంగా చుట్టుముంటే అవకాశం ఉంది. పిల్లల ముందు పాలు, జున్ను, దేశీ ఆవు నెయ్యి.. గురించి మాట్లాడితే వారు ముఖముఖాలు చూసుకుంటారు. అలాంటి పదార్థాల గురించి ఈ తరం వారికి తెలియనే తెలియవు. అదే మన చిన్ననాటి రోజుల్లో చలికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో అవిసె గింజలు, నువ్వులు, శనగపిండితో చేసిన కమ్మని వంటకాల వాసన వస్తుండేది’ అని చెప్పే నీలూ భండారి ఐదేళ్లుగా తన చేత్తో తయారు చేసిన స్వీట్ల వ్యాపారాన్ని ఆమె వృత్తిగా చేసుకున్నారు. ఆ స్వీట్లకు మన దేశంలోనే కాదు విదేశాలలోనూ మంచి డిమాండ్ ఉంది. చక్కెర, నెయ్యి లేకుండా స్వీట్లు! చక్కెర లేని, నెయ్యి లేని స్వీట్లను నీలూ స్నేహితులు రుచి చూసి తమ కోసమూ వాటిని అడిగి మరీ చేయించుకునేవారు. దీంతో ఆమె ఎక్కువ మొత్తంలో అలాంటి స్వీట్లు తయారుచేసి వారి కోసం ప్రదర్శన ఏర్పాటు చేసేది. స్నేహితులు, బంధువులు ఆ ప్రదర్శనలో పాల్గోవడమే కాదు, ఆర్గానిక్ స్వీట్ల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. బయట నుంచి కూడా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. డిమాండ్ పెరగడంతో ఆమె ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో స్వీట్ల తయారీని పెంచింది. సెలబ్రిటీలకు చేరువ ఆమె చేతితో తయారు చేసిన శుభ్రమైన స్వీట్లు బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జస్పిందర్ నరులా, కర్మవీర్ వోహ్రా, సుప్రియా, అబూ సూఫీ.. తదితరులు ఇష్టపడి మరీ ఆర్డర్ల మీద తెప్పించుకుంటారు. మన దేశంలోనే కాకుండా వర్జీనియా, ఫ్లోరిడా, కెనడా, ఆస్ట్రేలియా, పారిస్, జర్మనీ నుండి కూడా నీలూ భండారీ స్వీట్లను ఆర్డర్ల మీద తెప్పించుకుంటున్నారు. -
కాకరకాయ, పచ్చిమిర్చితో రసగుల్లా
రాంచి: కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తీపి అంటే ఇష్టమైన వాళ్లంతా నోళ్లు కట్టేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం రాంచిలోని ఓ స్వీట్ షాపు నిర్వాకుడు కమల్ అగర్వాల్ తీపి కబురు అందించాడు. తీపి తినేవారికి రోగనిరోధక శక్తని అందించే రసగుల్లాను ఈ దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడు. అయితే స్వీట్స్‌తో రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా. ఇందులో వాడే పదార్థాలు ఏంటో మీరే చదవండి మరి. ఈ రసగుల్లా తయారికి అగర్వాల్ ఇమ్యూనిటీని పెంచే పదార్థాలు... కాకరకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు పదార్థాలను వాడుతున్నాడు. ఈ పదార్థాల్లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయని జార్ఖండ్ ప్రభుత్వ ఆయుష్ వైద్యుడు భరత్ కుమార్ కూడా స్పష్టం చేశారు. (చదవండి: మరో లాక్డౌన్ వల్ల అన్నీ అనర్థాలే!) స్వీట్స్ షాపు నిర్వాహకుడు కమల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో నా మిఠాయిల వ్యాపారం నిలిచిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. జనాలు కూడా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తినిచ్చే ఉత్పత్తులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి పదార్థాలనే ప్రజలంతా కొనుగోలు చేయడం గమనించాను. అందువల్లే ఇమ్యూనిటీ ఇచ్చే ఈ రసగుల్లాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పాడు. అయితే ఇవి తయారు చేసిన మొదల్లో చాలా తక్కువమంది ఈ రసగుల్లాలను కోనుగొలు చేసేవారని, అయితే దుర్గా పూజ తర్వాత వీటి డిమాండ్ బాగా పెరిగిందన్నాడు. అంతేగాక ఈ స్వీట్స్‌కు ప్రజల నుంచి విశేష స్పందని వస్తుందని, ఈ దీపావళికి రసగుల్లాలకు చాలా ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశాడు. (చదవండి: జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి) -
కరోనా : బెంగాలీలకు గుడ్‌న్యూస్
కోల్‌కతా : మిఠాయిలను అమితంగా ఇష్టపడే బెంగాలీలకు మరో 'స్వీట్' న్యూస్. కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ సుందర్భన్ అడవుల్లోంచి సేకరించిన తేనె, స్వచ్ఛమైన ఆవు పాలు, తులసీరసంతో తయారుచేసిన ఈ మిఠాయికి 'ఆరోగ్య సందేశ్'గా నామకరణం చేశారు. పూర్తి సహజమైన పద్ధతిలో దీన్ని తయారు చేశారని, ఇందులో ఎలాంటి కృత్రిమ పదార్థాలు, రంగులు కలపలేదని జంతు వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మిఠాయితో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. అయితే ఇది కరోనాకు విరుగుడు మందు కాదని, కేవలం రోగ నిరోదక శక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. (వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్? ) ఇప్పటికే ఆరోగ్య సందేశ్‌కు ప్రభుత్వ అనుమతి కూడా లభించింది. దీంతో అతి త్వరలోనే సామాన్యులకు అందుబాటు ధరల్లో అభించనుందని సుందర్బన్స్ వ్యవహారాల మంత్రి మంతురాం పఖిరా తెలిపారు. కాగా ఈ నెల ప్రారంభంలో ప్రఖ్యాత మిఠాయి తయారీ సంస్థ ఇమ్యూనిటీ సందేశ్ పేరుతో ఈ స్వీట్‌ను తయారుచేసింది. ఇందులో సహజసిద్ధమైన పసుపు, తులసి, కుంకుమ, యాలకులు, తేనే వంటి మూలికలతో దీన్ని సిద్ధం చేయగా వివిధ పరిశోధనల అనంతరం దీనికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ మిఠాయిలో ఉన్నట్లు శాస్ర్తీయంగా తేలింది. (కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు ) -
'కరోనా’ను కరకరా నమిలేస్తాం..
కోల్‌కతా: ఎక్కడైనా కంటికి ఆకర్షణీయంగా కనిపించేవాటిపైనే మన చూపు లాగుతుంటుంది. చూడటానికి బాగుంటేనే దాన్ని టేస్ట్ చేయాలన్న కోరిక పుడుతుంది. అయితే ఇక్కడ ఆకర్షణీయం అన్నమాట పక్కనపెడితే.. కాస్త ఆశ్చర్యకరంగా కనిపించే ఓ స్వీట్ మార్కెట్లోకి వచ్చింది. దాన్ని తినాలంటే మాత్రం మీరు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాల్సిందే. లాక్డౌన్ పుణ్యమా అని అన్నింటికీ బ్రేక్ పడితే కొన్ని రకాల దుకాణాలకు మాత్రం మినహాయింపు దొరికింది. అందులో స్వీట్స్ షాపు కూడా ఒకటి. అయితే గిరాకీ లేక చాలా చోట్ల దుకాణదారులు ఈగలు తోలుకుంటూ కూర్చుంటున్నారు. ఈ తరుణంలో కోల్‌కతాలోని ఓ షాపు నిర్వాహకుడు కరోనా వైరస్ నమూనాతో స్వీట్లు తయారుచేసి జందరి దృష్టినీ ఆకర్షించాడు. అనంతరం ఆ స్వీట్లను అందంగా ఓ ట్రేలో అమర్చి అమ్మకానికి పెట్టాడు. (స్వీట్స్ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే) దీనికి సంబంధించిన ఫొటోలను ప్రీతి భట్టాచార్య అనే ట్విటర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ 'వామ్మో, పేరు వింటేనే గుండెలదురుతున్నాయి.. అలాంటిది ఏకంగా దాన్ని తినడమే?’ అని నోటికి తాళం వేసుకుంటున్నారు. 'దేన్నీ వదలరుగా, మీ క్రియేటివిటీ తగలెయ్య’, 'కరోనాను కరకరా నమిలి, నామరూపాల్లేకుండా చేస్తాం’ అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆ రాష్ట్రంలో స్వీటు దుకాణాలు ప్రతిరోజు నాలుగు గంటలపాటు తెరిచి ఉంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చని, కానీ.. సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. (రుచిని చాట్‌కుందాం!) -
కుటుంబ సభ్యులకు విషం; మరో వ్యక్తితో పరారీ..
సాక్షి, గంగాధర(కరీంనగర్) : స్వీటు పదార్థంలో కుటుంబ సభ్యులకు విషం కలిపిచ్చిందో మహిళ. దాన్ని తిన్న నలుగురు స్పృహ తప్పి పడిపోగా.. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగరం ఉమ గురువారం రాత్రి సేమియా తయారుచేసింది. దాన్ని భర్త విలాసాగరం అంజయ్య, మామ రాజేశం, కొడుకు సిద్దార్థ(11), కూతురు మన్విత(4)కు వడ్డించింది. అత్త లక్ష్మికి ఇవ్వగా తినలేదు. స్వీటుతిన్న కాసేపటికే నలుగురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన ఉమ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. శుక్రవారం వేకువజామున స్పృహలోకి వచ్చిన అంజయ్య తేరుకుని విషయాన్ని అదే గ్రామంలో ఉన్న బంధువులకు చెప్పేందుకు వెళ్తుండగా.. డ్రెయినేజీలో పడి గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు నలుగురిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. మన్విత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అంజయ్య తెలిపాడు. -
ఈ స్వీట్ బాంబులు..హాట్ కేకులే!
సాక్షి,జోధ్‌పూర్ : దీపావళి అంటేనే స్వీట్లు, క్రాకర్స్ పండుగ. అయితే ఈ దీపావళి పండుగకు కూడా ఉత్త లడ్డూలు, జిలేబీలు, జామూన్లు ఏంటి బోర్... సమథింగ్ ఇస్మార్ట్ అనుకున్నారో ఏమో కానీ... రాజస్థాన్‌లోని వ్యాపారులు స్వీట్ తయారీదారులు సరికొత్తగా ఆలోచించారు. పండుగవేళ వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బాంబులతో స్వీట్లు పేల్చారు. అదేనండీ.. దీపావళి క్రాకర్స్ మాదిరిగా స్వీట్లను తయారు చేసారు. సుత్లీ బాంబులు, లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు లాంటి దీపావళి క్రాకర్స్ తరహాలో స్వీట్లను రూపొందించారు. అయితే దీపావళి క్రాకర్స్అనుకొని కొనడానికి వచ్చిన కస్టమర్లు.. క్రాకర్ల ఆకారంలో ఉన్న స్వీట్లను చూసి బహు ముచ్చటపడిపోతున్నారుట. దీంతో 'క్రాకర్ స్వీట్స్' అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా పిల్లల్ని ఆకట్టుకుంటూ హాట్‌కేక్‌ల మాదిరిగా అమ్ముడవుతున్నాయి. సాధారణంగా దీపావళికి స్వీట్లకు మంచి ఆదరణ లభిస్తుందని జోధ్‌పూర్‌లోని సర్దార్‌పురా దుకాణదారులు చెబుతున్నారు. సుమారు ఒక నెల సమయంనుంచే స్వీట్ల తయారీలో నిమగ్నమై పోతామని చెప్పారు. అంతేకాదు, స్వచ్ఛమైన నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో ఎలాంటి కల్తీ లేకుండా తయారుచేస్తారట, అందుకే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట. ఈ సంవత్సరం దీపావళి పర్వదినాన్ని అక్టోబర్ 27న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. -
హెల్మెట్ లేకపోతే స్వీట్లు : సొంత భద్రత కోసమే
ఇంఫాల్: ప్రయాణికుల భద్రత కోసం ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అధికారులు పదే పదే చెబుతున్నా..నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉంది. హెల్మెట్ ధరించని వాహన చోదకులకు జరిమానా విధిస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పేపీ కనిపించడంలేదు. దీంతో మణిపూర్ పోలీసులు వినూత్నపద్ధతిని అవలబింస్తున్నారు. హెల్మెట్‌లెస్ రైడర్లకు జరిమానా విధించే సాధారణ పద్ధతికి విరుద్ధంగా మణిపూర్ చురాచంద్‌పూర్‌లోని ట్రాఫిక్ కంట్రోల్ పోలీసు సిబ్బంది స్వీట్లు పంపిణీ చేసి భద్రతా చిట్కాలపై వారికి సలహా ఇస్తున్నారు. గతకొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని పలకరించి, ప్రత్యేకంగా స్వీట్లు అందించి మరీ భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జరిమానాలు విధించడం వల్ల ఎటువంటి మార్పు రావడం లేదు.. కనీసం ఇలా అయినా ప్రజల్లో మార్పు వస్తుందని భావిస్తున్నామనీ, తద్వారా వారిలో భద్రతా భావాన్ని ప్రేరేపించడమే తమ ఉద్దేశ్యమని ఎస్సీ అమృత సిన్హా వెల్లడించారు. ప్రమాద సమయంలో ప్రయాణికుణి తలకు తీవ్రమైన, ప్రాణాంతకమైన దెబ్బలు తగలకుండా హెల్మెట్ రక్షిస్తుంది, ఇదంతా వారి సొంత భద్రత కోసమే అని సిన్హా పేర్కొన్నారు. మరోవైపు ఇంఫాల్‌కు చెందిన పాయా సువాంటక్ మాట్లాడుతూ ఇది ప్రజల అభివృద్ధికి నాంది అని అభిప్రాయపడ్డారు. ఈ చర్య హెల్మెట్ ధరించాలనే విషయం ప్రతీ క్షణం తనకు గుర్తు చేస్తుందంటూ పోలీసు శాఖ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. -
పెరుమాళ్లపురం గారెల రుచే వేరయా...
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలన్నారు పెద్దలు. అయితే తింటే పెరుమాళ్లపురం బెల్లంపాకం గారెలే తినాలి అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందాయి పాకం గారెలు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతం సమీపిస్తుండగానే పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెల ఘుమఘమలు పట్టి లాగేస్తుంటాయి. తెలుగు సంప్రదాయ వంటకాల్లో బూరెలకు, గారెలకు ఒక ఆదరణ ఉంది. పూర్వం బూరెలు, బెల్లంగారెలే పెళ్లివారి విందులో ఉండేవి. అత్తారింటికి అల్లుడు వచ్చాడంటే బెల్లం గారెలతో స్వాగతం పలికేవారు. ఇప్పటికీ నైవేద్యాలలో, విందు భోజనాల్లోనూ బెల్లం పాకం గారెలదే మొదటి స్థానం. నోరూరించే ఈ పాకం గారెను ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి. ఆహా! ఆ మధురానుభూతే వేరు. ఓ హోటల్లో సాయం సమయంలో యాదృచ్ఛికంగా వేసిన బెల్లం గారెలకు డెబ్బై ఏళ్ల చరిత్ర ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇదీ అసలు కధ తూర్పుగోదావరిజిల్లా సముద్ర తీరప్రాంతంలో తొండంగి మండలం పెరుమాళ్లపురం గ్రామానికి చెందిన పేరూరి కన్నయ్య, అప్పయ్యమ్మ దంపతులు 1940 కాలంలో పెరుమాళ్లపురంలో అప్పట్లో పుంతరోడ్డుగా ఉన్న రహదారిలో చిన్న కాకా హోటల్ నడిపేవారు. ఉదయం పూట ఇడ్లీ, సాయంత్రం పకోడి వేసేవారు. ఎప్పుడూ పకోడీలేనా అని అక్కడివారు అనడంతో అప్పయ్యమ్మ మినప్పప్పు రుబ్బి ఆ పిండితో గారెలు వేసి, బెల్లం పాకంలో వేసి వండటం ప్రారంభించింది. అవి ఎంతో రుచిగా ఉండటంతో అప్పయ్యమ్మ బెల్లంపాకం గారెలకు క్రమంగా మంచి పేరు వచ్చింది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి పాకం గారెల అమ్మకం జోరుగా సాగేది. అప్పట్లో అణాకు నాలుగు గారెలు అమ్మేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పయ్యమ్మ హోటల్ నిర్వహణతోనే ఇద్దరు కుమారులు, కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. అమ్మాయికి వివాహం కూడా చేసింది. ఆ తరవాత నుంచి అప్పయ్యమ్మకు కుమారులైన సత్యనారాయణ, సూర్యనారాయణలు సహాయపడేవారు. శుభకార్యాలకు ఆర్టర్లు వస్తే ఇంటిల్లిపాదీ కష్టపడేవారు. పెద్దవారు గతించడంతో ప్రస్తుతం చిన్న కుమారుడు సూర్యనారాయణ తన కుమారుడితో కలిసి బెల్లం పాకం గారెలు వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిత్యం హోటల్లో అమ్మడంతోపాటు శుభకార్యాలకు అర్డర్లు వస్తే వండి పంపిస్తున్నారు. నాయనమ్మ ప్రారంభించిన బెల్లం పాకం గారెలను నేటికీ నాణ్యత తగ్గకుండా తండ్రి సూర్యనారాయణ, మనమడు రాంబాబులు షాపును నిర్వహిస్తున్నారు. పెరుమాళ్లపురం పాకం గారెలకు ప్రసిద్దిగాంచడంతో ఇటీవల కాలంలో వీరితోపాటు స్థానికంగా మరో రెండు కుటుంబాల వారు గారెలు వండటం ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారు. కాగా అప్పయ్యమ్మ శతాధిక వృద్దురాలిగా 105 ఏళ్ల వయస్సులో 2019 జూలైలో కాలం చేశారు. రోజుకి 1000 నుంచి1200 గారెల అమ్మకం కిలో మినపగుళ్లు రుబ్బగా వచ్చిన పిండి నూనెలో వేయిస్తే 150 వరకూ గారెలు తయారౌతాయి. ఈ గారెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బెల్లం పాకం సిద్ధం చేస్తారు. అప్పయ్యమ్మ తమ హోటల్లో పాకం గారెల వ్యాపారం చేయడం ప్రారంభించేనాటికి కిలో మినప్పప్పు రూపాయిన్నర ఉండేదని, బెల్లం కిలో అర్ధరూపాయి ఉండేదని గతంలోకి అనుభవాలను పంచుకుంటారు. పాకం గారెలను ప్రతీరోజూ సాయంత్రం హోటల్లో వేడివేడిగా వండి అమ్ముతారు. గతంలో సాధారణ రోజుల్లో ఐదొందలకు పైగా అమ్మేవారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో నిత్యం 1000 – 1200 గారెలు తయారుచేసి అమ్ముతున్నారు. రుచి చూసిన ప్రముఖులు... దీర్ఘకాలం నుంచి పేరూరి అప్పయ్యమ్మ వేసిన బెల్లం పాకం గారెలు కోనసీమ ప్రాంతంలో పేరొందడంతో ఎవరైనా ప్రముఖులు ఈ ప్రాంతానికి వస్తే పెరుమాళ్లపురం బెల్లం గారెలను రుచి చూపించేవారు. సినీనటులు జమున, నందమూరి తారకరామారావు, చిరంజీవి, ఇంకా పలువురు సినీ, రాజకీయప్రముఖులు రుచి చూశారు. ఉభయగోదావరి జిల్లాలకు ఎవరైనా ప్రముఖులు వస్తే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ గొట్టం కాజాతో పాటు పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెలు తీసుకెళ్లి రుచి చూపించడం ఆనవాయితీగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల రాకతో పెరిగిన డిమాండ్ పెరుమాళ్లపురం పాకం గారెలకు ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఇతర తెలుగు ప్రాంతాలలో కూడా ప్రాచుర్యం పొందాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగడంతో శుభకార్యాలకు అర్డుర్లు ఎక్కువయ్యాయని నిర్వాహకుడు పేరూరి రాంబాబు అంటున్నారు. – పోతుల జోగేష్,తొండంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా. పేటెంట్ హక్కుల కోసంప్రయత్నిస్తున్నాను... మా నాయనమ్మ డెబ్బై ఏళ్ల క్రితం నుంచి బెల్లం పాకం గారెలు వండి అమ్మడం ప్రారంభించింది. వృద్ధురాలు కావడంతో పాకం గారెల తయారీ నా తండ్రి సహకారంతో కొన్నాళ్లు మేమంతా నిర్వహించాం. ఆయన కూడా వృద్ధుడు కావడంతో పూర్తిగా గారెల తయారీని నేనే నిర్వహిస్తున్నాను. బెల్లం పాకం గారెలకు పేటెంట్ హక్కులతోపాటు, జియోగ్రాఫికల్ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను. – పేరూరి రాంబాబు,(పేరూరి అప్పయ్యమ్మ మనమడు) -
భగత్ హల్వా (1795 నుండి)
భగత్ హల్వా తాజ్‌మహల్ అంత పురాతనమైనది కాకపోవచ్చును కాని, ఇంచుమించు అంత పురాతనమైనదే. బెలాంగంజ్ ప్రాంతానికి చెందిన లేఖ్‌రాజ్ భగత్ సుమారు రెండు శతాబ్దాల క్రితం హల్వాను అమ్మడం ప్రారంభించారు. మట్టితో అలికిన నేల మీద కూర్చుని రెస్టారెంట్ భోజనం చేసే రోజులు అవి. చెక్క స్పూనుతో, మట్టి పాత్రలలో మాత్రమే ఆ రోజుల్లో ఆహారం తీసుకునేవారు. దక్షిణ భారతీయులు, చైనీయులు ఇక్కడకు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. లడ్డు, బర్ఫీల స్థానంలో స్టేపుల్ ఫుడ్ అంటే పూరీ కూర, కేక్స్ పేస్ట్రీలు వంటివి పరిచయం చేశారు. అన్నిటికీ దీటుగా నిలబడింది ఇది.భగత్ హల్వాయి కుటుంబం లో తొమ్మిదో తరానికి చెందినవారు రాజ్‌కుమార్ భగత్. మొఘలుల కాలం నుంచి వీరి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయట. బొగ్గులు, కట్టె పుల్లల వంటి వాటిని వంటకు ఉపయోగించే వారు కాదు. కేవలం ఆవు పిడకల మీద మాత్రమే వంట చేసేవారు. మొదట్లో పూరీ కూర తయారుచేసేవారు. బేడాయ్ (స్టఫ్డ్ పూరీ), రబ్రీ, జిలేబీ, బర్ఫీ వంటి మిఠాయిలు తయారుచేసేవారు. కాలక్రమేణా వీరు తమ వ్యాపారాన్ని విస్తరించారు. నగరంలో చాలా షాపులు ప్రారంభించారు. స్వీట్స్ నుంచి కేకుల వరకు, బ్రెడ్ నుంచి బటర్ వరకు, చాట్ నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు, అన్ని రకాల సంప్రదాయ మిఠాయిలు సైతం వీరు తయారుచేస్తున్నారు. కోకోనట్ వాటర్ రిఫ్రెషనర్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర లీటర్లు; పుదీనా ఆకులు – అర కప్పు; నిమ్మ తొనలు – 4 (చిన్న చిన్న ముక్కలు); నిమ్మ రసం – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన పుచ్చకాయ ముక్కలు – అర కప్పు; ఐస్ క్యూబ్స్ – కొద్దిగా. తయారీ: ∙ఒక పాత్రలో ఒక టీ స్పూను నిమ్మ రసం, కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి ∙నిమ్మ తొనలు, పుచ్చకాయ ముక్కలు జత చేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ∙గ్లాసులోకి తీసుకోవాలి ∙కొబ్బరి నీళ్లు, ఐస్ క్యూబ్స్ జత చేసి బాగా కలిపి, చల్లగా అందించాలి. ట్రాపికల్ కోకోనట్ సంగారియా కావలసినవి: పైనాపిల్ తరుగు – ఒక కప్పు; పచ్చి మామిడికాయ తురుము – ఒక కప్పు; కమలాపండు తొనలు – ఒక కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర కప్పులు తయారీ: ∙ఒక పెద్దపాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి ∙సుమారు రెండు గంటలపాటు మూత పెట్టి ఉంచేయాలి ∙కొద్దిగా ఐస్ వేసి చల్లగా అందించాలి. వాహ్ లస్సీవాలా! వాహ్!!!జైపూర్ లస్సీవాలా (1944 నుంచి) జైపూర్ లస్సీవాలా గురించి ఎవరికి తెలియదు కనుక మళ్లీ వాళ్ల గురించి చెప్పడానికి. తరతరాలుగా అందరూ అక్కడి లస్సీ తాగినవారే. జైపూర్ వెళితే లస్సీని రుచి చూడకుండా వెనక్కు రారు. ఎం.ఐ. రోడ్లో ఈ లస్సీవాలా సుమారు ఏడు దశాబ్దాలుగా లస్సీ అమ్ముతున్నారు. 1944లో కిషన్‌లాల్ అగర్వాల్ ‘లస్సీవాలా’ ప్రారంభించారు. జైపూర్‌లో ఇటువంటి షాపు ఇదే మొదటిది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా తియ్యగా, ఉప్పగా రెండు ఫ్లేవర్స్లోను లస్సీ దొరుకుతుంది. ఇప్పుడు సుగర్ ఫ్రీ లస్సీ కూడా అందిస్తున్నారు. ఈ లస్సీని రుచి చూడని సెలబ్రిటీలు లేరు. ప్రముఖ బాలీవుడ్ తారలంతా ఈ లస్సీని రుచి చూసినవారే. ఈ లస్సీవాలాను దర్శించి, లస్సీ రుచిని తలచుకుంటూ నాలుక తడుపుకుంటుంటారు. అమితాబ్, ముఖేష్ అంబానీ, శిల్పాశెట్టి, డింపుల్ కపాడియా, శోభాడే వంటి వారంతా ఈ లస్సీని ఆస్వాదించినవారే. మిగిలిన షాపులు రాత్రివరకు తెరిచి ఉంటాయి. లస్సీవాలాలు మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు మాత్రమే తెరచి ఉంటాయి. ఇందుకు కారణం ఏమిటని ప్రశ్నిస్తే, లస్సీవాలా అధినేత ఘనశ్యామ్ అగర్వాల్ ఇందుకు మంచి సమాధానం చెబుతారు, ‘సాయంత్రానికి పెరుగు పులిసిపోతుంది. అంతేకాదు ఆ తరవాత ఇంక మా దగ్గర పెరుగు కూడా మిగలదు’ అంటారు. కుల్లాడ్ (మట్టి పాత్ర) 200 మి.లీ., 400 మి.లీ. పరిమాణంలో రెండు సైజులలో లస్సీ దొరుకుతుంది. ఇందులో పెరుగు, ఐస్, మంచి నీళ్లు పోస్తారు. మండుటెండలో చల్లటి లస్సీ కోసం నిలబడలేమనుకుంటే, ప్యాకింగ్ కూడా తెప్పించుకోవచ్చు. బటర్ పేపర్‌తో కవర్ చేసి, దారంతో బిగించి ఇంటి గుమ్మం దగ్గరకు చేరుతుంది ఈ కుల్లాడ్. భారతీయులే కాకుండా, ప్రతిరోజు కనీసం వంద మంది విదేశీయులు సైతం కుల్లాడ్ లస్సీని రుచి చూస్తారు. జైపూర్ వెళితే లస్సీ తాగడం మరచిపోకండేం!!! -
కైట్స్ ఎగిరే.. స్వీట్స్ అదిరే!
సాక్షి, సిటీబ్యూరో: కైట్, స్వీట్ ఫెస్టివల్‌తో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ జనసందోహంగా మారింది. ఆనందాల పతంగులు అంబరంలో విహరించాయి. మిఠాయిల రుచుల సంగమం నోరూరించాయి. టూరిజం, సాంస్కృతిక శాఖలు ఒకరోజు ముందే నగరానికి సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. సందర్శకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆదివారంఅంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. విభిన్న ఆకారాల గాలిపటాలు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన స్వీట్లు అదరహో అనిపించాయి. వేడుకల్లో 20 దేశాల నుంచి 42 మంది కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్, సింగపూర్, సౌత్‌కొరియా, ఇండోనేషియా, చైనా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, టర్కీ తదితర దేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులు పతంగులతో సందడిచేశారు. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 22 విదేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లు కొలువుదీరాయి. ఈ నెల 15 వరకు ఫెస్టివల్ కొనసాగనుంది. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. పక్షులకు ప్రాణాంతకం కావొద్దు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్లో పక్షి ప్రేమికుడు సత్తి రామచంద్రారెడ్డి ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. పతంగులకు మాంజా వాడకూడదని, కాటన్ దారాలను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే చిన్న పక్షులు కనుమరుగు కాకుండా వాటికి గూళ్లు ఏర్పాటు చేయడం, తాగునీరు అందించాలని, బాల్కనీ లేదా టెర్రస్‌పై దాణా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తియ్యని వేడుక సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రారంభమైన స్వీట్ ఫెస్టివల్లో తెలుగురుచులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల స్వీట్లు రుచి చూడవచ్చు. అవీ సరిపోలేదనుకుంటే అంతర్జాతీయ రుచులను ఆస్వాదించవచ్చు. అర్జెంటీనా, నేపాల్, అఫ్గానిస్థాన్, సోమాలియా, కొరియా, ఇటలీ, శ్రీలంక, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలా 22 దేశాల స్వీట్లతో పాటు అసోం, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాలీ ఇలా 25 రాష్ట్రాల తీపి వంటలూ ఇక్కడకొలువుదీరాయి. నేపాల్.. రాధిక, ఐశ్వర్య, జెమిశ్, సునీల్, రమేశ్, సంత్ బహదూర్ మేమంతా నేపాల్ నుంచి వచ్చాం. ఇక్కడే చాలా ఏళ్లుగా ఉంటున్నాం. ఈ ఫెస్టివల్లో నేపాల్‌లో బాగా పాపులరైన సిల్కోట్, గోర్కలీ చట్నీని మా స్టాల్లో అందిస్తున్నాం. అసోం.. మేం అసోంలోని గువాహటి నుంచి వచ్చాం. చందన, సరపర్ణ, మొనాలిసా, పాపోరి నలుగురం కలిసి మా ప్రాంతంలో చేసే నల్లబియ్యం, తెల్లబియ్యం పాయసం చేశాం. ఇక్కడ ఇలా తొలిసారి అస్సాం వంటలు అందరితో పంచుకోవటం మాకు పండగలా ఉంది. బెంగళూరు.. మేం గృహిణులం. బెంగుళూరు నుంచి ఈ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చాం. బియ్యం పిండితో చేసిన రోజ్ ఫ్లవర్స్ చూడటానికి అలంకరణ కోసం తెచ్చుకునే పూలలా ఉన్నా వీటిని బియ్యం పిండితో తయారు చేశాం. 7 కప్ కేక్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. -
ఘుమఘుమ.. మధురిమ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. అందమైన రంగవల్లులతో లోగిళ్లు హరిల్లులను తలపిస్తున్నాయి. రకరకాల పిండివంటలతో ఘుమఘుమలాడుతున్నాయి. నగరంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇళ్లల్లో పిండివంటలు చేసుకోలేని వాళ్లు స్వగృహ ఫుడ్స్ వద్ద బారులు తీరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా ప్రజల అభిరుచులకు అనుగుణమైన పిండివంటలతో స్వగృహ ఫుడ్స్ స్టాళ్లు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లల్లో పిండివంటలు చేసుకొనేందుకు సమయం లేని వారికి ఈ స్టాళ్లు ఫుడ్ ప్రదాయినిగా మారాయి. నాచారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు, విదేశాలకు సైతం శ్రీదేవి స్వగృహఫుడ్స్ను ఎగుమతి చేస్తున్నారు. తక్కువ ధరల్లోనే, నాణ్యమైన, రుచికరమైన పిండివంటలను అందజేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో నాచారంలోని శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ స్టాల్ వద్ద జనం బారులు తీరుతున్నారు. రెండు రోజుల్లోనే 7 క్వింటాళ్ల సకినాలను విక్రయించినట్లు నిర్వాహకుడు రమేష్‌రావు చెప్పారు. మొత్తం 50 రకాల పిండివంటలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. 25 ఏళ్లుగా పిండివంటలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల పిండివంటలు కిలోకు రూ.250 నుంచి రూ.280కు ఇక్కడ లభిస్తున్నాయి. నగరంలోని అన్ని చోట్ల స్వగృహ ఫుడ్స్‌లో రకరకాల పిండివంటలను సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. నాణ్యతే నడిపిస్తోంది 25 ఏళ్ల క్రితం మా అమ్మ సావిత్రమ్మ దీనిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రుచికరమైన, నాణ్యమైన పిండివంటలు తయారు చేసి ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.శుభకార్యాలకు, పెళ్లిళ్లు, వేడుకలకు, సభలు, సమావేశాలకు ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తున్నాం. – రమేష్‌రావు, శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ -
కరాచీ బేకరీ స్వీట్స్‌లో పురుగులు
సాక్షి, హైదరాబాద్: పండుగ రోజు షాకింగ్ న్యూస్. దీపావళి అంటేనే స్వీట్స్‌కు ప్రత్యేకం. బిజీబిజీ గందరగోళ జీవితంలో పండుగలకు, పబ్బాలకు స్వీట్ షాప్‌లు, బేకరీలపైనే ఆధారపడటం నగరవాసులకు తప్పనిసరి. అందులోనూ పేరున్న షాపులను ఎంచుకోవడం కూడా పరిపాటి. అయితే అలాంటి పెద్ద పేరున్న కంపెనీల్లోనే చెడిపోయిన, అనారోగ్యకరమైన పదార్థాలను వినియోగదారులకు అంటగడితే.. వినియోగదారుల పరిస్థితి బెంబేలే. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే హైదరాబాద్ కస్టమర్‌కు ఎదురైంది. అతి పెద్ద పేరున్న కరాచీ బేకరిలో. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కరాచీ బేకరీనుంచి దీపక్ అనే వినియోగదారుడు చాకొలెట్ స్వీట్లు కొనుగోలు చేశారు. తీరా ఇంటికెళ్లి పరిశీలిస్తే...పురుగులు పలకరించాయి. దీంతో దీపక్ ఫ్రెండ్ దోనితా జోష్ ట్విటర్లో పోస్ట్ చేశారు. హ్యాపీ వార్మీ దివాలీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమీషనర్ హరిచందన ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. కలుషితమైన స్వీట్లు ఇచ్చినట్టుగా తేలిందనీ, నిబంధనలను ఉల్లంఘించినందుకు బేకరీ యజమానికి 25వేలరూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా హైదరాబాద్ 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐకానిక్ కరాచీ బేకరీ అంటే హైదరాబాదీయులకు ఎనలేని నమ్మకం. కానీ ఇదే ఆరోపణలతో, నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 2014లో, బంజారా హిల్స్ బేకరీ ఔట్‌లెట్‌ను అధికారులు మూసివేయడం గమనార్హం. అలాగే కేవలం రెండు నెలల క్రితం, హైదరాబాదులోని ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఐకియా షోరూంలోని రెస్టారెంట్ బిర్యానీలో గొంగళి పురుగు కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. Happy wormy Diwali from @KarachiBakery Found these worms in at least 4 chocolate pieces. They even move... Not sure how many batches are even impacted by this 😞@GHMCOnline pic.twitter.com/nwK7So1Z8y — Donita Jose (@DonitaJose) November 6, 2018 #TeamGHMC Penalty imposed & samples of the same collected pic.twitter.com/I38tOIbhRa — Musharraf Faruqui (@musharraf_ias) November 6, 2018 -
2 గంటల్లో ముంగిట్లోకి ‘ఖట్టా మీఠా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నచ్చిన స్వీట్స్ కోసం కొన్ని షాపులకే వెళతాం. అక్కడికెళ్లే అవకాశం లేకపోతే ఫుడ్ అగ్రిగేటర్ల ద్వారా ఆన్లైన్లో ఆర్డరివ్వొచ్చు. కానీ అవి నిర్దేశిత పరిధి వరకే డెలివరీ చేస్తాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘ఖట్టా మీఠా’ ఒక అడుగు ముందుకేసింది. వినియోగదారులు సిటీలో ఏ మూలనున్నా టాప్ దుకాణాల నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది. స్వీట్స్, నమ్కీన్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు ఆర్డర్లు తీసుకుంటోంది. హైదరాబాద్‌కే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా 10–15 శాతం తక్కువ ధరకే సరఫరా చేస్తామంటున్నారు ‘ఖట్టా మీఠా’ను ప్రమోట్ చేస్తున్న ఫ్రెస్కో సర్వీసెస్ సీఈవో సందీప్ మారెళ్ల, సీవోవో శ్రీధర్ మహంకాళి. దీని గురించి స్టార్టప్ డైరీకి వారు చెప్పిన వివరాలివీ.. టాప్ స్వీట్ షాప్స్ నుంచే.. హైదరాబాద్‌లో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని స్వీట్స్, నమ్కీన్స్ మాత్రమే డెలివరీ చేసే కంపె నీ మాదే. దాదూస్, ఆల్మండ్ హౌస్, మిఠాయివాలా, ఆలివ్, ఆగ్రా స్వీట్స్ బంజారా, కేసరియాస్, ఆగ్రావాలా, గంగారామ్స్ వంటి 40 ప్రముఖ బ్రాండ్ల స్వీట్లు, నమ్కీన్స్, పచ్చళ్లు, టీ పొడులు మా పోర్టల్‌లో ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా మాదిరి ముంబై, బెంగాల్, అగ్రా, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పేరున్న దుకాణాల్లో లభించే పాపులర్ వెరైటీలను త్వరలో ప్రవేశపెడతాం. సంక్రాంతి నుంచి హోమ్ మేడ్ స్వీట్స్ సరఫరా చేస్తాం. విదేశాలకు అయిదు రోజుల్లో.. ప్రస్తుతం ఖట్టామీఠా.ఇన్ పోర్టల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. దీపావళికల్లా యాప్ సిద్ధమవుతుంది. 10–15 శాతం తక్కువ ధరకే ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నాం. ఇక భాగ్యనగరిలో రెండు గంటల్లో డెలివరీ ఇస్తాం. డెలివరీకి రూ.40 చార్జీ తీసుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 48 గంటల్లో కస్టమర్‌కు చేరతాయి. విదేశాలకు 5–7 రోజుల సమయం పడుతుంది. ఇతర సంస్థలతో పోలిస్తే విదేశాలకు సరఫరాకు డెలివరీ చార్జీలు 50 శాతం కంటే తక్కువే వసూలు చేస్తున్నాం. స్వీట్ కంపెనీలు మాకిచ్చే డిస్కౌంట్ ప్రయోజనాలను కస్టమర్లకే అందజేస్తున్నాం. స్నేహితులు రవీందర్ పల్లెర్ల, నరేశ్ కుమార్ బుద్ధాతో కలిసి ఈ ఏడాది మొదట్లో దీన్ని ఆరంభించాం. 10 మంది మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు. డెలివరీకి క్వికర్ సేవల్ని వినియోగించుకుంటున్నాం. కార్పొరేట్ ఆర్డర్లూ స్వీకరిస్తున్నాం. యూఏఈ, మలేషియా, సింగపూర్, యూఎస్ నుంచి ఇప్పటికే ఎంక్వైరీలు వస్తున్నాయి. -
మధురం మధురమే
శుభమైనా, సుఖమైనా; మంచికైనా మాటకైనా; వార్తకైనా, వలపుకైనా; అనుబంధమైనదీ అన్యోన్యమైనదీ ‘మధుర’ రసమే గాని మరొకటి కాదు. మిఠాయిని అందిస్తే మైత్రి కుదిరినట్లే. ఇది మన సాంప్రదాయం. జీవశాస్త్రం కూడా దీనికి దాసోహమే. రుచిని గ్రహించేది నాలుక. షడ్రసాలకు సంబంధించి నాలుకపై ఒక్కొక్క చోట ఒక్కొక్క రసానికి సంబంధించిన ‘రసగ్రంధులు’ ఉంటాయి. ఏ పదార్థానికైనా ముందుగా తగిలేది నాలుక చివరి భాగమే. ఈ జిహ్వాగ్ర స్థానంలోనే మధుర రసాన్ని ఆస్వాదించే ‘రస గ్రంధులు’ ఉంటాయని వైద్యశాస్త్రం నిరూపించింది. ఉప్పు, పులుపులకు పార్శ్వ భాగం, ఇతర స్థానాలలో తిక్త కటు కషాయాలు (చేదు, కారం, వగరు) ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఈ షడ్రసాలకు సంబంధించి నిర్దిష్టమైన ఆరోగ్య మరియు పోషక ప్రయోజనాలు, అతి సేవన వలన కలిగే అనర్థాలు సుస్పష్టంగా వివరించింది ఆయుర్వేదం. మధుర రసం: (అష్టాంగ హృదయ సంహితా) ఇది అన్నిటి కంటె శ్రేష్ఠమైనది. జన్మతః అందరికీ హితకరం. ఓజస్సు, ఆయుష్షు, శరీరకాంతి వర్ధకం, ధాతు పుష్టికరం, కేశ వర్థకం. కంఠస్వరాన్ని మెరుగు పరుస్తుంది. బాలింతలలో చనుబాలు (స్తన్యం) కలగడానికి దోహదకారి. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వ్యక్తులకు కూడా హితకరం. (అంటే వ్రణాలు మానడానికి సహాయకారి అని అర్థం). విషహరం కూడా. వాతపిత్త హరం. మధుర రసం ‘గురువు’. అంటే జీర్ణమవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అనంతరం శరీరం బరువుగా ఉంటుంది. అందువలన స్థూలకాయానికి దారి తీస్తుంది. ఆజన్మ సాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం‘ బాలవృద్ధ క్షతక్షీణ, వర్ణ కేశేంద్రియ ఓజసాం.... స్తన్యం సంధానకృత్... ఆయుష్యో.. జీవనః... అతిగా సేవిస్తే... స్థౌల్యం, మధుమేహం, అగ్ని మాంద్యం, ఆంత్రకృతములు, ఇతర కఫ జన్య రోగాలు, కంతులు కలుగుతాయి. సన్యాసం (కోమా) కూడా సంభవించే అవకాశం ఉంది.కురుతే అత్యుపయోగేన సమేదః కఫజాన్, గదాన్‘స్థౌల్య అగ్నిసాద, సన్యాస, మేహ, గండ, అర్బుదాదికాన్‘తీపి ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది? ప్రకృతిసిద్ధ ద్రవ్యాలు: పండ్లు (ఫలాలు): అరటి, సీతాఫలం, సపోటా, పనస, మామిడి, ఖర్జూరం వంటి ఫలాలు అత్యంత మధురంగా ఉంటాయి. అలాగే దానిమ్మ, బొప్పాయి, జామ, ఆపిల్ మొదలైనవి. ద్రవరూప రసంతో ఉండేవాటిలో బత్తాయి, కమలా, ద్రాక్ష, పుచ్చకాయ ప్రధానమైన వి. స్ట్రాబెర్రీ, చెర్రీ, రామాఫలం మొదలైనవి కూడా ఎక్కువ తీపిగా ఉంటాయి. ద్రవాలు: చెరకు రసం, కొబ్బరి నీళ్లు, పాలు, తేనె (కొంచెం వగరు కూడా కలిపి ఉంటుంది) ఔషధ ప్రధానమైనవి: అతి మధురం, శతావరీ (పిల్లి పీచర) మొదలైనవి. ఆహార శాకాలు: తియ్య గుమ్మడి, చిలగడ దుంప, సొరకాయ, బీరకాయ, టొమాటో మొదలైనవి. పప్పులు: నువ్వులు, పెసలు, సెనగలు మొదలైనవి. 2. పిండి వంటలు: వీటి తయారీలో వరి పిండి, గోధుమ పిండి, మైదా పిండి ప్రధాన భూమికలు. పప్పులలో నువ్వులు, మినుములు, పెసలు, సెనగలు, కందుల వంటివి విరివిగా వాడతారు. శర్కర, బెల్లం ప్రధాన పాత్రధారులు. కొన్ని పాయసాలలో పాలు, తేనె, భాగస్వాములు. మరిగించిన నూనెలతో చేసిన డీప్ ఫ్రైలను మిఠాయిలుగా మలుస్తారు. ఉదా: కాజా, లడ్డు, కజ్జికాయ, జిలేబి, అరిసెలు మొదలైనవి. అలాగే పాలు, మీగడలు ప్రధానంగా ఉండే బర్ఫీ, రసగుల్లా, రసమలైల వంటివి కోకొల్లలు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మిఠాయిలు ప్రాచుర్యం పొందుతున్నాయి. చాక్లేట్లు, ఐస్‌క్రీమ్‌ల వంటివి అదోరకం. తెలుగు వారి పిండివంటల్లో... మినపసున్ని, బూరెలు, కొబ్బరి లస్కోరా, అరిసెలు, హల్వాలు అత్యంత ప్రధానమైనవి. చాలా వాటిల్లో నెయ్యి కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది.తీపి ఏదైనా ఒకటే విలువా? ఒకటే ప్రయోజనమా? కాదు, కానే కాదు. ప్రకృతి సిద్ధమైనవి ఆరోగ్యపరంగా ప్రథమ స్థానంలో ఉంటాయి. వీటిలో ఉండే సహజమైన పీచు మరియు ఇతర పదార్థాల వల్ల దేహానికి హాని కలుగదు. పిండివంటల్లో వాడే ఇతర పదార్థాలు (వరి, గోధుమ), నూనె, నెయ్యి... వీటి వల్ల ఆయా మిఠాయిల గుణధర్మాలు మారి, కేలరీలు పెరిగి, శరీరం మీద వివిధ ప్రభావాలు చూపిస్తాయి. మరో విషయం ఏమిటంటే, ‘రిఫైన్డ్ ఆయిల్స్, స్వీట్ కోసం ఎసెన్స్, నిల్వ కోసం రసాయనాలు.. ఇలా ఎన్నెన్నో రసాయనిక పదార్థాలు అతిథులుగా చేరి అపార నష్టం కలిగిస్తాయి. బజారులో, స్వీట్ షాపుల్లో లభించే వాటిలో అత్యధిక శాతం ఇలాంటివే. ఆధునిక జీవ రసాయన శాస్త్రం మిఠాయిలన్నీ కార్బోహైడ్రేట్సు ప్రధానమైనవే. ఇవి ధాతు పరిణామంలో గ్లూకోజ్‌గా మారాల్సిందే. అందుకు ఇన్సులిన్ అవసరం కాబట్టి మధుమేహ రోగులు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రకృతిసిద్ధ మధుర ద్రవ్యాలలో నేరుగా ‘సుక్రోజ్’ ఉంటుంది. (సుక్రోజ్ = ఫ్రక్టోజ్+ గ్లూకోజ్). కాబట్టి వీటి అరుగుదల ధాతుపరిణామాలలో ఇన్సులిన్ అతి తక్కువ పాత్ర పోషిస్తుంది. ఇది గమనించాల్సి ఉంది. గుర్తుంచుకోవలసిన సారాంశం: రసములారింట ‘మధురమ్ము’ రమ్య రసము ప్రకృతి దత్తపు మధురిమల్ వరము మనకు తీపి యెంతేని సర్వదా తృప్తికరము ఆయురారోగ్యసిద్ధికై అగ్రగామి లె గువ వహియించి మితిమీరి తినగవలదు గృహ మిఠాయిలు తినవయ్య ఇంపు మీర అంగడివి యేల దేహ బాధార్తి యేల సప్త ధాతుసారమునకు సహకరించు మినపసున్నిని సేవించు తనివి తీర! అమిత తక్షణ శక్తికై అరటి పండు. డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు -
మీఠా బంధన్
ఇదిగోండి బుజ్జి బుజ్జి మిఠాయిలు. కొరకక్కర్లేదు. నాలుక మీద పెడితే చాలు... అయినా ఈ రోజుల్లో మిఠాయి పెద్దదైతే ముఖాలు చిన్నవవుతున్నాయి... కేలరీలు గట్రా ఎక్కువని!అందుకే ఈ రాఖీకి చిన్న చిట్టి చిన్నారి చ్వీట్లు చిన్నారి జిలేబి కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; పుల్ల పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; మిఠాయి రంగు – చిటికెడు (నీళ్లలో కలిపి కరిగించాలి); నీళ్లు – అర కప్పు + 3 టేబుల్ స్పూన్లు; నూనె లేదా నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – అర కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నిమ్మ రసం – అర టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి, పుల్ల పెరుగు జత చేసి మరోమారు కలపాలి ∙మిఠాయి రంగు కలిపిన నీళ్లు జత చేసి మూత పెట్టాలి ∙(పిండి మరీ పల్చగా ఉండకూడదు. అవసరాన్ని బట్టి మాత్రమే నీళ్లు కలుపుకోవాలి) ∙మిశ్రమాన్ని ఒక రోజు నాననివ్వాలి ∙మరుసటి రోజు మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపి, అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో పంచదార, నీళ్లు వేసి ఉడికించాలి ∙తీగ పాకం వచ్చిన తరవాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, నిమ్మ రసం వేసి కలిపి దింపేయాలి ∙జిలేబి మిశ్రమాన్ని జిలేబి వేసే సీసాలో పోసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక జిలేబి సీసాలోని మిశ్రమాన్ని నూనెలో జిలేబి ఆకారం వచ్చేలా తిప్పుకోవాలి ∙రెండువైపులా దోరగా వేయించిన తరవాత పంచదార పాకంలో వేసి సుమారు రెండు గంటల తరవాత ప్లేటులో అందించాలి. చమ్ చమ్ ఇన్ డాలర్ కావలసినవి: పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – 2 టేబుల్‌స్పూన్లు; పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 4 కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను. స్టఫింగ్ కోసం: పచ్చి కోవా – పావు కప్పు (సన్నగా తురమాలి); పంచదార పొడి – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు రేకలు – 5 (పావు టీ స్పూను పాలలో నానబెట్టాలి); ఏలకుల పొడి – చిటికెడు; పిస్తాచూ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి మంట బాగా తగ్గించి నిమ్మ రసం వేస్తూ కలపాలి ∙పాలు విరిగి నీళ్లు, పాల ముద్ద విడివడతాయి ∙స్టౌ మీద నుంచి దింపేసి, చల్లారాక పల్చటి వస్త్రంలో వేసి, నీరు పూర్తిగా పిండేసి, ఆ వస్త్రానిన గట్టిగా మూట కట్టి, సుమారు గంట సేపు మూట మీద బరువు ఉంచాలి ∙ఇలా చేయడం వల్ల నీరు పూర్తిగా పోతుంది ∙నీరు పోయిన తరవాత ఆ ముద్దను ఒక ప్లేటులోకి తీసుకుని, చేతితో పొడిపొడిగా విడదీయాలి ∙పాల విరుగును చేతితో బాగా కలుపుతూ ముద్ద చేయాలి ∙కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని మనకు కావలసిన ఆకారంలో గుండ్రంగా లేదా పొడవుగా ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వెడల్పాటి పాత్రలో ఒకటిన్నర కప్పుల పంచదార, నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, సన్న మంట మీద కొద్దిగా మరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఉండలను ఒక్కొక్కటిగా పాకంలో వేసి మూత పెట్టాలి ∙సుమారు పది నిమిషాల తరవాత మూత తీసి చమ్చమ్లను చెక్క స్పూనుతో వెనక్కు తిప్పి మూత పెట్టాలి ∙మరో పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙పావు టీ స్పూను ఏలకుల పొడి జత చేసి చల్లారనివ్వాలి ∙కుంకుమ పువ్వుతో అలంకరించాలి. స్టఫింగ్ తయారీ: ∙ఒక పాత్రలో పావు కప్పు పచ్చి కోవా, టీ స్పూను పంచదార పొడి, చిటికెడు ఏలకుల పొడి, పాలలో కలిపిన కుంకుమ పువ్వు వేసి ఒక స్పూనుతో బాగా కలపాలి చమ్చమ్లలో అదనంగా ఉన్న పంచదార పాకాన్ని తీసేయాలి ∙ఒక్కో చమ్చమ్ను చేతిలోకి తీసుకుని చాకుతో మధ్యకి కట్ చేయాలి ∙ఒక టీ స్పూను స్టఫింగ్ మిశ్రమాన్ని అందులో ఉంచి, కొబ్బరి తురుమును పైన చల్లాలి పిస్తాచూ తరుగును సిద్ధంగా ఉన్న చమ్చమ్ల పైన చల్లి, చేతితో మృదువుగా అదమాలి ∙కావాలనుకుంటే నీళ్లలో కలిపిన కుంకుమపువ్వుతో గార్నిష్ చేసుకోవచ్చు. పైనాపిల్ బర్ఫీ కావలసినవి: పైనాపిల్ స్లయిసులు – 4; పాలు – ఒక లీటరు; నెయ్యి – కొద్దిగా; పెరుగు – అర టీ స్పూను; పంచదార – ఒక కప్పు; నిమ్మ ఉప్పు – రెండు చిటికెలు; పైనాపిల్ ఎసెన్స్ – నాలుగు చుక్కలు. తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి వేడి చేసి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక అందులో పెరుగు వేయాలి ∙ఈ మిశ్రమాన్ని స్టౌ మీద ఉంచి చిక్కపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙మిశ్రమం సగానికి తగ్గిన తరవాత పంచదార జత చేయాలి నిమ్మ ఉప్పు కూడా వేసి బాగా కలపాలి మిశ్రమం బాగా గట్టిపడేవరకు ఉడికించాలి ∙పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలిపి, నెయ్యి రాసిన పాత్రలో సగం మిశ్రమం పోయాలి తరిగి ఉంచుకున్న పైనాపిల్ స్లయిసెస్‌ను మిశ్రమం మీద ఉంచి, మిగిలిన సగం మిశ్రమం ఆ పైన వేయాలి ∙మిశ్రమాన్ని సమానంగా పరిచి చల్లారనివ్వాలి కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. లౌకీ కలాకండ్ కావలసినవి:సొరకాయ – ఒకటి (తొక్క తీసి సన్నగా తురమాలి); పంచదార – అర కప్పు; కోవా – పావు కిలో; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; బాదం + పిస్తాచూ తరుగు – కొద్దిగా; కుంకుమపువ్వు – పావు టీ స్పూను; మిఠాయి రంగు – పావు టీ స్పూను (కొద్దిగా నీళ్లలో కలపాలి); ఏలకుల పొడి – అర టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో సొరకాయ తురుము, నీళ్లలో కలిపిన మిఠాయి రంగు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙కొద్దిగా చల్లారాక నీరు పిండి తీసేసి, అర కప్పు పంచదార జత చేసి పక్కన ఉంచాలి ∙పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద సుమారు పది నిమిషాల సేపు మరిగించాక, బొంబాయి రవ్వ వేసి కలిపి దింపేయాలి ∙పెద్ద బాణలిలో సొరకాయ మిశ్రమం వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, పాలు జత చేసి బాగా కలపాలి ∙వెడల్పాటి పళ్లానికి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న కలాకండ్ మిశ్రమం పోసి సమానంగా పరవాలి ∙బాదం తరుగు, పిస్తాచూ తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో ఉంచాలి ∙గంట సేపయ్యాక బయటకు తీసి కావలసిన ఆకారంలో కట్ చేయాలి. ఖీర్ కదమ్ కావలసినవి పచ్చి కోవా – ఒక కిలో; పాలు – 2 లీటర్లు; కుంకుమ పువ్వు – కొద్దిగా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార – ఒక కిలో; పంచదార పొడి – 4 టీ స్పూన్లు; కొబ్బరి తురుము – తగినంత; మిఠాయి రంగు – 4 చుక్కలు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ∙మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచాలి ∙పాలు పోసి మరిగించాక, నిమ్మ రసం వేసి కలపాలి ∙పాలు విరిగాక ఒక వస్త్రంలో కట్టి, నీళ్లు పిండేసి పనీర్ తయారు చేసుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా రసగుల్లాలను చేసుకుని పక్కన ఉంచాలి ∙మరొక పాత్రను స్టౌ మీద ఉంచి నీళ్లు, పంచదార వేసి తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙కుంకుమ పువ్వు, మిఠాయి రంగు వేసి కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న రసగుల్లాలను పంచదార పాకంలో వేసి సుమారు గంటసేపు ఉంచాలి ∙స్టౌ మీద ఒక నాన్‌స్టిక్ పాన్‌లో కోవా వేసి కొద్దిగా రంగు మారేవరకు కలపాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేయాలి. చిట్టి కాజా కావలసినవి మైదా పిండి – ఒక కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – పావు కప్పు + 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; బియ్యప్పిండి – కొద్దిగా; పంచదార పాకం కోసం; పంచదార – 2 కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ¯ð య్యి వేసి ఉండలు లేకుండా కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి, గంట సేపు పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి ∙వేరొక పాత్రలో బియ్యప్పిండి, నెయ్యి వేసి ముద్దలా చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని ఉండలుగా చేసి, ఒక్కో ఉండ తీసుకుని చపాతీల మాదిరిగా అన్నిటినీ ఒత్తుకోవాలి ∙బియ్యప్పిండి ముద్దను ఒక చపాతీ మీద పూసి ఆ పైన మరో చపాతీ ఉంచి దాని మీద మళ్లీ బియ్యప్పిండి ముద్ద పూయాలి ∙ఈ విధంగా ఐదు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక, రోల్ చేయాలి ∙అంగుళం మందంలో ముక్కలుగా కట్ చేసి, మధ్య భాగంలో కొద్దిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కాజాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేసి రెండు మూడు గంటలయ్యాక బయటకు తీసి ప్లేట్లో అందించాలి. గవ్వలు కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; మైదా పిండి – 2 కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు/పంచదార – ఒక కప్పు; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒకపాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి.నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙గవ్వలు తయారుచేసుకునే బల్ల మీద ఒక్కో ఉండను గవ్వ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న గవ్వలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం తరుగు/పంచదార వేసి స్టౌ మీద ఉంచి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి ∙తయారుచేసిన గవ్వలను బెల్లం పాకంలో వేసి చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. స్వీట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; నానబెట్టిన సెనగ పప్పు – అర కప్పు; పంచదార పొడి/బెల్లం తరుగు – అర కప్పు; కరిగించిన నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు (ముక్కలు చేయాలి); కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10 (నీళ్లలో నానబెట్టి, తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి); ఏలకుల పొడి – టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి పూరీ పిండిలా కలిపి, సుమారు అర గంట సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి ∙సెనగపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించి దింపేయాలి చల్లారాకి నీరు ఒంపేసి సెనగ పప్పును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మెత్తగా చేసిన సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙నెయ్యి వేరుపడుతున్నట్లుగా అనిపించాక కిందకు దింపి చల్లారాక డ్రై ఫ్రూట్స్ ముక్కలు, బెల్లం తరుగు/పంచదార పొడి, ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి, వేరొక పాత్రలోకి తీసి, పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి దీర్ఘచతురస్రాకారంలో సన్నగా పొడవుగా ఒత్తుకుని, సమోసా ఆకారం వచ్చేలా మడతలు వేయాలి ∙ఒక టీ çస్పూను స్టఫింగ్ మిశ్రమం అందులో ఉంచి అంచులు మూసేయాలి (అంచులను నీటితో తడి చేస్తే గట్టిగా అతుకుతుంది ∙ఇలా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొద్దిగా చల్లారాక అందించాలి. రాఖీ మిఠాయిలను ఇలా అందంగా అలంకరించండి... రక్షాబంధన్‌ను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకోగానే, రకరకాల మిఠాయిలు తయారుచేసి, పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటారు. ఈ మిఠాయిలను చేసినవి చేసినట్లుగా కాకుండా, వాటిని అందంగా అలంకరిస్తే, మిఠాయిలు రుచిగానే కాకుండా, కనువిందు కూడా చేస్తాయి. ∙మోతీచూర్ లడ్డూ వంటి వాటిని బాదం, జీడిపప్పు, పిస్తా తరుగులతో అలంకరించాలి. ∙లడ్డూలను ప్లేట్లో ఉంచాక, చుట్టూ గులాబి రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. ∙గులాబ్‌జామ్, రసగుల్ల వంటివాటిని కొబ్బరి తురుముతో గార్నిష్ చేయాలి. ∙వంటకం పూర్తి చేసి, ప్లేట్లో అందించేటప్పుడు గార్నిషింగ్ చేస్తే తాజాగా ఉంటుంది. ∙రాఖీ పండుగ ప్రతిబింబించేలా మీరు తయారుచేసే స్వీట్లను రాఖీ ఆకారంలో తయారుచేస్తే, మిఠాయిలోనే పండుగ కనిపిస్తుంది. ∙బర్ఫీ, పేడా వంటి వాటి మీద రాఖీ డిజైన్ చేసి, చుట్టూ పంచదార పాకంతో డిజైన్ చేశాక, కొబ్బరి తురుమును చల్లి, చివరగా ఒక చెర్రీ ఉంచితే, నోటికి విందు చేసే రాఖీ తయారయినట్లే. – డా. బి. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్) -
స్వీట్లు, రొయ్యలంటే ప్రాణం!
న్యూఢిల్లీ: అటల్జీ మంచి భోజన ప్రియుడని వాజ్‌పేయి సన్నిహితులు, విలేకరులు గుర్తు చేసుకున్నారు. ఆయనకు స్వీట్లు, రొయ్యలంటే మహా ఇష్టమని చెప్పారు. సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ మాట్లాడుతూ.. ‘ప్రధానిగా ఉన్న సమయంలో ఓ అధికారిక కార్యక్రమం తర్వాత భోజనం కోసమని నేరుగా ఫుడ్ కౌంటర్ వద్దకు వెళ్లారు అటల్జీ. ఆప్పుడు ఆయన ఆహార నియమాలు పాటిస్తున్నారు. దీంతో అతని సిబ్బంది ఓ ఆలోచన చేశారు. వెంటనే అక్కడున్న బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌ను పరిచయం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ సినిమాల గురించి మాట్లాడుతుండగా.. అక్కడున్న స్వీట్లను సిబ్బంది దాచేశారు’అని చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడి స్థానికంగా లభించే ఆహార పదార్థాలను తింటానని పట్టుబట్టేవారని అటల్జీతో పని చేసిన అధికారులు గుర్తు చేసుకున్నారు. ‘కోల్‌కతాలో పుచ్‌కాస్, హైదరాబాద్‌లో బిర్యా నీ, హలీమ్, లక్నోలో గలోటి కబాబ్స్ ఆయన తినేవారు. చాట్ మసాలా దట్టించిన పకోడాలు, మసాల టీ కాంబినేషన్ ఆయనకు భలే ఇష్టం’ అని ఓ అధికారి చెప్పారు. ‘ఎన్నోసార్లు అటల్‌జీనే స్వయంగా మాకు వండిపెట్టారు. మాంసాహారం గానీ, స్వీట్‌గానీ ఏదో ఒకటి మా కోసం వండేవారు’ ఓ జర్నలిస్టు అన్నారు. కేబినెట్ భేటీల్లో వేరుశనగలు తినేవారు ‘కేబినెట్ సమావేశాల సమయంలో అటల్జీ ఉప్పుతో దట్టించిన వేరుశనగ కాయాలు తినేవారు. ఖాళీ అయినాకొద్దీ తీసుకురమ్మనేవారు’అని అటల్జీతో పనిచేసిన ఓ సిబ్బంది చెప్పారు. ‘అటల్ తన సన్నిహితుడు లాల్జీ లాండన్‌ను లక్నోలోని చౌక్ నుంచి కబాబ్స్ తీసుకురమ్మనేవారు. కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఆయన కోసం ఢిల్లీ నుంచి బెడ్నీ ఆలూ, చాట్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యలు తీసుకొచ్చేవారు’అని మరో సన్నిహితుడు చెప్పారు. వాజ్‌పేయితో ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓ జర్నలిస్టు మాట్లాడుతూ.. ‘నేను చూసిన వారిలో చాలా రిలాక్స్డ్ ప్రధాని’అన్నారు. ఆయన అనారోగ్యంగా ఉన్నా కాజూ, సమోసాలు తినేవారని మరో సన్నిహితుడు చెప్పారు. -
మీఠా దావత్
జుబాన్ మీఠా హై తో జమానా మీఠా హై మాట తియ్యనిదైతే అందరి మనసులు తియ్యగా ఉంటాయి. ఇంకో వారం రోజుల్లో రంజాన్ మనకి కష్టం ఉన్నా ఇతరులకు తీపి పంచే ఔదార్యం ఉన్న పండుగ. అలాంటి గొప్ప పండుగ చేసుకునే మనందరికీ ఇదిగో ... ఏక్ మీఠా దావత్ ! కాజు హల్వా కావలసినవి :జీడి పప్పులు – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; నీళ్లు – మూడున్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; పంచదార – ఒక కప్పు; కుంకుమ పువ్వు – మూడు నాలుగు రేకలు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; బాదం పప్పు తరుగు – పావు టీ స్పూను. తయారీ: ∙జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నీళ్లు పోసి మరిగాక, పంచదార వేసి బాగా కరిగేవరకు కలుపుతుండాలి ∙కుంకుమ పువ్వు జత చేసి మరో నిమిషం పాటు మరిగించి కిందకు దింపేయాలి ∙స్టౌ మీద వెడల్పాటి పాత్రను వేడి చేసి, అందులో నెయ్యి వేసి కరిగాక మైదాపిండి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుతుండాలి ∙మిశ్రమం గోధుమరంగులోకి మారేవరకు ఐదారు నిమిషాలు ఉడికించాక, పంచదార పాకం జత చే సి మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, బాదం పప్పు తరుగు జత చేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని వేరొక పాత్రలోకి తీసుకుని వేడిగా కాని చల్లగా కాని అందించాలి. ఫ్రూట్ ఖీర్ కావలసినవి :బియ్యం – ఒకటి ముప్పావు కప్పులు; పాలు – ఒక లీటరు; బటర్ – 2 టేబుల్ స్పూన్లు; సపోటా ముక్కలు – పావు కప్పు; అరటి పండు ముక్కలు – పావు కప్పు; ఆపిల్ ముక్కలు – పావు కప్పు; కిస్మిస్ ద్రాక్ష – పావు కప్పు; మామిడి పండు ముక్కలు – పావు కప్పు; పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; రోజ్ సిరప్ – ఒక టీ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద పాన్‌లో బటర్ వేసి కరిగాక పండ్ల ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి ∙ఒక టేబుల్ స్పూను పంచదార జత చేసి కొంతసేపు ఉడికించి, సర్వింగ్ డిష్‌లోకి తీసుకోవాలి ∙అదే పాన్‌లో బియ్యం వేసి దోరగా వేయించాలి. (అవసరమనుకుంటే మరి కాస్త బటర్ జత చేయొచ్చు) ∙పాలు జత చేసి అన్నం బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి కొద్దిగా నీళ్లల్లో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలపాలి ∙మిగిలిన పంచదార జత చేసి మరోమారు కలపాలి ∙రోజ్ సిరప్ జత చేసి, తయారుచేసి ఉంచుకున్న పండ్ల ముక్కల మీద వేయాలి ∙పిస్తా ముక్కల తరుగుతో అలంకరించి, చల్లగా అందించాలి. షాహీ టుక్డా కావలసినవి:రబ్రీ కోసం: పాలు – లీటరు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; పాల పొడి – 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా పంచదార పాకం కోసం: పంచదార – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను టుక్డా కోసం: బ్రెడ్ స్లయిసెస్ – 6 ; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: బాదం పప్పులు – 15; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ: ∙ఒక పాత్రలో కప్పుడు నీళ్లు పోసి మరిగించాలి ∙మరుగుతున్న నీటిలో పిస్తా పప్పులు, బాదం పప్పులు వేసి ఒకసారి కలిపి దింపేసి, మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙చల్లారాక బాదం పప్పులు, పిస్తా పప్పుల తొక్క తీసేయాలి. రబ్రీ తయారీ ∙వెడల్పాటి పాత్రలో లీటరు చిక్కటి పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేసి కలిపి దింపేయాలి ∙పంచదార జత చేసి కరిగేవరకు బాగా కలిపి బాదం పప్పుల తరుగు, పిస్తా తరుగు, రోజ్ వాటర్ వేసి కలపాలి. (నోట్: చిక్కగా, చక్కగా, రుచిగా తయారుకావడానికి సుమారు గంట సమయం పడుతుంది. మీగడ వచ్చినప్పుడల్లా తీసి పక్కన ఉంచాలి. అప్పుడు పాలు గోధుమవర్ణంలోకి మారవు. మరగడం పూర్తయ్యాక మీగడ జత చేయాలి) టుక్డా తయారీ ∙బ్రెడ్ చుట్టూ ఉండే గట్టి పదార్థాన్ని తీసేసి, ముక్కలుగా కట్ చేయాలి ∙స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక బ్రెడ్ ముక్కలను రెండువైపులా కాల్చి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.షాహీ టుక్డా కోసం పంచదార పాకం తయారీ ∙ఒక పాత్రలో అర కప్పు పంచదార, అర కప్పు నీళ్లు వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, మరిగించి తీగ పాకం వచ్చాక దింపేయాలి ∙ఏలకుల పొడి జత చేయాలి ∙బ్రెడ్ ముక్కలు జత చేసి బాగా కలపాలి. షాహీ టుక్డా తయారీ ∙పంచదార పాకంలో బ్రెడ్ ముక్కలు మునిగేలా వేసి కొద్దిసేటి తరవాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙వాటి మీద రబ్రీ సమానంగా పోయాలి ∙బాదం తరుగు, పిస్తా తరుగులతో అందంగా అలంకరించాలి ∙అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అందించాలి. బ్రెడ్ హల్వా కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – 4; పంచదార – పావు కప్పు; కరిగించిన నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 5; నీళ్లు – అర కప్పు తయారీ:బ్రెడ్ స్లయిసెస్ అంచులను తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙బ్రెడ్ స్లయిసెస్ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, చల్లారాక ముక్కలు చేసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి ∙కొద్దికొద్దిగా బబుల్స్‌లా వస్తుండగా, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి ∙బ్రెడ్ ముక్కలు మెత్తగా అయ్యేలా గరిటెతో మెదపాలి ∙ఉడుకుతుండగా, ఒక్కో స్పూను నెయ్యి వేస్తూ కలపాలి ∙బాగా ఉడికిందనిపించాక, వేయించిన జీడిపప్పులు జత చేసి ఒకసారి కలిపి దింపేయాలి. స్వీట్ కోకో బర్ఫీ కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; కోకో పౌడర్ – అర కప్పు; పాలు – తగినన్ని; బాదం పప్పుల తరుగు – ఒక టీ స్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు తయార:∙మందపాటి పాత్రను వేడి చేసి, నెయ్యి వేసి కరిగించి మంట బాగా తగ్గించాలి ∙మైదా పిండి జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకువేయించి, పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో పాలు పోసి సన్న మంట మీద మరిగించాక, పంచదార జత చేసి కరిగించాలి ∙పాలుకొద్దిగా చిక్కబడ్డాక, మైదా పిండి, కోకో పొడి జత చేసి ఉండ కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, అందులో ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరిచి, బర్ఫీ ఆకారంలో కట్ చేయాలి ∙చల్లారాక ముక్కలను జాగ్రత్తగా తీసి, బాదం పప్పుల తరుగుతో అలంకరించి అందించాలి. ఖజూర్ హల్వా కావలసినవి: గింజలు లేని ఖర్జూరాలు – 200 గ్రా.; పాలు – ఒక కప్పు; పంచదార పొడి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – పావు కప్పు; జీడి పప్పులు – 100 గ్రా.; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో పాలు, ఖర్జూరాలు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙మంట బాగా తగ్గించి పాలు చిక్కబడి, ఖర్జూరాలు ఉడికే వరకు కలుపుతుండాలి ∙మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార పొడి, నెయ్యి, జీడిపప్పులు వేసి బాగా కలిపి మరోమారు ఉడికించాలి ∙ఏలకుల పొడి జత చేసి కలిపి దింపేయాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో పోసి పల్చగా పరవాలి ∙బాగా చల్లారాక, కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి అందించాలి. షీర్ ఖుర్మా కావలసినవి :పాలు – అర లీటరు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; రోస్టెడ్ సేమ్యా – అర కప్పు; జీడిపప్పులు – 8; బాదం పప్పులు – 10 (ముక్కలు చేయాలి); అన్ సాల్టెడ్ పిస్తా – 10 (ముక్కలు చేయాలి); గింజలు లేని ఖర్జూరాలు – 10; ఏలకుల పొడి – టీ స్పూను; చిరోంజీ – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి ∙ఒక పాత్రలో సన్న మంట మీద పాలు మరిగించి, చిక్కబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙రోస్టెడ్ సేమ్యా, పంచదార జత చేసి బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలపాలి ∙డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, రోజ్ వాటర్ జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙పంచదార తక్కువగా అనిపిస్తే మరికాస్త జతచే సుకోవచ్చు ∙షీర్ ఖుర్మా బాగా చల్లారాక కుంకుమ పువ్వుతో అలంకరించి అందించాలి. రోజ్ ఫిర్నీ కావలసినవి:బాదం పప్పులు – 10; బాస్మతి బియ్యం – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు + రెండున్నర కప్పులు; పంచదార – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా (ఒక టీ స్పూను పాలలో కలపాలి); రోజ్ వాటర్ – కొద్దిగా. గార్నిషింగ్ కోసం బాదం పప్పుల తరుగు – టీ స్పూను; పిస్తా తరుగు – టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ: మిక్సీలో బాదం పప్పులు, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసి చిన్న పాత్రలోకి తీసుకోవాలి ∙బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అర గంట సేపు నానబెట్టాక, నీరు ఒంపేయాలి ∙మిక్సీ జార్లో బియ్యం, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసి, చిన్న పాత్రలోకి తీసి, అర కప్పు పాలు జత చేయాలి ∙రెండున్నర కప్పుల పాలను ఒక పెద్ద పాత్రలో పోసి, స్టౌ మీద ఉంచి, పాలు మరుగుతుండగా, పాలు+బియ్యం మిశ్రమం జత చేసి, మంట తగ్గించి, ఆపకుండా కలుపుతుండాలి ∙సుమారు ఏడు నిమిషాల తరువాత మిశ్రమం చిక్కగా మారుతుంది ∙పంచదార, ఏలకుల పొడి, పాలలో కలిపిన కుంకుమపువ్వు జత చేసి మరోమారు కలపాలి ∙బాదం పప్పు పేస్ట్, రోజ్ వాటర్ జత చేసి, కొద్దిసేపు ఉడికించి దింపేయాలి ∙తయారయిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ∙పైన మూత పెట్టి, ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచి, బయటకు తీసి చల్లగా అందించాలి.(ఇంటికి వచ్చిన అతిథికి రాత్రి భోజనం తరువాత ఫిర్నీ అందిస్తే, పండుగ భావన కలుగుతుంది). వంటింటి చిట్కాలు బియ్యం, తృణధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి n పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా మారితే, దాని మీద సబ్బు నీళ్లు పోసి సన్నటి సెగ మీద ఉంచి, చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది n రాగి సామగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి n పచ్చి బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి n చపాతీలు ఒత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనె వేసి మడతలుగా చేసి కాల్చి, హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడు గంటలపాటు మెత్తగా ఉంటాయి n చపాతీ పిండిలో ఉడికిన బంగాళదుంపను వేసి బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి n పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక అరటిపండు, సాయంత్రం వెలగపండు తింటే అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు n పెరుగు పచ్చడి మరింత రుచిగా రావాలంటే, పోపులో టీ స్పూను నెయ్యి కలిపితే సరి n గులాబ్‌జామ్ తయారుచేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ జత చేస్తే, మృదువుగా, రుచిగా ఉంటాయి n దోసెల పిండి బాగా పులిస్తే, అందులో రెండు టీ స్పూన్ల గోధుమపిండిని కలిపితే రుచిగా వస్తాయి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. – నిర్వహణ వైజయంతి పురాణపండ -
తీయని బంధం
నేస్తరికం.. పెళ్లి కన్నా ఘనమైన సంబరం. బారసాల కంటే అపురూపమైన వేడుక. పుట్టిన రోజు కంటే విలువైన కార్యక్రమం. ఓ స్నేహితుడిని వెతుక్కుని, శాస్త్రబద్ధంగా అతడు లేదా ఆమెతో నేస్తరికాన్ని కట్టుకోవడం, ఆ విషయాన్ని ఊరంతా చాటింపు వేయడం సిక్కోలు విశిష్ట సంప్రదాయానికి ప్రతీక. ఈ సంప్రదాయంలో మరింత ప్రత్యేకమైనవి నెయ్యి చెక్కీలు. ఆనందకరమైన సందర్భాన్ని మరింత ఆనందంగా చేస్తుందీ పదార్థం. ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా ఉద్దానంలో నెయ్యి చెక్కీ తిననిదే సంక్రాంతి పూర్తి కాదు. రండి ఇంకాస్త లోతుగా వెళ్దాం.. నేస్తం.. నేస్తురాలు.. మిత్రాలు.. మిత్తన్న.. మొఖరా.. మనకు చాలా పరియమైన పదాలు. మర్చిపోతున్న పదాలు కూడా. సిక్కోలు విశిష్ట సంప్రదాయానికి ఈ పదాలే ప్రతీకలు. కులాలు, మతాలు, రక్త సంబంధాలతో పనిలేకుండా ఒకరికొకరు ఆప్యాయంగా పిలుచుకునే మానవ సంబంధాల వరసలు ఇవి. కులాలు వేరైనా, మతాలు వేరైనా ఒకే పోలికతో ఉంటే వారి మధ్య అన్నదమ్ముల అనుబంధాలకు ‘నేస్తం’ అనే సంబంధాన్ని కలుపుతారు. అప్పటి నుంచి వారి మధ్య ‘నేస్తరికం’ సాగుతుం. అదే విధంగా బావ, బావ మరదళ్లు వరుస అయితే అందుకు ‘మొఖరా’ అనే పదంతో పిలుస్తారు. వీరి అనుబంధాలు కలకాలం ఉడాలనే ఉద్దేశంతో ఏటా సంక్రాంతి మకర సంక్రమణం నుంచి నెయ్యిలతో తయారు చేసిన పేలాల చెక్కీలు ‘నెయ్యి చెక్కీలు’ ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ చెక్కీలనే మువా చెక్కీలు అని కూడా అంటారు. ఎలా చేస్తారంటే..? ధాన్యంను దోరగా వేయించి వచ్చిన నెయ్యిలు(మువాలు)ను వేరే బానలో పోసి వాటిలో పంచదార లేక బెల్లం పాకంగా మార్చి వివిధ ఆకృతుల్లో చెక్కీలను తయారు చేస్తారు. వాటిపై ఎండు కొబ్బరి(కురడీ) ముక్కలను పలుచగా కోసి అద్దుతారు. వాటిపైనే జీడిపప్పును సైతం క్రమంగా అమర్చి అందంగా తయారు చేస్తారు. స్థానికంకా ఈ చెక్కీలు తయారు చేస్తున్నప్పటికీ ఆంధ్రా సరిహద్దులో ఇచ్ఛాపురం ఉండటంతో నిత్యం వందల సంఖ్యలో బరంపురం నుంచి ఈ చెక్కీలు దిగుమతి అవుతుంటాయి. ధరలు సైతం సైజును బట్టి రూ.20 నుండి 200 రూపాయల వరకు ధర పలుకుతాయి. ఇక్కడ నుండే శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కోల్కత్తా వంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. బరంపురం చెక్కీలకే గిరాకీ సంక్రాంతి వచ్చిందంటే చాలు మువా చెక్కీలకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. లోకల్‌గా తయారు చేసిన చెక్కీల కంటే బరంపురం చెక్కీలకే ఎక్కువ గిరాకీ ఉంటోంది. ఇవి చాలా ధృడంగానూ, రుచికరంగానూ ఉంటాయి. ఒక్కో చెక్కీ రెండు నెలలు వరకు చెక్కుచెదర కుండా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వ్యాపారం కూడా బాగుంటుంది. – సిఆర్.గౌడ, చెక్కీల అమ్మకందారుడు, ఇచ్ఛాపురం -
వియ్యాలవారి విందు.. ఓహొహో మనకే ముందు!
సాక్షి, హైదరాబాద్: 78 రకాల లడ్డూలు.. 66 రకాల హల్వాలు.. 74 రకాల పాయసాలు.. మరెన్నో రకాల స్వీట్లు నగరవాసుల నోరూరించాయి. దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. మూడు రోజులపాటు సాగే ఈ ఫెస్టివల్‌ను సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ప్రారంభించారు. మిఠాయిల పండుగలో వెయ్యికి పైగా స్వీట్లను ప్రదర్శించారు. కాకినాడ కాజా, బందరు లడ్డూలు, పలురకాల పాయసాలు, 220 రకాల డ్రై ఐటమ్స్, 446 రకాల సెమీ లిక్విడ్ హల్వాలు, 60 రకాల జ్యూస్‌లు, పానకాలు ఘుమఘుమలాడాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీలు, బెంగాలీలు, రాజస్తానీలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక అసోసియేషన్స్ తమ సంప్రదాయ మిఠాయిలను ప్రదర్శనకు తీసుకువ చ్చాయి. వీటి కోసం 720 విక్రయశాలలు ఏర్పాటు చేశారు. అలాగే 12 అంతర్జాతీయ స్టాల్స్‌ను ఉంచారు. తొలిరోజు ఫెస్టివల్‌ను సందర్శించిన 25 వేల మందికిపైగా ప్రజలు.. అద్భుతం.. అమోఘం అంటూ లొట్టలేస్తూ మిఠాయిలు లాగించేశారు. రుచులు, కళలపై ప్రత్యేక ముద్ర రుచులు, కళలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముద్రను వేస్తూ ముందుకు సాగుతోందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. మిఠాయిలు ఓ ప్రాంతానికి పరిమితం కావని, భాగ్యనగరం కూడా అందరికీ చెందినదని చెప్పారు. ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా జరగని మిఠాయిల పండుగకు హైదరాబాద్ వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. నగరవాసుల జీవితాల్లో ఈ స్వీట్ ఫెస్టివల్ ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ.. 15 దేశాలు, 25 రాష్ట్రాలకు చెందిన వెయ్యి రకాల మిఠాయిలను ఒకే చోట చూసే, తినే అవకాశం రావడం అద్భుతమేనని చెప్పారు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ వివిధ దేశాల వారి కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్వీట్ స్టాల్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్వీట్ ఫెస్టివల్ వైస్ చైర్మన్ మామిడి హరికృష్ణ, ఈవెంట్స్ కన్వీనర్ అభిజిత్, టూరిజం కమిషనర్ సునీత భగవత్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో మరో వేడుక
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత మరో ప్రపంచస్థాయి వేడుకకు నగరం వేదిక కానుంది. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. ప్రతి రాష్ట్రం నుంచి 50 రకాల స్వీట్లను వేడుకల్లో ప్రదర్శించనున్నారు. 1000 రకాల స్వీట్లను అమ్మకానికి ఉంచనున్నారు. దీనికి లక్ష మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన పలు రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిగిన సమీక్షలో వేడుకల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. -
పాకం కుదిరింది పండగ అదిరింది
జీవితం ఎప్పుడూ మనిషిని ఫ్రై చేస్తుంటుంది. బాణలిలో పడేసి బాధిస్తుంటుంది. సలసలలాడే సమస్యల్లో తిరగేస్తుంటుంది. దీపావళి రోజు ఇవన్నీ మర్చిపోండి. పిండిని కలపండి.. నూనెలో వేయించండి. పాకం పట్టించండి.. నోటిలో దట్టించండి. ఎంజాయ్.. హ్యాపీ అండ్ స్వీట్ దీపావళి!! జాంగ్రీ కావలసినవి: మినప్పప్పు – 150 గ్రాములు, బియ్యప్పిండి – 50 గ్రాములు, కార్న్‌ఫ్లోర్ – 150 గ్రాములు, రెడ్ ఆరెంజ్ కలర్ – చిటికెడు (టేబుల్ స్పూన్ నీళ్లలో కరిగించి, కలపాలి), కాటన్ క్లాత్ – జాంగ్రీ చేయడానికి పాకం: పంచదార – ముప్పావు కేజీ, పాలు – అర కప్పు, రోజ్ ఎసెన్స్ – పావు టీ స్పూన్ లేదా యాలకుల పొడి – టీ స్పూన్ తయారి: ∙మినప్పప్పును గంట సేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టి, పిండి మృదువుగా అయ్యేలా రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ∙పంచదారలో అర కప్పు పాలు, నీళ్లు పోసి కరిగేవరకు కలిపి, పొయ్యి మీద పెట్టాలి. పాకం తయారయ్యాక మంట తీసేయాలి. దీంట్లో రోజ్ ఎసెన్స్ లేదా యాలకులపొడి వేసి కలపాలి ∙క్లాత్కి మధ్య చిన్న బటన్ హోల్ చేయాలి. రంధ్రం పెద్దగా కాకుండా ఉండటానికి చుట్టూ కుట్టాలి ∙రుబ్బుకున్న పిండిలో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఆరెంజ్ కలర్ వేసి చేత్తో బాగా కలపాలి ∙వెడల్పాటి మూకుడు పొయ్యి మీద పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న పిండిని హోల్ చేసిన క్లాత్ మధ్యలో వేసి మూటలా చేయాలి ∙కాగుతున్న నూనెలో పిండి ఉన్న క్లాత్ చుట్టను ఒత్తుతూ రింగులు రింగులుగా పిండాలి. ముందు చిన్న చిన్నగా ఒత్తుకుంటే జాంగ్రీలు విరిగిపోవు. వీటిని రెండువైపులా వేయించుకొని తీయాలి. పొడవాటి ఇనుప చువ్వతో జాంగ్రీలు తీసి, పాకంలో ముంచి, తీయాలి. జిలేబీ కావలసినవి: మైదా – పావుకేజీ, శనగపిండి – 25గ్రాములు, నెయ్యి – అర కేజీ, చక్కెర – అర కేజీ, యాలకుల పొడి– అర టీ స్పూన్, కుంకుమపువ్వు – చిటికెడు తయారి: ∙మైదా, శనగపిండిని తగినంత నీటితో ముద్దగా కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం లోతు లేకుండా అడుగు చదరంగా ఉన్న పెనంలో నెయ్యి పోసి, వేడి చేయాలి. మైదా, శనగపిండి మిశ్రమాన్ని మెహిందీకి వాడే కోన్లాగా కాని, సన్న చిల్లు పెట్టిన మందపాటి వస్త్రంలో కాని వేసి కావలసిన ఆకారంలో నేతిలో చుట్లుగా తిప్పాలి. కరకరలాడే వరకు వేగిన తర్వాత తీసి పాకంలో వేయాలి. పాకం పీల్చుకోవడం కోసం పది నిమిషాలు ఉంచి తీయాలి. బాణలిలో నేతిని వేడి చేసేటప్పుడే మరొక స్టవ్ మీద చక్కెరపాకం తయారుచేసుకుంటే మంచిది. ఈ పాకంలో యాలకుల పొడివేసుకుంటే రుచి పెరుగుతుంది. ∙జిలేబీలను పాకంలో నుంచి తీసిన తర్వాత కుంకుమపువ్వుతో గార్నిష్ చేసుకోవచ్చు. గులాబ్ జామూన్ కావలసినవి: పాలపొడి – ఒక కప్పు, మైదా – పావు కప్పు, గోధుమపిండి – పావుకప్పు, వెన్న – మూడు టేబుల్ స్పూన్లు, పాలు – పావుకప్పు, చక్కెర – రెండు కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, యాలకులు– నాలుగు (పొడి చేయాలి), బాదం పప్పులు – పది (సన్నగా పొడవుగా తరగాలి), నెయ్యి – వేయించడానికి సరిపడినంత తయారి: ∙ఒక పాత్రలో పాల పొడి, మైదా, గోధుమ పిండి వేసి సమంగా కలిపిన తర్వాత వెన్న వేసి మళ్లీ కలపాలి. దీంట్లో పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మిశ్రమంలోఎక్కడా పిండి ఉండలు లేకుండా అంతా సమంగా మృదువుగా ఉండేటట్లు కలుపుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ టైమ్‌లో పాల పొడి, పాలతో కలుస్తుంది. ఈలోపుగా పాకం సిద్ధం చేసుకోవాలి. చక్కెర పాకం: ∙వెడల్పుగా ఉన్న పాత్రలో చక్కెర, నీళ్లు పోసి మరిగించాలి. చక్కెర కరిగి, రెండు వేళ్లతో తాకి చూసినప్పుడు పాకం అతుక్కుంటున్న దశలో యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి అది వేడయ్యే లోపుగా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను కాగిన నేయ్యిలో సన్నని మంట మీద ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేయించి తీయాలి. సిద్ధంగా ఉంచిన వేడి వేడి పాకంలో ఉండలను వేసి పైన మూత పెట్టాలి. తర్వాత సర్వ్ చేయాలి. నోట్: జామూన్లు వేగేటప్పుడు, పాకం పీల్చుకునేటప్పుడు వాటి పరిమాణం పెరుగుతాయి. కాబట్టి నేయ్యిలో వేయించేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా తీసుకున్న నేతిపరిమాణాన్ని బట్టి కొన్ని వేసి తీశాక మరికొన్ని వేసి వేయించాలి. పాకం గారెలు కావలసినవి: మినప్పప్పు – కప్పు, బెల్లం – కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙మినపప్పును కడిగి, 4 గంటల సేపు నానబెట్టాలి ∙నీళ్లు లేకుండా వడకట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. మధ్య మధ్య కొన్ని నీళ్లు వాడుకోవచ్చు ∙కొన్ని నీళ్లు తీసుకొని, దాంట్లో బెల్లం తరుగు, యాలకు పొడి వేసి బాగా కలపాలి ∙బెల్లం కరిగాక, పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాకం బాగా చిక్కగా అయ్యేంతవరకు ఉంచి, మంట తీసేయాలి ∙కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. నిమ్మకాయంత పరిమాణంలో మిండిముద్దలు తీసుకొని గుండ్రంగా చేసి, తర్వాత అరచేత్తో లేదా అరటిఆకులో వేసి, అదిమి, మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండువైపులా బంగారురంగు వచ్చేవరకు వేయించాలి ∙అలా వేయించిన గారెలను బెల్లం పాకంలో వేయాలి. పాకంలో 5 నిమిషాలు ఉంచి, ప్లేట్లోకి తీసుకొని, పై నుంచి మరికొద్దిగా పాకం పోసి సర్వ్ చేయాలి. పాకం గవ్వలు కావలసినవి: మైదా లేదా గోధుమపిండి – కప్పు, బొంబాయిరవ్వ – టేబుల్ స్పూను, బెల్లం తురుము – అర కప్పు, నెయ్యి – టేబుల్‌స్పూను, నూనె – వేయించడానికి సరిపడేంత తయారి: ∙ఒక పెద్ద పాత్రలో మైదా లేదా గోధుమపిండి, బొంబాయిరవ్వ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరవాతనీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్ద గట్టిగా కాకుండా మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనినిఅరగంటసేపు నాననివ్వాలి ∙నానిన ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి, గవ్వలపీట మీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఒకగిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు పోసి కరిగించి, ముదురు పాకం వచ్చేదాక మరగనివ్వాలి. వేయించిన గవ్వలను ఈ పాకంలో వేసి బాగా కలపాలి. మడత కాజా! కావలసినవి: మైదా/గోధుమ పిండి – కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, పాలు – 2 టేబుల్ స్పూన్లు (కాచి చల్లార్చినవి), ఉప్పు – చిటికెడు, నీళ్లు – తగినన్ని, నూనె – వేయించడానికి తగినంత ఫిల్లింగ్: బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, బాదం, పిస్తాపప్పు (పలుకులు ) – 2 టేబుల్ స్పూన్లు పాకం: పంచదార – కప్పు, నీళ్లు – అర కప్పు, రోజ్ ఎసెన్స్ – టీ స్పూన్ (లేదా) యాలకుల పొడి – టీ స్పూన్ తయారీ: ∙ముందు మైదాను జల్లించుకోవాలి ∙ఇక గిన్నెలో మైదా, నెయ్యి, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు చల్లి, పిండి మృదువుగా అయ్యేంతవరకు కలిపి ఒక తడి కాటన్ క్లాత్‌లో చుట్టి 5 నిమిషాలు ఉంచాలి ∙నిమ్మకాయపరిమాణంలో పిండి తీసుకొని, ఉండలా చేసి, చపాతీలా వత్తుకోవాలి ∙ఒక గిన్నెలో బియ్యప్పిండి, నెయ్యి వేసి కలపాలి. దీంట్లోనే బాదం, పిస్తాపప్పు పలుకులు వేసి కలపాలి. చపాతీ మీదుగా ఈ మిశ్రమాన్ని పోసి, రోల్ చేయాలి. తర్వాత చాకుతో రోల్ చేసినదానిని డైమండ్ షేప్‌లో కట్ చేయాలి ∙ఇలా బాల్స్ అన్నీ తయారుచేసుకున్నాక పాకం సిద్ధం చేసుకోవాలి. పాకం: పంచదారలో నీళ్లు కలిపి కరిగేంతవరకు ఉంచి, మరగనివ్వాలి. దీంట్లో యాలకుల పొడి 5–7 నిమిషాలు మరిగించి మంట తీసేయాలి ∙కడాయిలో నూనె, నెయ్యి పోసి కాగనివ్వాలి. దీంట్లో కట్ చేసి సిద్ధంగా ఉంచిన బాల్స్ వేసి రెండు వైపులా మంచి రంగుతేలేలా వేయించుకోవాలి. వెంటనే పాకంలో వేసి, 2 నిమిషాల సేపు ఉంచాలి. చల్లారాక తీసి సర్వ్ చేయాలి. బాదుషా కావలసినవి: మైదా – కేజీ, వెన్న : పావుకేజీ, బేకింగ్ పౌడర్– రెండు స్పూన్లు, నూనె – కేజీ, పంచదార – కేజీ, నీళ్లు– తగినన్ని, యాలకులు – 5 (పొడి చేయాలి) తయారి: ∙మరిగిన నీటిలో పంచదార వేసి కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు స్టవ్‌పై ఉంచాలి ∙పాకంలో యాలకుల పొడి కలిపి దించి పక్కన పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్ వేసి ముద్దగా కలపాలి. కాటన్ క్లాత్ కప్పి 5 నిమిషాలు ఉంచాలి. తరువాత పిండిని మరికాస్త మృదువుగా చేత్తో అదిమి, చిన్న చిన్న ఉండలు చేయాలి. వాటిని చేత్తో అదిమి, నూనెలో వేయించాలి. తరువాత వాటిని పంచదార పాకంలో వేయాలి. పాకంలో 15 నిమిషాలు ఉంచి తీయాలి. నిర్వహణ: ఎన్.ఆర్. -
40 ఏళ్లకు అరెస్టు.. రూ.100 జరిమానా!
40 ఏళ్ల క్రితం పాలు కల్తీ చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పాలు కల్తీ చేసిన మోతీలాల్ నాయి(64)కు పెద్ద వయసు కావడంతో కనికరించిన న్యాయమూర్తి అతని నేరానికి రూ.100 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. కల్తీ పాలతో తయారు చేసిన స్వీట్లను అమ్మినందుకు 40 ఏళ్ల క్రితం నాయి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని రాజస్ధాన్‌లోని నగౌర్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో షాక్ తిన్న మోతీలాల్.. ఆంధ్రప్రదేశ్‌కు పారిపోయి వచ్చాడు. ఏపీలో బతుకుదెరువు కోసం టీ షాపును పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం నాయి భార్య మరణించడంతో తిరిగి రాజస్ధాన్‌కు వచ్చాడు. పాత కేసుల విచారణ చేపట్టిన పోలీసులకు నాయి కేసు ఫైల్ కనిపించింది. అతని అడ్రస్‌ను పట్టుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు నాయి తారసపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా.. రూ.100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి పాల కల్తీకి పాల్పడిన వ్యక్తులకు జీవిత ఖైదును శిక్షగా విధించొచ్చని గతేడాది ఆగష్టులో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, నాయి వయసు దృష్ట్యా అతనికి శిక్ష లేకుండా జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. -
దశాబ్దాం నాటి కల సాకారం
ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి కేసీకి కృష్ణా జలాలు - జిల్లాకు చేయాల్సినంతా చేశా... - స్వీట్లు పంపిణీ చేసిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): ‘‘జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చా. గోదావరి జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేశా. జిల్లా ప్రజలు అభివృద్ధి ఫలాలను అనుభవించే రోజులు వస్తున్నాయి. దశాబ్దం కలను నెరవేర్చాం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చాం.’’ అని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా అధికారులతో ప్రధానంగా అభివృద్ధిపై చర్చించారు. ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి కేసీకి కృష్ణా జలాల తరలింపుతో తన కల నేరవేరిందంటూ స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాకు చేయాల్సిందంతా చేశామని.. ఇక చేయాల్సింది ఏమీ లేదని ప్రకటించారు. హంద్రీనీవా సుజల స్రవంతి, కేసీ కెనాల్ కాలువలకు 300 రోజులు నీరు పారుతుండటం వల్ల రైతులు మూడు పంటలు పండించుకోవచ్చన్నారు. రేయింబవళ్లు పనిచేసి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వేలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగామన్నారు. వచ్చే జనవరి నాటికి పత్తికొండ, దేవనకొండ, మండలాల్లోని 65వేల ఎకరాలకు నీరిచ్చేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. డీలర్లు కోర్టుకు వెల్లి స్టే తెచ్చుకునే అవకాశం ఎందుకిచ్చారు.. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి ప్రజాపంపిణీకి తూట్లు పొడిచిన డీలర్లు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత కనీసం మూడు వారాల సమయం వచ్చిందని.. ఆ లోపు వారిని అరెస్ట్ చేయకుండా జాప్యం చేసి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిని ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు నోట్స్‌లో పెట్టాలని ఆదేశించారు. నివేదికలు ఇవ్వండి.. ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు తాజా అభివృద్ధిపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన 27 అంశాలపై నివేదికలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, నీటిపారుదల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు -
సరిహద్దులో ఈ సారి స్వీట్లులేవు
అమృత్సర్: ముఖ్యమైన పండుగల సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న భారత్, పాకిస్తాన్ సైనికులు స్వీట్లు పంచుకోవడం ఓ ఆనవాయితి. ఇరుదేశాల స్వాతంత్ర్య దినోత్సవాలు, ఈద్, దీపావళి రోజుల్లో పంజాబ్‌లోని అట్టారి-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ వద్ద ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే.. ఉడీ ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన సర్జికల్ దాడులు, పాక్ వైపు నుంచి నిరంతరం కొనసాగుతున్న కాల్పుల ఉల్లంఘనల నేపథ్యంలో ఈ సారి స్వీట్లు పంచుకునే కార్యక్రమానికి బ్రేక్ పడింది. బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు పాకిస్థాన్ రేంజర్లతో స్వీట్లు పంచుకుని.. శుభాకాంక్షలు చెప్పుకునే కార్యక్రమాన్ని ఈ సారి నిలిపివేశారు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కొన్ని సందర్భాల్లో ఇదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని నిలిపేశారు. అయినా.. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాక్ దేశం సైనికులతో స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నంత మాత్రాన సోదరభావం ఉప్పొంగుతుందా. ఎవరో అన్నట్లు కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా! -
రంగవల్లుల కేళి మా దీపావళి!
రంగులు ఎంపిక చేయడం.. ఇంటి ముందు ఏయే ముగ్గులు వేయాలో నిర్ణయించడం.. చిన్నప్పుడు దీపావళి వస్తే ఈ పనులతోనే సరిపోయేది. వేసిన ముగ్గు ఎంత చెత్తగా ఉన్నా ఏదో గొప్ప పని చేశామన్న ఫీలింగ్... రంగులన్నీ కలిపి ముగ్గులు వేయడం భలే సరదాగా ఉండేది! నాకప్పుడు దీపావళి అంటే ముగ్గుల కేళీనే. దీపాలకు రంగులు వేసి ఇల్లంతా అలకరించేదాన్ని. ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలసి సాయంత్రం ముంబైలోని మహాలక్ష్మీ అమ్మవారి గుడికి వెళతాం. ఎన్నో దీపావళులను ఈ విధంగానే జరుపుకున్నా. ప్రతి దీపావళికీ నేను ఇంట్లోనే ఉంటాను. ఈ పండక్కి ఎవరూ షూటింగ్‌లు చేయరు. దాంతో హీరోయిన్ అయిన తర్వాత కూడా ప్రతి దీపావళి ఇంట్లోనే జరుపుకున్నా. చాలా ఏళ్ల క్రితమే టపాసులు కాల్చడం మానేశాను. చిన్నప్పుడు కూడా పెద్దగా కాల్చిన సందర్భాలు లేవు. టపాసుల వలన పొల్యూషన్ మాత్రమే కాదు, ఊరంతా చెత్త పేరుకుపోతుంది. అది నాకిష్టం లేదు. షుగర్ ఫ్రీ స్వీట్స్! స్వీట్స్ మన పండగల్లో ఎప్పుడో ఓ భాగమయ్యాయి. ప్రతి పూజకూ స్వీట్స్ కంపల్సరీ కదా. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన ఎక్కువ య్యాయి. మా ఇంట్లో తయారు చేసే స్వీట్స్ అన్నీ షుగర్ ఫ్రీనే. సాధారణంగా నేను ఎక్కువ స్వీట్స్ తినను. కానీ, పండగలప్పుడు నా డైట్ పక్కన పెట్టేసి స్వీట్స్ తినేస్తాను. -
రైల్వేలైన్ శంకుస్థాపనతో టీఆర్ఎస్ సంబరాలు
కరీంనగర్‌సిటీ : కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడంతో జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ రెండేళ్లుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర భాగస్వామ్యంతో లైన్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల అశోక్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో టపాసులు పేల్చారు. టీఆర్ఎస్వై జిల్లా అధ్యక్షుడు కట్ల సతీశ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, ఎంపీపీ వాసాల రమేశ్, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, బోనాల శ్రీకాంత్, నాయకులు బోనాల రాజేశం, కన్న కృష్ణ, జక్కుల నాగరాజు, మైఖేల్ శ్రీనివాస్, దండబోయిన రాము, పెండ్యాల మహేశ్, జక్కం నర్సయ్య పాల్గొన్నారు. -
మిఠాయిలతో అమ్మవారికి అలంకరణ
ఘట్కేసర్: ఆషాడమాసంలో అమ్మవారికి జరుగు ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పోచారంలోని సర్వమంగళ స్పటికలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని శనివారం అన్ని రకాల మిఠాయిలతో అలంకరించి పూజలు చేశారు. అలకరణ కోసం పలురకాల మిఠాయిలు ఉపయోగించినట్లు తెలిపారు. ఆషాడమాసోత్సవాల్లో అమ్మవారిని వివిధ రకాల పదార్థాలతో అలంకరిస్తున్నట్లు దేవాలయ నిర్వహకకమిటి చైర్మన్ చెరకు సరితా భద్రీనారాయణగౌడ్ తెలిపారు.అధిక సంఖ్యలోభక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. -
గన్‌తో బెదిరిస్తే.. స్వీట్లతో కొట్టింది!
మాల్మో: ఓ షాపింగ్ మాల్లో దోపిడి చేయడానికి వచ్చిన ఘరానా దొంగకు షాపులో పనిచేసే యువతి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. గన్ చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండగా ఆ యువతి స్వీట్లతో ఎదురు దాడి చేసింది. ఏం జరుగుతుందో అర్థం కాని సదరు దొంగ పరుగులంకించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. స్వీడన్‌లోని మాల్మో పట్టణంలో జైనాబ్ సలీం అనే యువతి ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. లేట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న జైనాబ్‌కు మంగళవారం ఊహించని ఘటన ఎదురైంది. క్యాష్ కౌటర్ వద్ద ఉన్న ఆమె వైపు ఓ దోపిడి దొంగ గన్‌తో వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. క్షణాల్లో తేరుకున్న జైనాబ్.. చేతికందిన స్వీట్లతో ఎదురుదాడికి దిగింది. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన దొంగ డబ్బులొద్దు ముర్రో అంటూ షాపు నుండి బయటకు పరుగులు పెట్టాడు. సమీపంలోనే ఉన్న తన సోదరుడికి సమాచారం ఇచ్చిన జైనాబ్ దొంగను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై జైనాబ్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే ఐదు సార్లు దోపిడి దారులు బారిన పడ్డాను. ఒకడు గొడ్డలితో, మరొకడు ఇనుప రాడ్డుతో బెదిరించాడు. అయితే ఈ సారి మాత్రం అప్రయత్నంగానే నేను స్పందించాను. ఒకవేళ ఆ గన్ లోడ్ చేసి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటే భయమేస్తోంది' అని తెలిపింది. -
సంక్రాంతి వంటలు
-
సెక్స్ కు ఆకర్షితులౌతున్న ఐరిష్ టీనేజర్లు..
ఐర్లాండ్ టీనేజర్లు ఇప్పుడు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఎనిమిది నుంచి 18 ఏళ్ళ వయసులోని పిల్లలపై చేసిన సర్వేలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడిస్తున్నాయి. అక్కడ ధూమపానంతోపాటు తాగుడుకు అలవాటు పడిన పిల్లలకంటే చిన్న వయసులోనే సెక్స్ పట్ల ఆకర్షితులవుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఐర్లాండ్ లో తాజాగా 230 స్కూళ్ళలో 13,500 మంది విద్యార్థులపై హెల్గ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బయటపడ్డ విషయాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే తమకు సెక్స్ అనుభవాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులోనూ పేద, మధ్య తరగతి పిల్లలే సెక్స్ పట్ల అధిక ఆసక్తి చూపుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు సెక్స్ లో పాల్గొనేప్పుడు దాదాపు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. వీరంతా సెక్స్ సమయంలో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా 15 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసు పిల్లలను సెక్స్ గురించి ప్రశ్నించినపుడు మాత్రం 27 శాతంమంది శృంగార అనుభవం పొందుతున్నట్లు తెలిసిందని, అంతకు ముందున్నకంటే రెండు మూడు శాతం ఈ సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. అయితే 2010 లో స్కూలు పిల్లలపై చేసిన సర్వేల్లోని నిష్పత్తికంటే... తాజా లెక్కల్లో స్మోకింగ్, డ్రింకింగ్ బానిసల సంఖ్య తగ్గిందని హెల్త్ ప్రమోషన్ రీసెర్స్ సెంటర్ పరిశోధకులు అంటున్నారు. అయితే సెక్స్ అనుభవాలను పొందుతున్న వారి సంఖ్య మాత్రం క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు వారు చెప్తున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 12 నుంచి 8 శాతానికి సిగరెట్లు, మద్యం సేవించే వారి సంఖ్య తగ్గిందని చెప్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన వల్లే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాక 2011 తో పోలిస్తే వారంతా డైటింగ్ పై కూడ శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే నేపథ్యంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని... స్వీట్లు, కూల్ డ్రిక్ ల వాడకం తగ్గిస్తున్నారని తాజా సర్వేల్లో వెల్లడైంది. -
ఎనిమిది క్వింటాళ్ల కల్తీ స్వీట్స్ సీజ్
లక్నో: దీపావళి పండుగకు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణం. అయితే పండుగ సందర్భంగా వ్యాపారులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో చెడిపోయిన, అపరిశుభ్రమైన మిఠాయిలను పోలీసులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. చాత్ వాలా నగరంలో స్వీట్స్ షాపులలో అమ్మాకానికి వుంచిన దాదాపు ఎనిమిది క్వింటాళ్ల కల్తీ తెల్ల రసగుల్లా స్వీట్స్ ను పోలీసులు సీజ్ చేశారు. పండుగ రోజున ఇంత భారీ మొత్తంలో కల్తీ స్వీట్స్ మార్కెట్లో లభ్యమవడం స్థానికంగా భయాందోళనలు రేపింది. దీపావళి పర్వదినం సందర్భంగా తాము నిర్వహించిన తనిఖీల్లో రెండు దుకాణాల్లో కల్తీ తెల్ల రసగుల్లాలను గుర్తించినట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి రాజేందర్ సింగ్ తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం, శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు చెప్పారు. అలాగే భారీ ఎత్తున్న స్వాధీనం చేసుకున్న స్వీట్స్‌ను అక్కడ నుంచి తరలించి వాటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. నివేదిక అనంతరం ఆయా దుకాణాల యజమానులపై చర్య తీసుకుంటామన్నారు. -
ఈసారి స్వీట్లు పంచుకోవట్లేదు
న్యూఢిల్లీ: ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత్ సైనికులు పాక్ సైనికులతో కరచాలనం చేయడం లేదు. ఇరువైపుల తీపి పదార్థాల పంపకాలు జరగడం లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కరచాలనం చేసుకోవడం, వందనం చేసుకోవడంతోపాటు స్వీట్లు పంచుకుంటారు. కానీ, ఈసారి ఆ సంప్రదాయానికి గండపడింది. అందుకు ప్రధాన కారణం ఇటీవల పాక్‌కు చెందిన ఉగ్రవాదులు బీఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు జవాన్లపై కాల్పులు జరపడంతో వారు ప్రాణాలుకోల్పోయారు. ఈ ఘటనను పాక్ ఖండించకపోవడంతోపాటు, పలుమార్లు సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్నా చూసిచూడనట్లు వ్యవహరించింది. అందుకు నిరసనగా ఈసారి స్వీట్ల పంపకాన్ని ఆపేశారు. -
చక్కెర తింటే నిద్రొస్తుందట!
చాక్లెట్లు, స్వీట్లు తినడం వల్ల పిల్లల్లో మంచి ఉత్సాహం, చురుకుదనం వస్తుందని కొందరు తల్లిదండ్రుల నమ్మకం. అయితే నిజానికి ఇలాంటి చక్కెర గల పదార్థాలతో నిద్ర వచ్చే అవకాశాలున్నాయని, చక్కెర మగతను కలిగించగలదని పరిశోధకులు అంటున్నారు. ‘‘అతిగా భోజనం చేసిన తర్వాత నిద్ర ఎక్కువగా వస్తుందని మనలో చాలా మంది అనుకుంటాం. కానీ అంతకంటే అధికంగా చక్కెర గల పదార్థాలు తీసుకుంటే త్వరగా నిద్రలోకి జారుకుంటాం’’ అని లియాన్ న్యూరోసైన్స్‌కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫీ వెరిన్ తెలిపాడు. ఫ్రాన్స్‌కు చెందిన వెరిన్ బృందం ఎలుకల్లో జరిపిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా కొన్ని ఎలుకల మెదడులోకి గ్లూకోజ్ (చక్కెరలోని ఓ రకం)ను ఇంజెక్ట్ చేశారు. మెదడులోని వీఎల్పీఓ (వెంట్రోలేటరల్ ప్రీయాప్టిక్ న్యూక్లియస్) ప్రాంతంలో దీన్ని ఇంజెక్ట్ చేశారు. ఎలుకలకు నిద్ర కలిగేందుకు వీఎల్పీఓ తోడ్పడుతుంది. గ్లూకోజ్‌ను ఇంజెక్ట్ చేసిన వెంటనే అవి నిద్రలోకి జారుకున్నాయి. దాదాపు రెండు గంటలపాటు అవి నిద్రలోనే ఉన్నాయి. ఎలుకల్లాగే మానవుల మెదడుపై చక్కెర పదార్థాలు ప్రభావం చూపగలవని అధ్యయనవేత్తలు తెలిపారు. చక్కెర కలిగిన పిండి పదార్థాలు ఉన్న ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు మనకు కూడా నిద్ర వచ్చే అవకాశం అధికంగా ఉందని వారు అన్నారు. -
భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్
వాఘా: ఇప్పుడప్పుడే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు తలెత్తకముందే.. 'పొరుగు దేశం మిఠాయిలు చేదు' అన్నట్లుగా వ్యవహరించింది దాయాది పాకిస్థాన్. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పండుగల సందర్భంలో పరస్పరం పలకరించుకొని, మిఠాయిలు తినిపించుకునే సంప్రదాయానికి తెరదించింది. సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతోన్న పండుగ చెలిమికి మంగళం పాడింది. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) ఇవ్వజూపిన మిఠాయిలు స్వీకరించేందుకు పాక్ సైనికులు నిరాకరించారు. ఈ ఉదయం వాఘా సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. వాఘానే కాకుండా భారత్- పాక్ సరిహద్దుల్లోని ముఖ్యమైన స్థావరాన్నింటివద్దా ఇలాంటి పరిస్థితే నెలకొంది. 'పండుగ సందర్భంగా పొరుగు దేశం సైనికులకు స్వీట్లు ఇవ్వడం ఆనవాయితి. అయితే ఈ సారి మాత్రం వారు స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. ఏది ఏమైనా మేం కోరుకునేది శాంతినే' అని బీఎస్ఎఫ్ డీఐజీ ఎంఎఫ్ ఫారూఖ్ చెప్పారు. పాక్ తీరుకు భిన్నంగా అసోం, మేఘాలయాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భారత్, బంగ్లాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, స్వీట్లు తినిపించుకోవడం గమనార్హం. కశ్మీర్ అంశం ప్రస్తావన లేకుండా భారత్- పాక్‌ల మధ్య చర్చలు అసాధ్యమని పాక్ రక్షణ సలహాదారు అజీజ్ ప్రకటించినప్పటినుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం రెట్టింపయింది. గడిచిన పక్షంరోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ సేనలు భాతర జవాన్లు, సాధారణ పౌరులపై తుపాకి గుండ్ల వర్షం కురిపించాయి. రంజాన్ పండుగ నాడు కూడా భారత సైన్యం స్థావరాలపై పాక్ రేజర్లు పలు మార్లు కాల్పులు జరిపారు. -
మిఠాయిలతో మోదీకి స్వాగతం
ఉఫా: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం రష్యా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ఘనస్వాగతం లభించింది. భారత ప్రధాని రాకను శుభసూచికంగా భావించిన రష్యా అధికార యంత్రాంగం ఏకంగా ఎయిర్ పోర్టులోనే మిఠాయి తినిపించిమరీ మోదీకి స్వాగతం పలికింది. ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం ఉజ్బెకిస్థాన్ నుంచి రష్యాలోని ఉఫా పట్టణానికి చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సు సహా షాంఘై సంహకార సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గోంటారు. బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా దేశాల అధ్యక్షులు ఇప్పటికే ఉఫా పట్టణానికి చేరుకున్నారు. భారత్‌కు రష్యా చరిత్రాత్మక స్నేహితుడని, తాను పాల్గొనబోయే సమాశాలు తప్పక ఫలవంతం అవుతాయని రష్యా అధికారులతో ప్రధాని మోదీ అన్నారు. -
మిఠాయిలతో మోదీకి స్వాగతం
-
సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత, పాక్ జవాన్లు!
జమ్మూ: పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా జమ్మూ,కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణారేఖ వద్ద పాక్, భారత జవాన్లు స్వీట్లు పంచుకుని సామరస్యాన్ని చాటారు. కాల్పుల ఒప్పంద నిబంధనల్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చిన 24 గంటల్లోనే ఈ ఘటన ఇరుదేశాల జవాన్ల మధ్య చోటుచేసుకోవడం అందర్ని ఆకట్టుకుంది. నియంత్రణారేఖ సమీపంలోని చకన్ దా బాగ్, హాట్ స్పింగ్ మెందార్ పాయింట్ల వద్ద ఇరుదేశాలకు చెందిన జవాన్తు గురువారం రాత్రి స్వీట్లు పంచుకున్నట్టు సైనికాధికారి వెల్లడించారు. నియంత్రణా రేఖ వద్ద సామరస్యం నెలకొనాలని ఇరుదేశాల అధికారులు అశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు రోజుల్లో హమీర్ పూర్, బాలకోటే ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పూంచ్ జిల్లా పోలీసులు తెలిపారు. -
‘రంగు’పడుద్ది
నెల్లూరు (సెంట్రల్) : రంగురంగుల స్వీట్లు, నోరూరించే ఆహార పదార్థాలు. మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి దుకాణాల యజమానులు తినుబండారాలకు చిక్కనైన రంగులు వాడుతున్నారు. ఇవేవి తెలియని ప్రజలకు ఆ స్వీట్లను చూడగానే తినాలనిపిస్తుంది. అయితే ఇలాంటి తినుబండారాలు తినడం వల్ల క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ రంగుల ఫుడ్ కల్చర్ ప్రస్తుతం గ్రామాలకు విస్తరించింది. మారుతున్న కాలానుగుణంగా ధరలను సైతం లెక్కచేయకుండా రెడీమెడ్ తినుబండారాలపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. ఎక్కువగా బిరియాని, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్, చికెన్ ఐటెమ్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటిల్లో ఈ రంగుల వాడకం ఎక్కువగా ఉంది. ఇవే కాకుండా చిన్నచిన్న తిండి పదార్థాల్లో కూడా రంగులను వాడుతున్నారు. రంగులు వాడకం వల్ల శరీరంలో కొన్ని భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థపై ప్రభావం ఆహార పదార్థాలపై వాడే రంగుల వల్ల ఎక్కువగా జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతాయి. ఇవే కాకుండా లివర్, కిడ్నీలపై ఈ ప్రభావం ఉంటుందని, ఎక్కువైతే క్యాన్సర్ బారిన పడే ప్రమాదమూ లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా స్వీట్స్‌లో వాడే సిల్వర్ లాంటి పేపర్ వల్ల ప్రమాదమంటున్నారు. మితిమీరిన రంగుల వాడకం వల్ల వ్యాపారులకు లాభాలు వస్తాయేమోగాని ప్రజలకు మాత్రం రోగాలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఈ రంగులు వాడిన పదార్థాలు తింటే పొగతాగడం కంటే ఎక్కువగా నష్టాలున్నాయని పలువురు వైద్యులు చెబుతున్నారు. రంగురంగుల పదార్థాలు కొనే సమయంలో కాస్త ఆలోచించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. నిబంధనలు ఎక్కడ? నిబంధనల ప్రకారం మిఠాయిల్లో మాత్రమే వినియోగించాలి. ఐఎస్ఐ వంటి గుర్తింపు ఉన్న రంగులను మాత్రమే వాడాలి. అదీ కూడా కేజీకి 0.1 మిల్లీ గ్రాములు మాత్రమే వాడాలి. ఈ ప్రమాణాల్లో మాత్రమే రంగులు వాడితే ఆహార పదార్థాలు అంతగా ఆకర్షణీయంగా కనపడవనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో రంగులు వాడుతున్నారు. అదీ తక్కువ ధరకు వచ్చే వాటిని వినియోగిస్తున్నారు. -
అమ్మ స్వీట్స్ మిస్సవుతున్నా
దీపావళి సందర్భంగా అమ్మ తయారు చేసే స్వీట్స్ తినే యోగం ఈసారి తనకు లేదని లక్ష్మీరాయ్ పేర్కొంది. ఈ భామ కొంచెం విరామం తర్వాత కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం అరణ్మనై. సుందర్.సి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియా మరో ఇద్దరు హీరోయిన్లు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ దీపావళి రోజునా అరణ్మనై షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని చెప్పింది. ప్రతి ఏడాదీ దీపావళికి ఇంటి దగ్గరే ఉండేదానినని తెలిపింది. ఈ సందర్భంగా అమ్మ తయూరు చేసే రకరకాల స్వీట్స్ తృప్తిగా తినే దానినని పేర్కొంది. ఈ సారి అరణ్మనై షూటింగ్ కారణంగా అమ్మ స్వీట్స్ తినే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దర్శకులు సుందర్.సి దీపావళి సందర్భంగా యూనిట్ అందరికీ స్వీట్స్ పంచుతానన్నారని చెప్పింది. మరో ఆనందం ఏమిటంటే అరణ్మనై చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా తన పాత్రకు అధిక ప్రాముఖ్యమని వివరించింది. -
అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్!
ఫుడ్ మార్కెట్లో ఏముంటాయి? రకరకాల కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, రొయ్యలు, ఇతరత్రా తినుబండారాలు... ఇవేగా! కానీ మీరింతవరకూ చూసి ఉండని ఓ విచ్రితమైన మార్కెట్ షాంఘైలో ఉంది. దాన్ని చూడటం సంగతి తర్వాత... దాని గురించి వింటేనే షాకయిపోతాం మనం! షాంఘైలోని గ్వాండాంగ్ ప్రావిన్స్‌లో ఉండే ఓ ఫుడ్ మార్కెట్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడా చూడలేనంత నాన్‌వెజ్ దొరుకుతుంది. ఎవరూ తినలేనన్ని రకాల మాంసాలు అక్కడ ఉంటాయి. చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్, మటన్ మామూలే. కానీ వాటితో పాటు మొసలి మాంసం, ఆక్టోపస్ మాంసం, స్టార్‌ఫిష్‌లు, తేళ్లు, జైలు, పాములు, ఎలుకలు, పురుగులు... దొరకని జీవి అంటూ ఏదీ ఉండదక్కడ. పచ్చివి, ఎండబెట్టినవి అంటూ వేరు చేసి మరీ అమ్ముతుంటారు. అంతేనా! తేళ్లతో చేసిన క్యాండీలు, ఫ్రూట్ పీసెస్ బదులు చిన్ని చిన్ని పురుగులను అద్దిన ఐస్‌క్రీములు, వేయించిన ఎలుకలు... అబ్బో, తినాలే గానీ బోలెడన్ని! మనకి వినడానికే వెగటుగా ఉంటుంది కానీ... షాంఘై వారికి ఆ మార్కెట్లో దొరికే ఐటెమ్స్ అంటే మహా ప్రీతి. ఎంత ఖరీదైనా పెట్టి వాటిని కొనేసుకుంటారు. ఏమాత్రం సంకోచం లేకుండా రకరకాల జీవుల్ని వండుకుని స్వాహా చేసేస్తుంటారు. వారికవి తినడం అలవాటు మరి! మీకేమైనా వాటి మీద ఇంటరెస్ట్ ఉంటే... ఎప్పుడైనా షాంఘై వెళ్లినప్పుడు చక్కగా టేస్ట్ చేసి రావచ్చు! ఆకాశంలో చందమామ ఎంత హుందాగా కనబడుతుందో... దుబాయ్‌లోని జుమేరియా బీచ్‌లో అంతకంటే ఠీవిగా కనిపిస్తుంది బుర్జ అల్ అరబ్ హోటల్. ప్రపంచంలోని అతి ఎత్తయిన హోటళ్లలో నాలుగో స్థానంలో ఉన్న ఈ స్టార్ హోటల్ అందాన్ని వర్ణించి లాభం లేదు. స్వయంగా చూడాల్సిందే! బుర్జ అల్ అరబ్ ఏర్పాటు కోసం ముందుగా సముద్రపు నీటిలో ఓ ఆర్టిఫీషియల్ దీవిని ఏర్పరిచారు. దాని మీద హోటల్‌ను నిర్మించారు. దీని ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. అటు పూర్తిగా అర్థ చంద్రాకారంలో కాకుండా, ఇటు పూర్తి నిటారుగా కాకుండా... ఓ విచిత్రమైన ఆకృతిలో ఉంటుంది. ఓడల రాకపోకలకు ఆటకం కలుగకుండా, ఓడల కారణంగా హోటల్‌కి నష్టం వాటిల్లకుండా ఉండేలా నిర్మించేందుకే ఈ ఆకారాన్ని ఎంచుకున్నారు. మొదట్లో దీనిని దుబాయ్ చికాగో బీచ్ హోటల్ అనేవారు. కానీ 1997లో బుర్జ అల్ అరబ్‌గా పేరు మార్చారు. జుమేరియన్ గ్రూప్ వారిది కావడంతో దీనికి జుమేరియన్ బీచ్ హోటల్ అనే పేరు కూడా వచ్చింది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో, విలాస వంతంగా ఉండే ఈ హోటల్లో విడిది చేస్తే స్వర్గంలో ఉన్నట్టేనంటారు సందర్శకులు! టామ్ రైట్, అట్కిన్స అనే ఇద్దరు ఆర్కిటెక్టులు కలిసి ఈ హోటల్‌కు రూపకల్పన చేశారు. కెనడాకు చెందిన ఇంజినీర్ రిక్ గ్రెగరీ 1994లో దీన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. 1999లో నిర్మాణం పూర్తయ్యింది. ఆ యేడు డిసెంబర్లో హోటల్‌ను తెరిచారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఇది లక్షలాది మందిని ఆకర్షించింది. దుబాయ్‌లో ప్రతిష్టాత్మకమైన, సుందరమైన నిర్మాణాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ హోటల్లో మొత్తం 202 సూట్స్ ఉన్నాయి. రాయల్ సూట్ పేరుతో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి 18,776 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మన కరెన్సీలో దాదాపు 12లక్షల పైమాటే. మామూలు సూట్ కూడా తక్కువేమీ ఉండదు. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదిహేను హోటళ్లలో ఒకటిగా పేర్కొంటారు. సామాన్యుడు ఇందులో అడుగు పెట్టడం కల్లే. అందుకే బడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు మాత్రమే ఇందులోకి వెళుతుంటారు.