కోల్‌కతా : మిఠాయిలను అమితంగా ఇష్టపడే బెంగాలీలకు మరో 'స్వీట్' న్యూస్. కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ సుందర్భన్ అడవుల్లోంచి సేకరించిన తేనె, స్వచ్ఛమైన ఆవు పాలు, తులసీరసంతో తయారుచేసిన ఈ మిఠాయికి 'ఆరోగ్య సందేశ్'గా నామకరణం చేశారు. పూర్తి సహజమైన పద్ధతిలో దీన్ని తయారు చేశారని, ఇందులో ఎలాంటి కృత్రిమ పదార్థాలు, రంగులు కలపలేదని జంతు వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మిఠాయితో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. అయితే ఇది కరోనాకు విరుగుడు మందు కాదని, కేవలం రోగ నిరోదక శక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. (వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్? )
ఇప్పటికే ఆరోగ్య సందేశ్‌కు ప్రభుత్వ అనుమతి కూడా లభించింది. దీంతో అతి త్వరలోనే సామాన్యులకు అందుబాటు ధరల్లో అభించనుందని సుందర్‌బన్స్ వ్యవహారాల మంత్రి మంతురాం పఖిరా తెలిపారు. కాగా ఈ నెల ప్రారంభంలో ప్రఖ్యాత మిఠాయి తయారీ సంస్థ ఇమ్యూనిటీ సందేశ్ పేరుతో ఈ స్వీట్‌ను తయారుచేసింది. ఇందులో సహజసిద్ధమైన పసుపు, తులసి, కుంకుమ, యాలకులు, తేనే వంటి మూలికలతో దీన్ని సిద్ధం చేయగా వివిధ పరిశోధనల అనంతరం దీనికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ మిఠాయిలో ఉన్నట్లు శాస్ర్తీయంగా తేలింది. (కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు )
Comments
Please login to add a commentAdd a comment