Immunity power
-
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్‌తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
‘మమ్రా’ బాదం గురించి తెలుసా? అంత స్పెషల్ ఏంటో?
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగ పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సౌందర్యానికి, రోగ నిరోధకశక్తికి చాలా అవసరం. అయితే బాదం పప్పు రకాల గురించి తెలుసా? అవేంటో తెలుసుకుందామా.!మార్కెట్లో మమ్రా ,కాలిఫోర్నియా బాదంతో సహా వివిధ రకాల బాదంపప్పులు అందుబాటులో ఉన్నాయి. బట్ బాదం ,కార్మెల్ బాదం, నాన్పరెయిల్ బాదం,గుర్బండి బాదం,స్వీట్ బాదం,పీర్లెస్ బాదం, గ్రీన్ బాదం మార్కోనా బాదం ఇలా 14 రకాలు ఉన్నాయి. వవీటిల్లో మమ్రా ,కాలిఫోర్నియా ఆల్మండ్స్ అనే ప్రధానమైనవి. ఈ రెండూ రుచికరమైనవీ, పోషకాలతో నిండి ఉన్నవే. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. మమ్రా బాదం: "రాయల్ బాదం" అని కూడా పిలుస్తారు, మమ్రా బాదం మధ్యప్రాచ్యానికి చెందినది మరియు కొన్ని శతాబ్దాల తరబడి సాగు చేయబడుతోంది. కాలిఫోర్నియా బాదం: ఇది అమెరికాకు చెందినది. కాలిఫోర్నియా బాదంపప్పును 19వ శతాబ్దంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో మొదటిసారిగా సాగు చేశారు. అనుకూలమైన వాతావరణం ,ఆధునిక వ్యవసాయ పద్ధతులు కాలిఫోర్నియాను ప్రపంచంలోనే అతిపెద్ద బాదం ఉత్పత్తిదారులలో ఒకటిగా మార్చాయి.రుచి, ఆకృతిలోనూ మమ్రా ,కాలిఫోర్నియా రకాలు మధ్య తేడాలున్నాయిమమ్రా బాదం మంచి సువాసనతో పెద్దగా ఉంటాయి. వీటిల్లో నూనె శాతం కూడా ఎక్కువే. మృదువుగా, విలక్షణమైన రుచితో ఎక్కువ క్రీమీగా ఉంటాయి కాలిఫోర్నియా బాదంపప్పులు చిన్నవిగా ఉంటాయి. నూనె శాతం తక్కువ . అందుకే రుచిలో కొంచెం తక్కువగా, క్రంచీగా ఉంటాయి. ప్రాసెసింగ్ పద్ధతులుమమ్రాం బాదంను చేతితో ప్రాసెస్ చేస్తారు. అందుకే ఇవిఎక్కువ నాణ్యంగా ఉంటాయి. సహజ రుచి ,ఆకృతిని పాడుకాకుండా ఉంటాయికాలిఫోర్నియా బాదం: సాధారణంగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. కనుక కొద్దిగా రుచినీ ఆకృతిని కోల్పోతుంది. అయినప్పటికీ, ఇది ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది.పోషక విలువలుమమ్రా , కాలిఫోర్నియా బాదం రెండూ విటమిన్లు, ఖనిజాలు , ఆరోగ్యకరమైన కొవ్వులకుఅద్భుతమైన మూలాలు, కానీ కొన్ని తేడాలు ఉన్నాయి:మమ్రా బాదం పెద్దగా, నూనె కంటెంట్ ఎక్కువ గనుక పోషక-సాంద్రత కలిగి ఉంటాయి. మమ్రా బాదంతో పోలిస్తే కాలిఫోర్నియా బాదంలో పోషక సాంద్రత కొంచెం తక్కువ. ధరలుమమ్రా బాధం ధర కిలో సుమారు రూ. 4000కాలిఫోర్నియా బాదం ధర కిలో సుమారు రూ. 1100 -
సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!
ఇటీవల చాలామందికి డాక్టర్లు అత్యంత ఖరీదైన బయాటిక్స్ ప్రిస్క్రయిబ్ చేస్తుండటం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. జీర్ణవ్యవస్థ పొడవునా ఉంటూ మనకు మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. అవి ఉండటం వల్లనే వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అందుకే పెరుగు తినడం అన్నివిధాలా ఆరోగ్యానికి మేలు చేసే విషయం మాత్రమే కాదు... ఎన్నో రకాల వ్యాధులను దూరంగా ఉంచేందుకు ఓ సమర్థమైన మార్గం కూడా. పెరుగుతో ఉండే ప్రయోజనాలు చూద్దాం. జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సంఖ్యలో ఉండే బ్యార్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూడటం మాత్రమే కాకుండా... కడుపులో మంటను తగ్గిస్తాయి. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ టాబ్లెట్ తీసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది నేచురల్‌గా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. ∙చర్మంలో తేమ ఎల్లప్పుడూ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందన్నది ఆహార నిపుణుల మాట. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్త΄ోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో ΄ోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సెంటిఫిక్ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మహిళల్లో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్న మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. (చదవండి: -
తల్లిపాల వారోత్సవాలు : బాధ్యత మనందరిదీ!
నవమాసాలు మోసి బిడ్డను కనిపెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. అలాగే తల్లి పాలల్లో మహత్తర శక్తి ఉంది. పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరం. దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు 120కి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటారు. పిల్లల సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరం. బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమేకాదు, తల్లీబిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది. పసివయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది. మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు. 1992లో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతిపాదను ఆమోదం లభించింది.1990లో ఆగస్టులో ప్రభుత్వ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ , ఇతర సంస్థలచే తల్లిపాలను రక్షించడానికి, ప్రోత్సహించడానికి , మద్దతు ఇచ్చేలా ఇన్నోసెంటి డిక్లరేషన్‌పై సంతకాలు జరిగాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, దానికి మద్దతు ఇవ్వడం , ప్రోత్సహించడంతో పాటు ప్రతిచోటా తల్లులు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు.World Breastfeeding Week...1st to 7th August 2024@OfficeOfLGJandK @SyedAbidShah @DrRakesh183 pic.twitter.com/QmgPtjLWWh— DIRECTORATE OF HEALTH SERVICES JAMMU (@dhs_jammu) August 1, 2024ప్రతీ ఏడాది, ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ డేని వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (WABA) ఎంపిక చేసిన కొత్త థీమ్‌తో జరుపుకోవడం ఆనవాయితీ. “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” (Closing the gap: Breastfeeding support for all) అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిపాలు ప్రాముఖ్యత , ప్రయోజనాలునవజాత శిశువులకు తల్లి పాలు బలవర్ధకమైన పోషకాహారం. అనేక రకాల సాధారణ వ్యాధులనుంచి రక్షించే రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. తల్లిపాలలోని పోషకాలు, యాంటీబాడీస్,ఎంజైమ్‌లు పిల్లల్ని అనారోగ్యాలు ,ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.తల్లి-పిల్లల బంధాన్ని బలోపేతం చేయడం, ప్రసవానంతరం బాలింతలు వేగంగా కోలుకోవడానికి, రొమ్ము, అండాశయ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లి పాలు ఏంతో మేలు చేస్తాయి. ఒక కొత్త జీవిని ఈ సమాజంలోకి తీసుకొచ్చే ఈ ప్రయాణంలో అమ్మకు మనం అందరంఅండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకొని అటు భర్త, ఇటు ఇరు కుటుంబ సభ్యులు ఆమె తోడుగా నిలవాలి. అలాగే కమ్యూనిటీ స్థాయిలో రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య సంస్థలు అధికారులు ఇందుకు మద్దతుగా నిలబడాలి. ఈ అవగాహన పెంచేందుకు,తల్లులు ఎదుర్కొంటున్ ఇబ్బందులను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్లు, సెమినార్లు, వర్క్‌షాప్‌ల ద్వారా కృషి చేస్తారు. -
ఇవి తిందాం.. ఉత్సాహంగా ఉందాం!
నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకూ అవేమిటో చూద్దామా?టొమాటో... దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే.బెర్రీస్... అన్ని రకాల బెర్రీస్... ముఖ్యంగా నేరేడుపండ్లు: వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి.యోగర్ట్ లేదా పెరుగు: ప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది.బీన్స్....ప్రోటీన్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్‌ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు.గ్రీన్ టీ... ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది.ఆకుకూరలు... ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బి, సి, ఇ, ఫోలేట్, పోటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్‌ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. అందుకే తిందాం... ఉత్సాహంగా ఉందాం. -
ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు
నిన్న మొన్నటి దాకా చెమటలు పట్టించిన ఎండలు కాస్తా ఇప్పుడు మబ్బుల వెనక దాక్కుని, వానలు కురిపిస్తున్నాయి. వానలు ఆహ్లాదంగానే ఉంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులను కూడా వెంట మోసు కొస్తాయి. ఈ అనారోగ్యాలతో పోరాడటానికి. రోగనిరోధకశక్తి బలంగా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుకోవడానికి నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. ఆ మార్పులేమిటో, ఈ సీజన్లో ఏ ఆహారం తీసుకుంటే మందో చూద్దాం... ముసురు పట్టినప్పుడు వేడి వేడి టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వాటికి బదులు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. దాంతోపాటు అల్లం, మిరియాలు, తేనెతో తయారు చేసిన టీ సేవిస్తే.. ఆరోగ్యానికి చాలా మంది. అదేవిధంగా బజ్జీలు, పునుగులు, బోండాలకు బదులు వేడి వేడి ఉగ్గాణి, సెనగ, పెసర గుగ్గిళ్లు, చుడువా, సగ్గుబియ్యం కిచిడీ మంది. పుదీనా, తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటితో కషాయం కాచుకుని తాగితే మంది. రాగులు, సోయాబీన్, పెసలు, మెుక్కజొన్న వంటి పప్పుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల దరిచేరవు. వీటితోపాటు పోషక విలువలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు అంటే దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటì , క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర వంటివి తీసుకుంటే మంచిది. అల్లం: ఇది శరీర కణ జాలాలకు పోషకాలను సమీకరించడానికి, సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. ఈ రోజుల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. అల్లం కఫాన్ని తగ్గిస్తుంది కాబట్టి అల్లం టీ తాగితే జలుబు, దగ్గు దూరం అవుతాయి. ఫ్లూతో పోరాడటానికి అల్లం తోడ్పడుతుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి. టీలు, సప్లు, కూరల్లో అల్లాన్ని ఎక్కువ ఉపయోగిస్తే వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు. నేరేడు పండు... ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాల ఫైటోకెమికల్సూ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. నేరేడులో క్యాలరీలు తక్కువ. వానాకాలంలో వచ్చే అతిసార, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకీ నేరేడు ఔషధంలా పనిచేస్తుంది. తులసి... ఈ కాలంలో రోజూ తులసి ఆకులను నమలడం ద్వారా అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చు. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని.. నీటిని తాగాలి. తులసి రోగనిరోధక వ్యవస్థను బూస్ట్ చేస్తుంది. నిమ్మ... నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచే సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు, శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మిరియాలు... నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జీవక్రియలను పెంచుతాయి. దగ్గు, గొంతు నొప్పి ఉన్నట్లయితే నల్ల మిరియాలను పొడి చేసి నిద్రవేళకు ముందు వేడి పాలలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు... పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రోజూ రాత్రిపూట చిటికడు పసుపు కలిపిన వేడి పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లవంగం... ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. వర్షాకాలంలో లవంగాలను తీసుకుంటే గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దాల్చిన చెక్క... అద్భుత ఔషధ గుణాలెన్నో దాగి ఉన్న దాల్చిన చెక్క మధుమేహులకు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. రోజూ గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం దీనిలో ఇమిడి ఉంది. వీటికి దూరంగా ఉండటం మేలు! రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే చక్కెర పదార్థాలకి దరంగా ఉండాలి. ముఖ్యంగా ఐస్ క్రీం, కేక్, క్యాండీ, చాక్లెట్, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. చాలామంది ప్యాక్ చేసిన ఆహారాలని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అధిక ఉప్పు ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఆల్కహాల్, ధూమపానం కూడా శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉంటే మేలు. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!) -
ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!
వేసవి తాపం చల్లారి హమ్మయ్యా అనిపించే కాలం. చలచల్లగా హాయిగా ఉంటుందని ఆనందించేలోపు అంటు వ్యాధులు మనం కోసం రెడీగా ఉంటాయి. ఈ కాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ తదితర అంటువ్యాధులు ప్రబలేకాలం. ఇలాంటి కాలంలో ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు నేరెడు పండ్లు: ఇందులో పోటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే రక్తంలో ఆకస్మికంగా పెరిగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెర్రీస్: దీనిలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణం కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలోనూ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడంలో ఉపకరిస్తుంది. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ ఇన్వెక్షన్ల నుంచి సునాయసంగా బయటపడే సామార్థ్యాన్ని పెంపొందిస్తాయి. బొప్పాయి: ఈ బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సంక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే గాక చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. దానిమ్మ : దానిమ్మ గింజలు: ఆరోగ్యాన్ని అందించే రుచికరమైన పండు. ఇందులో ముఖ్యంగా బీ విటమిన్లు, ఫోలేట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, రక్త ప్రసరణకు సహయపడతాయి. ఈ పళ్లు హైపర్‌టెన్షన్, గుండె సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పీచెస్: ఈ పండ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని పచ్చిగా గానీ సలాడ్‌తో గానీ కలిపి తినండి. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ ఐరన్ ఉన్నాయి. ఇది జామూన్ మాదిరి మంచి శక్తిమంతమైన పోషకాలను అందిస్తుంది. లిచ్చి: ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆస్తమా రోగుల శ్వాసక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి తరుచుగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పైన చెప్పిన ఈ పళ్లల్లో దేని రుచి మీకు నచ్చకపోయినా, వాటిని తినడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ పండ్లను పచ్చిగా తినడం లేదా జ్యూస్ /సలాడ్లు, స్మూతీలు, యోగర్ట్‌లు లేదా డెజర్ట్‌లలో చేర్చి తీసుకోండి. ఇవి మీ రోజువారీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
‘కోవిడ్-19’పై గుడ్‌న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ
జెనివా: కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త అందించింది. కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని 90 శాతం మందిలో కొంత మేర రోగనిరోధక శక్తి పెంపొందినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్‌కు గురికావటం లేక వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచంలోని 90 శాతం మందిలో కోవిడ్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది’ అని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. కోవిడ్-19 మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని, అయితే, వైరస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోల్ అధనోమ్. వైరస్‌పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. అంతకు ముందు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది. ఇదీ చదవండి: Viral Video: భయానక దృశ్యం.. చెరువులో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి -
తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. మహోన్నతమైన ఆ తల్లి మనసుకు వందనం! ఒక తల్లి నుంచి మరో తల్లి బిడ్డకు... పాలు అందించే సేవ మహోత్కృష్టం. ఆ సేవలో తరిస్తున్నాయి పాలబ్యాంకులు. బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. తల్లిపాలు ఆహారం మాత్రమే కాదు ఔషధం కూడా. బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా దేహం తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. జీర్ణాశయ సమస్యలు తలెత్తకుండా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్న తల్లిపాలను నిర్లక్ష్యం చేయరాదని దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపిస్తోంది. కొంతమంది తల్లులకు పాలు పడవు. అలాగే కొంతమందికి డెలివరీ సమయంలో ఇతర కారణాల రీత్యా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెలలు నిండకముందే పుట్టిన బిడ్డలను కొన్ని రోజులు, నెలలపాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచాలి. ఇలాంటి బిడ్డల కోసమే తల్లిపాల బ్యాంకులు ఉద్భవించాయి. హైదరాబాద్ నగరంలో ధాత్రి మిల్క్ బ్యాంకు అలాంటిదే. ఈ బ్యాంకు ప్రధానంగా నీలోఫర్ హాస్పిటల్‌కు సేవలందిస్తోంది. ‘‘అక్కడ డెలివరీల్లో అల్పాదాయ కుటుంబాల వాళ్లే ఎక్కువ. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు ఫార్ములా మిల్క్‌ను జీర్ణం చేసుకోలేరు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా కష్టమే. అందుకే మా సర్వీస్ ప్రధానంగా ఆ బిడ్డలకే’’ అన్నారు డాక్టర్ భవాని. చైతన్యప్ర‘దాత’లు... రక్తపరీక్ష చేసి హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి మరికొన్ని అనారోగ్యాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మిల్క్ డొనేషన్‌ను ప్రోత్సహిస్తారు. డెలివరీ అయి హాస్పిటల్లో ఉన్న తల్లులతోపాటు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తల్లుల నుంచి కూడా పాలను సేకరిస్తారు. ఇంట్లో ఉన్న తల్లులకు 250 మి.లీ, 500 మి.లీ. కెపాసిటీ కలిగిన ‘బ్రెస్ట్‌మిల్క్ స్టోరేజ్ పౌచ్’లను ఇస్తారు. తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను స్టెరిలైజ్ చేసిన పాత్రలోకి సేకరించి వాటిని పౌచ్‌లో పోసి ఇంట్లోనే డీప్‌ఫ్రీజర్‌లో పెడతారు. వారం లేదా పది రోజులకొకసారి మిల్క్ బ్యాంకు వాళ్లు వచ్చి ఆ పౌచ్‌లను కోల్డ్ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి బ్యాంకుకు చేరుస్తారు. బ్యాంకులో పాలను పాశ్చరైజ్ చేస్తారు. ఇన్ఫెక్షన్ కారకాలైమేనా ఉన్నాయేమోనని పరీక్ష చేస్తారు. ఆ తర్వాత పాలను చల్లబరిచి డీప్‌ఫ్రీజర్‌లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. ఇలా మిల్క్ బ్యాంకులో నిల్వ చేసిన పాలను నాలుగు నుంచి ఆరునెలల వరకు ఉపయోగించవచ్చు. ‘పాలను సేకరించడం, మిల్క్ బ్యాంకుకు తరలించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, అవసరమైన బిడ్డకు అందించడం’ ఇన్ని దశలుంటాయి. సాధారణంగా బ్లడ్‌బ్యాంకుల గురించి తెలిసినంతగా మిల్క్ బ్యాంకుల గురించి జనానికి పెద్దగా తెలియదు. కానీ చదువుకున్న మహిళల్లో చైతన్యం బాగా వచ్చిందని, హైదరాబాద్ నగరంలో 18వందలకు పైగా తల్లులు ధాత్రితో అనుసంధానమై పాలదానం చేస్తున్నారని తెలియచేశారు ధాత్రి నిర్వహకులు. పాలదాతలు తల్లి నుంచి పాలను సేకరించిన తర్వాత మామూలుగా నిల్వ ఉంచితే గంట లేదా రెండు గంటల్లో ఉపయోగించాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆరుగంటల వరకు వాడవచ్చు. ప్రసవం సెలవు పూర్తి చేసుకుని డ్యూటీలకు వెళ్లే తల్లులు ఇదే పద్ధతి పాటిస్తుంటారు. నెలల కొద్దీ నిల్వ ఉండేవి మిల్క్ బ్యాంకులో నిల్వ చేసినవి మాత్రమే. మిల్క్ డోనర్ మదర్లకు మేము పౌచ్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం. పౌచ్‌ను డీప్ ఫ్రీజర్‌లోనే పెట్టాలి. ఆ ఫ్రీజర్‌లో మరేదీ పెట్టకూడదు. ఇలా నిల్వ చేసిన పాలను వారం పది రోజుల్లో బ్యాంకుకు తెప్పించుకుంటాం. కరెంట్ పోతే అప్పటి వరకు ఇంట్లో నిల్వ చేసిన పాలను వెంటనే బ్యాంకుకు చేర్చాలి. మిగులు పాలు ఉన్న తల్లులనే ఎంపిక చేసుకుంటాం. కాబట్టి మిల్క్ డోనర్ల బిడ్డల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూనే మరొక బిడ్డకు ప్రాణం పోయవచ్చు. డా. భవాని కలవలపల్లి పీడియాట్రీషియన్ , వైస్ ప్రెసిడెంట్, సుశేన హెల్త్ ఫౌండేషన్ సీఈవో, ఐడియా క్లినిక్స్ ఏడాదికి ఎనిమిది లక్షల మంది శిశువులు తల్లిపాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలన్నీ బిడ్డకు ఆరు నెలలు నిండేలోపే సంభవిస్తున్నట్లు డబ్లు్యహెచ్‌వో లెక్కలు చెబుతున్నాయి. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో టైప్ టూ డయాబెటిస్, ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదం చేసే బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవేర్నెస్ కోసం ఏటా ఆగస్టు మొదటి వారం రోజులను కేటాయించింది డబ్లు్యహెచ్‌వో. ఈ ఏడాది ‘స్టెప్ అప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్–ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్’ థీమ్‌తో ముందుకెళ్తోంది. – వాకా మంజులారెడ్డి -
తట్టులాగే.. మంకీపాక్స్ కూడా
కర్నూలు (హాస్పిటల్): ‘ఇంట్లో ఎవ్వరికైనా ఒంటిపై పొక్కులు వస్తే పెద్దవారు తట్టు పోసిందనో, ఆటలమ్మ వచ్చిందనో చెప్పి వెంటనే ఓ గదిలో ఉంచుతారు. తేలికపాటి ఆహారం ఇస్తూనే తెల్లటి వస్త్రంపై పడుకోబెట్టి చుట్టూ వేపాకు మండలు పెడతారు. వేపాకు నూరి శరీరమంతా పూసి స్నానం చేయిస్తారు. ఇప్పుడు మంకీపాక్స్‌లో కూడా ఇదే జరుగుతుంది. దీనికి భయపడాల్సిన పనిలేదు. ఆటలమ్మ, తట్టు మాదిరిగానే ఇది కూడా ప్రాణాంతకం కాదు. కోవిడ్‌లా వేగంగా వ్యాప్తి చెందదు’ అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిప్యూటీ సూపరింటెండెంట్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని బుధవారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అరికట్టడం కష్టం కాదు ఈ వైరస్ ఏమీ చేయదు. దీనిని అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మాస్క్, ఐసోలేషన్ ముఖ్యం. పారాసిటమాల్, సిట్రిజన్, ఆంపిక్లాక్స్ 500 ఎంజీ మాత్రలు రోజుకు రెండు చొప్పున పది రోజులు వేసుకోవాలి. మ్యూపరసిస్ లేదా బిటాడిన్ ఆయింట్మెంట్, కొబ్బరి నీళ్లు, తేలికపాటి ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే చాలు. బయట తిరగకూడదు. ఇంట్లో వారికీ దూరంగా ఉండాలి. ఒంటిపై పొక్కుల్లో నీరు చేరితే కొంచెం నొప్పి ఉంటుంది. త్వరగానే తగ్గిపోతుంది. మరీ పెద్దగా నొప్పైతే నీడిల్‌తో గుచ్చి బాక్ట్రోబాన్ ఆయింట్మెంట్ రాయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇలా ఓ పది రోజులుంటే అంతా సర్దుకుంటుంది. జాగ్రత్తగా ఉండాలి మంకీపాక్స్ వైరస్ ఎవరిలో ఉందో తెలుసుకోవడం కష్టం. జలుబు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది తుమ్ముల తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువసేపు కాంటాక్టులో ఉన్నా వస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు పొక్కులు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే ఐసోలేషన్‌లో ఉంచి మందులు ఇస్తారు. ప్రజలు సైతం ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఆరోగ్య కార్యకర్తలకు, వాలంటీర్లకు తెలపాలి. ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే వ్యాప్తి ఆగిపోతుంది. ఇవీ లక్షణాలు ‘మంకీ పాక్స్’కు, మన దేశంలో అంతరించిన స్మాల్‌పాక్స్(తట్టు)కు, అడపాదడపా కనిపించే ఆటలమ్మ, చికెన్‌పాక్స్‌కు దగ్గర సంబంధం ఉంది. వారియోలా, వారిసెల్లా అనే వైరస్ల వల్ల వచ్చిన జబ్బులివి. ఇవంత ప్రాణాంతకం కావు. మంకీపాక్స్ సోకితే 5 నుంచి 21 రోజుల్లో శరీరంపై పొక్కులు వస్తాయి. జ్వరం, జలుబు, కండరాల నొప్పులు, నీరసం వస్తుంది. లింఫు గ్రంధుల వాపుంటుంది. గజ్జలు, చంకలో, మెడలో గడ్డలు వస్తాయి. పొక్కుల్లో కొన్నిసార్లు ద్రవం చేరి లావుగా మారి పగిలిపోతాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సమస్యలు వస్తాయి. ఆయాసం, దగ్గు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేరాలి. -
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్‌కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సర్వ్‌జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
Health Tips: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక.. నరకం కనిపిస్తుంది!
శరీరానికి అన్నిరకాల విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ తగ్గినా.. అనారోగ్యాలు దాడి చేసేందుకు సిద్ధమవుతాయి. ముఖ్యంగా శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్–డి లోపిస్తే.. నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డి విటమిన్ లోపం వల్ల తలెత్తే సమస్యలు తెలుసుకుందాం. ►విటమిన్–డి అనేది కొవ్వులో కరిగే ముఖ్యమైన విటమిన్. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. లేదా శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ►విటమిన్–డి లోపం.. శరీర కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ►కండరాల నొప్పి, నీరసం, ఎముక సాంద్రత, పిల్లల్లో రికెట్స్ సమస్యలు ఏర్పడతాయి. ►ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్–డి అధిక మొత్తంలో శరీరానికి అందడం చాలా ముఖ్యం. ►కొన్ని అధ్యయనాల్లో విటమిన్–డి అధిక స్థాయిలో ఉండే వ్యక్తులు ఎంతో ఆరోగ్యంగా... చురుగ్గా ఉన్నట్లు వెల్లడి అయింది. విటమిన్ డి ఎందుకు అవసరం? ►విటమిన్–డి ఎముకల జీవక్రియకు అవసరమైన హార్మోన్ ఉత్పత్తికి, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం. ►రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ►శరీర కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ►చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ‘సన్‌షైన్ విటమిన్’ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది. ►శీతాకాలంలో శరీరానికి విటమిన్ ఈ లభించాలంటే కనీసం 10–30 నిమిషాలు సూర్యరశ్మి తగలాలి. లోపిస్తే ఏమవుతుంది? ►విటమిన్–డి లోపిస్తే.. పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ►పిల్లల్లో ఎముకల వృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ►పెద్దవారిలో ‘ఆస్టియోమలాసియా’ ఏర్పడుతుంది. ►కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి–విటమిన్ లోపాన్ని ఎదుర్కొంటారు. ►ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా శరీరానికి సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం వల్ల ఈ లోపం ఏర్పడుతుంది. చదవండి👉🏾 Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇదే.. ఇవి తింటే మేలు! -
భళా.. బాపట్ల బ్లాక్ రైస్!
బీపీటీ 2841 రకం నల్ల బియ్యం వంగడాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్, జింక్ వంటి సూక్ష్మపోషకాలను పుష్కలంగా కలిగి ఉండటం.. పంట పడిపోకుండా ఉండటం, చీడపీడలను తట్టుకోవటం, ఎకరానికి 30–35 బస్తాల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకతలు. రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా వరుసగా మూడేళ్లు సత్ఫలితాలు వచ్చాయి. సేంద్రియ/ప్రకృతి సేద్యానికి అనువైన ఈ విశిష్ట వంగడం అధికారిక విడుదలకు సిద్ధమవుతోంది. ఆరోగ్యకరమైన ఆహారం గురించి వినియోగదారుల్లో ఇటీవల అవగాహన పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వలన పోషకాలు కలిగిన ఆహార పదార్థాల వాడకం పెరిగింది. సేంద్రియ ఆహారోత్పత్తులపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నందున నలుపు, ఎరుపు దేశవాళీ వరి రకాల సాగు, వాడకం క్రమక్రమంగా పెరుగుతోంది. కోతకు ముందు పడిపోవటం, దిగుబడులు తక్కువగా ఉండటం వంటి సమస్యలను తట్టుకునే సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పూర్వరంగంలో బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఎకరానికి 30–35 బస్తాల దిగుబడినిచ్చే బీపీటీ 2841 బ్లాక్ రైస్ వంగడాన్ని అభివృద్ధి చేయటం విశేషం. 130–140 రోజుల పంట యం.టి.యు. 7029, ఐ.ఆర్.జి.సి. 18195, యం.టి.యు. 1081 అనే రకాల సంకరం ద్వారా బీపీటీ 2841 సన్న రకం బ్లాక్ రైస్ వంగడాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. డా. బి. కృష్ణవేణి, డా. డి. సందీప్ రాజా, డా. సి.వి. రామారావు, డా. వై. సునీత, డా. కె.ఎ. మృదుల ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు. 2019–20 ఖరీఫ్ సీజను నుంచి రైతు క్షేత్రాల్లో మినీ కిట్ పరీక్షల నిర్వహణకు అనుమతి పొందింది. దీని పంట కాలం 130–140 రోజులు. ఈ రకం దాదాపు 110 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. పడిపోదు. దోమపోటు, అగ్గి తెగుళ్లను కొంత వరకు తట్టుకుంటుంది. మధ్యస్త సన్న రకం. వెయ్యి గింజల బరువు సుమారు 14–14.5 గ్రాములు. పైపొట్టును మాత్రమే తొలగించినప్పుడు (దంపుడు బియ్యం) 76.6% రికవరీనిస్తుంది. పాలీష్ చేస్తే 66% రికవరీనిస్తుంది. దంపుడు బియ్యం తింటే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. పాలీష్ చేస్తే పై పొరలలోని నలుపు రంగులో ఉండే అంధోసైనిన్ తవుడులోకి వెళ్లి పోతుంది. ఎకరానికి 35 బస్తాల దిగుబడి బీపీటీ 2841 రకం నారును 20“15 సె.మీ. దూరంలో నాటుకుంటే హెక్టారుకు 6 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. అయితే, పిలక చేసే సామర్థ్యం తక్కువ కాబట్టి 15“15 సెం.మీ. దూరంలో నాటుకుంటే (ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం) మంచిదని, ఇలా చేస్తే ఎకరానికి 35 బస్తాల (హెక్టారుకు 6.5 టన్నుల) వరకు దిగుబడి సాధించవచ్చని రైతుల అనుభవాల్లో తేలిందని బాపట్ల ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డా. రామారావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. రోగనిరోధక శక్తే కీలకం బీపీటీ 2841 సన్న వరి బియ్యం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యం పైపొర నలుపు రంగులో ఉంటుంది. బియ్యానికి పై పొరలలోని నలుపు రంగు ఆంథోసైనిన్ అనే పదార్థం వల్ల వస్తుంది. మామూలుగా మనం రోజూ ఆహారంగీ తీసుకునే వరి రకాలతో పోల్చినప్పుడు నలుపు, ఊదా, ఎరుపు రంగు పై పొరగా కలిగినటువంటి వరి రకాలలో పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. నలుపు రంగు బియ్యం పై పొరలలో ఉండే దట్టమైన నలుపు రంగునిచ్చే ఆంధోసైనిస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సూపర్ ఫుడ్‌గా పిలవబడే బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో సమానమైన పోషక విలువలను కలిగి ఉన్నట్లు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బీపీటీ 5204తో పోల్చితే యాంటీ ఆక్సిడెంట్లు బీపీటీ 2841 బ్లాక్ రైస్‌లో 3–4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. పాలీష్ చేయని బీపీటీ 2841 దంపుడు బియ్యంలో వంద గ్రాములకు 90.52 మిల్లీ గ్రాముల ఫినాలిక్ పదార్థాలు, వంద గ్రాములకు 110.52 మిల్లీ గ్రాముల యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లు కోత బాపట్లలోని అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రయోగశాల పరీక్షల్లో వెల్లడైంది. 5% పాలీష్ చేసిన బీపీటీ 2841 నల్ల బియ్యంలో కూడా వంద గ్రాములకు 90.19 మిల్లీ గ్రాముల యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లు తేలింది. అదే విధంగా, పై పొట్టు మాత్రమే తొలగించిన ముడి బియ్యంలో 11.02%, పాలీష్ బియ్యంలో 6.3% మాంసకృత్తులున్నాయి. సూక్ష్మపోషకాలైన జింక్, ఇనుప ధాతువులు కూడా బీపీటీ 2841లో ఎక్కువ పరిమాణంలో ఉండటం విశేషం. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఉత్పత్తయిన ఫ్రీరాడికల్స్‌ను సమతుల్యం చేయటం వలన పలు రకాల కేన్సర్లు, గుండె సంబంధిత సమస్య, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ రోగనిరోధక శక్తినిచ్చే బియ్యం బీపీటీ 2841 బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్, జింక్, ఐరన్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. అందువల్ల ఈ బియ్యం రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. ఫార్టిఫైడ్ రైస్ కన్నా ఇవి మేలైనవి. బ్రీడర్ విత్తనాన్ని గత తెలుగు రాష్ట్రాల్లో పది వేల మంది రైతులు సాగు చేశారు. సుమారు 15–20 వేల ఎకరాల్లో సాగు చేసి సంతృప్తికరమైన ఫలితాలు పొందారు. చిరు సంచుల దశ పూర్తయింది. ఎస్వీఆర్సీకి ఈ ఏడాది నివేదించి విడుదలకు అనుమతి కోరుతాం. ప్రస్తుతం మా దగ్గర టన్ను వరకు విత్తనం ఉంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడే బ్రీడర్ విత్తనం ఇస్తాం. కిలో రూ.50. కావల్సిన రైతులు మాకు ఈ చిరునామా (ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, వ్యవసాయ పరిశోధనా స్థానం, బాపట్ల – 522101, ఆంధ్రప్రదేశ్)కు ఉత్తరం రాస్తే.. పేర్లు నమోదు చేసుకొని సీరియల్ ప్రకారం మే ఆఖరు వారం, జూన్ మొదటి వారంలో ఇస్తాం. వారే స్వయంగా వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. – డా. సి.వి. రామారావు, ప్రధాన శాస్త్రవేత్త – అధిపతి, బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం.ars.bapatla@angrau.ac.in -
'నులి'పేద్దాం
సాక్షి, అమరావతి: పిల్లలను పట్టి పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి. రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంటాయి. నులిపురుగుల నివారణలో భాగంగా ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది తొలి విడత పంపిణీ మార్చి 2న ప్రారంభమైంది. 5వ తేదీ వరకూ కొనసాగనుంది. అంగన్వాడీలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. 1–19 ఏళ్ల వయసున్న 1,04,93,350 మందికి మాత్రలు అందజేస్తున్నారు. 1–2 ఏళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ సగం మాత్ర, 3–19 ఏళ్లలోపు వారికి 400 ఎంజీ పూర్తి మాత్ర వేస్తున్నారు. అపరిశుభ్రత ప్రధాన కారణం పిల్లల్లో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. నులిపురుగుల ప్రభావం ఇలా.. నులిపురుగులు పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి. ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలి 1.5 కోట్ల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని జిల్లాలకూ సరఫరా చేశాం. విద్యా సంస్థల వారీగా 19 ఏళ్లలోపు పిల్లల వివరాలను ఫోన్ నంబర్లతో సహా సేకరించి, వారికి మాత్రలు అందాయో లేదో ఐవీఆర్ఎస్ ద్వారా విచారిస్తున్నాం. రాష్ట్రంలోని అందరు పిల్లలకు మాత్రలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలందరూ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలి. – శ్రీనివాసరెడ్డి, ఆర్బీఎస్కే రాష్ట్ర ప్రత్యేకాధికారి -
వారిలో కోవిడ్ టీకా ‘రక్షణ’ ఆరు నెలలే!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని.. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని ‘ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)’అధ్యయనంలో తేలింది. భారతీయులలో వ్యాక్సిన్‌తో వచ్చే రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువ కాలం ఉంటుందన్న దానిపై ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏఐజీ ఇటీవల అధ్యయనం చేసింది. సంస్థ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. పూర్తిగా రెండు డోసుల టీకాలు వేయించుకున్న 1,636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ స్టడీ చేసినట్టు తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అదృష్టవశాత్తూ వ్యాక్సినేషన్ ప్రభావం, వైవిధ్యం యొక్క అంతర్గత లక్షణం, జనాభాలో ఉన్న సహజ రోగనిరోధక శక్తి వంటి వివిధ కారణాలతో తీవ్రత స్వల్పంగా ఉంది. అయినా కూడా ఈ అంటువ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండేలా, వీలైనంత ఎక్కువ మందిని రక్షించగల మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ఆ కోవలోనే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఎంతకాలం ఉంటుందో తేల్చడం, బూస్టర్ డోసులు అవసరమైన నిర్దిష్ట జనాభా గుర్తించడమే మా పరిశోధన లక్ష్యం’’అని నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం 93 శాతం మంది కోవిషీల్డ్ తీసుకున్నవారే.. ఏఐజీ అధ్యయనంలో పాల్గొన్న 1,636 మంది లో 93% మంది కోవిషీల్డ్, 6.2 శాతం మంది కోవాగ్జిన్, 1% స్పుత్నిక్ తీసుకున్నవారు ఉన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాల తో సరితూగేలా ఉన్నాయి. 6 నెలల తర్వాత దాదా పు 30% మంది రక్షిత రోగనిరోధకశక్తి స్థాయి 100 ఏయూ/ఎంఎల్ కంటే తక్కువస్థాయికి యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించారు. వీరిలో అధిక రక్త పోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40ఏళ్లు పైవయసువారే ఎక్కువగా ఉన్న ట్టు తేల్చారు. మొత్తంగా 6% మందిలో రోగనిరోధ క శక్తి అభివృద్ధి చెందలేదని గుర్తించారు. వయస్సు, రోగనిరోధకశక్తి క్షీణించడం అనేవి అనులోమానుపాతంలో ఉంటాయని ఫలితాలు సూచిస్తున్నాయని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. చదవండి: మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్ అంటే వృద్ధుల కంటే యువకుల్లో ఎక్కు వ యాంటీబాడీలు ఉంటాయని, వయసు పెరిగినకొద్దీ తక్కువ యాంటీబాడీలు ఉంటా యని వెల్లడించారు. రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40 ఏళ్లు పైబడినవారిలో 6 నెలల తర్వాత యాంటీబాడీలు బాగా తగ్గిపోతున్నాయని.. అలాంటివారిలో కోవిడ్ ఎక్కువ ప్రభా వం చూపించే అవకాశం ఉందని తెలిపారు. వీరికి 6 నెలల తర్వాత బూస్టర్ డోసు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించా రు. ఇక 6 నెలలు దాటినా తగినంత యాంటీబాడీలు ఉన్న మిగతా 70% మందికి కూడా 9 నెలల విరామం తర్వాత బూస్టర్‌డోసు ఇవ్వడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. -
Health Tips: రోజూ ఒక్క గ్లాస్ మోసంబి జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో..
Amazing Mosambi Juice Benefits for Skin, Hair and Health: మార్కెట్లో సులభంగా, తక్కువ ధరలో లభించే వాటిలో మోసంబి ఒకటి. ఇది సిట్రస్ పండు. దీనిని తీపి సున్నం అని కూడా అంటారు. ఇండోనేషియా నుంచి చైనా వరకు అనేక ప్రాంతాల్లో మూలాలను కలిగి ఉంది. మోసంబిలో సాధారణ నిమ్మకాయల కంటే కూడా తక్కువ మోతాదులో యాసిడ్ ఉంటుంది. విత్తనాలు, మందపాటి తొక్క కారణంగా పండు రూపంలో తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. జ్యూస్‌గా మాత్రం మంచి రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మోసంబి రసం ఎంత అలసిపోయిఉన్నా తక్షణమే రీఫ్రెష్ చేస్తుంది. మోసంబిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి శరీరానికి ఉపయోగపడే అనేక మూలకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మోసంబి ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలించనట్లయితే.. విటమిన్ సి యొక్క పవర్ హౌస్: ఇది నీటిలో కరిగే విటమిన్. దీనిని మనం శరీరంలో నిల్వ చేయలేము. అందువల్ల ప్రతిరోజూ మనకు ఆహారం ద్వారా అవసరం. రోజూవారీ మోతాదుగా విటమిన్ సీ పొందడానికి మోసంబి రసం గొప్ప మార్గం. ఇది శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరం. మానవుని ఆరోగ్యంలో సమగ్ర పాత్ర పోషిస్తుంది. చదవండి: (Feet Care Tips: విటమిన్ ‘ఈ’ క్యాప్య్సూల్స్తో ఇలా అందంగా..) కళ్లకు మంచిది: యాంటి ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా.. మోసంబి జ్యూస్ కళ్లను ఇన్ఫెక్షన్ల నుంచి, కంటి శుక్లం అభివృద్ధి కాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్: క్రమం తప్పకుండా మోసంబి జ్యూస్ తాగడం వల్ల బలహీనత, అలసట తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చదవండి: (Health Tips: రోజూ గ్లాసు పళ్ల రసం చక్కెర వేయకుండా తాగితే..) క్యాన్సర్ నిరోధక లక్షణాలు: మోసంబిలో ఉండే లిమోనాయిడ్లు వివిధ రకాల క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడతాయి. గ్లూకోజ్ అనే చక్కెర అణువుతో లిమోనాయిడ్లు జతచేయబడి సులభంగా జీర్ణమవుతాయి. అందమైన చర్మం కోసం: మోసంబి జ్యూస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ అందమైన, ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతగానో ఉపయోగపడాయి. ఆరోగ్యకరమైన మెరుస్తున్న చర్మానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సీ ఇందులో పుష్కలంగా ఉంటుంది. మచ్చలను తొలగిస్తుంది: మోసంబి జ్యూస్‌లో తేలికపాటి బ్లీచింగ్, క్లెన్సింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి మచ్చలు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు తగ్గడానికి: మోసంబి రసంలో వృద్ధాప్య నిరోధక లక్షణాలు ఉన్నాయి. చర్మం ముడతలు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన కొల్లాజెన్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. శరీరానికి దృఢత్వాన్ని అందిస్తుంది. మనిషి కుంగిపోకుండా చేస్తుంది. జుట్టును బలపరుస్తుంది: మోసంబి జ్యూస్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . మీరు ఎల్లప్పుడూ కోరుకునే మెరుపును ఇస్తుంది. -
ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
Omicron Boost Immunity Against Delta: ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.. అనేది పాత సామెత! ముందునుంచి ఉన్న చెవులకు కొత్త కొమ్ముల వాడి తగలడం దీనికి కొనసాగింపు! ఈ కథలో ముందునుంచి ఉన్న చెవులు డెల్టా వేరియంట్ కాగా, వెనకొచ్చిన కొమ్ములు ఒమిక్రాన్ వేరియంట్. డెల్టాను మించిన వేగంతో ఆవతరించిన ఒమిక్రాన్ క్రమంగా డెల్టాకే పరోక్ష ప్రమాదకారిగా మారుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వివరాలేంటో చూద్దాం.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీలు భవిష్యత్‌లో డెల్టా వేరియంట్ సోకితే అడ్డుకునేలా సదరు వ్యక్తి శరీరంలో రోగనిరోధకతను పెంచుతాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన పలు మ్యుటేషన్లతో ఒమిక్రాన్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే! డెల్టాతో పోలిస్తే దీనికి వేగం, వ్యాప్తి సామర్ధ్యం ఎక్కువని నిరూపితమైంది. అదేవిధంగా శరీరంలో టీకాల వల్ల, గత ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. అయితే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల కలిగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం గమనార్హం. దీనివల్లనే ఒమిక్రాన్ ప్రపంచమంతా అత్యధిక వేగంతో వ్యాపించినా, డెల్టా తరహాలో మరణాలు సంభవించడం లేదు. అంటే డెల్టా సోకితే వచ్చిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. కానీ ఒమిక్రాన్ సోకితే వచ్చే యాంటీబాడీలు మాత్రం అటు డెల్టాను, ఇటు ఒమిక్రాన్‌ను అడ్డుకోగలుగుతున్నాయి. అందుకే కొందరు సైంటిస్టులు ఒమిక్రాన్ దేవుడు ఇచ్చిన ‘‘సహజ వ్యాక్సిన్’’గా అభివర్ణిస్తున్నారు. టీకా చేసే పనులను ( వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండడం, శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపించడం) ఈ వేరియంట్ చేస్తోందని భావిస్తున్నారు. ఈ భావనకు తాజా పరిశోధన బలం చేకూరుస్తోంది. ఏమిటీ పరిశోధన ఒమిక్రాన్ వేరియంట్‌ను మరింతగా అవగాహన చేసుకునేందుకు దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక అధ్యయనం జరిపారు. దీని వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా 15మందిని అధ్యయనం చేశారు. వీరిలో టీకాలు తీసుకున్నవారు మరియు ఇంతవరకు టీకాలు తీసుకోకుండా ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారు ఉన్నారు. ఈ రెండు గ్రూపులకు చెందిన వారి రక్తం, ప్లాస్మాల్లో యాంటీబాడీలను విశ్లేషించారు. వీరి శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల్లో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను అడ్డుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందుకోసం ‘‘న్యూట్రలైజేషన్’’పరీక్ష నిర్వహించారు. లక్షణాలు కనిపించినప్పుడు, తిరిగి రెండు వారాల తర్వాత మొత్తం రెండు దఫాలు ఈ పరీక్షలు చేశారు. ఒమిక్రాన్ సోకి యాంటీబాడీలు ఉత్పత్తైన వ్యక్తుల్లో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 14 రెట్లు అధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా డెల్టాకు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 4.4 రెట్లు పెరిగినట్లు గమనించారు. అంటే ఒమిక్రాన్ సోకి వ్యాధి తగ్గిన వారిలో అటు ఒమిక్రాన్, ఇటు డెల్టాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని తేల్చారు. అంటే ఒకసారి ఒమిక్రాన్ సోకి తగ్గితే సదరు వ్యక్తికి భవిష్యత్‌లో డెల్టా, ఒమిక్రాన్ సోకే అవకాశాలు బాగా తగ్గవచ్చని పరిశోధకుడు అలెక్స్ సైగల్ అభిప్రాయపడ్డారు. టీకా సైతం ఇదే పనిచేస్తున్నందున ఒమిక్రాన్‌ను కరోనాకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన టీకాగా భావించవచ్చన్నది నిపుణుల అంచనా. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తే కరోనా ఒక సాధారణ జలుబుగా మారిపోయే అవకాశాలున్నాయనేది ప్రస్తుతానికి వినిపించే గుడ్ న్యూస్! విమర్శలు కూడా ఉన్నాయి... సైగల్ చేపట్టిన పరిశోధన వివరాలు ఆశాజనకంగా ఉన్నా, ఈ పరిశోధనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం 15మంది వాలంటీర్ల అధ్యయనంతో మొత్తం ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని అంచనా వేయలేమన్నది విమర్శకుల వాదన. డెల్టా కన్నా ఒమిక్రాన్ మంచిదనేందుకు ఈ యాంటీబాడీల పరీక్ష కాకుండా మరే ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని ఒమిక్రాన్ యాంటీబాడీలు పెంచిఉండొచ్చని కొందరి అంచనా. అలాగే డార్విన్ సిద్ధాంతం ప్రకారం డెల్టాను ఒమిక్రాన్ తరిమేస్తే భవిష్యత్‌లో మరో శక్తివంతమైన వేరియంట్ పుట్టుకురావచ్చు. అందువల్ల కేవలం ఒమిక్రాన్‌తో కరోనా ముగిసిపోకపోవచ్చని పరిశోధకుడు డాక్టర్ పియర్సన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మూడు పరిణామాలకు అవకాశం ఉందన్నారు. 1. ఫ్లూ వైరస్లాగా ప్రతి ఏటా ఒక సీజనల్ కరోనా వేరియంట్ పుట్టుకురావడం . 2. డెంగ్యూలాగా పలు కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూ కొన్ని సంవత్సరాలకొకమారు ఒక వేరియంట్ విజృంభించడం. 3. తేలికగా నివారించగలిగే ఒకటే వేరియంట్ మిగిలడం.. అనేవి పియర్సన్ అంచనాలు. వీటిలో మూడోది మానవాళికి మంచిదని, కానీ దీనికి ఛాన్సులు తక్కువని ఆయన భావిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
కోవిడ్ తగ్గాక మధుమేహం?
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన ఉమేశ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. గత మేలో కరోనా బారినపడ్డారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్కు లోనుకావడంతో చికిత్సలో భాగంగా వైద్యులు స్టెరాయిడ్స్ వాడారు. కరోనా నుంచి కోలుకున్నాక రెండు నెలల్లో 10 కిలోల బరువు పెరిగాడు. దీనికి తోడు చర్మంపై దద్దుర్లు, అతిగా మూత్రం రావడం వంటి ఇతర సమస్యలు ఎదురవుతుండటంతో డాక్టర్‌ను సంప్రదించాడు. వైద్య పరీక్షల అనంతరం ప్రీ డయాబెటిక్ దశలో ఉమేశ్ ఉన్నట్లు నిర్ధారించారు. ..ఇలా ఉమేశ్ తరహాలో కరోనా నుంచి కోలుకున్న వారిలో 5–10 శాతం మందిలో మధుమేహం బయటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మధుమేహం బారినపడుతున్న వారిలో ఎక్కువగా స్టెరాయిడ్స్ సాయంతో చికిత్స పొందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా స్టెరాయిడ్స్ వాడితే శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అయితే.. కొందరిలో 2–3 వారాలకు తగ్గుతోంది. మరికొందరిలో మాత్రం మానేసిన 2–3 నెలలకు కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడంలేదు. సాధారణ చికిత్స ద్వారా కోలుకున్నప్పటికీ.. కరోనాకు ముందు ఉన్న ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, ఇతర లక్షణాలున్న వారు, వైరస్ సోకిన సమయంలో తీవ్ర ఒత్తిడికిలోనై మధుమేహం బారినపడినట్లు వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో.. పోస్ట్ కోవిడ్‌లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మధుమేహం పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో నిశ్శబ్దంగా నష్టాన్ని చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. మధుమేహానికి కారణాలివీ.. ► క్లోమ గ్రంధిలోని బీటా కణాలు సక్రమంగా ఇన్సులిన్‌ను స్రవించకపోవడంవల్ల మధుమేహం సమస్య తలెత్తుతుంది. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల్లో వైరస్ అతుక్కునేందుకు కారణమయ్యే ఏసీఈ–2 రిసెప్టార్లు.. క్లోమ గ్రంధిపై కూడా ఉండి, ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి శరీరంలో చక్కెరస్థాయి పెరుగుతుంది. ► దీన్ని శరీర కణజాలం త్వరగా గ్రహించుకోలేకపోవడంతో 6 నెలల పాటు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉండేందుకు అవకాశముంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► స్టెరాయిడ్స్ ద్వారా కరోనా చికిత్స తీసుకున్న వారు పోస్ట్ కోవిడ్‌లో తప్పనిసరిగా మధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. ► మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్యులు సూచించిన మందులు వాడాలి. ► రక్తంలో గ్లూకోజు స్థాయి పరగడుపున 125 ఎంజీ/డీఎల్, ఆహారం తీసుకున్నాక 200 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువుంటే మధుమేహం వచ్చినట్లే. ► పొగతాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. ► తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. ► వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. ► క్రమం తప్పని వ్యాయామంవల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. ► శరీరంలో కొవ్వు నియంత్రణకు తోడ్పడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది శరీరంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. కరోనా చికిత్స పొందిన కొందరిలో స్టెరాయిడ్స్, ఇతర మందుల ప్రభావంవల్ల మధుమేహం బయటపడుతోంది. యువత, పెద్ద వయస్కులు ఇలా అన్ని వర్గాల్లో ఈ సమస్య ఉంటోంది. కరోనా బారినపడ్డ వారిలో అప్పటికే మధుమేహం ఉన్నా, కొత్తగా మధుమేహం బయటపడినా వైద్యుల సూచనల మేరకు విధిగా ఇన్సులిన్ వాడాలి. – డాక్టర్ రాంబాబు, విమ్స్ డైరెక్టర్ ప్రారంభంలోనే గుర్తించాలి ప్రారంభ దశలోనే మధుమేహాన్ని గుర్తిస్తే మంచిది. లేదంటే లోలోపల చాలా నష్టం చేకూరుతుంది. అతిగా మూత్రం రావడం, ఊబకాయం, చర్మంపై దద్దుర్లు, గాయాలైతే నెమ్మదిగా మానడం వంటి లక్షణాలున్న వారు వైద్యులను సంప్రదించాలి. మధుమేహం నిర్ధారణ అయిన వారు ఆహార అలవాట్లు మార్చుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులి చ్చిన మందులు వాడాలి. – డాక్టర్ పి. పద్మలత, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గుంటూరు మెడికల్ కళాశాల -
సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?
Benefits of millets and their role in increasing immunity: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మన పూర్వీకులు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు లేకుండా జీవించారని చెబుతుంటారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ‘ఇమ్యూనిటీ పవర్’ పెంచుకునేందుకు బలవర్ధక ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ సంప్రదాయ ఆహారం వైపు మళ్లుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా నల్లగొండలో చిరు ధాన్యాల టిఫిన్ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లలో పట్టణవాసులు బారులు దీరుతున్నారు. – రామగిరి (నల్లగొండ) చిరు ధాన్యాలతో చేసిన అల్పాహారం తింటున్న ప్రజలు మారిన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంతో చాలామంది మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మనుషుల ఆరోగ్యం అలవాట్లతో పాటు, తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే, చిరు ధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు చిరు ధాన్యాల ఆహారం తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. చదవండి: బిగ్‌బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు చిరు ధాన్యాలు అంటే..? పూర్వ కాలంలో మెట్ట పంటలైన చిరు ధాన్యాలను ఎక్కువగా సాగు చేసేవారు. వీటినే అప్పటి వారు ప్రధాన ఆహారపు అలవాటుగా చేసుకున్నారు. చిరు ధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, అరికలు, అండు కొర్రలు, ఊదలు, అవిసెలు, సామలు మొదలైనవి. చదవండి: తరుముతున్న థర్డ్‌వేవ్: ‘ఫిబ్రవరి వద్దు.. డిసెంబర్లోనే కానివ్వండి పంతులు గారూ’ చిరు ధాన్యాల టిఫిన్లు చిరు ధాన్యాలు (తృణ ధాన్యాలను) ఉపయోగించి పలు రకాల టిఫిన్లను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా దోశలు, ఇడ్లీలు, పొంగల్, బిస్మిల్లాబాత్, పులిహోర, రాగి సంకటి, రాగి జావ లాంటివి ప్రత్యేకం. వీటితోపాటు నువ్వుల లడ్డు, అవిస గింజల లడ్డు, బీట్రూట్ లడ్డులను తయారు చేసి అమ్ముతున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారితో పాటు ఇతర వ్యాధులు ఉన్న వారి వీటిని రోజూ అల్పాహారంగా తీసుకుంటున్నారు. చదవండి: వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు బిస్మిల్లా బాత్ సామలు సామలను ఆహారంగా తీసుకోవ డం వల్ల అనేక గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అతిసారం, అజీర్ణం, సుఖ వ్యాధులు, శుక్రకణాల వృద్ధికి, ఆడవారిలో రుతు సమస్య లకు మంచి ఔషధంగా పని చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నివారణకు ఇది మంచి ఆహారం. చదవండి: ఆ ఇంటి నిండా మొక్కలే!... ఉద్యానవనాన్ని తలపించే గృహవనం!! రాగి ఇడ్లీ కొర్రలు కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియంతో పాటు విటమిన్స్ ఉండడంతో ఉదర సంబంధ వ్యాధి గ్రస్తులకు మంచిగా పనిచేసాయంటున్నారు. మూత్రంలో మంట, కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయని, కాలిన గాయాలు, రక్తహీనత, ఊబకాయం, రక్తస్రావం, కీళ్లవాతం, గుండెజబ్బుల నుంచి త్వరగా కోలు కోవడానికి కొర్రలు మంచిగా పనిచేస్తాని చెబుతున్నారు. బీట్రూట్ లడ్డు అండు కొర్రలు పూర్వపు పంటల్లో అండు కొర్రలు ఒకటి. వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతనే వండుకోవాలి. కంటి సంబంధ, బీపీ, థైరాయిడ్, జీర్ణాశయం, ఊబకాయం లాంటి సమస్యల నివారణకు బాగా పని చేస్తాయి. అంతే కాకుండా అర్షమొలలు, అల్సర్, ఎముకలు, ఉదర, పేగు, చర్మ సంబంధ కాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయంటున్నారు. మిక్స్డ్ పొంగలి ఊదలు ఊదలు దేహంలో శరీర ఉష్ణొగ్రతలను సమస్థితిలో ఉంచడానికి ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవారికి శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారమని, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మలబద్ధకం, మధు మేహానికి మంచిగా పనిచేస్తాయని చెబుతున్నారు. కొర్ర దోశ అరికెలు అరికెలలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. రక్తంలో కోలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. నువ్వుల లడ్డు ఆన్లైన్ సౌకర్యం కూడా.. చిరు ధాన్యాల టిఫిన్స్‌ను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ తీసుకుని ఇంటికి చేరవేస్తాం. టేస్ట్ బాగుండడంతో ఆర్డర్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం జొమాటో ద్వారా ఆర్డర్ తీసుకుని సరఫరా చేస్తున్నాం. ఇక్కడికి రాలేనివారు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం. – ఎస్.నరేష్, జొమాటో బాయ్ జొన్న సంకటి షుగర్ తగ్గింది నెల రోజుల నుంచి చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్ చేస్తున్నాను. నాకు షుగర్ ఉంది. మందులు వాడినా తగ్గకపోయేది. చాలా రోజులుగా చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్ చేస్తుండడంతో షుగర్ తగ్గినట్లు వైద్యులు చెప్పారు. – బి.యాదగిరి పార్సిల్ తీసుకెళ్తా నేను చిరుధాన్యాల టిఫిన్ సెంటర్ నుంచి పార్సిల్ తీసుకెళ్తా. ఇంట్లో అందరం చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫినే తింటాం. ఇంట్లో ఇవన్నీ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకని రోజుకో రకం టిఫిన్ తీసుకెళ్తాను. ఇవి తిన్నప్పటి నుంచి ఆరోగ్యం మంచిగా ఉంది. – అజారుద్దీన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా చిరు ధాన్యాలతో టిఫిన్ చేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో ఇలాంటి హోటళ్లు ఎక్కువగా ఉండేవి. నల్లగొండలో ఈ ఆహారం అందించాలనే ఉద్దేశంతో శివసాయి చిరు ధాన్యాల పేరుతో టిఫిన్ సెంటర్ పెట్టాను. ఇక్కడ నేను మరో నలుగురికి శిక్షణ కూడా ఇస్తున్నా. షుగర్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ పేషంట్లు టిఫిన్ సెంటర్‌కు బాగా వస్తున్నారు. – రాజునాయక్, నిర్వాహకుడు -
గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు..
హింగోలి: గాడిదపాల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. అంతేకాదు గాడిద పాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుందని విక్రేతలు చెప్తున్నారు కూడా. కరోనా వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందనే నమ్మకం కూడా లేకపోలేదు. దీంతో గాడిద పాలకు గరిష్ఠంగా లీటరుకు పది వేల రూపాయలు వెచ్చించిమరీ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బారీ స్థాయలో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. హింగోలిలో వీధి వీధికి గాడిద పాలను విక్రయిస్తున్నారు. స్పూను పాలు తాగితే అన్ని రకాల రోగాలు దూరమవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాడిదపాలల్లో ఔషధగుణాలు అధికంగానే ఉంటాయని, పిల్లలకు న్యుమోనియాను దూరం చేస్తుందని, జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పాల విక్రయదారులు నమ్మబలికి వ్యాపారం చేస్తున్నారు. అనేక వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని టీస్పూన్ పాలను రూ. 100కు, ఒక లీటరు పాలు ఏకంగా రూ. 10,000లకు అమ్ముతున్నారు. పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాల వరకు రోజూ ఈ పాలను తాగిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. దీనితో జనాలు విపరీతంగా కొనుగోలు సాగిస్తున్నారు. వైద్యులు ఏమి చెబుతున్నారంటే.. ఈ వందంతులన్నీ పూర్తిగా అవాస్తవాలని, గాడిద పాలు తాగడం వల్ల కరోనా లాంటి ఇన్ఫెక్షన్లు నయమవుతాయనేది అసాధ్యమని, ఇలాంటి వదంతులకు మోసపోవద్దని డాక్టర్ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రజలు తమ డబ్బును వృధాగా ఖర్చు చేసకోవద్దని సూచించారు. చదవండి: పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం... -
కొత్త బ్యాక్టీరియా.. సరికొత్త జ్వరం
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలం సింగన్నవలస ప్రాంతంలో కొత్త రకం బ్యాక్టీరియాను వైద్యులు గుర్తించారు. ఓ రకం కీటకం కాటు ద్వారా ‘ఓరియన్షియా సుషుగముషి’ అనే బ్యాక్టీరియా సోకి ‘స్క్రబ్ టైఫస్’ అనే జ్వరం వస్తోంది. ఈ జ్వరం కారణంగా రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడంతో పాటు.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే జ్వరం తీవ్రమై ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధికంగా ఉండే ఈ బ్యాక్టీరియా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోనూ కనిపిస్తోంది. పాలకొండ మండలం సింగన్నవలసలో ఈ తరహా లక్షణాలతో కూడిన జ్వర పీడితులను ఇటీవల వైద్యులు గుర్తించారు. సకాలంలో వైద్యులు స్పందించటంతో ప్రమాదం తప్పింది. దీనిని నియంత్రించేందుకు ప్రత్యేక టీకాలు అంటూ ఏమీ లేవు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మురుగుతో పాటు..: పచ్చిక బయళ్లు, మురుగు నిల్వ ఉన్న చోట పెరిగే ఓ రకం (నల్లిని పోలి ఉండే) కీటకాల్లో ఈ ‘ఓరియన్షియా సుషుగముషి’ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీటకం కాటు వేసిన చోట నల్లని మచ్చతో పాటు.. చుట్టూ ఎరుపు రంగుతో కూడిన గాయం ఏర్పడి దురద పుడుతుంది. తీవ్రమైన చలి జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు, తలనొప్పితో పాటు ఒంటిపై ఎర్రని దద్దుర్లు ఏర్పడతాయి. డెంగీ మాదిరి లక్షణాలతో ఉండే జ్వరంతో పాటు రక్తంలో సోడియం నిల్వలు తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. జ్వరం తీవ్రమైతే ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం ప్రభావానికి గురవుతాయి. తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఈ రకమైన జ్వరాన్ని గుర్తించేందుకు మ్యాల్ కిల్లర్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. -
ఇమ్యూనిటీ ఫస్ట్...పిండి వంటలు నెక్ట్స్
నగరంలో లక్షలాది మంది కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఉన్నారు. మరోవైపు ఇంకా కోవిడ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పండుగ సంబరాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు జిహ్వా చాపల్యాన్ని నియంత్రించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరో పండుగల సీజన్ వచ్చిందంటే జీవితంలో జిహ్వకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో దాని ప్రభావం ఏమిటో కూడా అర్ధమవుతుంది. రకరకాల వంటకాల ఘమఘమలు ఇల్లంతా పరుచుకోకపోతే పండుగ పరిపూర్ణం కాదని భావిస్తాం. దీపావళి రోజున రకరకాల పిండివంటలు వండుకోవడం, మిఠాయిలు కొని పరస్పరం పంచుకోవడం సంప్రదాయం. అయితే సంప్రదాయాన్ని వదులుకోకుండానే వ్యాధి నిరోధక సామర్ధ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. మక్కువ ఉన్నా తక్కువగా... అరిసెలు, బూరెలు, గారెలు, కజ్జికాయలు...ఇంకా ఇష్టమైన వంటకాలను చూస్తే నియంత్రించుకోవడం కష్టం. కాబట్టి వీలున్నంత వరకూ తక్కువ పరిమాణంలో వండుకోవడం మంచిది. అంతేకాకుండా పిండి వంటల్ని పండుగకు ఒక్కసారే చేసుకుని కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచే సమయంలో వాటిని సరైన చోట, సరైన విధంగా నిల్వ చేయాలి. అలాగే కొన్ని రోజుల పాటు పాడవకుండా ఉండాలన్నా, కొంచెం ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా అనారోగ్యం కలుగకుండా ఉండాలన్నా.. వండేటప్పుడు ముడిదినుసులు, దాదాపుగా అన్నీ ఆయిల్ వంటకాలే కాబట్టి, సరైన నూనెలు ఉపయోగించడం తప్పనిసరి. ఆయిల్...కేర్ పండుగ సమయంలో ఇచ్చి పుచ్చుకునేందుకు షాప్స్‌లో స్వీట్స్ కొనుగోలు చేసే ముందు వాళ్లు వినియోగించిన ఆయిల్స్ గురించి కనుక్కోవడం అవసరం. ఇప్పుడు దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్స్ వాళ్లూ ఆరోగ్య అవగాహనను దృష్టిలో పెట్టుకుని నాణ్యతా పరంగా తాము పాటిస్తున్న ప్రమాణాలు వెల్లడిస్తున్నారు. ‘‘అత్యుత్తమ రా మెటీరియల్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూనె ఉత్పత్తి చేస్తున్నాం. నిల్వ చేసుకునేందుకు వీలుగా మా ప్యాక్స్ ట్యాంపర్ ప్రూఫ్ సీల్స్‌తో వస్తాయి. మా ప్రమాణాలే ఐబిసి, యుఎస్‌ఎల నుంచి ఏసియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఆయిల్ బ్రాండ్ అవార్డ్‌ని దక్కించాయి’’ అని గోల్డ్ డ్రాప్ సంస్థ ప్రతినిధి మితేష్ లోహియా చెప్పడం దీనికో నిదర్శనం. అంతేకాక మార్కెట్లో సహజమైన పద్ధతిలో తయారైన ఆర్గానిక్ నూనెలూ లభిస్తున్నాయి. వాటినీ పరిశీలించడం మంచిది. వ్యాయామం...అవసరం.. జాగ్రత్తలు పాటిస్తూ పిండి వంటలు పరిమితంగా ఆస్వాదిస్తూ ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా జోడించాలి. ఒక్కసారిగా అధికంగా శరీరానికి అందిన కేలరీలు ఖర్చయేందుకు శారీరక శ్రమ తప్పనిసరి. పండుగలు ఏటేటా వస్తాయి... ఇప్పటి పరిస్థితుల్లో ఆరోగ్యం కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం సులభం కాదని గుర్తుంచుకోవాలి. పోషకాహారం అవసరం.. నగరంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారున్నారు కోల్పోయిన ఆరోగ్యాన్ని శక్తిని తిరిగి సమకూర్చుకునేందుకు వారికి కొన్ని నెలల పాటు పోషకాహారం అవసరం. పండుగల సందర్భంగా వండే వంటకాల్లో పోషకాలు ఉండేవి తక్కువే. రుచి కోసం వీటిని తీసుకున్నప్పటికీ, మితిమీరకుండా జాగ్రత్తపడాలి. –వాణిశ్రీ, న్యూట్రిషనిస్ట్ -
Health Tips: నోరు అపరిశుభ్రంగా ఉంటే క్యాన్సర్తోసహా.. ఎన్నో సమస్యలు..
నోరు మంచిదైతే ఊరే కాదు... ఒళ్లూ మంచిదవుతుంది. ఈ కొత్త సామెత ఏమిటని ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు తెలుసా? అనేక అనారోగ్యాలకు మన నోరే రహదారి. అదెలాగంటే... ఎప్పుడూ నోరు శుభ్రంగా ఉంచుకుని, నోటి ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే గుండెజబ్బులూ, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటి అనేక జబ్బులను నివారించుకోవచ్చు. గుండెకు కీడు చేసే ఇన్ఫెక్షన్లు నోరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు... అక్కడి నుంచి గుండెకు పాకి జబ్బును కలగజేస్తాయి. అంతేకాదు... నోరు పరిశుభ్రంగా లేకపోతే రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. ఫలితంగా అనేక జబ్బులకు అదే కారణమవుతుంది. అంతేకాదు... అపరిశుభ్రమైన నోరు లేదా అక్కడ చేరే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండెజబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకూ కారణమవుతాయి. ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అక్కడ వచ్చే కొద్దిపాటి సమస్యలైన పళ్లలో రంధ్రాలు (క్యావిటీస్), చిగుర్ల సమస్యలు (జింజివైటిస్, పెరియోడాంటైటిస్) వంటి వాటికి తేలికపాటి చికిత్సలు తీసుకుంటూ ఉంటే... పెద్ద పెద్ద జబ్బులను చాలా చవగ్గా నివారించివచ్చు. చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! అధ్యయనం తాలూకు కొన్ని గణాంకాలివి... ఇటీవలి కరోనా కారణంగా నోటి సమస్యలకు చికిత్స చేయించుకోవడం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు మొదటి లాక్డౌన్ దశలో దాదాపు 90 లక్షల మంది చిన్నారులు చిన్నపాటి దంతసమస్యల చికిత్సలకు సైతం పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఒక అధ్యయనం ప్రకారం... మన దేశంలో 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి దంతవైద్యుల దగ్గరికి వచ్చే చిన్నారుల శాతం 34% నుంచి 10% కి పడిపోయింది. యుక్తవయస్కుల విషయానికి వస్తే... చికిత్సకు వచ్చే పెద్దవారి సంఖ్య గత రెండేళ్లలో 32.6% నుంచి 23.6%కు పడిపోయింది. ఫలితంగా పెరుగుతున్న ముప్పు... దాంతో మునుపు తేలిగ్గా నివారితమైపోయే చాలా జబ్బుల ముప్పు ఇప్పుడు భారీగా పొంచి ఉన్నట్లు ఈ గణాంకాల వల్ల తేటతెల్లమవుతోంది. ప్రాథమికంగా చేసే స్క్రీనింగ్‌తో లేదా చిన్నపాటి సమస్య దశలోనే అంటే... పళ్లలోని రంధ్రా(క్యావిటీ)లకు చిన్నపాటి ఫిల్లింగులు, అరిగిన పళ్లకు క్రౌన్స్ అమర్చడం అనే కొద్దిపాటి చికిత్సలు, పళ్లను శుభ్రం చేసే స్కేలింగ్స్లతో తప్పిపోయే చాలా చాలా పెద్ద అనర్థాల ముప్పు ఇప్పుడు పొంచి ఉందని అర్థం. ఈ అధ్యయనాల ఆధారంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... నిన్నటి వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్యాండమిక్ ముప్పు ఇప్పుడు కొద్దిగా ఉపశమించినందువల్ల ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, చిగుర్ల సమస్యలు లేకుండా చూసుకోవడం, ఒకవేళ చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని మొగ్గ దశలోనే స్కేలింగ్, నోటి ఇన్ఫెక్షన్లకు సాధారణ చికిత్సతోనే కట్టడి చేస్తే ఎంతో పెద్ద జబ్బులనూ ముందే నివారించవచ్చన్న అవగాహనను పెంచుకోవడం చాలా ముఖ్యం. - డాక్టర్ వికాస్ గౌడ్ సీనియర్ దంతవైద్యులు, ఈస్థటిక్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ చదవండి: Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్! -
World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు..
ఆరోగ్యమైన జీవనానికి పోషకాహారం అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే! పోషకాహారం అనే ఆలోచన మదిలోమెదలగానే బరువు తగ్గడం, మధుమేహం, గుండె ఆరోగ్యం.. వంటి ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. ఐతే కంటి ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే. ఆరోగ్యకరమైన చూపు పొందుకోవాలంటే.. లూటిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బేటాకెరొటిన్, ‘ఎ, సి, ఈ’ విటమిన్లు, జింక్.. వంటి పోషకాలు అవసరమౌతాయని ఢిల్లీ నూట్రీషనిస్ట్ లోకేంద్ర తోమర్ సూచిస్తున్నారు. ఏయే ఆహారాల్లో ఆయా పోషకాలు పుష్కలంగా ఉంటాయో తెలుసుకుందాం.. ఆరెంజ్ పండ్లు విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఆహారాలు నయనారోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరెంజ్‌లో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకతకు మాత్రమే కాకుండా కంటిలో శుక్లాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా నల్లగుడ్డుపై కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది కళ్లు పొడిబారకుండా ఉండటానికి, గాయాలను మాన్పడానికి, ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్ట్ రూపాలీ దత్తా తెలిపారు. చదవండి: బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు! క్యారెట్ మన ఇంట్లో పెద్దవాళ్లు క్యారెట్ తింటే కంటి ఆరోగ్యానికి మంచిదని పదేపదే చెప్తుంటారు. ఎందుకంటే.. క్యారెట్లలో అధికంగా ఉండే బీటా కెరొటిన్ విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెందుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారని ఆయుర్వేద నిపుణులు రామ్ ఎన్ కుమార్ కూడా సూచిస్తున్నారు. ఆప్రికాట్ పండ్లు సాధారణంగా వేసవికాలంలో లభించే ఈ పండ్లు మన సంప్రదాయ వంటకాల్లో ఎప్పటినుంచో విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. వీటిని డ్రైఫ్రూట్స్‌గా కూడా వినియోగిస్తాం. డీకే పబ్లిషింగ్వారి ‘హీలింగ్ ఫుడ్స్’ పుస్తకం ప్రకారం వృద్ధాప్యం వల్ల కలిగే దృష్టిలోపాలను నివారించడంలో ఈ పండ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ పండ్లలో బీటాకెరోటిన్ కంటెంట్ కూడా అధికమే. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! రాగులు రాగుల్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే పోలీఫెనాల్స్ అధికంగా ఉంటాయని నూట్రీషనిస్ట్ శిల్సా ఆరోరా తెలిపారు. యాంటీ క్యాటెర్యాక్ట్ స్థాయిలు ఎక్కువ ఉండే పోలీఫెనాల్స్ కంట్లో శుక్లాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ ముప్పు నుంచి కాపాడటంలోనూ వీటి పాత్ర కీలకమైనదే. ఉసిరి మనకు అందుబాటులో ఉండో ఆహారాల్లో ఉసిరి ఒకటి. ఉసిరి రోగనిరోధకతను పెంచడమేకాకుండా దృష్టిలోపాలను నివారించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుందని ఆయుర్వేద నిపుణులు రామ్ ఎన్ కుమార్ సూచిస్తున్నారు. ఉసిరిలోని కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచి మెరుగైన చూపుకు తోడ్పడుతుందని అనేక అధ్యయనాలు కూడా వెల్లడించాయి. శరీరంలోని వివిధ అవయవాల మాదిరిగానే కళ్ల ఆరోగ్యం కూడా ప్రధానమైనదే. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి యేటా అక్టోబర్‌లో వచ్చే రెండో గురువారాన్ని ప్రపంచ దృష్టి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ యేడాది అక్టోబర్ 14న జరుపుకునే ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్ల ద్వారా నయనారోగ్యాన్ని పదిలంగా కపాడుకుందాం.. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. -
రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తిన్నారంటే..
►రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు (సన్ ఫ్లవర్ విత్తనాలు) తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ►ఈ విత్తనాల్లో ప్రొటిన్ , జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ , విటమిన్ ఈ, బీ, బీ6, మంచి కొవ్వులు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ►ఈ గింజల్లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనం నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి. ►విటమిన్ బి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ గింజలు డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి. ►బరువుని అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వదు. ►ఇంకా దీనిలో ఉన్న విటమిన్ ‘ఈ’ చర్మానికి పోషణ అందించి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చదవండి: బ్రేకింగ్ రికార్డ్.. ఏడడుగుల సౌకుమార్యం -
Health Tips: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా..
ఓ వైపు కోవిడ్, మరోవైను డెంగ్యూ, ఫ్లూ, చికెన్‌గున్యా.. రోగాలు. ఎటునుంచి ఓ వ్యాధి సోకుతుందో తెలియని సందిగ్ధం. అదేంటో కొందరు దేనినైనా తట్టుకుని దృఢంగా నిలబడతారు. మరికొంతమందేమో చిన్న పాటి జలుబుకు కూడా బెంబేలెత్తిస్తారు. ఇమ్యునిటీ సిస్టంలో వ్యత్యాసాలే ఇందుకు బలమైన కారణం. వంటగదిలో దొరికే తేలికపాటి పదార్ధాలతో సింపుల్‌గా తయారు చేసుకునే ఈ హెర్బల్ టీ తో మీ రోగనిరోధకతను పెంచుకోవచ్చని డా. అంజలి శర్మ చెబుతున్నారు. దాన్ని తయారుచేసుకునే విధానం మీ కోసం.. కావల్సిన పదార్ధాలు ►2 కప్పుల నీళ్లు ►గళ్ల ఉప్పు (తగినంత) ►1/4 టీ స్పూన్ వాము (కరోమ్ సీడ్స్ లేదా అజ్వైన్) ►1/4 టీ స్పూన్ జీలకర్ర ►1/4 టీ స్పూన్ పసుపు ►లవంగం ఒకటి ►ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ►అర టీస్పూన్ సోంపు గింజలు తయారీ విధానం ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనియ్యాలి. తర్వాత అన్నింటినీ మరిగే నీళ్లలో వేసి మూత పెట్టి 3 నుంచి 4 నిముషాలపాటు మరగనియ్యాలి. తర్వాత వేడి వేడిగా తాగాలి. ప్రయోజనాలు.. ఈ హెర్బల్ టీలోని వాము, జీలకర్ర, సోంపు గింజలు మీ రోగనిరోధకతను పెంచడమేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్థాయి. తాపాన్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే పసుపు శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడి రక్షణ నిస్తుంది. ఈ టీ ప్రతి ఉదయం తాగితే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు డా. అంజలి శర్మ సూచిస్తున్నారు. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
జింక్ ప్రాముఖ్యం తెలుసా.. తగుస్థాయిలో తీసుకోకపోతే..
మన శరీరానికి విటమిన్లతోపాటు మినరల్స్ (ఖనిజాలు) కూడా తగుమోతాదులో అవసరమే! అంటే కాల్షియం, మాగ్నిషియం, ఐరన్ వంటివి మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. వాటిల్లో ముఖ్యమైన ఖనిజం జింక్. మన శరీరంలో ఈ ఖనిజం నిర్వహించే ముఖ్య విధులు, ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం.. జింక్‌ను ఎందుకు తీసుకోవాలి? మన వ్యాధినిరోధక వ్యవస్థ వివిధ అలర్జీలు, వ్యాధులు, వైరస్ల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే కోవిడ్ సంక్షోభ కాలంలో అందరి దృష్టి ఇమ్యునిటీ పై పడింది. మరి ఇమ్యునిటీ ఏవిధంగా పెంచుకోవాలి? అనే అంశంపై చాలా మందికి క్లారిటీ లేదు. ముఖ్యంగా విటమిన్ ‘సి’, ‘డి’ లతో పాటు జింక్ ఖనిజం కూడా ఇమ్యునిటీ పెంపునకు తోడ్పడుతుంది. మన శరీరంలో జింక్ నిర్వహించే పాత్ర ఏమిటి? మానవ శరీరంలో అనేక జీవక్రియలతో జింక్ సంబంధం కలిగి ఉంటుంది. భిన్న కణసంబంధ ప్రక్రియల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ప్రొటీన్ సంశ్లేషణ, గాయాలు నయంచేయడానికి, కణ విభజనకు, డీఎన్ఏ సమన్వయానికి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా సంభవించే జలుబు, హైపోథైరాయిడ్ నివారణకు, జీర్ణ వ్యవస్థకు, హృదయ సంబంధింత వ్యాధుల నుంచి రక్షణ, చర్మ మరియు కంటి ఆరోగ్యానికి, రుచి, వాసన పసిగట్టడానికి ఇది అవసరం. అంటువ్యాధులతో పోరాడి రక్షణ కల్పించడంలో జింక్ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రపంచ వ్యాప్త పరిశోధనల్లో రుజువైంది. జింక్ తగుమోతాదులో తీసుకోకపోతే ఏమౌతుంది? మానవ శరీరం దానంతట అది జింక్‌ను ఉత్పత్తి చేసుకోలేదు, అలాగే నిల్వ చేసుకునే అవకాశం కూడా లేదు. కేవలం ఆహారం ద్వారా మాత్రమే అది శరీరానికి అందుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం యేటా సుమారు 8 లక్షల మంది జింక్ కొరతతో మరణిస్తున్నారు. వారిలో సగానికిపైగా 5యేళ్లలోపు పిల్లలు ఉండటం గమనార్హం. జింగ్ లోపిస్తే రోగనిరోధక వ్యవస్థ పనితీరు సన్నగిల్లి, క్రమంగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఎక్కువ. సెల్యులర్, సబ్ సెల్యులర్ స్థాయిల్లో అకాల కణ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆకలి మందగించడం, గాయాలు నెమ్మదిగా మానడం, పేగు సంబంధిత వ్యాధులు, మొటిమలు, మానసిక రుగ్మతలు తలెత్తడం, జుట్టు రాలడం, బ్లడ్ షుగర్ సమస్యలు, సంతాన వైఫల్యం వంటివి సంభవించవచ్చు. ఒక రోజుకు ఏంత పరిమాణంలో జింక్ అవసరం? జింక్ చాలా సూక్ష్మస్థాయిలో మాత్రమే మన శరీర ఆరోగ్యానికి అవసరం అవుతుంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఒక రోజుకు మహిళలకైతే 8 గ్రాములు, పురుషులకు11 గ్రాముల జింక్ అవసరం అవుతుందని వెల్లడించింది. గర్భం దాల్చిన మహిళలకైతే రోజుకు 11 గ్రాములు, పాలిచ్చే తల్లులకు 12 గ్రామలు జింక్ అవసరం అవుతుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారం ►మాంసాహారంలో, నత్తగుల్లల్లో, పౌల్ ట్రీ ఉత్పత్తుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ►మొక్క సంబంధిత ఆహారంలో సాధారణంగా జింక్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే శాఖాహారంలో జింక్ లభ్యత తక్కువ. అయినప్పటికీ బ్రెడ్, చిక్కుళ్లు, కాయధాన్యాలు, పప్పుధినుసులు మొదలైన వాటిల్లో జింక్ లభ్యత ఉంటుంది. అలాగే కొన్ని వంటలను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో వండటం లేదా మొలకెత్తించడం ద్వారా కూడా దీనిని పొందుకోవచ్చు. అంటే బీన్స్, ధాన్యాలు, విత్తనాలను నానబెట్టడం, వేయించడం, పులియబెట్టడం ద్వారా జింక్ లభ్యతను పెంపొందించుకుని ప్రయోజనం పొందవచ్చు. ►మన దేశంలో అనేక మంది ధాన్యపు ఆహారఅలవాట్లు కలిగి ఉండటం వల్ల జింక్ హీనత అధికంగా కనిపిస్తుంది. కొన్ని సార్లు మాంసాహారులకంటే శాకాహారులకే 50 శాతం అధికంగా జింక్ అవసరం అవుతుంది. అందుకు ఉత్తమ మార్గం ఏమిటంటే... పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, కాయధాన్యాల్లో పుష్కలంగా జింక్ ఉంటుంది. అలాగే వాల్నట్స్, బాదం పప్పు, జీడి పప్పు, పొద్దు తిరిగుడు, గుమ్మడి, పుచ్చకాయ విత్తనాలు వంటి గింజల ద్వారా జింక్ కొరతను భర్తీ చేయవచ్చు. అలాగే అవకాడో పండు, జామ, పుట్టగొడుగులు, బచ్చలికూర, బ్రకోలి క్యాబేజిలలో కూడా జింక్ నిండుగా ఉంటుంది. కాబట్టి పటిష్టమైన ఇమ్యునిటీని పెంపొందించడంలో జింక్ ప్రాధాన్యత ఎనలేనిది. కోవిడ్ నుంచే కాకుండా ఇతర అంటురోగాలు, వ్యాధుల నుంచి మన శరీరానికి రక్షణ కల్పించడంలో జింక్ కూడా అవసరమేనని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోండి. చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!! -
వర్షాకాలం: ఆహారాన్ని సరిగ్గా ఉడికిస్తున్నారా లేదా!
ఋతువులు మారే కొద్దీ మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాకాలంలో ఐతే ఇక చెప్పక్కరలేదు. షరా మామూలే! అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి. మరెలాగని అనుకుంటున్నారా? వెరీ సింపుల్!! మన రక్షణా వ్యవస్థ పటిష్టంగా ఉంటేచాలు. ప్రముఖ నూట్రీషనిస్ట్ రాధికా కార్లే సూచించిన ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి.. విటమన్ ‘సి’ అధికంగా ఉండే ఆహారం రెడ్ బెల్ పెప్పర్ లేదా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్, బొప్పాయి, నిమ్మ, టమాటాలలో విటమన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే మీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. బయట తినకపోవడం మంచిది ఇంటి వంటలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. సాధ్యమైనంత వరకు హోటళ్లు, రోడ్డు పక్క దొరికే చిరుతిండ్లు తినకపోవడం మంచిది. జొన్న లేదా అమరంత్ వంటి చిరు ధాన్యాల్లో కూడా ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. కూరగాయల ముక్కలు వేసి కిచిడీలా తయారు చేసుకుని తింటే రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. సుగంధ ద్రవ్యాలు పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వంటి మసాలా దినుసులు కూడా మీ ఇమ్యునిటీ పుంజుకునేలా చేస్తాయి. వంటకాల్లో ఈ మసాలా దినుసుల వాడకం ఉండేలా చూసుకోంది. అలాగే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన టీ లేదా నిమ్మ రసంలో కొన్ని అల్లం ముక్కలు చేర్చి ఉదయాన్నే తాగితే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. తగు మోతాదులో నీరు త్రాగాలి కాలాలతో సంబంధం లేకుండా అన్ని ఋతువుల్లో తప్పనిసరిగా సరిపడినంత నీరు త్రాగాలి. నీళ్లతోపాటు జ్యూస్‌లు, ఔషధ మూలికలతో తయారుచేసిన కషాయాలు తరచూ తాగుతూ ఉండాలి. ఆహారాన్ని సరిగ్గా ఉడికించాలి మార్కెట్ నుంచి కొని తెచ్చుకునే తాజా ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా కూడా వెన్నంటే ఉంటుంది. కాబట్టి తగినంత వేడి మీద ఆహారాన్ని ఉడికించాలి. అలాగే తొక్క ఒలిచి తినే పండ్లు అంటే.. అరటి, మామిడి, పుచ్చకాయ, ఆరెంజ్, లీచీ.. వంటి ఇతర ఫలాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఇమ్యునిటీ పుంజుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మేకప్‌తో దాచేసినా ఇబ్బంది తప్పదు.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్! -
రోజూ ఉదయం ఈ 5 రకాల డ్రింక్స్ తాగారంటే..
ఎన్నడూలేనిది గత రెండేళ్లుగా మాత్రం అందరికి ఆరోగ్యంపై తెగ శ్రద్ధ పెరిగింది. అందుకు కరోనా కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలను హరించేస్తుంది. దీంతో అందరి దృష్టి ఇమ్యునిటీ ఏవిధంగా పుంజుకుంటుందనే విషయంపై పడింది. ఒకప్పుడు (రెండేళ్ల క్రితం) రుచిగా ఉండే వంటకాలు, స్పైసీ వంటకాలు, స్వీట్స్.. వీటినే ఎడాపెడా తినేశాం. కానీ రోజులు మారాయి. ఆహారపు అలవాట్లు కూడా మారాలనే వాస్తవం సర్వమానవలోకానికి త్వరగానే బోధపడింది. దీంతో ఆచితూచి ఏది తినాలో, ఏది తాగాలో ఆలోచించడం ప్రారంబించాం. ఉదయం ఆహ్లాదంగా ప్రారంభమైతే రోజంతా దాని ప్రభావం మనపై ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా సెప్టెంబర్ 1 నుంచి జాతీయ పోషకాహార వారం (నేషనల్ న్యూట్రిషన్ వీక్)ప్రారంభమైన నేపథ్యంలో అటు రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రతి ఉదయం తీసుకోల్సిన పానియాలు, వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చదవండి: క్యాన్సర్.. ఫాలో అప్ల ప్రాధాన్యమెంత? ఇదిగో ఇంత! గ్రీన్ జ్యూస్ ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి. వీటిని జ్యూస్ రూపంలో ప్రతిరోజూ తాగవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే.. పాల కూర, లెట్యూస్ ఆకులు లేద కాలే తో జ్యూస్ చేసుకుని, మీ రుచికి తగినవిధంగా కొంచెం షుగర్‌ను జోడించండి. ఈ విధంగా తయారుచేసుకున్న జ్యూస్ ప్రతి ఉదయం తాగడం ద్వారా అనేకరకాల పోషకాలను అందించడంతోపాటు మీ ఇమ్యునిటీని కూడా పెంపొందిస్తుంది. బొప్పాయి జ్యూస్ ఈ జ్యూస్ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఎంతో ఉపకరిస్తుంది. 5 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ జ్యూస్‌లో విటమిన్ ‘సి’ అధిక మోతాదులో ఉంటుంది. తొక్క తీసిన బొప్పాయి ముక్కలతో చేసిన జ్యూస్‌లో, నానబెట్టిన హలిమ్ విత్తనాలను కలుపుకుని తాగవచ్చు. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ బీట్రూట్, క్యారెట్ జ్యూస్‌లో ‘ఏ, సి, ఇ’ విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ మిశ్రమంలో కొంచెం అల్లం, పసుపు కలిపి తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధకత పుంజుకుంటుంది. ఇన్ఫ్లమేషన్తో బాధపడేవారికి ఈ జ్యూస్ ఉపశమనాన్నిస్తుంది. వెలగపండు పానియం మన దేశంలో ఎక్కడైనా దొరికే ఔషధ ఫలం వెలగపండు . దీనిని మారేడు పండు అని కూడా అంటారు. ఈ పండులో ఫైబర్, విటమిన్ ‘సి’ లతోపాటు పోషకాలు నిండుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపకరించే ఈ వెలగపండు జ్యూస్ వడదెబ్బ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. కొకుమ్, అంజీర జ్యూస్ కొకుమ్ ఫలాలు, అంజీర పండ్ల రసంలో జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్‌ను కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్లో ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంత చల్లటి నీటిని చేర్చి రోజు మొత్తంలో ఏ వైళలోనైనా సేవించవచ్చు. ప్రతి ఉదయం ఈ 5 రకాలైన పానీయాలు తీసుకోవడం ద్వారా మీ ఇమ్యునిటీని పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసి చూడండి -
ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే!
How To Boost Immunity.. 5 Simple Ways శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కొంత మందికి చిన్నతనం నుంచే రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. మరి కొంతమందికి వయసుతో పాటు జీవన ప్రమాణాల కారణంగా పెంపొందుతుంది. అందుకు పోషకాహారం అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే విషయంలో మనలో చాలా మందికి క్లారిటీ లేదు. ప్రస్తుత కరోనా కల్లోలకాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీ యేటా సెప్టెంబర్ మొదటి వారంలో జరుపుకునే వార్షిక కార్యక్రమమే నేషనల్ న్యూట్రిషన్ వీక్(జాతీయ పోషకాహార వారం). ఈ ఏడాది కార్యక్రమంలో.. 5 సులభతర మార్గాల ద్వారా రోగనిరోధకతను పెంపొందించుకునే పద్ధతులు మీకోసం.. సరిపడినంతగా నీరు మనిషి శరీరంలోని ప్రతి జీవాణువు, కణజాలం, అవయవం సమర్థవంతంగా పనిచేయాలంటే సరిపడినంతగా నీరు తాగాలి. ఆరోగ్యకరమైన జీవనానికి మూల సూత్రమే ఇది. హైడ్రేషన్ శరీరం పనితీరును నియంత్రించడంలో, జీవక్రియను సరైన మార్గంలో నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నీరు రోగనిరోధకతను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఆకుపచ్చ కూరగాయలు కూరగాయలు, ఆకుకూరలు తినమని పేరెంట్స్ ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ సహజసిద్ధంగా అందిస్తాయి కాబట్టే! విటమన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్లు.. మొదలైనవి అధిక మోతాదులో అందించడమే కాకుండా రోగనిరోధకత పెంపుకు తోడ్పడతాయి. ప్రొబియోటిక్ ఫుడ్ రోగనిరోధకతను పెంపొందించడంలో కడుపులోని ఆహారనాళం కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధకతను పెంచడానికి తోడ్పడుతుంది. అందుకే మన రోజువారి ఆహారంలో పెరుగు, మజ్జిగ మొదలైన పాల ఉత్పత్తులు ఉండాలని న్యూట్రిషనిస్ట్స్ సూచిస్తుంటారు. తాజా పండ్లు, పండ్ల రసాలు పండ్లు, పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాన్ని కొట్టిపారేయలేము. నేరుగా తిన్నా లేదా జ్యూస్ రూపంలో తాగినా ముఖ్యమైన పోషకాలన్నీ సహజమైన మార్గంలో అందిస్తాయి. మన ఆహారంలో వీటి పాత్ర కూడా కీలకమే. మూలికలు, సుగంధ ద్రవ్యాలు రోగనిరోధకతను పెంచడంలో దాల్చినచెక్క, జీలకర్ర, పసుపు.. వంటగదిలో ఉపయోగించే ఇతర సుగంధ ద్రవ్యాల ప్రాధాన్యాన్ని మరచిపోకూడదు. వంటల్లో ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాకుండా, యుగాలుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో కూడా విరివిగా వాడుకలో ఉన్నాయనేది నిపుణులు చెప్పే మాట. కరోనా మహమ్మారి కాలంలో కూడా కషాయం, హెర్బల్ టీ, చూర్ణం మొదలైన పద్ధతుల్లో.. వీటిని వినియోగించడం చూశాం. ఈ మూలికలు, సుగంధ ద్రవ్యాల్లో యాంటి ఆక్సిడెంట్స్, యాంటి బ్యాక్టీరియాలను బలపరిచే లక్షణాలు పుష్కలంగా ఉండటమే వీటి ప్రత్యేకతకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. చదవండి: గర్భిణులూ.. చక్కెర తగ్గించండి! -
NLR 3238: జింక్ పుష్కలం.. ఇతర సప్లిమెంట్లతో పనిలేదు!
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి కలవరపెడుతున్న తరుణంలో ఎవరి నోట విన్నా సి–విటమిన్, జింక్‌తో కూడిన మల్టీవిటమిన్లు వంటి పేర్లు వినపడుతున్నాయి. కరోనా నివారణ కోర్సులో జింక్ బిళ్లల వాడకం భాగమైంది. రోగనిరోధక శక్తిని పెంచే కారకాల్లో జింక్ ఒకటి కావడమే ఇందుకు కారణం. అయితే.. బిళ్లలు, టానిక్‌ల రూపంలో కంటే మనం తినే ఆహారంలోనే జింక్‌ను భాగంగా చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. జింక్ కోసం కొన్ని రకాల బియ్యాల్ని వారు సిఫార్సు చేస్తున్నారు. అటువంటి వాటిలో ఒకటి.. ఎన్‌ఎల్‌ఆర్ 3238. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందించిన ఈ వంగడంలో జింక్ ఎక్కువగా ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్‌ఎల్‌ఆర్ 3238లో సుమారు 22.5 శాతం జింక్ ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. మిగతా వరి రకాల్లో జింక్ గరిష్టంగా 16 శాతం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై జింక్ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, అందుకు ఎన్‌ఎల్‌ఆర్ 3238 పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలోనే జింక్ ఉంటే ఇక సప్లిమెంట్లతో పనే ఉండదంటున్నారు. ఈ వంగడం సమర్థంగా పనిచేయడంతోపాటు బ్యాక్టీరియా, వైరస్ వంటివి సోకకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచడంలో ఉపకరిస్తుందని వివరిస్తున్నారు. ఇదీ ఎన్‌ఎల్‌ఆర్ చరిత్ర.. ఎంటీయూ 1010, బీపీటీ 5204 సంకరంతో ఈ ఎన్‌ఎల్‌ఆర్ 3238ను సృష్టించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ టి.గోపీకృష్ణ వివరించారు. ఈ వంగడం అభివృద్ధి వెనుక అనేకమంది వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఉంది. స్వల్పకాలంలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాల సృష్టిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనల అనంతరం ఐదేళ్ల తర్వాత ఈ వంగడం బయటకు వచ్చింది. ఎకరానికి 35 – 40 బస్తాల దిగుబడి తెగుళ్లను తట్టుకోవడం, అధిక దిగుబడి ఎన్‌ఎల్‌ఆర్ 3238 ప్రత్యేకత. ఎకరానికి 35 – 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. దిగుబడిలో బీపీటీ రకాలతో ఎన్‌ఎల్‌ఆర్ 3238 పోటీ పడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల సమయంలోనే గుర్తించారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాచుర్యం కలిగి దేశవ్యాప్తంగా పేరుగాంచిన బీపీటీ 5204తో సమానంగా ఈ వంగడం దిగుబడి ఇస్తుంది. పైగా దీన్ని అన్ని కాలాల్లో పండించవచ్చు. బీపీటీ 5204, ఎంటీయూ 1010లతో సమానంగా దిగుబడి ఉంది. ఒక్క నెల్లూరులోనే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ వంగడాన్ని పరీక్షించి చూశారు. విస్తృత పరిశోధనలు చేసి పర్యావరణ అనుకూల వంగడంగా పరిగణించాకే మార్కెట్‌కు విడుదల చేశారు. ఎన్‌ఎల్‌ఆర్ 3238లో ఒక్క జింకే కాకుండా అన్నం కూడా బాగా ఆటి వస్తుంది.. వదుగ్గా ఉండి తినేందుకు బాగుంటుంది. విత్తనాల కోసం నెల్లూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారిని సంప్రదించవచ్చు. చదవండి: World Organ Donation Day: మొట్టమొదట అవయవాన్ని దానం చేసింది ఎవరో తెలుసా? -
కోవిడ్ టీకాలపై పేటెంట్లు రద్దు చేస్తే మేలు
సబ్బవరం (పెందుర్తి): ప్రపంచ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోవిడ్ టీకాలపై పేటెంట్ హక్కులను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి అభిప్రాయపడ్డారు. వర్సిటీ మేధో సంపత్తి హక్కుల కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ నమూనా సమావేశాలు శనివారం ముగిసాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక మార్గం కాగా.. టీకా తీసుకోవడం మరో మార్గమన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత.. ప్రజలకు దాన్ని అందించే క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఆయా ఉత్పత్తి కంపెనీలు తమ పేటెంట్ హక్కులను సరళం చేసినప్పుడే అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. కోవిడ్–19 కారణంగా ఛిన్నాభిన్నమైన పేద దేశాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, దక్షిణాఫ్రికా సూచించిన తాత్కాలిక పేటెంట్ హక్కుల రద్దు ప్రతిపాదనకు అనేక దేశాలు మద్దతు పలికినప్పటికీ, ధనిక దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. అన్ని దేశాలు, ఆయా కంపెనీలు ప్రజా రక్షణ దృష్ట్యా కొంత కాలమైనా పేటెంట్ హక్కుల రద్దు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచిన జేఎస్ఎస్ లా కళాశాల, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఎస్.సూర్యప్రకాష్ అభినందించారు. -
వృద్ధాప్యంలో డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసా?
మనిషి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు సహజం. వృద్ధాప్యమంటే మరోమారు బాల్యదశకు చేరినట్లేనని పెద్దలు చెపుతుంటారు. వయసు పెరిగి వృద్ధాప్యం ముదిరేకొద్దీ వారిని పసిపిల్లల్లాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వయసుపైబడుతున్న కొద్దీ ప్రతి జీవిలో అనేక జైవిక మార్పులు జరుగుతుంటాయి. మనుషుల్లో వయసు మీరే కొద్దీ జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడడం, మతిమరుపు పెరగడం వంటివి గమనించవచ్చు. వృద్ధాప్యం ముదిరే కొద్దీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మెరుగైన ఆరోగ్య విధానాలు అందుబాటులోకి రావడంతో మనిషి జీవన ప్రమాణం పెరుగుతోంది. అదేవిధంగా వృద్ధాప్య సమస్యలకు పరిష్కారాలు కూడా పెరిగాయి. ఇప్పటికీ సమాజంలో వృద్ధుల పట్ల ఈసడింపు, చీదర ఎక్కువగానే గమనించవచ్చు. కానీ ప్రతిఒక్కరూ ఆ దశకు చేరుకోవాల్సిన వాళ్లేనని గుర్తించి పెద్దలపై, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజ విచ్ఛిన్నం జరుగుతుందని మానవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధులను భారంగా పరిగణించేవారు అసలెందుకు వృద్ధాప్యంలో సమస్యలొస్తాయో అవగాహన పెంచుకోవడం అవసరమన్నది నిపుణుల మాట. అలాగే ఎవరమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు సైతం ఈ అవగాహన ఉపయుక్తంగా ఉంటుంది. సో, జీవన సంధ్య వేళ సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం! వయోవృద్దుల్లో జీర్ణక్రియ మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోతుంటారు. ఇది క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణతకు, కండరాల బలహీనతకు, అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే తినేది కొంచమైన పౌష్టికాహారం తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ తినలేకపోతే, కొద్దికొద్దిగా పలుమార్లు ఆహారం తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. దైనందిన ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, సాల్ట్, ఫ్యాట్ కలిగిన ఆహారాలను తగ్గించాలి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు సాధారణంగా వృద్ధాప్యంలో డిప్రెషన్ వస్తుంది. అంతవరకు ఎంతో చురుగ్గా తిరుగుతూ అందరినీ శాసించినవారు క్రమంగా నిస్సహాయత ఆవరించడంతో ఏపని చేసుకోలేక డిప్రెషన్ బారిన పడుతుంటారు. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నిరశా నిస్పృహలకుదారి తీస్తాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, కుటుంబం, స్నేహితుల సాయంతో ఉల్లాసంగా గడపడం, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్ ఛాయలు మనసులోకి రాకుండా చూసుకోవడం చేయవచ్చు. ఫుల్స్టాప్ పెట్టాలి. చిన్నప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తూ వచ్చిన చెవులు, కళ్లు, నోరు వయసు ముదిరేకొద్దీ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. దీంతో చెవుడు, చూపు మందగించడం, పంటి సమస్యలు ఎదురవతుంటాయి. కళ్లజోడు, హియరింగ్ ఎయిడ్స్‌తో ఈ సమస్యలను అధిగమించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వినికిడి, దృష్టి లోపాలను ముందస్తుగానే గుర్తించవచ్చు. అదేవిధంగా పెద్దయ్యేకొద్దీ వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం, ఇతర రకాల అనారోగ్య సమస్యలతో పళ్లు దెబ్బతినడం, నోరు పొడిబారడం, చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల మొదటి నుంచి డెంటల్కేర్పై దృష్టి సారించాలి. ధూమపానం, పాన్ పరాగ్, తంబాకు వంటి అలవాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలి. మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. -
మనదేశంలో కోవిడ్–19 మూడోవేవ్
కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధిని కోవిడ్–19 అంటారన్నది తెలిసిందే. ఈ ఇంగ్లిష్ పదంలో తొలి రెండు అక్షరాలు ‘సీఓ’ అన్నవి కరోనాను, ‘విఐ’ అన్నవి వైరస్‌నూ ‘డి’ అన్నది డిసీజ్ అంటే వ్యాధిని సూచిస్తాయి. ఇటీవల మూడోవేవ్‌లో కోవిడ్–19 వ్యాధి పిల్లలపై తీవ్రప్రభావాన్ని చూపబోతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... కరోనా గురించి అనేక అంశాలను తెలుసుకుందాం. ►మనదేశంలో మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందా? జవాబు : అవును. వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అయితే తీవ్రత అంచనా వేయలేం. ఏ మహమ్మారి (ప్యాండమిక్) అయినా దశలవారీగా వస్తుంటుంది. అది ఏళ్ల తరబడి ఉత్పరివర్తనాలు చెందుతూ... దాని ప్రభావం నామమాత్రం అయ్యేవరకూ లేదా ఓ ప్రాంత ప్రజలందరిలోనూ దానిపట్ల వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) పెంపొందేవరకు అది తన ప్రభావం చూపుతూనే ఉంటుంది. ►మూడో వేవ్ ముప్పు పిల్లల్లో ఎక్కువా? జవాబు : ఇటీవల ఢిల్లీలోని ఏఐఐఎమ్ఎస్తో పాటు ఇతర హాస్పిటల్స్‌లో జరిగిన పరిశోధనల ప్రకారం పెద్దలతో పోలిస్తే పిల్లల్లో సీరో–పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇప్పుడున్న కోవిడ్–1 వేరియెంట్... రెండేళ్లు అంతకు పైబడి వయసున్న పిల్లలపై ప్రభావం ఖచ్చితంగా చూపుతుందని తెలియరాలేదు. ►పెద్దలతో పోల్చినప్పుడు అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందా? జవాబు : ఈ విషయమై అనేక అధ్యయనాలూ, పరిశీలనలూ జరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి ‘ఏసీఈ రిసెప్టార్’ల గురించి జరుగుతున్న అధ్యయనం. అవి పిల్లల్లో తక్కువగా ఉన్నందున... ఆ ప్రకారం చూస్తే 90 – 94 శాతం మంది పిల్లల్లో కోవిడ్–19 వ్యాధి తీవ్రత చాలా స్వల్పంగానే ఉండే అవకాశాలున్నాయి. హాస్పిటల్లో చేరాల్సిరావడం చిన్నారుల్లో చాలా చాలా తక్కువే. ►హాస్పిటల్లో చేరాల్సి వచ్చే పిల్లల శాతం ఎంత ఉండవచ్చు? జవాబు: కేవలం 6 – 10 % వరకు ఉండవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు, ఇతరత్రా సౌకర్యాలతో మరణాల రేటు కూడా తక్కువగానే ఉండవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ మరణాల రేటు ఇప్పటికే చాలా తక్కువగానే ఉంటోంది. ►కోవిడ్–19 వచ్చి కోలుకున్న పిల్లల్లో అనంతర దుష్ప్రభావాలు ఏవైనా ఉండవచ్చా? జవాబు : కోవిడ్–19 నుంచి కోలుకున్న 2 – 6 వారాల తర్వాత వ్యాధి నిరోధక సమస్య కారణంగా వాళ్లలో ‘ఎమ్ఐఎస్–సి’ (మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ ఛైల్డ్) అనే రుగ్మత కనిపించవచ్చు. పాజిటివ్ వచ్చిన పిల్లల్లో కేవలం 1 – 2 శాతం లోపు పిల్లల్లోనే ఈ ‘ఎమ్ఐఎస్–సి’ కనిపించే అవకాశం ఉంది. ►ఎమ్ఐఎస్–సి అంటే ఏమిటి? దాన్ని గుర్తించడం ఎలా? జవాబు : కోవిడ్–19 వచ్చి తగ్గాక 2–6 వారాల్లో పిల్లల్లో కనిపించేందుకు అవకాశం ఉన్న కోవిడ్ అనంతర రుగ్మతే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ ఛైల్డ్ – ‘ఎమ్ఐఎస్–సి’. నాలుగు రోజులకు పైగా తగ్గని జ్వరం, కళ్లు ఎర్రబారడం, ఒంటి నిండా ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), అదేపనిగా వాంతులు, అరచేతులు, అరికాళ్ల చర్మంలో మార్పులు, నోరు ఎర్రబారడం, నోటిలో పగుళ్లు వంటి లక్షణాలతో ఇది వ్యక్తమవుతుంది. వైద్యపరీక్షల్లో ఇతరత్రా ఏ సమస్యా కనిపించప్పుడు... లక్షణాలను బట్టి ఎమ్ఐఎస్–సి ఉన్నట్లుగా కచ్చితంగా నిర్ధారణ చేసి, తగిన మందులు వాడాలి. ►ఎమ్ఐఎస్–సి నుంచి కోలుకునే అవకాశాలు ఎంత? జవాబు : చాలా త్వరగా కనుగొని, తక్షణం చికిత్స అందిస్తే పిల్లలు చాలా బాగా కోలుకుంటారు. ఎంత త్వరగా కనుక్కుని, ఎంత వేగంగా చికిత్స అందించామన్న అంశంపైన పిల్లల మరణాల నివారణ ఆధారపడి ఉంటుంది. ►తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నివారణ చర్యలేమిటి? జవాబు : పిల్లలను ఇంట్లోనే ఉండేలా జాగ్రత్త పడాలి. భౌతిక దూరం పాటించేలా చూడాలి. రెండేళ్లు పైబడిన పిల్లలకు మాస్క్ వాడాలి. కోవిడ్ నివారణకు అనుసరించే అన్ని జాగ్రత్తలూ వారూ పాటించేలా చూడాలి. ► మనదేశంలో పిల్లల కోసం వ్యాక్సిన్ ఏదైనా అందుబాటులో ఉందా? జవాబు : ఇప్పటికి ఉన్న నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేదు. అయితే ఈ విషయంలో ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయి. కొన్ని నెలల్లోనే వాటి ఫలితాలు వెల్లడికానున్నాయి. దాంతో రెండేళ్లు పైబడిన పిల్లలకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ►పిల్లలకు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ (ఫ్లూ షాట్) ఇప్పించడం అన్నది కోవిడ్–19ను నివారిస్తుందా? జవాబు : ఇన్ఫ్లుయెంజా అన్నది తీవ్రమైన సీజనల్ రుగ్మత. దీని నివారణ కోసం ప్రతీ వర్షాకాలంలో (జూన్‌లో) ఐదేళ్ల వయసు వచ్చే వరకు ప్రతీ ఏడాదీ దాన్ని తీసుకోవాలనేది ఓ సిఫార్సు. అయితే ఇప్పటికి ఉన్న పరిశోధన ఫలితాల ప్రకారం... ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్–19 కూడా నివారితమవుతుందన్న దాఖలా ఏదీ లేదు. అయితే పిల్లలకు హాని చేసే సీజనల్ అంశాల్లో ఇన్ఫ్లుయెంజా కూడా ఒకటైనందున వర్షాకాలం వచ్చే ముందర ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. – డాక్టర్ సూర్యప్రకాశ్ హెడ్డా, ఎండీ (గోల్డ్ మెడల్), ఎఫ్ఐపీఎమ్, పీజీపీఎన్., కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ అండ్ నియోనేటాలజిస్ట్, రెనోవా నీలిమా హాస్పిటల్స్, సనత్‌నగర్ హైదరాబాద్. 040–21111100 9121012265 -
హెర్బల్ మిక్చర్‌తో పశువులకు పుష్టి!
సృష్టిలో ఏ ప్రాణికైనా ఆరోగ్యం, దేహదారుఢ్యం ప్రధానంగా 5 క్రియలపై ఆధారపడి ఉంటుంది. అవి: 1. ఉచ్ఛ్వాస 2. నిశ్చ్వాస 3. సేవనం 4.పచనం 5. విసర్జనం. పశువులలో ఈ 5 క్రియలను దృష్టిలో పెట్టుకొని కొన్ని దినుసులతో ఈ రోజు మనం అమృత తుల్యమైన హెర్బల్ మిక్చర్‌ను తయారు చేసుకుందాం. మినరల్ మిక్చర్, కాల్షియంలకు బదులుగా ఈ హెర్బల్ మిక్చర్ ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ మిక్చర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్ని తిన్న పశువులు ఎండు/పచ్చి గడ్డి ఎక్కువ తింటాయి. కాబట్టి, ఆ మేరకు దాణాను తగ్గించుకోవచ్చు. గోసంరక్షణ శాలలకు దానాలు ఇచ్చే వారు ఈ హెర్బల్ మిక్చర్‌ను స్వయంగా తయారు చేయించి దానం చేస్తే మేలు జరుగుతుంది. హెర్బల్ మిక్చర్‌కు కావలసిన దినుసులు 1. సొంఠి – 200 గ్రా.: దీన్ని ఆయుర్వేదంలో మహా ఔషధంగా పిలుస్తారు. వాత, పిత్త, కఫ దోషాలను సమతూకం చేయగలదు. ప్రధానంగా ఆమ వాత రోగాన్ని నిర్మూలిస్తుంది. 2. మిరియాలు – 150 గ్రా. : మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా కలిగి ఉండి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. 3. పిప్పళ్లు – 50 గ్రా. : దీన్ని రసాయన గుణకారిణి అంటారు. అరుగుదలకు బాగా ఉపయోగపడటమే కాకుండా గర్భాశయ శుద్ధికి దోహదపడుతుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. 4. వాములయు మిరియాలు – 50 గ్రా.: దీన్నే వాయు విడంగాలు అని కూడా పిలుస్తారు. జీర్ణవ్యవస్థలో ఉండే పలు రకాల రుగ్మతలను తొలగించడంతో పాటు మంచి డీవార్మింగ్ దినుసుగా ఉపయోగపడుతుంది. 5. తోక మిరియాలు – 50 గ్రా. : వీటిని చలువ మిరియాలు అంటారు. శరీరానికి చలువ చేస్తూ గుండె రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు నాలుకపై రుచి గ్రంథుల వృద్ధికి, మూత్ర వ్యవస్థ శుద్ధికి చాలా ఉపయోగకారిణి. 6. వాము – 200 గ్రా.: మనుషులు వామును ఎక్కువగా జీర్ణాశయ సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ, పశువుల్లో పాల స్రావాన్ని మెరుగుపరిచే చను గ్రంథులకు శ్రీరామరక్షగా వాము ఉపయోగపడుతుంది. 7. పాల ఇంగువ – 100 గ్రా.: ఇది ఒక యాంటీ మైక్రోబియల్ దినుసు. సుఖ విరేచనకారి గాను, నరాల ఉత్తేజకారిణిగాను ఉపయోగ పడుతుంది. 8. వెల్లుల్లి – 300 గ్రా. : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే నానుడి ఉండనే ఉంది. వెల్లుల్లి కూడా అంతే. ఇది ప్రధానంగా పరాన్న భుక్కులను సమూలంగా నశింపజేస్తుంది. 9. మెంతులు – 150 గ్రా.: మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన పశువులో పొదుగు వాపు దరిచేరనీయక పాల రుచిని బాగా పెంచుతుంది. 10. మోదుగుపువ్వు – 300 గ్రా.: శివునికి ఇష్టమైన పువ్వు. ఇవి కడుపులోని బద్దె పురుగుల నివారణకు, చర్మ వ్యాధుల వలన వచ్చే దురదలను అలాగే విషతుల్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి. 11. దాల్చిన చెక్క – 50 గ్రా.: ఇందులోని 41 సమ్మేళనాలు అనేక రుగ్మతలపై విశేషంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నివారిణిగా, మెదడుకు రక్షణ కారిణిగా పనిచేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 12. నల్లనువ్వులు లేదా వేరు పిసరాకు – 1.5 గ్రా.: జింక్, థయామిన్, ఐరన్, కాల్షియం, విటమిన్–ఇ సమృద్ధిగా ఉండటం వలన వీటిని ఆంగ్లంలో పవర్ హౌజ్ అని పిలుస్తారు. పశువులను ముఖ్యంగా యువి కిరణాల నుంచి నల్ల నువ్వులు రక్షిస్తాయి. నోటి పూతల నివారణకు ఉపయోగపడుతుంది. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు వేరు పిసర ఆకులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో దేనినైనా వాడుకోవచ్చు. 13. ఉలవలు 1.5 కిలోలు : వీటిలో పోషక విలువల అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విశేషంగా పనిచేస్తాయి. 14. తాటి బెల్లం – 1.5 కిలోలు : ఐరన్ అధికంగా ఉంటుంది. జీర్థాశయ ఎంజైముల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. పేగుల్లో ఉన్న విషతుల్యాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. 15. యాలకులు – 50 గ్రా. : యాలకులలో టర్పనైన్, లియోనెన్, టెర్ఫినోల్ లాంటి రసాయనాలు ఉన్నాయి. ఉదర సంబంధమైన అజీర్తి, మలబద్ధకాన్నే కాకుండా అల్సర్‌ను సైతం నివారిస్తాయి. 16. లవంగాలు – 100 గ్రా. : ఇవి రక్తాన్ని గడ్డకట్టడంలోనూ, నొప్పులు, వాపులు నియంత్రించడంలోనూ, రక్త ప్రసరణలోనూ, సంతాన ఉత్పత్తిలోనూ పశువులలో చక్కగా పనిచేస్తాయి. పైన ఉదహరించిన దినుసులను దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్లలో ఆవ నూనె (750 ఎం.ఎల్. నుంచి ఒక లీటరు వరకు) కలుపుకొని తడి తగలకుండా 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. వాడే విధానం : పెద్ద పశువులకు రోజుకోసారి 50 గ్రా. మోతాదులో, దూడలకు రెండు నెలలు దాటిన దగ్గర నుంచి 5–20 గ్రాముల మోతాదులో తినిపించాలి. ప్రతి రోజూ అక్కర్లేదు. వరుసగా నెలకు 10–15 రోజులకు తగ్గకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంతో పశువులను అనేక రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాకుండా దుకాణాల్లో దొరికే మినరల్ మిక్చర్, కాల్షియం వాడకంతో పని లేకుండా అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. పైన చెప్పిన మోతాదులో తయారుచేసుకున్న హెర్బల్ మిక్చర్ 10 పెద్ద పశువులకు, 5 దూడలకు (10 రోజులు) సరిపోతుంది. – వల్లూరు రవి కుమార్ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు,పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా, ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు, డా.వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార గ్రహీత. -
ఈ వేరియంట్లేంటి? మ్యుటేషన్ల ముప్పేంటి?
ఏడాదిన్నర కింద కరోనా వైరస్ దాడి మొదలైంది. ఏడాది కింద మొదటి వేవ్‌తో కలకలం సృష్టించింది. ఇటీవల రెండో వేవ్‌తో అతలాకుతలం చేసింది. త్వరలో మూడో వేవ్ వస్తోందన్న ఆందోళననూ రేకెత్తిస్తోంది. అంతా కరోనానే అయినా.. మొదట్లో వచ్చిన వైరస్ వేరియంట్ ఆల్ఫా, ఇప్పుడున్నది డెల్టా, మూడోవేవ్‌కు కారణమవుతాయన్నది డెల్టా ప్లస్. మరి అసలు వైరస్ ఇలా మ్యూటేట్ అవడం ఏమిటి? కారణాలు ఏమిటి? దీనివల్ల ప్రమాదం ఎంత? దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వైరస్ మ్యుటేషన్లు, వేరియంట్లు ఏమిటి? సాధారణంగా వైరస్లు పరిస్థితులకు అనుగుణంగా తరచూ వాటిల్లోని జన్యు, ప్రొటీన్ పదార్థాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులనే మ్యుటేషన్లు అంటారు. జన్యు, ప్రొటీన్లలో జరిగిన మార్పులను బట్టి ఆ వైరస్ లక్షణాలు తీవ్రంగా మారడంగానీ, ఉన్న సామర్థ్యాన్ని కోల్పోవడం గానీ జరుగుతుంది. ఇలా మ్యుటేషన్లు జరిగిన వైరస్ రకాలనే వేరియంట్లు అంటారు. వైరస్ ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందుతూ పోతుంటే.. అంత ఎక్కువగా మ్యుటేషన్లు చెంది కొత్త కొత్త వేరియంట్లు వస్తాయి. వీటిలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వేరి యంట్లను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (వీఓఐ)’గా.. ప్రమాదకరంగా మారే అవకాశమున్న వాటిని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ)’గా సూచిస్తున్నారు. కరోనా ఎందుకు మార్పు చెందుతోంది? ►ప్రజలు కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం ►వ్యాపించిన కొద్దీ వైరస్ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ►భారీగా పునరుత్పత్తి చేసుకునే క్రమంలో వైరస్ విభజనలో తేడాలు ►ప్లాస్మా థెరపీ, వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి చికిత్సలతో శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తిని ఎదుర్కొనేందుకు వైరస్ ప్రయత్నించడం. మ్యుటేషన్ల వల్ల ప్రమాదం ఎంత వరకు? ►వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉండటం ►వ్యాప్తి చెందే సామర్థ్యం పెరగడం ►రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం ►ఊపిరితిత్తుల కణాలకు మరింత సులువుగా అతుక్కునే సామర్థ్యం రావడం ►ఒకచోట ఉన్నవారందరికీ గుంపులుగా ఇన్ఫెక్ట్ కావడం ►మోనోక్లోనల్ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే శక్తి సంతరించుకోవడం దేశంలో ‘కన్సర్న్’ వేరియంట్ల పరిస్థితి ఏమిటి? ►దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 174 జిల్లాల్లో ప్రమాదకర కరోనా వేరియంట్లను గుర్తించారు. ►ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఇవి ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. ►40వేల శాంపిళ్లలో ప్రమాదకర వేరియంట్లపై చేసిన కమ్యూనిటీ స్టడీలో.. ఆల్ఫా వేరియంట్ కేసులు 3,969.. గామా రకం ఒకటి.. బీటా రకం 149.. డెల్టా, దాని అనుబంధ రకాల కేసులు 16,238 నమోదయ్యాయి. ►కరోనా కొత్త కేసుల్లో ‘వీఓసీ’ల శాతం మే రెండో వారంలో 10.31 శాతమే ఉండగా.. జూన్ 20 నాటికి ఏకంగా 51 శాతానికి పెరిగింది. అంటే ప్రమాదకర వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోంది. డెల్టా వేరియంట్లు.. ప్రమాదం లెక్కలివీ.. దేశంలో కరోనా రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా (బీ.1.617) వేరియంట్ మరికొన్ని మార్పులు చెంది.. మూడు సబ్ వేరియంట్లు గా మారింది. ఇందులో కప్పా (బీ.1.617.1), లంబ్డా (బీ.1.617.3)లను జాగ్రత్త పడాల్సిన ‘వీఓఐ’ రకాలుగా గుర్తించారు. మరొకటైన డెల్టా ప్లస్ (బీ.1.617.2 లేదా ఏవై.1) రకాన్ని ప్రమాదకరమైన ‘వీఓసీ’ రకంగా ప్రకటించారు. ►డెల్టా ప్లస్ వేరియంట్‌కు వ్యాప్తి చెందే లక్షణం, ఊపిరితిత్తుల్లోని కణాలకు అతుక్కునే సామర్థ్యం మరింత ఎక్కువ. వ్యాక్సిన్‌తో శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి నుంచి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే సామర్థ్యం పెరిగింది. దేశంలో ‘డెల్టా ప్లస్’ కేసుల తీరు ►దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 51 డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు. ►ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్‌లలో ఈ వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ►వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ వేరియంట్ కరోనా సోకినవారి పరిస్థితి ఏమిటి, వ్యాక్సిన్ ప్రభా వం ఎంత వరకు ఉందన్నది కచ్చితంగా తేల్చేందుకు పలు ఆస్పత్రుల్లో అధ్యయనం జరుగుతోంది. ప్రమాదకర వేరియంట్ల నియంత్రణ ఎలా? దేశంలో ప్రమాదకర వేరియంట్లు విస్తరిం చకుండా కేంద్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ఈ తరహా కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం, బాధితులను ప్రత్యేకంగా ఐసోలేట్ చేసి, తగిన చికిత్స అందించడం, వారి కాంటా క్టులను క్వారంటైన్ చేయడం, ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ భారీగా చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ►ప్రమాదకర వేరియంట్లు వచ్చిన జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైద్యారోగ్య సేవలను పెంచాలని సూచించింది. ►విస్తృతంగా కరోనా టెస్టులు చేయడం, పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టుల ట్రేసింగ్, శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం, జనం గుంపులుగా ఉండకుండా చూడటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. -
మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరే.. పక్కన ఉన్నా పాజిటివ్!
►మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రా ల్లోనూ కేసులు మొదలయ్యాయి. ►డెల్టా ప్లస్ సోకినట్టు గుర్తించిన వారిలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మహిళ చనిపోయింది. ఆమె ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు ప్రకటించారు. ►కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన కరోనా వేరియంట్)’గా ప్రకటించింది. డెల్టా, దాని అనుబంధ వేరియంట్లతో ప్రమాదం ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల వెల్లడించింది. ►కరోనా ఏ వేరియంట్ వచ్చినా కూడా.. ‘కోవిడ్ జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్, లాక్డౌన్’ ఈ మూడు అంశాలే కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటితోనే మూడో వేవ్‌ను నియంత్రించవచ్చని చెప్తున్నారు. ►మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గా, సాతారా, సాంగ్లీ, క్లోహపూర్, హింగోలి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తొందరపడి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించవద్దని సీఎం అధికారులకు సూచించారు. సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశలో లక్షల కేసులకు కారణమైన డెల్టా వైరస్‌ను అదుపు చేయగలిగామని అనుకుంటుండగానే.. డెల్టా ప్లస్ కలవరం మొదలైంది. ఇది మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇటీవల వెల్లడించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకు తుందని.. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కోవిడ్ జాగ్రత్తతోనే రక్షణ అని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమని రణ్‌దీప్ స్పష్టం చేశారు. మొదట ఇంగ్లండ్‌లో గుర్తింపు కరోనా వైరస్ రూపాంతరాల్లో డెల్టా ప్లస్ (ఏవై.1) సరికొత్తది. ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు ఈ కొత్త వేరియంట్‌ను తొలిసారి గుర్తించినట్టుగా ఈ నెల 11న ప్రకటించారు. భారత్‌లో రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్లోని కొమ్ము (స్పైక్) ప్రొటీన్‌లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్ పుట్టింది. ఈ తరహా జన్యుమార్పును బీటాగా పిలిచే దక్షిణాఫ్రికా వేరియంట్లో గతంలోనే గుర్తించారు. అయితే బీటా రకం కంటే డెల్టా వేరియంట్‌కు వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్కువ. అలాంటిది ఈ సామర్థ్యానికి తాజా జన్యుమార్పు జత కలవడంతో.. డెల్టా ప్లస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ ఇటీవలే వెల్లడించారు. ఎక్కడెక్కడ కేసులు? డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను ఇప్పటికే 11కుపైగా దేశాల్లో గుర్తించారు. మొదట గుర్తించిన బ్రిటన్‌తోపాటు అమెరికా, చైనా, రష్యా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలండ్, నేపాల్ తదితర దేశాల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. మన దేశంలోనూ 40కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 45 వేల నమూనాల్లోని జన్యుక్రమాలను విశ్లేషించి ఈ కేసులను గుర్తించారు. ఇవి మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి భారత్‌లో ఏప్రిల్ ఐదో తేదీన తీసిన ఓ శాంపిల్‌లోనే డెల్టా ప్లస్ ఆనవాళ్లు ఉన్నాయని, ఈ వేరియంట్ అప్పుడే మొదలైందని ఓ అంచనా. బ్రిటన్‌లో తొలి ఐదు కేసులను ఏప్రిల్ 26న సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు. ప్రమాదం ఎంత? రెండో దశలో నమోదైన కేసుల్లో అత్యధికం డెల్టా రూపాంతరితానివే. డెల్టా ప్లస్ విషయంలోనూ కేసులు అంత భారీ సంఖ్యలో ఉంటాయా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. డెల్టా ప్లస్‌తో ప్రమాదం ఎంత? ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా? అన్నదానిపై భారత వైద్య పరిశోధన సమాఖ్య, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు ఇప్పటికే అధ్యయనం ప్రారంభించాయి. ప్రమాదం ఉండకపోవచ్చు డెల్టా ప్లస్‌లోని కే417 జన్యుమార్పు ఒక్కదానితోనే ప్రమాదం పెరిగిపోదని, లక్షలకొద్దీ కేసులు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదని కొందరు వైరాలజిస్టులు అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తలు, నియమాలు ఎలా అమలు చేస్తున్నామన్నది కూడా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్ భవిష్యత్తులోనూ మరింతగా రూపాంతరం చెందుతూనే ఉంటుందని, అవకాశం ఉన్నంత వరకు సోకుతూనే ఉంటుందని అంటున్నారు. అందువల్ల నమూనాల సేకరణ, జన్యుక్రమ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా, విస్తృతంగా జరగాలని.. ఎక్కడికక్కడే కొత్త రూపాంతరితాలను గుర్తించి, కట్టడి చేయడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు పనిచేస్తాయా? మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డెల్టా ప్లస్ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు. టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్ బారిన పడటాన్ని బట్టి చూస్తే.. కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు కరోనా కేసులు తగ్గిపోయాయి కదా అంటూ మొదటి వేవ్ తర్వాతిలాగా ఇప్పుడూ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. ఏది ఏమైనాసరే అన్నట్టుగా కఠినంగా మాస్కులు, భౌతికదూరం, శానిటైజేషన్ వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇదే సమయంలో విస్తృతంగా వ్యాక్సినేషన్ చేపట్టాలి. అప్పుడే మూడో వేవ్‌ను ఎదుర్కోగలుతాం. -ఎయిమ్స్ ప్రధానాధికారి రణదీప్ గులేరియా ఆ కేసులు తక్కువగానే ఉన్నాయి డెల్టా ప్లస్‌తో దేశంలో మరోదఫా లక్షల సంఖ్యలో కేసులు వస్తాయన్న దానికి రుజువులేమీ లేవు. అలాగని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. మేం ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి సేకరించిన 3,500 నమూనాలను విశ్లేషించాం. ఏప్రిల్, మే నెలల నమూనాల్లో డెల్టా ప్లస్‌కు చెందినవి ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి. -డాక్టర్ అనురాగ్ అగర్వాల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ -
Yoga Day 2021: దివాణంలో దివ్యౌషధం
రోగ నిరోధక శక్తి, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి, మానసిక దృఢత్వం... ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్–19కు గట్టి విరుగుడుగా చెబుతున్న నాలుగు మాటలు, సహజ పరిష్కారాలు ఇవే! ముందు నుంచీ ఇవి తమలో ఉన్నవారు కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారు. వ్యాధి బారిన పడ్డాకయినా... వీటిని పెంచుకుంటే కోవిడ్ నుంచి తేలిగ్గా బయటపడగలరనీ చెబుతున్నారు. అత్యధిక సందర్భాల్లో ఇదే రుజువైంది. కానీ, ఈ నాలుగింటినీ ఇచ్చే ఔషధాన్ని ఇంతవరకు ప్రపంచ వైద్యారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు కనుక్కోలేదు. ఔషధ పరిశ్రమలేవీ దీన్ని ఉత్పత్తి చేయలేదు. ఈ నాలుగింటినీ ధారాళంగా అందించే ఒక ప్రక్రియ మాత్రం అయిదువేల ఏళ్ల నుంచే భారతీయులకు అందుబాటులో ఉంది. అదే ‘యోగా’! సనాతన సంప్రదాయం నుంచి, మధ్యయుగాల ఆచరణ ద్వారా, ఆధునిక శాస్త్ర–సాంకేతిక తరం వరకు... అవిచ్ఛిన్నంగా భారతీయ జీవన విధానంలో అవిభాజ్య భాగమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆరేళ్ల కిందటి ఓ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితిలోనూ గుర్తింపు దక్కింది. ఫలితంగా 177 సభ్య దేశాల మద్దతుతో, మనం ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొంది, 2015 నుంచి ఏటా జూన్ 21, ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’గా జరుగుతోంది. భవిష్యత్ కార్యక్రమాల్లో యోగానొక భాగంగా యూఎన్ నిర్ణయించింది. కోవిడ్ కష్టకాలంలో యోగ ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్నారు. ‘అందరి అభ్యున్నతికి యోగ’ ఈయేడు ప్రాధాన్యతగా యూఎన్ ప్రకటించింది. ‘ఇంటి వద్దే యోగ, కుటుంబ సభ్యులందరితో కలిసి’ అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. అవగాహన లేమి వల్ల చాలా మంది ‘యోగ’ను పరిమితార్థంలో చూస్తారు. ఏవో రెండు ఆసనాలో, శ్వాస కసరత్తులనో యోగగా భావిస్తారు. కానీ, స్థూలార్థంలో ఇదొక పటిష్టమైన జీవన ప్రక్రియ. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ‘యోగ’ అంటే (విడిపోవడమనే ‘వియోగ’ శబ్దానికి వ్యతిరేకార్థం) కలిపి ఉంచడం. శరీరం, మేధ, మనసు... ఈ మూడింటినీ ఒకే మార్గంలోకి తెచ్చి, మనిషిలోని అంతఃశక్తుల్ని గరిష్టంగా ఉద్దీపించే ప్రక్రియే యోగ! మూలాలు పరిశోధించి, సాధన పద్ధతుల్ని క్రోడీకరించి పతంజలి మహర్షి ‘అష్టాంగయోగ’ను వేల ఏళ్ల కిందటే రూపొందించారు. ‘పతంజలి’ కూడా ఒకరు కాదని, వేర్వేరు కాలాల్లో తమ నైపుణ్యాల్ని సమాజహితంలో (క్రీ.పూ 500 నుంచి క్రీ.శ 400) ప్రదర్శించిన ఇద్దరు ముగ్గురు రుషితుల్యులని చరిత్రకారుల ఉవాచ. ‘యమ’ (నైతికాంశాలు), ‘నియమ’ (ప్రవర్తన కట్టుబాట్లు), ‘ఆసన’ (శరీర పటిష్టత), ‘ప్రాణాయామ’(శాస్వ నియంత్రణ), ‘ప్రత్యాహార’(ఇంద్రియ నిగ్రహం), ‘ధారణ’(ఏకాగ్రత), ‘ధ్యాన’(నిమగ్నత), ‘సమాధి’(అన్నీ అదుపులోకి తెచ్చిన ఉన్నతస్థితి)... వీటన్నింటినీ కలిపి అష్టాంగయోగగా చెబుతారు. మనిషి ఇవి సాధన చేసి, పరిపూర్ణ జీవితం గడపాలనేది లక్ష్యం. గౌతమ బుద్దుడి ‘అష్టాంగిక పథం’ కూడా ఇటువంటిదే! ఆ మహనీయుల పథనిర్దేశంలోనే మనిషి జీవిత ముఖ్యసారముందని జాతిపిత మహాత్ముడు, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డా.అంబేడ్కర్లు గట్టిగా విశ్వసించారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న కాలంలోనూ.. ప్రాణాంతకమైన అనూహ్య సూక్ష్మ జీవుల నుంచీ సదరు జీవనశైలి రక్షణ కల్పిస్తోంది. శతృదుర్భేధ్యమైన ఓ కోటలా శరీరాన్ని తీర్చిదిద్దుతుందీ యోగ! ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. కలవరపాటు, మానసిక ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. మనిషిని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంచడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ పెంచి మానసిక దృఢత్వంతో వ్యవహరించేలా చేస్తుంది. ‘ప్రాణాయామం’ శ్వాసమీద ధ్యాస నిలిపేలా చేస్తుంది. పద్దతిగా ఉశ్ఛ్వాస–నిశ్ఛ్వాస క్రియల సాధన ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఈ అవసరాన్ని, ఓ గుణపాఠంగా చెప్పింది కరోనా! మెదడు, శరీరం, ఆత్మ ఒకే వరసలోకి వచ్చి ఏకీకృత శక్తిగా మారి, మనిషి తనను తాను సమగ్రంగా తెలుసుకుంటాడని విశ్లేషకులంటారు. ఫలితంగా స్వీయ అవగాహన పెరిగి, ప్రాపంచిక అంశాల పట్ల సమ్యక్ దృష్టి, తనకు తాను సమస్థితి మనిషి సాధిస్తాడనేది విశ్వాసం. ప్రకృతిని వికృతం చేస్తున్న మానవ తప్పిదాల వల్లే పర్యావరణం పాడవుతోంది. పలు విపరిణామాలొన్నాయి. వేగంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ ప్రభావంతో మున్ముందు ఇంక చాలా వైరస్లు దాడి చేస్తాయనే అధ్యయనాల నేపథ్యంలో... ఎన్నో సమస్యలకు ‘యోగ’ ఒక దీర్ఘకాలిక పరిష్కారం! జబ్బులనే కాక జీవితంలో దారితప్పిన క్రమతనూ సరిదిద్దే శక్తి యోగాకు ఉంది. ‘యోగా ఒక కాంతి ప్రజ్వలనం. ఒకసారి వెలిగితే ఆరిపోయేది కాదు. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత వెలుగు’ అన్న యోగాచార్యుడు బి.కె.ఎస్ అయ్యంగార్ మాటలు అక్షర సత్యాలు. సాధన చేస్తే, మనిషి దివాణంలో సర్వవేళలా అందుబాటులో ఉండే దివ్యౌషధం ఈ యోగా! దీనికోసం జాతి మరింత జాగృతం కావాలి. నవతరం యువత తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోగలిగితే... శారీరకంగా, మానసికంగా తలెత్తే భవిష్యత్ సవాళ్లను వారు సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. తట్టుకొని నిలువగలుగుతారు. -
కోవిడ్ నుంచి కోలుకునే దశలో చర్మ వ్యాధులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడితే శరీరం బలహీనమవుతుంది. ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇతర వైరస్లు సులువుగా దాడి చేస్తాయి. కరోనా సోకిన తర్వాత కోలుకుంటున్న దశలో బాధితులకు చర్మ వ్యాధులు సోకుతున్నట్లు వైద్యులు చెప్పారు. జుట్టు అధికంగా రాలుతుందని, ప్రధానంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని, గోళ్ల వ్యాధులు తలెత్తుతున్నాయని తెలిపారు. కరోనా బాధితుల్లో హెర్పిస్ అనే చర్మవ్యాధి తిరగబెడుతోందని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజిస్టు డాక్టర్ డి.ఎం.మహాజన్ చెప్పారు. హెర్పిస్ సోకితే నోటిపూత, చర్మంపై బొబ్బలు కనిపిస్తాయి. కోవిడ నుంచి కోలుకున్న తర్వాత కొందరు చర్మ సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు. చర్మ సమస్యలను మ్యుకోర్మైకోసిస్గా (బ్లాక్ ఫంగస్) భావిస్తున్నారని తెలిపారు. ఇవి రెండూ వేర్వేరు అని, అవగాహన పెంచుకోవాలని సూచించారు. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు, ఇతర ఔషధాలు మితిమీరి తీసుకోవడం వల్ల బాధితుల్లో క్యాండిడా ఫంగస్ సోకుతోందని వెల్లడించారు. దీనివల్ల జననేంద్రియాలపై తెల్ల మచ్చలు కనిపిస్తాయన్నారు. -
చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ
చంద్రగిరి: కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపటా్ననికి చెందిన ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ మందును చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇందుకు చొరవ తీసుకున్నారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్యుల సహకారం తీసుకున్నారు. ఈ మందు తయారీని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్ (పి) మందు మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, మారేడు, బుడ్డ బుడవ ఆకులు, కొండపల్లేరు కాయలు, తెల్లజిల్లేడు పూలు తీసుకొచ్చారని తెలిపారు. మరో 11 రకాల ముడి సరుకులను సమకూర్చామన్నారు. రెండు రోజుల్లో నియోజకవర్గంలోని 142 పంచాయతీలు, దాదాపు 1,600 గ్రామాల్లో ఈ మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ఉపయుక్తమైన సంప్రదాయ మందు తయారీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మందు తయారీలో ఆనందయ్య కుమారుడితోపాటు శిష్యులు చంద్రకుమార్, సురేష్, వంశీకృష్ణ పాల్గొంటున్నారు. -
Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే శుభవార్తే!
న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కోలుకున్న బాధితులకు కోవిడ్ టీకాలు ఇస్తే అవి వారిలో సహజసిద్ధ వ్యాధినిరోధక శక్తి మరింతగా పెరగడానికి దోహదపడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకాలు తీసుకున్న వారు భవిష్యత్‌లో దాడిచేసే ఇతర వేరియంట్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కోగలరని అధ్యయనం పేర్కొంది. గత ఏడాది కరోనా బారినపడి తర్వాత కోలుకున్న బాధితుల రక్త నమూనాల్లో యాంటీబాడీలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కొనుగొన్నట్లు అమెరికాలోని రాకీఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. వ్యాధినిరోధక శక్తి మరింతగా పెరిగాక సార్స్– కోవ్–2 వైరస్‌లను ఇమ్యూనిటీకి సంబంధించిన మెమొరీ బి–సెల్స్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని పరిశోధకులు చెప్పారు. మానవ శరీరంపై దాడి చేసే వేర్వేరు రకాల వైరస్‌లను అంతమొందించేందుకు మన వ్యాధినిరోధక వ్యవస్థ తయారుచేసే వేర్వేరు రకాల యాంటీబాడీల నిధే మెమొరీ బి–సెల్స్. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత కోవిడ్ రికవరీ వ్యక్తుల్లో మరింత శక్తివంతమైన, ఎక్కువకాలం నిలిచే రక్షణవ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పారు. కనీసం ఒక డోస్ మోడెర్నా / ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు గణనీయంగా పెరిగాయన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో, బ్రిటన్‌లో, దక్షిణాఫ్రి కాలలో తొలిసారిగా కనుగొన్న వేర్వేరు వేరియంట్లనూ నాశనంచేసే యాంటీబాడీలు వీరిలో అభివృద్ధి చెందాయి. మెమొరీ బి–సెల్స్ వల్లే ఈ యాంటీబాడీల ఉత్పత్తిసాధ్యమైందని పరిశోధకులు చెప్పారు. ఇంతవరకు కరోనా బారినపడని వ్యక్తులకూ ప్రస్తుత డోస్‌లతోపాటు బూస్టర్ డోస్ ఇస్తే వారికి మరింత రక్షణ లభిస్తుందని అధ్యయనం సూచించింది. అయితే, ఈ అధ్యయనం ఫలితాల ఖచ్చితత్వాన్ని ఇదే రంగంలోని వేరే సంస్థలకు చెందిన నిపుణులు ఇంకా పరిశీలించాల్సి ఉంది. -
45 ఏళ్లు దాటిన వారే లక్ష్యం..
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ కేసులు 45 ఏళ్లు దాటిన వారిలోనే అధికంగా నమోదవుతున్నాయి. మధుమేహం ఉండి కరోనా వచ్చిన వారిపై ఈ ఫంగస్ ఎక్కువగా దాడి చేస్తున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,179 మందికి బ్లాక్ ఫంగస్ సోకినట్టు గుర్తించారు. వీరిలో 1,139 మంది కోవిడ్ వచ్చి పోయిన వారే ఉన్నారు. కోవిడ్ రాకున్నా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ 40 మందికి ఇది సోకినట్టు వెల్లడైంది. 18 ఏళ్లు దాటిన వారిలోనూ 415 కేసులుండగా, 18 ఏళ్ల లోపు వారిలో 3 కేసులున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారు 14 మంది ఉన్నారు. కోవిడ్ సోకిన వారిలోనే ఎక్కువగా కేసులొచ్చాయి. అయితే వీరిలో ఎక్కువ మంది మధుమేహ బాధితులే. 1,179 కేసుల్లో 743 మంది షుగర్ బాధితులు కోవిడ్ సోకిన తర్వాత బ్లాక్‌ఫంగస్‌కు గురయ్యారు. మిగతా వారిలో 251 మంది వ్యాధి నిరోధక శక్తి లేక దీని బారినపడ్డారు. క్యాన్సర్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బులు వంటి వాటితో బాధపడుతున్న వారిలో 130 మందికి ఈ జబ్బు సోకింది. అలాగే బ్లాక్‌ఫంగస్ ముందుగా ముక్కుకు చేరి ఆ తర్వాత కన్ను, మెదడుకు సోకిన వారే ఉన్నారు. వీటినే రినో సెరబ్రల్ అంటారు. 618 మంది రినో సెరబ్రల్ (ముక్కు, కన్ను సంబంధించిన ఫంగస్)తో చికిత్స పొందుతున్నారు. పల్మనరీ అంటే ఊపిరితిత్తుల ఫంగస్‌తో 117 మంది, క్యుటానస్ అంటే చర్మసంబంధిత ఫంగస్‌తో 146 మంది చికిత్స పొందుతున్నారు. సాధారణ అవయవాలకు అంటే డెసిమినేటెడ్ పరిధిలో ముగ్గురు, అన్‌కామన్ ప్రెజెంటేషన్(అసాధారణంగా) వచ్చినవి 295 కేసులున్నాయి. వచ్చే 7 రోజుల్లో 55 వేల ఇంజక్షన్లు అవసరం బ్లాక్‌ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇంజక్షన్ల వినియోగం పెరిగింది. తాజా అంచనాల ప్రకారం జూన్ మొదటి వారంలో 55 వేలకు పైగా ఇంజక్షన్లు, జూన్ రెండో వారంలో 79 వేలకు పైగా ఇంజక్షన్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,795 ఇంజక్షన్లు మాత్రమే ఉన్నాయి. బీడీఆర్ ఫార్మాస్యుటికల్, ఎల్వీకేఏ ల్యాబ్స్, గుఫిక్ బయోసైన్సెస్, మైలాన్ ల్యాబొరేటరీస్‌కు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. ఒక్కో పేషెంటుకు రోజుకు 6 ఇంజక్షన్లు అవసరమని వైద్యులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం వల్ల కేసులు పెరుగుతున్నాయ్ కోవిడ్ వల్ల రక్తం గడ్డకడుతోంది. ముక్కు లోపల రక్తనాళాలు గడ్డకడితే టిష్యూల వద్దకు ఫంగస్ వచ్చినట్టు తాజాగా గుర్తించారు. రక్తం ఎక్కడైతే సరఫరా కాకుండా గడ్డలు వస్తున్నాయో అక్కడే ఫంగస్ చేరుకుంటోంది. కోవిడ్‌కు స్వతహాగానే రక్తాన్ని గడ్డకట్టించే గుణం ఉంది. –డా.పల్లంరెడ్డి నివేదిత అసిస్టెంట్ ప్రొఫెసర్, కర్నూలు ప్రాంతీయ కంటి ఆస్పత్రి -
Dry Fruits: కరోనా కాలం.. బండ్లపై రోజూ 15 లక్షల వ్యాపారం!
కడప కల్చరల్: శత్రువుతో పోరాడాలంటే మనకు అతనికి మించిన శక్తి కావాలి. ఆయుధాలు లేకపోయినా ఎదుటివాడి దాడిని అడ్డుకునే ఆత్మవిశ్వాసం కావాలి. ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జనం రోగ నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలని, అందుకు పోషకాహారం తీసుకోవాలని భావిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పెంచుకోవడం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడంతోనే సాధ్యమంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా రోగ నిరోధకశక్తి పెంచుకోవాలని వైద్యులు సైతం సూచించడంతో జనం వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఉపాధి దెబ్బతిన్నా.. కరోనాతో 95 శాతం పనులు నిలిచిపోయాయి. వ్యాపారాలు కూడా కుదేలయ్యాయి. ఈ నేపత్యంలో డ్రై ఫ్రూట్స్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకున్నా ప్రాణం కంటే ఎక్కువ కాదు గనుక దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా వాడుతున్నారు. దీంతో డ్రై ఫ్రూట్స్ వ్యాపారాలు మాత్రం ఇంతకు ముందెన్నడూ కనివినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కేవలం కడప నగరంలోనే 30కి పైగా డ్రై ఫ్రూట్స్ విక్రయించే తోపుడు బండ్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 150కి పైగా ఉన్నాయి. పట్టణాలు, మండలాల్లో కూడా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇందులో ప్రధానంగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష, ఎండు, పండు ఖర్జూరాలు, వాల్నట్స్, దోస, పుచ్చ గింజలు తదితరాలు విక్రయిస్తున్నారు. ఇవి తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని, కరోనా వచ్చినా ధీటుగా ఎదుర్కొవచ్చని ప్రజల్లో నమ్మకం బాగా పెరిగింది. అందుకే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోట్లలో వ్యాపారం కరోనా రానంత వరకు జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం తదితరాలను తక్కువగా వాడేవారు. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి డ్రై ఫ్రూట్స్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని వైద్యులు చెప్పడంతో వాటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వినియోగం పెరగడంతో ధరలు కూడా 20–30 శాతం పెరిగాయి. కరోనా రాకముందు రోజూ కేవలం 2–4 వేల రూపాయల వ్యాపారం మాత్రమే జరిగేది. ఇప్పుడు రోజూ కనిష్ఠంగా రూ. 10 వేల వ్యాపారం జరుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా అంతటా తోపుడు బండ్లపైనే రోజూ రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతోందని కిరాణా, మసాల దినుసులు, ఇతర దుకాణాల ద్వారా మరో రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతోందని వ్యాపారుల అంచనా. జిల్లా వ్యాప్తంగా తోపుడుబండ్లు, దుకాణాల్లో నెలకు రూ. 9–10 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. -
కరోనా 'చింత' లేని గిరిజనగూడెం
పెద్దదోర్నాల: పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తోన్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు. చిన్ననాటి నుంచి వివిధ వ్యాధులకు ఆకుపసర్లే వాడామని.. అవే తమలో రోగనిరోధకశక్తిని పెంచాయని చెబుతున్నారు. ఇప్పటివరకు తమకు మాస్కు వాడే అవసరం కూడా రాలేదని పేర్కొంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లా నల్లమల అభయారణ్యం పరిధిలో చింతల గిరిజనగూడెం గ్రామస్తులు కరోనా చింత లేకుండా జీవిస్తున్నారు. ఎన్నో ఔషధ మొక్కల నిలయం.. చింతల గిరిజనగూడెంలో సుమారు 710 మంది జీవిస్తున్నారు. వీరికి వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, గొర్రెల పెంపకమే ఆధారం. అటవీ ప్రాంతంలోని ఔషధ మొక్కల నుంచి వీచే చల్లటి గాలులు, ప్రశాంత వాతావరణం కరోనా వైరస్‌ను ఆ గూడెం దరిదాపులకు రాకుండా చేశాయి. గ్రామస్తుల్లో ఎవరికైనా సుస్తీ చేస్తే ఔషధ మొక్కల ద్వారా వారికి వారే నయం చేసుకుంటున్నారు. అశ్వగంధి, కొండగోగు, నరమామిడి, సరస్వతి ఆకు, నేలవేము, పొడపత్రి, అడవిచింత, మయూరశిఖ, తెల్లగురివింద, నల్లేరు, అడవి ఉల్లి, సుగంధ మొక్కలు, చిల్లగింజలు, నాగముష్టి, విషముష్టి, అడవి తులసి, గడ్డిచేమంతి, ఉసిరి, కరక్కాయ ఇలా ఎన్నో ఔషధ మొక్కలను వివిధ వ్యాధులకు వాడుతున్నారు. అటవీ వాతావరణమే కాపాడుతోంది.. పుట్టినప్పటి నుంచి కొండల్లోనే మా ఆవాసం. అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల గురించి అవగాహన ఉంది. చిన్నచిన్న జబ్బులకు ఆకులు, అలములతోనే మేమే మందులు తయారు చేసుకుంటాం. కరోనాలాంటి జబ్బులు మా గూడెం వాసులకు రానే రావు. – భూమని అంజమ్మ, గూడెం వాసి గూడెంలో ఒక్క కేసూ నమోదు కాలేదు.. గూడెంలో ఇంతవరకు ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. అటవీ వాతావరణం, ఆహారమే మాకు రక్షణగా నిలుస్తోంది. తేలుకాటు, పాము కాట్లకు కూడా మాకు ఆకుపసరే మందు. – భూమని వెంకటయ్య, సర్పంచ్, చింతల చెంచుగూడెం ఏ రోగానికైనా అడవి మందులే మాకు ఏ రోగమొచ్చినా అడవి మందులే వేసుకుంటాం. ఎప్పుడో గాని ఆస్పత్రికి వెళ్లం. మొదటి నుంచి పాత అలవాట్లనే పాటిస్తున్నాం. బయటి వ్యక్తులు వస్తే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటాం. – భూమని రామయ్య, గూడెం వాసి -
చిన్నారులకు టీకాలే రక్ష
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి అందరినీ బెంబేలెత్తిస్తోంది. దీంతో అందరూ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల మందులూ, ఆహారం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలే ఇప్పుడు పెద్ద శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓవైపు చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, థర్డ్ వేవ్‌లో చిన్నారులకే ముప్పు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిలో ‘క్రాస్ ఇమ్యూనిటీ’ అంశం తెరమీదకు వచ్చింది. పుట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాధినిరోధక టీకాలు వేయడం వల్ల వచ్చే రోగనిరోధక శక్తినే క్రాస్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధినిరోధక టీకాలతో వైరస్‌కు చెక్.. పుట్టినప్పటి నుంచే చిన్నారులకు పోలియో మొదలుకొని బీసీజీ, డీపీటీ ఇలా అనేక రకాల వ్యాధినిరోధక టీకాలు వేస్తారు. ఈ టీకాలన్నిటితో చిన్నారుల్లో క్రాస్ ఇమ్యూనిటీ వస్తుందని శాస్త్రపరంగా నిర్ధారణ అయ్యిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రాస్ ఇమ్యూనిటీ.. చాలావరకు కరోనాను నియంత్రించగలదని అంటున్నారు. ఐదేళ్ల వయసొచ్చేవరకూ ఈ టీకాలన్నీ ఎప్పటికప్పుడు వేయించుకున్న చిన్నారులకు కరోనా సోకడం తక్కువని, ఒకవేళ సోకినా ప్రాణభయం ఉండదని చిన్నపిల్లల వ్యాధుల వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలో టీకా ఎందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ చిన్నారుల్లో ఎక్కువ అనేది అపోహ మాత్రమేనని అంటున్నారు. అలాంటి నివేదికలేమీ ఇప్పటివరకూ రాలేదని, అయితే చిన్నారులు కూడా కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. తల్లిదండ్రులు రొటీన్ టీకాలు తప్పనిసరిగా వేయించాలి.. చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాల వల్ల వారిలో క్రాస్ ఇమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తే కరోనా వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. ఈ క్రాస్ ఇమ్యూనిటీ అనేది చిన్నారులకు 10 ఏళ్ల వయసొచ్చే వరకూ కాపాడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు రొటీన్ టీకాలు తప్పనిసరిగా వేయించాలి. –డా.కిరీటి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి -
మారుతున్న ‘5 స్టార్’ రుచులు
న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల్లో 5 స్టార్ హోటళ్లు నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం గతేడాది మార్చి, ఏప్రిల్‌లో విధించిన లాక్డౌన్లు స్టార్ హోటళ్లకు కొత్త మార్గాలను వెతుక్కునేలా చేశాయి. ఈ క్రమంలోనే కోరుకున్న ఆహారాన్ని కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే వ్యాపారాన్ని కొన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత లాక్డౌన్లు క్రమంగా తొలగిపోయినప్పటికీ.. హోటళ్ల వ్యాపారం పెద్దగా పుంజుకున్నది లేదు. ఈలోపే కరోనా రెండో వేవ్ (దశ) వచ్చి పడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్లు లేదా కర్ఫ్యూల పేరుతో ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలపై 5 స్టార్ హోటళ్లు దృష్టి సారించాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అందరిలోనూ శ్రద్ధ కొంత పెరిగిన విషయం వాస్తవం. దీన్ని ఎందుకు వ్యాపార అవకాశంగా మార్చుకోకూడదు? అన్న ఆలోచన వాటికి వచ్చింది. దీంతో మంచి పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలతో సరికొత్త రుచుల మెనూ తయారీని ప్రారంభించాయి. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఫీల్ మెనూ ఐటీసీ హోటల్స్ కూడా ఇదే విధంగా ‘ఫీల్మెనూ’ను రూపొందించింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలన్న ప్రణాళికతో ఉంది. రుతువుల వారీగా స్థానికంగా లభించే ముడిసరుకులతో (వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి) ఆహారపదార్థాలను అందించాలనుకుంటోంది. ‘‘ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార రుచులను ఎన్నింటినో ఇప్పటికే అందిస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా సూపర్ ఫుడ్‌గా పరిగణించే వాటిని మా జాబితాలోకి చేర్చనున్నాము’’ అని ఐటీసీ హోటల్స్ కార్పొరేట్ చెఫ్ మనీషా బాసిన్ చెప్పారు. ఇద్దరి భోజనానికి ధర రూ.1,100–1,400 మధ్య ఉంటుందని ఆమె తెలిపారు. అంటే ఐటీసీ ఆన్లైన్ హోమ్ డెలివరీ బ్రాండ్ గోర్మెట్కచ్తో పోలిస్తే ఈ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ నెల 25న ఐటీసీ సరికొత్త ఆహారపదార్థాల మెనూను విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఐటీసీ హోటళ్లలో ఈ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. తాజ్, జింజెర్ బ్రాండ్ హోటళ్లను కలిగిన ఇండియన్ హోటల్ కంపెనీ రెండు వారాల కిందటే ప్రత్యేకమైన ఆహారపదార్థాల జాబితాను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ క్యుమిన్పై ఇవి అందుబాటులో ఉన్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత కోలుకునే సమయంలో వివిధ వయసుల వారికి అవసరమైన పోషకాహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. కొట్టక్కల్ ఆర్యవైద్యశాలకు చెందిన నిపుణుల సలహాల మేరకు కొత్త పదార్థాలను ఈ సంస్థ రూపొందించింది. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలను కలిగిన మూలికలు, దినుసులు, ఇతర పదార్థాలను ఇందులో వినియోగిస్తున్నట్టు ఇండియన్ హోటల్ ‘క్యుమిన్’ కమర్షియల్ డైరెక్టర్ జహంగీర్ తెలిపారు. ఒబెరాయ్ సైతం..: ఒబెరాయ్ గ్రూపు హోటళ్లలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్‌పై కస్టమర్ల ఇంటికి డెలివరీ సైతం చేస్తున్నాయి. మునగ, ఖర్జూరం, పుట్టగొడుగులు, బ్రొక్కోలి తదితర ముడి పదార్థాలుగా ఆహార పదార్థాలను ఒబెరాయ్ గ్రూపు హోటళ్లు ఆఫర్ చేస్తున్నాయి. మూడ్ డైట్స్... మారియట్ ఇంటర్నేషనల్ ‘మూడ్ డైట్స్’ పేరుతో మెనూను పరిచయం చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ‘మారియట్ ఆన్ వీల్స్’ బ్రాండ్ కింద నిర్వహిస్తోంది. ఈ నెల చివరి నుంచి ఆహార ప్రియులకు మంచి భావనలను కల్పించే మూడ్ డైట్స్‌ను సైతం మారియట్ ఆన్ వీల్స్ వేదికగా అందించనుంది. ‘‘డార్క్ చాక్లెట్, కాఫీ, అరటి, బెర్రీలు, నట్స్, సీడ్స్ మంచి భావనలను కల్పించే ఆహార పదార్థాలు. మనకు తెలియకుండానే వీటిని తరచుగా తింటుంటాం. దీంతో ఈ ఆహార పదార్థాలనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మారియట్ఇంటర్నేషనల్ కలినరీ డైరెక్టర్ హిమాన్షు తనేజా తెలిపారు. మంచి ఆహారం మంచి భావనలకు మధ్యనున్న అనుబంధం నుంచి తమకు ఈ ఆలోచన వచ్చినట్టు చెప్పారు. -
Amla: విటమిన్ ఉసిరి.. ఎన్నెన్నో ఉపయోగాలు
సాక్షి, అమరావతి: వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటంలో ఉసిరి అద్భుతంగా పని చేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కరోనా బారిన పడినవారికి తొలి రోజు నుంచి కోలుకునేంత వరకు వాడే మందుల జాబితాలో ‘సీ’తో పాటు పలు విటమిన్ల టాబ్లెట్లు ఉంటున్నాయి. వీటిలో ప్రధానమైన సీ విటమిన్ కోసం టాబ్లెట్ వాడటం కన్నా ఉసిరి కాయను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకుంటే మేలని సలహా ఇస్తున్నారు. అందువల్లే ఉసిరికి ప్రపంచ దేశాల్లో గిరాకీ పెరిగింది. రాష్ట్రంలో విరివిగా లభించే ఉసిరి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది వైరస్‌లను నివారిస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రక్త కణాల హీనతను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇదొక బూస్టర్‌గా పని చేస్తుందని డాక్టర్ జి.భార్గవ్ వివరించారు. ఉసిరితో ఉపయోగాలు విటమిన్ సీ,¯ కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉసిరిలో ఎక్కువ. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పేర్కొంటున్నారు. ఇందులో ఉండే క్రోమియం చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మార్కెట్లో ఉసిరి కాయలతోపాటు పొడి, మాత్రల రూపంలోనూ లభిస్తోంది. తేనెతో కలిపి ఉసిరిని తీసుకుంటే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 11,982 టన్నుల ఉత్పత్తి ఉద్యాన శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 13,336 ఎకరాల్లో ఉసిరి పంట సాగవుతోంది. ఏటా దిగుబడి 11,982 టన్నుల వరకు ఉంది. ఒకప్పుడు శీతాకాలంలో మాత్రమే దొరికే ఉసిరి కాయలు ఇప్పుడు అన్ని కాలాలలోనూ లభిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, దక్షిణ కొరియా, హాంకాంగ్, మలేషియా, ఫ్రాన్స్, లెబనాన్, స్విట్జర్లాండ్, స్వీడన్, జపాన్, నార్వే, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా తదితర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. దివ్య ఔషధమే ప్రస్తుత కరోనా కాలంలో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సహజ సిద్ధంగా దొరికే పండ్లు, కాయలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ఆసక్తి పెరిగింది. అందుకే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను పాటిస్తున్నారు. అందులో భాగంగానే జనం ఇటీవల కాలంలో ఉసిరి ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. ఉసిరి కచ్చితంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులను నయం చేస్తుంది. – డాక్టర్ కె.అప్పారావు, ఆయుర్వేద వైద్య నిపుణులు చదవండి: సపోటా పండు తింటే ఇన్ని లాభాలా! -
బియ్యంతో లాభం లేదు, ‘చిరు’కు జైకొడితేనే బెటర్!
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రజలు ఇకనైనా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) సూచించింది. పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కోసం చిరు ధాన్యాల బాట పట్టాలని విజ్ఞప్తి చేసింది. ఆహార, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రకటిస్తూ.. నీటి ఆధారిత పంటల్ని, సాగు పద్ధతుల్నీ మార్చాలని కోరింది. ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు మారడంతో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా వంటి వైరస్ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల వాడకంతో శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా సమకూర్చుకోవచ్చు. తద్వారా ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చని హోంసైన్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. చిరు ధాన్యాలే కదా అని.. చిన్న చూపు కూడదు పూర్వ కాలం నుంచి చిరు ధాన్యాల సాగు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మరుగున పడిపోయింది. ఆ స్థానాన్ని వరి ఆక్రమించింది. ఆధునిక జీవన శైలిలో బియ్యం, ప్రత్యేకించి పాలిష్ చేసిన బియ్యం రకాల వాడకం పెరిగింది. పోషకాలు లేని బియ్యం రకాల వినియోగంతో ఫలితం లేదని శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు చాలా కాలం నుంచే చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. దేశంలోని జాతీయ పోషకాహార సంస్థ సైతం చిరు ధాన్యాలను చిన్న చూపు చూడొద్దని హెచ్చరించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ముందుచూపుతో చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగుకు చర్యలు చేపట్టడమే కాకుండా, చిరు ధాన్యాలకూ మద్దతు ధర ప్రకటించిన తరుణంలోనే.. ఎఫ్ఏవో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం గమనార్హం. స్మార్ట్ ఫుడ్‌తో జీవనశైలి వ్యాధులు దూరం జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పోషక లోపాలు దరిచేరకుండా ఇవి ఒక కవచంలా పని చేస్తాయి. పోషకాలను అందించడంలో బియ్యం, గోధుమల కంటే చిరుధాన్యాలు మేలైనవి. అందుకే వీటిని స్మార్ట్ ఫుడ్‌గా కూడా అభివర్ణిస్తున్నారు. ఊబకాయం, షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులను దూరం చేయడంలో చిరుధాన్యాలు ఉపయోగపడుతున్నందున ప్రజలు వీటిని ఎక్కువగా వాడాలి. – టి.గోపీకృష్ణ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రాష్ట్రంలో చిరుధాన్యాలకు పూర్వవైభవం రాష్ట్రలో చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటి సాగును ప్రోత్సహించేందుకు చిరు ధాన్యాల బోర్డుల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా కొన్ని రకాల చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతుల్ని ప్రోత్సహిస్తోంది. – డాక్టర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ -
వంటింటి పోపు డబ్బా:రోగనిరోధక శక్తిని పెంచే అవుషదాలు
-
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోన్న సెకండ్‌వేవ్
వాషింగ్టన్/లండన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 28 లక్షలు దాటేసింది. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వాయువేగంగా జరుగుతున్నప్పటికీ మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలు నమోదవడానికి ఏడాది పడితే, ఆ తర్వాత కేవలం మూడు నెలల్లోనే మరో 8.79 లక్షల మరణాలు సంభవించి మొత్తం 28లక్షల 79వేలు దాటేశాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికిపైగా వైరస్ బారిన పడినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా మూడు కోట్లకి పైగా కేసులతో అగ్రభాగంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, భారత్ ఉన్నాయి. మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత 2 లక్షలకు పైగా మృతులతో మెక్సికో మూడో స్థానంలో ఉంది. ►అమెరికాలోని 50 రాష్ట్రాల్లో యూకే వేరియెంట్ కేసులు పెరిగాయి. 5,5 లక్షలకు పైగా మరణాలతో ఆ దేశం మొదటి స్థానంలో ఉంది. ►ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ నమోదయ్యే ప్రతీ 4 మరణాల్లో ఒకటి బ్రెజిల్ నుంచే వస్తోందని రాయిటర్స్ తెలిపింది. ►యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా 11 లక్షల మరణాలు సంభవించాయి. ►యూరప్‌లోని మొత్తం మరణాల్లో 60 శాతం యూకే, రష్యా, ఫ్రాన్స్, జర్మనీల నుంచే వస్తున్నాయి. ►యూరప్ దేశాల్లో బ్రిటన్ లక్షా 27 వేల మరణాలతో అగ్రభాగంలో ఉంది. ►ఫ్రాన్స్, పోలండ్, హంగేరి, ఇటలీ వంటి దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలను ఇంకా అమలు చేస్తున్నారు. ►బ్రిటన్‌లో సగం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో ఆంక్షల్ని సడలిస్తున్నారు. ►అమెరికాలో 40శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. ఇమ్యూనిటీ ఉంటేనే మక్కా యాత్రకి రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలు మక్కా యాత్ర చేయాలంటే వారిలో పూర్తి స్థాయిలో ఇమ్యూనిటీ ఉండాలని సౌదీ అరేబియా తెలిపింది. హజ్ ఉమరాహ్ మంత్రిత్వ శాఖ యాంటీ బాడీలున్నవారికే మక్కా మసీదులోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు, ఒకసారి కరోనా సోకి పూర్తిగా కోలుకున్న వారు, యాత్రకి 14 రోజుల ముందు వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్న వారికి మాత్రమే మక్కాలోకి ప్రవేశం ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: (హెచ్చరిక: వచ్చే 4 వారాలు అత్యంత సంక్లిష్టం) -
మీ పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా.. ఇవి తినిపించండి..
కరోనాను ఎదిరించాడానికి ప్రతి ఒక్కరికి శక్తి అవసరం. పెద్దలకి అయితే, కాస్తంత ఇమ్యూనిటి పవర్ ఎక్కువ. మరి చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరముల ప్రమాదం ఎక్కువ. అయితే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వారికి రోజూ తినిపిస్తే చాలు.. వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటో చూద్దాం..! పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది. నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది. నట్స్: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా తయారవుతారు. వారికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. క్యారెట్లు: పిల్లలకు విటమిన్ ఎ, జింక్ సమద్ధిగా లభించాలంటే వారికి నిత్యం క్యారెట్లను తినిపించాలి. వీటితో కంటి చూపు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. -
పచ్చ సొన.. సుగుణాల సోనా: డాక్టర్ ప్రత్యూషారెడ్డి
‘కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయితే కొంతమంది కొవ్వు చేరుతుందని అందులోని పచ్చసొనను పక్కనపెట్టి తెల్లసొన మాత్రమే తింటుంటారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. డీ విటమిన్ కొరత రాకుండా ఉండాలంటే రోజూ కోడిగుడ్డు తినాలి. గుడ్డులో ఉండే పచ్చసొనలో లభించే డీ విటమిన్ మరెక్కడా లభించదు’ అంటున్నారు డాక్టర్ ప్రత్యూషారెడ్డి. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివి, అమెరికాలో క్లినికల్ న్యూట్రిషన్లో ఎంఎస్ చదివిన ప్రత్యూష ప్రస్తుతం హైదరాబాద్‌లో పోషకాహార నిపుణులుగా రాణిస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలన్న దానిపై ‘సాక్షి’కి ప్రత్యూషారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. –సాక్షి, హైదరాబాద్ రోగనిరోధక శక్తి అంటే ఏంటి? ఎర్ర రక్తకణాలను పెంచుకోవడం లేదా వాటిని బలోపేతం చేసుకోవడమే రోగ నిరోధక శక్తి. ఏదైనా వైరస్ వస్తే, దానిపై పోరాడేతత్వం ఈ ఎర్రరక్త కణాలకు ఉంటుంది. ఏడు రకాల పద్ధతులు పాటిస్తే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ప్రపంచ వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమతుల్యమైన ఆహారం అవసరం... ఆరోగ్యానికి, బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సమతుల్యమైన ఆహారం అవసరం. సమతు ల్యమైన ఆహారం అంటే ఏంటనే ప్రశ్న అందరిలో వస్తుంది. కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్ సరిగ్గా తీసుకోవడమే సమతుల్యమైన ఆహారం. ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీలతో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అదే సమయంలో పీచుపదార్థం తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రంగుల్లో లభించే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు ఉండే గుడ్లు, పప్పు, చికెన్, మటన్ వంటివి కొద్దిగా తీసుకోవాలి. ఇలా మన ఆహారంలో ఇవి మూడూ ఉండాలి. పసుపు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వంటివి ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే కరోనా సమయంలో ఏ కషాయాలు తాగాల్సిన అవసరంలేదు. రోజులో అప్పుడప్పుడు పళ్లు, డ్రైప్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. వ్యాయామం.. నిద్ర.. నీరు ఇక ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాలు ఆగకుండా వాకింగ్ చేయ డం ఆరోగ్యానికి మంచిది. లేదా ప్రాణాయామంతో కూడిన యోగా చేసుకోవచ్చు. కరోనా సమయంలో ప్రాణాయామం ముఖ్యం. వ్యాయామంతోపాటు ప్రతి ఒక్కరూ ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లు దెబ్బతిని అవయవాల పనితీరు తగ్గిపోతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే రోజుకు 10–12 గ్లాసుల నీరు తాగితే మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఉండదు. మానసికంగా లేదా శారీరకంగా తీవ్రమైన ఒత్తిడి, అలసట ఏర్పడితే మనలో ఉన్న హార్మోన్లు తగ్గడం లేదా పెరగడం జరుగుతాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకో వడానికి వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పెద్దలకు ప్రతిరోజూ మల్టీ విటమిన్... తినే ఆహారంలో అన్ని విటమిన్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి అవసరమైన విటమిన్లు శరీరానికి సరిగా అందవు. కాబట్టి పెద్దవాళ్లు రోజూ ఒక మల్టీ విటమిన్ మాత్ర వేసుకోవాలి. కడుపునిండా తిన్న తర్వాతే మాత్ర వేసుకోవాలి. మల్టీ విటమిన్లో విటమిన్–సీ, యాంటి ఆక్సి డెంట్స్ ఉంటాయి. శరీరంలో ఇన్ఫెక్షన్, ఊపిరితి త్తుల్లో సమస్య రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ కరోనా వచ్చినా ఇబ్బంది ఉండదు. పండ్లను జ్యూస్ చేసుకోకూడదు.. అన్ని రకాల పండ్లను జ్యూస్ చేసుకొని తాగకూడదు. పండ్లను నేరుగా తినడమే మేలు. జ్యూస్ చేయడం వల్ల వాటిలో షుగర్ చేరుతుంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేల లోపల పండే క్యారె ట్, బీట్రూట్ లాంటి వాటిని ఉడికించే తినాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక చాలామంది సకాలంలో ఆహారం తినకపోవడం వల్లనే బరు వు పెరుగుతూ ఉంటారు. ఉదయం అల్పా హారం సరిగా తినకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా తింటాం. ఉదయం ఏదైనా కొద్ది మోతాదులో టిఫిన్‌తోపాటు ఒక ఎగ్ లేదా కూరగాయలు తింటే సరిపోతుంది. అన్నం పరిమాణం తగ్గించుకోవాలి. సాయంత్రం తక్కువ తినాలి. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారి లక్షణాలు.. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి తరచుగా జలుబు చేస్తుంది. ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతి చిన్నదానికీ భయపడుతుంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం, విరేచనాలు వస్తుంటాయి. తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. శారీరకంగా పెద్దగా శ్రమ చేయకుండానే అలసిపోతుంటారు. -
అజాగ్రత్తల వల్లే సెకండ్‌వేవ్
సాక్షి, అమరావతి: ‘ఒక జట్టు విజయం సాధించాలంటే హిట్టింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ఎంత ముఖ్యమో.. జట్టును నిలకడగా ముందుకు నడిపించడానికి డిఫెన్స్ బ్యాట్స్‌మెన్ కూడా అంతే ముఖ్యం. ఇందులో కరోనా వ్యాక్సిన్ హిట్ బ్యాట్స్‌మెన్ అయితే.. వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డిఫెన్స్ ఆడటంలాంటిది. కోవిడ్ మహమ్మారిని జయించాలంటే ఈ రెండింటి పాత్ర చాలా కీలకం’.. అని అంటున్నారు ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజి మాజీ విభాగాధిపతి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గౌరవ సలహాదారు.. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కె. శ్రీనాథరెడ్డి. దేశంలో సెకండ్ వేవ్ వచ్చిందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే తప్ప దీని నుంచి బయటపడలేమని హెచ్చరిస్తున్నారు. ‘సాక్షి’తో ఆదివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. జాగ్రత్తే అసలు సిసలు మందు దేశంలో సెకండ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం ప్రజల అజాగ్రత్తే. కొద్దిగా కరోనా తగ్గింది అనగానే మళ్లీ గుంపులు గుంపులుగా వెళ్లడం, మాస్కులు తీసేసి తిరగడం, భౌతిక దూరం పాటించకపోవడం చేస్తున్నారు. అందుకే వ్యాక్సిన్ కంటే మంచి మందు ఏదైనా ఉందీ అంటే అది జాగ్రత్తగా ఉండటమే. కొన్ని నెలలపాటు అవి విధిగా పాటించాల్సిందే. దేశంలోకి మూడు కొత్త స్ట్రెయిన్స్ తాజాగా.. ఐసీఎంఆర్ ఇచ్చిన సమాచారం మేరకు దేశంలోకి మూడు కొత్త రకాల స్ట్రెయిన్స్ వచ్చాయి. అయితే, వాటి పరివర్తన, లక్షణాలు, దాన్ని నిరోధించాల్సిన విధానం ఇంకా తెలీదు. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. టీకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది టీకా ప్రభావం బాగానే ఉంటుంది. టీకా అనేది కరోనా మనకు సోకకుండా కాపాడలేదు. కరోనా సోకిన తర్వాత వచ్చే వ్యాధులను నిరోధించేడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటే మనకు కరోనా రాదు అని అనుకుంటున్నారు. కానీ, అది తప్పు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి జబ్బు తీవ్రతను తగ్గిస్తుంది. శాశ్వత టీకాకు సమయం పడుతుంది కరోనా సోకకుండా ఉండే వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో నిర్దిష్టంగా చెప్పలేం. శాశ్వత టీకా వచ్చేవరకూ ఇమ్యూనిటీ వ్యాక్సిన్లు కీలకంగా ఉండచ్చు. పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి దారుణం బ్రిటన్, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా అజాగ్రత్తలే కొంప ముంచాయి. కొద్దిగా తగ్గగానే బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసేశారు. బిజినెస్ పెంచుకునేందుకు డిస్కౌంట్లు ప్రవేశపెట్టారు. దీంతో ఎక్కడికక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడడంతో కరోనా విస్తృతంగా వ్యాపించింది. ఎంతలా అంటే.. ఇప్పుడక్కడ కరోనా బాధితులకు వైద్య సదుపాయం లేకుండాపోయిన పరిస్థితి ఏర్పడింది. అందరూ టీకా వేయించుకోండి ప్రస్తుత పరిస్థితుల్లో టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కూడా జాగ్రత్తగా ఉంటే కరోనా ఏమీ చేయలేదు. ఎక్కడికెళ్లినా మాస్కు విధిగా ధరించండి. జన సమూహంలో అస్సలు ఉండొద్దు. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. ఇంతకుమించిన మందు కరోనాకు లేదు. -
యాంటీ బయోటిక్స్ అని వాడితే.. చివరికి అవే విషంలా
గుంటూరుకు చెందిన రవిచంద్ర కాలేజీ నుంచి వస్తూ కింద పడి గాయం కావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా.. అటు నుంచి అటే మెడికల్ షాప్‌కు వెళ్లి యాంటీ బయోటిక్ ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నాడు. ఆ తర్వాత చిన్నపాటి జ్వరం వస్తే దానికి మరో యాంటిబయోటిక్ ట్యాబ్లెట్ తీసుకున్నాడు. ఇలా చీటికిమాటికి యాంటీ బయోటిక్ మందులు వాడటం వల్ల.. ఆ తర్వాత ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వేసుకున్న మందులు.. సరైన ప్రభావం చూపించకపోవడంతో చివరకు వైద్యుడిని సంప్రదించాడు. యాంటీ బయోటిక్స్ అతిగా వాడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడైంది. బ్యాక్టీరియా కూడా మందులకే సవాల్ విసిరేంత శక్తిని సంతరించుకున్నట్లు తేలింది. ఇలా.. యాంటీ బయోటిక్స్ మితిమీరి వాడటం ద్వారా అనేక మంది తమ ఆరోగ్యాలను చేజేతులారా పాడుచేసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: యాంటీ బయోటిక్స్ మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల చివరికి అవే విషంలా మారుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా యాంటీ బయోటిక్స్ వాడకం పెరిగిపోయింది. దీని వల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలకూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(యాంటీ బయోటిక్స్ ఎక్కువ వాడటం వల్ల బ్యాక్టీరియా బలం పుంజుకోవడం)పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో ఏటా సుమారు 2 కోట్ల మంది యాంటీ బయోటిక్స్ మందులను వాడుతున్నారు. వీరిలో అత్యధిక మంది మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు తేలింది. బ్యాక్టీరియా బలం పుంజుకుంది మొండి జబ్బులకు కూడా దివ్యౌషధంగా భావించేది యాంటీ బయోటిక్స్ మందులే. అయితే మితిమీరిన వాడకం వల్ల బాక్టీరియా కూడా బలం పుంజుకుని యాంటీ బయోటిక్స్‌కు సవాల్ విసిరేంత శక్తి సంతరించుకుంటోంది. చిన్నపాటి జ్వరం వస్తే యాంటీ బయోటిక్ మాత్ర లేదా ఇంజక్షన్ వేస్తున్నారు. తర్వాత జ్వరం తీవ్రంగా వచ్చినప్పుడు గతంలో ఇచ్చిన డోసు సరిపోవడం లేదు. ఇలా యాంటీ బయోటిక్ డోసు పెంచుకుంటూ పోయి.. చివరకు రోగమే పై చేయి సాధించేలా పరిస్థితి తయారైంది. దీనిపై దృష్టి సారించకపోతే జబ్బులను నియంత్రించడం కష్టమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందులపై నియంత్రణ యాంటీ బయోటిక్స్ మందులను రేషనలైజేషన్ చేయనున్నారు. మనుషులకు సంబంధించే కాకుండా.. చేపలు, పౌల్ట్రీ, వెటర్నరీ తదితరాల్లో వినియోగించే మందులపైన కూడా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఏ జబ్బుకు.. ఎలా? ఎవరు? ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు నార్కోటిక్(మత్తు) మందులపైనే నియంత్రణ ఉండేది. ఇకపై డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ ఇవ్వడానికి కూడా వీలుండదు. ఇష్టారాజ్యంగా మందులు రాసే వైద్యులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్ మందులిచ్చిన షాపులపైనా చర్యలు తీసుకుంటారు. యాంటీ బయోటిక్ వాడి రోగ నిరోధక శక్తి కోల్పోయిన రోగుల నమూనాలను ల్యాబొరేటరీల్లో నిర్ధారించి.. వాటిని ఎక్కడ కొనుగోలు చేశారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటారు. నిపుణులతో కమిటీ.. యాంటీ బయోటిక్స్ నియంత్రణ కోసం నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్, ఫుడ్ సేఫ్టీ, అగ్రికల్చర్, పశుసంవర్థక, డైరీ అండ్ ఫిషరీస్, పర్యావరణ, ఫారెస్ట్, ఫార్మాస్యుటికల్/డ్రగ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డ్రింకింగ్ వాటర్, ఆయుష్ తదితర విభాగాల నిపుణులుంటారు. నోడల్ అధికారిగా ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ వ్యవహరిస్తారు. ప్రిస్కిప్షన్ ఉంటేనే ఇవ్వాలి.. మెడికల్ షాపుల వాళ్లు రోగులకు ప్రిస్కిప్షన్ ఉంటేనే మందులివ్వాలి. ఇష్టమొచ్చినట్టుగా ఇవ్వడం వల్ల.. కోర్సు మొత్తం పూర్తి చేయకుండా కొంతమంది 2 మాత్రలు వాడి తగ్గగానే మానేస్తున్నారు. ఆ తర్వాత అవి వాడితే పనిచేయట్లేదు. ఇచ్చే మందులు, ప్రిస్కిప్షన్‌తో ఆన్లైన్ లింక్ చేయాలి. ప్రతిదీ ప్రిస్కిప్షన్‌కు లింక్ చేసి, మందులకు సంబంధించి వైద్యుడిని బాధ్యుడిని చేస్తే నియంత్రణ చేయచ్చు. కౌంటర్ సేల్ జీరో చేయాలి. – డా.కె.రాంబాబు, కింగ్ జార్జి ఆస్పత్రి, విశాఖ కార్యాచరణ రూపొందిస్తున్నాం ఔషధ నియంత్రణ శాఖ డీజీ ఆధ్వర్యంలో వివిధ భాగస్వామ్యులతో దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వినియోగంపై నియంత్రణ దిశగా ఈ కార్యాచరణ ఉంటుంది. – ఎంబీఆర్ ప్రసాద్, సంచాలకులు, ఔషధ నియంత్రణ శాఖ -
కరోనాతో ఏడాది సావాసాన్ని చూస్తే...
కంటికి కనిపించని శత్రువు మనకి సవాల్ విసిరి ఏడాదైంది. కేరళలో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చి ఇవాళ్టికి సరిగ్గా ఏడాదైంది. జనాభాతో కిటకిటలాడే భారత్‌లో కరోనా బాంబు విధ్వంసం సృష్టిస్తుందని అందరూ అంచనా వేశారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలికేసు నమోదు కాగానే భారత్ పనైపోయిందని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అగ్రరాజ్యాలే ఇంకా కరోనా పడగ నీడలో భయం భయంగా బతుకు వెళ్లదీస్తూ ఉంటే, మనం అన్నీ తట్టుకొని ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం. కరోనా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ పాఠాలే గుణపాఠాలుగా మార్చుకొని పడిలేచిన కడలితరంగంలా పైకి లేస్తున్నాం. కరోనాతో కలిసి చేసిన ఈఏడాది ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దాం.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ఏడాదిలో మన జీవన చిత్రాన్ని మార్చేసింది. ఎంతలా అంటే కరోనాకి ముందు కరోనా తర్వాత అని నిర్వచించుకునేలా మారి పోయింది. అమెరికా, యూరప్ వంటి దేశాలు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌తో చిగురుటాకులా వణికిపోతూ ఇంకా ఇళ్లలోనే మగ్గిపోతూ ఉంటే మనం మాత్రం ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమయ్యే వ్యూహరచనలో మునిగి ఉన్నాం. కరోనాపై పోరాటం తుది దశకు వచ్చేసింది. ఏడాదిలోనే దాని కొమ్ములు విరిచేసి ప్రపంచ దేశాల్లో రొమ్ము విరుచుకొని భారత్ ఠీవిగా నిలబడింది. రోజుకి దాదాపుగా లక్ష వరకు కేసులు చూసిన భారత్‌లో ఇప్పుడు రోజుకి 10 నుంచి 20 వేలు వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి కేరళకి చైనాలోని వూహాన్లో 2019 డిసెంబర్ 27న తొలిసారిగా కరోనా కేసు బట్టబయలైతే ఆ తర్వాత నెల రోజులకే అంటే జనవరి 30న చైనా నుంచి భారత్‌కి వచ్చిన కేరళ విద్యార్థినికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఆ విద్యార్థినిని క్వారంటైన్‌కి తరలించడంతో భారత్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ మన ఉష్ణోగ్రతలకి వైరస్ బతకదన్న ధీమాతోనే మార్చి వరకు గడిపేశాం. అంతకంతకూ కేసులు పెరుగుతూ ఉండడంతో వైరస్ ముప్పుని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 24న హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో అందరూ మేల్కొన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి మాటలే కొత్తగా విన్న ప్రజలకు ఈ వైరస్‌పై అవగాహన పెంచుకోవడానికి సమయం పట్టింది. ఆ కొద్దిపాటి సమయంలోనే కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రపంచ దేశాల పట్టికలో అమెరికా తర్వాత కోటి కేసులు దాటిన దేశంగా భారత్ నిలిచినప్పటికీ, జనసాంద్రత పరంగా చూస్తే కరోనా విసిరిన సవాళ్లను పకడ్బందీగా ఎదుర్కొన్నామనే చెప్పాలి. కరోనా విస్తరించిన తొలిరోజుల్లో ముంబై కరోనాకి రాజధానిగా మారింది. ఇప్పటికి కూడా మహారాష్ట్ర కోవిడ్–19 కేసుల్లో ముందు వరసలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర నుంచే 65శాతం నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 1.6శాతం మాత్రమే. సరైన సమయంలో లాక్డౌన్ వల్ల కోటి వరకు కేసులు, లక్ష వరకు మరణాలను నిరోధించగలిగామన్న అంచనాలున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామా..? పశ్చిమ దేశాలు కరోనా వైరస్‌తో ఇంకా కష్టాలు పడుతూ ఉంటే మన దేశంలో అక్టోబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. భారతీయుల్లో రోగనిరోధకత ఎక్కువగా ఉండడం, యువతరం ఎక్కువగా ఉండడం, చాలా మందిలోయాంటీ బాడీలు ఏర్పడడం వంటివి ఇందుకు కారణమని నిపుణుల అంచనా. భారత్‌లో ఎంత మందికి కరోనా వచ్చి తగ్గిందన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పట్టణాల్లో థైరోకేర్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 30 నుంచి 40 కోట్ల మందికి కరోనా వచ్చినట్టు తేలగా, 3నెలల క్రితం ఐసీఎంఆర్ సర్వేలో 10 కోట్ల మందికి సోకినట్టు తేలింది. దీంతో భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించి ఉంటుందని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. మరణాలు తక్కువే.! రికవరీలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. మొత్తం కేసులు కోటీ 7 లక్షలు దాటితే మృతుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. రికవరీ అంశం భారత్‌కు మొదట్నుంచీ అతి పెద్ద రిలీఫ్. తాజాగా జాతీయ రికవరీ రేటు 96శాతంగా ఉండడం ఒక రికార్డు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మరణాల రేటు భారత్‌లో చాలా తక్కువ. 12 నెలల ప్రయాణం 2020 జనవరి 18: చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకి విమానాశ్రయాల్లోనే థర్మల్ స్క్రీనింగ్ 30: కేరళలో తొలి కేసు నమోదు ఫిబ్రవరి 3,4: మరో రెండు కేసులువెల్లడి, వీరు కూడా చైనా నుంచి వచ్చిన విద్యార్థులే మార్చి 10: కరోనాతో తొలి మరణం 11: ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19న మహమ్మారిగా ప్రకటించింది. 24: భారత్‌లో 21 రోజుల లాక్డౌన్ విధింపు ఏప్రిల్ 14: లాక్డౌన్ మే 3వరకు పొడిగింపు మే1: మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగింపు 7: 50 వేలు దాటిన కరోనా కేసులు జూన్ 1: అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం 27: భారత్‌లో 5 లక్షలు దాటిన కేసులు జూలై 1 : అన్‌లాక్ 2 ప్రారంభం 17: భారత్‌లో 10 లక్షలు దాటిన కేసులు ఆగస్టు 3: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి 7:20 లక్షలు దాటిన కేసులు వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు సెప్టెంబర్ 5: కరోనా కేసుల్లో బ్రెజిల్‌ని దాటేసి రెండోస్థానంలోకి చేరుకున్న భారత్ 16 : 50 లక్షలు దాటిన కేసులు అక్టోబర్ 11: 80 లక్షలు దాటిన కేసులు నవంబర్16: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభం డిసెంబర్ 8: ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అనుమతుల్ని పరిశీలిస్తున్నట్టుగా కేంద్రం వెల్లడి డిసెంబర్ 10 : కోటి దాటిన కేసులు 2021 జనవరి 2 : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి 16: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం. -
ఇవే ఇమ్యూనిటీ బూస్టర్స్...
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్–19 లేదా కరోనా వైరస్ దాటికి గజగజ వణికిపోతుంది. దీనికితోడు వర్షాకాలం, చలికాలం రాబోతున్న సమయంలో మరిన్ని సాంక్రమిక వ్యాధులు పెచ్చురిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో వ్యాధులు వచ్చాక చికిత్స కన్నా, నివారణ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏంతింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది? ఏవి తినాలి? ఏవి తినకూడదు?.. చూద్దాం... రోగనిరోధక శక్తిని పెంచడంలో ఏ, బీ, సీ, డీ, ఈ విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటికి కనిపించని హానికారక సూక్ష్మ జీవుల కారణంగా సంక్రమించే అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఏ దోహదపడుతుంది. విటమిన్ సీ, బీటా కెరోటిన్, ఈ, డీ విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఈ పోషకాలన్నీ మన శరీరానికి చేరతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మోతాదుకు మించి పోషకాలు తీసుకున్నా ఇతర రకాల సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ దొరుకుతాయి? ప్రధానంగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి. అందువల్ల వీటన్నింటిని దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో పోషకాలు అధికంగా లభిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసి వండి ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు. కార్బోనేటెడ్ శీత పానీయాలు తాగకూడదు. వీటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు మోతాదుకు మించి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఏవీ ఉండవు. మాంసం, గుడ్లు వంటి ఆహారాలను బాగా ఉండికించిన తర్వాతే తినాలి. పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్‌తో కడుక్కోవాలి. లేదంటే వాటి మీద ఉన్న సూక్ష్మజీవులు మన శరీరంలోకి సులభంగా ప్రవేశించి వివిధ అనారోగ్యాలను కలుగచేస్తాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక వ్యక్తి రోజుకి 30 గ్రాములకు మించి నూనెను, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. చక్కెరలో కెలరీలు తప్పించి పోషకాలు ఏవీ ఉండవు. అందువల్ల చక్కెరను మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఈ అలవాట్లు ఉన్న వారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వీటిని మానేయాలి. మరీ ముఖ్యంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి. నీరు శరీర ఉష్ణోగ్రతలను సమ స్థితిలో ఉంచడంతోపాటు. శరీరంలో వ్యర్థాలను స్వేదం, మూత్రం ద్వారా బయటకు పంపి మన శరీరాన్ని స్వచ్చగా ఉంచుతుంది. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితోపాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్లు ఏ, ఈలు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకునేందుకు ఇవి ఎంతగానో సాయపడతాయి. నారిజం, నిమ్మ, బత్తాయి, బెర్రీ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతున్న వారు ఇప్పటిదాక వాడుతున్న మందులను వాడుకుంటూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కేవలం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే కాకుండే ఎవరైనా సరే మానసిక ఒత్తిడి లేకుండా చూసుకుంటూ, రోజూ సమతుల ఆహారం తీసుకోవాలని, అప్పుడు ఆటోమేటిగ్గా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణుల మాట!. -
ఎండిన పండ్లతో... మెండైన ఆరోగ్యం
డ్రైఫ్రూట్స్‌ను మనందరం చాలా ఇష్టంగా తింటుంటాం. ఈ ఎండిన పండ్లలో మనకు బాగా తెలిసినవి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర వంటివి కొన్నే. కానీ... ఇటీవల అలాంటి డ్రైఫ్రూట్ ఎన్నెన్నో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా అవి ఎన్నెన్నో వ్యాధుల నివారణకూ తోడ్పడుతున్నందువల్ల వాటిపై ఆసక్తి కూడా బాగా పెరిగింది. ఇటీవల వాటి లభ్యత కూడా బాగానే పెరిగింది. కొన్ని ఎండు పండ్లు... ఎన్నో వ్యాధుల నివారణతో బాగా మన ఆరోగ్య పరిరక్షణలో, వాటితో ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కలిగించుకునేందుకు తోడ్పడేదే ఈ కథనం. సాధారణంగా ఆరోగ్యాన్ని కలిగించేవి కాస్తంత చేదుగానో, ఘాటుగానో, వగరుగానో ఉంటాయి. వాటిని తినడానికి మనం ఒకింత ఇబ్బంది పడుతుంటాం కూడా. కానీ ఎండిన పండ్లు మంచి రుచిగా ఉంటాయి కాబట్టి ఇష్టంగానే మనం వీటిని తింటుంటాం. అలా ఇష్టంతో, మంచి రుచితో కొన్ని జబ్బులను నివారించుకునే మార్గాలను చూద్దాం. రక్తహీనత తగ్గించే ఎండు ఖర్జూర: సాధారణంగా మహిళలందరిలోనూ రక్తహీనత కనిపిస్తుంటుంది. ప్రతినెలా అయ్యే రుతుస్రావం వల్ల ఈ కండిషన్ ఉంటుంది. రక్తహీనతను నివారించే మంచి మార్గాల్లో ఎండు ఖర్జూరం ఒకటి. బాగా నీరసంగా ఉండేవారికి సైతం ఎండు ఖర్జూర మంచి ఉపయోగకారి. చాలాసేపు ఏమీ తినకుండా ఉండి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గి, నీరసంగా ఉన్నవారిలో ఆ నిస్సత్తువను తక్షణం తగ్గించేందుకు ఎండు ఖర్జూరాలు తోడ్పడతాయి. వీటిలో ఉండే చక్కెర వల్ల కేవలం ఒకటి రెండు ఎండు ఖర్జూరాలతోనే అన్నం తిన్నంత ఫలితం ఉంటుంది. అలాగే ఎండిన అత్తిపండ్లు (డ్రై– ఫిగ్స్) తినడం వల్ల దీనిలోని ఐరన్, విటమిన్–సి వల్ల రక్తహీనత తగ్గడంతోపాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. రక్తహీనత నివారణకు మాంసాహారం... ముఖ్యంగా మాంసాహారాల్లోనూ కాలేయం బాగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే కఠినంగా శాకాహార నియమాలు పాటించేవారికి ఇది ఒకింత ఇబ్బంది కలిగించే పరిష్కారం. అలాంటివారందరూ ఎండిన ఫిగ్స్‌పై ఆధారపడవచ్చు. రక్తహీనతతో బాధపడేవారిలో మాంసాహారంలోని కాలేయం వంటివి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఒనగూరుతాయో... ఎండిన ఫిగ్స్తోనూ అవే ప్రయోజనాలు చేకూరతాయి. అధిక రక్తపోటు నివారణకు ఎండు ఆప్రికాట్: సాధారణంగా హైబీపీతో బాధపడేవారికి అరటిపండ్లు తినమని డాక్టర్లు సూచిస్తుంటారు. అరటిపండులో పుష్కలంగా ఉండే పొటాషియమ్ రక్తపోటును నివారిస్తుంది/నియంత్రిస్తుంది. అందుకే ఆ సూచన చేస్తుంటారు. అయితే ఒక అరటి పండులో కంటే ఒక ఎండిన ఏప్రికాట్లో మూడు రెట్లకు మించి కాస్తంత ఎక్కువగానే పొటాషియమ్ ఉంటుంది. దాంతో హైబీపీ బాగా తగ్గుతుంది. అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పొటాషియమ్ ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీ నియంత్రిస్తుందని తేలింది. (దీనికి భిన్నంగా సోడియమ్ అన్నది రక్తపోటును పెంచుతుందన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉన్నందున ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దంటూ డాక్టర్లు సూచిస్తుంటారు కూడా). అందుకే హైబీపీ నియంత్రణకు ఎండిన ఏప్రికాట్ మంచి రుచికరమైన మార్గం. ఆస్టియోపోరోసిస్‌ను నివారించే రెయిసిన్స్ : ఇటీవల రకరకాల రెయిసిన్స్ (కిస్మిస్ లాంటివే అయినా బాగా ఎండిన మరో రకం ద్రాక్ష) మెనోపాజ్‌కు చెరుకున్న మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి. వాళ్ల ఎముకలను పటిష్టం చేస్తాయి. సాధారణంగా మహిళలందరిలోనూ ఒక వయసు దాటాక ఎముకల సాంద్రత తగ్గుతుంది. (ఈ పరిణామం అందరిలోనూ కనిపించినా... మెనోపాజ్ దాటాక మహిళల్లో మరింత ఎక్కువ. అందుకే ఎముకలను పెళుసుబార్చి తేలిగ్గా విరిగేలా చేసే ఆస్టియోపోరోసిస్ వాళ్లలోనే ఎక్కువ). సాధారణంగా పాలు, పాల ఉత్పాదనల్లో కాల్షియమ్ ఎక్కువ. అందుకే పెరుగులో కొన్ని రెయిసిన్స్ ముక్కలతో పాటు మన దగ్గర ఇటీవలే లభ్యత పెరిగిన ‘పెకాన్స్’ వంటి ఎండుఫలాలను కలిపి తీసుకుంటే మరింత మంచి ప్రయోజనం కనిపిస్తుంది. మలబద్దకాన్ని నివారించే ప్రూన్స్: ఈ ప్రూన్స్ కూడా కిస్మిస్, రెయిజిన్స్ లాంటి మరో రకం ఎండు ద్రాక్ష. కాకపోతే అవి నల్లటి రంగులో కిస్మిస్, రెయిజిన్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. మనలో చాలామంది మలబద్దకంతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించడం కోసం అనేక మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే రుచుకరమైనదీ, తేలికైన మార్గం ప్రూన్స్ తినడం. రోజూ అరడజను ప్రూన్స్ తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుందని అనేక పరిశీలనల్లో తేలింది. ప్రూన్స్లో ఉండే సార్బిటాల్ అనే పోషక పదార్థం మలాన్ని మృదువుగా చేసి అది తేలిగ్గా విసర్జితమయ్యేలా తోడ్పడతుంది. కాబట్టి మలబద్దకం ఉన్నవారు ఈ రుచికరమైన మార్గాన్ని ఎంచుకుని ప్రయోజనం పొందవచ్చు. గౌట్‌ను నివారించే ఎండు చెర్రీలు: ఎండు చెర్రీలలో యాంథోసయనిన్ అనే పోషకం ఉంటుంది. ఇది ఎముకల్లో మంట, నొప్పి, ఇన్ఫ్లమేషన్ను సమర్థంగా తగ్గిస్తుంది. అందుకే ఎముకల్లో తీవ్రమైన నొప్పి కలిగించే గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఎండు చెర్రీలను తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిరోజుల కిందట యూఎస్ లోని మిషిగన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎండు చెర్రీ పండ్లు తినేవారిలో ఎముకల్లో మంట, నొప్పి, ఇన్ఫ్లమేషన్ సగానికి సగం తగ్గుతాయని తేలింది. యూరినరీ ఇన్ఫెక్షన్స నివారణకు ఎండిన క్రాన్బెర్రీ పండ్లు : మహిళల్లో మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఇలా మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల (యూరినరీ ఇన్ఫెక్షన్స్)తో బాధపడేవారు ఎండిన క్రాన్బెర్రీ పండ్లను తింటే మంచి ఉపశమనం కలుగుతుందని తేలింది. కొన్ని అమెరికన్ అధ్యయనాల్లో ఇది నిరూపితమైన సత్యం. అంతేకాదు క్యాన్‌బెర్రీ పండ్ల వల్ల జీర్ణసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచీ ఉపశమనం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ–కోలై బ్యాక్టీరియా నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని తేలింది. ఎండిన క్యాన్‌బెర్రీలలో ఉండే ప్రో–యాంథోసయనిన్ అనే పోషక పదార్థం వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని స్పష్టమైంది. జీనత్ ఫాతిమా డైటీషియన్ -
కొత్త కరోనా: భారత్‌లో ఆందోళన అవసరం లేదు!
బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్ నుంచే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం. సాక్షి, హైదరాబాద్: పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎదురవుతున్న సమస్యలతో పోలిస్తే భారత్‌లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తక్కువగా సెకండ్ వేవ్ రావొచ్చని, జనవరిలో మళ్లీ కేసులు పెరిగే అవకాశాలున్నాయని, అయితే అది పెద్ద ఆందోళన కరమైనది కాకపోవచ్చని పేర్కొన్నారు. జనవరి నాటికి వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే, ఏప్రిల్ కల్లా వ్యాక్సిన్లు అందిస్తే.. మే నాటికి కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పారు. వచ్చే అక్టోబర్ కల్లా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయుల్లో రోగ నిరోధకశక్తి కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా సంబంధిత అంశాలంపై ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా.నాగేశ్వర్‌రెడ్డి తెలిపిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ఇక్కడ తక్కువగానే కేసులు..: అమెరికా, ఐరోపాలతో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అమెరికా, లండన్‌లో థర్డ్ వేవ్ కూడా వచ్చేసింది. భారత్‌లో ఫస్ట్ వేవ్ మాత్రమే ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ కేసులు నమోదు అవుతుండటంతో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్ నుంచే కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం. చదవండి: (కరోనా కొత్త అవతారం!) అధిక రోగ నిరోధకతపై పరిశోధన.. భారతీయుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండటం, జన్యుపరంగా రక్షణలు, వైరస్ ప్రవేశించే తీరు తక్కువగా ఉండటం, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ నిరోధక వ్యవస్థ.. మన దేశంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఏఐజీలో పరిశోధనలు నిర్వహిస్తున్నాం. దీని వివరాలు మరో నెలలో వెల్లడిస్తాం. వ్యాక్సిన్‌పై ట్రయల్స్ మేమూ నిర్వహించాం. ఇక్కడి వ్యాక్సిన్లు 70 శాతానికిపైగా ప్రభావం చూపుతున్నాయి. ఇండియాలో లేని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఫైజర్, మోడర్నా 95 శాతం కచ్చితత్వం ఉన్నట్లు వెల్లడైంది. వ్యాక్సిన్ల ధరలు, భద్రపరచడం మన దేశంలో కాస్త సమస్య. ఈ వ్యాక్సిన్లను అత్యల్ప ఉష్ణోగ్రతల్లో భద్రపరచాల్సి ఉంటుంది. ఇక్కడి పెద్ద పట్టణాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో ఈ వెసులుబాటు లేకపోవడం మైనస్. ఇండియాలో ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు తొందరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. గర్భిణులు,16 ఏళ్లలోపు వారు మినహా.. గర్భిణులు, 16 ఏళ్లలోపు పిల్లలు మినహా అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న వారు వ్యాక్సిన్లు తీసుకుంటే యాంటీబాడీస్ ఏర్పడతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 3, 4 వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 15 రోజులకు యాంటీబాడీస్ ఏర్పడతాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశం కావడంతో భారత్‌లో ఇప్పటికీ ఇంకా 20 నుంచి 30 శాతమే హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడినట్లు అంచనా. అలాగే వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్క్ శ్రీరామ రక్ష. అయితే బయటికి వెళ్లినప్పుడే మాస్క్ ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి భారత్‌లో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. కోవిడ్‌పై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు చైతన్యం కలిగించింది. సోషల్ మీడియాలో మాత్రం కొంత అసత్యాల ప్రచారం జరిగి భయాలు ఏర్పడ్డాయి. మొత్తం కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుంటే 30 శాతం కంటే ఎక్కువగా గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధిత సమస్యలతో కూడుకున్నవే ఉన్నాయి. డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి, బరువు తగ్గుదల, వాసన కోల్పోవడం వంటి కారణాలతో ఈ కేసులు ట్రేస్ అయ్యాయి. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!) పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు... భారత్‌లో జీర్ణకోశ సంబంధ వ్యాధులు, వాటితో ముడిపడిన సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారం, నీరు కలుషితం కావడం, పరిశుభ్రత పాటించకపోవడం, హెపటైటిస్ బీ, సీ వైరస్ సోకడం, జీవనశైలిలో మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ధూమపానం, మద్యం అలవాట్లు పెరుగుతున్నాయి. పెయిన్ కిల్లర్ మందులు విచక్షణారహితంగా వాడుతున్నారు. దీంతో అసిడిటీ పెరుగుతోంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కరోనాకే కాకుండా హెపటైటిస్ బీ, ఏ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటే మంచింది. -
పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్
లండన్: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్ కిట్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. జనం కరోనిల్ కిట్లను ఎగబడి కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు రూ.250 కోట్ల విలువైన 25 లక్షల కిట్లు విక్రయించినట్లు పతంజలి సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే, స్వసారి–కరోనిల్ కిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, కరోనా వైరస్ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. వృక్ష సంబంధిత పదార్థాలతో రూపొందిన కరోనిల్‌లో కరోనాను ఎదుర్కొనే సామర్థ్యంలేదని వెల్లడైంది. కనీసం రోగ నిరోధక శక్తిని పెంచేదీ అస్పష్టమేనని వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ వెల్లడించారు. యూకేలో పతంజలి స్వసారి–కరోనిల్ కిట్ల విక్రయానికి అనుమతి ఇవ్వలేదని బ్రిటిష్ వైద్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) స్పష్టం చేసింది. అనుమతి లేని ఔషధాలు, వైద్య ఉత్పత్తులను యూకే మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బాబా రాందేవ్ జూన్ 23న కరోనిల్ కిట్లను విడుదల చేశారు. -
కొబ్బరి నూనె... బుల్లెట్ కాఫీ..
► ఆయన పేరు నర్సింహారావు. రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారి. దాదాపు 55 ఏళ్లుంటాయి. ఆయనకు రెండు నెలల కిందట కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్ల సూచన మేరకు బలవర్ధక ఆహారం తీసుకుంటున్నారు. నిత్యం డ్రైఫ్రూట్స్, మాంసాహారం, గుడ్లు, చేపలు, పండ్లు వంటివి తింటున్నారు. దీంతో ఈ రెండు నెలల్లోనే ఆయన అదనంగా 17 కేజీల బరువు పెరిగారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని ఇప్పుడు మథనపడుతున్నారు. ► ఆమె పేరు నమిత... 35 ఏళ్లుంటాయి. హైదరాబాద్‌లో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. గతంలో ప్రతీ రోజూ ఉదయం జిమ్‌కు వెళ్లేవారు. లాక్డౌన్లో జిమ్‌లు మూతపడటంతో వ్యాయామం ఆగిపోయింది. పైగా రోగనిరోధక శక్తి పెరగడానికి బలవర్ధకమైన ఆహారం తీసుకున్నారు. ఫలితంగా 15 కేజీల బరువు పెరిగారు. దీంతో ఆమెకు మోకాళ్ల నొప్పులు కూడా ప్రారంభమయ్యాయి. - సాక్షి, హైదరాబాద్ కరోనా కాలంలో ఇల్లు కదల్లేదు. ఒంటికి శ్రమలేదు. బలంగా ఉండాలని బాగా తినేశారు. బరువెక్కారు. ఇప్పుడు పెరిగిన పొట్టలు చూసుకొని బావురుమంటున్నారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయనే ఆందోళనతో ‘సన్న’బడాలని ఆరాటపడుతున్నారు. అసలే తెలంగాణలో ఊబకాయుల సంఖ్య అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సర్వే తేల్చిచెప్పగా, దానికితోడు కరోనా లాక్డౌన్ తర్వాత వారి సంఖ్య మరింత పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ కాలంలో ఎక్కువమంది ఇంటికే పరిమితమయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సహా వివిధ రంగాల ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. కరోనా కాలంలో రోగనిరోధక శక్తి కోసం బలవర్థకమైన, అధిక కేలరీల ఆహారం తీసుకున్నారు. వ్యాయామం లేకపోవడంతో పొట్ట బెలూన్లా మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారిలో 40 శాతం మంది అధికబరువుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిపుణులను సంప్రదించకుండా... మార్కెట్ మాయలో పడుతున్నారు. ఎవరికి తోచిన డైట్‌ను వారు ఫాలో అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించే ‘ఉచిత’సలహాలను పాటించి రకరకాల ప్రయోగాలకు దిగుతున్నారు. కొబ్బరి నూనె... బుల్లెట్ కాఫీ అధిక బరువును తగ్గించేందుకు మార్కెట్లో అనేక పద్ధతులంటూ ఊదరగొడుతున్నారు. వివిధ రకాల ప్రకటనలతో మాయ చేస్తున్నారు. వీటిలో అశాస్త్రీయ పద్దతులు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నూనె తాగమని కొందరు చెబుతున్నారు. బుల్లెట్ కాఫీ అనేది మరొకటి ఉంది. కాఫీలో వెన్న వేసుకొని తాగడం. అలాగే హెర్బల్ ఆధారిత ఉత్పత్తులు వచ్చాయి. ఏవో రసాయన పదార్థాలు కలిపేస్తారు. అవి తీసుకుంటే బరువు తగ్గుతారని ప్రచారం చేస్తున్నారు. వీటివల్ల రక్తపోటు పెరగడం, కిడ్నీలు ఫెయిల్యూర్ అవడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇక కీటోడైట్ అనేది మరొకటి... ఇందులో ఎక్కువ కొవ్వున్న పదార్థాలు తినాలి. కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు తక్కువ తీసుకోవాలి. ఇది అందరికీ సరిపడదని వైద్యులు అంటున్నారు. మరోటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే రోజుకు 16 గంటలు ఏమీ తినకుండా ఉండటం. మిగిలిన 8 గంటల మధ్యే ఆహారం తీసుకోవడం ద్వారా మిగిలిన సమయంలో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. కానీ దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. పైగా ఇది అందరికీ సరిపడదు. లైపోసెక్షన్ వల్ల బాడీõÙప్ మారుతుందే కానీ బరువు తగ్గదని నిపుణులు అంటున్నారు. అశాస్త్రీయ పద్ధతులతో అనర్థాలు కరోనా తర్వాత బరువు తగ్గిస్తామంటూ అనేక వ్యాపార ప్రకటనలు వచ్చాయి. అశాస్త్రీయ పద్ధతుల వల్ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆస్పత్రిలో చేరిన వారున్నారు. కృత్రిమ డైట్ ప్లాన్లతో కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్ వచ్చిన వారున్నారు. షుగర్, కొలె్రస్టాల్ వంటి కేసులు పెరుగుతున్నాయి. కొందరిని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయాల్సి వచి్చంది. అందరికీ అన్నీ సరిపడవని గుర్తుంచుకోవాలి. డాక్టర్, డైటీíÙయన్ పర్యవేక్షణలోనే డైట్‌ను ఫాలో అవ్వాలి. – డాక్టర్ రాకేశ్ కలపాల, డైరెక్టర్, ఒబెసిటీ సెంటర్, ఏఐజీ, హైదరాబాద్ లావెక్కితే సమస్యలెన్నో.. ► ఊబకాయం వల్ల బుద్ధి మందగిస్తుంది. మెదడు పనితీరు తగ్గుతుంది. ► ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. రాత్రి పడుకున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ► కొవ్వు పెరిగి రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండె పోటు వచ్చే అవకాశముంది. గుండె కొట్టుకునే రేటులో హెచ్చుతగ్గులు వస్తాయి. ► ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. లివర్ సైజ్ కుంగిపోయి పనితీరు తగ్గుతుంది. క్లోమగ్రంధిలో కొవ్వు పెరిగి ప్రాంకెటైటిస్, ప్రాంకియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ► తేన్పులు, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. షుగర్, బీపీ పెరుగుతాయి. ఆస్తమా ఉంటే అది మరీ ఎక్కువవుతుంది. ► మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. ► మానసిక వ్యాధులు, డిప్రెషన్ వంటివి కూడా వస్తాయి. ► ఆడవాళ్లలో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓడీ) సమస్యలు వస్తాయి. -
‘కివి’తో రోగనిరోధక శక్తి ఖాయం..!
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో మంచి డైట్లో భాగంగా ఏదైనా తీసుకోవాలంటే కివియే అంటున్నారు నిపుణులు. చూడడానికి సపోటాలా కనిపించే ఈ కివి పండు శీతాకాలంలో మనం తినే ఆహారంలో కచ్చితంగా ఉండాల్సింది. కివి ఇప్పుడు మన దేశంలో విరివిగా దొరుకుతుంది. ఈ పండుని న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఆ దేశ క్రికెటర్లను కివీస్ అంటుంటాం అనుకుంట.. ఈ పండు తినడం ద్వారా మనకు అనేక పోషక విలువలు, విటమిన్లు, రోగ నిరోధక శక్తి లభిస్తుంది. సి-విటమిన్ మనకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కివి ఈ పండులో ఇది పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కివి కాలరీ ఫ్రెండ్లీ ఫ్రూట్, అందుకే డైట్ ప్లాన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోజూ మనం తినే బ్రేక్ ఫాస్ట్, సలాడ్స్, స్మూతీస్, షేక్స్‌లో వాడవచ్చు. కివి పండు ద్వారా మనకు దాదాపుగా 42 కేలరీలు పొందవచ్చును. మరి కివి ద్వారా మనకు ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం: జీర్ణక్రియ వేగవంతం: కివి పండులో మనకు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అది మన జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా యాంటిఆక్సిడెంట్స్ ఉండటంతో డయేరియా, నాసియా,గ్యాస్,మలబద్దకం వంటి మానసిక వ్వాధులకు నిరోధకంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి : సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దాని ద్వారా మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సి విటమిన్ అవసరమైన మోతాదులో కావాలంటే దీన్ని డైట్లో భాగంగా తీసుకుంటే సరిపోతుంది. గుండెకు మేలు: కివి పండు గుండెకు ఎంతో మేలు. రక్తపోటును నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా పోషకాహారం కలిగి గుండె సంబంధిత వ్యాధులను ఎక్కువ రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఆస్తమాకి మంచిది: ఆస్తమాతో భాదపడుతున్న వారు కివి పండు ద్వారా ప్రయోజనం పొందవచ్చు. యాంటీఆక్సిడెంట్స్, సి-విటమిన్ ఉండటంతో ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా అలర్జీలను దగ్గర రానివ్వకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. కంటి చూపు పెంచుతుంది: రోజు డైట్లో కివి పండును తీసుకోవడం ద్వారా కంటిచూపు మందగించకుండా ఉపయోగపడుతుంది. కివిలో లుటిన్, జియాక్సంత్ ఉండటంతో ఆరోగ్యమైన కంటి చూపును పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడాని ఆహారంలో తీసుకునే ఉత్తమ పండ్లలో కివి ఒకటి. శీతాకాలంలో శరీరం అలర్జీలు ,అనారోగ్యానికి గురయ్యేటప్పుడు, కివి వంటి పండ్లు మంచి ఎంపిక. -
వైరస్ ముప్పు సమసిపోలేదు..
న్యూయార్క్: కరోనా వైరస్ ముప్పు ఇంకా సమసిపోలేదని, వైరస్ నివారణకు తయారవుతున్న వ్యాక్సిన్లు మాజిక్ బుల్లెట్లు కావని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సమాఖ్య) హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్‌తో మహమ్మారి అంతం దగ్గరపడిందని శుక్రవారం వ్యాఖ్యానించిన సమాఖ్య, అంతమాత్రాన కరోనా పూర్తిగా మాయం అవుతుందని భావించట్లేదని తెలిపింది. వ్యాక్సిన్ రాగానే అందరికీ అందుబాటులోకి రాదని, అందువల్ల అప్రమత్తత తప్పదని తెలిపింది. టీకాలు పనిచేయడం ప్రారంభించి క్రమంగా అందరిలో ఇమ్యూనిటీ పెరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం దాదాపు 51 టీకాలు మనుషులపై ప్రయోగదశలో ఉన్నాయని, వీటిలో 13 అంతిమ దశలో ఉన్నాయని పేర్కొంది. వాక్సిన్ పంపిణీ, నిల్వ ప్రయాసతో కూడిన అంశాలని గుర్తు చేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు దగ్గరపడుతుండడంతో మరింత జాగ్రత్త అవసరమని సూచించింది. క్రిస్మస్ సమయంలో కేసులు మరోమారు పెరగవచ్చని అంచనా వేస్తోంది. అందువల్ల గుంపులుగా పండుగ జరుపుకోవద్దని సూచించింది. -
ప్రపంచానికి శనిలా పట్టుకుంది!
ఒక్కసారి పట్టుకుంటే ఏళ్ల పాటు వదలదని ఏలినాటి శనికి పేరు.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కూడా ఇంతే! ఏడాది కాలంలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి.. భవిష్యత్తులోనూ మానవాళికి అనేక రకాలుగా సమస్యగానే మిగిలిపోనుంది. ఆయు ప్రమాణాలను తగ్గించడం మాత్రమే కాదు.. కోట్ల మందిని పేదరికం కోరల్లోకి తోసేయనుంది! సాక్షి, హైదరాబాద్: రోగమొచ్చింది.. మందేసుకున్నాం.. తగ్గింది.. హమ్మయ్య.. ఇక ఏ చింతా లేదు! ఇప్పటివరకు ఏదైనా అనారోగ్యమొస్తే మనం ఆలోచించిన తీరిది.. కానీ కోవిడ్ విషయంలో ఈ ఆలోచన పూర్తిగా మారి పోతోందని అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారిలో కొంతమంది దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవలి కాలంలో నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ కారణంగా వచ్చే జబ్బుల ప్రభావం కొంతకాలం ఉంటుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కరోనా విషయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని.. కానీ కొన్ని కేసుల్లో దాని ప్రభావం మెదడు, గుండెలపై కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌లతో పోలిస్తే కరోనాలో తెలియని మిస్టరీలు చాలా ఉన్నాయి. (ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం) రోగ నిరోధక శక్తి తగ్గుదల, దీర్ఘకాలం పాటు నిస్సత్తువ, తలనొప్పితో పాటు గుండె, శ్వాస సమస్యలు కొనసాగుతాయి..’అని మేయో క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ పోలాండ్ అన్నారు. కోవిడ్ వ్యాధి కణస్థాయిలో జరిపే విధ్వంసం ఇందుకు కారణమవు తుందన్నది ఆయన అంచనా.. వీటితోపాటు కొంతమంది కండ రాలు, దగ్గు వంటి లక్షణాలూ కనపరచవచ్చు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి గుండె ఎక్స్‌రేలను పరిశీలించినప్పుడు కండరాలు దెబ్బతిన్నట్లు తెలిసిందని, ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లోనూ నష్టం ఎక్కువగా ఉందని మేయో క్లినిక్ జరిపిన పరిశోధనల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాకుండా.. రక్తంలో చిన్నసైజు ముద్దల్లాంటివి ఏర్పడతాయని, పెద్దసైజు వాటితో గుండెజబ్బులు వస్తే చిన్నవాటితో గుండెకు వెళ్లే చిన్న చిన్న ధమనులు మూసుకుపోతాయని చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో మాత్రమే కనిపిస్తుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.. (కరోనా: ఒకే ఇంట్లో ఐదురోజుల్లో ముగ్గురి మరణం) ఆయుః ప్రమాణాల తగ్గుదల వైద్య సదుపాయాలు పెరగటం, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయు ప్రమాణాలు పెరిగాయి. అయితే కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిన శ్రమ మొత్తం నీరు కారిపోనుంది. ఆయు ప్రమాణాలు భారీగా తగ్గనున్నాయని దాదాపు మూడు దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాకపోతే ఇది ఆయా దేశాల్లో వ్యాధి తీవ్రత, ప్రస్తుత ఆయు ప్రమాణం తదితర అంశాలపై ఆధారపడి ఉండనుంది. పీఎల్ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ బారిన పడ్డ వారు పది శాతం వరకు ఉంటే.. అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కొత్తగా పుట్టబోయే వారి ఆయుష్షు ఏడాది వరకూ తగ్గనుంది. షాంఘై యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్ (ఆస్ట్రియా), యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూకే) శాస్త్రవేత్తల ఈ అధ్యయనం ప్రకారం వ్యాధి తీవ్రత ఎక్కువున్న చోట్ల ఆయుష్షు 3 నుంచి 8 ఏళ్ల వరకు తగ్గవచ్చు. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది రెండు నుంచి ఏడేళ్లు.. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉండవచ్చు. (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) పెరగనున్న పేదరికం... ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్లుగా తగ్గుతున్న పేదల సంఖ్య కోవిడ్ కారణంగా ఇకపై పెరగనుంది. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది 8.8 నుంచి 11.5 కోట్ల మంది మళ్లీ కఠిన దారిద్య్రం బారిన పడనుండగా.. ఈ సంఖ్య వచ్చే ఏడాది చివరికల్లా 15 కోట్లకు పెరుగుతుంది. రోజుకు 2 డాలర్లు లేదా రూ.150 కంటే తక్కువ ఆర్జించే వారిని పేదలుగా గుర్తించి ప్రపంచబ్యాంకు ఈ అధ్యయనం నిర్వహించింది. కోవిడ్ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పేదల జనాభా 7.9 శాతంగా ఉండేదని, ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు అది 9.1 నుంచి 9.4 శాతం వరకు పెరగనుందని ఈ అధ్యయనం వివరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఆర్థిక వ్యూహాలతో ముందు కెళ్లాల్సి వస్తుందని తెలిపింది. ఇలా పేదరికం బారిన పడే వారిలో ఎక్కువ మంది ఇప్పటికే పేదరికం ఎక్కువున్న దేశాల్లోనే ఉండటం గమనార్హం. మధ్య ఆదాయ దేశాల్లోనూ గుర్తించదగ్గ స్థాయిలో ప్రజలు పేదలుగా మారతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. యుద్ధాల వంటి సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న దేశాల్లో కోవిడ్ గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మారిందని తెలిపింది. ఈ పరిణామం వల్ల 2030 నాటికి పేదల జనాభాను 7 శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని ప్రపంచబ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఇబ్బంది ఏర్పడనుంది. -
షాకింగ్: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో..
సాక్షి, హైదరాబాద్: కరోనా మానసికంగానూ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఇది ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక సమస్యలనూ సృష్టిస్తున్నట్టు ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. వైరస్ మెదడుపై ప్రభావం చూపడంతో పాటు నిద్రలేమి, మనోవ్యథ, కుంగుబాటు, ఒత్తిళ్లు, ఆదుర్దా, ఆందోళన, అయోమయం వంటి మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నట్టు తేల్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో, మరణం అంచు వరకు వెళ్లి తిరిగొచ్చిన వారి లో ఈ మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు పేర్కొంది. అలాగే, అమెరికాలోని పలు వైద్యపరిశోధన సంస్థలు తాజాగా లక్షలాది మంది పేషెంట్ల హెల్త్‌రికార్డ్‌లు (62 వేల మంది కోవిడ్ పేషెంట్లతో సహా) పరిశీలించి.. మానసిక అనారోగ్య అంశాలు, సమస్యలపై లోతైన విశ్లేషణ నిర్వహించాయి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 20 శాతం కంటే ఎక్కువ మందిలో 90 రోజుల్లోనే మానసిక వ్యాకులత, కుంగుబాటుతో మెదడుపై ప్రతి కూల ప్రభావాలు బయటపడినట్టు ఇవి గుర్తించాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది ఆస్పత్రులకు చికిత్సకు వస్తున్నట్టు స్పష్టమైంది. ఈ వివరాలన్నీ ఇటీవల ‘లాన్సెట్ సైకియాట్రీ’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. (కరోనా వ్యాక్సిన్ : ఫైజర్ పురోగతి) అన్ని అధ్యయనాల సారమిదే.. కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి మానసిక సమస్యలున్న వారికి ఇతరులతో పోలిస్తే 65% మేర కోవిడ్–19 సోకే అవకాశాలెక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. కరోనా కారణంగా కలుగుతున్న మానసిక అనారోగ్యంతో కొందరిలో చిత్తవైకల్యం, మెదడు సరిగా పనిచేయకపోవడం వంటి తీవ్ర సమస్యలూ ఎదురయ్యే అవకాశాలున్నట్టు తమ పరిశీలనలో వెల్లడైందని బ్రిటన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ హారిసన్ చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారికి సంబంధించిన ఆందోళన, భయాల వల్ల ఇలాంటి మానసిక సమస్యలు కలుగుతుండొచ్చని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మైఖేల్ బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. కోవిడ్–19 అనేది కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం వల్ల ఇతర మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయని లండన్ కింగ్స్ కాలేజీ సైకియాట్రీ ప్రొఫెసర్ సైమన్ వెస్లీ అంటున్నారు. (‘ఫైజర్’ వ్యాక్సిన్ భారత్‌కు వస్తుందా!?) భయమే పెద్ద సమస్య మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటుతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువుంటుంది. కాబట్టి వైరస్ బారినపడే అవకాశాలెక్కువ. ఆదుర్దా, ఆందోళన, భయం, నిద్రలేమి సమస్యలతో మా వద్దకు పేషెంట్లు వస్తున్నారు. కోవిడ్ అంటే ముందే ఏర్పడిన భయంతో పాజిటివ్ అని తేలాక మరింత కుంగిపోతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమకు కరోనా వచ్చిందని, అదెక్కడ తమ ఆప్తులకు సోకుతుందోనన్న ఆందోళనకు గురవుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా ఆరోగ్యం క్షీణిస్తుందా? గుండెపోటు వస్తుందా? ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే కోలుకోవడం కష్టమేమో వంటి సందేహాలను వెలిబుచ్చుతున్నారు. – డాక్టర్ నిశాంత్ వేమన, సైకియాట్రిస్ట్ -
టీకా ధీమాతో జాగ్రత్తలు హుష్!
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్, వ్యాక్సిన్.. కోవిడ్‌ను అంతం చేసే టీకా కోసం ప్రపంచమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. సెపె్టంబర్, అక్టోబర్ నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని గత ఏప్రిల్ నుంచి కంపెనీలు పేర్కొంటూ వస్తున్నాయి. అందులో కాస్త ఆలస్యమైనా.. ఈ సంవత్సరాంతానికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని ఆయా సంస్థలు బలంగా చెప్తున్నాయి. దీనికి తగినట్లు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఎలా పంపిణీ చేయాలి? అనే విషయంపై కసరత్తు కూడా చేస్తోంది. వెరసి.. ఇంకేంటి ఇక వ్యాక్సిన్ వచ్చినట్లే అనే ధీమా.. ప్రజల్లో కోవిడ్‌పై ఇంతకాలం ఉన్న భయాందోళనలను క్రమంగా దూరం చేస్తోంది. ఇదే వారిలో తీవ్ర నిర్లక్ష్యానికీ కారణమవుతోంది. కోవిడ్ భయం పూర్తిగా పోవడంతో అత్యవసరమైన మాస్కును కూడా దాదాపు పెట్టుకోవటం మానేశారు. 60 శాతం మంది మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. భౌతిక దూరం.. చేతుల శుభ్రత సంగతి సరేసరి. ఈ తీరు అతిపెద్ద ప్రమాదకారి కాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కోవిడ్ రెండో వేవ్‌కు కారణమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం చలికాలం రాబోతుండడంతో వైరస్ మరింత విజృంభించే ప్రమాదముందంటున్నారు. రోగ నిరోధక శక్తే కీలకం ప్రస్తుతం తుదిదశకి చేరిన వ్యాక్సిన్ ప్రయోగాలు సానుకూలంగానే ఉన్నాయని ఆయా కంపెనీలు అంటున్నా, వాటి పనితీరు ఎలా ఉంటుందో చెప్పలేం. గతంలో ఎప్పుడూ ఇంత వేగంగా వ్యాక్సిన్లు సిద్ధం కాలేదు. కోవిడ్ వైరస్ శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రభావం చూపుతోంది. దీన్ని పూర్తిస్థాయిలో నిరోధించే టీకా తయారవడం అంత సులభం కాదు. అందువల్ల టీకాపై ధీమాతో నిర్లక్ష్యంగా ఉండడం సరికాదు. వ్యాక్సిన్ వచ్చినా రోగనిరోధక శక్తిని సక్రమంగా ఉంచుకోవడమే అత్యంత కీలకం. ప్రస్తుతం చలికాలం ప్రవేశిస్తున్నందున మరింత జాగ్రత్తగా ఉండాలి. కరోనాతోపాటు దాడి చేసే ఇతర వైరస్‌లనూ దృష్టిలో ఉంచుకోవాలి. శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పెంచుకోవాలి. న్యుమోనియాకు దారి తీయకుండా ఇది కాపాడుతుంది. వైరస్ చొచ్చుకుపోకుండా కాపాడుకోవాలి. నైట్రేట్స్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. విటమిన్–డి చాలా అవసరం. ఎండ తక్కువగా ఉండే కాలం కాబట్టి విటమిన్–డి పెంపుపై దృష్టిసారించాలి. విటమిన్–డి శరీరంలో శోషణ కావాలంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సెలీనియం ఉండే పదార్థాలు తీసుకోవాలి. మెగ్నీషియం, సెలీనియం ఇమ్యూనిటీని అవసరానికి తగినట్లు ఉంచడంలో తోడ్పడతాయి. జింక్ (రోజుకు 40 ఎంజీలోపు) కూడా శరీరానికి అందాలి. రోగ నిరోధకశక్తిలో కీలకంగా ఉండే ప్రొటీన్ ఇంటర్‌ల్యూకిన్–1బి, 6ను తగ్గించటంతోపాటు ఇంటర్‌ల్యూకిన్ 10ను పెంచేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఆకుకూరలు, మునగకాడలు, మునగాకు, షెల్‌తో ఉండే మాంసాహారంలో ఎక్కువగా ఉండే సెలీనియం బాగా ఉపయోగపడుతుంది. నైట్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవటం వల్ల న్యుమోనియా, రక్తంలో గడ్డలు ఏర్పడకుండా, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. జింక్ వల్ల రోగ నిరోధకశక్తి సమపాళ్లలో ఉంటుంది. సల్ఫర్ అధికంగా ఉండే పదార్థాల వల్ల గ్లూటాటయోన్ పెరిగి వైరస్ శరీరంలో విస్తరించకుండా ఉంటుంది. లివర్ బాగా పనిచేసేలా చేస్తుంది. వృద్ధుల్లో థైమస్ గ్రంథి కుచించుకుపోవడం వల్ల రోగనిరోధక శక్తి లోపిస్తుంది. అందువల్ల వీరు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. వీరు రోగనిరోధకశక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. -
నేను సూపర్ మ్యాన్‌ను: ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ చికిత్స తీసుకున్నాక తనకి తానే ఒక సూపర్ మ్యాన్‌లా అనిపిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ చికిత్సతో రోగ నిరోధక శక్తి పెరిగి తనలో శక్తి బాగా పుంజుకుందని అన్నారు. కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన పెన్సిల్వేనియా ఎన్నికల సభలో తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. తనకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘కరోనా సోకిన తర్వాత నాకు ఇచ్చిన మందులు అద్భుతంగా పని చేశాయి. అవేవో యాంటీ బాడీస్ చికిత్స అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అది తీసుకున్నాక నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నాకు నేనే ఒక సూపర్ మ్యాన్‌లా అనిపిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు అమెరికాలో వాల్టర్ రీడ్ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన కొనియాడారు. తనకు ఎంతటి శక్తి వచ్చిందంటే ఈ సభలో ఉన్న అందరినీ ముద్దాడగలనని అంటూ చమత్కరించారు. ట్రంప్ క్వారంటైన్ సమయం ముగియ కుండానే బయటకి వచ్చారన్న విమర్శలకి ఆయన బదులిస్తూ ‘‘కావాలంటే నేను కూడా వైట్‌హౌస్‌లో ఒక మూల గదిలో కూర్చోవచ్చు. కానీ నేను అలా చెయ్యలేను. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని. నేను ప్రజల్ని కలుసుకోవాలి. వారితో మాట్లాడాలి. అందుకే నేను అలా శ్వేత సౌధానికే పరిమితమవలేకపోయాను’’ అని ఆ ఎన్నికల సభలో ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కంటే ట్రంప్ బాగా వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతూ ఉండడంతో ట్రంప్ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. బైడెన్‌కే ఇండో అమెరికన్లు జై తాజా సర్వేలో మళ్లీ వెల్లడి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కే భారతీయ అమెరికన్లు జై కొడుతున్నారని తాజా సర్వేలో మరోసారి వెల్లడైంది. ఇండో అమెరికన్ ఓటర్లలో 72శాతం మంది బైడెన్‌కి ఓటు వేయాలని భావిస్తుంటే, 22శాతం మంది అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతుగా ఉన్నట్టుగా ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (ఐఏఏఎస్)లో తేలింది. మరో మూడు శాతం మంది వేరే అభ్యర్థి వైపు మొగ్గు చూపిస్తే, మరో మూడు శాతం మంది ఓటు వెయ్యడానికి సుముఖత వ్యక్తం చేయలేదని ఆ సర్వే వెల్లడించింది. ఇండియన్ అమెరికన్లు ఎప్పటి నుంచో డెమొక్రాట్లకే మద్దతుగా ఉన్నారు. ఈ సారి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండడం, విదేశీ విధానంపై ట్రంప్ అనుసరిస్తున్న ఆందోళనలు వంటివి కూడా ప్రవాస భారతీయులు ఎక్కువగా జో బైడెన్ వైపు మొగ్గు చూపించడానికి దోహదం చేశాయని ఆ సర్వే వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు ఆన్లైన్ ద్వారా 936 మంది ఇండో అమెరికన్లతో ఈ సర్వే నిర్వహించింది. -
అన్నం తక్కువ తిందాం..!
సాక్షి, హైదరాబాద్: తిండి కలిగితే కండ కలదోయ్... కండకలవాడేను మనిషోయ్.. అన్నాడు కవి గురజాడ. అలాగని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో మెజార్టీ జనాలు ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ.. కొవ్వులు, గ్లూకోజ్‌లు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో శరీర సౌష్టవం దెబ్బతినడంతో పాటు అనారోగ్యానికి దారితీస్తోంది. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా పరిశీలన చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న దానిపై ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ పలు సూచనలు చేశాయి. అలాగే వీటన్నింటినీ వివరిస్తూ ‘వాట్ ఇండియా ఈట్స్’ నివేదికను విడుదల చేశాయి. పరిశీలన సాగిందిలా... దేశాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్ ఈస్ట్‌గా విభజించి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, తీసుకుంటున్న విధానాన్ని 24 గంటల(ఒక రోజు)ను ఒక యూనిట్ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లున్నా... తీసుకునే విధానం మాత్రం సరిగా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా> తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా తృణ, చిరుధాన్యాల వినియోగం అధికంగా ఉంది. పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని మోతాదులోనే భుజిస్తున్నారు. పాల ఉత్పత్తులతో పాటు కాయగూరలు, పండ్లు, గింజలను తక్కువగా తీసుకుంటున్నారు. దుంపలను ఎక్కువగా తీసుకుంటుండగా... పట్టణ ప్రాంతాల్లో కొవ్వు పదార్థాల వినియోగం అధికంగా ఉంది. ‘మై ప్లేట్ ఫర్ ది డే’ మెనూ ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు సగటున 2 వేల కిలో కెలోరీల ఆహారం సరిపోతుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం, వ్యాయామంతో శరీర సౌష్టవం, చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ఎన్ ఐఎన్ సూచిస్తోంది. రోజువారీగా ఏయే పదార్థాలు ఎంత శాతం తీసుకోవాలన్న దానిపై ఒక మెనూను రూపొందించి ‘మై ప్లేట్ ఫర్ ది డే’ పేరు పెట్టింది. ఇందులో 40% ఆహారంగా బియ్యం లేదా గోధుమలు, మొక్కజొన్నతో పాటు తృణ ధాన్యాలైన జొన్నలు, రాగులు, అరకలు, సజ్జలతో వండిన పదార్థాలు కూడా తీసుకోవాలి. 11% పప్పులు, 6% మాంసాహారం, 10% పాలు లేదా పెరుగు, 5% కాయగూరలు, 3% పండ్లు, 8% బాదం, ఖాజు, పల్లీ తదితర నట్స్ తినాలి. కొవ్వు లేదా నూనె పదార్థాలను 12% తీసుకోవాలి. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సగటు మనిషి ప్రామాణిక బరువును ఐదు కిలోలు పెంచగా, మనిషికి కావాల్సిన కేలరీలను వారి శ్రమ ఆధారంగా పోలుస్తూ మార్పులు చేశారు. ► పప్పుదినుసులతో చేసిన ఆహారానికి బదులుగా గుడ్లు, మాంసం, చేపలను అదే మోతాదులో తీసుకోవచ్చు. ► పండ్లను జూస్‌ల రూపంలో కాకుండా నేరుగా తినేలా తీసుకోవాలి. ► కొవ్వులు, నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిత్యం ఒకే రకమైన నూనె పదార్ధాలు కాకుండా వేరువేరుగా తీసుకోవాలి. ► ఊబకాయం ఉన్నవారు, లేదా బరువు తగ్గాలనుకున్న వారు బియ్యం, గోధుమ తదితర ధాన్యాలతో చేసిన పదార్థాలను తగ్గించాలి. -
కరోనాను 'ఢీ'కొట్టండి
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడుతున్నవారిలో 80 శాతం మంది డీ విటమిన్ లోపం కలిగి ఉన్నారని తేలింది. ఈ విషయంపై జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా) అధ్యయనం చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు విటమిన్ డీ లోపం ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువున్నట్లు గుర్తించారు. విటమిన్ డీ వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. ఈ లోపం ఉన్న వారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోవడంతో కరోనా సోకే అవకాశమెక్కువ. విటమిన్ డీ మందుల వల్ల శ్వాసకోçశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని తేల్చారు. కరోనా చికిత్సలో విటమిన్ డీ మాత్రలు విటమిన్ డీ లోపం సర్వసాధారణం. ఇది దాదాపు సగం జనాభాను ప్రభావితం చేస్తుంది. సూర్యరశ్మి తగ్గిన వ్యక్తులలో అధికంగా ఈ లోపం ఉంటుంది. ఇళ్లలో ఉండేవారు, వైద్య సిబ్బంది సహా ఎండ తగలకుండా ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారిలో విట మిన్ డీ లోపం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత మొదలై ఇన్నాళ్లైనా ఇంతవరకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ కానీ మందులు కానీ అందుబాటులోకి రాలేదు. అం దుకే వైరస్ బారినపడిన వారికి డాక్టర్లు రోగనిరోధకశక్తి పెంచే విట మిన్లు, బలవర్ధ్థకమైన ఆహారం ఇవ్వడం ద్వారా చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడనివారు ముందు జాగ్రత్తగా విటమిన్ డీ, సీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. అవి లభించే ప్రత్యేక ఆహారం తీసుకుంటున్నారు. విటమిన్ డీ చికిత్స కరోనాను నివారించడానికి, చికిత్సకు ఒక వ్యూహంగా నిపుణులు గుర్తించారు. విటమిన్ డీ.. వైరల్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని వారు కనుగొన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు ►కరోనా పరీక్షలప్పుడు విటమిన్ డీ తక్కువుండే వారికి పాజిటివ్ వచ్చే చాన్స్ ఎక్కువ. ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్యాల కారణంగా విటమిన్ డీ లోపం పెరిగే చాన్స్ ఉంది. ►వైరల్ ఇన్ఫెక్షన్లను విటమిన్ డీ తగ్గించగలదు. వీటిలో కరోనా కూడా ఒకటి. ►విటమిన్ డీ రోగనిరోధకశక్తిని కల్పిస్తుంది. కాబట్టి కరోనా సంక్రమణను తగ్గిస్తుంది. ►విటమిన్ డీ డెన్డ్రిటిక్ కణాలు టీ కణాలపై ప్రభావం చూపడం వల్ల రోగనిరోధక పనితీరును మాడ్యులేట్ చేస్తుంది. తద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
కరోనా వైరస్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీర అవయవాలపై అధికంగా దాడి చేస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా ఆస్పత్రి పాలు చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా జనం సవాలక్ష మార్గాల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. వ్యాధి నిరోధక శక్తి మరింత పెంచుకోవాలని వైద్యులు సూచించేలా చేస్తోంది. ఆరోగ్యానికి మాంసాహారమే ఉత్తమ మార్గమని జనం భావించేలా చేసింది. నిన్నమొన్నటి వరకు వెల వెలబోయిన నాన్‌వెజ్ వ్యాపారాలు నేడు పుంజుకునేలా మార్చింది. వైరస్ అంతం.. ఇమ్యూనిటీ పంతం అనేలా తెచ్చింది. జిల్లాలో మాంసం వినియోగం పెరగడంపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. చిత్తూరు కలెక్టరేట్: అసలే కరోనా కాలం. రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్లు, పోషకాలు చికెన్‌లో అధికంగా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. కరోనా ప్రారంభమైన మొదట్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం నెల రోజులుగా పతాక స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కోడి మాంసం, గుడ్ల వినియోగం పెరిగింది. గతంలో.. కరోనా వైరస్ ప్రారంభంలో చికెన్, మటన్ తింటే వైరస్ సోకుతుందనే ప్రచారం సాగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కసారిగా వాటి వినియోగం పడిపోయింది. గతంలో రోజుకు 15 లక్షల కోడిగుడ్లు విక్రయాలు జరుగుతుండేవి. కరోనా ఎఫెక్ట్‌తో 4 లక్షలకు అమ్మకాలు పడిపోయింది. చికెన్ కూడా అంతకుముందు నెలకు 6.5 లక్షల టన్నుల వరకు విక్రయించేవారు. కరోనా వల్ల 2 లక్షల టన్నులకు పడిపోయింది. కరోనా ప్రారంభమైన మా తీరని నష్టం వాటిల్లింది. అప్పట్లో కోళ్లు, కోడిగుడ్లు ఎక్కువగా నిల్వ ఉండడంతో తక్కువ ధరకు కొందరు విక్రయించేశారు. మరికొంతమంది వ్యాపారులు ఉచితంగా పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు.. చికెన్ తింటే కరోనా వస్తుందన్న భయాన్ని నిపుణులు పోగొట్టారు. సాక్షాత్తు వైద్యులే చికెన్, మటన్, కోడిగుడ్లు తినాలని సూచించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ప్రజలు వీటిని వినియోగించడం ప్రారంభించారు. ఇందులో విచిత్రమేమిటంటే కరోనా కేసులు ఎక్కువైన సమయంలో వాటి వినియోగం పెరిగింది. చికెన్ ధర కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. కోడిగుడ్డు ధర రూ.2.50 నుంచి రూ.5 చేరింది. ధర పెరిగినా వినియోగదారులు ఏమాత్రం తగ్గడం లేదు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని.. కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు కండ పుష్టి పొందడానికి, ఎముకల బలానికి, ప్రొటీన్లు, పోషకాల పెంపు కోసం చికెన్ తినడం ప్రారంభించారు. చికెన్‌లో చాలా రకాల పోషకాలుంటాయని వైద్యులు సలహాలిస్తున్నారు. చికెన్‌లో అమినో యాసిడ్స్ ఉండడం వల్ల శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుందని అంటున్నారు. మినరల్స్‌గా పిలుచుకునే సెలినీయం పోషకం ఉండడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. విటమిన్– బీ5, పాంటోథెనిక్ ఆమ్లం వంటివి ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయని వైద్యులు చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల గుండెనొప్పి, ఇతర సమస్యలను తగ్గిస్తుందని, విటమిన్– బీ6 అధికంగా ఉండడంతో గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. చికెన్‌లో జింక్ అధికంగా ఉండడంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. పెరిగిన వినియోగం జిల్లాలో చికెన్, మటన్ వినియోగం గతంలో కంటే అధికంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజు మార్చి రోజు చికెన్ తింటున్నారు. బాయిలర్ చికెన్‌తో పాటు నాటుకోడి మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మటన్, కోడిగుడ్లకు కూడా ప్రాధాన్యమిçస్తున్నారు. మటన్ అతిగా తీసుకోకూడదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారంలో రెండు రోజులు మాంసం తీసుకోవచ్చని, పూటకు సగటున 300 గ్రాముల మాంసం తీసుకుంటే సరిపోతుందంటుని చెబుతున్నారు. జిల్లాలో మటన్‌తో పాటు నాటు కోడి మాంసం ధర పెరిగింది. మటన్ కిలో రూ.800 నుంచి రూ.900 వరకు పెరిగింది. నాటుకోడి మాంసం ధర కిలో రూ.600 దాటింది. బాయిలర్ కోడి మాంసం ధర కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ఉంటోంది. కరోనా వల్ల మొదట్లో పూర్తిగా నష్టపోయిన చికెన్ వ్యాపారులు ప్రస్తుతం ఆర్థికంగా పుంజుకుంటున్నారు. ఉచితంగా పంపిణీ చేశాం కోవిడ్ వచ్చిన మొదట్లో చికెన్ ధరలు పడిపోయాయి. కొనే వారు లేక చికెన్, కోళ్లు ఉచితంగా పంపిణీ చేశాం. ఎక్కువ రోజులు కోళ్లు నిల్వ చేసుకోలేక రెగ్యులర్ కస్టమర్లకు ఉచితంగా పంచిపెట్టాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అమ్మకాలు జోరందుకున్నాయి. మదనపల్లెలో కిలో చికెన్ ధర రూ.150 వరకు పలుకుతోంది. – మైనుద్దీన్, చికెన్ వ్యాపారి జాగ్రత్తలు ముఖ్యం జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదు. ఒకవేళ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం రోజుల పాటు కఠోర సాధన చేస్తే కరోనాను జయించవచ్చు. ధాన్యం, యోగా, ఆధ్యాత్మిక చింతనతో గడిపితే చాలు. పోషకాహారాలు తీసుకున్న వారికి కరోనా రాదు. కరోనాపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. – మహేష్‌నారాయణ, యోగా సాధకులు వ్యాపారాలు వృద్ధి చెందాయి కరోనా వచ్చిన మొదట్లో అపోహలతో చాలా నష్టపోయాం. చికెన్, కోడిగుడ్లు తినకూడదని అప్పట్లో తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కొనడానికి ఎవరూ ముందుకొచ్చే వారు కాదు. రోజుకు 8 లక్షల కోడిగుడ్లు అమ్మాలంటే గగనంగా ఉండేది. ప్రస్తుతం రోజుకు 15 లక్షల వరకు కోడిగుడ్లు అమ్ముడవుతున్నాయి. ధరలు కూడా పెరిగాయి. – హరినాయుడు, ఎస్ఆర్పురం -
ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యింది. ఇంటి, ఒంటి శుభ్రతతో పాటు తినే ఆహారంలో కూడా తగన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు బయటి ఆహారాన్నే ఇష్టపడ్డవారు సైతం ఇప్పుడు ఇంటి భోజనమే బెటర్ అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మన శరీరం చూపే కొన్ని లక్షణాలను బట్టి మన రోగనిరోధక శక్తి బలంగా ఉంది లేనిది అనే దాని గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో చూడండి.. (చదవండి: నాటుకోడి నోరూరిస్తోంది..!) తరచు జలుబు, దగ్గు.. తరచుగా జలుబు చేసినా.. గొంతులో చిరాకుగా ఉండి దగ్గు సూచనలు కనిపించినా మీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు గనక సంవత్సరంలో నాలుగు సార్లకంటే అధికంగా దగ్గు, జలుబు వచ్చాయంటే మీ ఇమ్మూనిటీ లెవల్స్ బలహీనంగా ఉన్నాయని అర్థం. నిద్ర లేచాక.. భారంగా ఉంటుందా.. రాత్రి నిద్రపోయాక తరచుగా మెలకువ వస్తుందా.. అలానే 7-8 గంటలు నిద్ర పోయి లేచిన తర్వాత కూడా మీకు భారంగా అనిపిస్తుందా. ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే.. మీ రోగ నిరోధక శక్తి ప్రమాదంలో ఉన్నట్లే. తరచుగా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడం.. మీరు బయట ఆహారం తిన్నారు.. కడుపులో అనిజీగి ఉందా. అయితే మీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లే. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మిగత శరీర భాగాలు కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. గాయాలు నెమ్మదిగా నయమవుతున్నాయా.. దెబ్బ తగిలినప్పుడు.. కాలినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఆ గాయాలు మానిపోతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటే.. గాయాలు నెమ్మదిగా మానితే.. మీ రోగనిరోధక శక్తి మందగించిందని అర్థం. అంతేకాక మీ శరీరం, చర్మాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అందించడం లేదనడానికి గుర్తు. తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా.. మీరు జలుబు, దగ్గుతో పాటు మూత్ర, చెవి, సైనస్ సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే ఇమ్యూనిటీ వీక్‌గా ఉందని అర్థం. మీ రోగనిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేసిన వైరస్లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తగినన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేకపోతుందనడానికి ఇది సంకేతం. ఈ పైలక్షణాలు మీకు కనిపిస్తే.. వెంటనే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వ్యాయమాలు చేయడం ప్రారంభించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!) -
కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా వైరస్‌ను తట్టుకునేందుకు రోగనిరోధకశక్తి చాలా కీలకమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పురుషుల కన్న మహిళలకే రోగనిరోధకశక్తి ఎక్కువని, అందువల్ల కరోనాను మహిళలు సులభంగా జయిస్తున్నారని యేల్ యూనివర్సిటీకి(యూఎస్ఎ) చెందిన నేచర్ జర్నల్ నివేదికలో తెలిపింది. కాగా కరోనాను ఎదుర్కొనే టీసెల్స్ మహిళలకు ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది. అయితే మానవుల్లో టీసెల్స్ సమృద్ధిగా ఉంటే క్రిమికారక వైరస్‌లను సులభంగా ఎదుర్కొంటాయి. అయితే పురుషుల్లో టీసెల్స్ నామమంత్రంగా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది. కాగా 98 మంది కరోనా బాధితులను పరీక్షించి నివేదికను రూపోందించారు. మరోవైపు రోగనిరోధక శక్తికి బలం చేకూర్చే సైటోకైన్స్ వ్యవస్థ మహిళల్లో అత్యద్భుతంగా పనిచేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చదవండి: ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్! -
మరో వింత.. ఈ చీరతో కరోనాకు చెక్?!
భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం వెరైటీగా రోగనిరోధకత పెంచే చీరలు వచ్చాయి. మీరు చదివింది వాస్తవమే.. రోగనిరోధక శక్తి పెంచే చీరలను ‘ఆయుర్‌వస్త్రా’ పేరుతో మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. రకరకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేశామని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని కార్పొరేషన్ అధికారులు తెలుపుతున్నారు. చీరలు మాత్రమే కాక ఇతర దుస్తులను కూడా తయారు చేశామన్నారు. వీటిని ధరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని. ఫలితంగా కరోనా వైరస్ మన దరిచేరదంటున్నారు కార్పొరేషన్ అధికారులు. (ఇమ్యూనిటీ బూస్టర్: వాస్తవమెంత?) యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలతో రోగ నిరోధక శక్తిని పెంచే చీరల తయారిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్‌కి అప్పగించింది. ఈ చీరలు తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాక ఎంతో నైపుణ్యం అవసరమన్నారు మాలేవర్. లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, రాయల్ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారికి వాడినట్లు వెల్లడించారు. వీటన్నింటిని పొడి చేసి 48 గంటల పాటు నీటిలో నానబెడతారు. తరువాత దీన్ని మరగబెట్టి.. దాని నుంచి వచ్చిన ఆవిరిని చీర, మాస్క్ లేదా ఇతర దుస్తులు తయారు చేసే వస్త్రానికి పట్టిస్తారు. ఇది కొన్ని గంటలపాటు జరుగుతుంది. తర్వాత ఆవిరి పట్టించిన వస్త్రంతో చీర, మాస్క్, ఇతర దుస్తులు తయారు చేస్తారు. ఈ పద్దతిలో ఒక చీర తయారు చేయడానికి 5-6రోజులు పడుతుందని తెలిపారు. (కరోనా పేరిట కొత్త వ్యాపారాలు) రెండు నెలలు శ్రమించి ఈ పద్దతి కనుగొన్నాం.. ఈ సందర్భంగా వినోద్ మాలేవర్ మాట్లాడుతూ.. ‘ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్దతి. ఈ బట్టల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది. ఈ దుస్తులను ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రకం దుస్తులను తయారు చేయడానికి దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ పద్దతిని కనుగొన్నాము. ఈ దుస్తులలో రోగనిరోధక శక్తి పెంచే ప్రభావం నాలుగైదు ఉతుకుల వరకు ఉంటుంది’ అని తెలిపారు మాలేవర్. మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ..‘ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచే పురాతన వస్త్రాల తయారీ విధానాన్ని పునరుద్ధరించడానికి మాకు అవకాశం లభించింది. కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో మేం జనాలకు మేలు చేసే హెర్బల్ దుస్తులను మార్కెట్లోకి తెచ్చాం. ప్రస్తుతం రోగనిరోధకత పెంచే ఈ చీర ధర 3 వేల రూపాయలు’ అన్నారు. (వామ్మో.. చై'నో'..) అంతేకాక ‘ప్రస్తుతం మేము ఈ చీరలను భోపాల్, ఇండోర్లలో విక్రయిస్తున్నాము. రాబోయే రోజుల్లో, ఈ చీరలను దేశవ్యాప్తంగా ఉన్న మా 36 షోరూమ్‌లలో విక్రయిస్తాము’ అని తెలిపారు రాజీవ్ శర్మ. అయితే ఈ చీరలు, మాస్క్‌లు ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిరూపించడానికి ఎలాంటి వైద్య ఆధారాలు లేవు. ముఖ్యంగా ఈ దుస్తులు కరోనా వైరస్ సంక్రమించకుండా కాపాడతాయని చెప్పడానికి ఎలాంటి ఆధాలు లేకపోవడం గమనార్హం. -
నాటుకోడి నోరూరిస్తోంది..!
రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు చికెన్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాయిలర్ కంటే నాటు కోడి మాంసంలో పోషకాలు, ప్రొటీన్లు అధికంగా ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పల్లెలో పెరిగే కోళ్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో నాటు కోళ్ల ధరను మాంసం విక్రయదార్లు విపరీతంగా పెంచేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కొందరు నాటు కోళ్లకు ప్రత్యేకంగా ఫారాలను ఏర్పాటు చేసి పెంచుతున్నారు. ప్రజల నమ్మకాన్ని తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కలికిరి, నిమ్మనపల్లె, మదనపల్లె, చంద్రగిరి, బంగారుపాళ్యం తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాటుకోళ్ల ఫారాలను నిర్వహిస్తున్నారు. – మదనపల్లె కరోనా మహమ్మారి కాలుమోపిన తొలినాళ్లలో కోళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోందనే వదంతులు వెల్లువెత్తాయి. దీంతో జనం చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో ఒక్కసారిగా కోళ్ల పరిశ్రమ దెబ్బతింది. అప్పట్లో చికెన్ వ్యాపారులు రూ.100కి 3కిలోల చొప్పున విక్రయాలు సాగించారు. తర్వాత కరోనాను ఎదుర్కోవాలంటే మనిíÙలో రోగనిరోధకశక్తి అవసరమని, కోడి మాంసం, గుడ్లను తప్పనిసరిగా తినాలని వైద్యనిపుణులు సూచించారు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు జనం ఒక్కసారిగా చికెన్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. పట్టణాల్లో దొరికే బ్రాయిలర్ చికెన్ కంటే పల్లెటూళ్లలో లభించే నాటుకోడి మంచిదని పలువురి నమ్మకం. అందుకే ప్రస్తుతం ప్రజలు నాటుకోడి మాంసం తినేందుకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే నాటుకోడి.. రాగి సంగటి అద్భుతమైన కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది. వహ్వా.. నాటుకోడి పులుసు బ్రాయిలర్ చికెన్ కంటే నాటుకోడి ఆరోగ్యానికి మంచిదనే ప్రచారంతో ఇటీవల కాలంలో వీటికి గిరాకీ బాగా పెరిగింది. బ్రాయిలర్ చికెన్‌లో రుచి తక్కువ, మటన్ తింటే కొవ్వు పెరుగుతుంది, మంచి చేపలు దొరకడం కష్టంగా ఉంది, దీంతో నాటుకోడి మాంసం వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా రాగి సంగటిలో నాటుకోడి పులుసు వేసుకుతింటే ఆ రుచి వర్ణనాతీతం. పెరిగిన డిమాండ్ బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో విపరీతంగా మందులు వాడుతుండటంతో, అవి తింటే అనారోగ్యం పాలవుతామనే భావన ప్రజల్లో అధికమైంది. దీనికితోడు నాటుకోడి కూర తినండి అంటూ పలువురు ఆహారనిపుణులు సూచించడంతో అందరిచూపు వీటివైపు మళ్లింది. నాటు కోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతుంది. మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప ఎలాంటి కీడు ఉండదు. ప్రస్తుతం వీటిని పెంచుతున్న ఫారాలలో నాటుకోళ్లకు రాగులు, సజ్జలు, జొన్నలు, నూకలు, వడ్లు, అన్నిరకాల కూరగాయలు, పాలకూర, మెంతి, అరటి, మామిడి, వేపాకులను దాణాగా వేస్తున్నారు. ఎలాంటి రోగాలు రాకుండా పసుపు, అల్లం కలిపిన నీటిని తాగిస్తున్నారు. అందుకే బ్రాయిలర్ చికెన్ కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటే నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు పల్లెల్లో తిరిగి నాటు కోళ్లను కొనుగోలుచేసి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. -
‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ మహమ్మారిని మన శరీరం ఎదుర్కోవాలంటే.. మనలో రోగనిరోధక శక్తి ఉండాలి. ఇందుకు ‘ప్రోటీన్లు’ అత్యధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇంతటి కీలకమైన పోషక పదార్థాలపై భారతీయుల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారతీయ తల్లుల్లో అత్యధికశాతం మంది ఆహారంలో వీటి ఆవశ్యకతను గుర్తించడం లేదని ప్రముఖ సంస్థ నిల్సన్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ప్రోటీన్లు మన హక్కు’ అనే నినాదంతో దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని మెట్రో, ద్వితీయశ్రేణి నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. నిల్సన్ సర్వేలోని ప్రధాన అంశాలు ఇవీ.. ► ప్రోటీన్లపై భారతీయులకు సరైన అవగాహన లేదు. పేదల్లోనే కాదు మధ్యతరగతి, ఉన్నతవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ► భారతీయులు సగటున తక్కువ పరిమాణంలో పోట్రీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. కేవలం 3శాతం మందికి మాత్రమే వీటి అవశ్యకత తెలుసు. ► రోగనిరోధక శక్తిని అందించి, కండరాల శక్తిని పెంపొందించడంలో ప్రోటీన్లు కీలకమనే విషయం 90% మంది తల్లులకు తెలియదు. ► రోజువారి ఆహారంలో 82% మంది తల్లులు ప్రోటీన్లకు తక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ► 80% మంది మాతృమూర్తులకు ప్రోటీన్లు ముఖ్యమైనవి అని తెలుసు కానీ రోజూ ఆహారంలో వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రోటీన్లు త్వరగా జీర్ణం కావని.. వీటిని ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతారని.. ఇలా పలురకాల దురభిప్రాయాలు ఉన్నాయి. ప్రోటీన్లతోనే ఆరోగ్యభారత్ చిన్నతనం నుంచే ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం ఇవ్వడం ద్వారానే ఆరోగ్య భారత్‌ను రూపొందించగలమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిల్సన్ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు భారతీయులకు కనువిప్పు కలిగించాలని ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్ప్రెసిడెంట్ డా.జగ్మీత్ మదన చెప్పారు. ‘ప్రోటీన్ పారడాక్స్’పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం దేశానికి సరైన మార్గనిర్దేశం చేసిందని న్యూట్రీటెక్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ డా.సురేశ్ ఇటపు అభిప్రాయపడ్డారు. ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం ► మొక్కజొన్న, స్వీట్‌కార్న్ ► ఆకు కూరలు ► పాలు ► పెరుగు ► పప్పు దినుసులు ► బీన్స్, చిక్కుళ్లు, రాజ్మా, సోయా, కాబూలీ శనగలు ► వేరుశనగ(పొట్టు తీయకుండా) ► పుట్టగొడుగు ∙గుడ్లు ► పళ్లు... ప్రధానంగా సిట్రస్ ఉండే దానిమ్మ, నిమ్మ, జామ, దబ్బ, ► స్కిన్లెస్ చికెన్, చేపలు -
ట్యాబ్లెట్లు నింపేస్తునారు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎన్నెన్నో దారులు వెదుకుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)పెంచుకునేందుకు కషాయం తాగడం లాంటి వంటింటివైద్యానికి ప్రాముఖ్యతనిస్తూనే..విటమిన్స్, మినరల్స్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఏ మెడికల్ షాపులకు భారీగా గిరాకీ పెరిగింది. కొందరు వ్యక్తిగతంగా టాబ్లెట్లు కొనుగోలు చేస్తుంటే..మరికొందరు డాక్టర్ల సలహాతో మందులువాడుతున్నారు. గత వారం రోజులుగా పలు విటమిన్స్, మినరల్స్‌కుసంబంధించిన మందుల కొరత ఏర్పడింది. మెడికల్ షాపుల్లోనో స్టాక్ అని చెప్పేస్తున్నారు. దీన్నిబట్టి నగర జనంఏ స్థాయిలో ఈ ముందులు వాడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది. సోమవారం ‘సాక్షి’ నగరంలోని పలు మెడికల్ షాపులనుసందర్శించగా..పలుఆసక్తికర విషయాలు తెలిశాయి. మెడికల్ షాప్‌లకు వచ్చే సుమారు వంద మంది కస్టమర్స్‌లో దాదాపు 90 మంది విటమిన్ సి,డితో పాటు ఇతర మినరల్ మాత్రలను కొనుగోలు చేయడం కన్పించింది. కొందరైతే ఇంట్లోని కుటుంబ సభ్యుల అందరి కోసం మాత్రలు కొనేశారు. వీటితో పాటు రోగ నిరోధక శక్తినిచ్చే ఇతర ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్లు, టానిక్స్, జింక్, ఐరన్, మల్టీవిటమిన్స్ కొనుగోలు చేస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శరీరంలో అన్ని విధాలుగా శక్తి సమకూర్చడానికి ఈ రకమైనా మందులు కొంటున్నామని చెబుతున్నారు. ఇలా నగరవాసులు శరీంలో విటమిన్స్‌ను నింపేస్తున్నారు. ఆక్సీమీటర్లు, నెబులైజర్లకు పెరిగిన డిమాండ్ కరోనా వ్యాధి లక్షణాలుంటే శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గతుందని నగర ప్రజల్లో ప్రచారం ఎక్కువగా ఉంది. శరీరంలో ఆక్సిజన్ శాతం తెలుసుకోవడానికి ఆక్సీమీటర్ ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది ఆక్సీమీటర్లు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో వీటికి డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. కరోనా వ్యాధి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ ఆక్సీమీటర్లు కొనుగోలు చేస్తున్నారు. జలుబు, జ్వరం ఉండి డాక్టర్ల వద్దకు వెళ్తే ముందు ఆక్సీమీటర్ పెట్టి చూస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు, స్క్రీనింగ్ మిషన్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక ప్రజల అవసరాలను మెడికల్ షాపుల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో ట్యాబెట్లు, ఇతర వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని అడిగితే స్టాక్ లేదని సమాధానం చెబుతున్నారు. గతంలో కోఠిలోని ఇందర్‌బాగ్ హోల్‌సేల్ మెడికల్ షాపుల సముదాయంలో మందులపై ఎక్కువగా డిస్కౌంట్ ఉండేది. కరోనా కారణంగా ఇప్పుడు ఎలాంటి డిస్కౌంట్ లభించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. వాటికే డిమాండ్ ఉంది.. ప్రస్తుతం కరోనా వ్యాధి నుంచి రక్షణ కోసం, రోగనిరోధ శక్తి పెంచడానికి జనం వివిధ రకాల విటమిన్స్, కాల్షియం, మినరల్స్ మందులు ఎక్కువగా వాడుతున్నారు. డాక్టర్లు కూడా ప్రతి రోగికి ఇలాంటి మందులే రాస్తున్నారు. ప్రత్యేకంగా విటమిన్–సి, డి, కాల్షియం మందులకు బాగా డిమాండ్ ఉంది. అలాగే ఈజీ బ్రీత్ మిషన్లతో ఆవిరి పడుతున్నారు. – గోపీనాథ్, మెడ్‌ప్లస్ ఉద్యోగి, ఆనంద్‌నగర్ -
దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ కష్టం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించవచ్చునని ఇన్నాళ్లూ పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్ భూషణ్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘హెర్డ్ ఇమ్యూనిటీతో కరోనాని జయించవచ్చునని మన దేశం భావించడం సరైంది కాదు. అధిక జనసాంద్రత, సామాజిక ఆర్థిక పరిస్థితులతో ఒకేసారి దేశవ్యాప్తంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు. ఒక్కో సమయంలో కొన్ని ప్రాంతాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ కనిపిస్తుంది. టీకాతో మాత్రమే కరోనాను జయించగలం’’అని ఆయన స్పష్టం చేశారు. అప్పటివరకూ ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ఉండాలని రాజేష్ హితవు పలికారు. హెర్డ్ ఇమ్యూనిటీపై భిన్నాభిప్రాయాలు ఒక ప్రాంతంలో ఉండే జనాభాలో ఎంత మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందితే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చునన్న అంశంలో శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 70 నుంచి 90 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే దానిని హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణించవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే 60 శాతం మందిలో వచ్చినా దానిని హెర్డ్ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చునని వైరాలజిస్టు షాహిద్ జమీల్ చెప్పారు. ఇటీవల జర్నల్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా గతంలో ఉన్న అంచనాల కంటే తక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్నా హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చునని వెల్లడించింది. అయితే కోట్లలో జనాభా ఉన్న భారత్‌లో సాధారణ ప్రక్రియ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం అన్న అంశంలో శాస్త్రవేత్తలో ఏకాభిప్రాయం నెలకొని ఉంది. కాగా, భారత్ వంటి దేశాల్లో జాతీయ స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించాలనుకోవడం తప్పిదం అవుతుందని వైరాలజిస్టు జమీల్ అభిప్రాయపడ్డారు. దేశంలో 70శాతం మందికి కరోనా సోకి వారిలో ఇమ్యూనిటీ పెరగాలని కోరుకోవడం సరికాదన్నారు. ఈ ప్రక్రియలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. ఒకే రోజు 52 వేల కేసులు దేశంలో కరోనా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గురువారం ఒక్క రోజే ఏకంగా 52 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. ఇందులో 10 లక్షల మందికి పైగా కోలుకోగా, 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో 52,123 కొత్త కేసులు వచ్చాయని, 775 మంది మరణించారని వెల్లడించింది. కోలుకునే వారి రేటు 64.44గా ఉండగా, మరణాల రేటు 2.21గా ఉంది. జూలై 29 వరకు 1,81,90,382 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. బుధవారం మరో 4,46,642 కేసులను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. 10 లక్షల టెస్టులు చేస్తాం.. దేశంలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, రానున్న రెండు నెల్లలో ఆ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని భావిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. కరోనాతో పోరాడుతున్న శాస్త్రవేత్తలను, వైద్యులను ఆయన కొనియాడారు. 6 నెలల క్రితం భారత దేశం వెంటిలేటర్లను దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు సొంతగా మూడు లక్షల వెంటిలేటర్లు తయారు చేయగల స్థాయికి ఎదిగిందని చెప్పారు. అంతేగాక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్ తయారీలో సైతం భారత్ ఇతరదేశాలతో పోటీ పడుతోందని వెల్లడించారు. -
జిల్లాకు రూ.లక్ష ఏం సరిపోతాయి?
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతి జిల్లాకు రూ.లక్ష మాత్రమే కేటాయించారని, అయితే ఈ నిధులెలా సరిపోతాయని హైకోర్టు ప్రశ్నించింది. వరంగల్ జిల్లాలోనే 44 వేల మంది దివ్యాంగులున్నారని, అలాంటప్పుడు రూ.లక్షతో ఏం చేస్తారని నిలదీసింది. దివ్యాంగులు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కర్నాటి గణేశ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ముందు హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.3.5 కోట్ల నిధులు ఉండగా..ప్రతి జిల్లాకు రూ.5 లక్షల చొప్పున...రూ.2 కోట్లను అన్ని జిల్లాలకు విడుదల చేశామని తెలిపారు. ముగ్గురు సంక్షేమ అధికారులు కరోనా బారిన పడ్డారని, అయినా దివ్యాంగుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దివ్యాంగుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, సలహా కమిటీలతో ఇప్పటికే సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. అంగన్వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఎంతమంది కరోనాబారిన పడ్డారు ? ‘‘ప్రతి జిల్లాలో ఎంతమంది దివ్యాంగులున్నారు? వారిలో కరోనాబారిన పడ్డవారెందరు ? వీరిలో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? సహజంగా దివ్యాంగుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందా? వారిలో రోగనిరోధక శక్తి పెంచేలా ఏం చర్యలు తీసుకుంటున్నారు ?’’తదితర వివరాలను ఆగస్టు 6లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వచ్చేనెల 6కు వాయిదా వేసింది. -
శక్తిమాన్..యువత
వయసుతో సంబంధం లేకుండా కరోనా కాటేస్తోంది. ఈ వైరస్ యువతకు ఎక్కువగా సోకుతోంది. అయితే ఈ మహమ్మారిని యువత సమర్థంగా ఎదుర్కొంటోంది. పాజిటివ్ వచ్చినా స్వల్ప కాలంలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకెళ్తోంది. వారిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తే వారిని కరోనా నుంచి కాపాడుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆస్పత్రులకు వస్తే తప్ప మిగతా వాళ్లందరూ 10 రోజుల్లోపే ఆరోగ్యవంతులవుతున్నారని అంటున్నారు. సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను యువత దీటుగా ఎదుర్కొంటోంది. కరోనా సోకినా స్వల్ప కాలంలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకెళ్తోంది. వారిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తే వారిని కరోనా నుంచి కాపాడుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆస్పత్రులకు వస్తే తప్ప మిగతా వాళ్లందరూ 10 రోజుల్లోపే ఆరోగ్యవంతులవుతున్నారని అంటున్నారు. 50 ఏళ్లకు పైన ఉన్నవారికే కోలుకోవడానికి 14 రోజులు పడుతోందని పేర్కొంటున్నారు. మొత్తం పాజిటివ్ కేసులను పరిశీలిస్తే.. త్వరగా కోలుకుంటున్నవారు, హోం ఐసొలేషన్‌లో ఉంటున్నవారిలో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపువారే ఉన్నట్టు స్పష్టమైంది. దీర్ఘకాలిక జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారిలో కొంతమంది కోలుకోవడం ఆలస్యమవుతోంది. యువతలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు.. ► రాష్ట్రంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు యువతకే వచ్చాయి. ► కోలుకున్నవారిలోనూ వీళ్లే ఎక్కువ. ► యాక్టివ్ కేసుల్లో 57.22 శాతం 40 ఏళ్ల లోపు వారివే. ► రికవరీలో 60 శాతం మంది యువతే. ► నిలకడగా ఆరోగ్యంగా ఉన్నవారిలో 47 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ► పాజిటివ్ కేసుల్లో 4.11 శాతం మంది 10 ఏళ్ల లోపు వాళ్లు ఉన్నారు. ► పాజిటివ్ కేసుల్లో 91 ఏళ్లు దాటినవారు 0.04 శాతం మంది ఉన్నారు. ఆందోళన అనవసరం.. ► కరోనా వైరస్ యువతను పెద్దగా ప్రభావితం చేయడం లేదని తేలింది. ► 60 ఏళ్లు దాటిన వారిని జాగ్రత్తగా కాపాడుకుంటే బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ► 50 ఏళ్లు దాటి మధుమేహం, హైపర్‌టెన్షన్, గుండెజబ్బులు వంటివి ఉన్నవారిని జాగ్రత్తగా చూడాలి. ► వైరస్ వ్యాప్తి ఉంది కాబట్టి వీరు ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉండటం ఉత్తమం. ► ఆందోళన చెందకుండా అవసరమైతే 104 లేదా టెలీమెడిసిన్ 14,410 నంబర్లకు ఫోన్ చేస్తే సలహాలు, సూచనలు ఇస్తారు. ► స్థానిక వార్డు లేదా గ్రామ వలంటీర్లు, ఏఎన్ఎంలకు ఫోన్ చేస్తే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. 50 ఏళ్లు దాటిన వారిపైనే దృష్టి మన రాష్ట్రంలో కరోనా వచ్చినవారిలో 50–60 ఏళ్ల మధ్యవారు ఎక్కువగా మృతి చెందుతున్నారు. వీరిలో మధుమేహం, హైపర్ టెన్షన్ బాధితులే ఎక్కువ. ఇలాంటి వారికి వైరస్ రాకుండా కాపాడుకోవాలి. వీరిపై కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. అప్రమత్తంగా ఉంటే యువతను కరోనా ఏమీ చేయలేదు. –డా.కె.ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక అధికారి, కమాండ్ కంట్రోల్ సెంటర్ -
పాజిటివ్ వ్యక్తులకు ‘దివ్య’ కషాయం
చిత్తూరు కలెక్టరేట్: కరోనా మహమ్మారి కమ్మేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది.అడ్డుకునేందుకు మందులు లేకపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాయామం, యోగా, పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడమే ఉత్తమ మార్గంగా మారింది. అలాగే హెర్బల్ కషాయం వైపు సమాజం మొగ్గుచూపుతోంది. ఇమ్యూనిటీని సాధించేందుకు దివ్య ఔషధంగా భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తులకు సైతం కషాయం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇది వరకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆస్పత్రికి, మెడికల్‌షాపుకు వెళ్లి మందులు తెచ్చుకునేవారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. దీంతో మందుల దుకాణాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. ఆరోగ్య సమస్య తలెత్తితే ఇంట్లో తయారు చేసే కషాయంతో వ్యాధి లక్షణాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వెతికి మరీ గృహవైద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. పాజిటివ్ వ్యక్తులకు కషాయం.. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వారి కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చికిత్సను అందజేస్తున్నారు. వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలు లేకుంటే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కోవిడ్ కేర్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సలు పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తులకు ప్రత్యేకంగా కషాయం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా తెలిపారు. ఐసొలేషన్‌లో అందించే ఆహారం.. ♦ఐసోలేషన్ వార్డుల్లోని రోగులకు ఉదయం 6.30 గంటలకు పొంగల్, ఇడ్లీ, వడ, కిచిడీ, ఉప్మా అల్పాహారంగా ఇవ్వడంతో పాటు కషాయం అందించేందుఉకు చర్యలు చేపడుతున్నారు. ♦మధ్యాహ్నం 1–2 గంటల మధ్య పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండుతో భోజనం. ♦సాయంత్రం 4–5 గంటల మధ్య రాగిజావ, ఖర్జూరం, బాదం పప్పు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య పప్పు, సాంబారు, చపాతీ, పూరీ, ఇడ్లీ, దోశ, పెరుగు అన్నం, కోడిగుడ్డు అందజేస్తారు. నిత్యం పాటించాల్సిన జాగ్రత్తలు ♦జ్వరం : థర్మామీటర్‌తో రోజుకు మూడు సార్లు చూసుకోవాలి. ♦ఆక్సిజన్/పల్స్రేట్ : పల్స్ ఆక్సీమీటర్ ద్వారా రోజుకు మూడు సార్లు చూసుకోవాలి. ♦ఆహారం : వైద్యులు సూచించిన పౌష్టికాహారంతో పాటు, పండ్లు, 2 వారాలపాటు వాడాల్సిన మందులు ♦విటమిన్– సి 500 ఎంజీ : ఒక ట్యాబ్లెట్ రోజుకు రెండుసార్లు : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (తిన్న తర్వాత) ♦విటమిన్–డీ : ఒక ట్యాబ్లెట్ రోజుకు ఒకసారి : ఉదయం తిన్న తర్వాత ♦మల్టీ విటమిన్– జింక్ : ఒక ట్యాబ్లెట్ రోజుకు రెండుసార్లు : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (భోజనం తర్వాత) ♦పారాసిట్మాల్ 500 ఎంజీ లేదా 650 ఎంజీ : రోజుకు రెండు సార్లు (ఉదయం ఒకటి, రాత్రి ఒకటి భోజనం తర్వాత) జలుబు ఉంటే 3 నుంచి 5 రోజులపాటు వాడాల్సినవి ♦సిట్రిజన్ : ఒక మాత్ర రోజుకు ఒకసారి తిన్న తర్వాత ♦అజిత్రోమైసిన్ 500 ఎంజీ : ఒక మాత్ర రోజుకు ఒకసారి రాత్రి తిన్న తర్వాత వైరల్ మందులు 5 రోజులపాటు వాడాలి ♦హైడ్రాక్సీక్లోరోక్విన్ 200 ఎంపీ : ఒక మాత్ర రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (తిన్న తర్వాత) విరేచనాలు తగ్గేందుకు ♦స్పోరోలాక్ : డీఎస్ టాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత గ్యాస్/ కడుపులో మంట తగ్గేందుకు... ♦ఫాంటాసిడ్ డీఎస్ఆర్ : రోజుకు ఒక మాత్ర ఉదయం తినకముందు. రోగనిరోధక శక్తికి చిట్కాలు ♦ప్రతి రోజూ ఉదయం 10 గ్రాముల చ్యవన్ ప్రాసం తీసుకోవాలి ♦హెర్బల్ టీ, తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంటి వేసిన డికాక్షన్ తాగాలి. రుచి కోసం అందులో బెల్లం, నిమ్మరసం వేసుకోవచ్చు. ♦రోజుకు రెండుసార్లు ఎండు ద్రాక్ష తినాలి. ♦150 మిల్లీలీటర్ల వేడిపాలలో అర టీస్పూన్ పసుపు వేసుకుని రోజుకు ఒకటి, రెండుసార్లు తాగాలి. ♦గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటివి ఉంటే పసుపును వేడిపాలు లేదా వేడి నీటిలో కలుపుకుని తాగాలి. ♦రోజూ ఏ సమయంలో అయినా గోరువెచ్చని నీటినే సేవించాలి. ♦వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పక వినియోగించాలి. ♦కృష్ణ తులసి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవాలి. ♦పసుపులో అల్లం వేసి ఉడికించి ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. ♦నువ్వుల నూనె, కొబ్బరినూనె, నెయ్యి చుక్కలను ఉదయం, సాయంత్రం ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. ♦నువ్వులనూనె, కొబ్బరి నూనె ఒక స్పూన్ మేర నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ♦తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాస్క్ ధరించకుంటే కనీసం చేతి రుమాలు అయినా అడ్డుపెట్టుకోవాలి. ♦ప్రతి 12 గంటలకు ఒకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ♦రోజూ అరగంట పాటు యోగా, ప్రాణాయామం చేయాలి. -
జన జీవన సూత్రం.. ఆరోగ్యమంత్రం
సాక్షి, అమరావతి: కరోనా విజృంభిస్తున్న వేళ జన జీవన శైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైరస్ రాకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒక వేళ వైరస్ వచ్చినా దానిని జయించేందుకు ముందుగానే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు బలమైన ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ గతానికి భిన్నంగా మన లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. ప్ర«ధానంగా ఇళ్లల్లో ఉన్న వృద్ధులు, పిల్లలను సంరక్షించుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► సాధారణ గృహిణి నుంచి ఉద్యోగి వరకు ఇప్పుడు ముఖానికి మాస్క్‌లు, చేతులకు శానిటైజర్లను వినియోగిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడు కూడా జేబుల్లో, హ్యాండ్ బ్యాగుల్లో శానిటైజర్లను వెంట తీసుకెళ్తున్నారు. ► స్తోమతను బట్టి రూ.20 నుంచి రూ.500 వరకు విలువైన మాస్కులను వాడుతున్నారు. ► రోగ నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో పసుపు, అల్లం, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ తదితర వాటితో కషాయాలు తయారు చేసుకుని తాగుతున్నారు. కాఫీ, టీల స్థానే కషాయాలు తీసుకోవడం పెరిగింది. ► కరోనా సోకాక ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్తగా అన్ని మందులను దగ్గర పెట్టుకుంటున్నారు. ► జ్వరానికి పెరాసెట్‌మాల్, జలుబు, దగ్గు, నొప్పులు వంటి వాటికి అవసరమైన మందు బిళ్లలను సరిపడా సిద్ధం చేసుకుంటున్నారు. ► కరోనా సోకినా తట్టుకుని ప్రాణాలు నిలుపుకొనేలా ఇమ్యూనిటీ బూస్ట్ కోసం మల్టీ విటమిన్ మాత్రలను మింగుతున్నారు. ఆక్సీమీటర్, ఆవిరి యంత్రాల కొనుగోలు ► పెరుగుతున్న కరోనా కేసులతో ఆస్పత్రుల్లో ఖాళీ ఉండే పరిస్థితి లేదని పలువురు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. ► ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడుకుని తమకు అవసరమైనప్పుడు బెడ్, వెంటిలేటర్ కేటాయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ► శరీరంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకునేందుకు రూ.1,350 నుంచి 2,500 ఖరీదైన ఆక్సీమీటర్, ఊపిరితిత్తుల్లో నిమ్మును తగ్గించేలా రూ.200 నుంచి రూ.600 వరకు ఖరీదైన ఆవిరి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. ► సత్వరం ఆక్సిజన్ అందించేలా రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకూ విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ► కాన్సన్ట్రేటర్ మిషన్‌లో నీళ్లు పోసి కరెంటు ప్లగ్ పెడితే దానికదే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ మిషన్‌కు ఉండే మాస్క్‌ను ఏకకాలంలో ఒకరిద్దరు ముఖాలకు పెట్టుకుంటే ముక్కు ద్వారా ఆక్సిజన్ అంది ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖానికి మాస్క్ తప్పనిసరైంది.. నేను బయటకు వెళితే ఖచ్చితంగా శానిటైజర్, మాస్క్ వినియోగిస్తున్నా. జేబులో పెట్టుకునేలా పెన్ మాదిరిగా ఉండే శానిటైజర్ పైపును వెంట తీసుకెళ్తున్నా. దానిలో రోజువారీగా జల్ శానిటైజర్ నింపుకొని తీసుకెళ్లడం సులభంగా ఉంది. సురక్షితమైన క్లాత్‌తో తయారు చేసిన దాన్నే మాస్క్‌గా వినియోగిస్తున్నా. ఇంటికొచ్చాక మాస్క్, గ్లౌజులను మూత ఉండే డస్ట్‌బిన్‌లో పడేసి, మొదట కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని స్నానం చేశాకే ఇంట్లోకి వెళుతున్నా. – మంగం రవికుమార్, ప్రైవేటు ఉద్యోగి, కలిసిపూడి, పశ్చిమగోదావరి ఆహారపు అలవాట్లు మార్చుకున్నా.. కరోనా నేపథ్యంలో మా ఇంట్లో ఉదయం లేవగానే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగుతున్నాం. టిఫిన్‌లో బాదం పప్పులు, ఒకటి లేదా రెండు గుడ్లతో పాటు అల్లం టీ తీసుకుంటున్నాం. మధ్యాహ్న భోజనంలో మిరియాల రసం, ఆకు కూరలు, కొద్దిగా మాంసాహారం లేదా క్యారెట్, బీట్రూట్, ఏదో ఓ కూర తింటున్నాం. రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగుతున్నాం. – ఎ.సుబ్బలక్ష్మి, గృహిణి, భీమవరం, పశ్చిమగోదావరి