Amazing Mosambi Juice Benefits for Skin, Hair and Health: మార్కెట్‌లో సులభంగా, తక్కువ ధరలో లభించే వాటిలో మోసంబి ఒకటి. ఇది సిట్రస్ పండు. దీనిని తీపి సున్నం అని కూడా అంటారు. ఇండోనేషియా నుంచి చైనా వరకు అనేక ప్రాంతాల్లో మూలాలను కలిగి ఉంది. మోసంబిలో సాధారణ నిమ్మకాయల కంటే కూడా తక్కువ మోతాదులో యాసిడ్ ఉంటుంది. విత్తనాలు, మందపాటి తొక్క కారణంగా పండు రూపంలో తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. జ్యూస్‌గా మాత్రం మంచి రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మోసంబి రసం ఎంత అలసిపోయిఉన్నా తక్షణమే రీఫ్రెష్ చేస్తుంది. మోసంబిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి శరీరానికి ఉపయోగపడే అనేక మూలకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మోసంబి ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలించనట్లయితే..
విటమిన్ సి యొక్క పవర్ హౌస్: ఇది నీటిలో కరిగే విటమిన్. దీనిని మనం శరీరంలో నిల్వ చేయలేము. అందువల్ల ప్రతిరోజూ మనకు ఆహారం ద్వారా అవసరం. రోజూవారీ మోతాదుగా విటమిన్ సీ పొందడానికి మోసంబి రసం గొప్ప మార్గం. ఇది శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరం. మానవుని ఆరోగ్యంలో సమగ్ర పాత్ర పోషిస్తుంది.
చదవండి: (Feet Care Tips: విటమిన్ ‘ఈ’ క్యాప్య్సూల్స్‌తో ఇలా అందంగా..)
కళ్లకు మంచిది: యాంటి ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా.. మోసంబి జ్యూస్ కళ్లను ఇన్ఫెక్షన్ల నుంచి, కంటి శుక్లం అభివృద్ధి కాకుండా కాపాడుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: క్రమం తప్పకుండా మోసంబి జ్యూస్ తాగడం వల్ల బలహీనత, అలసట తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చదవండి: (Health Tips: రోజూ గ్లాసు పళ్ల రసం చక్కెర వేయకుండా తాగితే..)
క్యాన్సర్ నిరోధక లక్షణాలు: మోసంబిలో ఉండే లిమోనాయిడ్లు వివిధ రకాల క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడతాయి. గ్లూకోజ్ అనే చక్కెర అణువుతో లిమోనాయిడ్లు జతచేయబడి సులభంగా జీర్ణమవుతాయి.
అందమైన చర్మం కోసం: మోసంబి జ్యూస్‌లో ఉండే విటమిన్‌లు, మినరల్స్ అందమైన, ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతగానో ఉపయోగపడాయి. ఆరోగ్యకరమైన మెరుస్తున్న చర్మానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సీ ఇందులో పుష్కలంగా ఉంటుంది.
మచ్చలను తొలగిస్తుంది: మోసంబి జ్యూస్‌లో తేలికపాటి బ్లీచింగ్, క్లెన్సింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి మచ్చలు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి.
చర్మం ముడతలు తగ్గడానికి: మోసంబి రసంలో వృద్ధాప్య నిరోధక లక్షణాలు ఉన్నాయి. చర్మం ముడతలు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన కొల్లాజెన్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. శరీరానికి దృఢత్వాన్ని అందిస్తుంది. మనిషి కుంగిపోకుండా చేస్తుంది.
జుట్టును బలపరుస్తుంది: మోసంబి జ్యూస్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . మీరు ఎల్లప్పుడూ కోరుకునే మెరుపును ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment