Juice
-
దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..
బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్‌గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఆ జ్యూస్ ఏంటంటే..వేప, కరివేపాకు, బీట్రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే. ప్రయోజనాలు..వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది. తయారీ విధానం..కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్‌ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
సొరకాయతో లాభాలెన్నో, బరువు కూడా తగ్గొచ్చు
మనం తినే ఆహారంలో తీగజాతి, దుంప ఇలా అన్ని రకాల కూరలు, ఆకుకూరలను చేర్చుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కూరగాయల తోటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. బీర, సొరకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈరోజు సొరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయతో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.సొరకాయలో విటమిన్ బీ, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో నీరు ,కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో అయితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సొరకాయ ఎంతగానో సహాయపడుతు సొరకాయతో పప్పు చట్నీ, సాంబార్, కర్రీ, ఇలా ఎన్నో వంటలను చేసి తినొచ్చు. ఇంకా సూప్‌లు లేదా స్మూతీ వంటి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.సొరకాయతో ప్రయోజనాలురక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సొరకాయలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.సొరకాయతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సొరకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. మెగ్నీషియంతో కండరాలు బలపడతాయి. కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సొరకాయ సహాయపడుతుంది. సొరకాయలో కూడా విటమిన్ సీి మెండుగా ఉంటుంది. ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకుంటుంది. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?
మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్లను నివారించడంలో ఉపయోపడుతుంది.ఈ జ్యూస్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్‌పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్‌ను తీసుకోవచ్చు.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్‌ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.దక్షిణ థాయ్‌లాండ్‌లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. -
రైతు బ్రాండ్.. ఈ నేరేడు జ్యూస్!
నేరేడు పండ్లు జూన్–జూలై మధ్య ఏడాదికి ఒక్క నెల రోజులు మాత్రమే వస్తాయి. చెట్లపై 90% పండిన నేరేడు కాయలను వ్యాపారులు కొని నగరాలు, పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఒక్క రోజు కోయక΄ోయినా పండ్లు 100% పండి΄ోతాయి. రవాణాకు పనికిరావు కాబట్టి వ్యాపారులు కొనరు. మరో రోజు కోయక΄ోతే రాలి మట్టిపాలవుతాయి. 100% పండిన పండ్లను వృథా కాకుండా ఇంటిపట్టునే జ్యూస్‌గా మార్చితే పండ్ల వృథాను అరికట్టినట్లవుతుంది. జ్యూస్ అమ్మకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని ఆశించిన రైతు మారుతీ ప్రసాద్. 8 ఏళ్లు కష్టపడి నేరేడు జ్యూస్ తయారీకి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని విజయవంతంగా రూపొందించుకున్నారు.అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ పి. మారుతీ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దానిమ్మ, ద్రాక్ష తదితర పంటల సాగుతో నష్టాల పాలైన నేపథ్యంలో వ్రేదావతి ఒడ్డున 4 ఎకరాల చౌడు భూమిని 15 ఏళ్ల క్రితం కొన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సహకారంతో రెండెకరాల్లో 150 అల్లనేరేడు మొక్కలు 2009లో నాటారు. కాలక్రమంలో నేరేడు తోటల విస్తీర్ణం ఆ ్రపాంతంలో 400 ఎకరాలకు పెరిగి, మార్కెటింగ్ సమస్య వచ్చిపడింది.8 ఏళ్ల ప్రయోగాలు ఫలించిన వేళ..జూన్–జూలై మధ్య కేవలం నెల రోజుల్లోనే నేరేడు పండ్లన్నీ మార్కెట్లోకి వస్తాయి. వీటిని నిల్వ చేసుకొని నెమ్మదిగా అమ్ముకునే మౌలిక సదుపాయాలు రైతులకు లేవు. పూర్తిగా పండిన నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేయటం ద్వారా మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని మారుతీప్రసాద్ భావించారు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ) శాస్త్రవేత్తలను 8 ఏళ్ల క్రితం సంప్రదించారు. అయితే, వారు సూచించిన ్రపాసెసింగ్ పద్ధతి నేరేడుకు సరిపడలేదు. అయినా, ఆయన తన ప్రయత్నాలు మానలేదు.‘మామిడి నుంచి నేరేడు వరకు అన్ని రకాల పండ్ల రసాల తయారీకి వారి వద్ద ఒకటే ్రపాసెసింగ్ పద్ధతి ఉంది. సగం రసం, సగం పంచదార, ప్రిజర్వేటివ్‌లు తదితరాలు కలిపి జ్యూస్ తయారు చేయాలని వారు సూచించారు. అవేమీ కలపకుండా నేరేడు జ్యూస్ తయారు చేయాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో నేరేడు ్రపాసెసింగ్ పద్ధతి, నిల్వ పద్ధతి, బాట్లింగ్ పద్ధతితో పాటు యంత్రాలను నా అవసరాలకు తగినట్లు ఏయే మార్పులు చేసుకోవాలి అనేది స్వీయఅనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఏవీ కలపకుండా కేవలం నేరేడు జ్యూస్ తయారు చేసి, ఏడాది పాటు నిల్వ ఉంచటంలో ఎట్టకేలకు విజయం సాధించాను..’ అని మారుతీప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చె΄్పారు.నేరేడు గింజల పొడి8 ఏళ్ల స్వయంకృషి ఫలితమిది..గత ఏడాది సీజన్లో 5 టన్నుల నేరేడు జ్యూస్ తయారు చేసి విక్రయించాను. ఈ ఏడాది పదెకరాల తోటలో పండ్లను అదనంగా కొనుగోలు చేసి, 22 టన్నుల జ్యూస్ తయారు చేశా. జ్యూస్‌ను అన్నివిధాలా సంతృప్తికరమైన రీతిలో ఆరోగ్యదాయకంగా ఉత్పత్తి చేస్తున్నా. సిఎఫ్టిఆర్ఐ తోడ్పాటు తీసుకున్నా. వ్యయ ప్రయాసలకోర్చి 8 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించా. నాకు అవసరమైన విధంగా తగిన మార్పులు చేర్పులతో ప్రత్యేక ్రపాసెసింగ్ పద్ధతిని, ప్రత్యేక యంత్రాలను రూపొందించుకున్నా. పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఇతరత్రా ఏమీ కలపకుండా స్వచ్ఛమైన నేరేడు రసాన్ని ప్రజలకు అందిస్తున్నా. గర్భవతులు మాత్రం నేరేడు జ్యూస్ తాగకూడదు. ఇతరులు నీటిలో కలిపి తాగితే మంచిది. ఎందుకైనా మంచిది వైద్యుల సలహా మేరకు వాడమని కొనే వారికి సూచిస్తున్నా. – పి. మారుతీ ప్రసాద్ (97018 66028), ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా2.5 కేజీలకు లీటరు జ్యూస్..తన ఇంటి దగ్గరే ్రపాసెసింగ్ యూనిట్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తన రెండెకరాల్లో నేరేడు పండ్లతో పాటు మరో 10 ఎకరాల తోటలో పండ్లను కొని జ్యూస్ తయారు చేస్తున్నారు. రెండున్నర కేజీల నేరేడు పండ్లతో లీటరు జ్యూస్ తయారు చేస్తున్నారు. మొదట్లో గింజలు తీసేసి గుజ్జుతో మాత్రమే జ్యూస్ తయారు చేశారు. గత ఏడాది నుంచి ప్రత్యేకంగా గింజతో పాటు మొత్తం పండ్లతో కూడా రెండు రకాలుగా జ్యూస్ తయారు చేస్తున్నారు. 200 ఎం.ఎల్. బాటిల్స్ లో ΄్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజ్జు జ్యూస్ కన్నా ఇది కొంచెం వగరుగా ఉన్నా, మార్కెట్లో క్లిక్ అయ్యింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర్రపాంతాల నుంచి కూడా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు నేరుగా కొనుగోలు చేస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ జ్యూస్ తమకు బాగా ఉపయోగపడుతోందని షుగర్ పేషెంట్లు చెప్పటం మారుతీ ప్రసాద్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది. అందుకే ఈ ఏడాది ఎక్కువగా గింజలతో కూడిన జ్యూస్‌ను తయారు చేశారు. ఈ జ్యూస్‌ను నాణ్యతా పరీక్షల కోసం సిఎఫ్టిఆర్ఐకి పంపానన్నారు. గుజ్జుతో జ్యూస్ చేసిన తర్వాత మిగిలే గింజలను కూడా ఎండబెట్టి, ΄÷డి చేసి అమ్ముతున్నారు. ఈ ΄÷డిని గోరువెచ్చ నీటితో కలుపుకొని తాగొచ్చు. నీటితో మరిగించి టీ డికాక్షన్ చేసుకొని తాగొచ్చని ఆయన చెబుతున్నారు. ఒక ఉద్యాన యూనివర్సిటీ లేదా పరిశోధనా కేంద్రం చేయాల్సిన పరిశోధనను సడలని పట్టుదలతో కొనసాగించి విజయం సాధించినను రైతు మారుతీప్రసాద్ అసలు సిసలైన రైతు శాస్త్రవేత్త. – కె. వంశీనాథ్‌రెడ్డి, సాక్షి, బొమ్మనహాళ్, అనంతపురం జిల్లా -
గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనే ప్యార్ కియా వంటి మూవీలో మంచి హిట్లను అందుకుని తన నటనతో వేలకొద్ది అభిమానులకు చేరువయ్యింది. వివాహ బంధంతో సినిమాలకు దూరంగా ఉన్నా..అంతే గ్లామర్ మెయింటైన్ చేస్తున్న నటి భాగ్యశ్రీ. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో సరికొత్త వంటకాలను షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం తాజగా కాంతి వంతమైన చర్మం కోసం సరికొత్త హెల్తీ జ్యూస్‌తో మన ముందుకు వచ్చింది భాగ్యశ్రీ. బచ్చలి, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయలతో చేసిన గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చారు. ఇది చర్మం ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా కాంతివంతంగా ఉంచుతుందని చెప్పారు. గ్రీన్ జ్యూస్‌తో కలిగే లాభాలు..ఉదయమే ఒక గ్లాస్లు ఈ గ్రీన్ జ్యూస్ చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పైగా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట గుణాలు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని, జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంది. తయారీ..నటి భాగ్యశ్రీ బచ్చలికూర, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయ తదితరాలను మిక్క్లో వేసి మెత్తగా జ్యూస్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత చక్కగా వడకట్టుకుంటే చాలు గ్రీన్ జ్యూస్ రెడీ. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి పోషకాలు అందడమేగాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
సొరకాయ, ఆనపకాయ ఈ పేరు చెబితేనే చాలా మంది పెద్దగా ఇష్టపడరు. సాంబారుకో, పులుసుకో తప్ప ఇంక దేనికీ పనికి రాదనుకుంటారు. నిజానికి సొరకాయ సౌందర్య పోషణలోనూ, బరువుతగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది. సొరకాయ , దాని ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం రండి..!కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కూరగాయసొరకాయ. ఇందులో లో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. సొరకాయతో పలు రకాలు వంటకాలు చేసుకోవచ్చు. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సొరకాయ జ్యూస్ - లాభాలు హైపర్‌టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది.సొరకాయలో ఉండే, పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు, పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే మంచిది. రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.సొరకాయ జ్యూస్ రెగ్యులర్ తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారి పని మరింత ఈజీ అవుతుంది.సొరకాయతో సౌందర్య ప్రయోజనాలు..!సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తుందిరోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే తాగుతుంటే ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగి, యవ్వనంగా కనిపిస్తారు.చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను, దురదలు, దద్దుర్లను తగ్గించడంలోనూ సాయపడుతుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరుగుతాయి, జుట్టు మెరిసిపోతుంది.ఎలా చేసుకోవాలి?సొరకాయ ముక్కలు, పుదీనా ఆకులు, అల్లంవేసి బ్లెండర్లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.దీనికి ఉప్పు, మిరియాలపొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని వడపోసుకుని ఇష్టంగా తాగేయడమే. -
మహిళలూ.. క్రాన్బెర్రీ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారా?
కుటుంబ బాధ్యతల్లో పడి చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించు కోరు. నిజానికి రుతుస్రావం, గర్భధారణ, పిల్లల పోషణ లాంటి గురుతర బాధ్యతలను నిర్వహించే మహిళలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో మహిళల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే ఒక జ్యూస్ గురించి తెలుసుకుందాం.క్రాన్బెర్రీ జ్యూస్. క్రాన్బెర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి.. ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడతాయిఉత్తర , దక్షిణ అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఐరోపాలో ఎక్కుగా సాగు చేస్తారు. ఎరికేసి కుటుంబానికి చెందిన వీటిని శాస్త్రీయంగా వ్యాక్సినియం ఆక్సికోకోస్ లేదా వ్యాక్సినియం మాక్రోకార్పన్ అని పిలుస్తారు. ఇవి పుల్లగా, తీయగా, కొంచెం చేదు కలగలిసిన రుచితో గమ్మత్తుగా ఉంటాయి.క్రాన్బెర్రీ జ్యూస్ ప్రయోజనాలునారింజ లేదా యాపిల్ లాంటి ఇతర జ్యూస్‌ల వలె ప్రాచుర్యం పొందనప్పటికీ, క్రాన్బెర్రీ జ్యూస్‌లో అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్వచ్ఛమైన క్రాన్బెర్రీ జ్యూస్‌లో సీ, ఈ విటమిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి విలువైన ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వయస్సు-సంబంధిత సమస్యలు, జబ్బులకు చెక్ పెడతాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాలు పేరుకుపోతాయి. క్రాన్బెర్రీ జ్యూస్‌లోని కొన్ని రసాయనాలు యాంటీఆక్సిడెంట్లు వీటిని అడ్డుకుంటాయి. కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధి, జీర్ణ ఆరోగ్యం, మూత్ర నాళం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రాన్బెర్రీ జ్యూస్‌లోని వివిధ పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రాన్బెర్రీస్లో పాలీఫెనాల్స్ అనే రసాయనాలు ఇందుకు తోడ్పడతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న ఆడవారిపై 2011లో జరిపిన అధ్యయనంలో క్రాన్బెర్రీ జ్యూస్ రక్త ప్లాస్మాలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతుందని కనుగొన్నారు. క్రాన్బెర్రీ జ్యూస్‌ను తీసుకునేవారిలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుడ్ కొలెస్ట్రాల్లెవల్స్ పెరుగుతాయి. కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారికి క్రాన్బెర్రీ జ్యూస్ ఒకబెస్ట్ ఆప్షన్. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మరో అధ్యయనంలో తేలింది.ముఖ్యంగా మహిళలు క్రాన్బెరీతో చేసే జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. అదే విధంగా యూరిన్‌లో వచ్చే మంట, దురదకు ఉపశమనం లభిస్తుంది.శరీరంలో మంట, దురద, చికాకు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఎంజైమ్స్‌ని పెంచుతాయి.రూమటాయిడ్ ఆర్ర్థరైటీస్, కాలిటీస్, ఎథెరోక్లోరోసిన్, అల్జీమర్స్ పెరడెంటైటీస్, డయాబెటీస్ వంటి బారిన పడకుండా కాపాడుతుంది.చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల చర్మానికి, ముఖంలో మంచి మెరుపు వస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఫినోలిక్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు బాడీకి మంచి డిటాక్స్ డ్రింక్‌లా పని చేస్తుంది.నోట్: కొన్ని పరిశోధనల ప్రకారం వార్ఫరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ , కొన్ని రకాల యాంటి బయెటిక్స్ వాడేవారు క్రాన్బెర్రీకి దూరంగా మంచిది. వైద్యుల సలహా మేరకుతీసుకోవాల్సి ఉంటుంది. -
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
ప్రపంచంలో నారింజ పండ్ల దిగుబడి తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్‌లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్లో ఈ ఏడాది భారీగా పంటనష్టం జరిగింది. గత 36 ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా ఈసారి ఏర్పడిన వేడిగాలులతో తీవ్రంగా పంటనష్టం వాటిల్లినట్లు పరిశోదనా బృందం ఫండెసిట్రస్ తెలిపింది.ఏటా ఏప్రిల్ ప్రారంభం నుంచి ఆరెంజ్ పండ్ల సీజన్ మొదలవుతుంది. బ్రెజిల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు 232.4 మిలియన్ బాక్సుల ఆరెంజ్ పండ్ల ఉత్పత్తి జరిగినట్లు ఫండెసిట్రస్ నివేదిక తెలిపింది. ఇందులో ఒక్కో బాక్స్ బరువు 90 పౌండ్లు(40.8 కిలోలు) ఉంటుంది. ఈసారి నమోదైన ఉత్పత్తి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 24 శాతం క్షీణించింది.ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు రిజస్టరైన ఐసీఈ ఫ్యూచర్స్ యూఎస్‌లో ఈ ఏడాది 26 శాతం లాభపడింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు అత్యధికంగా 5 శాతం పెరిగాయి. హీట్‌వేవ్ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో భవిష్యత్తులో ఆశించిన ఫలితాలు రావని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది సెప్టెంబరు-నవంబర్ మధ్య ఆరెంజ్ పంట సాగుకు సిద్ధమైతే ఈ సమయం వరకు సమృద్ధిగా పంట చేతికి వచ్చేది. కానీ వేడిగాలుల వల్ల పంటకాలం ఆలస్యమైంది. దాంతో సరైన దిగుబడి రాదని నివేదిక చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నారింజ రసం సరఫరాలో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం పానీయాల ఎగుమతుల్లో 70 శాతం వాటా ఆరెంజ్ జ్యూస్దే అవ్వడం గమనార్హం. -
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!
వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్ కటీరా గురించి విన్నారా? ఇది ఎడిబుల్ గమ్. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శక్తిని పెంచుతుంది. గోండ్ కటీరా మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..! గోండ్ కటీరా అనేది తినగలిగే గమ్. ఇది కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకు తుంది. వేసవిలో చల్లదనం కోసం దీన్ని తాగితే, చాలా లాభాలున్నాయి. గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో ప్రసిద్ధి. దీన్ని ఆస్ట్రాగాలస్ ప్రొపింకస్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. ఇది పౌడర్ లేదా క్యాండీ రూపంలో లభిస్తుంది. గోండ్ కటీరా జ్యూస్ ముందుగా ఈ గమ్‌ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని చక్కగా తాగెయ్యడమే. కావాలంటే ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని పౌడర్‌ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. గోండ్ కటీరా ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్‌లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్ బాగా పాపులర్. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది. పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళల్లో పీరియడ్ సమస్యలకూ మంచింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. -
బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు బూడిద గుమ్మడికాయ. వడియాలకోసమో, లేక గుమ్మానికి దిష్టికోసమో, స్వీట్‌కోసమే వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరబాటే. శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పరగడుపున దీని జ్యూస్ తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీన్నే వింటర్‌మిలన్ అనీ, సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజన్ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు. అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్‌తో ప్రస్తుతం, పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు , చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాలలో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి. గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందని నమ్మకం. బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది. ఎవరు తాగకూడదు ఈ ప్రపంచంలో ప్రతిదానికీ లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. దీర్ఘంకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకు పోతాయి. జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంతవరకే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్’ దీన్ని మర్చిపోకూడదు. -
ఈ బ్లెండర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, ఏకంగా అన్ని వేలా!
పిండి, నూక, చట్నీ, జ్యూస్ ఇలా.. మిక్సీ లేకుండా వంటింట్లో ఏ పనీ సాగదు. చిత్రంలోని ఈ డివైస్.. వినూత్నమైన వాక్యూమ్ టెక్నాలజీతో డిమాండ్ క్రియేట్ చేసుకుంది. బ్లెండింగ్ చేయడానికి ముందు బ్లెండర్ జార్ నుంచి గాలిని పూర్తిగా తీసివేసి.. ఆహారాన్ని సాధారణ బ్లెండర్ కంటే స్మూత్‌గా చేస్తుంది. అందుకే ఇందులోని ఫుడ్ లేదా జ్యూస్ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ బ్లెండర్తో.. జ్యూస్‌లు, బేబీ ఫుడ్ (నెలల పిల్లలకు), మిల్క్ షేక్స్ ఇలా చాలావాటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ప్రాసెసర్ బ్లెండర్లో మిలిటరీ–గ్రేడ్ లేజర్ స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్స్ అమర్చి ఉంటాయి. అత్యంత పదునైన ఈ బ్లేడ్స్.. ఎంతటి ఘనపదార్థాలనైనా మెత్తటి మైనంలా మార్చగలవు. ప్రొఫెషనల్ సౌండ్‌ప్రూఫ్ కవర్ కలిగిన ఈ డివైస్.. సాధారణ డివైస్ల కంటే.. 40 శాతం సౌండ్‌ని తగ్గిస్తుంది. ఈ కంటైనర్ సుమారుగా ఆరు నుంచి ఎనిమిది మందికి సరిపడా ఫుడ్‌ని లేదా జ్యూస్‌ని అందిస్తుంది. దీని ధర 807 డాలర్లు (రూ.67,116). -
మినీ మిక్సర్: మిల్క్‌షేక్‌ల నుంచి చిన్న పిల్లల ఆహారం వరకు ఏదైనా..!
చిత్రంలోని 4 ఇన్ 1 ఎలక్ట్రిక్ మినీ గార్లిక్ చాపర్ మిక్సర్.. పిల్లలకు, పెద్దలకు భలే ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఐస్ క్రీమ్, సోయా మిల్క్, ఫ్రెష్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, మిల్క్ షేక్స్ వంటివే కాదు.. పసిపిల్లలకు మెత్తటి ఆహారం, ఫేస్ మాస్క్ కోసం మెత్తటి మిశ్రమాన్నీ తయారు చేసుకోవచ్చు. దీనిలో 3 పదునైన బ్లేడ్స్ ఉంటాయి. సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది పండ్లు, కూరగాయలతో పాటు మాంసాన్నీ కచ్చాబిచ్చాగా చేయగలదు. స్కూల్లో, ఆఫీసుల్లో, జిమ్‌లో, క్యాంపింగ్‌లో ఇలా ప్రతిచోటా.. చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని 3 నుంచి 4 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు. కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. ఈ బాటిల్ రెండువైపులా ఓపెన్ అవుతుంది. దాంతో క్లీనింగ్ సులభమవుతుంది. బాటిల్ కింద వైపు ఉన్న బటన్ని ప్రెస్ చేసుకుంటే... ఇది ఆన్ ఆఫ్ అవుతుంది. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
స్లిమ్‌గా అవ్వాలనుకుంటే..బరువును జ్యూస్ చేయండి!
బరువు తగ్గడానికి కొందరు రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి పోతుంటారు. అయితే కొన్ని రకాల జ్యూస్‌లు తాగడం వల్ల కూడా సులువుగా బరువు తగ్గవచ్చు. అవేమిటో, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం... గోధుమగడ్డి జ్యూస్‌ను పొద్దున్నే కాఫీ టీ బదులుగా తాగటం వల్ల తొందరగా సన్నబడతారు. దీనికి కావాల్సిన గోధుమగడ్డిని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులోఐరన్ , కాల్షియం, మెగ్నిషియం, ఫైటో న్యూట్రియెంట్లు,అమైనోయాసిడ్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గోధుమగడ్డి జ్యూస్‌ను తరచూ తీసుకోవడం వల్ల, శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి, ఈజీగా అధిక బరువు తగ్గిస్తుంది బీట్రూట్, క్యారెట్ జ్యూస్ రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్, రెండు క్యారెట్లు కలిపి జ్యుస్లా తయారు చేసుకోవాలి. ఇందులోని విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా లభించి,అధిక బరువును తొందరగా తగ్గించడానికి ఉపయోగపడతాయి. కరివేపాకు జ్యూస్ దీనికోసం గుప్పెడు కరివేపాకు తీసుకొని, గ్లాసు నీళ్లలో వేసి మరిగించుకోవాలి. ఇందులో స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం కలిపి తాగడం వల్ల తొందరగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్, ఐరన్ లభిస్తాయి. ఇందులోని లిపిడ్లు, అమైనో ఆమ్లాలు పొట్ట కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. బొప్పాయి జ్యూస్... టిఫిన్‌కి బదులుగా బొప్పాయి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులోని పైబర్ ΄÷ట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. అంతే కాక ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ జ్యూస్... పుచ్చకాయ జ్యూస్‌ని తరచూ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా ΄÷ట్ట నిండిన భావన కలుగుతుంది. దీనితో తినాలనే కోరిక తగ్గి, తొందరగా బరువు తగ్గవచ్చు. నిమ్మ జూస్ నిమ్మరసం తేనె కలిపి తాగుతూ వుంటే తొందరగా పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. దీనితో తినాలనే కోరిక తగ్గి, తొందరగా బరువు తగ్గవచ్చు. (చదవండి: మ్యాంగో మ్యాన్) -
కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల..
వేసవిలో మనకు అధికంగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కర్బూజలో దాదాపు తొంబై శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. తెల్ల రక్తకణాల వృద్ధి ►కర్బూజ పండులో ఎక్కువ శాతంగా ఉండే బీటాకెరోటిన్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలోని తెల్ల రక్తకణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ►కర్బూజలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటిచూపు బాగా ఉండేలా చేస్తుంది. వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు.. ►కర్బూజ పండులో విటమిన్ కె, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనివలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా పని చేసేలా ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన ►ఈ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రియంట్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండటం వలన అది హార్ట్ ఎటాక్ నుండి, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ►తక్కువ క్యాలరీస్, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. ►ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. కిడ్నీలో రాళ్లను సైతం ►ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ►ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గర్బిణులకు ఎంతో మేలు ►ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం గర్బిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ►కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... -
ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్ జ్యూస్ వివాదం..యువతి అరెస్టు
యూపిల్ జ్యూస్‌ని ఎయిర్‌పోర్ట్‌లో అనుమతించ లేదని టీనేజ్ గర్ల్ శివాలెత్తిపోయింది. కోపంతో ఊగిపోయి అధికారులపై దాడి చేసింది. ఈ షాకింగ్ ఘటన యూఎస్‌లో అర్కాన్సాస్‌లోని ఫినిక్స్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఫినిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం సెక్యూరిటీ గుండా 19 ఏళ్ల మకియా కోల్మాన్ వెళ్తోంది. ఐతే ఆమె పెద్ద మొత్తంలో ఆపిల్ జ్యూస్‌ని తీసుకుని వెళ్తోంది. అంత మొత్తంలో జ్యూస్‌ని తీసుకువళ్లేందుకు అనుమతి లేదని ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెకు చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆ జ్యూస్‌ని ఆమె నుంచి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తుండగా.. ఆమె తిట్టడం ప్రారంభించింది. వారిలో ఒక అధికారి ఆమెను పక్కకు నెట్టడంతో ఆమె సీరియస్ అయ్యి అధికారులతో గొడవకు దిగింది. ఒక అధికారి చేయి కొరికి, మోచేతులతో కొట్టడం, ఒక అధికారి జుట్టుని పట్టుకుని దాడి చేయడం వంటివి ప్రారంభించింది. ఈ అనూహ్య ఘటనతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫీనిక్స్ పోలీసులు సదరు యువతి కోల్మాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దాడి కారణంగా ఇద్దరు అధికారులు ఆస్పత్రి పాలయ్యారు. ఆ యువతి వీరంగంతో చెక్పాయింట్ని మూసివేసి.. భద్రతా స్క్రీనింగ్ కోసం సుమారు 450 మంది ప్రయాణికులు మరో చెక్పాయింట్కి వెళ్లాల్సి వచ్చింది. (చదవండి: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..) -
పానీయం
బత్తాయి, ఆపిల్, క్యారెట్, బీట్ రూట్, టమోటా, కీరా, సొరకాయ, పార్సీలే ఆకులను సమపాళ్లల్లో తీసుకుని చిటికెడు పసుపు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు కలుపుకోవాలి. వడగట్టి తాగాలి. ఈ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల మంచి ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. -
పండ్లరసంలో మద్యం కలిపి తాగించి..వృద్ధుడు అఘాయిత్యం
ఒంటరిగా చిన్నారులు కనిపిస్తే చిదిమేయాలనుకునే కామాంధులు సమాజంలో పెరిగిపోయారు. అదే కోవలో ఓ పసిమొగ్గకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టిన వృద్ధుడు కడతేరిపోయాడు. బాధితురాలి కుటుంబీకులు దాడి చేసి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఐటీ సిటీలోని హెణ్ణూరు పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాక్షి, బనశంకరి: మైనర్ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు బాలిక బంధువుల దాడిలో విగత జీవి అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కుప్పణ్ణ (72) హతుడు. నమ్మించి ఇంట్లోకి పిలిపించి సోమవారం తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్ గుళేద్ కేసు వివరాలను వెల్లడించారు. కుప్పణ్ణ గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి దాడి సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. కుప్పణ్ణ ఉండే ఇంటి పై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో బాలిక వివరంగా చెప్పడంతో బంధువులు అగ్రహోదగ్రులయ్యారు. వెంటనే వెళ్లి కుప్పణ్ణను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. మరోవైపు కుప్పణ్ణ తమ బాలిక మీద లైంగిక దాడి చేశాడని హెణ్ణూరుపోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి గమనించగా కుప్పణ్ణ శవమై ఉన్నాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. -
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
ప్లేట్లెట్స్ బదులు బత్తాయి జ్యూస్.. బిగ్ ట్విస్ట్
లక్నో: కలకలం రేపిన ప్లేట్లెట్స్ బదులు పండ్లరసం పేషెంట్‌కు ఎక్కించి.. అతని మరణానికి కారణమయ్యారనే ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పేషెంట్‌కు ఎక్కించింది బత్తాయి రసం కాదని.. అది ప్లేట్లెట్స్ యూనిట్లేనని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ సంజయ్ ఖత్రీ మాట్లాడుతూ.. ఆ రోగికి ఇచ్చింది బత్తాయి రసం కాదని చెప్పారు. పేషెంట్‌కు ఎక్కిచ్చింది ప్లేట్లెట్స్. కాకపోతే వాటిని సరిగా నిల్వ చేయలేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించినట్లు ఖత్రీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటికే అధికారులు ఆస్పత్రిని సీల్ చేయడమే గాక వివరణ ఇవ్వకపోవడంతో బుల్డోజర్తో కూల్చివేయాలని అదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు) -
రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ప్రైవేటు ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రోగి ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో తాజాగా సదరు ఆసుపత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం నాటికి భవనాన్ని ఖాళీ చేయాలని లేదంటే బుల్డోజర్తో కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డెంగ్యూ రోగి చనిపోయిన కేసు ప్రాథమిక విచారణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడటంతో గత వారమే ఆసుపత్రిని సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో రోగులు లేరు. అయితే గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రి అధికారులు సమాధానం ఇవ్వలేదని తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు డెంగ్యూ రోగి మరణం అనంతరం ప్రయాగ్‌రాజ్ పోలీసులు నకిలీ ప్లేట్లెట్స్ సరఫరా చేసే ముఠాను ఛేదించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. నిందితుల నుంచి కొన్ని నకిలీ ప్లేట్లెట్ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చదవండి: ‘ఏయ్ ఐటమ్. ఎక్కడికి వెళ్తున్నవ్’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు In UP's Prayagraj, the development authority has issued demolition notice to the the hospital where a dengue patient died during treatment. Family of the deceased had alleged that the patient was given Mosambi juice in the drip instead of platelets. pic.twitter.com/T5a34EtIyY — Piyush Rai (@Benarasiyaa) October 25, 2022 -
ప్లేట్లెట్స్ బదులు పండ్ల రసం.. ఆస్పత్రికి సీల్
లక్నో: డెంగీ రోగికి ప్లేట్లెట్స్ బదులు పండ్ల రసం ఎక్కించి.. అతని మృతికి కారణమైన ఆస్పత్రిపై అధికారిక చర్యలు మొదలయ్యాయి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశాలనుసారం.. గురువారం రాత్రి ఆ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నిర్లక్ష్యపూరిత ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ హస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు.. బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ సంజయ్ కుమార్ ఖాత్రి స్పష్టం చేశారు. మరోవైపు పేషెంట్ బంధువులు ప్రభుత్వాసుపత్రి నుంచి తెచ్చిన ప్లేట్లెట్స్ బ్యాగులనే తాము ఉపయోగించామని, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు చెప్తున్నారు. 32 ఏళ్ల వయసున్న బాధితుడిని డెంగీ కారణంగా జీహెచ్‌టీసీలో చేర్పించారు. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో.. ఐదు యూనిట్ల ప్లేట్లెట్స్ ఎక్కించాలని సిబ్బంది ప్రయత్నించారు. మూడు యూనిట్లు ఎక్కించేసరికి వికటించడంతో.. పేషెంట్‌పై ప్రభావం పడింది. దీంతో మిగతావి ఎక్కించడం ఆపేశారు. ఈలోపు పరిస్థితి విషమించడంతో.. బంధువులు అతన్ని పక్కనే ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ కన్నుమూశాడు. ప్లేట్లెట్స్ బ్యాగు నకిలీదని, బత్తాయిలాంటి జ్యూస్‌లతో నింపేసి ఉన్నారని రెండో ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది బాధిత కుటుంబంతో చెప్పారు. దీంతో జీహెచ్‌టీసీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అన్యాయంగా తన సోదరి భర్తను పొగొట్టుకుందని.. యోగి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సౌరభ్ త్రిపాఠి అనే బంధువు వాపోతున్నాడు. प्रयागराज में मानवता शर्मसार हो गयी। एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया। मरीज की मौत हो गयी है। इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP — Vedank Singh (@VedankSingh) October 19, 2022 ఇక ఘటన దుమారం రేపడంతో.. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ స్పందించారు. ఆస్పత్రి నుంచి వైరల్ అయిన వీడియోపై దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఆస్పత్రికి సీజ్ వేయమని ఆదేశించాం. మరోవైపు ప్లేట్లెట్ ప్యాకెట్లను పరీక్షల కోసం పంపించాం అని పాథక్ ప్రకటించారు. మరోవైపు ప్లేట్లెట్స్ బ్యాగుల్లో పండ్ల రసాలను నింపి సప్లై చేస్తున్న ముఠాల గురించి కథనాలు వస్తుండడంతో దర్యాప్తు ద్వారా విషయం తెల్చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది. ఇదీ చదవండి: భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు -
Multi Function Juicer: మల్టీఫంక్షన్ జ్యూసర్.. దీని ధర ఎంతంటే!
ఆరోగ్యాభిలాషులు మెచ్చే పాలలో సోయా పాలు ప్రత్యేకం. 350 ఎమ్ఎల్ సామర్థ్యం కలిగిన ఈ జ్యూసర్ చాలా వేగంగా సోయా మిల్క్ తయారుచేస్తుంది. స్మార్ట్ ప్యానల్ కలిగిన ఈ డివైజ్.. ఆరు వేరు వేరు మోడ్స్‌తో పని చేస్తుంది. టీ, హాట్ వాటర్, రైస్ పేస్ట్, స్టీమ్ కుక్, ఫ్రై వంటి ఎన్నో ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. స్టెయిన్ లెస్ లైనర్.. హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్‌లో చాలా రుచులను ఈజీగా సిద్ధం చేసుకోవచ్చు. పని పూర్తి అయిన తర్వాత కొంత వాటర్ నింపుకుని.. క్లీనింగ్ బటన్ నొక్కితే చాలు క్షణాల్లో శుభ్రమైపోతుంది. ఒకరు లేదా ఇద్దరికి సరిపడే ఆహారాన్ని ఇది వేగంగా కుక్ చేస్తుంది. ఇందులో న్యూట్రిషన్ మీల్స్, బేబీ మీల్స్ (పసిపిల్లల ఆహారం) తయారు చేసుకోవడం ఈజీ. పైగా దీని మూత జగ్ మాదిరి ఉండటంతో లోపల ఉన్న ద్రవాన్ని ఒలికిపోకుండా సర్వ్ చేసుకోవచ్చు. ధర : 71 డాలర్లు (రూ. 5,620) చదవండి: Kobbari Vadalu Recipe: రుచికరమైన కొబ్బరి వడల తయారీ ఇలా! -
బరువు ఈజీగా తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ఈ జ్యూస్ తాగారంటే..!
పెరిగిన బరువును తగ్గించు కోవడం కోసం చాలామంది నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్‌ను తీసుకుంటే బరువు తగ్గడమే కాదు బాడీ మొత్తం డిటాక్స్ కూడా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆ జ్యూస్ ఏంటీ..? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి..? వంటి విషయాలపై ఓ లుక్కేద్దామా? ముందుగా ఒక క్యారెట్, ఒక కీరదోస తీసుకోవాలి. వాటికి చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పియర్ పండును కూడా తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, పియర్ పండు ముక్కలు, గింజ తొలగించిన మూడు ఖర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్–కీర–పియర్ జ్యూస్ సిద్ధమైనట్లే. ఈ జ్యూస్‌ను ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల అందులో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బాడీని డిటాక్స్ చేస్తాయి. అలాగే అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అతి ఆకలి సమస్యను దూరం చేస్తాయి. కాబట్టి, ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో.. వారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి. చదవండి: Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్‌సి అయ్యింది -
Constipation Remedies: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. నిర్లక్ష్యం చేస్తే!
మలబద్ధకం చాలామందిని వేధించే సమస్య. ఇది కేవలం ఉదయం పూట చెప్పుకోలేని బాధ మాత్రమే కాదు.. దీనివల్ల మున్ముందు కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా కూడా దీన్ని నివారించుకోవాల్సిన అవసరమూ ఉంది. పీచు పుష్కలంగా ఉండే ఆహారం, తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం సాధ్యం. అవి జీర్ణాశయమార్గాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు విరేచనం కూడా తేలిగ్గా అయ్యేలా చేస్తాయి. దేహంలో చక్కెరను నెమ్మదిగా వ్యాపించేలా చేసేందుకూ, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికి దోహదపడతాయి. మనం వాడే అన్ని రకాల ధాన్యాల పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు.. ఉదాహరణకు దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. చిక్కుళ్లలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చదవండి: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా తెలుసా? ఇక పండ్ల విషయానికి వస్తే.. పీచు ఎక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. ∙పీచుపదార్థాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మేలు చేస్తుందని గ్రహించాలి. చదవండి: ‘స్టెమీ’ గుండెపోటు అంటే తెలుసా? ఎవరికి ఆ ప్రమాదం? -
Health Tips: రోజూ ఒక్క గ్లాస్ మోసంబి జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో..
Amazing Mosambi Juice Benefits for Skin, Hair and Health: మార్కెట్లో సులభంగా, తక్కువ ధరలో లభించే వాటిలో మోసంబి ఒకటి. ఇది సిట్రస్ పండు. దీనిని తీపి సున్నం అని కూడా అంటారు. ఇండోనేషియా నుంచి చైనా వరకు అనేక ప్రాంతాల్లో మూలాలను కలిగి ఉంది. మోసంబిలో సాధారణ నిమ్మకాయల కంటే కూడా తక్కువ మోతాదులో యాసిడ్ ఉంటుంది. విత్తనాలు, మందపాటి తొక్క కారణంగా పండు రూపంలో తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. జ్యూస్‌గా మాత్రం మంచి రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మోసంబి రసం ఎంత అలసిపోయిఉన్నా తక్షణమే రీఫ్రెష్ చేస్తుంది. మోసంబిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి శరీరానికి ఉపయోగపడే అనేక మూలకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మోసంబి ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలించనట్లయితే.. విటమిన్ సి యొక్క పవర్ హౌస్: ఇది నీటిలో కరిగే విటమిన్. దీనిని మనం శరీరంలో నిల్వ చేయలేము. అందువల్ల ప్రతిరోజూ మనకు ఆహారం ద్వారా అవసరం. రోజూవారీ మోతాదుగా విటమిన్ సీ పొందడానికి మోసంబి రసం గొప్ప మార్గం. ఇది శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరం. మానవుని ఆరోగ్యంలో సమగ్ర పాత్ర పోషిస్తుంది. చదవండి: (Feet Care Tips: విటమిన్ ‘ఈ’ క్యాప్య్సూల్స్తో ఇలా అందంగా..) కళ్లకు మంచిది: యాంటి ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా.. మోసంబి జ్యూస్ కళ్లను ఇన్ఫెక్షన్ల నుంచి, కంటి శుక్లం అభివృద్ధి కాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్: క్రమం తప్పకుండా మోసంబి జ్యూస్ తాగడం వల్ల బలహీనత, అలసట తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చదవండి: (Health Tips: రోజూ గ్లాసు పళ్ల రసం చక్కెర వేయకుండా తాగితే..) క్యాన్సర్ నిరోధక లక్షణాలు: మోసంబిలో ఉండే లిమోనాయిడ్లు వివిధ రకాల క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడతాయి. గ్లూకోజ్ అనే చక్కెర అణువుతో లిమోనాయిడ్లు జతచేయబడి సులభంగా జీర్ణమవుతాయి. అందమైన చర్మం కోసం: మోసంబి జ్యూస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ అందమైన, ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతగానో ఉపయోగపడాయి. ఆరోగ్యకరమైన మెరుస్తున్న చర్మానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సీ ఇందులో పుష్కలంగా ఉంటుంది. మచ్చలను తొలగిస్తుంది: మోసంబి జ్యూస్‌లో తేలికపాటి బ్లీచింగ్, క్లెన్సింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి మచ్చలు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు తగ్గడానికి: మోసంబి రసంలో వృద్ధాప్య నిరోధక లక్షణాలు ఉన్నాయి. చర్మం ముడతలు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన కొల్లాజెన్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. శరీరానికి దృఢత్వాన్ని అందిస్తుంది. మనిషి కుంగిపోకుండా చేస్తుంది. జుట్టును బలపరుస్తుంది: మోసంబి జ్యూస్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . మీరు ఎల్లప్పుడూ కోరుకునే మెరుపును ఇస్తుంది. -
సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!
A video of a customer preparing his own juice: ఇంతవరకు వింతైన వంటకాలను సంబంధించి రకరకాల వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అంతేందుకు పాములా అనిపించే విచిత్రమైన కేకులు, ఓరియా బిస్కెట్ పకోడిలు వంటి వెరైటీ వంటకాలను గురించి విన్నాం. అచ్చం అలానే అహ్మాదాబాద్కి జ్యూస్ షాప్ సైకిలింగ్ చేయండి జ్యూస్‌ని ఆస్వాదించండి అంటూ మంచి సైకిల్ జ్యూస మిషన్‌ని తయారు చేసింది. (చదవండి: వలసదారులను తీసుకువెళ్లుతున్న పడవ బోల్తా....11 మంది మృతి) అసలు విషయంలోకెళ్లితే... అహ్మదాబాద్ గ్రీయోబార్ జ్యూస్ షాప్ తమ షాప్‌లో కస్టమర్లు తమకు నచ్చిన జ్యూస్‌ని తామే తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు అంటోంది. పైగా మీరు తగిన ఫిట్నెస్ తోపాటుగా మంచి జ్యూస్‌ని ఆస్వాదించే అవకాశం కూడా లభిస్తోంది అని చెబుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే జ్యూస్ మిక్సర్ సైకిల్‌కి అటాచ్ చేసి ఉంటుంది. దీంతో మనం ఆ సైకిల్ని తొక్కితేనే జ్యూస్ తయారవుతుంది అదే ఈ జ్యూస్ సైకిల్ ప్రత్యేకత. ఈ మేరకు మోహిత్ కేస్వానీ అనే కస్టమర్ ఈ జ్యూస్ సైకిల్ని తొక్కుతూ తనకు నచ్చిన పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!) View this post on Instagram A post shared by Greenobar (@thegreenobar) -
ఆ.. ఐడియా అక్కచెల్లెళ్ల జీవితాన్నే మార్చేసింది..
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వారిద్దరు అక్కాచెల్లెలు.. కరోనా సమయంలో పనులు, ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సొంతంగా వ్యాపారం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అప్పుడే వారికి హెల్దీఫుడ్స్ వ్యాపారం చేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టారు. వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి, ప్రస్తుతం స్థానిక గాంధీపార్క్ సమీపంలో చిన్నషాపు ఏర్పాటు చేసుకున్నారు. వారే ఆదిలాబాద్‌లోని వాల్మీకినగర్, శ్రీరాంకాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మి, ఎల్లుల అనిత. లక్ష్మి భర్త కూలీ పని చేస్తుండగా, అనిత భర్త ప్రైవేటుగా ఎలక్ట్రిషియన్‌గా చేస్తుంటాడు. వీరు సొంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరా నిలుస్తూ, తమదైన శైలిలో ఉపాధి పొందుతున్నారు. కోవిడ్ సమయంలో పాఠశాలలు మూతపడ్డాయి. మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న వీరి తండ్రి గుమ్మల పొచ్చన్న ఉపాధి కోల్పోయాడు. అక్కడే వీరి ఆలోచనలకు అంకురార్పణ జరిగింది. తొలుత తక్కువ మొత్తంలో చపాతి, జొన్న, మునుప వంటి రొట్టెలు, రాగిజావ, అల్లం టీ, గ్రీన్ టీ, ఉడికించిన గుడ్డు వంటివి ఇంట్లోనే చేసి తండ్రి పొచ్చన్న అమ్మకానికి పంపించేవారు. ఆయన స్థానిక గాంధీపార్కు సమీపంలో వీటిని విక్రయించేవాడు. అలా నెలపాటు కొనసాగించగా స్థానికుల నుంచి ఆదరణ లభిస్తుండటంతో చిన్నషెడ్డు వేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. లభించే ఫుడ్ ఐటమ్స్ క్యారెజ్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, కిరా, కాకరకాయ, సబ్జి గింజల జ్యూస్‌లు రూ.20 వరకు లభిస్తాయి. అలాగే గ్రీన్, లెమన్, జీర టీలు, ఇతర రకాలు, పాలు, రాగి సంకటి, రాగి జావలు రూ.6 నుంచి రూ.10 వరకు ఉంటాయి. రొట్టెలలో రాగిరొట్టెలు, మినప, జొన్న, సర్వపిండి రొట్టెలు, చపాతీలు రూ.10 నుంచి రూ.15 లభిస్తాయి. రాగి, నువ్వు, మినుప లడ్డూలు, జొన్న గట్కా, మొలకలు, ఉడికించిన గుడ్డులు లభిస్తాయి. రొట్టెలను ఆర్డర్‌పై చేసి ఇస్తున్నారు. చాలా బాగుంటాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు ఇక్కడ నుంచి రొట్టెలు, జ్యూస్‌లు పార్సిల్ తీసుకెళ్తాను. – అనిల్, శాంతినగర్, ఆదిలాబాద్ -
‘ఖూనీ జ్యూస్’ కోసం క్యూ కడుతున్న జనాలు
చండీగఢ్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత జనాలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. బయట ఆహారాన్ని తగ్గించి.. ఇంటి భోజనానికే పెద్ద పీట వేస్తున్నారు. ఇక రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం రకరకాల జ్యూస్‌లు, కషాయాలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. దీనిలో ఓ వ్యక్తి ‘ఖూనీ జ్యూస్’ తయారు చేస్తున్నాడు. ఖూనీ అంటే చంపేయడం.. అంటే ఎవరినైనా చంపి.. వారి రక్తంతో జ్యూస్ తయారు చేస్తున్నాడా ఏంటి అనే అనుమానం కలగకమానదు. ఇక పేరుకు తగ్గట్లే ఆ జ్యూస్ కూడా ఎర్రగా రక్తం రంగులో ఉంటుంది. చూడగానే.. ముఖం ఏదోలా పెట్టినా.. తయారీ విధానం చూశాకా లొట్టలేసుకుంటూ మరీ ఖూనీ జ్యూస్‌ని తాగుతున్నారు. మరి ఆ జ్యూస్ తయారీ.. పేరు వెనక కారణాలు తెలియాలంటే ఇది చదవండి.. హరియాణాకు చెందిన చిరు వ్యాపారి నదీమ్ ఫరిదాబాద్‌లోని భగత్‌సింగ్ చౌక్‌లో చిన్న జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడు. కరోనా కాలంలో జనాలు బయట ఆహారం అంటే భయపడుతుండటంతో.. నదీమ్ తన రూట్ మార్చాడు. జనాల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. ‘ఖూనీ జ్యూస్’ తయారీ ప్రారంభించాడు. ఇక ఈ జ్యూస్ తయారు చేయడానికి నదీమ్ పలు రకాల పండ్లు, కూరగాయాలు వాడాడు. ముఖ్యంగా పాలకూర, కాకరకాయ, పసుపు, క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు వాడి జ్యూస్ తయారు చేశాడు. బీట్రూట్ వాడటంతో ఇది ఎర్రగా ఉంటుంది. దాంతో దీనికి వెరైటీగా ఉంటుందని భావించి ‘ఖూనీ జ్యూస్’ అని పేరు పెట్టాడు నదీమ్. సర్వ్ చేయడానకి ముందు నిమ్మరసం, నల్ల ఉప్పు వేసి కస్టమర్లకు అందిస్తాడు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాక రుచిగా ఉండటంతో జనాలు ‘ఖూనీ జ్యూస్’ కోసం క్యూ కడుతున్నారట. ప్రస్తుతం నదీమ్ జ్యూస్ తయారు చేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు నదీమ్ తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న దేశీ చిరు వ్యాపారులను ప్రోతాహించాల్సిన అవసరం ఎంతో ఉంది. జ్యూస్ చూడ్డానికే కాదు.. తాగడానికి కూడా ఎంతో బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
80 ఏళ్ల బామ్మః జ్యూస్ స్టాల్
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ నగరంలో పండ్ల రసం దుకాణం నిర్వహిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న సదరు బామ్మను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఇటీవల అమృత్సర్ బామ్మ ఉదంతాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 90 లక్షల మందికి పైగా నెటిజన్లు తిలకించారు. అమృత్‌సర్‌లోని ఉప్పల్ న్యూరో ఆసుపత్రి సమీపంలో రాణి దా బాగ్ వద్ద ఆమె స్వయంగా జ్యూస్ స్టాల్ నడిపిస్తున్నారు. 80 ఏళ్ల బామ్మ బత్తాయి రసం తయారు చేసి, విక్రయిస్తున్న దృశ్యం జనం మనసులను కదలిస్తోంది. ఆమెపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆవేదన పంచుకుంటామని, ఆర్థిక సాయం అందిస్తామని చాలామంది బామ్మ బ్యాంకు ఖాతా వివరాల కోసం ఆరా తీస్తున్నారు. బామ్మ దుకాణంలో పండ్ల రసం తాగి, ఆమెకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటూ అమృత్సర్ ప్రజలకు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. జీవనోపాధి కోసం జ్యూస్ స్టాల్ నడిపిస్తున్న బామ్మకు హ్యాట్సాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే అసలైన ఆత్మనిర్భర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటితరం యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడుతున్నారు. వృద్ధుల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఓ నెటిజన్ అభ్యర్థించాడు. -
హైదరాబాద్‌లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. వీడియో వైరల్
సోనూసూద్.. ఇతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాయం అనే పదం ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తోంది. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్.. కొద్ది రోజుల నుంచి కొత్త అవతారం ఎత్తి మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తున్నాడు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం నుంచి పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం ప్రారంభించాడు. సోనూసూద్ దా పంజాబీ ధాబా.. ఇక్కడ దాల్.. రోటీ ఉచితమే’ అంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. ఇటీవలే రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి ఆయన కంట పడటంతో వెంటనే కారు దిగి స్వయంగా తనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు. ఇలా రోజుకొక చిర వ్యాపారులకు సోనూసూద్ అండగా నిలుస్తున్నాడు. ఇక తాజాగా సోనూ కొత్త అవతారం ఎత్తాడు. ఈసారి జ్యూస్ షాప్ ఓనర్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ షాపు వద్దకు వచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడాడు. ఇక్కడ బత్తాయి జ్యూస్ ఫ్రీ అంటూ స్వయంగా జ్యూస్ తయారు చేసి అమ్మాడు. కొద్దిసేపు అక్కడే ఉండి చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరాడు. దానికి చెందిన వీడియోను ట్విటర్లో షేర్చేశాడు. ఇలా తనదైన స్టైల్లో చిరు వ్యాపారులకు సోనూ సపోర్టు చేస్తుండటంతో ఆయన చేసిన ఈ పనిపై మరోసారి సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. -
చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరిన సోనూసూద్
-
బామ్మ జ్యూస్ స్టాల్: వావ్ అంటున్న నెటిజనులు, వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్యంలో హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలు మీద కాలు వేసుకుని జీవించే అదృష్టం ఎంతమందికి ఉంటుందో తెలియదు గానీ, తమకు ఏజ్ జస్ట్ ఒక నంబరు మాత్రమే. అసలు వయసు ఒక సమస్యేకాదు అని చాలామంది సీనియర్ సిటిజన్స్ నిరూపిస్తున్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా మాకు మేమే సాటి అంటూ ఈమధ్య కాలంలో చాలామంది దర్శనమిస్తున్నారు. తమ టాలెంట్‌తో ఇంటర్నెట్లో సంచలనంగా మారుతున్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన జ్యూస్ స్టాల్ బామ్మ వార్తల్లో నిలిచారు. అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం తీసి యిస్తూ కస్టమర్లను భలే ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా చాలా కష్టపడుతూ జ్యూస్ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాదు యుక్తవయసులో కూడా పనీ పాటా లేకుండా తిరిగే ఆవారా బ్యాచ్‌కు ఈ బామ్మ పెద్ద సవాలే విసురుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేనా తన కష్టార్జితాన్ని నమ్ముకుని గౌరవంగా జీవించాలనుకునేవారికి ఆమె ఒక రోల్ మోడల్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ వయసులో ఆమె చాలా కష్టపడుతున్నారు. దయచేసిన ఎవరైనా ఆమెకు సాయం చేయండి అంటూ ఒక ట్విటర్ యూజర్ వీడియోను ట్వీట్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. వీలైతే ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ జ్యూసర్ ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు ట్వీట్ చేయగా మరికొందరు భిన్నంగా స్పందించారు. పాశ్చాత్య దేశాలలో, సీనియర్లు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు వీలుగా పెన్షన్లు పొందుతారు. కానీ మన దేశంలో మాత్రం వారికి నరకమే అంటూ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సులభంగా డబ్బు కావాలనుకునే యువత ఈమెను చూసి సిగ్గుపడాలని మరొకరు ట్వీట్ చేశారు. The bibiji in the video below has her juice stall in Amritsar. She is working hard in her old age. Please show some love and support to her. The address of her stall is Rani da bagh Amritsar, Opp SBI Bank, near Uppal Neuro Hospital. Please share with your contacts 🙏 pic.twitter.com/YTpjk4IIWm — A Sidhu (@asidhu_) July 27, 2021 -
సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్
నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది తొక్క తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను తీసి నేలకొట్ట తీయని నారింజ తింటే హాయ్ హాయ్.. చిన్నప్పుడు చదువుకున్న పాట ఇది. నారింజ పేరు చెబితేనే కళ్లు మూసుకుంటాయి. అటువంటి నారింజ రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు ఇక్కడ. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం దాటి, ఆత్రేయపురం వెళ్లే దారిలో లొల్ల లాకులకు ముందుగా, రోడ్డు పక్కన పచ్చని చెట్ల కింద చిన్న బండి కనిపిస్తుంది. అక్కడకు రాగానే వారి వారి వాహనాలను పక్కన పెట్టి, జుత్తుగ సుబ్బారావు తాత ఇచ్చే నారింజ రసం సేవించి, సేద తీరుతుంటారు. సుబ్బారావు వయస్సు 83 సంవత్సరాలు. ‘శ్రేష్ఠమైన వడ్లమూడి నారింజ పండ్లు తెప్పించి, రసం తీసి ఇస్తాను. వడ్లమూడిలో దొరక్కపోతే, రాజమండ్రి, నిడదవోలు ప్రాంతాల నుంచి నారింజకాయలు తీసుకువస్తాయి’ అంటారు ఈ తాత. ఆశ్చర్యమేమిటంటే, నారింజ కాయలు కొనడానికి తాత ఎక్కడకూ వెళ్లరు, అక్కడి నుంచి కాయలు రాగానే, ఇక్కడ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ‘అంతా నమ్మకం మీదే నడిచిపోతోంది వ్యాపారం’ అంటారు ఈ తాత. ఒక్కో మనిషికి మూడు కాయల రసం పిండుతారు. కాయలు బాగా తగ్గినప్పుడు రెండు కాయలు పిండుతారు. ఒక్కో కాయ పది రూపాయలకు కొంటారు. కాని గ్లాసు రసం 20 రూపాయలకే అమ్ముతారు. ఎవరైనా వచ్చి ‘ధర పెంచవా తాతయ్యా’ అని అడిగితే, ‘నాకు ఆదాయానికి లోటు లేదు. నేను కూర్చుని తిన్నా నాకు సాగుతుంది. కాని ఏదో ఒక పనిచేయనిదే నాకు తోచదు. ఇది అలవాటైన పని. ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాను’ అంటూ ఎంతో సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. వ్యాపార రహస్యం.. నారింజ రసంలో నాలుగు రకాల వస్తువులు కలుపుతారు. ‘లక్ష రూపాయలిచ్చినా ఆ రహస్యం మాత్రం చెప్పను’ అంటారు సుబ్బారావు తాత. మొట్టమొదట్లో ఈ వ్యాపారం ర్యాలి గ్రామంలోని జగన్మోహిని ఆలయం దగ్గర ప్రారంభించారు. అక్కడ ఈ బండి పాతిక సంవత్సరాలు నడిచింది. ఆ తరవాత ఇప్పుడున్న ప్రదేశానికి మార్చానని చెబుతారు సుబ్బారావు తాత. ఆ తల్లి చలవ.. సుబ్బారావు తాత తన చిన్నతనంలో ఒకరి ఇంట్లో చాలా కాలం పనిచేశారు. అందుకుగాను వారు సుబ్బారావు తాతకు ఆరు కుంచాల పొలం రాసి ఇచ్చారట. సుబ్బారావు తాతకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిది ఉమ్మడి కుటుంబం. ‘వంటంతా ఒక కుండలోనే జరుగుతుంది’ అంటూ సంబరంగా చెబుతారు సుబ్బారావు తాత. ‘ఇంటి దగ్గర కూర్చుంటే ఏం వస్తుంది. ఓపిక ఉంది, కష్టపడతాను. ఎక్కడెక్కడ నుంచో మీరంతా రసం తాగటానికి వస్తుంటారు. నేను తయారుచేసిన నారింజ రసం అమెరికా కూడా వెళ్లింది. నాకు అంతకుమించిన సంతోషం లేదు’ అంటారు ఈ తాత. ఆరు నెలలు నారింజలే.. ఆరు నెలల పాటు కేవలం నారింజ రసం అమ్ముతారు. మిగిలిన ఆరు నెలలు రకరకాల రసాలు అమ్ముతారు. సొంతంగా లిమ్కా రుచిని కూడా తయారుచేస్తారు. మొత్తం 20 రకాల జ్యూస్‌లు తయారుచేస్తారు సుబ్బా రావు తాత. అన్నీ 20 రూపాయలకే అందిస్తున్నారు. వచ్చిన ప్రతివారినీ ‘రండి బాబూ! రా తమ్ముడూ! రా మనవడా!’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పది పైసలతో మొదలు.. 50 సంవత్సరాల క్రితం 10 పైసలతో ప్రారంభమైన నారింజ రసం ఇప్పుడు 20 రూపాయలకు చేరింది. ‘ఈ పాకం, ఈ ఫార్ములా ఎవ్వరికీ తెలియదు. ఈ రుచికి అలవాటు పడిన వాళ్లు మళ్లీ మళ్లీ అక్కడకు వచ్చి, ఆగి తాగి వెళ్తారు. ‘సుబ్బారావు గ్రేట్’ అంటారు అక్కడ రసం తాగినవారు. మంచి నీడనిచ్చే చెట్టు కింద నీడలో చల్లగా సేద తీరుతారు. ‘బండి చిన్నదే కానీ రుచి మాత్రం పెద్దది’ అంటారు ఆ రసం రుచి చూసినవారంతా. ఆ రసాన్ని మిషన్ మీద కాకుండా చేత్తో తీసే మిషన్‌తోనే తీస్తారు. ఉప్పు, కారం, ప్రత్యేకమైన మసాలా వేసి, కొద్దిగా ఐస్ జత చేసి జ్యూస్ ఇస్తూ, సుబ్బారావు తాత అందరి కడుపులను చల్లబరుస్తున్నారు. -
వైరల్: జ్యూస్ షాప్‌గా మారిన ఏటీఎం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఒక జ్యూస్ షాప్ యజమాని చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ యజమాని ఏటీఎంనే ఏకంగా జ్యూస్ షాప్‌గా మార్చేశాడు. సాధారణంగా ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఉంటేనే మరో వ్యక్తిని లోనికి అనుమతించరు. అలాంటిది ఏటీఎం మిషన్‌ను ఒక మూలకు నెట్టి మరీ అతను లోపల కుర్చీలు వేసేశాడు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బలు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన వారిని కుర్చీలో కూర్చోండి అంటూ మర్యాదలు కూడా చేస్తున్నాడు. చాలా మంది అక్కడ కూర్చొని ఉండగానే కస్టమర్లు వారి ఏటీఎం లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని బట్టి ఏటీఎంలు ఎంత రిస్క్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీ ఏటీఎం పిన్‌లను, ఓటీపీలను ఎవరికి తెలియనివ్వద్దు అంటూ బ్యాంకులు ప్రతిసారి మెసెజ్‌లు పంపుతూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటిది ఈ వ్యక్తి ఏటీఎంను జ్యూస్ షాప్‌గా మార్చడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. ఇది పూర్తిగా బ్యాంక్ ఏటీఎం నిబంధనలకు విరుద్ధం. ఏటీఎం రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి లోపల ఉంటే మరో వ్యక్తి అక్కడ ఉండటానికి వీలు లేదు. సాధారణంగా ప్రతి ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అయితే ఈ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదో తెలియడం లేదు. అంతేకాకుండా బ్యాంకు అధికారులు ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదైనా సాంకేతిక లోపలు తలెత్తినప్పుడు అధికారులు అక్కడికి వచ్చే ఉంటారు. అప్పుడు కూడా వారు జ్యూస్ యజమానిని ఎందుకు హెచ్చరించలేదు? అసలు ఆ వ్యక్తిపై బ్యాంక్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ వీడియో చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో సదరు వ్యక్తిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వైరల్: జ్యూ స్ షాప్‌గా మారిపోయిన ఏటీఎం Autoplay ONOFF చదవండి: ఇటలీని షేక్ చేస్తున్న ప్రభాస్ మేనియా -
చక్కెర చాయ్‌తో క్యాన్సర్!
న్యూఢిల్లీ : చిక్కటి చక్కెర చాయ్ తాగితే నీరసంగా ఉన్న శరీరానికి అనుకోని బలం హఠాత్తుగా వచ్చినట్లు ఉంటుంది. గ్లాసుడు పళ్ల రసం పుచ్చుకున్న నిస్సత్తువ శరీరానికి ఎక్కడిలేని శక్తి వచ్చినట్లు ఉంటుంది. అయితే ఈ రెండింటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు భారీగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం తేల్చారు. 100 మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన పళ్ల రసం రోజు పుచ్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతుందని దాదాపు లక్ష మంది ప్రజలు ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన ఫ్రాన్స్ వైద్యులు తెలిపారు. ఇక అంతే మొత్తంలో కార్డియల్, ఫిజ్జీ పాప్లు తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం 19 శాతం పెరుగుతాయని వారు చెప్పారు. రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని రోజుకు ఒక్క కప్పు టీ తాగినా అంతే ప్రమాదమట. కోక కోలా డ్రింక్ కన్నా కప్పు ఛాయ్ ప్రమాదమట. చక్కెర కలవడం వల్లనే ఈ పానీయాలన్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతున్నాయని అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. వయస్సును బట్టి చక్కెర పాళ్లను పరిమితం చేస్తే పెద్ద ప్రమాదమేమీ లేదని వారే చెబుతున్నారు. బ్రిటన్ పిల్లలు మోతాదుకు మించి చక్కెర తీసుకుంటున్నారని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్’ ఆందోళన చెందుతోంది. పిల్లలు, టీనేజర్లు కూల్ డ్రింకులను ఎక్కువగా తీసుకుంటున్నారని, వాటిల్లోనే క్యాన్సర్‌కు దారితీసే చక్కెర శాతం ఎక్కువ ఉంటుందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బాటిళ్లలో దొరకి పళ్ల రసాల్లో కూడా చక్కెర కలుపుతారుకనుక సాధారణ పళ్ల రసాల కన్నా అవి మరింత ప్రమాదకారకాలని వారంటున్నారు. క్యాన్సర్ మరణాలను తగ్గించాలంటే అన్ని డ్రింకుల్లో చక్కెర పాళ్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉందని అధ్యయనకారులు ఫ్రెంచ్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. పారిస్‌లోని సార్బోన్, ఫ్రెంచ్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నిపుణులు సంయుక్తంగా ఈ తాజా అధ్యయనం జరిపారు. -
ఈ జ్యూస్‌తో గుండె జబ్బులు దూరం..
టోక్యో : ఉప్పు కలపకుండా టొమాటో జ్యూస్ నిరంతరం తీసుకోవడం బీపీ, కొలెస్ర్టాల్లను తగ్గించి గుండె జబ్బుల ముప్పును నివారిస్తుందని తాజా అథ్యయనం తేల్చింది. దాదాపు 500 మంది స్త్రీ, పురుషులను ఏడాది పాటు పరిశీలించిన మీదట ఉప్పులేని టొమాటో జ్యూస్ తీసుకున్న వారిలో బీపీ గణనీయంగా తగ్గినట్టు తేలిందని టోక్యో మెడికల్, డెంటల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అథ్యయనం వెల్లడించింది. తమ అథ్యయనంలో పాల్గొన్న వారిలో సిస్టోలిక్ బీపీ సగటున 141 ఎంఎంహెచ్‌జీ నుంచి 137కు తగ్గగా, డయాస్టలిక్ బీపీ సగటున 83.3 నుంచి 80కి తగ్గిందని పరిశోధకులు తెలిపారు. ఇక చెడు కొలెస్ర్టాల్ సగటున 155 నుంచి 149కు తగ్గినట్టు గుర్తించారు. మహిళలు, పురుషులు సహా భిన్న వయసుల వారిలో ఒకేరకంగా సానుకూల ఫలితాలను గమనించామని చెప్పారు. ఏడాదిపాటు భిన్న వయసులు, స్త్రీ, పురుషులపై ఈ తరహా అథ్యయనం జరగడం ఇదే తొలిసారని ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అథ్యయన పరిశోధకులు వెల్లడించారు. -
ఇంజినీర్ వినూత్న ప్రయత్నం.. వాటర్ లెస్ జ్యూస్
గచ్చిబౌలి :పండ్లను ముక్కలుగా కోసి అందులో ఐస్ ముక్కలు, షుగర్ వేసి తయారు చేసిన జ్యూస్‌ను మనం తాగే ఉంటాం. కానీ పండ్లను మిషన్‌లో క్రష్ చేసి నీరు, చక్కెర లేకుండా సహజ సిద్ధమైన జ్యూస్‌ను తయారు చేస్తున్నాడీ యువకుడు.నగరంలో ‘ఎన్ కోల్డ్ ప్రెస్ట్’ పేరిట జ్యూస్ తయారు చేసి హోమ్ డెలివరీ చేస్తున్నారు. అశోక్గనర్కు చెందిన అమితేష్ శర్మ 2012లో బీటెక్ పూర్తి చేశారు. కాలేజ్‌లో వినూత్న రీతిలో ప్రాజెక్ట్‌లు చేస్తుంటే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని అక్కడి లెక్చరర్లు ప్రోత్సహించే వారు. బీటెక్ పూర్తి కాగానే 2013లో శివంలో ఫిల్మి తడక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్నునడుపుతూ కిచెన్ పండ్లతో వాటర్, షుగర్ కలపకుండా జ్యూస్ చేసి వచ్చే వారికి ఉచితంగా ఇచ్చేవారు. దీనికి మంచి స్పందనరావడంతో 2016లో రెస్టారెంట్ సమీపంలో మరో కిచెన్తీసుకొని జ్యూస్ తయారు చేస్తున్నారు. ఎన్ కోల్డ్ ప్రెస్డ్... ఎన్ కోల్డ్ ప్రెస్డ్ పేరిట వాటర్, షుగర్ లెస్ జ్యూస్‌ను తయారు చేసే విధానంపై ప్రాజెక్ట్ రిపోర్డ్‌ను తయారు చేసి ఐటీసీలో సీఈఓగా పని చేసిన ప్రదీప్ దోబ్లేను కలిశారు. ఆయన సంతృప్తి వ్యక్తం చేసి పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. దీంతో మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో ఎన్ కోల్డ్ ప్రెస్డ్ స్టార్టప్‌ను నెలకొల్పారు. సీఈఓ, ఫౌండర్‌గా అమితేష్‌తో పాటుమరో ఐదుగురు కలిసి అధ్యయనం చేశారు. నిజాంపేట్‌లో ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించారు. 53 రకాల పండ్లు, కూరగాయలు, గింజలు, డ్రై ఫ్రూట్స్‌తో జ్యూస్ తయారు చేస్తున్నారు. రోజుకు 300 లీటర్ల జ్యూస్ తయారు చేస్తున్నారు. నాలుగైదు రకాల కూరగాయలు, పండ్లు కలిపి జ్యూస్ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జ్యూస్ తయారు చేసిన అనంతరం 6 గంటల పాటు కూలింగ్‌లో ఉంచుతారు. ఉదయం హోమ్ డెలివరీ చేస్తారు. తమ జ్యూస్‌ను సెలబ్రిటీలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారని అమితేష్ చెబుతున్నారు. త్వరలో వంద మందికి ఉపాధికల్పిస్తామని పేర్కొంటున్నారుఅమితేష్ శర్మ . చర్లపల్లిలో మరో యూనిట్... రోజుకు 5000 లీటర్ల జ్యూస్‌ను తయారు చేసేందుకు చర్లపల్లిలో మరో యూనిట్‌ను త్వరలో పెట్టనున్నారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి కేంద్రాన్నినెలకొల్పనున్నారు. – అమితేష్ శర్మ, ఎన్ కోల్డ్ ప్రెస్డ్ సీఈఓ -
పొడిబారిన చర్మం కోసం ప్యాక్స్..
టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ క్యారట్ జ్యూస్ గాని నారింజ జ్యూస్ గాని కలపాలి. ఈ మూడింటినీ బాగా కలిపిన తరవాత పేస్ట్ చేసుకోవడానికి సరిపడా శనగ పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం మృదువవుతుంది. పొడి చర్మం వారు వారానికి ఒక్కసారి ఈ ప్యాక్‌ని వాడడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. కోడిగుడ్డులోని పచ్చ సొనలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం నిగారిస్తుంది. -
జ్యూస్ అనుకుని విషం తాగాడు..!
సాక్షి, పళ్లిపట్టు : కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తున్న ఓ బాలిక తెలిసి తెలియక అందులో పురుగుల మందు కలపడంతో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. బిహార్‌లో జరిగిన ఈ సంఘటన మరువక ముందే తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జ్యూస్ అనుకుని ఓ బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలివి.. పళ్లిపట్టు మండలం కొళత్తూరు గ్రామ పంచాయతిలోని జయంతి కాలనీలో కార్మికుడు బాబు, లావణ్యలు నివశిస్తున్నారు. ఈ దంపతులకు భాను(7), కదిర్‌వేల్ అలియాస్ అఖిల్(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఖిల్ శుక్రవారం ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని చెత్త కుప్పలో ఉన్న బాటిళ్లను చూశాడు. అందులో జ్యూస్ ఉంటుందని అనుకుని ఆ పురుగుల మందును తాగాడు. కాసేపటి తరువాత ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే పళ్లిపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రా అత్త.. అన్నానగర్ కోడలు.. అదిరే జ్యూస్‌లు
కేకేనగర్ : ఫ్రూట్ జ్యూస్‌లతో ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు ఈ అత్తాకోడళ్లు. గత పదేళ్లుగా ముగప్పేర్ ఈస్ట్‌లో నివసిస్తున్న అత్త ప్రేమ, కోడలు లక్ష్మీలు ఇంట్లోనే రకరకాల పండ్లతో ప్రకృతి సిద్ధంగా జ్యూస్‌లను తయారు చేసి అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు తాగడానికి జ్యూస్ చేసి ఇచ్చేవారు. వారు వారికి తెలిసిన వారికి చెప్పి ఆర్డర్లు ఇవ్వడంతో వీరి చిన్న పాటి వ్యాపారానికి గిరాకీ పెరిగింది. రోజూ పది లీటర్ల జ్యూస్‌ల నుంచి సీజన్లలో 150 లీటర్ల వరకు అమ్మకాలు సాగుతుంటాయని ప్రేమ తెలిపారు. ప్రేమ తెలుగు వారు కావడం విశేషం. ఆమె పుట్టిల్లు తిరుపతికాగా కోడలు లక్ష్మీ చెన్నై అన్నానగర్‌కు చెందినవారు.ప్రేమ నాన్న వేదాంతచారి. ఆయన తిరుమల కొండపై అహోబిలం మఠంలో ముద్రకర్తగా 65 సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకుని గత 40 ఏళ్ల కిందట చెన్నై వచ్చేశారు. భర్త రామభద్రన్ టాన్సీ విశ్రాంత ఉద్యోగి. కుమారుడు ఆరవముదన్కు వివాహం జరిగిన అనంతరం కోడలు లక్ష్మితో కలిసి ప్రేమ జ్యూస్ వ్యాపారం ప్రారంభించారు. ఈ విషయమై ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తాము తయారు చేసే పండ్ల జ్యూస్‌లను ఎంతో ఇష్టంగా తాగుతారని తెలిపారు. చిన్న ప్లిలలు సాధారణంగా పాలు తాగాలంటే మొండికేస్తారు. వారి తల్లుల కోరిక మేరకు రోస్మిల్క్లను తయారు చేసి అందిస్తున్నట్టు పేర్కొన్నారు. సీజన్లతో పని లేకుండా అన్ని సీజన్లకు తగినట్లు ఫ్రూట్ జ్యూస్‌లను తయారు చేయడం తమ ప్రత్యేకత అని ప్రేమ చెప్పారు. లెమన్, పైనాపిల్, గ్రేప్, మ్యాంగో, జింజర్ జ్యూస్‌లు, ఇంకనూ లెమన్ ప్లెయిన్, జింజర్ లెమన్, లెమన్– నన్నారి, లెమన్ – మింట్, పిల్లల కోసం ప్రత్యేకంగా రోస్మిల్క్ తయారు చేస్తామని అన్నారు. తమ వ్యాపారానికి ఎలాంటి ప్రకటనలు, పబ్లిసిటీ ఇవ్వలేదన్నారు. ప్రేమ, వినియోగదారుల పోత్రాహం, అభిమానమే తమ వ్యాపార రహస్యం అన్నారు ప్రేమ నవ్వుతూ.. లక్ష్మీ మా ట్లాడుతూ.. సమ్మర్ సీజన్లో జింజర్, మిం ట్‌తో తయారు చేసిన జ్యూస్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అల్లం శరీ రంలో చురుకుదనాన్ని కల్గించి అలసటను పోగొడుతుందని వివరించారు. ఒక జ్యూస్‌ను తయారు చేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని లక్ష్మి తెలిపారు. జ్యూస్‌లలో కలపడానికి తాజా పండ్లను తీసుకుంటామని, చక్కెర సిరప్‌ను వేడి చేసి ఫ్రెష్‌గా తయారు చేసి చల్లారిన తర్వాత జ్యూస్‌లలో కలుపుతామని, తాము తయారు చేసే ఈ జ్యూస్‌లు ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయని ఈ అత్తాకోడళ్లు తెలిపారు. ఖర్చులకు పోగా వచ్చే ఆదాయాన్ని కూడబెట్టి సత్కార్యాలకు వినియోగించాలనేది ఈ ఇద్దరి కోరిక. వీరితో పాటు కుటుంబ సభ్యులందరూ అదే కోరుకుంటున్నారు. మనం కూడా వారి కోరిక నెరవేరాలని ఆశిద్దాం. -
రాళ్లను కరిగించే జ్యూస్
హెల్త్ టిప్స్ కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. అయితే కొందరికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటివారు రోజూ నారింజ పండ్ల రసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చునంటున్నారు వైద్యపరిశోధకులు.నిద్రలేమి చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగని నిద్రమాత్రలు వాడితే మరిన్ని సైడ్‌ఎఫెక్ట్‌లు వస్తాయి. అందుకోసం ఏం చేయాలంటే రోజూ ఒకటి రెండు కప్పుల దానిమ్మ జ్యూస్ తాగాలి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. పులిపిర్లు పెద్ద సమస్య. ఇవి ఏర్పడటానికి ప్రధాన కారణం వైరస్. కొందరు వీటిని గిల్లడం, లాగడం వల్ల కొత్తచోట్లలో కూడా పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్ల నివారణకు ఇలా చేయడం ఉత్తమం.వెల్లుల్లిపాయలను వొలిచి పులిపిర్ల పైన రుద్దుతూ ఉండాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని తొలగించి అందులో ఉప్పు నింపాలి. దీనినుంచి వచ్చే రసంతో పులిపిర్లపైన సున్నితంగా రుద్దాలి. అలా దాదాపు నెలరోజులపాటు చేయాలి. బంగాళదుంపను మధ్యకు కోసి ఆ ముక్కలతో రుద్దుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా 15, 20 రోజులపాటు చేస్తే పులిపిర్లు ఎండి రాలిపోతాయి. ఆస్తమా ఉన్నవాళ్లు పది నల్లమిరియాలు, రెండు లవంగాలు, గుప్పెడు తులసి ఆకులను తీసుకుని వాటిని మరుగుతున్న నీటిలో వేయాలి. అనంతరం స్టవ్‌ను పావుగంటపాటు సిమ్‌లో ఉంచి నీటిని మళ్లీ మరిగించాలి. ఈ ద్రవాన్ని వడకట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేయాలి. ద్రవం చల్లారేదాకా ఉంచి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఒకటి రెండు స్పూన్ల ద్రవాన్ని రెండు వారాలపాటు రోజూ సేవించాలి. -
రెయిన్బో జ్యూస్
హెల్దీ ట్రీట్ కావలసినవి:బీట్రూట్ – 1 (చిన్నది), క్యారట్లు – 2, టొమాటో – 1, తేనె – 1 టీ స్పూన్ తయారి: బీట్రూట్, క్యారట్ల పై తొక్క తీసి, కట్ చేసుకోవాలి. టొమాటోలను కూడా ముక్కలుగా చేయాలి. ఈ పదార్థాలన్నీ మిక్సర్‌లో వేసి తగినన్ని నీరుపోసి జ్యూస్ చేయాలి. జ్యూస్‌ని గ్లాస్లో పోసి తేనె వేసుకుని తాగాలి. నోట్: యువతీ యువకులు మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. వీళ్లు భోజనానికి గంట ముందు ఈ జ్యూస్ తాగాలి. దీంట్లో ఉప్పు, పంచదార కలపకూడదు. జ్యూస్ తాగిన గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా క్రమం తప్పకుండా నెలరోజులు చేస్తే మొటిమలు తగ్గుతాయి, చర్మం కాంతివంతం అవుతుంది, సన్‌బర్న్ బారిన పడదు. క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉన్న ఈ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నాయి. ఊబకాయం సమస్య ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఫలితం ఉంటుంది. పోషకాలు: క్యాలరీలు – 95.9కె.సి.ఎ. ఎల్, కార్బోహైడ్రేట్లు 20.77 గ్రా., ప్రొటీన్ – 2.21గ్రా., ఫ్యాట్ – 0.35గ్రా., క్యాల్షియం – 113 మి.గ్రా. -
కూల్ ఐడియా
మెలన్ టాంగో ఎండాకాలంలో విరివిగా లభించే కర్బూజతో వెరైటీ జ్యూస్. విటమిన్ సి మెండుగా ఉండే మెలన్ టాంగో తాగితే ఎండతాకిడికి కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. కావలిసినవి కర్బూజ ముక్కలు : రెండు కప్పులు కమలాపండ్లు : రెండు చక్కెర : రెండు టీ స్పూన్లు నల్ల ఉప్పు : చిటికెడు తయారీ కర్బూజ ముక్కలను, కమలాపండు తొనలను మిక్సీలో బ్లెండ్ చేసి వడపోయాలి. చక్కెర, నల్ల ఉప్పు కలపాలి. దీని తయారీకి ఐదు నిమిషాలు పడుతుంది. పై కొలతల ప్రకారం చేస్తే నాలుగు గ్లాసుల టాంగో వస్తుంది. చలువ చేసే కిస్మిస్ డ్రింక్ బాడీ టెంపరేచర్ని అదుపులో ఉంచడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది కిస్మిస్ పానీయం. కావలసినవి వేడినీరు – ఒక గ్లాస్ ఎండుద్రాక్ష – 50 గ్రాములు గ్లూకోజ్ – రెండు టీ స్పూన్లు తయారీ ఎండుద్రాక్షను మంచినీటితో శుభ్రపరిచి రాత్రి పూట వేడినీటిలో నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ద్రాక్షను మిక్సీలో పేస్ట్‌లా చేసి, ఈ గ్లాసుడు నీటిలో కలిపి తాగితే తక్షణ శక్తి వస్తుంది. -
సమ్మర్ కేర్
వేసవిలో పిల్లలు కుదురుగా ఇంట్లో ఉండమంటే ఉండరు. పైగా ఎండ వేడి. పిల్లలు ఎండలను తట్టుకొని, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లులకు తెలిసుండాలి. చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ ఇప్పించవద్దు. వాటికి బదులు కొబ్బరి నీళ్లు, లస్సీ, షర్బత్ లాంటివి ఇస్తే దాహం తీరుతుంది. డయేరియా దరిచేరదు. ఫ్రూట్స్ తినని పిల్లలకు వాటితో వెరైటీ స్వీట్స్, జ్యూస్ చేసి ఇస్తే ఇష్టపడతారు. ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్స్‌తో ఆడుకోవడమన్నా, వాటినలాగే తినడమన్నా, చల్లటి నీటిని తాగడమన్నా పిల్లలకు సరదా. వీటి వల్ల గొంతుకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎండ వేడిమిని తట్టుకోవడానికి కాటన్ దుస్తులనే వేయాలి. నైలాన్ దుస్తులు వేస్తే చెమట పొక్కులు, ర్యాష్ వస్తాయి. -
తీగ లాగితే జ్యూస్ వచ్చింది
రుచిగా పాకుతుంది... ఆరోగ్యంగా అల్లుకుంటుంది... అందరి హృదయాలలో విస్తరిస్తుంది. నాలుకపై నాట్యమాడుతుంది... తీగలాగితే చాలు జ్యూస్ వస్తుంది... తీగకూరగాయలతో చేసిన జ్యూస్ స్పెషల్స్ ఇవి. సొరకాయ జ్యూస్ కావల్సినవి: సొరకాయ – 1 (250 గ్రాములు); పుదీనా ఆకులు– 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత, అల్లం– చిన్నముక్క తయారీ: సొరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన, కొత్తిమీర ఆకులు వేయాలి. నిమ్మరసం వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీంట్లో అర కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి, వడకట్టాలి. గ్లాసులో పోసి సేవించాలి. గుమ్మడికాయ జ్యూస్ కావల్సినవి: ఆప్రికాట్స్ – 10; నీళ్లు – ఒకటిన్నర కప్పు; యాపిల్ జ్యూస్ – 2 కప్పులు; దాల్చిన చెక్క – చిన్నముక్క; అల్లం – చిన్న ముక్క, నిమ్మరసం – టీ స్పూన్ తయారీ: గుమ్మడికాయ పై తొక్క నుంచి మెత్తటి ముక్కను వేరు చేయాలి. గింజలను తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేయాలి. దీనికి పంచదార/బెల్లం/తేనె/ యాపిల్ జ్యూస్ వాడచ్చు. దీంట్లో జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి, అల్లం తరుగు, నిమ్మరసం కలపాలి. కూలింగ్ కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి వేయాలి. బీరకాయ జ్యూస్ కావల్సినవి: బీరకాయ – 1; పుదీనా ఆకులు – 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; నల్లుప్పు – తగినంత ఉప్పుకు బదులుగా తియ్యగా కావాలనుకునేవారు తేనె కలుపుకోవచ్చు. తయారీ: బీరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన , కొత్తిమీర, నిమ్మరసం, నల్లుప్పు, మిరియాల పొడి వేసి మళ్లీ మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోయాలి. చల్లగా కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి కలుపుకోవచ్చు. దొండకాయ జ్యూస్ కావల్సినవి: దొండకాయలు – 4; ఉసిరి ముక్కలు – 3; అల్లం – చిన్నముక్క; పుదీనా ఆకులు – 15; కొత్తిమీర తరుగు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత; నల్లుప్పు – తగినంత జీలకర్రపొడి – టేబుల్ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్ స్పూన్లు; ఐస్‌క్యూబ్స్ – తగినన్ని తయారీ: దొండకాయలను శుభ్రం చేసి చిన్నముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్జార్లో దొండకాయ ముక్కలు, అల్లం తరుగు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బ్లెండ్ చేయాలి. దీనికి కప్పు నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో ఐస్‌క్యూబ్స్ వేసి అందించాలి. దోసకాయ/కీరా జ్యూస్ కావల్సినవి: దోసకాయ/ కీరా – ఒకటి; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పుదీనా – 10; ఉప్పు – తగినంత; నిమ్మరసం – పావు టీ స్పూన్ తయారీ: దోసకాయ కడిగి, పై తొక్క తీసి ముక్కలు చేయాలి. ఈ ముక్కలను మిక్సర్జార్లో వేసి పుదీనా, జీలకర్రపొడి, ఉప్పు, నీళ్లు కలిపి బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో పావు టీ స్పూన్ నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి. కూల్‌గా కావాలనుకునేవారు ఐస్‌క్యూబ్స్ వాడచ్చు. కాకరకాయ జ్యూస్ కావల్సినవి:కాకరకాయలు – 5, నీళ్లు – గ్లాసుపసుపు – చిటికెడుఉప్పు – తగినంతనిమ్మరసం – టీ స్పూన్ తయారీ:కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్ చేయాలి. గ్లాసు నీళ్లలో కట్ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేసి, రసం పిండాలి. ఈ రసానికి నీళ్లు కలిపి, దీంట్లో నిమ్మరసం కలిపి సేవించాలి. అధికబరువు, మధుమేహం, ఆస్త్మా వంటి సమస్యలకు కాకరలోని ఔషధాలు అమోఘంగా పనిచేస్తాయి. -
రసాన్ని లాగేస్తుంది
మాంసాహారులకైనా.. శాకాహారులకైనా.. నిమ్మకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. పులిహోరలోకైనా, బిర్యానీలోకైనా నిమ్మకాయ లేకుంటే ఎలా..? అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఉదయాన్నే కావలసిన నిమ్మరసంలోకి నిమ్మకాయే లేకపోతే ఎలా..? ఒకటా? రెండా? నిమ్మకాయ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. దీనివల్ల కలిగే మేలు ఎంతున్నా.. ఓ సమస్య కూడా ఉంది. అదేనండీ.. దాన్ని పిండి, రసం తీయాలంటే మాత్రం కాస్త కష్టమే. మార్కెట్లోకి రసం తీసే ఎన్ని పరికరాలొచ్చినా... కాస్తో కూస్తో రసం అందులో ఉండిపోక తప్పదు. అందుకే ఈసారి నుంచి ‘సిట్రస్ స్ప్రేయర్’ను వాడండి. ముందుగా నిమ్మకాయ తొడిమను తీసి, ఈ స్ప్రేయర్‌ను దాంట్లోకి గుచ్చి, పైనున్న బటన్‌ను ప్రెస్ చేస్తే సరి. నిమ్మరసం కాయలోంచి డెరైక్ట్‌గా మీ సలాడ్లోకే వచ్చేస్తుంది. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి. ఈ స్ప్రేయర్‌తో ఒక్క నిమ్మరసాన్నే కాదు.. బత్తాయిలాంటి పండ్లరసాలనూ ఏమాత్రం వృథా కాకుండా లాగేయవచ్చు. -
ఈ ఐస్.. మహా వేస్ట్..
తెల్లటి చల్లదనం వెనుక భయంకర నిజాలు తయారీలో పాటించని ప్రమాణాలు జనం ప్రాణాలతో చెలగాటం సిటీబ్యూరో: మండుటెండలో ప్రయాణించేవారు ఉపశమనం పొందాలంటే కడుపులో చల్లగా ఏదన్నా పడాల్సిందే. ఇందుకు ముందుగా కనిపించేది రోడ్డుపక్కన పళ్లరసాల దుకాణం లేదా చెట్టుకింద చెరుకురసం బండి. తెల్లటి ఐస్ వేసి తీయటి రసం చల్లగా గొంతులోకి జారుతుంటే.. నీరసించిన దేహానికి కొత్త ఉత్తేజం వస్తుంది. జ్యూస్ తాగడం ఓకే.. కానీ అందులో వేసి ఐస్‌తోనే అసలు సమస్య. ఎందుకంటే అందులో ఈ ఐస్‌తో వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందంటున్నారు వైద్యనిపుణులు. అపరిశుభ్రమైన నీటిని మానవ, జంతు సంబంధ వ్యర్థాలు కలిసినవి, నిల్వ ఉన్న నీటిని ఐస్ తయారీకి వినియోగిస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్ నగరంలోని వీధుల్లో వెలిసిన జ్యూస్ సెంటర్లలో ఉపయోగిస్తున్న ఐస్ నాసిరకంగా ఉంటుండడంతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టం సంస్థల పరిశోధనలో ఐస్ లోగుట్టు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ధర తక్కువన్న కారణమే.. ఈ మండు వేసవిలో మహానగరంలో ఐస్ హాట్ కేకులా అమ్ముడవుతోంది. దీంతో పలు పరిశ్రమలు పెద్ద ఎత్తున ఐస్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ఎక్కడా కనీస ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు లేవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి ధర కూడా తక్కువే కావడంతో చిరు వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా కొంటున్నారు. పాణాంతకంగా పరిణమించే రసాయనాలు, పాథోజెన్స్ (మానవ, జంతు సంబంధిత వ్యర్థాలు), ఇ-కోలి బ్యాక్టీరియా, సిట్రో బ్యాక్టర్, మెగ్నీషియం, నైట్రేట్ వంటి విషతుల్యాలు మార్కెట్లో లభ్యమవుతున్న ఐస్‌లో ఉన్నాయంటే నమ్మలేం. కానీ ఇది నిజమని పరిశోధనలు నిరూపించాయి. పరిశోధనలో తేలిన వాస్తవాలు ఇవీ.. నగరంలోని పలు ఐస్ శాంపిళ్లను సేకరించిన ఐహెచ్ఎస్, ఐఐపీఎంలు విస్తృతంగా పరిశోధనలు చేశాయి. వీటిలో మెగ్నీషియం 100 మి.గ్రా. కన్నా అధికంగా కనిపించింది. కొన్నింట 200 మి.గ్రాలు దాటిందంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. కాలుష్య నీటిలో ఇ-కోలి బ్యాక్టీరియా 1 పీపీఎం కన్నా అధికంగా ఉన్నట్లు రుజువైంది. మానవ దేహంలో ఆక్సిజన్ సరఫరాను నిరోధించే అమ్మోనియం నైట్రేట్ స్థాయి 8 మి.గ్రాలు కనిపించింది. విసర్జితాల్లో ఉండే కోలిఫాం బ్యాక్టీరియా, యూరియా, పాథోజెన్స్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించినట్లు తెలిసింది. పాథోజెన్స్ స్థాయి 176 మి.గ్రా.లున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. జాగ్రత్త లేకుంటే రోగాలు.. బ్యాక్టీరియా, రసాయనాలు కలిసిన ఐస్‌తో చేసిన ద్రవాలు తాగిన వారు కలరా, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు, గొంతు సంబంధిత సమస్యలు ప్రబలే అవకాశాలున్నాయి. వాంతులు, విరేచనాలు, నిస్సత్తువ ఆవహిస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐస్ లేకుండా జ్యూస్ తాగడమే మేలు. - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
కూల్‌డ్రింక్స్‌తో శరీరం చల్లబడుతుందా?
అవాస్తవం అపోహ: వేసవిలో కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వాస్తవం: చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫరిక్ యాసిడ్‌తో కాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనల నివేదికలు చెబుతున్నాయి. పైగా కూల్ డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాల (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందట. అందుకే కూల్‌డ్రింక్స్‌కు బదులు తాజా పళ్లరసాలు, మజ్జిగ, క్యారట్ జ్యూస్, టొమాటో జ్యూస్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం మేలు. ఒకవేళ కూల్‌డ్రింక్స్ తాగాల్సి వచ్చినా వాటిని చాలా తక్కువ పరిమితిలో ఎప్పుడో ఒకసారి తాగాలి. ముఖ్యంగా పిల్లలకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా పళ్లరసాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది. -
నీళ్లని జ్యూస్‌గా మారుస్తుంది!
రోజులో ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిదని చెబుతుంటారు డాక్టర్లు. కానీ కొంతమందికి అది ఇష్టం ఉండదు. అన్ని నీళ్లు ఎవరు తాగుతారు అనుకుంటారు. అలాంటివాళ్లకి నీటి మీద ఆసక్తిని, ఇష్టాన్ని పుట్టిస్తుందీ వాటర్ బాటిల్. దీన్ని ఇన్‌ఫ్యూజింగ్ వాటర్ బాటిల్ అంటారు. మొదట సీసాలో నీళ్లు నింపాలి. తరువాత... ఈ బాటిల్ మూతకు ఉన్న ఒక గొట్టం లాంటి దానిలో... మనకు ఇష్టమైన పండ్ల ముక్కలు వేసి మూతను సీసాకు బిగించాలి. దీన్ని ఇలా కాసేపు ఉంచితే... ఆ గొట్టానికున్న అతి చిన్న రంధ్రాల ద్వారా పండ్ల రసం కొద్దికొద్దిగా నీటిలో కలుస్తుంది. వాటి వాసన నీటికి అంటు కుంటుంది. దాంతో నీళ్లు తాగినా జ్యూస్ తాగిన ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా స్కూలుకు తీసుకెళ్లడానికి పిల్లలకు ఇవి ఇస్తే... సరదా పడి అయినా నీళ్లన్నీ తాగేస్తారు. ఈ బాటిల్ ధర ఒక్కోటీ రూ. 300 పైనే పలుకు తోంది. భవిష్యత్తులో తగ్గే అవకాశం లేకపోలేదు. ఆన్లైన్లో అయితే డిస్కౌంట్స్ ఉంటాయి. -
ఓ మై డాగ్..
గ్రీకు భాషలో ‘జ్యూస్’ అంటే ఏమిటో తెలుసా? దేవుడని. ఈ దేవుడు నా దగ్గరకు వచ్చి ఇది ఎయిత్ ఇయర్. అమెరికాలో ఉన్నప్పుడు 10థౌజండ్ డాలర్స్ ఖర్చుతో.. త్రీ మంత్స్ వయసులో నా ఒడిలో పడింది. ‘వైర్హెయిర్ పాయింటిన్ గ్రిఫాన్’ అనేది దీని బ్రీడ్. మన దేశంలో నా దగ్గర మాత్రమే ఉందీ బ్రీడ్. ఇప్పుడు అదే నా ప్రపంచం అయింది. ఇల్లంతా గిర్రున అది తిరుగుతుంటే... నేను రాగానే హైస్పీడ్‌లో వచ్చి నన్ను చుట్టేసుకుంటుంటే... వావ్... ఆ ఫీలింగ్ చెప్పలేను. మీకో విషయం తెలుసా? మేమిద్దరం కలిసి ‘చందమామ కథలు’లో కలసి నటించాం కూడా. - మంచులక్ష్మి -
స్మార్ట్ కప్పు.. తాగేది గుట్టు విప్పు..
వాషింగ్టన్: మనం తాగే జ్యూస్‌లోనో, డ్రింక్లోనో ఎంత మొత్తంలో కేలరీలు ఉన్నాయో తెలిస్తే ఎంత బావుంటుంది. ఇదే ఆలోచనతో మార్క్ వన్ అనే అమెరికా కంపెనీ ఒక స్మార్ట్ కప్పు ‘వెసిల్’ను తయారుచేసింది. కప్పులో మనం ద్రవం పోసిన వెంటనే అది ఏమిటి, పరిమాణం ఎంత, పోషకవిలువలు ఏమిటి, రుచి ఎలాంటిది అనే వాటితో పాటు చక్కెర పరిమాణం కూడా ఈ కప్పులో ఉన్న సెన్సార్లు గుర్తించి వెంటనే కప్పుపైనే ప్రదర్శిస్తాయి. అంతేగాక దీనికి అనుసంధానించిన మొబైల్ యాప్.. మన శరీరంలో ప్రొటీన్, కెఫీన్ల స్థాయి ఎంత ఉందో, ఏ మాత్రం పరిమాణం తీసుకోవాలో కూడా చెబుతుందట. నిర్దేశిత సమయంలో మన శరీరంలో కేలరీలు ఎంత ఖర్చు అయ్యాయో కూడా మన స్మార్ట్ కప్పు చెప్పేస్తుందట. మన ఫిట్నెస్ను కంట్రోల్లో పెట్టే ఈ కప్పు నిజంగానే సూపర్ స్మార్ట్ కదా. అందుకే దీనిని మార్కెటింగ్ చేయడానికి ఆ కంపెనీ సీఈఓ జస్టిన్ లీ ఫిట్నెస్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మార్కెట్లోకి వచ్చే సరికి స్మార్ట్ కప్పు ఖరీదు రూ. 12 వేలు ఉండొచ్చని అంచనా. -
పిల్లలూ.. ఆరోగ్యం పదిలం
- చిన్నారులను ఎండలో తిరగనివ్వొద్దు - ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి సూర్యాపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్, వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఒక్కటే ఉక్కపోత.. వడగాలులు. పెద్దలే.. ‘వామ్మో ఏం ఎండలు బాబోయ్’ అంటున్నారంటే.. ఇక చిన్నారుల పరిస్థితి ఎలాఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈకాలంలో పిల్లలు అనారోగ్యంబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా. వడదెబ్బ.. వడదెబ్బ తగిలితే మూర్చపోతారు. జ్వరం తీవ్రమవుతుంది. అప్పుడు తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. తేలికపాటి దుస్తులు వేయాలి. అవసరాన్ని బట్టి వైద్యుడిని సంప్రదించాలి. విష జ్వరం.. ఎండలో తిరిగితే విషజ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల నుంచి 104 డిగ్రీలకు చేరుతు ంది. జ్వరం తగ్గకపోతే ఐస్ ముక్కలను పిల్లల చంక మధ్యలో పెట్టాలి. చల్లని నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని ప్రతి పది నిమిషాలకోసారి తుడవాలి. వదులుగా ఉండే దుస్తులు వేయాలి. చికెన్ ఫాక్స్.. జ్వరంతో ఒళ్లంతా దురదగా ఉంటుంది. ఇలాంటి పిల్లలను వారం పాటు ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి. పొంగు.. ఒళ్లంతా చిన్నచిన్న దద్దుర్లు.. కళ్లు ఎర్ర బడడం.. ఈ వ్యాధి లక్షణాలు. తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జాగ్రత్తలు పాటించాలి పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉంచాలి. గుడ్లు, మాంసాహారం తగ్గిం చాలి. కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు ఎక్కువగా అందించాలి. నిమ్మరసం కలిపిన ద్రావణాన్ని చిన్నాపెద్దా తేడా లేకుండా తీసుకోవడం మంచిది. చంటి పిల్లలకు తల్లిపాలే పట్టించాలి. రోజూ గ్లాస్ నీటిలో రెండు చెంచాల చక్కెర, పావు చెంచా ఉప్పు కలిపిన నీటి ని అందించాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం నాలుగు గం టల వరకు ఎండలో తిరగకుండా చూడాలి. ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. జ్యూస్, కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి అంత గా మంచివి కావు. నీటి ని వేడిచేసి చల్లార్చి తాగించడం చాలా మంచిది. - పి.నారాయణరావు, పిల్లల వైద్యనిపుణులు, సూర్యాపేట