ప్లేట్లెట్స్‌ బదులు బత్తాయి జ్యూస్‌.. బిగ్‌ ట్విస్ట్‌ | Hospital Accused UP Official Said Poorly Preserved Platelets Not Juice | Sakshi
Sakshi News home page

ప్లేట్లెట్స్‌ బదులు బత్తాయి జ్యూస్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published Wed, Oct 26 2022 7:25 PM | Last Updated on Wed, Oct 26 2022 7:43 PM

Hospital Accused UP Official Said Poorly Preserved Platelets Not Juice - Sakshi

లక్నో: కలకలం రేపిన ప్లేట్లెట్స్‌ బదులు పండ్లరసం పేషెంట్‌కు ఎక్కించి.. అతని మరణానికి కారణమయ్యారనే ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పేషెంట్‌కు ఎక్కించింది బత్తాయి రసం కాదని.. అది ప్లేట్లెట్స్‌ యూనిట్‌లేనని అధికారులు తేల్చారు. 

ఈ మేరకు ప్రయాగ్‌రాజ్‌ కలెక్టర్‌  సంజయ్‌ ఖత్రీ మాట్లాడుతూ.. ఆ రోగికి ఇచ్చింది బత్తాయి రసం కాదని చెప్పారు. పేషెంట్‌కు ఎక్కిచ్చింది ప్లేట్లెట్స్‌. కాకపోతే వాటిని సరిగా నిల్వ చేయలేదని కలెక్టర్‌ ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించినట్లు ఖత్రీ పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనలో ఇప్పటికే అధికారులు ఆస్పత్రిని సీల్‌ చేయడమే గాక వివరణ ఇవ్వకపోవడంతో బుల్డోజర్‌తో కూల్చివేయాలని అదేశాలు కూడా జారీ చేశారు. 

(చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్‌ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement