patient
-
బెంగాల్లో పేషెంట్‌పై డాక్టర్ అఘాయిత్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ రోగిపై డాక్టర్ చేసిన అత్యాచార ఘటన కలకలం రేపింది. నార్త్ 24 పరగణాలలోని హస్నాబాద్‌లో 26 ఏళ్ల రోగిపై అత్యాచారం చేసినందుకు కోల్‌కతా పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘ నిందితుడైన డాక్టర్ సదరు మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి లైంగిక వేధింపులను చిత్రీకరించాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియోను ఉపయోగించి మరీ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల నిందితుడు నూర్ ఆలం సర్దార్‌పై బాధిత మహిళ తన భర్తతో కలిసి.. హస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. నగరంలోని బరున్‌హాట్ ప్రాంతంలోని డాక్టర్ క్లినిక్ నుంచి పోలీసులు సర్దార్‌ను అరెస్టు చేశారు. నిందితుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మహిళా రోగి.. అపస్మారక స్థితికి తీసుకువచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు’’ అని పోలీసులు తెలిపారు.ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మహిళ రహస్య వాంగ్మూలం రికార్డ్ చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు బరున్‌హాట్ ఎస్పీ హొస్సేన్ మెహెదీ రెహ్మాన్ తెలిపారు. దీంతో కోర్టు నిందితుడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు.. గత నెలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి మరణశిక్షను తప్పనిసరి చేసే కఠినమైన కొత్త బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. -
మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?
మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ (ఎంబీసీ) అనేది తీవ్రమైన కేన్సర్ దశ. ప్రారంభ దశలో గుర్తిస్తే..చికిత్స చేయడం సులభం. పైగా ఈ వ్యాధి నుంచి బయటపడతారు కూడా. అదే స్టేజ్4 దశలో నయం కావడం కష్టం. జీవితాంత ఆ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంటే ఈ దశలో బతుకున్నంత కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఈ దశలో కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇక్కడ రోగికి కావాల్సింది మానసిక బలం. ఏ వ్యాధినైనా ఎదుర్కోవాలంటే మానసిక స్థైర్యం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్. అందులోనూ కేన్సర్‌కి స్టేజ్ 4 దశకు ఇది మరింత అవసరం అని అన్నారు. అలాంటి పేషెంట్లు మానసిక ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ ఆటను కట్టించి..మీ ఆయువుని పెంచుకోగలుగుతారని చెప్పారు. అవేంటంటే..45 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలైన నీతా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది. ప్రారంచికిత్సలో మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇవి ఆమె ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్నితీవ్రంగా ప్రభావితం చేశాయి. తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన ఎక్కువై కుంగిపోతుండేది. అప్పుడే ఆమె కేన్సర సపోర్ట్ గ్రూప్‌లో చేరి మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లతో ఆ వ్యాధితో బతకటం నేర్చుకుంది. ధైర్యంగా జీవించడం అంటే ఏంటో తెలుసుకోగలిగిందని తన పేషంట్ల అనుభవాలను గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ పాటిల్ అలాంటి రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమర్థవంతంగా ఆవ్యాధిని నిర్వహించగలరో చెప్పారు . అందుకోసం ఏం చేయాలో కూడా సవివరంగా తెలిపారు. అందుకోసం ఏం చేయాలంటే..ఎలాంటి చికిత్స అయితే మంచిదో వైద్యునితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న చికిత్సకు అనుగుణంగా ఎదరుయ్యే పరిణామక్రమాలను తట్టుకునేందుకు మానసికంగా సిద్ధం కావాలి. ఈ స్థితిలో మానసికంగా ఎదురవ్వుతున్న కల్లోలాన్ని తట్టుకునేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ల తీసుకోవడం లేదా వారితో మాట్లాడటం వంటివి చేయాలి. అలాగే మీలాంటి స్థితిలో ఉన్నవాళ్లతో మీ బాధను పంచుకోవడం వంటివి చేయాలి. ఇది ఎంతో స్టైర్యాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు ఒక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదు, మనలాంటి వాళ్లు ఎందరో ఉన్నారనే విషయం తెలుస్తుంది. మానసిక ధైర్యం కూడగట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒత్తిడిని దూరం చేసుకునేలా యోగ, మెడిటేషన్ వంటి వాటిలో నిమగ్నం కావాలి. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఈ వ్యాధితో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించడంలో సహయపడుతుంది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయండి ఇవి మనసును ఉత్సాహపరుస్తాయి. అలాగే చికిత్సకు సంబంధించి ప్రతీది తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీ చికిత్సకు సంబంధించిన దాని గురించి వైద్యులతో మాట్లాడి, భరోసా తీసుకోండి తప్ప ఆందోళన చెందేలా ప్రశ్నలతో వైద్యులను ఉక్కిరిబిక్కిరి చేసి చివరికీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్.(చదవండి: ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!) -
డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు
కామారెడ్డి టౌన్: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. -
చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్
భావ్‌నగర్: గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్‌నగర్‌లోని సిహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్‌సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్‌పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;Altercation erupts over removing shoes. A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward."#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024 -
రోగికి కావల్సిన అసలైన మందు అదే..!
ఇంట్లో ఒక్కరు అనారోగ్యం బారిన పడినవారుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆందోళన చెందుతుంటారు. జబ్బున పడిన మనిషికి ఇవ్వాల్సిన భరోసా.. సమస్యను నివారించే ఉపాయాలు.. సరైన సమయంలో రోగ నిర్ధారణ ఆవశ్యకత, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు.. ఎదుర్కొనే విధానాలు... వీటన్నింటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భరోసాగా ఉండచ్చు. ఈ ఏడాది పేషెంట్ సేఫ్టీ డే థీమ్ ‘రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేయడం.’ ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ‘రోగనిర్ధారణ అవకాశాలు మెరుగుపరచడం, పరిష్కరించడం’లో ఆగ్నేయాసియా వెనకంజలో ఉందని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ సైమా వాజెద్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ 2021–2030 అమలును అంచనా వేయడానికి గ్లోబల్ మెంబర్ స్టేట్ సర్వేలో కేవలం 47 శాతం దేశాలు మాత్రమే రోగనిర్ధారణ బాధ్యతలను తీసుకుంటున్నాయని తెలిసింది.నిర్ధారణ ముఖ్యం..ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో నిర్వహించిన సమావేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రపంచ పేషెంట్స్సేఫ్టీ డేని ప్రారంభించింది. రోగి భద్రత ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే గుర్తు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా రోగి భద్రత ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడమే ఈ సేఫ్టీ డే లక్ష్యం. ఇందులో రోగులతోపాటు వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, నాయకులు, సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. అంతేకాదు ఎన్జీవోల నుంచి నిపుణులు, రోగులు లేదా వారి కుటుంబీకులు, ప్రతినిధులను ఒకచోట చేర్చి వివిధ వ్యాధుల నిర్వహణలో ‘రోగనిర్ధారణ ప్రాముఖ్యత’ను చర్చించాలని సూచించింది.అత్యవసర సేవలుఅత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచు వింటూనే ఉన్నాం. అత్యవసర సేవలను అందించడం ద్వారా దేశంలో 50 శాతానికి పైగా మరణాలు, 40 శాతానికి పైగా రోగాల భారాన్ని తగ్గించిన వారవుతారని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య భారతం మనందరి సమష్టి బాధ్యత అని తెలియజేసింది. ‘‘మేం ఇప్పుడు 600 మంది మృత్యుముఖంలో ఉన్న పేషెంట్స్‌కు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాం. కొంతమంది హాస్పిస్‌లో ఉండి సేవలు పొందుతున్నారు. రోగులకు ఇచ్చే సేవ, సంరక్షణ భరోసాతో కూడుకున్నదైతే వారు అంతే ప్రశాంతంగానూ ఉండగలుగుతారు. మరికొందరు వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఆందోళనను తగ్గించుకోవడంతో బాటు రోగికి కావాల్సిన ప్రశాంత వాతావరణం, వాడాల్సిన మందులు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. చెప్పిన సూచనలను పాటిస్తూ ఉండటం వల్ల ఆ పేషెంట్స్ కూడా భద్రతను పీలవుతారు. అది వారి ఆయుష్షునూ పెంచుతుంది.అవగాహనతో ..వీటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు, అంటువ్యాధులకు ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబసభ్యులకు చెబుతున్నాం. కౌన్సెలింగ్స్ ఇస్తున్నాం. రొమ్ము కేన్సర్‌తో ఇటీవల ఒకామె చనిపోయింది. ఆమె కూతురుకు 22 ఏళ్లు. పెళ్లయ్యింది. కానీ, ఆమె భర్త ఈ అమ్మాయికి కూడా తల్లికి మాదిరే కేన్సర్ వస్తుందేమో అనే అనుమానంతో ఆమెను వదిలేశాడు. దీంతో ఇద్దరికీ కౌన్సెలింగ్ చేశాం. కొన్ని ముందస్తు జాగ్రత్తలు చెప్పాం. ఇప్పుడా అమ్మాయి ఆరోగ్యంగా, భరోసాతో కూడిన జీవనం గడుపుతోంది.మొదటి దశలోనే గుర్తిస్తే..వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుంది. అది ఆ పేషెంట్‌నే కాదు వారి కుటుంబాన్ని కూడా కాపాడిన సందర్భాలూ ఉన్నాయి. ముందస్తుగా చేయించుకోవాల్సిన వాక్సినేషన్లు, వాడాల్సిన మందులు, జాగ్రత్తల గురించీ వివరిస్తున్నాం. దీర్ఘకాలిక జబ్బులు, పేషెంట్స్‌ను చూసుకోవాల్సి విధానం గురించి తెలుసుకోవాలనుకునే వారికి తగిన అవగాహన కల్పించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని వివరించారు శారద లింగరాజు.మరణం అంచుల్లో ఉన్న రోగులకు తమ స్పర్శ ద్వారా భరోసాను కల్పిస్తోంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ కేంద్రం. ప్రధానంగా కేన్సర్ రోగులకు సాంత్వన కలిగిస్తున్నారు ఇక్కడి నిపుణులు, స్వచ్ఛంద సేవకులు. వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే సందర్భంగా వీరిని సంప్రదించినప్పుడు శారదా లింగరాజు చెప్పిన వివరాలు ఎంతో మంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగిస్తాయి. (చదవండి: గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!) -
రూ. 5 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం.. పదేళ్లలో రాని ఒక్క రోగి.. కారణమిదే!
ఎక్కడైనా ఆసుపత్రులను నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకొని ఉంటుంది. నిధుల సేకరణ, బిల్డింగ్‌ను కట్టడం, వైద్య పరికరాలు అమర్చడం, వైద్యులను నియమించడం, వసతులు కల్పించడం ఇలా ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. కానీ అదే ఆసుపత్రిని కట్టడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనేక జబ్బులను నయం చేయవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకంటే..బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కోట్లాది రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని అయితే నిర్మించారు కానీ గత పదేళ్లుగా అక్కడ ఒక్క రోగి కూడా వైద్యం అందలేదు. ఇందుకు ఇంకా ఆ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయకపోవడమే కారణం. అవును నిజమే..చాంద్ పురా ప్రాంతంలో ఆరు ఎకరాల్లో 30 పడకల ఆసుపత్రిని 2015లో రూ.5 కోట్లతో నిర్మించారు. అత్యాధునిక వసతులు కల్పించారు. కానీ ప్రారంభోత్సవం చేయకుండానే వదిలేయడంతో పొలం మధ్యలో శిథిలావస్థకు చేరుకుని దొంగలు, మందుబాబులుగా అడ్డాగా మారింది. అక్కడ ఒక్క రోగికి కూడా వైద్యం అందకపోవడంతో వైద్య పరికరాలు పాడైపోయాయి. ఆసుపత్రిని నిర్మించి పదేళ్లు కావస్తున్నా దీనినివైద్యారోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకోలేదని, ఈ సౌకర్యాల గురించి అసలు తమకు తెలియదని అధికారులు చెబుతుండటం గమనార్హం.ఈలోపు దొంగలు ఆసుపత్రి కిటికీలు, డోర్ ఫ్రేమ్‌లు, తలుపులు, గ్రిల్స్, గేట్లు, కప్బోర్డ్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో ఆసుపత్రి ఓ అస్థిపంజరంలా మిగిలిపోయింది. ఆసుపత్రి క్యాంపస్‌లో మూడు భవనాలు ఉండగా.. ఆరోగ్య కార్యకర్తల నివాసం, పరీక్షా కేంద్రం, ప్రధాన భవనాలుగా నిర్మించారు.#Bihar Hospital Abandoned for 10yrs Becomes Haven for Thieves Government hospital in #Muzaffarpur Bihar built in 2015 at cost of ₹5 Crs, has never been inaugurated or opened for patients. The 30-bed hospital, equipped with modern facilities, has been left to deteriorate, with… pic.twitter.com/In9CAFQZW3— Nabila Jamal (@nabilajamal_) September 6, 2024ఆసుపత్రి నానాటికీ క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం నగరవాసులు నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు లక్ష జనాభా నివాసం ఉంటుంది. ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు, దాని గొప్పతనాన్ని చూసి, చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇకపై నగరానికి 50 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం లేదని భావించారు. కానీ ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు తెరుచుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు నగరానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయంపై సబ్ డివిజనల్ ఆఫీసర్ షెరియాను ఆరా తీయగా.. ఆసుపత్రి గురించి తనకు తెలియదని, పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. సివిల్ సర్జన్, సర్కిల్ అధికారి వారి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు. -
మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. కేర్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు వైద్య ఖర్చులు కోసం పేషెంట్ బంధువులు రూ.5 లక్షలు చెల్లించారు.నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికే మృతిచెందారు. విషయం చెప్పకుండా మరో రూ.4 లక్షలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అనుమానంతో ఐసీయూలోకి దూసుకెళ్లిన బంధువులు.. వెంకటేష్ మృతిచెంది ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. -
నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌కు సంబంధించి వెలువడిన తాజా నివేదిక మరింత దడ పుట్టిస్తోంది. 2023లో ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్ఐవి వైరస్‌ను ప్రపంచంలోని సుమారు నాలుగు కోట్ల మందిలో గుర్తించారు. వీరిలో 90 లక్షల మంది వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్స పొందలేకపోయారు. ఫలితంగా ప్రతి నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతిచెందాడని వెల్లడయ్యింది.ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసే దిశగా పురోగతి సాధిస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరంగా పరిణమించింది. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదిక తెలిపింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలలో ఎయిడ్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాది ఎయిడ్స్ కారణంగా ఆరు లక్షల మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు2023లో దాదాపు 6,30,000 మంది ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మృతిచెందారు. యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమా మాట్లాడుతూ 2030 నాటికి ఎయిడ్స్‌ను అంతం చేస్తామని ప్రపంచ నాయకులు ప్రతిజ్ఞ చేశారని, అయితే 2023లో కొత్తగా13 లక్షలకు పైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని అన్నారు. -
నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. ఇంజక్షన్ వికటించి..
అనకాపల్లి, సాక్షి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. వివిధ అనారోగ్య సమస్యలో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం వైద్యులు మంగళవారం రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్లు ఇచ్చారు.ఆ ఇంజక్షన్లు తీసుకున్న 17 మంది కొద్ది సేపటికే వాంతులు, వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్యే పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం డి ఎల్ పురం, ఉపమాక్ తదితర గ్రామాలకి చెందిన వారని సమాచారం. -
స్టెతస్కోప్ తగ్గిందా?
డాక్టర్ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్ వేసుకునో, దానితో చెక్ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్‌ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్ పల్స్, హార్ట్‌బీట్ తెలుసుకునేందుకు డిజిటల్ పరికరాలు వచ్చేశాయి.దీనితో స్టెతస్కోప్‌తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్లో ‘ఏఐ, హెల్త్‌కేర్’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్‌ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ఇదే తొలిసారి కాదు.. స్టెతస్కోప్ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్ చనిపోయింది’అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ రీడ్ థామ్సన్ మాత్రం దీన్ని ఖండించారు.మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యవాన్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్‌ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్‌లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్‌తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్ పింటో చెప్పారు.స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనిపెట్టారు?స్టెతస్కోప్‌ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్ డాక్టర్ రీన్ లానెక్ కాగితాన్ని ట్యూబ్‌లా చుట్టి స్టెతస్కోప్‌లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో స్టెతోస్ అంటే ఛాతీ అని.. స్కోపీన్ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్‌లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్ లీర్డ్ అనే ఐరిష్ డాక్టర్ కాస్త మెరుగైన స్టెతస్కోప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్‌ను లిట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు.పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్‌తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్ మర్మర్) కాంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్, మెడికల్ ఆఫీసర్స్టెత్కు ఎప్పటికీ వన్నె తగ్గదు స్టెతస్కోప్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్‌గా స్టెతస్కోప్‌తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్ కచి్చతత్వం ఎప్పుడూ మారదు. – శిరందాస్ శ్రీనివాసులు, నిమ్స్ రేడియోగ్రాఫర్ అత్యవసర సమయాల్లో దానితోనే మేలు అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్ అమర్చే సమయంలో పైప్ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్‌తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్ లేనిదే పనికాదు. – విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..
ఓ వృద్దుడు అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నూటికి ఒక్కరికి వచ్చే సమస్యతో నరకం చూశాడు. పాపం ఈసమస్యతో తినడం కూడా మానేశాడు. దీంతో రోజుల వ్యవధిలోనే ఐదు కిలోలు బరువు తగ్గిపోయాడు. వైద్యులు సైతం అతడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఇంతకీ అతడికీ ఏం వ్యాధి వచ్చిందంటే..90 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా అత్యంత అరుదైన విరామ హెర్నియాతో బాధపడ్డాడు. దీని కారణంగా కడుపు ఛాతీ భాగంలోకి చొచ్చుకు వచ్చి.. తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేసేది. ఇక్కడ పొట్టలో ఆహారం ఇమడక వెనక్కి వాంతి రూపంలో వచ్చేటప్పుడూ ఉండే బాధకు తాళ్లలేకపోయాడు. దీంతో అతడు తినడమే మానేశాడు. దెబ్బకు ఆ వృద్ధుడి కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 కిలోల మేర బరువు తగ్గిపోయాడు. ఇక్కడ హెర్నియా అనేది సాధారణ సమస్యే. ఒక అవయవం లేదా కణజాలం బలహీనమైన ప్రదేశం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల కండరాలు లేదా బంధన కణజాలంలో చిరిగిపోయినప్పుడు అవి సంభవిస్తాయి. హెర్నియాలు తరచుగా ప్రాణాంతకం కానప్పటికీ, అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఈ వృద్ధుడికి వచ్చిన పరిస్థితి కాస్త క్రిటికల్.అతని కడుపులోని కొంత భాగం డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా ఛాతీలోకి నెట్టబడి ఊపిరితిత్తు కుదించుకుపోయేలా తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. దీన్ని సివియర్ హయాటల్ హెర్నియా అనిపిలుస్తారు. ఇక్కడ వృద్ధుడి అధిక వయసు రీత్యా చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. డయాఫ్రాగమ్ లోపంను మూసి వేసి కడుపుని ఉదరకుహరంలోకి యథావిధిగా అమర్చారు. సదరు వృద్ధుడు కోలుకోవడమే గాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు కూడా.(చదవండి: అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!) -
కేరళలో పెరుగుతున్న గవదబిళ్లల కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
కేరళలో గవద బిళ్లల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 190 కేసులు నమోదయ్యాయి. దీంతో నేషనల్సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. గత నెలలో దాదాపు 2,500 కేసులు దాక నమోదయ్యినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా వివిధ ప్రాంతాల రాష్ట్రాల పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గవద బిళ్లలు ఎందుకొస్తాయి? నివారణ ఏంటీ? తెలుసుకుందామా!. ఈ గవద బిళ్లలు ముఖ్యంగా పిల్లలు, యువకులను ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది రుబులవైరస్ కుటుంబానికి చెందిన పారామిక్సోవైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్‌కి మానవులు మాత్రమే అతిధేయులు. ఇది బాధితుడి నోటి నుంచి వచ్చే నీటి తుంపరల ద్వారా సంక్రమిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, లేదా మాట్లాడేటప్పుడు నోటి తుంపరల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా చెవులు చుట్టూ ఉన్న రెండు ప్రాంతాల్లో బాధకరమైన వాపుతో కూడిన జ్వరం వస్తుంది. లక్షణాలు.. గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాస్తాయి. ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపుకు గురవుతాయి దీనివల్ల ఏమీ తినలేరు తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. ఇలా ఏడు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ గవదబిళ్లలు తేలికపాటివి, దానంతట అవే వెళ్లిపోతాయి. ఒక్కోసారి యువకులలో ఎన్సెఫాలిటిస్, చెవుడు లేదా ఆర్కిటిస్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. నివారణ.. డీ హైడ్రేట్ అవ్వకుండా ద్రవాల రూపంలో ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు ఆహారం మెత్తగా తీసుకోవాలి. తగినంత బెడ్ రెస్ట్ తీసుకోవడం. వాపును తగ్గించడానికి స్క్రోటల్ సపోర్ట్, ఐస్ ప్యాక్‌లను ఉపయోగించాలి అలాగే వృషణాల వాపుతో కూడిన సందర్భాల్లో వాపును తగ్గించడానికి పరోటిడ్ గ్రంధులపై కోల్డ్ కంప్రెస్లను ఉపయోగించడం వంటివి చేయాలి. నొప్పి, వాపును తగ్గేందుకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే స్టెరాయిడ్స్ వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గవదబిళ్ళకు చికిత్స.. ప్రస్తుతం, గవదబిళ్ళకు నిర్దిష్ట చికిత్స లేదు. చాలా చికిత్సా ఎంపికలు ద్రవాలు ఎక్కువగా తాగడం, కోల్డ్ కంప్రెస్ చేయడం, సులభంగా జీర్ణమయ్యే మెత్తని ఆహారాలు తీసుకోవడం. ఉప్పు నీటితో పుక్కిలించడం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. ఇక దీని బారిన గర్భిణీ స్త్రీలు పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. (చదవండి: ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు..ఆ ఇద్దరు మహిళలు!) -
కొద్ది స్పేస్‌లోనే హ్యాపీగా చేసుకునే 'హోమ్ జిమ్ మెషిన్'!
‘తిండి కలిగితే కండగలదోయ్’ వాక్యానికే పరిమితం కాలేదు ఈ నలుగురు మిత్రులు. ‘కండకు జిమ్ కూడా కావాలోయి’ అంటున్నారు. ‘రోజూ జిమ్‌కు వెళ్లడానికి తిరిగి అక్కడి నుంచి రావడానికి బోలెడు సమయం తీసుకుంటుంది. అలా అని ఇంట్లోనే జిమ్ సెట్ చేసుకుందామా అంటే స్పేస్ ప్రాబ్లం’ అనుకునేవాళ్లకు ‘అరోలీప్ ఎక్స్’ రూపంలో పరిష్కారం చూపారు దిల్లీ, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అమన్రాయ్, అనురాగ్ డానీ, రోహిత్ పటేల్, అమల్జార్జ్. చిన్న స్థలాలలోనే ఏర్పాటు చేసుకునే స్మార్ట్ హోమ్ జిమ్‌ను తయారుచేసి, ఈ టెక్నాలజీపై పేటెంట్ పొందారు. ‘అరోలీప్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలు పెట్టి విజయం సాధించారు. అంతర్జాతీయ విపణిలోకి అడుగు పెట్టనున్నారు... కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(ఐఐటీ, దిల్లీ) అయిన అమన్ రాయ్ అల్ట్రా మారథాన్లు నిర్వహించడంలో దిట్ట. అయితే కెరీర్ ప్రారంభించిన తరువాత ఉద్యోగ బాధ్యతలు, జిమ్‌కు వెళ్లడం మధ్య సమన్వయం కుదరడానికి కష్టపడాల్సి వచ్చేది. బెంగుళూరులోని అద్దె ఇంట్లో స్థల సమస్య వల్ల ఎక్సర్సైజ్కు సంబంధించి లిమిటెడ్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉండేది. ఇక అనురాగ్ డానీకి ఆఫీసు పనిభారం వల్ల జిమ్‌కు వెళ్లడం అనేది కుదిరేది కాదు. రోబోటిక్ గ్రాడ్యుయెట్స్ అయిన రోహిత్ పటేల్, అమల్ జార్జ్ల పరిస్థితి కూడా అంతే. రకరకాల సమస్యలకు పరిష్కారాలు వెదకడానికి రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన అమన్, అనురాగ్, రోహిత్, అమల్లు జిమ్‌కు వెళ్లడానికి తాము ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టి పెట్టారు. హోమ్ జిమ్ ఎక్విప్మెంట్లు పెద్దవిగా ఉంటాయి. ఖరీదైనవి. తగినంత స్థలం కావాలి. ‘ఇంట్లో వ్యాయామాలు చేయడానికి వేర్వేరు బరువులు ఉన్న ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తూ ఉండాలి. ఇవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. అద్దె ఇండ్లలో, చిన్న అపార్ట్మెంట్లలో ఇది కష్టం. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నాం’ అంటారు నలుగురు మిత్రులు. కొత్తగా డిజిటల్–వెయిట్స్ టెక్నాలజీ ఊపందుకుంటున్న టైమ్ అది. ఫిజికల్ వెయిట్స్‌ను రిప్లేస్ చేసే డిజిటల్ టెక్నాలజీ కోసం ప్రయోగాలు ప్రారంభించారు. రకరకాల ప్రోటోటైప్‌లు బిల్డ్ చేయడం కోసం పాతిక లక్షల వరకు వెచ్చించారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఈ నలుగురు మిత్రులు లిమిటెడ్ స్పేస్‌లో ఉపయోగించుకోగలిగే రూపొందించారు. పదిహేను ప్రోటోటైప్‌ల తరువాత వారి కృషి ఫలించింది, ఈ స్మార్ట్, వాల్–మౌంటెడ్ జిమ్ ఎక్విప్మెంట్ ‘అరోలీప్ ఎక్స్’లో వందగంటల ఫిట్నెస్ కంటెంట్ ఉంటుంది. మూమెంట్స్‌ను ట్రాక్ చేస్తుంది. సంబంధిత డాటాను మ్యాపింగ్ చేస్తుంది. డాటా–డ్రైవెన్ వర్కవుట్స్ కోసం ఈ స్మార్ట్ ఎక్సర్సైజ్ మెషిన్ మోటర్–పవర్డ్ ఎలక్ట్రోమాగ్నటిక్ రెసిస్టెన్స్‌ను ఉపయోగిస్తుంది. జిమ్‌లో చేసే ప్రతి వర్కవుట్కు ఈ మెషిన్‌ను ఉపయోగించవచ్చు. ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ డిజైన్ చేసిన గోల్–బేస్డ్ వర్కవుట్ ప్రోగ్రామ్స్‌ను ఈ మెషిన్ అందిస్తుంది. ‘అరోలీప్ ఫిట్నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టారు. ఫ్రెండ్స్‌ను ఆహ్వానించి ట్రయల్స్ మొదలుపెట్టారు. తమ ప్రాడక్ట్ తాలూకు వీడియోలను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వ్యాయామ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని మంత్లీ సబ్స్క్రిప్షన్లు మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత ఫస్ట్ కస్టమర్స్ తమ ఫీడ్‌బ్యాక్‌ను కంపెనీ ఫౌండర్లకు ఇచ్చారు. తమ ప్రాడక్ట్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి, మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఫీడ్‌బ్యాక్ వారికి ఉపయోగపడింది.ప్రాడక్ట్‌కు పాజిటివ్ టాక్ రావడం మాట ఎలా ఉన్నా ఇన్వెస్టర్లు దొరకడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ ‘జెరోదా’ సీయివో నిఖిల్ కామత్‌కు మెసేజ్ పెట్టాడు. వీరు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి ప్రోటోటైప్లను పరిశీలించి ఇంప్రెస్ అయ్యాడు నిఖిల్ కామత్. ఫస్ట్ ఏంజెల్ ఇన్వెస్టర్ అయ్యాడు. ఆ తరువాత మరో ముగ్గురు ఇన్వెస్టర్లు వచ్చారు. మాన్యుఫాక్చరింగ్ కోసం బెంగుళూలో చిన్న స్థలం ఏర్పాటు చేసుకొని ‘అరోలీప్ ఎక్స్’లను అమ్మడం మొదలుపెట్టారు. దేశీయంగా విజయం సాధించిన ‘అరోలీప్ ఎక్స్’ ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. ‘ఫిట్నెస్ సింపుల్ అండ్ యాక్సెసబుల్ అనేది మా నినాదం. లక్ష్యం’ అంటున్నారు నలుగురు మిత్రులు. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
‘పోకిరి’ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసేశారు..
గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు. -
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 760 కరోనా కేసులు!
కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చైనాతో సహా అనేక దేశాలలో కరోనా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. భారతదేశంలో గత 20 రోజులుగా ప్రతిరోజూ కొత్తగా సగటున 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 760 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారితమయ్యింది. జేఎన్-1 వేరియంట్ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423కు చేరింది. కరోనా ముప్పు పెరుగుతోందని, దీని నివారణకు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) తెలిపింది. -
సర్జరీ చేస్తున్న టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్
ఓ వైద్యుడు విచక్షణ మరిచి సర్జరీ చేసే సమయంలో పేషెంట్‌పై దాడికి దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. అతను అలా దాడి చేయడంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని సదరు ఆస్పత్రి బాధితుడికి నష్ట పరిహారం కూడా చెల్లించినట్లు సమాచారం. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..2019లో జరిగిన ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లు చైనా పేర్కొంది. దీనిపై ఇప్పుడు చైనా అధికారులు కూలంకషంగా ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు చైనా అధికారులు వెల్లడించారు. బాధితురాలు ఆక్టోజెనేరియన్ అనే 82 ఏళ్ల మహిళ కంటి ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెకు అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తుండగా, ఆమె అసహనంతో కదలిపోవడం ప్రారంభించింది. ఐతే రోగికి స్థానికి మాండలిక భాష మాత్రేమ తెలుసు. పాపం వైద్యుడికి ఆ భాషలో అంత ప్రావిణ్యం లేదు. అందువల్లో ఇరువరి మధ్య కమ్యూనికేషన్ కాస్త ఇబ్బందిగా మారింది. ఓ పక్క సర్జరీ టైంలో పేషెంట్ కనుబొమ్మలు కదిలించడం వంటివి చేశాడు. వైద్యుడు చెబుతున్నవేమి రోగికి అర్థంగాక అదేపనిగా కదలడంతో అసహనం చెందిన వైద్యుడు కొట్టడం జరిగింది. దీంతో ఆమె ఎడమ కన్ను పైభాగంలో గాయలయ్యాయి. అందుకు సదరు ఆస్పత్రి దాదాపు 500 యువాన్లు(రూ. 60, వేలకు పైనే) వరకు నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సదరు వైద్యుడిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా ఆ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతుండటంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో చైనా అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితురాలి కొడుకు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ..ఆ డాక్టర్ దూకుడు ప్రవర్తన కారణంగా ఎడమ కన్ను పైభాగంలో కూడా గాయలయ్యాయిని, ఐతే ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు సదరు ఆస్పత్రి సీఈవో, ఆ వైద్యుడిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించారు. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో అలాంటి అనుచిత ప్రవర్తన తగదని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చైనా అధికారులు వెల్లడించారు. (చదవండి: బ్లూ సీ డ్రాగన్! చూడటానికీ అందంగా ఉందని టచ్ చేశారో అంతే..!) -
దేశంలో కొత్తగా 88 కరోనా కేసులు.. 400 మందికి చికిత్స!
గతంలో కరోనా వైరస్ విజృంభణతో దేశం అతలాకుతలమైపోయింది. లక్షల మంది మృత్యువాత పడ్డారు. వ్యాక్సినేషన్ తర్వాత కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ మహమ్మారి ఇంకా మన మధ్య నుంచి పోలేదు. భారత్‌లో కొత్తగా 88 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 396 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,33,300. కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,68,407కు పెరిగింది. దేశంలో కరోనా నుండి కోలుకున్నవారి శాతం 98.81 కాగా, మరణాల రేటు 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందించారు. కాగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో కరోనా పాజిటివ్‌తో ఒక మహిళ మృతి చెందింది. ఇది కూడా చదవండి: భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది? -
పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..
రోగుల ప్రాణాలు కాపాడే వైద్యుడైన మృత్యువుకి బలవ్వాల్సిందే. ఒక్కొసారి మృత్యువు ఎలా వస్తుందో తెలియదు. చూస్తుండగానే కబళించేసి తన పని చేసుకుని వెళ్లిపోతుంది. తేరుకునేలోపే కథ అయిపోతుంది అదే కథ జీవితం!. అసలేం జరిగిందంటే..ఓవైద్యుడు పేషెంట్‌కి చికిత్స చేస్తూ కుప్పకూలిపోయాడు. ఈ అనూహ్య ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది. 38 ఏళ్ల దిలీప్ కుమార్ కుష్వాహా తన క్లినిక్ రోగికి చికిత్స అందిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ వైద్యడు రోగిని తనిఖీ చేస్తుండగా ఛాతి నొప్పితో విలవిలలాడుతు కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ వైద్యుడు షాహదోల్ జిల్లాలో కేస్వాహి గ్రామంలో తన క్లినిక్ నడుపుతూనే సామాజిక సేవలో చొరవ చూపేవాడని పలువురు చెబుతున్నారు. రోగులకు ఉచిత వైద్య అందించడమేగాక ఉచితంగా మందులు కూడా ఇచ్చేవాడని సన్నిహితులు తెలిపారు. పేషెంట్ల ట్రాన్స్పోర్ట్ చార్జీలు సైతం అతనే చెల్లించేవాడని అంటున్నారు. ఈ రోజుల్లో ఇలా ప్రజలకు ఇలాంటి మెరుగైన సేవలందించే వ్యక్తే మృత్యువు కబళించడం అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. (చదవండి: వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్! మొత్తం కంటినే మార్పిడి..) -
ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది?
ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్).. దేశంలోని ఇతర ప్రాంతాలకు మించిన మౌలిక సదుపాయాలు కలిగినదిగా పరిగణిస్తారు. వాస్తవానికి ఇక్కడున్న మౌలిక సదుపాయాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలోని గురుగ్రామ్ జిల్లాలోని బంధ్‌వాడి గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది గురుగ్రామ్-ఫరీదాబాద్ హైవేపై, ఆరావళి పర్వతాల దిగువన ఉంది. ఇక్కడకు రాగానే దూరం నుంచే ఒక చెత్త కొండ కనిపిస్తుంది. దీని పరిష్కారానికి కసరత్తు జరుగుతున్నప్పటికీ, మరోవైపు దీనికారణంగా స్థానికుల ప్రాణాలు పోతున్నాయి. దాదాపు నాలుగున్నర వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ప్రతి మూడో ఇంటిలో ఒక కేన్సర్ బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న సత్పాల్ మాట్లాడుతూ ‘చెత్త కొండపై నుంచి ప్రవహించే ‘లీచెట్’ కారణంగా క్యాన్సర్ బారిన పడ్డాను. నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంటున్నాను’ అని అన్నాడు. ‘లీచెట్’ అంటే తడి చెత్త నుండి వెలువడే ద్రవ విష పదార్థం. అది భూమిలో ఇంకిపోతే ఆ నీరు తాగడానికి లేదా స్నానానికి సైతం పనికిరానిదిగా మారుతుంది. ఇక్కడ సుమారు రెండున్నరేళ్ల క్రితం పల్లపు స్థలంలో నిర్మించిన సరిహద్దు గోడ వర్షాలకు కూలిపోవడంతో ఆ స్థలంలో నిరంతరం చెత్త పేరుకుపోతూవచ్చింది. ఈ చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. గౌహతిలోని ఐఐటి బృందం తన సర్వేలో ఇక్కడ 22 లక్షల టన్నుల చెత్త ఉందని వెల్లడించింది. ఈ చెత్తనంతటినీ 2024, ఏప్రిల్ నాటికి తొలగించగలమని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. బంధ్‌వాడి భూగర్భ జలాల పరీక్షలో నీటిలో సీసం ఉండవలసిన పరిమితి కంటే 120 రెట్లు, కాడ్మియం 10 రెట్లు అధికంగా ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి? -
డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం?
దేశంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిపై 2004లో తన తండ్రి ఢిల్లీ వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశారని, తదనంతరం ఎదురైన పరిణామాలు ఇలా ఉన్నాయంటూ స్టోరీపిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు తన్మయ్ గోస్వామి ట్విట్టర్ మాధ్యమంలో పలు వివరాల తెలిపారు. తన తండ్రి విషయంలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ వైద్యపరంగా నిర్లక్ష్యం వహించారంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇందుకుగాను రూ. 80 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తన తండ్రి అభ్యర్థించారన్నారు. ఇది జరిగి11 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని, 2015లో తన తండ్రి చనిపోయారన్నారు. అయితే వృద్ధురాలైన తన తల్లి ఈ కేసును విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నదని, సుదీర్ఘ పోరాటం అనంతరం 19 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విజయం సాధించామని తెలిపారు. తొందరపాటుతో శస్త్రచికిత్స అసోంకు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 19 సంవత్సరాల పాటు ప్రముఖ వైద్యసంస్థతో న్యాయపరంగా పోరాడి ఎలా గెలిచిందనే వివరాలను తన్మయ్ గోస్వామి తెలియజేశారు. తన తండ్రి 2004లో ఈపీఎస్ డయాగ్నస్టిక్ స్టడీ కోసం బాత్రా ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఈపీఎస్ అధ్యయనం అసాధారణంగా ఉంటే, రోగితో చర్చించిన తర్వాత ఆర్ఎఫ్ఏ చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్ఎఫ్ఏ ప్రమాదకరం లేదా ప్రాణాంతకం కావడంతో దానిని వైద్యులు సిఫార్సు చేయరు. అయినప్పటికీ బాత్రా ఆసుపత్రి కార్డియాలజిస్టులు తన తండ్రితో లేదా మా కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఆర్ఎఫ్ఏ చేశారన్నారు. ఇది కూడా చదవండి: భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత! పేస్ మేకర్ సరిగా అమర్చకపోవడంతో.. అయితే ఈ చికిత్స కారణంగా తన తండ్రి ఆరోగ్యం విషమించిందని గోస్వామి తెలిపారు. దీంతో వైద్యులు తన తండ్రిని కాపాడేందుకు అతని ఛాతీలో పేస్ మేకర్ అమర్చాలని నిర్ణయించారు. దీంతో వైద్యులు తన తల్లికి ఫోన్ చేసి, వెంటనే ఢిల్లీకి రావాలని తెలియజేశారు. వారు చెప్పిన విధంగానే తన తల్లి ఢిల్లీ వెళ్లిందన్నారు. అక్కడి చికిత్స ముగిసిన కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారని, అయితే తన తండ్రి అనారోగ్యం నుంచి కోలుకోలేదన్నారు. తన తండ్రి ఛాతీ ప్రాంతం రోజురోజుకు ఉబ్బిపోవడాన్ని గమనించి, గౌహతిలో కార్డియాలజిస్ట్‌ని సంప్రదించామన్నారు. అప్పుడు ఆయన తన తండ్రిని పరీక్షించి, పేస్ మేకర్ సరిగా అమర్చలేదనే విషయాన్ని తెలిపారన్నారు. దీంతో తండ్రి ఛాతీలోని పేస్ మేకర్‌ను సరిచేయడానికి అతనికి అత్యవసరంగా అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తరువాత.. వైద్యుల సలహా మేరకు తన తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. అనంతరం ఆయన బలహీనంగా మారి, పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. అయినా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించేవారన్నారు. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని బత్రా హాస్పిటల్‌పై వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేశారన్నారు. తమ కుటుంబ న్యాయవాది ఈ కేసును చేపట్టారన్నారు. ఇది వినియోగదారుల న్యాయస్థానానికి సంబంధించిన ఉదంతం కనుక సత్వర న్యాయం జరుగుతుందని తామంతా భావించామన్నారు. చనిపోయే వరకూ న్యాయపోరాటం 2004 నుండి 2015 వరకు.. అంటే తన తండ్రి చనిపోయే వరకు కేసులోని ప్రతి విచారణ వాయిదాకు హాజరయ్యారన్నారు. కోల్‌కతా నుండి మా న్యాయవాది ఢిల్లీకి వచ్చేవారని, అతని ప్రయాణ, బస ఖర్చులను తామే భరించామని గోస్వామి తెలిపారు. ఈ విధంగా 19 సంవత్సరాల పాటు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయన్నారు. ఈ కేసు కోసం తమకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యిందన్నారు. కేసు విచారణ సమయంలో పలు కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చిందన్నారు. వీటన్నింటినీ కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. తన తండ్రి చనిపోయే వరకూ అంటే 11 సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారన్నారు. తన తండ్రి చనిపోయాక, బాత్రా హాస్పిటల్ కాస్త ఊపిరి పీల్చుకుందేమో.. కానీ మా తల్లి మాత్రం ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో తాను ఈ ఉదంతంలో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవడం మొదలుపెట్టానని గోస్వామి తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! కేసు జాప్యం వెనుక సవాలక్ష కారణాలు ఈ కేసు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం వెనుక పలు కారణాలున్నాయని గోస్వామి తెలిపారు. ఇది మెడికల్ కేసు కావడంతో వాదనకు న్యాయమూర్తులు సరిపోలేదు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ ఉపేంద్ర కౌల్ పలుకుబడి కూడా కేసు జాప్యానికి కారణంగా మారింది. దీనికితోడు ఉద్దేశపూర్వక జాప్యాలు, కోర్టు నుండి సాక్ష్యాలను ఉపసంహరించుకోవడం లాంటివి ఎదురయ్యాయన్నారు. అయితే తమ న్యాయవాది వినతి మేరకు కేసు విచారణలో స్వతంత్ర వైద్య బోర్డు అవసరమని కోర్టు కోరింది. మెడికల్ బోర్డు విచారణలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. In 2004, my dad filed a case of medical negligence against one of India's most powerful hospitals viz. Batra Hospital, Delhi and Padmashree awardee cardiologist Dr Upendra Kaul. Case was filed in the state consumer court, Delhi & my dad asked for a compensation of Rs. 80 lakh.… — Tonmoy Goswami (@protonycle) August 3, 2023 ఆధారాలను చూపలేకపోయిన ఆసుపత్రి వర్గాలు అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు తన తండ్రి ఆర్ఎఫ్ఏ చికిత్స విషయంలో తమ సమ్మతి తీసుకున్నట్లు పేర్కొంటూ బెంచ్‌ను గందరగోళపరిచేందుకు ప్రయత్నించాయి. ఇందుకు సాక్ష్యం అడిగినప్పుడు, వారు తరచూ ఈపీఎస్ సమ్మతి పత్రాన్ని సాకుగా చూపిస్తూ వచ్చారు. దీంతో కేసు ఆలస్యం అవుతూ వచ్చిందేగానీ, ముందుకు కదలలేదు. పైగా పీఎస్ సమ్మతి పత్రాన్ని తమకు ఇచ్చేశామని వారు కోర్టులో బుకాయించేవారని గోస్వామి తెలిపారు. ఎంతకాలం గడిచినా బాత్రా ఆసుపత్రి వర్గాలు ఆర్ఎఫ్ఏ పత్రాలను కోర్టుకు సమర్పించ లేకపోయాయి. ఎట్టకేలకు 2018లో తాము ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్‌లో కేసును గెలిచామన్నారు. కేసు దాఖలు చేసిన తేదీ నుండి 7% సాధారణ వడ్డీతో రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం బాత్రా ఆసుపత్రి వర్గాలకు ఆదేశించింది. అయితే తన తండ్రి కోరిన విధంగా రూ. 80 లక్షల పరిహారంతో పోల్చితే ఇది ఏమీ కానప్పటికీ, తాము ఈ కేసులో గెలిచినందుకు ఎంతో సంతోషించామన్నారు. కథ మళ్లీ మొదటికి.. అయితే అప్పటితో కథ ఆగిపోలేదని బాత్రా ఆసుపత్రి వర్గాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నేషనల్ కన్స్యూమర్ ఫోరమ్‌లో అప్పీలు చేశామని గోస్వామి తెలిపారు. దీంతో కేసు మొదటికి వచ్చింది. అయితే మరో 14 ఏళ్లు పట్టినా ఈ పోరాటం కొనసాగిస్తానని తల్లికి మాట ఇచ్చానని గోస్వామి తెలిపారు. అయితే మా న్యాయవాది నెగ్వివ్ అహ్మద్ ఈ కేసు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయినా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని, విచారణలో ఎక్కువ వాయిదాలు పడకుండా కేసు త్వరగా ముందుకు కొనసాగేందుకు ప్రయత్నించారు. ఫలితంగా 2023లో ఈ కేసులో తాము మరోమారు గెలిచామని గోస్వామి తెలిపారు. అయితే బాత్రా ఆసుపత్రి వర్గాలు వారి పరపతి నిలబెట్టుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తాము భావించామన్నారు. అయితే 19 ఏళ్లలో తాము రెండుసార్లు విజయం సాధించిన నేపధ్యంలో బాత్రా ఆసుత్రి వర్గాల సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయలేదని గోస్వామి తెలిపారు. భవిష్యత్ న్యాయ పోరాటాలకు స్ఫూర్తి ఎట్టకేలకు ఈ కేసు ముగిసినందుకు మా కుటుంబం సంతోషించింది. అయితే ఇంతటి సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా సాధ్యం కాదని తాను అర్థం చేసుకున్నానని గోస్వామి అన్నారు. తాము సాగించిన న్యాయపోరాటం భవిష్యత్తులో మరింతమంది రోగులకు న్యాయం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. బాధితులు ఎవరైనా ఇటువంటి న్యాయపోరాటం చేసేటప్పుడు వారు గోస్వామి కుటుంబాన్ని గుర్తుంచుకుంటారన్నారు. నష్టపరిహారం సొమ్ముతో మంచి పని మాకు కోర్టు నుంచి అందిన పరిహారం మొత్తాన్ని మా అమ్మ ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుందన్నారు. మొదట్లో తాను బాత్రా ఆసుపత్రిపై కోపంగా ఉండేవాడనిని, ఈ ఆసుపత్రిలో మీ సొంతపూచీ కత్తుతో చేరాలని ఆసుపత్రి ముందు బోర్డు పెట్టాలని అనుకునే వాడినని అన్నారు. అయితే అటువంటి సందర్భంలో తన తల్లి తనను శాంతపరిచేదని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
చికిత్స కోసం వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్.. ఆసుపత్రి బయట కూడా!
ఆ విషయం తెలియగానే ఆసుపత్రి యాజమాన్యంలో కలకలం చెలరేగింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేయడంతో, యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దర్యాప్తులో ఆమె ఆ బాధితుడు డయాలసిస్ కోసం వస్తుంటాడని చెప్పింది. ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా.. చికిత్స కోసం వచ్చిన బాధితునితో ఒక నర్సు రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆసుపత్రి బయట కూడా ఆ బాధితుడిని కలుస్తూ వచ్చింది. ఈ వ్యవహారం ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా గుట్టుగా సాగింది. అయితే ఒక రోజు ఆ బాధితుడు చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కన్నుమూశాడు. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా సాయంతో.. డెయిలీ స్టార్ రిపోర్టులోని కథనం ప్రకారం ఈ ఉదంతం ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. పెనెలోప్ విలియం అనే మహిళ 2019 నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్‌లో నర్సుగా పనిచేస్తోంది.ఈ నేపధ్యంలో ఆమెకు ఒక పేషెంట్‌తో సంబంధం ఏర్పడింది. వారు రహస్యంగా కాల్ చేసుకోవడం, కలుసుకోవడం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా సాయంతో ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఆసుపత్రి బయట తరచూ కలుసుకునేవారు. అయితే ఒక రోజు అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో వారిద్దరూ రహస్యంగా కలుసుకున్న సమయంలో ఆ పేషెంట్‌కు గుండెపోటు వచ్చింది. సహోద్యోగికి ఫోను చేసి.. వెంటనే పెనెలోప్ అంబులెన్స్‌కు కాల్ చేసింది. ఇంతలో వారుంటున్న కారులోనే ఆ బాధితుడు మృతి చెందాడు. అయితే పెనెలోప్ తన సహోద్యోగినికి ఫోను చేసి, సీపీఆర్ అందించేందుకు పిలిచింది. అయితే అప్పటికే సమయం మించిపోయింది. విషయం ఆసుపత్రివర్గాలకు తెలియగానే కలకలం చెలరేగింది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పెనెలోప్‌ను విధుల నుంచి తొలగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమెను ప్రశ్నించగా, అతను ఆరోజు డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చాడని తెలిపింది. అయితే ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక మెసేజ్‌లో అతనికి చెస్ట్ పెయిన్ వచ్చినట్లు ఉంది. దీంతో పెనెలోప్ అబద్దం చెబుతున్నదని యాజమాన్యానికి స్పష్టమైంది. ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందంటూ.. ఆమె అతనికి ఫోను చేసి, ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందని దర్యాప్తులో తేలింది. అతను రాగానే వారిద్దరూ కారులో సరససల్లాపాల్లో తేలారు. సరిగ్గా అదే సమయంలో ఆ బాధితునికి గుండెపోటు వచ్చి, మృతి చెందాడు. ఆ నర్సు, బాధితునికి మధ్య గత రెండేళ్లుగా ఈ ఎఫైర్ ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ బాధితుని పేరు వెల్లడించలేదు. ఈ విషయమై ఆసుపత్రి దర్యాప్తు కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ పెనెలోప్ విలియమ్స్ ఆ బాధితునితో తనకు ఎటువంటి సంబంధం లేదని, బాధితునికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, మృతి చెందాడని తెలిపిందన్నారు. ఇది కూడా చదవండి: తండ్రి మృతుని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి.. -
ఆస్పత్రి వేళలో వస్తేనే వైద్యం చేస్తాం
కోస్గి: మున్సిపల్ పరిధిలోని తిమ్మాయపల్లికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి రావడంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంకాలం వస్తేనే వైద్యం చేస్తామని చెప్పి వైద్యానికి నిరాకరించిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. తిమ్మాయపల్లికి చెందిన ఎల్లప్ప రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలికి గాయాలయ్యాయి. కొంతకాలు భాగం తీసివేశారు. ఒకరోజు విడిచి ఒకరోజు గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నడవలేని స్థితిలో ఓ ఆటోలో కట్టు కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. మధ్యాహ్నం 2గంటలకు ఆస్పత్రికి వచ్చాడు. దీంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంత్రం 4 గంటలకు రావాలని సిబ్బంది చెప్పారు. వైద్యం చేయడానికి నిరాకరించారు. నడవలేని స్థితిలో ఉన్నాడని, కట్టుకడితే వెళ్తామని బాధితులు ప్రాధేయపడినా వినిపించుకోలేదు. ఆస్పత్రి వేళల్లో వస్తేనే వైద్యం చేస్తాం.. మీ ఇష్టం వచ్చినట్లు వస్తే చేయం. ఎవరికై నా చెప్పుకోండి అంటూ రోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక బాధితుడు ఎల్లప్ప ఇంటికి వెళ్లిపోయాడు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యుడు అనుదీప్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేడు. -
Stroke: ఈ చికిత్స అందిస్తే..ఈజీగా రికవరీ అవ్వచ్చు!
స్ట్రోక్ వస్తే సత్వరమే చికిత్స అందుబాటులో ఉన్నా అవన్నీ తాత్కలికమే. ఎందుకంటే ఒక్కోసారి భవిష్యత్తులో మళ్లీ రావచ్చు లేదా రాకపోవచ్చు. అంతేగాదు రోగికి అలాంటి సమయంలో త్వరితగతిన కోలుకోవడం కూడా ఒక్కొసారి సమయం పడుతుంటుంది. పైగా రోగి అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇక నుంచి అలా కాకుండా రోగులను త్వరితగతిన కోలుకునేలా చేయవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్వీడన్ యూనివర్శిటీ ఆఫ్ గోథెన్బర్గ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్‌లో ఆ పరిశోధనలు గురించి వెల్లడించింది. పరిశోధకులు అందుకోసం ఎలుకలపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రయోగంలో భాగంగా ఎలుకలకు నాసిల్ చికిత్స విధానం ఉపయోగించి.. నాసిక గుండా సీ3ఏ పెప్టైడ్ ఆస్ట్రోసైట్ల డ్రాప్స్‌ను ఇచ్చారు. ఈ చుక్కలను తీసుకున్న ఎలుకలు స్ట్రోక్ తర్వాత చాలా చురుకుగా యథావిధిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వీడన్, జర్మనీలలో చేసిన ప్రయోగాల్లో కూడా ఇలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ అధ్యయనాలు చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని న్యూరో ఇమ్యునాలజీ ప్రోఫెసర్ మార్సెలా పెక్నా మాట్లాడుతూ..ఈ చికిత్స క్లినిక్స్‌లో ఉపయోగించవచ్చన్నారు. స్ట్రోక్‌కి గురై ఆస్పత్రులకు వచ్చిన వారు కూడా అంగవైకల్యానికి గురి కాకుండా త్వరితగతిన కోలుకోగలుగుతారని పెక్నా చెప్పారు. అంతేగాదు ఈ నాసిల్ డ్రాప్ చికిత్స విధానం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించగలమని చెప్పారు. (చదవండి: విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం! -
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్‌తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్‌కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్‌లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్‌బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్‌లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..)