సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్) : ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం ఇటీవల మనం వార్తల్లో వినే ఉంటాం. ఆ మాటకు ఆర్థాన్నిచ్చేలా మన పోలీసులు వ్యవహరించారు. హైదరాబాద్‌లో ఓ రోగిని అత్యవసరంగా ఒక ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అది చాలా తక్కువ సమయంలోనే మార్చాల్సి ఉండగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏ ఆటంకం లేకుండా రోగి ఉన్న ఆంబులెన్స్ కు సకాలంలో ఆస్పత్రికి చేరాలా చేసి ఓ ప్రాణానికి కాపాడారు.
వివరాల్లోకి వెళితే.. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్యుల తెలిపారు. ఈ క్రమంలో గ్రీన్ చానెల్ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా సకాలంలో ఆంబులెన్స్‌ను గమ్యస్థానానికి చేర్చారు. కిమ్స్ నుంచి అపోలోకు కేవలం 9 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరానికి చేర్చడంతో రోగి ప్రాణాలతో బయట పడ్డాడు.
( చదవండి: హమ్మయ్యా.. గాంధీలో సిద్ధమైన ఆక్సిజన్ ఫ్లాంట్ )
Comments
Please login to add a commentAdd a comment