సాక్షి,సంతోష్‌నగర్(హైదరాబాద్): హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సమయన్వయంతో శుక్రవారం అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రి నుంచి లైవ్ ఆర్గాన్ (ఊపిరితిత్తులు)ను రవాణా చేసే సౌకర్యాన్ని కల్పించారు. గ్రీన్ చానల్ (ట్రాఫిక్ పోలీసుల) సహకారంతో శుక్రవారం అవయవదానం జరిగింది. వివరాల ప్రకారం.. బడంగ్‌పేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.
అతడిని కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రి వారు కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఊపిరితిత్తులతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి ఎల్‌బీనగర్, ఉప్పల్ మీదుగా బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి మధ్యాహ్నం 12.12 గంటలకు తరలించారు. అపోలో ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 23.4 కిలో మీటర్ల దూరానికి కేవలం 27 నిమిషాల్లో చేరుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు ఆసుపత్రుల నిర్వాహకులు అభినందించారు.
చదవండి: హనీట్రాప్‌లో డీఆర్‌డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment