వైరల్‌: పరోటా కోసం గోడలు దూకాడు.. | Corona Patient Bothered Many For Parota In Chennai | Sakshi
Sakshi News home page

వైరల్‌: పరోటా కోసం గోడలు దూకిన కరోనా బాధితుడు

Published Sun, Jul 19 2020 7:12 AM | Last Updated on Sun, Jul 19 2020 7:48 AM

Corona Patient Bothered Many For Parota In Chennai  - Sakshi

వీడియోలో నమోదైన దృశ్యాలు 

సాక్షి, చెన్నై ‌: ఆచారిపాలెంలో కరోనా బాధితుడు హల్‌చల్‌ చేశాడు. అక్కడ ఉన్న ప్రత్యేక వార్డు నుంచి కరోన బాధితుడు సమీపంలో ఉన్న సుమారు నాలుగు ఇండ్ల కాంపౌండ్‌ గోడ ఎక్కి దూకి ఓ దుకాణంలో పరోటా పార్సిల్‌ చేసుకుని వెళ్లే వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది. కన్యాకుమారి జిల్లా ఆసారిపళ్లంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో కరోనా సోకిన సుమారు 150 మందికి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆ పాఠశాలలో ఉన్న ఒక అతను గోడ ఎక్కిదూకి సమీపంలో ఉన్న దుకాణంలో పరోటా కొనుక్కుని వచ్చినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న స్థానికులు శుక్రవారం రాత్రి హఠాత్తుగా ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు సమాధాన పరిచి పంపారు. అతను పాఠశాల కాంపౌండ్‌ గోడ ఎక్కి అక్కడ ఉన్న సుమారు నాలుగు ఇళ్లలోని కాపౌండ్లలో చొరబడి బయటకు వచినట్టు తెలుస్తోంది. సుమారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో మెయిన్‌ రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేటు దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో నమోదయినట్టు సమాచారం. (మద్యం బాటిళ్లలో బొద్దింకలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement