![Etela Rajender Helps To Corona Patient Video Viral - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/6/etala.jpg.webp?itok=TgEF8eHU)
సాక్షి, హైదరాబాద్ : ఒక్క ఫోన్ కాల్ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’ అంటూ మంత్రిపై బాధితుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో తనను కాపాడిన మంత్రి ఈటలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రఫీ అనే వ్యక్తి గత రెండు రోజుల అనార్యోగానికి గురయ్యాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో శనివారం ఆస్పత్రికి వెళ్లాగా, చేర్చుకోను అని చెప్పడంతో ఇంటర్‌నెట్‌లో మంత్రి ఈటల ఫోన్‌నెంబర్ చూసి ఫోన్ చేశాడు. తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. వెంటనే స్పందించిన మంత్రి, తన పీఏను అలర్ట్ చేయించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అయితే తనను కాపాడిన ఈటలకు జీవితాంతం రుణపడి ఉంటానని రఫీ చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment