గ్రామంలోనికి అంబులెన్స్‌ .. కరోనా రోగి పరార్‌.. | Covid Patient Escaped From Doctors In Karnataka | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ను చూసి కరోనా రోగి పరార్‌..

Published Fri, Apr 30 2021 2:16 PM | Last Updated on Thu, May 6 2021 2:46 PM

Covid Patient Escaped From Doctors In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,యశవంతపుర(కర్నాటక): గ్రామంలోకి వచ్చిన అంబులెన్స్‌ను చూసి కరోనా రోగి పారిపోయిన ఘటన హావేరిలో జరిగింది. కాగా, కబ్బూరు తండాకు చెందిన ఒక  వ్యక్తికి కరోనా సోకింది. అతడు కరోనా సోకిన కూడా బైట స్వేచ్చగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి కొద్దిరోజులుగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గ్రామస్థులు అతడిని ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలని కోరినా ఏవరి మాట వినలేదు.

దీంతో, అతడిని ఎలాగైనా ఆసుపత్రికి తరలించాలని గ్రామస్థులు భావించారు. ఈ క్రమంలో.. స్థానికంగా ఉన్నా ఒక ఆసుపత్రికి సమాచారం అందించారు. అతడిని ఆస్పత్రికి తరలించడానికి గ్రామంలోకి అంబులెన్స్‌ వచ్చింది. దీనిని గమనించిన సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అంబులెన్స్‌ సిబ్బంది, గ్రామస్తులు ఎంత గాలించినా కూడా ఆ వ్యక్తి కనిపించలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement