ఒక ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలోని ఘటన ఒక్కసారిగా ఆశ్చర్యంతోపాటు కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. ఈ ఘటన అర్జెంటీనాలోని ఫినోచిట్టో శానిటోరియం, బ్యూనస్ ఎయిర్స్‌లో ఉన్న ఒక ప్రైవేట్ కేర్ సెంటర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే....ఆ వీడియోలో...ఆస్పత్రి వద్ద ఉన్న ఆటోమెటిక్ డోర్లు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఎవరో ఎంట్రవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే సెక్యూరిటీ గార్డు మాత్రం లేచి వచ్చి మరీ రిజిస్టర్‌లో పేషెంట్ ఎవరో వచ్చినట్లుగా వివరాలు నమోదు చేసుకుంటాడు. ఆ తర్వాత లోపలకి వెళ్లే దారిని వివరిస్తూ ఒక వీల్ చైర్ కూడా ఇస్తున్నట్లు కనిపించింది.
ఈ ఘటన సీసీఫుటేజ్‌లో రాత్రి 3 గంటల ప్రాంతంలో రికార్డు అయ్యిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెటిజన్లంతా ఒక్కసారిగా వామ్మో ఏముందక్కడా? అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డైలీ స్టార్ అనే స్థానిక మీడియా ఈ విషయమై ఆరా తీయగా ఆ తలుపులు ప్రతి పది గంటలకోసారి ఆటోమెటిక్‌గా తెరుచకుంటాయని చెబుతున్నారు ఆస్పత్రి యజమాన్యం.
పైగా ఆ రోజు ఏ పేషెంట్ వివరాలు ఆ సమయంలో రికార్డు చేయలేదని అన్నారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవ్వడం స్థానికి మీడియా వంతైంది. మరికొంతమంది నెటిజన్లు మాత్రం.... ఆ సెక్యూరిటీ గార్డు కావాలనే ఇలా చేశాడు. అక్కడే ఏమి లేదు ఇదంతా సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుందనే తెలిసే ఇలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.
Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk
— Newspremises (@News_premises) November 21, 2022
(చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన)
Comments
Please login to add a commentAdd a comment