security guard
-
కెనడాలో భారత విద్యార్థి హత్య
టొరంటో:కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. చదువుకుంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న హర్షన్‌దీప్‌సింగ్‌ను ఎడ్మాంటన్‌లోని అతడి అపార్ట్మెంట్లోనే దుండగులు కాల్చి చంపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గిరిలో ఇవాన్ రెయిన్,జుడిత్ సాల్టియాక్స్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగులు తొలుత హర్షన్‌దీప్‌సింగ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. అతన్ని ఫ్లాట్‌లో నుంచి లాగి మెట్ల మీదకు నెట్టేస్తూ వెనుక నుంచి కాల్పులు జరిపారు.కాల్పుల సమాచారం అందుకుని తాము అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికే హర్షన్‌దీప్‌సింగ్ స్పందించడంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతడి మృతిని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిందని చెబుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవలే అల్పాహారం విషయంలో గొడవ జరిగి స్నేహితుడి చేతిలో భారతీయ విద్యార్థి ఒకరు హత్యకు గురైన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: డేంజర్ బెల్స్.. మనపాలిట శాపాలివే -
ఆస్పత్రుల్లో ప్రైవేటు సైన్యం!
సాక్షి, సిటీబ్యూరో: వాళ్లు సెక్యూరిటీ గార్డులు..గేటు దగ్గరి నుంచి డాక్టర్‌ను కలిసే దాకా అడుగడుగునా ఉరుముతూ కనిపిస్తుంటారు. తెలిసీతెలియక ఏదైనా అడిగితే చిరాకు పడుతుంటారు. మరోసారి అడిగామంటే అంతే సంగతులు..అక్కడికి వచ్చే పేషెంట్ గజగజలాడాల్సిందే. ఈ పరిస్థితి ఏదో ప్రైవేటు ఆస్పత్రుల్లోనిది కాదు.. మన భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవహార శైలి. నిజం..నగరంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ రాజ్యం నడుస్తోంది. ఒక రకంగా ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నట్టే ఉంది వ్యవహారం. దూరభారాల నుంచి వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం..గట్టిగా మాట్లాడితే దుర్భాషలాడటం.. మరీ కాదంటే దౌర్జన్యం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల గురించి పాఠకులకు తెలియజేసేందుకు ఫొటోలు తీసేందుకు వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ప్రైవేటు సెక్యూరిటీ గార్డు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రుల్లోని ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఆగడాలపై మరోసారి చర్చకు తెరలేచింది. అంత ఉలుకెందుకు? ఆస్పత్రుల్లో తాకిడిని నియంత్రించేందుకు థర్డ్ పార్టీ ద్వారా ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పరచుకుంటుకున్నారు. అయితే వారి వ్యవహార శైలి ఏ ఆస్పత్రిలో చూసినా.. ఎప్పుడైనా వివాదాస్పదమే. చిన్న విషయాలకే రోగులపై విరుచుకుపడటం, దుర్భాషలాడటం సర్వసాధారణం అయింది. ఆస్పత్రులకు వచ్చే వారు అనారోగ్యంతో ఎంతో బాధతో వస్తుంటారు. కనీసం వారితో మర్యాదగా మాట్లాడుదామనే ఆలోచనే ఉండట్లేదని రోగులు వాపోతున్నారు. నేరస్తులను చూసినట్టు చూస్తుంటారని, చేతిలో లాఠీల్లాంటి కర్రలతో బెదిరిస్తుంటారని చెబుతున్నారు. శిక్షణ లేకుండానే విధుల్లోకి..? ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే ప్రైవేటు సెక్యూరిటీకి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ప్రజలతో ఎలా మెలగాలి? వారితో ఎలా ప్రవర్తించాలి..? అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? మానవతా దృక్పథం ఎలా అలవర్చుకోవాలి వంటి అనేక అంశాలపై వారికి అవగాహన కలి్పంచాలి. పైగా వీరిని గమనించే ఇన్చార్జి వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ప్రతిసారి షిఫ్ట్ మారుతున్న సమయంలో రోల్ కాల్‌కు పిలిచి వారికి సూచనలు చేస్తుండాలి. కానీ ఏ ఆస్పత్రిలో కూడా ఇలా జరుగుతున్న దాఖలాలు లేవు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సమస్యలు దాస్తే ఏం లాభం? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన పరిపాలనా యంత్రాంగం.. మసిపూసి మారేడు కాయ చేయడంపైనే దృష్టిసారిస్తోంది. ఆస్పత్రుల్లోని సమస్యలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఎన్నడూ లేని ఆంక్షలు విధిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి..ఆ సమస్యలు బయటకు రాకుండా మేనేజ్ చేస్తే సరిపోతుందిలే అన్న చందంగా పాలక వర్గం వ్యవహరిస్తోంది. దీంతో రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోతోంది. మీడియాపై ఆంక్షలు విధించి, సమస్యలను దాచేస్తే సరిపోతుందా.. నిజాలు బయటకు రాకుండా ఎంతకాలం దాస్తారంటూ పలువురు రోగులు ప్రశి్నస్తున్నారు.‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి.. విధుల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రిలో పరిస్థితిని ప్రపంచం ముందు పెట్టేందుకు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ఫొటోగ్రాఫర్ జి.బాలస్వామిపై అక్కడి సెక్యూరిటీ గార్డు దాడి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కెమెరా లాక్కుని దుర్భాషలాడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను విధుల్లో భాగంగా ఇక్కడికి వచ్చానంటూ ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా, సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించామని తెలిపారు. అయితే వ్యవస్థ మొత్తం ఇలాగే ఉండగా, ఒక్కరిపై వేటు వేసి చేతులు దులుపుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నడూ లేనంత ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. -
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు త్వరలో కనీస వేతనాలను ఖరారు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడి కంటే తమిళనాడు, కర్ణాటకల్లో సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, త్వరలో తెలంగాణలో దేశంలోనే ఉత్తమమైన వేతనాలను సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024ను భట్టి విక్రమార్క ప్రారంభించారు.హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్‌కు నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్‌ఎం.భగవత్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్‌తో పాటు హెచ్సీఎస్సీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డిçప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ..’’రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 3.5 లక్షల వరకు ఉండగా.. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు 4 లక్షల మంది ఉన్నారు. అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్న ఈ రంగం యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఈ సమ్మిట్ చేసే సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.’’అని చెప్పారు. సెక్యూరిటీ ఏజెన్సీలు రిజి్రస్టేషన్ చేసుకోవాలి: సీపీ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఇప్పటికీ తక్కువ జీతాలే ఇస్తున్నారు. రాష్ట్రంలో 1500 ఏజెన్సీలు ఉండగా... 500 మాత్రమే రిజి్రస్టేషన్ చేసుకున్నాయి. మిగిలినవీ రిజి్రస్టేషన్ చేసుకోవాలి’అని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండెంట్స్‌గా మారాలని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ పిలుపునిచ్చారు. ‘పోలీసులు వచ్చే వరకు నేర స్థలిని పరిరక్షించాలి. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి అంశాన్నీ గుర్తిస్తూ, సంబంధిత శాఖలు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రైవేట్ సెక్యూరిటీలకు సంబంధించిన పసేరా చట్టం కూడా అదే చెప్తోంది. సెక్యూరిటీ గార్డులు ఇలా రూపొందేలా ప్రతి ఏజెన్సీ వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పోలీసు విభాగం అప్పట్లో నక్సలైట్లతో ఇప్పుడు సైబర్ క్రిమినల్స్‌తో పోరాటం చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సైకిల్ పెట్రోలింగ్ పోయి సైబర్ పెట్రోలింగ్ వచి్చంది’అని మహేశ్‌భగవత్ అభిప్రాయపడ్డారు. -
జీడిమెట్లలో కారు బీభత్సం.. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. కారును డ్రైవ్ చేస్తోన్న మహేష్ గౌడ్ అతివేగం, మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డును ఢీకొట్టాడు.కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులే కాగా, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన ఐదుగురు యువకులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన గోపి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జీడిమెట్లలో రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. -
ఉద్యోగం నుంచి తొలగిస్తే.. పురుగుల మందే దిక్కు
పులివెందుల: తమను ఉద్యోగం నుంచి తొలగిస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటూ ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఇద్దరు చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో నియమితులై పులివెందుల మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న నలుగురిని, సింహాద్రిపురం మార్కెట్‌యార్డులో ముగ్గురిని తొలగించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్న ఆందోళనతో పులివెందుల మార్కెట్‌యార్డులో అటెండర్‌గా పనిచేస్తున్న అజార్, సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో పురుగుమందు డబ్బాలు, పెట్రోలు తీసుకెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన మీడియాతో అజార్, మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో.. సరైన కారణాలు చూపకుండా ఇప్పటికే అధికారులు తమకు రెండు షోకాజ్ నోటీసులు అందజేశారన్నారు. ఆఫీసులో రిజిష్టర్‌ను దాచిపెట్టి తాము సంతకాలు పెట్టేందుకు వీలులేకుండా చేస్తున్నారని చెప్పారు. తమకు జీవనాధారం అయిన ఈ ఉద్యోగాలను తీసేస్తే.. ఆత్మహత్యలే శరణ్యమని విలపించారు. దీంతో మార్కెట్‌యార్డు సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ‘మీరు కోర్టును ఆశ్రయించారు కాబట్టి.. కోర్టు ద్వారా వచ్చే నిర్ణయాన్ని బట్టి తాము చర్యలు తీసుకుంటాం’ అని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. దీనిపై సెక్రటరీని వివరణ కోరగా తాము ఎవర్ని విధుల నుంచి తొలగించలేదని తెలిపారు. -
చీరకొంగు
చీరలు కట్టే రోజుల్లో వాటికి కొంగు ఉండేది. దానికి ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. గుండెలని కప్పటంతో పాటు, అవసరమైతే తన చేతులు తుడుచుకోవటం, దేనినైనా గబగబా తుడిచి శుభ్రం చేయటం, కోపం లేదా పౌరుషాన్ని ప్రదర్శించటానికి కొంగుని చీరకట్టులో దోపి ముందుకు రావటం తరచుగా కనపడే ప్రయోజనాలు. అలసిపోతే మొహం తుడుచుకోవటానికి, చెమట పడితే విసురుకోవటానికి, వీలైతే పక్కనున్న భర్తకో, అత్తగారికో, పిల్లలకో కూడా ఆ భోగాన్ని కలిగించటానికి కొంగు పనికి వస్తుంది. పిల్లలు మొహం తుడుచుకోవటానికి, అన్నం తిని చేతులు కడుక్కున్నాక తుడుచుకోటానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే మగవారికో? వారు కూడా ఉత్తరీయం పైన వేసుకునే వారు. లేదంటే కనీసం తుండు గుడ్డ. ఇప్పుడు రెండూ కనపడటం అపురూపమైపోయాయి. ఇవి రెండు చేసే పనులు ఒకటే అయినా, చీర కొంగు చేసే పనులు ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి. ఇంటితాళాలు, ఇనుపపెట్టె తాళాలు ఒకప్పుడు ఇంటావిడ కొంగుచివర ఉండేవి. ముఖ్యంగా బెంగాలీ స్త్రీలకి పెద్ద తాళాల గుత్తి కొంగు చివర కట్టి ఉంటుంది. అది వారు వంగ దేశపు వారు అనటానికి గుర్తు. కొంగున కట్టారు అంటే ఎంతో ముఖ్యమైనది అని అర్థం. గుడిలో ఇచ్చిన అక్షతలు కావచ్చు, ప్రసాదం కావచ్చు, ఏదైనా విలువైన తాయెత్తో, రక్షరేకో, మరేదైనా కావచ్చు ఇల్లాలి కొంగులో ఒదిగి దాక్కుంటాయి. అంతేకాదు, పనికిరానివి, ఉన్నచోట పడేయ కూడనివి ఉంటే కొంగులో దాక్కుంటాయి. అంటే, విరిగిన గోళ్ళు, రాలి పడిన వెంట్రుకలు, చిన్న చిన్న గాజుముక్కలు, ముళ్ళు... ఇట్లాంటి వాటిని కూడా కొంగు భద్రంగా జాగ్రత్త చేస్తుంది చెత్తలో వేసేవరకు. కొంగుకి ఎంతటి ్రపాముఖ్యమో చూడండి – వివాహ సమయంలో బ్రహ్మముడి వేయటానికి ఇద్దరి కొంగులని కలుపుతారు. అంటే, ఒకరి కొంగులో మరొకరు ఉండమని. ఒకరికొకరు కొంగు బంగారం. కొంగు బంగారం అంటే అందుబాటులో ఉండే విలువైన, అవసరానికి ఆదుకొనేది అని అర్థం. ఒకరి అవసరాలు, కష్టసుఖాలు మరొకరు అడగనవసరం లేకుండానే పంచుకుంటూ, తీర్చుకుంటూ జీవితం గడపాలన్నది సూచన. అందుకే ఎవరైనా భార్యని అపురూపంగా చూస్తుంటే – ఆవిడ భర్తని కొంగున కట్టుకుంది అంటారు. లక్ష్మీదేవే దానికి పెద్ద ఉదాహరణ. గజేంద్రుడి కుయ్యాలించిన విష్ణువు ఉన్న వాడు ఉన్నట్టుగా బయలుదేరితే లక్ష్మీదేవి వెంట వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆవిడ కొంగు ఆయన చేతిలో ఉన్నది అని వర్ణించారు. ‘‘వివాద ్రపోత్థిత శ్రీ కుచోపరి చేలాంచల మైన వీడడు’’ అన్నారు పోతన గారు. అసలు విషయం అది కాదు. విష్ణువుని లక్ష్మీదేవి కొంగున కట్టుకుంది. ఆయన కదిలితే తానున్న కొంగు కూడా కదిలింది. పోనీ, ఆయనే పట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడైనా విష్ణువు లక్ష్మీదేవి కొంగు విడవడు అనే కదా అర్థం. భర్తని తానే కొంగున కట్టుకున్నా, కొంగుని వదలని వారూ ఉన్నారు. వారే సంతానం. కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా కొత్తవారు వచ్చినా, సిగ్గు కలిగినా అమ్మ కొంగు చాటున దాక్కుంటూ ఉంటారు. అది వారికి రక్షణ. పసితనంలో పాలు తాగుతున్నపుడు, (తల్లిపాలు అయినా, పోతపాలు అయినా) అందరి చూపు పడకుండా అడ్డుగా ఉండే అమ్మ కొంగు, ఎండ, వాన, చలి, గాలి మొదలైనవి రాగానే తమ పైన చేరి వాటి బాధ నుండి రక్షణ కలిగించే అమ్మ చీర కొంగు తమకి ఎప్పుడు భద్రతా భావన కలిగిస్తుంది అని నమ్మకం. ‘‘కొంగు చాటు బిడ్డ’’ అనే నానుడి అందుకే వచ్చి ఉంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహిత సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు. 39 ఏళ్ల కపడే తన సర్వీస్ గన్‌తో మెడపై కాల్చుకుని మరణించినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జమ్నేర్ పోలీస్ స్టేషన్ సీఐ కిరణ్ షిండే పేర్కొన్నారు. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చిత కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారుప్రాథమిక విచారణ ద్వారా వ్యక్తిగత కారణాల వల్ల జవాన్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కపడే మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్య ఘటనపై జమ్మేర్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ కల్పిస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎస్ఆర్పీఎఫ్ వ్యక్తిగతంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నది.మరోవైపు, వీవీఐవీ భద్రత కోసం నియమించిన గార్డు ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ ఘటనపై SRPFస్వతంత్ర విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు!
‘నువ్వేమైనా కలెక్టర్‌వా? డాక్టర్‌వా? లేకపోతే ఏమైనా కంపెనీకి ఓనర్‌వా? ఆఫ్టరాల్... సెక్యూరిటీ గార్డ్వి. సెక్యూరిటీ గార్డు కూతురు విదేశాల్లో చదవగలదా?’ అని ఆ గార్డు ముఖం మీదే కరుకుగా మాట్లాడారు చాలామంది. బాధ పెట్టే కామెంట్స్ ఎన్ని చెవిన పడ్డా కూతురిని విదేశాల్లో చదివించాలనే లక్ష్యం విషయంలో ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కట్ చేస్తే... యూకే లో ఒక యూనివర్శిటీ నుంచి సెక్యూరిటీ గార్డ్ కూతురు ధనుశ్రీ గైక్వాడ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ధనుశ్రీని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడం, ఆమె తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని స్వీకరించడానికి వేదికపైకి వెళ్లడం, గ్రాడ్యుయేషన్ క్యాప్, గౌన్ ధరించిన ధనుశ్రీ తండ్రిని ఆనందంగా ఆలింగనం చేసుకోవడంలాంటి దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ఆయుష్మాన్ ఖురాన, ఈశా గుప్తాలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వీడియోపై స్పందించారు. ‘నువ్వు గార్డువి మాత్రమే. నీ కూతురిని విదేశాల్లో చదివించడం అసాధ్యం’ అని తండ్రితో చెప్పిన ప్రతి ఒక్కరికీ వీడియోను షేర్ చేసింది ధనుశ్రీ గైక్వాడ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
ఖరీదైన మద్యం తాగాలని...
బంజారాహిల్స్: ఓ పబ్ సెక్యూరిటీ గార్డ్ విదేశీ లిక్కర్ బాటిల్‌ను చోరీ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఆర్.యూ పబ్‌లో కొంతకాలంగా వినీత్‌కుమార్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ పబ్‌కు వచ్చే యువత ఖరీదైన విదేశీ లిక్కర్‌ను సేవిస్తుండటాన్ని గుర్తించిన అతను తాను కూడా స్నేహితులతో కలిసి ఆ లిక్కర్‌ను తాగాలనుకుని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న రాత్రి పబ్ మూసివేసిన తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి క్యాష్ బాక్స్‌లో ఉన్న రూ.2 లక్షల నగదుతో పాటు ఐదు రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు, ఒక చివాస్ రీగల్, ఒక మొహిట్ చాన్ దాన్ బాటిల్‌ను చోరీ చేసి పబ్‌పై అంతస్తు నుంచి పైపుల ద్వారా కిందకు దిగి పరారయ్యారు. మర్నాడు ఉదయం పబ్ మేనేజర్ మద్యం బాటిళ్లతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా సెక్యూరిటీ గార్డ్ వినీత్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు అగంతకులు నగదు, బాటిళ్లతో కిందకు పైపుల ద్వారా కిందకు జారుతున్న దృశ్యాలను గుర్తించారు. ఆ రోజు నుంచి వినీత్‌కుమార్ విధులకు హాజరుకావడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉందని మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డు
-
25 ఏళ్లు..23 అటెంప్ట్‌లు..చివరికి సాధించాడు
భోపాల్: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడిప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్‌కరణ్ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం 25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్‌లో పీజీ సాధించి కల నెరవేర్చుకున్నాడు. నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ మ్యాథ్స్‌లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. ‘నాకు ఇంఘ్లీష్ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు. ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్ -
56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు! ఏకంగా 23 సార్లు..
కొందరూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఇతర కారణాల వల్ల చదువు కోలేకపోవడం జరగుతుంది. ఐతే కొందరూ మాత్రం పట్టువదలకు పెద్దయ్యాక అయినా ఆ కలను నెరవేర్చుకుని మరీ చదువుకున్న ఎందరో వృద్ధుల ఉదంతాలను చూశాం. కానీ ఒక మాస్టర్ డిగ్రీలో ఫెయిలై సబ్జెక్టులు ఉండిపోతే పాసయ్యేంత వరకు ఎదురు చూసిన వ్యక్తిని చూశారా? అది కూడా దాదాపు సగం జీవితంపైనే ఓపిగ్గా గెలపు కోసం నిరీకిస్తూ పరీక్షలు రాయడం మాటలు గాదు కదా!. ఏకంగా 18 సార్లు ఫెయిల్ అయినా సరే..పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఎమ్సెస్సీలో ఉత్తీర్ణత సాధించడంతో ఒక్కసారిగా వార్తలో నిలిచాడు. వివరాల్లోకెళ్తే..జబల్పూర్కి చెందిన 56 ఏళ్ల రాజ్కరన్ అనే సెక్యూరిటీ గార్డుకి గణితంలో ఎంఎస్సీ చేయాలనేది ప్రగాఢ కోరిక. ఈ ఆలోచన 1996లో ఎంఏ పూర్తి చేసి పాఠశాల్లో విద్యార్థులకు గణితం బోధిస్తున్నప్పుడూ కలిగిందని చెబుతున్నాడు రాజ్కరన్. ఆ రోజుల్లో ఇలా ఎంఏ చేసిన వాళ్లు ఎంఏ మ్యాథ్స్ కూడా చేసే ఆప్షన్ ఉండటంతో తాను అదే ఏడాది జబల్పూర్లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో గణితంలో ఎంఎస్సీ మ్యాథ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించాడు. మ్యాథ్స్‌లో ఎంఎస్సీ ఎంత కష్టం అన్నది గ్రహించకుండా కేవలం తాను పిలల్లకు గణితం భోధించిన తీరుని అందరూ మెచ్చుకున్నారనే కారణంతో అనాలోచితంగా ఈ నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిపాడు రాజ్కరన్. అయితే తొలిసారిగా ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 1997లో హాజరై, ఫెయిలయ్యానని, అలా పదేళ్లలో మొత్తం ఐదు సబ్జెక్టులలో కేవలం ఒక్క సబ్జెక్టులోనే పాసయ్యినట్లు తెలిపాడు. అయినా సరే ఇక వదిలేద్దా అని మాత్రం అస్సలు అనుకోలేదని చెప్పాడు. ఎలాగైన గణితంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అందుకోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ..ఎంఎస్సీ పరీక్షలకు ప్రిపేరైనట్లు తెలిపాడు. సుమారు 18 సార్లు ఫెయిల్ అయినట్లు తెలిపాడు. తొలిసారిగా 2020లో కోవిడ్ మహమ్మారి టైంలో ఫస్ట్ ఇయర్ పాసవ్వగా, 2021లో సెకండియర్ పాసవ్వడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎట్టకేలకు గణితంలో ఎమ్మెస్సీ పూర్తి చేయాలన్న తన 25 ఏళ్ల తపస్సు ఫలించిందని చెప్పుకొచ్చాడు. అయితే 18 సార్లు ఎమ్మెస్సీ ఫెయిలైన వ్యక్తిగా పేపర్లో తన గురించి రావడంతో ప్రజలంతా తనను చులకనగా చూడటం మొదలు పెట్టారని, అదే తనలో ఎలాగైన గెలవలనే తపనను మరింత పెంచిదని చెప్పాడు కరణ్. అలాగే సెక్యూరిటీ గార్డుగా అతడి నెల జీతం రూ. 5000/- మాత్రమే. అయినప్పటికి వ్యక్తితగ ఖర్చులు కొంత డబ్బుని తన పీజీ కోసం కేటాయించేవాడినని చెప్పాడు. అలా ఈ మాస్టర్ డిగ్రీ కోసం అని పుస్తకాలకు, పరీక్ష పీజులకైతే ఇప్పటి వరకు దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ కల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు అతడు. పైగా తనని అందరూ పెయిల్యూర్‌కి ఉదహారణగా చూపుతూ తమ పిల్లలకి హేళనగా చెప్పేవారో బాధగా తెలిపాడు. అయితే తానెప్పుడూ అవేమీ పట్టించుకోకుండా ఈ డిగ్రీని పూర్తిచేయడమే తన ధ్యేయంగా భావించానని చెప్పాడు. అంతేగాదు ఓపిగ్గా.. విసుగు లేకుండా ప్రయత్నించేవాడు తప్పక విజయం సాధిస్తాడనే విషయం తెలుసుకున్నానని సగర్వంగా చెబుతున్నాడు. పైగా ఈ లక్ష్యాన్నే తాను పెళ్లి చేసుకున్నానని మరో పెళ్లాం ఎందుకని చమత్కారంగా మాట్లాడాడు రాజ్‌కరణ్. (చదవండి: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?) -
పొరుగింటి వ్యక్తే హంతకుడు
కృష్ణరాజపురం: నగరంలోని మహాదేవపురలో ఓ యువతిని హత్య చేసి ఇంటి ముందు పడేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని మహాదేవపుర పరిధిలో లక్ష్మీ సాగర లేఔట్లో గుల్బర్గాకు చెందిన మహానంద (21) అనే యువతి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం మహానంద బయటకు వెళ్లి ఆ తరువాత ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనూహ్యంగా మరుసటి రోజు ఇంటి ముందే విగతజీవిగా పడి ఉంది. యువతిని ఇంటిలోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం : ఈ యువతి ఇంటి పక్కనే ఒడిస్సాకు చెందిన కృష్ణ చంద అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ రోజు మహానంద బయటకు వచ్చిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో కృష్ణచంద యువతిని తన ఇంటిలోకి లాక్కెళ్లాడు. అత్యాచారం చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో ఆమె అరవకుండా చేయడానికి యత్నించగా ఊపిరి ఆగిపోయింది. దీంతో ఏమి చేయాలో తెలియక ఒక బెడ్ షీట్ చుట్టి మూలలో పెట్టాడు. సాయంత్రం భార్య విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి భార్యకు తెలియకుండా మహానంద యువతి శవాన్ని బయటకు తీసుకువచ్చి వారి ఇంటి ముందే పడేశాడు. పోలీసులు అనుమానంతో కృష్ణచందను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెల్లడించాడు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. -
చికోటి ప్రవీణ్‌కు షాక్.. సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిణి అమ్మవారి ఆలయం వద్దకు అనుమతి లేకుండా ఆయుధాలు కలిగిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని వెంట తీసుకెళ్లినందుకు చత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చీకోటి సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్‌తోపాటు ఫోర్జరీ, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. A1గా చికోటి, A2గా రాకేష్, A3గా సుందర్ నాయక్, A4గా రమేష్ గౌడ్లుగా చేర్చారు. ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌కు చెందిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని (సుందర్ నాయక్, రాకేష్ కుమార్, రమేష్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక వారి వద్ద ఉన్న ఆయుధాల లైసెన్స్ ఫేక్ డాక్యుమెంట్స్‌గా పోలీసులు తేల్చారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా బోనాల పండుగ సందర్భంగా చీకోటి ప్రవీణ్ ఆదివారం సింహావాహిని అమ్మవారి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్న ప్రవీణ్ వారితో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకున్నారు. వాళ్లను తనిఖీ చేయగా ఆయుధాలు బయటపడటంతో ఖంగుతున్నారు. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. అయితే వెపన్స్ లైసెన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏడాది క్రితమే ఛత్రినాక పోలీస్ స్టేషన్‌కు పంపామని చీకోటి ప్రవీణ్ చెబుతున్నారు. తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని లోకల్ పోలీస్ స్టేషన్లలో సమర్పించానని, వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పుడు డాక్యుమెట్స్ ఫోర్జరీ అని కేసు నమోదు చేశారని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని సైదాబాద్ పోలీసులు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇందుకు పోలీసుల తప్పిదమే కారణమని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో పార్టీ జాయిన్ గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మతం కోసం, హిందూత్వం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని, గజ్వేల్ ఘటన తర్వాత తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. -
ఒంగోలు: బ్యాంకులో కాల్పుల కలకలం.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య
సాక్షి ప్రకాశం: ఒంగోలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు సెంటర్లోని యూనియన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఎం. వెంకటేశ్వర్లు(35) తుపాకీతో తనను తానే కాల్చుకుని మృతిచెందాడు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూనియన్ బ్యాంక్‌లో వెంకటేశ్వర్లు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం విధుల్లో ఉండగా.. బ్యాంక్‌లోని రూమ్‌లోకి వెళ్లి గన్‌తో తనను తానే కాల్చుకున్నాడు. ఈ క్రమంలో పెద్ద శబ్ధం రావడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇక, చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుటుంబం ఒంగోలు రామ్‌నగర్‌లోని 8వ లైన్లో నివాసం ఉంటోంది. ఏడేళ్ల క్రితం ఉమామహేశ్వరితో వెంకటేశ్వర్లకు వివాహం జరిగింది. వీరికి సంతానం లేనట్టు తెలుస్తోంది. కాగా, వెంకటేశ్వర్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. కారణం ఇదే.. -
Bihar Bridge Collapse: కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు..
బిహార్‌లో భాగల్పూర్లో రూ. 1700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెన ఆదివారం పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ మేరకు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..గతేడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంతభాగం కూలిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత దీని నిర్మాణ విషయంపై అధ్యయనం చేయడం కోసం ఐఐటీ రూర్కీ నిపుణలను సంప్రదించాం. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. అధ్యయనం చేసిన నిపుణుల ఈ నిర్మాణంలో కొద్దిపాటి లోపాలున్నాయని మాకు తెలియజేశారు. అందుకు సంబంధించిన వాటినన్నింటిని తొలగించాం. అయనప్పటికీ ఆదివారం జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోందని తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వంతెన దగ్గర పనిచేస్తున సెక్యూరిటీ గార్డు కూడా ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలిపారు. రెస్క్యూ అధికారులు అతని ఆచకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి కూలిన తర్వాత నుంచి గార్డు కనిపించ లేదని, అతడి మృతదేహం కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి డిమాండ్ చేశారు. ఆయన పాలనలో జరుగతున్న అవినీతి కారణంగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఆరోపణలు చేశారు. మరో సహచర బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ కూడా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. (చదవండి: బిహార్‌లో కూలిన తీగల వంతెన) -
సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ.. 33 మంది అరెస్టు
గ్రేటర్ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసలు తెలిపిన కథనం మేరకు.. సెక్యూరిటీ గార్డులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌చంద్ హాస్టల్లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. అదికాస్త తీవ్రమై ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుడంతో తాము ఘటన స్థలానికి చేరుకుని ఆయా వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో ప్రైవేటు గార్డులు, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులను స్వీకరించామని, దీనిపై సత్వరమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, క్యాంపస్ వెలుపల సెక్యూరిటీ గార్డు, విద్యార్థులు కర్రలు చేతపట్టుకుని ఘర్షణ పడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి) -
నడిరోడ్డుపై వీరంగం.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న యువతులు
ఏం జరిగిందో తెలియదు గానీ నడిరోడ్డుపై ముగ్గురు ఆడవాళ్లు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘర్షణను ఆపాలని చుట్టూ ఉన్న వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన శాన్ ఆంటోనియోలోని ప్రైవేట్ సోషల్ క్లబ్ వెలుపల చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ నైట్ క్లబ్ ముందు ముగ్గురు మహిళలు ఘర్షణ పడుతున్నారు. వారిని ఆపేందుకు కొందరు ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత ట్రై చేసినా మహిళల గొడవను మాత్రం ఆపలేకపోయారు. ఇంతలో వారి మధ్యకు ఓ నైట్ క్లబ్ సెక్యూరిటీ వచ్చి వారిని విడదీసేందుకు ప్రయత్నించాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఇది చూసిన సెక్యూరిటీ గార్డు ఘర్షణ పడుతున్న ఒక మహిళను అమాంతం పైకి లేపి రోడ్డుపై ఎత్తేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనంతటినీ ఆ ప్రాంతంలోని కొందరు వీడియోలు తీసి పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకునే సరికి ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ పట్ల సెక్యూరిటీ గార్డ్ ప్రవర్తించిన తీరుని తప్పుపడుతున్నారు. గొడవ ఆపాల్పింది పోయి నిన్ను కొట్టమనలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. -
Hyderabad: లిఫ్ట్ విషయంలో గొడవ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌పై సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.58 గంటల సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ శాంతకుమార్ గచ్చిబౌలిలోని ఎన్సీసీ నాగార్జున రెసిడెన్సీ గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆపి నువ్వు ఏ లిఫ్ట్‌లో వెళ్లావని అడగ్గా, స్విగ్గీ బాయ్ సర్వీస్ లిఫ్ట్‌లో వెళ్లానని చెప్పగా, లేదు నువ్వు మెయిన్ లిఫ్ట్‌లో వెళ్లావంటూ గొడవకు దిగారు. ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దాడి చేయగా, గాయపడిన శాంతకుమార్ అక్కడి నుంచి తప్పించుకొని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. చదవండి: జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం! -
గుంటూరులో వేర్వేరుచోట్ల ఇద్దరు సెక్యూరిటీ గార్డుల హత్య
-
యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు..పలువురికి గాయాలు
లక్నో: అలహబాద్ యూనివర్సిటీ తీవ్ర హింసాత్మకంగా మారింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగడంతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు రాళ్లు రువ్వడం, మోటారు సైకిళ్లుకు నిప్పంటించడం వంటివి చేశారు. ఈ ఘర్షణలో ఇరువురు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపు విషయమై నెలల తరబడి నిరసన జరుగుతోంది. అందులో భాగంగా ఓ విద్యార్థి నాయకుడు క్యాంపస్‌లోని బ్యాంకుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే గార్డు అందుకు అనుమతించ లేదు. దీంతో వాగ్వాదం ఏర్పడి అది కాస్త ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌పై విదేశాంగ మంత్రి ఫైర్) -
ఘోస్ట్ పేషెంట్‌తో ముచ్చటిస్తున్న సెక్యూరిటీ గార్డు: వీడియో వైరల్
ఒక ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలోని ఘటన ఒక్కసారిగా ఆశ్చర్యంతోపాటు కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. ఈ ఘటన అర్జెంటీనాలోని ఫినోచిట్టో శానిటోరియం, బ్యూనస్ ఎయిర్స్లో ఉన్న ఒక ప్రైవేట్ కేర్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఆ వీడియోలో...ఆస్పత్రి వద్ద ఉన్న ఆటోమెటిక్ డోర్లు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఎవరో ఎంట్రవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే సెక్యూరిటీ గార్డు మాత్రం లేచి వచ్చి మరీ రిజిస్టర్లో పేషెంట్ ఎవరో వచ్చినట్లుగా వివరాలు నమోదు చేసుకుంటాడు. ఆ తర్వాత లోపలకి వెళ్లే దారిని వివరిస్తూ ఒక వీల్ చైర్ కూడా ఇస్తున్నట్లు కనిపించింది. ఈ ఘటన సీసీఫుటేజ్‌లో రాత్రి 3 గంటల ప్రాంతంలో రికార్డు అయ్యిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో నెటిజన్లంతా ఒక్కసారిగా వామ్మో ఏముందక్కడా? అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. డైలీ స్టార్ అనే స్థానిక మీడియా ఈ విషయమై ఆరా తీయగా ఆ తలుపులు ప్రతి పది గంటలకోసారి ఆటోమెటిక్‌గా తెరుచకుంటాయని చెబుతున్నారు ఆస్పత్రి యజమాన్యం. పైగా ఆ రోజు ఏ పేషెంట్ వివరాలు ఆ సమయంలో రికార్డు చేయలేదని అన్నారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవ్వడం స్థానికి మీడియా వంతైంది. మరికొంతమంది నెటిజన్లు మాత్రం.... ఆ సెక్యూరిటీ గార్డు కావాలనే ఇలా చేశాడు. అక్కడే ఏమి లేదు ఇదంతా సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుందనే తెలిసే ఇలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk — Newspremises (@News_premises) November 21, 2022 (చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన) -
దారుణంగా కొట్లాడుకున్న ఫుడ్ డెలివరి మ్యాన్, సెక్యూరిటీ గార్డు... షాక్‌లో స్థానికులు
నోయిడా: ఫుడ్ డెలివర్ మ్యాన్, సెక్యూరిటీ గార్డుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటన నోయిడా గార్డెనియా సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సబీ సింగ్ అనే జోమాటో ఫుడ్ డెలవరీ మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ రామ్ వినయ్‌ల మధ్య ఎంట్రీ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరి ఒకరినోకరు గాయపరుచుకునే వరకు వచ్చింది. మొదటగా ఫుడ్ డెలివరీ మ్యాన్ సబీ సింగ్ సెక్యూరిటీ గార్డుని కొట్టడం, నెట్టడం వంటివి చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గార్డు కర్ర తీసుకుని ఫుడ్ డెలివరీ వ్యక్తి పై దాడి చేశాడు. దీంతో ఇద్దరు కాసేపు కర్రలతో ఘోరంగా కొట్టుకున్నారు. స్థానికులు ఆపేందుకు యత్నించిన ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాసేపటికి ఫుడ్ డెలవరీ మ్యాన్ స్ప్రుహ తప్పి నేలపై పడిపోయాడు. దీంతో ఘటనా స్థలం వద్ద ఉన్న స్థానికులు అతనికి సపర్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాని చేరుకుని ఇరువురి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: వెండి వస్తువుల కోసం ఏకంగా వృద్ధురాలి కాలు నరికి...) -
సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్ పట్టుకుని...
ఇటీవలకాలంలో మహిళలు సెక్యూరిటీ గార్డుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు గురించి తురుచుగా వింటున్నాం. గ్రేటర్ కమ్యూనిటీ అపార్టమెంట్లో ఉంటున్న కొంతమంది నివాసితులు సెక్యూరిటీ గార్డుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లను కొట్టడం లేదా అసభ్యంకరంగా తిట్టి అవమాన పరిచే హేయమైన చర్యలకు దిగుతున్నారు. అచ్చం అలానే నోయిడాలోని ఒక మహిళ ఒక సెక్యూరిటీ గార్డుపై వీరంగం సృష్టించింది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నోయిడాలోని అజ్నార్ సోసైటీలో పనిచేస్తున్న ఒక గార్డు పట్ల ఒక మహిళ చాలా అమానుషంగా ప్రవర్తించింది. సదరు గార్డు టోపీ లాక్కుని, కాలర్ పట్టుకుని దుర్భాషలాడింది. పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను ఆపేందుకు ప్రయత్నించకుండా అలా చూస్తోంది. ఇంతలో మరో సెక్యూరిటీ గార్డు వచ్చి బాధితుడుని ఆ మహిళ నుంచి వెనక్కి లాగేందుకు యత్నించాడు. ఈ మేరకు పోలీసులు సదరు బాధితుడు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. (చదవండి: భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...) -
అపార్థమే.. హత్యకు దారితీసింది
సాక్షి, శామీర్‌పేట్: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అందులో ఒకరి మృతికి దారితీసిన ఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్‌కు చెందిన శివదులార్ రామ్(55), శామీర్‌పేట మండలం, బొమ్మరాశిపేట గ్రామ శివారులోని కమలాకర్‌రెడ్డికి చెందిన క్రషర్ మిషన్‌లో రెండేళ్లుగా సెక్యూరిటీకి గార్డుగా పని చేస్తున్నాడు. కాగా అక్కడే ఉండే వేయింగ్ మెషిన్ వద్ద విజయ్ మరవి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కంకర లోడ్‌తో ఓ టిప్పర్ లారీ వేయింగ్ కొరకు రాగా అక్కడ విజయ్ మరవి లేకపోవడంతో సూపర్వైజర్ సుశాంత్ వచ్చి వేయింగ్ చేసి పంపించి, విజయ్ మరవిని మందలించాడు. తను వేయింగ్ మెషిన్ వద్ద లేడనే విషయం సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న శివదులార్ రామ్ సూపర్వైజర్కు చెప్పి ఉంటాడనుకొని అతనితో విజయ్ దు ర్భాషలాడుతూ గొడవపడ్డాడు. దీంతో ఇరువురిని సూపర్వైజర్ సుశాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో చెట్ల పోదల్లో శివదులార్రామ్ తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. వేయింగ్ మెషిన్ వద్ద పనిచేసే విజయ్ మరవి కనబడకపోవడమే కాక ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు) -
అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...
కరాచి: పాకిస్తాన్ ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అన్న కనికరం లేకుండా కొట్టి కొందపడేసి బూట్లతో తన్ని దారుణంగా ప్రవర్తించాడు ఒక సెక్యూరిటి గార్డు. పోలీసులు తెలపిన కథనం ప్రకారం....పాకిస్తాన్‌లోని కరాచీలో నోమన్ గ్రాండ్ సిటీ అనే అపార్టమెంట్స్ గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉంది. సనా అనే ఒక ఐదు నెలల గర్భిణి ఆ ఆపార్టమెంట్స్ లోనే పనిమనిషిగా పనిచేస్తోంది. ఐతే ఆమె తన కొడుకు సోహిల్ తన కోసం ఆహారం తీసుకువచ్చాడని తనని లోపలికి అనుమతించాల్సిందిగా ఆ ఆపార్టమెంట్ సెక్యూరిటీ గార్డుని వేడుకుంది. ఐతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్ నాసిర్, అదిల్ ఖాన్, మహ్మద్ ఖలీల్ లోపలకి రావడాని అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఆ సెక్యూరిటీ గార్డు కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తిరిగి లేచేందుకు ప్రయత్నించే లోపే బూట్లతో ముఖం పై తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్ప్రుహ కోల్పోయింది. ఈ సంఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడ్డంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఆ గార్డు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఆ గార్డు పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా. (చదవండి: కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..) -
దారి తప్పడంతో.. దొంగ అనుకుని బ్యాంక్ ఉద్యోగిని కొట్టి చంపాడు
బనశంకరి(బెంగళూరు): ఎక్కడో చత్తీస్ఘడ్ నుంచి వచ్చాడు. ఇక్కడి భాష తెలియదు, ఊరు తెలియదు, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు బ్యాంకు ఉద్యోగిని రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మారతహళ్లి వద్ద వంశీ సిటాడెల్ అపార్టుమెంట్ వద్దకు ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెళ్లాడు. సెక్యూరిటీగార్డు శ్యామనాథ్ అతన్ని ఎవరని ఎన్నిసార్లు అడిగినా జవాబివ్వలేదు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో సెక్యూరిటిగార్డు రాడ్‌తో అతడి తలపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయం కావడంతో వ్యక్తి అక్కడే మృతిచెందారు. హతుడు చత్తీస్ఘడ్ చెందిన బ్యాంకు ఉద్యోగి కాగా శిక్షణ తీసుకోవడానికి బెంగళూరుకు వచ్చినట్లు తెలిసింది. స్నేహితులతో విందులో పాల్గొని ఒక్కడే స్నేహితుడి రూమ్ కు నడుచుకుని బయలుదేరాడు. మొబైల్లో అడ్రస్ అడుగుతూ వస్తుండగా అది బ్యాటరీ అయిపోయి స్విచాఫ్ అయ్యింది. దీంతో దారి తప్పి వేరే అపార్టుమెంట్ వద్దకు వెళ్లాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు దాడి చేసినట్లు తెలిసింది. హెచ్ఏఎల్ పోలీసులు పరారీలో ఉన్న శ్యామ్‌నాథ్‌ను ను ఆదివారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: 11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్ మిస్టరీ! -
ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ?
Nora Fatehi Gets Trolled: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తనదైన హావాభావాలతో, డ్యాన్స్ మూమెంట్స్‌తో కట్టిపడేస్తుంది. 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అనే ఐటమ్ సాంగ్‌తో టాలీవుడ్లో ఎంటరైన ఈ భామ 'బాహుబలి' చిత్రంలో 'మనోహారి' పాటతో పాపులారిటీ దక్కించుకుంది. హిందీలో 'దిల్బర్' సాంగ్‌తో ఒక ఊపు ఊపేసింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఆమె చేసిన ఓ పని నెటిజన్స్ విరుచుకుపడేలా చేసింది. డ్యాన్స్ రియాలిటీ షో అయిన 'డ్యాన్స్ దీవానే జూనియర్స్'కు నోరా ఫతేహీ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో పాల్గొనేందుకు నోరా చీరలో వచ్చింది. ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. వర్షంలో కారు దిగబోతుండగా అక్కడ నీటిలో చీర తడిసిపోతుందని భావించి సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకుంది. సెక్యూరిటీ గార్డు ఆమె చీరను పట్టుకోగా నోరా ఫతేహీ కార్‌వ్యాన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నోరాను నెటిజన్స్ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. (చదవండి: 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !) 'ఆమె ఏ దేశపు యువరాణి', 'ఈ శతాబ్దంలో ఇలాంటి బానిసత్వాన్ని అంగీకరించలేం', 'ఆమె మహారాణి అయినప్పటికీ సెక్యూరిటీ గార్డ్‌పై కొంచెం కూడా దయలేదా. చీరను కాపాడేందుకు అతను వర్షంలో తడిసేలా చేసింది', 'ఒక గొడుగును కొనుక్కునేందుకు ఆమె దగ్గర డబ్బులు లేవా ?' అంటూ నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి,రంగారెడ్డి: పెద్ద అంబర్ పేట్ కండర్ షైన్ స్కూల్ బస్సు బీభత్సం సృటించింది. 10వ తరగతి పరీక్షలు కావడంతో విద్యార్థులను ఎకించుకొని బస్సు స్కూల్ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు పరీక్ష గదిలోకి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఢీకొన్న సెక్యూరిటీ గార్డ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హయత్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం గురించి అడిగినందుకు విద్యార్థుల తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగారు. దీంతో వారి ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్ -
శంషాబాద్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చేతివాటం
శంషాబాద్(హైదరాబాద్): ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగులోంచి రియాల్స్ తస్కరించిన సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. నిజామాబాద్ డిచ్పల్లికి చెందిన షేక్ అల్తాఫుద్దీన్ శుక్రవారం రాత్రి రియాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. బంధువులు, కుటుంబసభ్యులు అరైవల్స్‌లోకి కాకుండా డిపార్చర్ వైపు వెళ్లడంతో హడావుడిగా అల్తాఫుద్దీన్ కూడా అక్కడికి వెళ్లాడు. చదవండి👉: చిల్.. జిల్.. టాప్ గేర్‌లో అమ్మకాలు.. పొంగుతున్న బీరు కారు పార్కింగ్ సమయం మించిపోతుందని సిబ్బంది సూచించడంతో బ్యాగు మరచిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఓ బ్యాగు లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆరా తీశారు. బ్యాగులో 3050 రియాల్స్‌తో పాటు కొన్న ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాగును తీసిన సదరు సెక్యూరిటీ సిబ్బంది తిరిగి అప్పగించినా అందులో కేవలం 500 రియాల్స్ మాత్రమే ఉండడంతో మిగతా రియాల్స్ ఎక్కడిపోయాయని బాధితుడు అడిగాడు. దీంతో మరో ఆరువందల రియాల్స్‌ను అతడికి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మిగతా రియాల్స్ తమవద్దలేవని చేతులెత్తేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించినట్లు ఆర్జీఐఏ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
దారుణం: జీతం అడిగితే.. తగల బెట్టేశారు!
సాక్షి, చెన్నై : జీతం కోసం ఒత్తిడి తెచ్చిన వృద్ధుడిని ఓ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు పెట్రోల్ పోసి తగల బెట్టారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి మరణించాడు. వివరాలు.. మదురై నగరం దక్షిణ మాసి వీధికి చెందిన రత్నవేల్(70) ఎస్ఎస్ఓ సెక్యూరిటీ సంస్థలో వాచ్‌మన్‌గా (కోయంబత్తూరులో) పని చేస్తున్నాడు. కొన్ని నెలలుగా నిర్వాహకులు దిలీప్‌కుమార్, జాన్ జీతం సరిగ్గా ఇవ్వకపోవడంతో రత్నవేల్ వారిపై ఒత్తిడి తెచ్చాడు. గురువారం జీతం ఇస్తామని నిర్వాహకులు సూచించారు. అదేరోజు రాత్రి వారు చెప్పిన చోటుకి రత్నవేల్ వెళ్లాడు. అక్కడ వారు అవహేళనగా మాట్లాడుతూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో రత్నవేల్ వారికి ఎదురు తిరిగాడు. దీంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు రత్నవేల్‌ను చితక్కొట్టారు. కారులో కొడిస్సీయా వద్దకు తీసుకొచ్చి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారు. మంటల్లో కాలుతూ వృద్ధుడు పెట్టిన కేకల్ని విని అటుగా వెళ్లేవారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రత్నవేల్ ఇచ్చిన వాంగ్ములం మేరకు నిర్వాహకులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అజ్ఞాతంలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అదే సమయంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న రత్నవేల్ శుక్రవారం అర్ధరాత్రి చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచాడు. -
ఏటీఎం మిషన్‌లో వేయాల్సిన నగదుతో జంప్!... దంపతులను బురిడీ కొట్టించినదొంగ!
మాండ్య : మండ్య జిల్లా మద్దూరు పట్టణంలోని కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన దంపతులను ఓ ఘరానా మోసగాడు వంచించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... చెన్నపట్టణ తాలూకా కోలూరు గ్రామానికి చెందిన మహదేవయ్య, మమత దంపతులు ఈనెల 2న తన కుమారుడు ఉన్నత చదువుల కోసం బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రూ. 50 వేలు తీసుకుని మద్దూరులోని కెనరా బ్యాంక్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో బ్యాంకులో వినియోగదారులు ఎక్కువగా ఉండటంతో ఏటీఎం మిషన్‌లో వేయాలని సూచించారు. వారి వెనుకాలే ఓ వ్యక్తి ఏటీఎం సెక్యూరిటీ ఉద్యోగి తరహాలో వారి వద్దకు వచ్చాడు. నగదు ఏటీఎం మిషన్‌లో తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని కోరారు. మోసగాడు వారిని చూపు మళ్లించి నగదు తన జేబులో పెట్టుకుని, ఖాతాలో వేసినట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో దంపతులు కుమారుడికి ఫోన్ చేసి నగదు వేశామని చెప్పారు. తనకు ఇంకా నగదు పడలేదని చెప్పడంతో బ్యాంకు సిబ్బందితో విచారించారు. సర్వర్ సమస్య ఉంటుందని, వారం రోజుల్లో నగదు పడుతుందని చెప్పారు. వారం రోజులు గడచినా నగదు జమ కాకపోవడంతో అనుమానించిన సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రష్యాలో సెక్యూరిటీ గార్డు చేసిన పనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు..!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆనంద్ మహీంద్రా పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు. అయితే, తాజాగా మరో ఆసక్తికర పోస్టుపై మహీంద్రా స్పందించారు. రష్యాలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక కొన్ని కోట్లు విలువైన పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. అయితే, ఈ వార్తాపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా.." ఎందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త కళాఖండాన్ని ఎన్ఎఫ్టిగా మార్చండి" అని సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. 1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. Why worry? Just convert the new ‘creation’ into an NFT! https://t.co/I7F3wbIxWH — anand mahindra (@anandmahindra) February 10, 2022 ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ, ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ.7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న 10 నగరాల్లో 2 మనవే..!) -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం
Bored Security Guard Drew Eyes On Painting of Faceless Figures: కొంతమంది సరదాగానో లేక బోరుకొడుతుందనో చేసిన పనులు వికటించి పెను ప్రమాదాలుగా మారిని సందర్భాలు కోకొల్లలు. ఐతే అవి ఒక్కోసారి మనకు నష్టం వాటిల్లకపోయిన లక్‌ని తీసుకువచ్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఒక్కోసారి ఆ పనులు మనం కలలో కూడా ఊహించనంత నష్టాన్ని చవిచూసేలా చేస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే రష్యాలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ. 7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు కూడా. (చదవండి: వెన్నుముక మార్పిడి..వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..) -
‘డబుల్’ ఇళ్లకు కాపలా కష్టాలు.. ఆర్నెళ్లకు రూ.1.16 కోట్లు.. కేటాయింపులు ఎప్పటికో..?
సాక్షి, హైదరాబాద్: ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. కట్టిన ఇళ్లకు కాపలా కాయడం మరొక ఎత్తయిన ఘటన ఇది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం పేదలకు ప్రకటించిన ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండగా, గ్రేటర్ నగరంలో మాత్రం ఏడాది క్రితం వరకు ఇళ్ల నిర్మాణం వడివడిగా జరిగింది. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వాటికి కాపలా కాయడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలోని విద్యుత్, వాటర్సప్లై శానిటరీలకు సంబంధించిన సామగ్రి,పరికరాలను అగంతకులు ఎత్తుకుపోతున్నారు. అంతటితో ఆగకుండా లిఫ్టులు, పంప్సెట్లు, అగ్నిమాపక పరికరాల వంటి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు బల్దియా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన కాపలా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత పోలీస్ కమిషనర్లకు సైతం కొద్దికాలం క్రితం అధికారులు లేఖలు రాశారు. కానీ.. ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం విభాగానికి చెందిన సిబ్బందిని కొన్ని ప్రాంతాల్లో కాపలా విధులకు నియమించారు. కానీ.. ఇంకా చాలా కాలనీల్లో కాపలా లేక దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోటిరూపాయలకు పైగా విలువైన సామగ్రి మాయమైంది. తిరిగి మళ్లీ కొనుగోలు చేసి.. అమర్చడం ‘డబుల్’ పనిగా మారింది. ఈ నేపథ్యంలో కాపలాకు సెక్యూరిటీ గార్డుల్ని నియమించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆర్నెళ్ల వరకు అంటే.. జూలై నెలాఖరు వరకు ఆయా ప్రాంతాల్లో 133 మంది సెక్యూరిటీగార్డులు/వాచ్మన్లను నియమించనుంది. వారి వేతనాల కింద ఆర్నెళ్లకు వెరసి రూ.1.16 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు స్టాండింగ్కమిటీ సైతం ఆమోదం తెలిపింది. పేదలుంటున్న బస్తీల్లో వారి చిన్న ఇళ్లను కూల్చి అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినచోట దొంగల బెడద లేకున్నా, శివార్లలో కట్టిన ప్రాంతాల్లోనే ఈ బెడద ఉంది. భారీ సంఖ్యలో ఇళ్లున్న అహ్మద్‌గూడ, రాంపల్లి, మంఖాల్, బహదూర్‌పల్లి, దుండిగల్, బాచుపల్లి, ప్రతాపసింగారం, మురహరిపల్లి, నిజాంపేట, తట్టిఅన్నారం తదితర ప్రాంతాల్లో ఈ సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు. 15వేలకు పైగా ఇళ్లున్న కొల్లూరులో మాత్రం కాంట్రాక్టు ఏజెన్సీయే కాపలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కేటాయింపులు ఎప్పటికో..? శివార్లలో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు సైతం అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లోనూ ఇళ్లను ఎవరికీ కేటాయించలేదు. ఇంకా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. కేవలం ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే తమవని, కేటాయింపులతో తమకెలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ హౌసింగ్ అధికారులు తెలిపారు.లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లది కావడం తెలిసిందే. -
నాన్న సెక్యూరిటీ గార్డ్.. కొడుకు రూ. కోటి గెలిచాడు
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్విళ్లురుతుంటారు. కొందరు ఏళ్లుగా ప్రయత్నిస్తుంటారు. అదృష్టం వరించి.. సెలక్ట్ అయిన వారు ఎంతో కొంత సొమ్ముతో షో నుంచి వెనుదిరుగుతారు. కొందరు ప్రతిభావంతులు మాత్రం కోటి రూపాయలు సాధిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలిచిన రెండవ వ్యక్తిగా నిలిచాడు సాహిల్ ఆదిత్య(19). సెక్యూరిటీ గార్డు కుమారుడైన సాహిల్.. ప్రస్తుత కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు.. (చదవండి: కేబీసీ 13: రూ. 7 కోట్ల ప్రశ్న, గెలుస్తాడా, లేదా?!) మధ్యప్రదేశ్ ఛతర్పూర్ మున్సిపాలిటీకి చెందిన సాహిల్ ఆదిత్య అహిర్వార్ తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా సాహిల్ అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. కాలేజీకి బంక్ కొట్టడం.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం చేసేవాడు. చదువు మీద అసలు ఆసక్తి కనపర్చేవాడు కాదు. కానీ గత రెండేళ్లలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. సమయం వృధా చేయకుండా దాని కోసం కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో కేబీసీ 13వ సీజన్లో పాల్గొనేందుకు ప్రయత్నించాడు సాహిల్. ఎస్ఎమ్ఎస్లు పంపాడు. అదృష్టం బాగుండటంతో సెలక్ట్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్న వరకు సరైన సమాధానం చెప్పాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. ఇక సాహిల్ తండ్రి గురించి, తన గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. తండ్రి పదవ తరగతి వరకు చదువుకున్నాడని... ప్రస్తుతం నోయిడాలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు అని తెలిపాడు సాహిల్. (చదవండి: కోటి రూపాయలను తలదన్నే కథ) ‘‘గత రెండేళ్లు నా జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. అంతకు ముందు నాకు చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాలేజీకి బంక్ కొట్టి.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు తిరిగేవాడిని. కానీ ఈ రెండేళ్లు నాలో ఎంతో మార్పు తీసుకువచ్చాయి. ప్రస్తుతం నేను ర్యాంక్ హోల్డర్ని. రానున్న రోజుల్లో తప్పక ఐఏఎస్ అవుతాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు సాహిల్. చదవండి: 900 కోట్ల రూపాయల అప్పు.. చీకటి రోజులవి: అమితాబ్ -
సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులపై ప్రజల్లో గౌరవం పెరిగింది. ప్రత్యక్ష దైవంగా వారిని భావించారు. అలాంటి భావనను కొందరు వైద్యులు తమ నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. విధులపై నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే గార్డుతో ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అంగుల్‌లోని జిల్లా ఆస్పత్రికి మంగళవారం ప్రమాదంలో గాయపడిన వ్యక్తితో పాటు అతడి బంధువులు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు ఎవరూ లేరు. దీంతో సెక్యూరిటీ గార్డే వైద్యం చేశారు. క్షతగాత్రుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి బంధువులు సెల్ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పరిణామంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ప్రభుత్వం స్పందించింది. ‘ఆ రోజు ఆస్పత్రిలో ఇన్చార్జ్ ఎవరో తెలుసుకుంటున్నాం. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. విచారణ అనంతరం కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ తెలిపారు. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
విద్యుత్ బకాయిల కోసం వెళ్తే.. ప్రాణం తీశారు
థానే: మహారాష్ట్రలోని ఓ గ్రామంలో చేపట్టిన విద్యుత్ బకాయిల వసూళ్ల డ్రైవ్ హింసాత్మకంగా మారింది. గ్రామస్తుల మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రైవేట్ విద్యుత్ సంస్థ గార్డు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మరమగ్గాల పరిశ్రమ కేంద్రమైన భివాండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ బిల్లుల బకాయిదార్లపై చర్యలు తీసుకునేందుకు ఓ విద్యుత్ సంస్థకు చెందిన సిబ్బంది తమ సెక్యూరిటీ గార్డు తుకారాం పవార్‌తో కలిసి శనివారం భివాండి సమీపంలోని కనేరి గ్రామానికి వెళ్లారు. విద్యుత్ సరఫరా లైన్లను కట్ చేసేందుకు ప్రయత్నించగా గ్రామంలోని 10 నుంచి 15 మంది కలిసి వారందరినీ కొట్టారు. ఈ దాడిలో గార్డు తుకారాం పవార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు నిజాంపుర స్టేషన్ పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అందాక తదుపరి చర్యలుంటాయని చెప్పారు. ఇక విద్యుత్ సంస్థే తమ తండ్రి మరణానికి కారణమని తుకారాం కుమారుడు ఆరోపిస్తున్నారు. బకాయిదారులపై చర్యలు సాధారణంగా ఉండేవేనని, అందుకే పోలీసు రక్షణ కోరలేదని సదరు విద్యుత్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. నేరస్థుడి మృతితో దాడి మరో ఘటనలో నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన వాళ్లపై దాడి జరిగింది. భివాండిలోని కసాయివాడలో శుక్రవారం ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి జరిగింది. గుజరాత్ పోలీసులు, భివాండి క్రైం బ్రాంచి పోలీసులు సాధారణ దుస్తుల్లో వెళ్లి జమీల్ ఖురేషిని పట్టుకునేందుకు వెళ్లారు. వారి నుంచి తప్పించు కునే క్రమంలో ఖురేషి తను ఉన్న నాలుగో అంతస్తు ఫ్లాట్ కిటికీ నుంచి కిందికి దూకి, ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు పోలీసులే కారణ మంటూ స్థానికులు, మృతుడి కుటుంబీకులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
మాస్క్ పెట్టుకోలేదని కస్టమర్‌తో సెక్యూరిటీ గార్డ్ గొడవ
-
సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు
లక్నో: చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్ మాస్క్ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కాగా తుపాకీ తూటాలకు ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీతో కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్‌ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేశ్ కుమార్ తన భార్యతో కలిసి శుక్రవారం పని నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకకు ఎంటరవుతున్న సమయంలో రాజేశ్ ఫేస్‌మాస్క్ పెట్టుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ అడ్డగించాడు. మాస్క్ పెట్టుకుంటేనే లోనికి అనుమతి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో రాజేశ్, సెక్యూరిటీ గార్డ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్ తనవద్ద ఉన్న తుపాకీతో రాజేశ్ తొడపై కాల్చాడు. తీవ్ర రక్తస్రావంతో రాజేశ్ అలాగే కిందపడిపోగా.. పక్కనే ఉన్న అతని భార్య..'' నా భర్తను ఎందుకు కాల్చావు'' అంటూ పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న మిగతావారు అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి తుపాకీతో కాలుస్తావా.. నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని గార్డ్‌ను ఆక్షేపించారు. 27 సెకెన్ల నడివి ఉన్న ఫుటేజీ సీసీటీవీలో రికార్డు అయింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. '' రాజేశ్ మాస్క్ ధరించలేదని.. ఆ విషయం చెప్పానని.. కానీ అతను నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని.. నన్ను బూతులు తిట్టాడు.. దీంతో తుపాకీ చూపించి బెదిరిద్దాం అనుకున్నా.. కానీ తుపాకీ మిస్‌ఫైర్ అయి అతనికి తగిలింది. ఇది అనుకోకుండా జరిగింది''. అని సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు వివరించాడు. చదవండి: మహిళ విషయంలో గొడవ.. పక్కా ప్లాన్‌తో In #Bareilly a railway employee was allegedly shot by bank guard at Junction road branch of Bank of Baroda. Reports claimed that victim was shot following an argument over not wearing mask. Victim taken to district hospital. pic.twitter.com/SzuHRpGZv5 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 25, 2021 -
సెక్యూరిటీ గార్డ్ టు సైబర్ క్రిమినల్!
సాక్షి, సిటీబ్యూరో: నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అర్జున్ బోర సైబర్ నేరగాడిగా మారాడు. తన సోదరుడితో పాటు నాగరాజు అనే వ్యక్తితో కలిసి బ్లాక్ ఫంగస్ మందులు విక్రయిస్తామంటూ ఎర వేసి మోసం చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పట్టుకున్న ఇతడిని పీటీ వారెంట్‌పై బుధవారం సిటీకి తరలించారు. నగరానికి చెందిన ధనుంజయ్ తండ్రి బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. దీని చికిత్సకు వాడే ఇంజెక్షన్ల కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు పరిచయస్తులు బెంగళూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఫోన్ నంబర్ ఇచ్చారు. ధనుంజయ్ ఆ నంబర్లో సంప్రదించగా... రూ.1.29 లక్షలకు ఇంజెక్షన్లు సరఫరా చేయడానికి అంగీకరించాడు. ఇందులో రూ.20 వేలు అర్జున్ ఖాతాకు, మిగిలిన మొత్తం నాగరాజు ఖాతాకు బదిలీ చేయించారు. ఆపై వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన ధనుంజయ్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అర్జున్ను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న ఇతడి సోదరుడితో పాటు నాగరాజు కోసం గాలిస్తోంది. చదవండి: ‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది! -
కోసి కుట్లేయడమే కదా అనుకున్నాడు.. మహిళ మృతి
ఇస్లామాబాద్: అప్పుడప్పుడు ఆర్ఎంపీలు, కాంపౌండర్లు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు చికిత్స చేయడమే కాక ఏకంగా ఆపరేషన్లు కూడా చేస్తూ.. బాధితుల ప్రాణాలతో ఆడుకుంటున్న సంఘటనలను అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. మాజీ సెక్యూరిటీ గార్డు ఒకరు తానే వైద్యుడినని చెప్పి ఓ వృద్ధురాలికి ఆపరేషన్ చేశాడు. దురదృష్టం కొద్ది సర్జరీ వికటించి సదరు మహిళ చనిపోయింది. ఆ వివరాలు.. పాకిస్తాన్ లాహోర్‌కు చెందిన షమీమా బేగం(80) వెన్నులో ఏదో సమస్య తలెత్తింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షమీమా కుటుంబ సభ్యులకు మాజీ సెక్యూరిటీ గార్డ్ మహ్మాద్ వహీద్ బట్ తారసడ్డాడు. తాను ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్నాని నమ్మ బలికి వారి సమస్య ఏంటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత షమీమాకు వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అని చెప్పాడు. తనకు కొంత డబ్బు ఇస్తే.. వెంటనే సర్జరీ చేస్తానని వారికి తెలిపాడు. దాంతో షమీమా కుటుంబ సభ్యులు అతడికి కొంత డబ్బు ఇచ్చారు. బట్ మరో టెక్నిషియన్‌ను తీసుకెళ్లి షమీమాకు ఆపరేషన్ చేశాడు. రెండు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించాడు. ఆ తర్వాత బట్ రెండు సార్లు షమీమా ఇంటికి వెళ్లి డ్రెస్సింగ్ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు షమీమా ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఆపరేషన్ చేసిన దగ్గర తీవ్ర రక్తస్రావం కాసాగింది. దాంతో షమీమాకు గతంలో ఆపరేషన్ చేసిన ఆస్పత్రికే తీసుకెళ్లి పరిస్థితి వివరించగా.. ఆ ఆస్పత్రిలో బట్ అనే డాక్టర్ ఎవరు లేరని తెలిసింది. అప్పటికే షమీమా మృతి చెందింది. ఇక బట్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. అతడిని విధుల నుంచి తొలగించినట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. చదవండి: వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు -
షాకింగ్: మాస్క్ అడగడంతో ఉమ్మేసి మహిళ పరుగు
లండన్: మహమ్మారి వైరస్ రాకుండా ముందస్తుగా ప్రపంచం మొత్తం మాస్క్ ధరిస్తున్నారు. కొందరు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇప్పుడు ప్రతిచోట ‘మాస్క్ ధరిస్తేనే అనుమతి’ అనే బోర్డులు విధించారు. మాస్క్ లేని వారిని అనుమతించడం లేదు. అయితే ఒక షాపింగ్‌మాల్ వద్ద మాస్క్ లేకుండా వచ్చిన మహిళ బీభత్సం సృష్టించింది. మాస్క్ లేదని అడిగిన సెక్యూరిటీ గార్డుపై ఉమ్మేసి పరుగులు పెట్టిన ఘటన వైరల్‌గా మారింది. ఈ సంఘటన యూకేలోని లండన్‌లో జరిగింది. లండన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు ఇద్దరు మహిళలు వచ్చారు. అయితే వారు మాస్క్ ధరించకపోవడంతో వారిని సెక్యూరిటీ గార్డు నిలువరించాడు. మాస్క్ ధరించి రావాలని సూచించాడు. దీంతో ఆ మహిళలు సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగారు. ఆ చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. లోపలకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకోవడంతో అతడిని దుర్భాషలాడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే ఆ ఇద్దరిలోని ఓ మహిళ దూరంగా వచ్చినట్టు చేసి వెంటనే సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి ముఖంపై ఉమ్మేసి పరుగులు పెట్టింది. షాక్‌కు గురయిన సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను పట్టుకునేందుకు ఉరుకులు పెట్టారు. చివరకు ఆమె చిక్కింది. ఆమెపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మాస్క్ ధరించడం వదిలేసి తనకు తానే ఆమె ఇబ్బందులను కొని తెచ్చుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోనిదే కాక సెక్యూరిటీ గార్డుపై ఉల్టా దాడి చేసుడు ఏందమ్మా? అని ప్రశ్నిస్తున్నారు. -
ఈ సెక్యూరిటీ గార్డ్ పని చూస్తే శభాష్ అనాల్సిందే!
ఈ హైటెక్ యుగంలో చదువు పెద్ద ఆర్భాటంగా తయారైంది. ఇష్టంతో కాకుండా ఇంట్లోవాళ్ల పోరు తట్టుకోలేక కష్టంగా చదువున్నవాళ్లే అధికం. అందులోనూ సకల సౌకర్యాలు కల్పిస్తేనే చదుకు కొనసాగిస్తామని తల్లిదండ్రులకు పోరు పెట్టే విద్యార్థులు ఎంతోమంది. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో మాత్రం చదవుకు కావల్సింది ఆసక్తి, శ్రద్ధ మాత్రమేనని చాటి చెబుతోంది. లక్ష్యాన్ని చేరకోవాలంటే కావాల్సింది ఏకాగ్రత, పట్టుదలేనని నిరూపిస్తూ ఓ యువకుడు తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూనే తనకిష్టమైన చదువును కోనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. తన కుటుంబానికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఓ యువకుడు ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అయితే రాత్రి పూట కస్టమర్ల తాకిడి పెద్దగా ఉండదు కాబట్టి ఆ సమయంలో ఖాళీగా ఉండడం కన్నా చదువుకోవడం బెటర్ అని భావించాడు. ఇంకేముంది ఏటీఎం కేంద్రంలోనే చదవడం షురూ చేశాడు. చదవాలనే కోరిక ఉంటే చాలు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చదుకునే వీలుంటుందని నిరూపించాడు. ఈ ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు హిందీలో ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. "హో కహిన్ భీ ఆగ్, ఆగ్ జల్ని చాయే’’ (నిప్పు ఎక్కడున్నా నిప్పే, ఎందుకంటే తన మండే స్వభావాన్నిమార్చుకోదు కాబట్టి). ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి విద్యార్థి ఉన్నాడా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ‘నీ డెడికేషన్ లెవల్‌కి నా సలాం’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ( చదవండి: నడి రోడ్డుపై ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా ) हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. (साभार) pic.twitter.com/auLrv7GIso— Awanish Sharan (@AwanishSharan) April 6, 2021 -
వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
కౌలలాంపూర్: నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేని స్థితిలో బతుకీడుస్తున్నారు అనేది అక్షర సత్యం. ఓ వైపు కొందరు తినలేక ఆహారాన్ని వృధా చేస్తుంటే.. మరి కొందరు చాలినంత తిండిలేక ఆకలితో కృశించి మరణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండటం నిజంగా సిగ్గు చేటు. ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి తాజాగా ఫేస్బుక్లో వైరలవుతోంది. దీని చూసిన వారంతా పాపం.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. మలేషియాకు చెందిన అపిత్ లిడ్ అనే ఫేస్బుక్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేసిన ఈ ఫోటోలో సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అతడి బాక్స్‌లో నీటిలో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ.. మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి. కూర, రసం, పెరుగులాంవంటివి ఏవి లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని.. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ నంజుకుని తింటాడు. ఈ ఫోటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు అపిత్ లిడ్. ‘‘ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తం తనకోసం ఉంచుకుంటాడు. అలా మిగుల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడు. ప్రతి రోజు ఇదే అతడి ఆహారం. దీని గురించి అతడు బాధపడడు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఆరు వేల మంది ఈ స్టోరిని షేర్ చేశారు. ‘‘ఇతడి పరిస్థితి చూస్తే.. చాలా బాధగా ఉంది..ఇలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతావు’’.. ‘‘ఇతడికి సాయం చేయండి’’.. ‘‘ఇతడి జీవితం మనకు ఓ పాఠం నేర్పుతుంది’’.. ‘‘ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్.. నీకు మంచి జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వైరల్: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్ -
రోగిని బురదలో ఈడ్చుకెళ్లిన సెక్యూరిటీ గార్డ్
భోపాల్: అనారోగ్యంతో ఆస్పత్రికి రాగా సెక్యూరిటీ గార్డ్ అమానుషంగా వ్యహరించాడు. బురద నీటిలో ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు. ఈ ఘోరమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది. నా అనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌కాగా.. ఆ సెక్యూరిటీ గార్డుపై దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలోని ప్రధాన ఆస్పత్రికి మానసిక పరిస్థితి సక్రమంగా లేని మహిళ వచ్చింది. చికిత్స చేయమంటూ వైద్యులను అడిగింది. అయితే ఆమె తన వివరాలు సక్రమంగా చెప్పకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వైద్యం చేయడానికి నిరాకరించారు. ఆమె ఎంత బతిమాలినా వినకపోవడంతో ఆమె గేట్ బయటకు వచ్చి కూర్చుంది. అయితే ఆమెను బయటకు వెళ్లాలని అక్కడున్న సెక్యూరిటీ గార్డు చెప్పాడు. ఆమె వెళ్లకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఆమె చేతిని పట్టుకుని లాక్కుంటూ బయటకు తీసుకెళ్లాడు. అక్కడ బురద ఉన్నా కూడా అలాగే తీసుకెళ్తున్న ఘటనను అక్కడున్న వాళ్లు ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు ఇప్పుడు అతడి తీరుపై ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తీవ్ర విమర్శలు రావడంతో ఆస్పత్రి అధికారులు ఆ సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేశారని సమాచారం. Shocking pictures from Khargone district hospital in MP. Pics show a mentally disturbed woman being dragged out of hospital gate by security guard. As per hospital's civil surgeon, the security guard has been removed after the Feb. 18 incident. @NewIndianXpress @TheMornStandard pic.twitter.com/ciqd1PCSx3 — Anuraag Singh (@anuraag_niebpl) February 20, 2021 -
విచారణకు వస్తానని చెప్పి..
సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సెక్యూరిటీ గార్డును ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుమల జపాలీ హనుమాన్ ఆలయంలో బంగారం మాయం విషయంలో సెక్యూరిటీ గార్డ్‌ను విచారణకు మఠం అధికారులు పిలిచారు. విచారణకు వస్తానని చెప్పి సెక్యూరిటీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులే కారణమని ఆయన స్నేహితులు చెబుతున్నారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్య
-
గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): విధి నిర్వహణలో ఉన్న తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మధు (31) చేతిలోని ఎస్ఎల్ఆర్ గన్ పేలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం ఉదయం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. 2010లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎన్నికైన సూర్యాపేట నేరేడుచర్ల మండలం బత్తులపాలెం గ్రామనికి చెందిన ఎ.మధు అంబర్‌పేట్‌లోని న్యూప్రేమ్‌నగర్‌లో భార్య నాగమణి, కుమార్తె రిషిక సాయి, కుమారుడు రిశాంక్ సాయిలతో కలిసి ఉంటున్నాడు. రాణిగంజ్ హైదర్‌బస్తీలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కరెన్సీ చెస్ట్‌లో చెస్ట్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల నుంచి కరెన్సీని ఇక్కడికి తీసుకుని రావడం, ఇక్కడి నుంచి అవసరం ఉన్న చోటకు నగదును తరలిస్తుంటారు. యథావిధిగా ఆదివారం ఉదయం మధు సెంట్రీ డ్యూటీలో చేరాడు. కొద్దిసేపటికి గన్ పేలిన శబ్దం వచ్చింది. తోటి సిబ్బంది, అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు అక్కడికి వచ్చి చూడగా చేతిలో ఎస్ఎల్ఆర్ గన్ (7.62 ఎంఎం)తో రక్తపు మడుగులో మధు పడివున్నాడు. అతన్ని పరిశీ లించగా తీవ్ర రక్తస్రావంతో అప్పటికే మరణించాడు. మహంకాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, క్లూస్ టీమ్‌తోపాటు ఎస్పీఎఫ్ డీజీ గోపాలకృష్ణ కూడా అక్కడికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తూటా అతడి గడ్డం కింది నుంచి నేరుగా తల పైభాగం మీదుగా బయటకు వచ్చి పైన బిల్డింగ్ స్లాబుకు తలిగింది. బుల్లెట్ తగిలిన విధానం చూస్తే మిస్‌ఫైర్ అయినట్లు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. అనారోగ్యం లేదా, అధికారుల వేధింపులతో ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. -
బయటికి వెళ్లొచ్చి బ్యాంకులో దోపిడీ
చండీగఢ్: సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకు ఉద్యోగులను బెదిరించి రూ. 10 లక్షల 44 వేలు లూటీ చేశాడు. అయితే, పోలీసులు సత్వరం స్పందించి నిందితున్ని 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ ఘటన హరియాణాలోని మొహాలీ జిల్లాలో జరిగింది. పార్చ్ గ్రామంలోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో బల్జీత్ సింగ్ సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బ్యాంకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్ పని నిమిత్తం బటయకు వెళ్లారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు, మందులు తీసుకొస్తానని బల్జీత్ సింగ్ కూడా బయటకు వెళ్లాడు. బ్రాంచ్‌లో మేనేజర్ అమన్ గగ్నేజా, ఒక ప్యూన్ మాత్రమే మిగిలారు. అంతలోనే మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో లోనికి ప్రవేశించి వారిద్దరినీ బెదిరించి క్యాష్ బాక్స్‌తో పరార్ అయ్యాడు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తమదైన రీతిలో ప్రశ్నించడంతో బల్జీత్ సింగ్ నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి నగదుతోపాటు ఓ నాటు తుపాకీ, ఐదు తుపాకీ గుళ్ల కార్ట్రిజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: విషాద ఘటనలో ఒంటరైన ‘కూవి’, దాంతో) -
80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిలువ నీడలేని ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో ప్రాంగణంలో తలదాచుకుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఆ వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం.. సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేసింది. వివరాలు.. 80 ఏళ్ల వృద్ధురాలు ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి ట్రామా సెంటర్ వెలుపల పడుకుని ఉంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రా ఆమెపై దెబ్బల వర్షం కురిపించాడు. సదరు గార్డు ఏ మాత్రం కనికరం లేకుండా వృద్ధురాలిని కొట్టడమే కాక కాలితో తన్నాడు. పాపం ఆ ముసలవ్వ నొప్పికి తాళలేక సాయం కోసం కేకలు వేసింది. ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారు తప్ప గార్డును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. (కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు) ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం వృద్ధురాలిని అదే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. అంతేకాక సదరు గార్డ్ సంజయ్ మిశ్రాను విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఆస్పత్రి యాజమాన్యం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం శోచనీయం అన్నారు. అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
‘నేను మర్కజ్‌కు వెళ్లలేదు’
న్యూఢిల్లీ: తమ దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డు వల్లే తమకు కరోనా సోకిందని ఓ కుటుంబం పోలీసులను ఆశ్రయించిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఈ కుటుంబానికి చెందిన ఎనభైయేళ్ల వృద్ధుడు బుధవారం కరోనాతో మరణించగా, అతని కొడుకు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. అతని భార్య ఈ మధ్యే కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. అయితే తమకు కరోనా సోకడానికి సెక్యూరిటీ గార్డు కారణమని, అతను వైరస్‌కు ప్రధాన కేంద్రంగా నిలిచిన నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్ సభ్యుల మతపర కార్యక్రమానికి వెళ్లాడని ఆరోపణలు గుప్పించింది. (కరోనాకు ‘ప్లాస్మా’ చికిత్సే మందు) దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గార్డు మర్కజ్ సమావేశాన్ని సందర్శించి ఉండవచ్చని నోటీసులు అంటించి కాలనీ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆనాటి నుంచి ఓక్లాలోని గదిలో క్వారంటైన్లో ఉంటున్న సెక్యూరిటీ గార్డుకు ఏప్రిల్ 11న పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అతని ద్వారా ఆ కుటుంబానికి కరోనా సోకలేదని నిర్ధారణ అయింది. దీనిపై సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. "ఇప్పటివరకు నేనెప్పుడూ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లలేదు, వెళ్లను కూడా. కేవలం నాకు దగ్గరలో ఉన్న మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసుకుంటాను. నేను మీకు అబద్ధం చెప్పను" అని పేర్కొన్నాడు. (పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా) -
డీమార్ట్‌లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు
-
డీమార్ట్‌లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్ : హయత్ నగర్ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సతీష్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వనస్థలిపురం డిమార్ట్ వద్ద ఆదివారం రాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. డిమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది కొట్టడం వల్లే తమ కూమారుడు మృతి చెందాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, డిమార్ట్ సెక్యూరిటీ సతీష్‌ను కొట్టలేదని, చాక్లెట్ దొంగిలించాడనే భయంతో అతను కిందపడిపోయి మృతి చెందాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. (చదవండి : చాక్లెట్ నేరం; విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి) ‘షాపింగ్ చేస్తుండగా సతీష్ చాక్లెట్‌ను జేబులో వేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ తనిఖీలు చేస్తున్న సమయంలో సతీష్ దానిని కిందపడేశాడు. అయినప్పటికీ ఇంకో మహిళా సెక్యూరిటీ చాక్లెట్‌ను తీసుకొని సతీష్‌ను పట్టుకున్నారు. దీంతో సతీష్ సొమ్మసిల్లి సెక్యూరిటీ గార్డ్ మీద పడిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ ఇదంతా యాక్టింగ్ అని, ఇలాంటి వాళ్లను చాలామందిని చూశానని అన్నారు. అప్పటికే మేమంతా సతీష్ దగ్గరకు వచ్చి కాళ్లు, చేతులు రఫ్ చేశాం. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే సతీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డీ మార్ట్ సెక్యూరిటీ సతీష్‌ను కొట్టలేదు. చాక్లెట్ దొంగిలించినందుకు సతీష్ భయంతో పడిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపల్‌కు తెలియాజేశాం’ అని సతీష్ తోటి విద్యార్థులు పేర్కొన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించం : ఎల్బీనగర్ డీసీపీ సతీష్ మరణం దురదృష్టకరమని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఘటనపై సతీష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. డీమార్ట్ సెక్యూరిటీ గార్డ్ ఘర్షణకు దిగి దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్ తండ్రి ఆరోపిస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీమార్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను, సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను కలెక్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించేది లేదని డీసీపీ పేర్కొన్నారు. డీమార్ట్ సిబ్బంది దాడి వల్లే మృతి డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ సతీష్ బంధువులు డీమార్ట్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే సతీష్ మృతి చెందారని, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఔటింగ్ పంపించే సమయంతో కాలేజీ యాజమాన్యం తమ అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. అనుమతి తీసుకున్నాం కాలేజీ నుంచి విద్యార్థులను ఔటింగ్ పంపడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకుంటామని హయత్ నగర్ శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. సతీష్‌ని బయటకు పంపేముందు తల్లిదండ్రులకు ఫోన్ చేశామని, వారు లిఫ్ట్ చేయలేదన్నారు. దీంతో సతీష్ నాయక్ బావ అనుమతి తీసుకొని ఔటింగ్‌కు పంపించామని చెప్పారు. గంట పాటు ఔటింగ్‌కు అనుమతి కోరుతూ సతీష్ లెటర్ కూడా ఇచ్చారని తెలిపారు. సతీష్ మృతి పట్ల కళాశాల యాజమాన్యం తప్పులేదన్నారు. సతీష్ చనిపోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
-
నీ భార్యా, కొడుకును కాల్చేశా: దోషికి ఉరిశిక్ష!
చండీగఢ్: గురుగ్రాంలో కలకలం సృష్టించిన న్యాయమూర్తి కృష్ణకాంత్ గార్గ్ భార్య, ఆయన కొడుకు హత్య కేసులో హర్యానా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరిపై కాల్పులకు పాల్పడిన సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో దాదాపు 64 మంది సాక్షులను విచారించిన తర్వాత దోషి మహిపాల్‌కు మరణ దండన విధిస్తున్నట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి సుధీర్ పర్మార్ తీర్పు వెలువరించారు. కాగా 2018 అక్టోబరులో హర్యానాలోని గురుగ్రామ్‌లో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య రీతూ, కొడుకు ధృవ్‌పై వారి సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మార్కెట్లో అందరి ముందే ఘాతుకానికి పాల్పడిన అతడు.. అనంతరం వారి కారులో అక్కడి నుంచి పారిపోయాడు. జడ్జికి ఫోన్ చేసి.. ‘నీ భార్యా, కొడుకును కాల్చి చంపేశా’ అని చెప్పాడు. ( మహిపాల్ హంతకుడిగా మారడం వెనుక అసలు కారణం అదేనా?!) మహిపాల్ సింగ్ పెళ్లినాటి ఫొటో ఇక ఈ ఘటనలో గాయపడిన రీతూ చికిత్స పొందుతూ మరణించగా, అతని కుమారుడు ధ్రువ్ బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో ఫరీదాబాద్ వద్ద పోలీసులు మహిపాల్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తనకు సెలవులు ఇవ్వకపోవడం, వేధించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మహిపాల్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల విచారణ అనంతరం మహిపాల్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇక మహిపాల్ స్వగ్రామం మహేంద్రగఢ్ కాగా.. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిపాల్ భార్య టీచర్‌గా పనిచేస్తోంది. వృత్తిపరమైన ఒత్తిళ్లతో పాటు వ్యక్తిగతంగా కూడా మహిపాల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని.. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఈ విధంగా ప్రవర్తించి ఉంటాడని అతడి సన్నిహితులు గతంలో మీడియాకు తెలిపారు. -
మూగజీవి అని కూడా చూడకుండా..
గురుగ్రామ్ : ఓ వీధి కుక్కపై కొందరు సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం గురుగ్రామ్‌లో కలకలం రేపింది. మూగజీవి అని కూడా చూడకుండా దారుణంగా హింసించారు. అంతేకాకుండా బతికుండానే దానిని పాతిపెట్టేందుకే యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్ సెక్టార్ 49లోని ఓ కాస్ట్లీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోకి శుక్రవారం సాయంత్రం ఓ వీధి కుక్క ప్రవేశించింది. దీంతో ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులు వీధి కుక్కను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ కుక్క బయటకు వెళ్లలేదు. దీంతో సెక్యూరిటీ సూపర్వైజర్ ఆదేశాల మేరకు అక్కడి గార్డులు కుక్కపై తమ వద్ద ఉన్న లాఠీలతో దాడి చేశారు. అది మూగజీవి అన్న సంగతి మరచి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో కుక్క కాలుకు, తలకు బలమైన గాయాలు కావడంతో అది అక్కడే నేలమీద పడిపోయింది. అలా పడిపోయిన కుక్కను అపార్ట్మెంట్ బయటకు తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డులు.. ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనిని గమనించిన కొందరు జంతు ప్రేమికులు గార్డుల చర్యను అడ్డుకున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన కుక్కను.. దగ్గర్లోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కుక్క పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. జంతు పరిరక్షణ చట్టం ప్రకారం ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులు, వారి సూపర్వైజర్పై కేసు నమోదు చేశామని తెలిపారు. అక్కడ సీసీటీవీ దృశ్యాల్లో వారు కుక్కను హింసించిన దృశ్యాలు నమోదయ్యాయని.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుక్కపిల్లలపై విద్యార్థుల దాడి.. బెంగళూరు : అలాగే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నలుగురు స్కూల్ విద్యార్థులు.. ఓ ఖాళీ ప్లాట్‌లో నిద్రిస్తున్న కుక్క పిల్లలపై దాడికి ప్పాలడ్డారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. దీంతో అవి అరవడం మొదలు పెట్టాయి. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడి చేరుకుని విద్యార్థులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారు అప్పటికే అక్కడ నుంచి పారిపోయారు. సాయంత్రం తిరిగి అక్కడికి వచ్చినవారు.. ఒక కుక్కపిల్లను రాడ్డుతో గట్టిగా కొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆ కుక్క పిల్లను స్థానికులు దగ్గర్లోని వెటర్నరీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ మూడోసారి అక్కడికి వచ్చిన విద్యార్థులు మిగిలిన రెండు కుక్కపిల్లలపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఆ విద్యార్థుల పనులతో ఆగ్రహానికి లోనైన ఓ స్థానికుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల దాడిలో గాయపడ్డ ఆ మూగజీవాలను ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్చారు. అందులో ఓ కుక్కపిల్లకు దవడ విరిగినట్టు వైద్యులు గుర్తించారు. కాగా, ఆ విద్యార్థుల వయసు 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. -
సెక్యూరిటీ గార్డుల సంక్షేమానికి ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ముసాయిదా విధాన పత్రాన్ని రూపొందించింది. ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సెంట్రల్ (అమెండ్మెంట్) మోడల్ రూల్స్, 2019’ ముసాయిదాపై అభిప్రాయాలను, సూచనలను ఇవ్వాల్సిందిగా వ్యక్తులు, సంస్థలను కోరుతూ హోం శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 90 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు అంచనా. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు లైసెన్స్లిచ్చేందుకు ఇప్పటికే హోం శాఖ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. లైసెన్సుల జారీకి ఆయా ఏజెన్సీల డైరెక్టర్లు, భాగస్వామ్యులు, యజమానుల వివరాలను వ్యక్తిగతంగా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం లేదని కూడా గతంలో హోంశాఖ ప్రకటించింది. ముసాయిదా నిబంధనలను mha.gov.in/sites/default/files/private SecurityAgenies&06112019.pdf నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో హోంశాఖ పేర్కొంది. అభిప్రాయాలు, సూచనలను us&pm@nic.inMకు డిసెంబర్ 6 లోపు పంపించాలని కోరింది. -
మా కడుపులు కొట్టొద్దు
సాక్షి, అనంతపురం : ‘సర్వజనాస్పత్రిలో చాలా ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్నాం. వచ్చే జీతం డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇప్పుడేమో మా కన్నా సీనియారిటీ తక్కువున్న వాళ్లని పెట్టుకుని మమ్మల్ని తీసేశామని చెబుతున్నారు. ఇలా అన్యాయంగా తొలగించి మా కడుపులు కొట్టొద్దు’ అంటూ పలువురు సెక్యూరిటీ గార్డులు వేడుకున్నారు. న్యాయం చేయాలని కోరుతూ గురువారం సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డు మునీరా బేగం మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం తనను వైద్య కళాశాలలోని హౌస్‌సర్జన్ హాస్టల్ వద్దకు మార్చారన్నారు. ఇప్పుడేమో నీవు వైద్య కళాశాల పరిధిలో పనిచేశావని తమకు సంబంధం లేదంటున్నారని వాపోయారు. తన భర్త మరణించడంతో కుటుంబాన్ని తానే పోషిస్తున్నానని, తనకు న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరో మహిళ విజయమ్మ మాట్లాడుతూ అన్యాయంగా సీనియారిటీ ఎక్కువగా ఉన్న వారిని తొలగించారని, న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎందుకిలా? కాగా, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుల నియామకాల్లో ఆస్పత్రి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియారిటీని పక్కన పెట్టి కేవలం గత సెక్యూరిటీ ఏజెన్సీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని అమాయకులకు అన్యాయం చేశారని తెలుస్తోంది. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తించిన వారిని కాదని వేరే వాళ్లకు అవకాశం కల్పించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు అధికారులు సెక్యూరిటీ నియామాలను ఇష్టానుసారంగా చేపట్టారు. వాస్తవంగా గత నెలలోనే సెక్యూరిటీ సిబ్బందిని తొలగిస్తామని ఆస్పత్రి యాజమాన్యానికి మెయిల్ వచ్చింది. సీనియారిటీ జాబితాను యాజమాన్యం కోరినా.. సదరు జయబాలాజీ ఏజెన్సీ తప్పులతడకగా సీనియారిటీ జాబితాను ఇచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయం కొందరు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కై ఈ అక్రమ బాగోతానికి తెరలేపారన్న విమర్శలున్నాయి. -
సిటీలో సీక్రెట్ పోలీస్
సాక్షి, సిటీబ్యూరో: నగరాభివృద్ధికి గుండెకాయ లాంటిదైన ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతల చిన్న సమస్య తలెత్తినా అది ఏకంగా రాష్ట్రాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్న ఐటీ కారిడార్‌లో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా లేకుంటే... అది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఐటీ కారిడార్‌తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ కత్తి మీద సామే. ఈ పరిస్థితుల్లో జనాభా అవసరాలకు సరిపడా సిబ్బంది లేకున్నా... ఓవైపు పోలీసులు, మరోవైపు సీసీ కెమెరాల డేగ కళ్లతో నేరాలను నియంత్రణ సాధ్యమవుతోంది. ఇప్పుడిదే పంథాలో భద్రత కోసం సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సరికొత్త చర్యలు తీసుకుంటున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను కొంతమందిని ఎంపిక చేసుకొని పోలీసు వలంటీర్లుగా సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ‘పోలీసు మిత్ర’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి, సెక్యూరిటీ గార్డులను ఖాకీ దుస్తులు లేని పోలీసులుగా మార్చే ప్రక్రియను వేగిరం చేశారు. దాదాపు నెల రోజుల్లో అమల్లోకి రానున్న ఈ కార్యక్రమానికి తుదిరూపునిచ్చే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చే సెక్యూరిటీ గార్డుల వివరాలు గోప్యంగా ఉంచనున్నారు. డేటాబ్యాంక్ ఆధారంగా.. కమిషనరేట్ పరిధిలో 125 కంపెనీలు వివిధ వ్యాపార, ఐటీ, హోటల్స్... ఇలా వివిధ సంస్థలకు భద్రతను కల్పిస్తున్నాయి. సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 18న ఆయా కంపెనీల హెడ్స్‌తో సమావేశం నిర్వహించిన సీపీ సజ్జనార్.. సెక్యూరిటీ గార్డుల నియామకం, వారి పనితీరును అంచనా వేస్తూ డేటాబ్యాంక్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రవర్తన బాగా లేకున్నా, నేర చరిత్ర ఉన్నా పక్కకు తప్పించాలని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఆయా కంపెనీల్లోని సెక్యూరిటీ గార్డులకు పోలీసులు టాక్టిక్స్, ఇంటెలిజెన్స్ అంశాల్లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సీసీటీవీ కెమెరాల నిర్వహణ, ఫేస్ రికగ్నేషన్, నంబర్ ప్లేట్ రికగ్నేషన్ తదితర భద్రత చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. విధులు ఉన్న సమయంలో అక్కడి పరిసరాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించేలా ట్రైనింగ్ ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు కళ్లుగా వ్యవహరించాలన్న సీపీ సజ్జనార్ ఆదేశాల ప్రకారం వారు పోలీసు మిత్రలుగా వ్యవహరించనున్నారు. ఏం చేస్తారు? 3లక్షల మంది సెక్యూరిటీ గార్డులున్నప్పటికీ వారి ప్రవర్తన, పనితీరు, వ్యక్తిగత విధానం, సైబర్ నైపుణ్యం, పోలీసులతో కలిసి పనిచేసే ఆసక్తి తదితరాలను క్రోడీకరించాకే ‘పోలీసు మిత్ర’లుగా తీసుకుంటున్నారు. వీరు ఉండే ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే ఆయా సెక్యూరిటీ గార్డులుండే వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టు చేయడంతో పోలీసులు చూస్తారు. లేదంటే వారి పరిధిలోని పోలీసులకు సమాచారమిస్తే నేరుగా అక్కడికి చేరుకొని అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. అలాగే ఏదైనా ప్రమాదం, చోరీ జరిగినా... అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసినా.. ఇలా నేరానికి సంబంధించి ఏ అంశమైనా పోలీసులకు సీక్రెట్‌గా తెలియజేస్తారు. ఆయా ప్రాంతాల్లోని మిగతా సెక్యూరిటీ గార్డులకు కూడా వీరు పోలీసు మిత్రలనే విషయం తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. పోలీసు మిత్రలకు ప్రశంస పత్రాలు, ప్రోత్సాహకాలు కూడా అందించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ‘సైబర్ మిత్ర’ కార్యక్రమం రూపొందించిన సైబరాబాద్ పోలీసులు... ఇప్పుడు ‘పోలీసు మిత్ర’తో నేర రహిత సమాజం కోసం ముందడుగు వేస్తున్నారు. -
మద్యం మత్తులో ‘గాంధీ’ సెక్యూరిటీ గార్డుల డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో టిక్‌టాక్‌ల వ్యవహారం సద్ధుమణగక ముందే ఆస్పత్రి అత్యవసర విభాగంలో మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డులు చేసిన డ్యాన్సులు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆస్పత్రి పాలనయంత్రాంగం నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గాంధీ ఆస్పత్రిలో ఎజిల్ సెక్యూరిటీ సంస్థ తరుపున సుమారు 200 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో వి«ధి నిర్వహణలో ఉంటూనే మద్యం మత్తులో కే.కట్టయ్య అనే గార్డు డ్యాన్స్ చేస్తుండగా అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న బీ. శ్రీనివాస్, ఎన్ వెంకటస్వామి, వి. వెంకటేష్ అనే గార్డులు మరింత ఉత్తేజ పరుస్తూ సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు.సదరు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టి మద్యం మత్తులో డ్యాన్స్ చేసిన కట్టయ్యతోపాటు మిగిలిన ముగ్గురిని విధుల నుంచి తొలగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. సదరు వీడియో ఈనెల 21వ తేది ఉదయం 8.30 గంటలకు అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో చిత్రీకరించగా, శనివారం సామాజక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. నిర్వహణ సంస్థ ఎజిల్ సెక్యూరిటీ సంస్థకు నోటీసులు జారీ చేశారు. టిక్‌టాక్ వ్యవహారంపై సీరియస్... గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో జరిగిన టిక్ టాక్ వ్యవహారాన్ని ఆస్పత్రి పాలనయంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. సదరు అప్రెంటీస్ విద్యార్థులను తొలగించడంతో పాటు రాంనగర్ సాధన పారామెడికల్ కాలేజీ, అత్తాపూర్ జెన్ ఓకేషనల్ కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇకపై సదరు కాలేజీలకు చెందిన విద్యార్థులకు గాంధీ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు ఇతర సిబ్బంది విధి నిర్వహణలో ఉంటు టిక్ టాక్‌లు, సుదీర్ఘ సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్, వీడియో చిత్రీకరణ చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ఫిజియోథెరపీ విభాగ వైద్యులకు నోటీసులు ఇవ్వడంతోపాటు కమిటీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. -
సెక్యూరిటీ గార్డే బలి పశువు
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యానికి ఒక సామాన్య సెక్యూరిటీ గార్డు బలయ్యాడు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే అర్ధంతరంగా అతడిని విధుల నుంచి తొలగించడంతో ఖమ్మంలోని పెద్దాస్పత్రి మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. ఆదివారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సమయానికి డాక్టర్లు, నర్సులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ ఎక్కించిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిర్లక్ష్యంపై ‘సాక్షి’ ప్రధాన, జిల్లా సంచికల్లో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఇంకా పలు పత్రికల్లో వార్తలు రావడం, చానళ్లలో ప్రసారం కావడంతో పెద్దాస్పత్రిలో ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, సెలైన్ ఎక్కించిన సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడంపై సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శించిన డాక్టర్లు, నర్సులపై చర్య తీసుకోకుండా సెక్యూరిటీ గార్డును బలిపశువును చేయడమేంటని? ఖండించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. సెక్యూరిటీ గార్డును విధుల్లోకి తీసుకొని బాధ్యులైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులు పదిలం.. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కాన్పుకు వచ్చే గర్భిణులకు ప్రసవం తర్వాత వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి..డిశ్చార్జ్ అయ్యే వరకు..డాక్టర్లు, నర్సులు పర్యవేక్షిస్తూ..వైద్యసేవలు అందించాలి. 24 గంటలూ షిఫ్టుల వారీగా వారికి డ్యూటీలు వేస్తారు. కానీ విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడం, వారి స్వంత క్లీనిక్‌లు చూసుకోవడంపై దృష్టి పెడుతుండటంతో బాలింతలు, చిన్నారులకు సరైన వైద్యం అందట్లేదనేది ఆరోపణ. సమయానికి ఎవ్వరూ అందుబాటులో ఉండక..కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో అక్కడి స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు బాలింతలకు సహాయం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే..తాజాగా సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సదరు గార్డు సెలైన్ పెట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులను వదిలేసి తాత్కాలిక ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వారిని రక్షించేందుకే సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారని, ఎలాంటి విచారణ చేపట్టకుండా..తీసేయడం అనుమానాలకు బలం చేకూర్చినట్లైంది. డబ్బులు వసూలు చేస్తున్నారా? డెలివరీ వీడియో తీశారా? – ప్రత్యేకాధికారి విచారణ పెద్దాస్పత్రిలో చోటు చేసుకున్న వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారును ఆదేశించింది. అందులో భాగంగా వైద్య విధాన పరిషత్ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఏ. రాజశేఖర్ బాబు సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు. డాక్టర్లు, నర్సులను వేర్వేరుగా పిలిచి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డు సెలైన్ పెట్టిన సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు? అందుబాటులో లేనిదెవరు? తదితర విషయాలపై విచారించారు. గతంలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. ప్రసవించిన సమయంలో మగ, ఆడ పిల్లలు పుడితే ఒక్కోరేటు పెట్టి పేషంట్ల వద్ద నుంచి డబ్బులు గుంజుతున్న విషయంపై కూడా అడిగారు. డాక్టర్లకు స్వంతంగా ఎవరెవరికి క్లీనిక్‌లు ఉన్నాయో తెలుసుకున్నారు. గత నెల ప్రసవ సమయంలో వీడియోలు తీసిన ఘటనపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి ఆర్ఎంఓ కృపా ఉషశ్రీ, డాక్టర్ మంగళ పాల్గొన్నారు. బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింతకు సెక్యూరిటీ గార్డు సెలైన్ ఎక్కించిన ఘటనకు సంబంధించి..పూర్వాపరాలు విశ్లేషించి, ఇంకా చోటు చేసుకున్న వరుస ఘటనలకు కారణమైన బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. డాక్టర్లు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్ వదిలి వెళ్లకూడదు. ప్రసవమప్పుడు బంధువుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే ఇంటికి పంపిస్తాం. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అందుకోసం స్వతహాగా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రేను అతి త్వరలో అందుబాటులోకి తెస్తాం. – రాజశేఖర్ బాబు, వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర ప్రత్యేకాధికారి -
బాడీగార్డ్ చెంప పగలగొట్టిన సల్మాన్!
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్’ బుధవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వెలువడుతుండగా.. మరోవైపు సల్మాన్ చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ చెంప ఛెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చినట్టు కనిపిస్తున్న సల్మాన్.. వాహనం నుంచి దిగివస్తుండగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. నడుస్తూ వెళ్తున్న సల్మాన్ ఫొటోలు తీసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుండటంతో.. ఆయనకు ఇబ్బంది కలుగకుండా బాడీగార్డులు రక్షణవలయంగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో కొంతదూరం నడిచాక ఒక్కసారిగా వెనకితిరిగిన సల్మాన్ ఓ బాడీగార్డ్‌కు వార్నింగ్ ఇస్తూ చెంప పగలగొట్టారు. ఈ ఘటన వీడియోలో రికార్డ్ అయింది. ఓ బాల అభిమాని సల్మాన్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా బాడీగార్డు అతనితో దురుసుగా ప్రవర్తించి.. పక్కకు తోసేశాడని, ఇది గమనించి సల్మాన్ బాడీగార్డ్ చెంపపగలగొట్టాడని వినిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Omg, @BeingSalmanKhan literally slapped a security guard for getting rough with a fan kid! #Bharat #SalmanKhan pic.twitter.com/05VFSRecmP — 🎐 (@heartgetshurt) June 5, 2019 -
సెక్యూరిటీ గార్డుపై ఇళయ రాజా ఫైర్
-
ఇళయరాజాకు ఏమైంది? వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. మైధోహక్కులపై గత కొంతకాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఇళయ రాజా సెక్యూరిటీ గార్డ్‌పై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే అక్కడున్న ఆడియన్స్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇళయరాజా 76వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల(జూన్ 2) చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గానగంధర్వులు సుబ్రహ్మాణ్యం, జేసుదాసు, ఇతర ప్రముఖ గాయనీగాయకులు కూడా హాజరయ్యారు. ఈవీపీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన మ్యూజికల్ కన్సర్ట్‌లో ఇద్దరు లెజెండ్స్ (బాలు, ఇళయరాజా) ఒకే వేదిక ద్వారా ప్రేక్షకులను అలరించడం మరపురానిదిగా పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ స్టేజ్‌పై ఉన్న గాయకులకు మంచి నీళ్ళ సీసాలు ఇవ్వడానికి వెళ్లాడు. ఇదే ఇళయ రాజాకు కోపం తెప్పించింది. అనుమతి లేకుండా నువ్వు స్టేజ్‌పైకి వచ్చి ఎందుకు కార్యక్రమాన్ని నాశనం చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఫలించకపోవడంతో చివరకు ఇళయరాజాకి క్షమాపణలు చెప్పి కాళ్ళు మొక్కి వెళ్లిపోయారు. అయినా తన అసహనాన్ని కొనసాగించిన ఇళయరాజా ఆడియన్స్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 టిక్కెట్స్ కొనుక్కున వారు ఎలా కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారితోపాటు, వీడియోను వీక్షించిన నెటిజన్లు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. కాగా తాను స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదన. దీనిపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి తెలిసిందే. మరోవైపు సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్రకటించి అందర్నీ ఆకట్టుకున్నారు. செக்யூரிட்டு இளையராஜா கால்ல விழுந்தாரே அந்த வீடியோ இருக்கா ப்ரோ — sakthi (@imsakthi1) June 2, 2019 -
ఛండీగడ్ గార్డుకు సలాం.. ఏం చేశాడంటే
చండీగఢ్ : పది రూపాయలు దొరికినా గుట్టుగా జేబులో వేసుకునే ఈ రోజుల్లో చండీగడ్‌లో ఒక సినిమా హాల్లోని సెక్యూరిటీ గార్డు చూపించిన నిజాయితీ ఆదర్శంగా నిలిచింది. లక్షల రూపాయల విలువ చేసే డైమండ్ బ్రాస్లెట్ను తిరిగి నిజమైన యజమానురాలికి ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కించుకుంటోంది. వివరాల్లోకి వెళితే..వివాహ వార్షికోత్సవ కానుకగా భర్త బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ బ్రాస్లెట్ను మీనాక్షి గుప్తా సినీపోలిస్ సినిమా హాల్లో పోగొట్టుకున్నారు. దీనికోసం వెతికి వెతికి నిరాశ చెందిన మీనాక్షి చివరి ప్రయత్నంగా సినీపోలిస్ థియేటర్లోని పోలీసులను సంప్రదించారు. ఆ ఆశే ఆమెకు అంతులేని సంతోషాన్ని మిగిల్చింది. నిజాయితీగల, నిఖార్సైన సెక్యూరిటీ గార్డును ప్రపంచానికి పరిచయం చేసింది. తన భర్త ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ పోవడంతో చాలా షాకయ్యాననీ, కానీ గార్డు నిజాయితీ తనకు అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు మీనాక్షి. నాలుగు సంవత్సరాల క్రితం దీని విలువ రూ. 2 లక్షలు అని తెలిపారు. ఇంతకీ ఈ స్టోరీలోని రియల్ హీరో పేరు సూరజ్, చండీగఢ్ నివాసి. గత ఏడు నెలలుగా సినీపోలిస్ సినిమా హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షో అయిపోగానే ప్రతీ సీటును క్షుణ్ణంగా పరిశీలిస్తామని సూరజ్ చెప్పారు. ప్రతీరోజు సెల్‌ఫోన్, బంగారు నగలు లాంటి విలువైన వస్తువులు దొరుకుతూనే ఉంటాయనీ వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి పోగొట్టుకున్నవారికి అందిస్తామన్నారు. నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే మనకు మిగులుతుంది.. అప్పనంగా వచ్చింది ఏదో ఒక రూపంలో పోతుందంటూ సూరజ్ పేర్కొనడం విశేషం. అంతేకాదు బ్రాసెలెట్ను జాగ్రత్తగా భద్రపరిచిన పెట్టిన సూరజ్..అడిగిన వెంటనే అలవోకగా మీనాక్షికి ఆ నగను స్వాధీనం చేయలేదు. దాని ఖరీదుకు సంబంధించిన బిల్లు, ఫోటో, ఆధార్‌కార్డు లాంటివి తీసుకుని పూర్తిగా ధృవీకరించుకున్న తరువాత మాత్రమే అప్పగించడం గమనార్హం. -
నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు
సినీ పరిశ్రమకున్న క్రేజ్ చాలా ప్రత్యేకమైనది. ఆ తళుకుబెళుకులకు అలవాటు పడిన వారు సాధరణ జీవితం గడపలేరు. అవకాశాలు తగ్గిపోతే డిప్రెషన్లోకి వెళ్లడం.. నేరాలకు పాల్పడటం.. ఆఖరుకి ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలను చూస్తూనే ఉంటాం. కానీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి నేడు.. సెక్యూరిటీ గార్డుగా అనామక జీవితం గడుపుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి పలువురు ప్రముఖుల దృష్టిని ఆకర్షించడమే కాక అభినందనలు కూడా అందుకుంటుంది. వివరాలు.. ‘బ్లాక్ ఫ్రైడే’, ‘గులాల్’, ‘పాటియాల హౌస్’ వంటి పలు చిత్రాల్లో నటించిన సావి సిద్ధు ప్రస్తుతం అవకాశాలు లేక సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి.. సెక్యూరిటీ గార్డుగా చేరాల్సి వచ్చిన పరిస్థితుల గురించి ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ‘12 గంటల ఈ ఉద్యోగం చాలా కష్టమైనది. చాలా మెకానికల్ జాబ్. బస్సు టికెట్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఇక సినిమా టికెట్ కొనడం అనేది నా జీవితంలో ఓ కలగా మారింది. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు’ అంటూ సావి వీడియోలో తన కష్టాల గురించి తెలిపారు. ఆన్లైన్లో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియో రాజ్‌కుమార్ రావ్, అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖుల దృష్టికి వచ్చింది. దాంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు సదరు యూ ట్యూబ్ చానెల్‌కి కృతజ్ఞతలు తెలపడమే కాక సావి ఎంచుకున్న మార్గం ఎందరికో ఆదర్శంగా నిలిచిందంటూ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. అంతేకాక తన పరిచయస్తులకు సావి గురించి చెప్పి అవకాశాలు ఇప్పిస్తానని తెలిపాడు. ఇక ఈ వీడియో గురించి అనురాగ్ కశ్యప్ ‘నేను సావి సిద్ధును గౌరవిస్తాను. అవకాశాలు రాని వారు చాలా మంది తాగుతూ.. ఇతర మార్గాల్లో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ సావి మాత్రం గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. బతకడం కోసం ఆయన ఎన్నుకున్న మార్గం చాలా ఉత్తమైనది. డబ్బులిచ్చి ఆయన స్వాభిమానాన్ని దెబ్బ తీయకూడదు. వారికి సాయం చేయాలనుకుంటే డబ్బు చెల్లించి వారి కళను ఆస్వాదించండి’ అంటూ ట్వీట్ చేశారు. There are so many actors out there who don’t have work. I respect Savi Siddhu as an actor and have cast him thrice when he earned the role. I respect him that he chose to live his life with dignity and picked a job unlike so many entitled out of work actors who have either — Anurag Kashyap (@anuragkashyap72) March 19, 2019 -
పాండాల ఎన్‌క్లోజర్‌లో చిక్కుకున్న చిన్నారి...!
బీజింగ్ : పాండాల ఎన్‌క్లోజర్‌లో చిక్కుకున్న ఓ చిన్నారిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు... చెంగ్డూ రీసెర్చ్ బేస్ వద్ద పాండాలను వీక్షించేందుకు ఎనిమిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె పాండాల ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. ఆ సమయంలో లోపల మూడు పాండాలు ఉన్నాయి. చిన్నారిని చూసిన పాండాలు మెల్లగా తన దగ్గరికి రావడంతో ఆమె బెంబేలెత్తి పోయింది. సమాచారం అందుకున్న రక్షణా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు. కాగా ఈ ఘటనను సిచువాన్ రీసెర్చ్ ఫెసిలిటీ తీవ్రంగా పరిగణించింది. ‘పాండాలు పైకి కనిపించేంత సాత్వికమైన జంతువులేమీ కావు. ఇక ఇంకో విషయం వాటి కాపలాదారులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారిని చాకచక్యంగా పైకి తీసుకువచ్చిన గార్డు లియూ గిహువాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కెనరా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
సాక్షి, వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట కెనరాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. వెల్దుర్తి సెంట్రల్‌బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించిన ఘటన మరువకముందే మళ్లీ దుండగులు మరో బ్యాంకులో చోరీకియత్నించారు. గ్యాస్‌కట్టర్ సహాయంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అప్రమత్తతతో దుండగులు పరారయ్యారు. బ్యాంక్‌లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ కెనరాబ్యాంక్‌లో దుండగులు చొరబడి బంగారు నగలతో పాటు లాకర్లలోని నగదు ఎత్తుకెళ్లండంతో, చోరీ ప్రయత్నం ఘటన తెలుసుకున్న ఖాతాదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. చివరికి లోనికి ప్రవేశించకుండానే దుండగులు పరారయ్యారని తెలుసుకుని ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. సంఘటనకు సంబంధించిన వివరాలను చేగుంట ఎస్సై సత్యనారాయణ, బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల 30నిమిషాల సమయంలో బ్యాంక్‌లో అలారం మోగింది. దీంతో అక్కడే కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు గణేష్ అప్రమత్తమై బ్యాంకు చుట్టూ కలియతిరిగాడు. ఈ క్రమంలో బ్యాంక్ వెనుక భాగంలో ఇద్దరు దుండగులు కిటికీ గ్రిల్స్ గ్యాస్‌కట్టర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. సెక్యూరిటీ గట్టిగా అరుపులు చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు గ్యాస్ సిలిండర్లను అక్కడే వదిలి పరారయ్యారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, బ్యాంక్‌మేనేజర్ బ్యాంక్‌లో పరిశీలించి ఎలాంటి అపహరణ జరగలేదన్నారు. బ్యాంక్ వద్ద ప్రత్యేక సెక్యూరిటీ గార్డును ఉంచడంతో పాటు బ్యాంకులో రక్షణ చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. -
రాష్ట్రపతి రక్షకుల నియామకంలో వివక్ష
న్యూఢిల్లీ: రాష్ట్రపతి బాడీగార్డుల నియామక ప్రక్రియలో మూడు కులాల వారికే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హరియాణాకు చెందిన గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్మీ చీఫ్, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్లతో పాటు రాష్ట్రపతి భద్రతా సిబ్బంది కమాండెంట్లకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎస్.మురళీధర్, సంజీవ్ నారులాతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. కోర్టుకు సమర్పించిన వివరణలో ఏమైనా పొరపాట్లు, సవరణలు ఉంటే వాటిని వచ్చే ఏడాది మే 8వ తేదీ లోపు అందించవచ్చని పేర్కొంది. రాష్ట్రపతి బాడీగార్డుల కోసం 2017 సెప్టెంబర్ 4న చేపట్టిన నియామక ప్రక్రియలో కేవలం జాట్లు, రాజ్‌పుత్‌లు, జాట్ సిక్కు వర్గాల వారి దరఖాస్తులను మాత్రమే ఆహ్వానించారని గౌరవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రపతి బాడీగార్డుగా ఎంపికయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నా పైన పేర్కొన్న మూడు కులాలకు చెందిన వాడిని కాకపోవడంతో ఉద్యోగం సాధించలేకపోయానని కోర్టుకు నివేదించారు. న్యాయవాది రామ్ నరేశ్ యాదవ్ ద్వారా గౌరవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాడీగార్డుల నియామకంలో మూడు కులాల వారినే అర్హులుగా ప్రకటించడం వల్ల మిగతా కులాల వారికి అన్యాయం జరిగిందని.. ఇది ఓ రకంగా కుల వివక్ష వంటిదేనని రామ్ నరేశ్ తెలిపారు. ఉద్యోగాల నియామకాన్ని కుల ప్రాతిపదికన చేపట్టడం రాజ్యాంగ నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల బాడీగార్డుల నియామక ప్రక్రియను రద్దు చేయాలని కోర్టును కోరారు. -
గురుగ్రాం కాల్పుల కేసు : జడ్జి కుమారుడి అవయవదానం
సాక్షి, న్యూఢిల్లీ : సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో గాయపడిన గురుగ్రాం జడ్జి కుమారుడు పదిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. మరణించిన అడిషనల్ సెషన్స్ జడ్జి కుమారుడి కీలక అవయవాలు గుండె, కాలేయం, మూత్రపిండాలను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. గురుగ్రాం సెక్టార్ 49లో న్యాయమూర్తి అధికారిక సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో జడ్జి భార్య ఘటనా స్ధలంలోనే మరణించగా, తీవ్ర గాయాలైన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల ఘటన చోటుచేసుకున్న వెంటనే మహిపాల్ సింగ్‌గా గుర్తించిన గన్‌మాన్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను చూసేందుకు సెలవు కావాలని గార్డు కోరగా, అందుకు నిరాకరించిన జడ్జి తన కుటుంబం షాపింగ్ వెళ్లేందుకు తోడుగా వెళ్లాలని సూచించారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి లోనైన సెక్యూరిటీ గార్డు గురుగ్రాం మార్కెట్లోని జనసమ్మర్ధం కలిగిన రోడ్డుపై పట్టపగలే తల్లీకొడుకులపై కాల్పులకు తెగబడ్డాడు. మరోవైపు హర్యానా పోలీసులు తమను వేధిస్తున్నారని నిందితుడి కుటుంబం ఆరోపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను చూసేందుకు మహిపాల్ సింగ్ సెలవు కోరారని వారు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మందుల చీటీని సైతం వారు చూపుతున్నారు. మహిపాల్ సింగ్ వారి ఇంట్లో పనిచేయడం లేదని, తనను సెక్యూరిటీగా కుటుంబ సభ్యులతో పంపడం ఆయనకు ఇష్టంలేదని సింగ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
హంతకుడిగా మారడం వెనుక అసలు కారణం ఇదేనా?!
కన్నతండ్రి కాదు పొమ్మన్నాడు.. కట్టుకున్న భార్య కష్టసుఖాలను పంచుకోలేకపోయింది... మనఃశ్శాంతి కోసమని మతం మారితే పాపం చేశావంటూ బంధువులు దూషించారు.. వీటన్నిటికీ తోడు పనిచేసే చోట గౌరవంగా బతకలేకపోతున్నానే ఆవేదన.. ఈ కారణాల వల్లేనేమో సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్ హంతకుడిగా మారాడు అంటున్నారు అతడి గురించి తెలిసిన వ్యక్తులు. అయితే నిజం నిగ్గుతేలాలంటే సిట్‌తో దర్యాప్తు చేపట్టాల్సిందేనని నిశ్చయించింది ప్రభుత్వం. హరియాణాలోని గురుగ్రామ్‌లో జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య, కొడుకుపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటన శనివారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన జడ్జి భార్య రీతూ మరణించగా, అతని కుమారుడు ధ్రువ్ బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్‌ను అదుపులోకి పోలీసులు.. హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. మహిపాల్ సింగ్ గతం, ప్రస్తుత జీవితం గురించి ఓ జాతీయ మీడియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చిన్ననాడే తండ్రికి దూరమయ్యాడు.. ‘మహిపాల్ తల్లి పెళ్లైన నాటి నుంచే చిత్రహింసలకు గురైంది. తాగుబోతు అయిన భర్త చేసే అకృత్యాలన్నీ పంటి బిగువనే భరించేది. అసహ్య పదజాలంతో తనని దూషించినా సహించేది. అతడు కొట్టిన దెబ్బల కారణంగా రెండుసార్లు గర్భస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో పడింది. కానీ మరోసారి అలా జరగకూడదనే మహిపాల్ కడుపులో పడగానే మా ఇంటికి వచ్చేసింది. రెండు నెలల పసికందుగా ఉన్ననాటి నుంచీ వాడి బాగోగులు నేనే చూస్తున్నా. తండ్రి గురించి తెలియకుండా పెంచుదామనుకున్నా. కానీ అది సాధ్యమయ్యే పనికాదు కదా. అందుకే ఏడాదికోసారి అతడి తండ్రి, బంధువుల దగ్గరికి తీసుకెళ్లేవాడిని’ అంటూ మహిపాల్ గతం గురించి చెప్పుకొచ్చారు అతడి మేనమామ. ‘తల్లి అనుభవించిన వేదనను తలచుకుంటూ.. తండ్రికి దూరమయ్యాననే బాధ మహిపాల్లో అంతర్లీనంగా దాగుండేది. కానీ ఆ విషయం బయటపడనిచ్చేవాడు కాదు’ అని మహిపాల్ బాల్యం గురించి ఆయన వివరించారు. పెళ్లితో కొత్త జీవితం మొదలు పెడదామనుకుంటే..! 2007లో హర్యానా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించిన మహిపాల్.. ఆ మరుసటి ఏడాదే వికాస్ దేవీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన రెండో రోజే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే బంధువుల బలవంతం మీద మళ్లీ మహిపాల్ దగ్గరికి వచ్చింది. భార్యతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన మహిపాల్ గురుగ్రామ్‌కి మకాం మార్చాడు. అయితే కొద్ది రోజులపాటు సజావుగా సాగిన సంసారంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే మహిపాల్.. భార్యతో మాత్రమే గొడవపడే వాడని.. పిల్లలిద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకునే వాడిని.. తమతో కూడా ఎంతో సఖ్యతగా మెదిలేవాడని మహిపాల్ ఇరుగుపొరుగు వారు చెప్పారు. కాగా కొన్ని రోజుల క్రితం క్రిస్టియన్ మతం స్వీకరించినందువల్ల బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. మహిపాల్ సొంతూరికి కూడా వెళ్లడం మానేశాడని తెలిపారు. (చదవండి : నీ భార్య, కొడుకును కాల్చేశా!) పనిమనిషిలా బతకడం కష్టంగా ఉంది! మహిపాల్ సెక్యూరిటీ గార్డుగా మాత్రమే పనిచేయాలనుకున్నాడు. కానీ ఆ జడ్జి కుటుంబం అతడిని ఓ పనిమనిషిలా చూసేది. దీంతో మహిపాల్‌కి కాస్త ఇబ్బందిగా అన్పించేది. పిల్లల్ని చూద్దామన్నా సెలవు దొరికేది కాదు. అందుకే గౌరవంలేని చోట ఉద్యోగం చేయడం కష్టంగా ఉందంటూ ఎప్పుడూ అంటూ ఉండేవాడు అని మహిపాల్ స్నేహితుడు కైలాష్ సింగ్ చెప్పాడు. తనని హీనంగా చూసిన కారణంగానే వాళ్లిద్దరిపై కాల్పులు జరిపి ఉంటాడని పేర్కొన్నాడు. సిట్‌తో దర్యాప్తు ఈ ఘటనకు గల అసలు కారణాలు తెలుసుకునేందుకు డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిపాల్ మానసిక స్థితి సరిగా లేదనే వార్తల్ని ఖండించారు. అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని, ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. మహిపాల్‌పై గతంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అతడికి ఎటువంటి నేర చరిత్ర కూడా లేదని డీసీపీ సుమిత్ కుమార్ తెలిపారు. కేవలం డిప్రెషన్ కారణంగానే కాల్పులకు పాల్పడ్డాడా లేదా ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
ఆ శత్రువు ఎవరు?
రాత్రి రెండు దాటింది. ‘కోహినూర్ జువెలరీ’ షాపుకి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజు షాపు ముందు ఉన్న వరండాలో నిద్రపోతున్నాడు. మధ్యలో తీవ్రమైన తలనొప్పి అతడిని నిద్రపోనివ్వలేదు. దాంతో పెయిన్ కిల్లర్ వేసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మగతనిద్రలోకి జారుకునే సమయంలో షాపులోపల నుంచి ఏదో కింద పడిన శబ్దం వచ్చింది. ఉలిక్కిపడి లేచిన రాజు.. అయోమయంగా చుట్టూ ప్రదేశాలను గమనించాడు.‘‘షాపులోకి ఏ ఎలకైనా వచ్చిందేమో అనుకుంటూనే... ఒకవేల దొంగలొస్తేనో..?’’ అనే ఆలోచన అతడ్ని కలవరపరిచింది. వెంటనే మంచం దిగి షాపు చూట్టూ తిరిగి చూశాడు. షాపు వెనక్కి వెళ్లిన రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షాపు వెనక వైపు ఉన్న బాత్రూమ్ కిటికిని ఎవరో ఊడబీకారు. అందులోంచి లోపలికి మనుషులు సునాయాసంగా వెళ్లొచ్చు. చప్పుడు చేయకుండా ఓ దిమ్మపైకి ఎక్కి అదే కిటికీలోంచి లోపలికి చూశాడు. ఎవరూ కనిపించలేదు. కాస్త ధైర్యం చేసి లోపలికి దిగాడు. అలికిడి లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బాత్రూమ్లోంచి షోరూమ్‌లోకి తొంగి చూశాడు. అక్కడా ఎవరూ కనిపించలేదు. అయితే షోకేసుల్లో ఉండాల్సిన నగలన్నీ మాయమయ్యాయి. ఓ ఫ్లవర్‌వాజ్ మాత్రం కిందపడి ఉంది. ఆ ఫ్లవర్‌వాజ్ శబ్దానికే మెలికువ వచ్చిందని అర్థం చేసుకున్నాడు. అంటే అన్నీ తీసుకుని పారిపోతున్న హడావుడిలో ఈ ఫ్లవర్‌వాజ్ కింద పాడేసి ఉంటారు దొంగలు. ఎంతో సమయం అయ్యి ఉండదు. వెంటనే పోలీసులకు సమాచారం అందిద్దాం. అనుకుంటూ ఫోన్ అందుకుంటూ ఓ అడుగు ముందుకేశాడు రాజు. అంతే! కాళ్లకు ఏదో తాకింది. వంగి దాన్ని అందుకున్నాడు. అది ఓ వజ్రాల నగ. కళ్లు తలుక్కుమన్నాయి. బహుశా దొంగలు దోచుకునే సమయంలో ఇది కింద పడి ఉంటుంది అనుకుంటూ ఫోన్ కట్ చేసి.. ఆ నగను జేబులో వేసుకుంటూనే ఇంకా నగలు దొరికే అవకాశం ఉందేమో అన్నట్లు ఆ షోకేసులను వెతికాడు. వెంటనే వచ్చిన దారినే వెనుదిరిగి సైకిల్ తీసుకుని ఆ నగను ఇంట్లో పెట్టి, తిరిగి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీస్ విచారణల్లో వేలుముద్రల ఆధారంగా... దొంగల ముఠాకు రాజే సహకరించాడని, దొంగతనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజే సహకరించాడని తేల్చారు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి డైమండ్ నగ రాజు వద్దే ఉందని చెప్పడం, ఆ వెంటనే పోలీసులు రాజు ఇంటిలో తనిఖీలు జరపడం వెంటవెంటనే జరిగిపోయాయి. పలు సాక్ష్యాల ఆధారంగా రాజు జైలు పాలయ్యాడు. మిగిలిన దొంగలను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.జైల్లో ఉండగా రాజుకు ఓ రోజు తీవ్రమైన తలనొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్లు అతడికి బ్రెయిన్‌ట్యూమర్ ఉందని తేల్చారు. వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే రాజు చనిపోతాడని చెప్పారు. రాజు ఖైదీ కావడంతో ఆపరేషన్ ఖర్చు అంతా ప్రభుత్వమే భరించింది. రాజు మెల్లగా కోలుకున్నాడు.కొద్దిరోజులకు కోహినూర్ షాపులో దొంగతనానికి పాల్పడిన దొంగలు దొరికారు.సెక్యూరిటీ గార్డ్ రాజుకి తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసు లకు చెప్పారు. దాంతో కోర్టు రాజును నిర్దోషిగా విడుదల చేసింది.దొంగలు దొరకడంతో కేసు క్లోజ్ అయ్యింది. అయితే ఈ కేసుని మొదటి నుంచి స్టడీ చేస్తూ వచ్చిన ఎస్సై రాఘురాం తల పట్టుకున్నాడు. అతడికి అర్థం కానీ విషయమేంటంటే... ‘వజ్రపు నగ సెక్యూరిటీ గార్డ్ రాజు దగ్గరే ఉంది’ అనే విషయాన్ని పోలీసులకు తెలియజేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరా అని ఆలోచనలో పడ్డాడు. ఎంతైనా పోలీసు కదా! ఎప్పటికీ అంతుచిక్కకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ ఇంటికి వెళ్లాడు రఘురాం.ఎస్సై రఘురామ్‌ని చూసిన రాజు కాస్త కంగారు పడ్డాడు. ‘‘కంగారు పడకులే! చిన్న డౌట్ అడుగుదామని వచ్చాను’’‘‘చెప్పండి సారు!’’‘‘ఏం లేదు..! నీకు శత్రువులెవరైనా ఉన్నారా?’’‘‘పేదోడిని నాకెవరు శత్రువులుంటారు సారు? ఎందుకలా అడుగుతున్నారు?’’‘‘ఏం లేదు రాజు..! ఈ దొంగతనం కేసులో నువ్వు నిర్దోషివని తేలింది. ఆ దొంగలే మొత్తమంతా చేశారని అర్థమవుతుంది కానీ.. దొంగలు వదిలిపెట్టిన ఆ వజ్రపు నగ నీ దగ్గరే ఉందని నాకు ఫోన్ చేసింది ఎవరైయుంటారు?’’‘‘ఫోన్ చేశారా? ఓ.. అందుకే మీరు మా ఇంటిని తనిఖీ చేశారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ‘‘అవును రాజు! కేసు క్లోజ్ అయినా ఇదే ఆలోచన నన్ను కుదురుగా ఉండనీయట్లేదయ్యా! నీకైతే శత్రువులెవరూ లేరా?’’ మరో సారి ప్రశ్నించాడు ఎస్సై రఘురాం.‘‘నాకు తెలిసైతే శత్రువులెవరూ లేరు సారు!ఆ దొంగనాయాళ్లే ఫోన్ చేసి చెప్పుంటారు సారు. కేసును తప్పుదారి పట్టించేందుకు!’’‘‘లేదయ్యా! వాళ్లెవ్వరూ కాదు! ఆ విషయం వాళ్లని కూడా అడిగాను’’‘‘మీరు అంతగా అడుగుతుంటే నాకో విషయం యాదికొస్తోంది సారూ!’’‘‘ఏంటయ్యా అది?’’‘‘ఆ కోహినూర్ గోల్డ్ షాపులో నాతో పాటు రాములు అని మరో సెక్యూరిటీ గార్డ్ ఉండేవాడు సారు! వాడు రాత్రేల సరిగా డ్యూటీ చేయకుంటే.. రెండు మూడు సార్లు వానరు సారు చేత తిట్టించినా. గా తర్వాత మా వానరు సారుకు విసుగొచ్చి వాడ్ని జాబు నుంచి తీసేసినారు. వాడు గిట్లా ఏమైనా నాపై పగబట్టిండేమో సారూ!’’ అన్నాడు రాజు కాస్త గట్టిగా.‘‘హా.. అయ్యుండొచ్చు. అతడే ఎవరిచేతైనా ఫోన్ చెయ్యించుండొచ్చు. సరేలే నువ్వు జాగ్రత్తగా ఉండు!’’అంటూ విషయాన్ని పెద్దది చేయకుండా ఎస్సై అక్కడ నుంచి కదిలాడు.ఎస్సై అక్కడి నుంచి కదలగానే ఓ విజేతలా నవ్వాడు రాజు. ‘నాకు శత్రువులెవరుంటారు!? గా ఫోన్ చేసింది నేనే. నాకు బ్రెయిన్ ట్యూమర్ అని ముందే తెలుసు. నాకు షోరూమ్‌లో వజ్రపు నగ కాలికి దొరకగానే ఓ పాత హిందీ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో హీరోకి ఏదో పెద్ద జబ్బు వస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అందుకే ఎవరో చేసిన నేరాన్ని తనపైన వేసుకుని జైలుకెళ్లి ప్రభుత్వ డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటాడు. పూర్తిగా బాగైన తర్వాత జైలు నుంచి పారిపోయి నేరం చేసిన వాడిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తాడు. ఆ సినిమానే నేనూ ఫాలో అయ్యాను! లేకుంటే పేదవాడినైన నాకు ఎవడు సాయం చేస్తాడు?’ అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూనే ఉన్నాడు. - మహబూబ్ బాషా -
ఏటీఎం గార్డ్‌కు క్రికెటర్ సెల్యూట్!
హైదరాబాద్ : ఓ ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ చేసే మంచి పనికి టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ముగ్ధుడయ్యాడు. అతని సేవను ప్రశంసిస్తూ ట్విటర్ వేదికగా సెల్యూట్ కొట్టాడు. డెహ్రాడూన్‌లో ఓ ఏటీఎంకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిసున్న రిటైర్డ్ సైనికుడు బ్రిజేందర్ సింగ్ దేశం కోసం తన సేవను కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని నిరూపేద పిల్లలను చేరదీసి చదువుచెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్.. అతని సేవను కొనియాడుతూ వారికి చదువు చెబుతున్న ఫొటోలను ట్వీట్ చేశాడు. ‘రియల్ హీరో బ్రిజేంద్రను కలవండి.. ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ మాజీ సైనికుడు దేశం కోసం తన సేవను ఇంకా కొనసాగిస్తున్నాడు. సాయంకాలంవేల ఏటీఎం వెలుగుల్లో అక్కడి మురికివాడలకు చెందిన పిల్లలకు చదువు చెబుతున్నాడు. ఈ మహోన్నత వ్యక్తికి నా సెల్యూట్’ అని ట్వీట్ చేశాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ సేవలను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. Meet a true hero Brijendra , who works as a security guard at an ATM in Dehradun. Having retired from the army, he still continues to serve the nation, he teaches children from nearby slums in the evenings under the ATM lights. Salute to an incredible man 🙏🏼 pic.twitter.com/vNobfOvBzH — VVS Laxman (@VVSLaxman281) August 24, 2018 -
ప్రాంక్ కాల్.. ఆపై కటకటాల పాలు..
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై దాడులు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రాంక్ కాల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల కాశీనాథ్ మండల్ ముంబైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ సేకరించాడు. ఆపై ఎన్ఎస్జీ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని మోదీపై దాడి జరుగుతుందని సమాచారం ఇచ్చాడు. కెమికల్ దాడి జరిగే అవకాశం ఉందని, తన వద్ద సమాచారం ఉందని ఎన్ఎస్జీని నమ్మించాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా కాశీనాథ్‌ను సెంట్రల్ ముంబైలోని డీబీ మార్గ్ పోలీసులు జూలై 27న అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌కు వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నరేంద్ర మోదీని కలుసుకోవడమే తన ఉద్దేశమని కాశీనాథ్ విచారణలో వెల్లడించాడు. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో తన స్నేహితుడు చనిపోయాడని.. ఈ విషయంపై ప్రధాని మోదీని కలుసుకుని మాట్లాడాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
ఇదేంది..పంతులూ..!
కేపీహెచ్‌బీకాలనీ: నో పార్కింగ్ ఏరియాలో కారును పార్కు చేయవద్దన్నందుకు ఓ సెక్యూరిటీ గార్డును జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ చితకబాదిన సంఘటన శనివారం జేఎన్టీయూ హెచ్లో చోటు చేసుకుంది. ఎంత దైర్యంరా నీకు నా కారునే పెట్టవద్దంటావా...నా కొడుకుతో వాగ్వాదానికి దిగుతావా అంటూ దుర్భాషలాడటమేగాకుండా ఎవడు పెట్టవద్దన్నాడో చెప్పాలంటూ ప్రిన్సిపాల్ ఛాంబర్ వరకు వెంటబడి మరీ కొట్టాడు. తోటి ఉద్యోగులు వారించినా వినకుండా చెప్పు తీసుకుని సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే...జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల స్పందన బ్లాక్ ఎదుట వాహనాలు పార్కు చేయకుండా పార్కింగ్ ఏరియాలోనే పార్కు చేసేలా చూడాలన్న ప్రిన్సిపాల్ ఆదేశిస్తూ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలుపకుండా సెక్యూరిటీ గార్డు కాశిరాములు విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తనయుడు తన తల్లి సహా వర్సిటీకి వచ్చి నో పార్కింగ్ ఏరియాలో కారు నిలిపాడు. దీంతో సెక్యూరిటీ గార్డు కాశీరాం అందుకు అభ్యంతరం చెప్పడంతో తాను ప్రొఫెసర్ కొడుకునని, తనకే అడ్డు చెబుతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. అతను వారించినా వినకుండా కారును పార్కుచేసిన ప్రొఫెసర్ తనయుడు లోపలికి వెళ్లి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోతూ బయటికి వచ్చిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు సెక్యూరిటీగార్డును అందరి ముందు బూతులు తిడుతూ మొఖంపై, మెడపై గాయాలయ్యేలా చితకబాదాడు. అంతేగాకుండా ప్రిన్సిపాల్ గదివరకూ కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. సిబ్బంది వారించినా పట్టించుకోకుండా తన చెప్పు తీసి కొట్టేందుకు యత్నించాడు. చివరకు సెక్యూరిటీ గార్డు తనను క్షమించాలని, తప్పయిందంటూ వేడుకున్నాడు. తన కొడుకు కాళ్లు పట్టుకుంటే వదిలేస్తానని చెప్పడంతో కాశీరాములు ప్రొఫెసర్ కొడుకు కాళ్లు పట్టుకున్నాడు. అతను శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా గతంలోనూ వెంకటేశ్వరరావు సెక్యూరిటీ గార్డులను బూతులు తిట్టినా ఎవరూ పట్టించుకోలేదని, దీంతో మరింత రెచ్చిపోయి ఏకంగా భౌతికదాడులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఈ విషయమై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సంఘటన తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రిన్సిపాల్ నుంచి నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
36 గంటలు డ్యూటీ చేసి...
చండీగఢ్ : ఫరీదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 36 గంటల పాటు నిరంతరాయంగా పని చేయడం వల్ల ఓ సెక్యూరిటీ గార్డు మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. హరీశ్ చందర్ అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా ఓ ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ తరపున వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని సెక్టార్ 59లో గల ఎస్టీఎల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం షిఫ్టు మారాల్సి ఉండగా వేరొక గార్డు రాకపోవడంతో హరీశ్ చందర్ డ్యూటీలోనే ఉండాల్సి వచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, తాగటానికి మంచి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. వేడిమి అధికంగా ఉండడం, నిరంతరాయంగా పనిచేయడం వల్ల అలసటతో హరీశ్ మరణించినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
రిమ్స్ సెక్యూరిటీగార్డ్కు దేహశుద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన వ్యక్తి బంధువుల అశ్లీల చిత్రాలు సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ సెక్యూరిటీ గార్డు దొరికిపోయారు. దీంతో అతడికి రోగి బంధువులతోపాటు అక్కడ ఉన్న మరికొంతమంది దేహశుద్ధి చేశారు. రిమ్స్‌లో ఆస్పత్రిలో ఫిమేల్ మెడికల్ (ఎఫ్ఎం) వార్డులో ఈ సంఘటన శుక్రవారం జరిగింది. రిమ్స్‌లో ఎఫ్ఎం వార్డులో నరసన్నపేటకు చెందిన రోగి బంధువు బాత్రూమ్లో ఉండగా ఆ వార్డులో విధులు నిర్వహిస్తున్న బలగ గ్రామానికి చెందిన ఒక సెక్యూరిటీ గార్డు సెల్ఫోన్లో వీడియో తీస్తుండటాన్ని కొందరు మహిళలు గమనించారు. విషయం తెలిసిన మహిళలందరూ దేహశుద్ధి చేశారు. రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సి.హెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు కొంతమంది సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటీవల జీతాలను కోత పెట్టారు. పూర్తి జీతాల కోసం ఈనెల 9 నుంచి 19 రోజులు సమ్మెచేశారు. కాంట్రాక్టరు, అధికారుల చొరవతో ఈ సమస్య సద్దుమణిగింది. సమ్మె ముగిసిన రెండో రోజుల్లోనే సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి చర్యలకు పాల్ప డడం రిమ్స్‌లో చర్చనీయంశంగా మారింది. -
తుపాకీ మిస్‌ఫైర్ ఇద్దరు గార్డులకు స్వల్పగాయాలు
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. తుపాకీలోని బుల్లెట్లను చెక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. మిస్‌ఫైర్ అయిన గన్‌లోని బుల్లెట్ నేలను కొట్టుకుని ముక్కలై పక్కనే ఉన్న ఇద్దరు గార్డులకు తగలడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ బేగంపేట గురిమూర్తినగర్‌లోని యాక్సిస్ బ్యాంక్ నుంచి నగదును ఏటీఎం సెంటర్లతో పాటు ఇతర బ్రాంచ్‌లకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో భద్రత కోసం సికింద్రాబాద్ తిరుమలగిరిలోని చెక్మెట్ సెక్యూరిటీ సంస్థ గార్డ్ సురేశ్‌కుమార్ శనివారం ఉదయం బ్యాంకు వద్దకు వచ్చారు. అతని వద్దనున్న లైసెన్స్డ్ డబుల్ బారెల్ గన్‌లో బుల్లెట్లను చూపాల్సిందిగా అక్కడి సెక్యూరిటీ అధికారి రామకృష్ణ అడిగారు. బుల్లెట్లను చూపించే క్రమంలో సురేశ్ చేతిలో ఉన్న తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. బుల్లెట్ భూమిని తాకి ముక్కలై పక్కనే ఉన్న అదే సంస్థలో పనిచేసే తోటి గార్డులు శ్రీనివాసులు (40), మహేశ్వరరావు (45)లకు తగిలాయి. స్వల్ప గాయాలకు గురైన వీరిని చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. బేగంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.