బిహార్ రాజధాని పట్నాలో శనివారం ఉదయం దారుణం జరిగింది.
పట్నా: బిహార్ రాజధాని పట్నాలో శనివారం ఉదయం దారుణం జరిగింది. దుండగులు ఏటీఎంకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును హతమార్చి.. ఏటీఎంలో ఉన్న నగదును లూటీ చేశారు. మౌర్యలోక్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ బ్యాంకు ఏటీఎం వద్ద ఈ ఘటన జరిగింది. దీపక్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
మౌర్యలోక్ అనేది పట్నాలో అత్యంత విలాసవంతమైన ప్రదేశం. ఇక్కడ పోలీసు సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తుంటారు. సెక్యూరిటీ జోన్‌గా పరిగణించే ఈ ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ దారుణంపై మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన నిర్వహించారు.