హోలీ డ్యాన్స్‌ చేస్తావా.. సస్పెండ్‌ చేయించమంటావా? | RJD leader Tej Pratap Yadav And Policeman Holy Dance | Sakshi
Sakshi News home page

హోలీ డ్యాన్స్‌ చేస్తావా.. సస్పెండ్‌ చేయించమంటావా?

Published Sun, Mar 16 2025 7:24 AM | Last Updated on Sun, Mar 16 2025 7:55 AM

RJD leader Tej Pratap Yadav And Policeman Holy Dance

పాట్న: హోలీ వేడుకల సమయంలో డ్యాన్స్‌ చేస్తావా లేక సస్పెండ్‌ చేయించమంటావా అంటూ ఒక పోలీసును ఆర్‌జేడీ నేత, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ బెదిరించడం వివాదం రేపుతోంది. మాజీ సీఎంలు లాలు ప్రసాద్, రబ్డీదేవీల పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అధికార నివాసం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

తండ్రి లాలు మాదిరిగానే హోలీ వేడుక సమయంలో పండగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మద్దతు దారుల చొక్కాలను తేజ్‌ ప్రతాప్‌ చించివేశారు. అనంతరం స్కూటర్‌పై ‘పిల్లిమొగ్గల చిన్నాన్నకు హోలీ శుభాకాంక్షలు’అని పరోక్షంగా సీఎం నితీశ్‌కుమార్‌ను ఉద్దేశించి తన నివాసం చుట్టుపక్కల వీధుల్లో కేకలు వేస్తూ తిరిగారు. అదేవిధంగా, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికపై సోఫాలో కూర్చుని.. ‘ఏయ్‌ పోలీస్‌.. దీపక్‌..ఇప్పుడు మేమొక పాట వేస్తాం. డ్యాన్స్‌ చేయాలి. లేదంటే నువ్వు సస్పెండ్‌ అవుతావ్‌. ఏమనుకోకు, ఇది హోలీ పండగ’ అని అక్కడే ఉన్న దీపక్‌ అనే కానిస్టేబుల్‌నుద్దేశించి అంటున్న వీడియో వైరల్‌గా మారింది. 

దీంతో, ఆ కానిస్టేబుల్‌ అక్కడి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్‌ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. ‘తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా. అప్పట్లో సీఎంగా లాలు చట్టాన్ని డ్యాన్స్‌ చేయించాడు. బిహార్‌ను జంగిల్‌ రాజ్‌గా మార్చాడు. ఇప్పుడు కుమారుడు అధికారంలో లేకున్నా, చట్టాన్ని, రక్షకులను డ్యాన్స్‌ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వారికి అధికారం ఇవ్వరాదు’ అని పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement