
'ఆఫీసర్ భార్య రివర్స్ డ్రైవ్ చేసి చంపేసింది'
రాయ్పూర్: ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ సీనియర్ అధికారి భార్య నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ సెక్యూరిటీ ప్రాణాలు బలిగొంది. రాయ్ పూర్ లోని రాజేంద్ర నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డయి.. చూసేవారి ఒళ్లు జలదరించేలా ఉంది. పూర్తి వివారాల్లోకి వెళితే సోమవారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో రాయ్ పూర్ లోని రాజేంద్ర నగర్ కాలనీలో ఓ సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉండగా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన సీనియర్ అధికారి భార్య నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసింది.
అది కూడా రివర్స్లో వెనుకాల ఎవరు ఉన్నారో అని కూడా చూసుకోకుండా చాలా వేగంతో. దీంతో ఆ కారు సరాసరి వెళ్లి సెక్యూరిటీగార్డును ఢీకొట్టడంతోపాటు అతడిని కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ అధికారి భార్యపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు.