raipur
-
ఇదెక్కడి క్రేజ్ రా అయ్యా.. పుష్పరాజ్ దెబ్బకు ట్రాఫిక్ జామ్!
అల్లు అర్జున్ పుష్ప-2 థియేటర్లను షేక్ చేస్తోంది. ఈ నెల 5న మొదలైన పుష్పరాజ్ బాక్సాఫీస్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకుంది. అంతేకాకుండా హిందీలో ఎప్పుడు లేనివిధంగా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 12 రోజుల్లోనే రూ.582 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా సెకండ్ వీకెండ్లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది.ఈ వసూళ్లు చూస్తే చాలు హిందీలో పుష్పరాజ్ క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. రెండోవారంలో ఆదివారం థియేటర్ల వద్ద ఏకంగా ఆడియన్స్‌ను చూస్తే ఏకంగా జాతరను తలపించింది. అయితే అది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పుష్ప-2 థియేటర్ వద్ద ఇసుకెస్తే రాలనంత జనం వచ్చారు. టికెట్స్ కౌంటర్ వద్ద మాస్ జాతర కనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా థియేటర్ ముందు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మార్కు అందుకున్న ఘనతను ఇప్పటికే సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ సినిమాల అల్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ఇప్పటికే రూ.1409 కోట్లకు వసూళ్లతో రెండు వేల కోట్ల మార్క్ దిశగా పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్లోనే రూ.2000 వేల కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. #Pushpa2 నిన్న ఆదివారం Raipur లో థియేటర్ లో టికెట్ల కోసం క్యూ... తెలుగు సినిమా 💪❤️ pic.twitter.com/amyUAvmoGf— Rajesh Manne (@rajeshmanne1) December 16, 2024 -
ఛత్తీస్‌గఢ్‌లో చలి విజృంభణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ను చలిపులి చంపేస్తోంది. నవంబర్ రెండో వారం నాటికే ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని సూరజ్‌పూర్, సుర్గుజా, మార్వాహి, కోర్బా, ముంగేలి, బిలాస్పూర్, రాజ్‌నంద్‌గావ్, బలోద్, కంకేర్, నారాయణపూర్, బీజాపూర్, బస్తర్, దంతెవాడ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది.రానున్న మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదని వాతావరణ నిపుణుడు హెచ్‌పీ చంద్ర తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.గత 24 గంటల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు, బలరామ్‌పూర్ రామానుజ్గంజ్లో 29.4 డిగ్రీలు, సర్గుజాలో 28.9 డిగ్రీలు, జష్పూర్లో 29.9 డిగ్రీలు, కొరియాలో 29.4 డిగ్రీలు, మర్వాహిలో 28.9 డిగ్రీలు, కోర్బాలో 30.3 డిగ్రీలు, ముంగేలిలో 3.4 డిగ్రీలు, 3.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అదే సమయంలో, రాజ్‌నంద్‌గావ్‌లో 30.5 డిగ్రీలు, బలోద్‌లో 31.7 డిగ్రీలు, కంకేర్‌లో 30.7 డిగ్రీలు, నారాయణపూర్‌లో 29.4 డిగ్రీలు, బస్తర్‌లో 30.3 డిగ్రీలు, బీజాపూర్‌లో 30.9 డిగ్రీలు, దంతవాడలో 32 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని రాయ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది కూడా చదవండి: National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి.. -
ఆలౌట్ తాగిన చిన్నారి.. అరుదైన చికిత్సతో కాపాడిన కిమ్స్ కడల్స్ డాక్టర్లు
హైదరాబాద్, మే 25, 2024: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18 నెలల పాప ప్రమాదవశాత్తు ఆలౌట్ సీసా మొత్తం తాగేసింది. ఆమె ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నా ఆమె పరిస్థితి బాగుపడకపోగా, ఊపిరితిత్తులు పాడయ్యాయి. ఆమెకు సరిగా ఊపిరి అందలేదు. దాంతో రాయ్‌పూర్ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిని సంప్రదించాయి.ఇక్కడి నుంచి ఇద్దరు ఇంటెన్సివిస్టులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు విమానంలో వెళ్లారు. అక్కడ పరీక్షించిన తర్వాత పాపకు ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్ల వల్ల కెమికల్ న్యూమోనైటిస్ అనే సమస్య తీవ్రంగా వచ్చిందని తెలిసింది. పాప శరీరానికి తగినంత ఆక్సిజన్ అందించడానికి వెంటిలేటర్ సరిపోకపోవడంతో, ఆమె కుడివైపు గుండె కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. దాంతో పాపకు ఎక్మో పెట్టి, ఆమె పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.ఎక్మోను రెండు విధాలుగా అమరుస్తారు. సాధారణంగా, కుడి తొడ వెయిన్ను తొలగించి, డీ-ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకుంటారు, ఆపై ఎక్మో ద్వారా ఆక్సిజనేషన్ తర్వాత కుడి ఇంటర్నల్ జుగులర్ వెయిన్ ద్వారా ఊపిరితిత్తులను బైపాస్ చేస్తారు. గుండె కూడా దెబ్బతింటే, అంతర్గత జుగులర్ వెయిన్ నుంచి డీ-ఆక్సిజనేటెడ్ రక్తం తీసుకుని, దాన్ని ఎక్మో ద్వారా ఆక్సిజనేట్ చేస్తారు. మొత్తం శరీరానికి సరఫరా చేయడానికి అయోటా ఆర్క్ ద్వారా తిరిగి ప్రవేశపెడతారు. సాధారణంగా, ఫెమోరల్ వెయిన్ నుంచి రక్తం తీసుకుని, దాన్ని శుద్ధిచేసి ఫెమోరల్ ఆర్టెరీకి తిరిగి పంపుతారు. ఇది కొంత సులభం. అయితే, ఈ సందర్భంలో, పాప బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉన్నందున, ఎక్మోను మెడ వద్ద అమర్చారు. ఇది ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ బైపాస్ చేస్తుంది. ఈ విధానం చాలా అరుదు.ఈ ప్రొసీజర్ తర్వాత పాపను తొలుత రోడ్డు మార్గంలో రాయ్‌పూర్‌కు విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను 9 రోజుల పాటు వీఏ-ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడింది. అప్పుడు మరో ఐదారు రోజులు వెంటిలేటర్ మీద ఉంచారు. అనంతరం హైఫ్లో, లోఫ్లో ఆక్సిజన్ పెట్టారు. ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ రావడంతో యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేశారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. అన్ని రకాలుగా బాగుండటంతో గురువారం ఆమెను డిశ్చార్జి చేశారు.వీఏ లేదా వీవీ ఎక్మోపై పిల్లలను పెట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం అత్యంత అరుదు. అందులోనూ ముఖ్యంగా మెడ వద్ద కాన్యులా పెట్టి తరలించడం భారతదేశంలోనే అత్యంత అరుదైనది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన ఇలాంటి అతి కొద్ది కేసుల్లో ఇదొకటి. గుండె శస్త్రచికిత్సలు చేసిన తర్వాత పిల్లలకు ఎక్మో పెట్టడం కొంత సులభం. కానీ ఈ కేసులో మాత్రం పాపకు ఊపిరితిత్తులు, గుండె కూడా కొంత దెబ్బతిన్నాయి. పాప వయసు బాగా తక్కువ. దాంతో మెడ వద్ద కాన్యులేషన్ ద్వారా ఎక్మో పెట్టడం, ఎలాంటి సమస్యలు లేకుండా రాయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా తరలించడం చాలా సంక్లిష్టమైనది, సవాళ్లతో కూడుకున్నది. ఇది మొత్తం వైద్య బృందానికి ఉన్న అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వాలకు నిదర్శనం.ఈ సందర్భంగా కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ 'పరాగ్ శంకర్రావు డెకాటే' మాట్లాడుతూ.. బాలికకు ఇచ్చిన చికిత్స వల్ల ఆమె గుండె, ఊపిరితిత్తులకు తగినంత మద్దతు లభించింది. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్యబృందం వల్ల మాత్రమే ఆమెను ఎక్మో పెట్టి రాయ్‌పూర్ నుంచి విమానంలో హైదరాబాద్‌కు విజయవంతంగా తీసుకురాగలిగాం.అనుభవజ్ఞులైన కార్డియాక్, వాస్క్యులర్ సర్జన్లు ఉండటంతో రక్తనాళాల్లోకి కాన్యులేషన్ సరిగ్గా జరిగింది. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో ఇలా మెడ ద్వారా కాన్యులేషన్ పెట్టి వీఏ-ఎక్మో పెట్టిన కేసులు ఆరు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో ఈ-పీసీఆర్ కూడా చేయగలరు. అంటే రోగిని ఎక్మో మీద పెట్టి, అదే సమయంలో కార్డియో రెస్పిరేటరీ మసాజ్ ఇవ్వగలరు. గడిచిన మూడేళ్లలో మొత్తం 15 సార్లు ఎక్మో పెట్టాము. ఇది భారతదేశంలోనే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి అత్యంత ఎక్కువ సార్లు. మెరుగైన ఫలితాల కోసం రక్తనాళాలను కూడా పునరుద్ధరించగలం. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో చాలా అందుబాటు ధరల్లోనే ఎక్మో సేవలు అందుతాయి. లిటిల్ వన్ అనే ఫౌండేషన్ ద్వారా పేద రోగులకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని రకాల రోగులకు అత్యున్నత స్థాయి చికిత్సలు అందుతాయనడానికి ఈ కేసు ఒక నిదర్శనం” అని ఆయన చెప్పారు.రాయ్‌పూర్ నుంచి పాపను తీసుకొచ్చిన బృందంలో పీఐసీయూ అధినేత డాక్టర్ పరాగ్ డెకాటే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అవినాష్ రెడ్డి, కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ జనార్ధన్, పెర్ఫ్యూజనిస్టు దయాకర్, మేల్ నర్సు దీపుమోనే, సర్జికల్ సిస్టర్ నాగశిరీష ఉన్నారు. ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత పాపకు కిమ్స్ కడల్స్ పీఐసీయూ బృందం, నర్సులు, ఇతర సిబ్బంది సాయంతో సమగ్ర చికిత్సలు అందినట్లు డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. ఈ వైద్య నిపుణులందరి సమిష్టి కృషి వల్ల, ఐకాట్ సంస్థ అందించిన ఎయిర్ అంబులెన్స్ సేవల వల్ల, తల్లిదండ్రులు సహకారం వల్ల పాప పూర్తిగా కోలుకోగలిగింది. -
ఛత్తీస్‌గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అందులో పని చేసేవాళ్లు మృతి చెందారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీయగా.. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు శబ్ధం భయంకరంగా వినిపించిందని.. ఆ ధాటికి భయంతో వణికిపోయామని స్థానికులు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఆ శబ్ధం వినిపించిందని.. కొన్ని ఇళ్లు సైతం దెబ్బ తిన్నాయని అంటున్నారు. భారీగా మంటలతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు పరుగులు తీశారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించింది. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల దేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయని, ఫ్యాక్టరీ లోపల 20 అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు.కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడు ధాటికి గల కారణాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యే మహారాష్ట్ర థానేలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. -
మాల్లో విషాదం: తండ్రి చేతుల్లోంచి జారిపడి..
కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది. తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్కులేటర్ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు. ఆ టైంలో ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడంతో.. నిలువరించేందుకు ఆ తండ్రి యత్నించాడు. ఈ లోపు చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడిపోయాడు. మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. మాల్ సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చొచ్చు.. సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk — Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024 -
ఛత్తీస్‌గఢ్‌లో పెరుగున్న కరోనా కేసులు
ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 24 మందికి కరోనా సోకింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా బాధితులు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు చెందిన వారని సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గత 24 గంటల్లో కొత్తగా 11 మందికి కరోనా సోకింది. దీంతో రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య 51కి చేరింది. ఇక్కడ ఇప్పటికే 40 మంది కరోనా బాధితులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 51కి పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. రాష్ట్రంలోని పారిశ్రామిక నగరం రాయ్‌ఘర్ కరోనా కేసులలో రెండవ స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 131కి చేరింది. కాగా 31 మంది కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4182 శాంపిల్స్‌ను పరీక్షించారు. -
Ind vs Aus: 3.16 కోట్ల రూపాయలు బకాయి! ఇప్పటికీ..
India vs Australia, 4th T20I: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20కి వేదికైన రాయ్‌పూర్ స్టేడియం గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ స్టేడియానికి అధికారులు కరెంటు కోత విధించినట్లు సమాచారం. తాజాగా అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనున్న నేపథ్యంలో లైటింగ్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియానికి సంబంధించి రూ. 3.6 కోట్ల మేర కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, రాష్ట్ర క్రీడా విభాగానికి మధ్య సమన్వయ లోపం వల్ల 2009 నుంచి ఇప్పటి దాకా ఇలా కోట్ల రూపాయల చెల్లింపులు అలాగే నిలిచిపోయాయి. నిజానికి రాయ్‌పూర్ స్టేడియం నిర్మాణం తర్వాత నిర్వహణ బాధ్యతలను పీడబ్ల్యూడీకే అప్పగించారు. అయితే, అదనంగా ఏవైనా సదుపాయాలు కల్పించాల్సి వస్తే అందుకు సంబంధించిన ఖర్చును క్రీడా శాఖ భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే ఇరు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు ఇక్కడిదాకా దారి తీసినట్లు తెలుస్తోంది. కుప్పలా పేరుకుపోతున్న బిల్లు చెల్లింపుల గురించి ఇప్పటికే విద్యుత్ శాఖ ఈ రెండు శాఖలకు నోటీసులు ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ సందిగ్దంలో పడింది. కరెంట్ కోత తర్వాత 2018 నుంచి రాయ్‌పూర్ స్టేడియంలో కేవలం ఒకే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. అది కూడా వన్డే! అప్పుడు కూడా జెనరేటర్ల వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మమ అనిపించారు. ఈ విషయం గురించి.. చత్తీస్గడ్ స్టేట్ క్రికెట్ సంఘ్ మీడియా కో ఆర్డినేటర్ తరుణేశ్ సింగ్ పరిహార్ మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా మాకుంది. నిజానికి స్టేడియం, లైట్లకు సంబంధించి ఎంత కరెంటు వినియోగం జరిగింది? బిల్లు ఎంతైంది? అన్న విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే, తాజా మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ సంఘ్ అభ్యర్థన మేరకు విద్యుత్ శాఖ తాత్కాలిక కనెక్షన్ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. కాగా రాయ్‌పూర్ స్టేడియంలో అంతర్జాతీయ టీ20 జరగడం ఇదే తొలిసారి. ఇక శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చదవండి: ఇర్ఫాన్‌తో ప్రేమ.. గంభీర్ మిస్డ్కాల్స్ ఇచ్చేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు -
Ind Vs Aus: తిలక్‌కు బైబై.. విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ!?
గువాహటిలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఫలితాన్ని తేల్చేయాలని భావించిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడో మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో వరుసగా రెండు టీ20లు గెలిచిన సూర్య సేన జోరుకు బ్రేక్ పడింది. దీంతో తదుపరి మ్యాచ్ టీమిండియాకు సవాలుగా మారింది. రాయ్‌పూర్‌లోనే ఆసీస్‌ను నిలువరించకపోతే మూల్యం చెల్లించే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆగమనం దాదాపుగా ఖాయమైపోయింది. కీలక మ్యాచ్‌లో ఈ విధ్వంసకర బ్యాటర్ తుదిజట్టులో తప్పక ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక అయ్యర్ రాకతో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మపై వేటు పడనుంది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో ఈ లెఫ్టాండర్‌కు చోటు దక్కింది. వైజాగ్‌లో 12 పరుగులు చేసిన తిలక్.. తిరువనంతపురంలో 7, గువాహటిలో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, తన బ్యాట్ నుంచి ఇప్పటిదాకా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఐదో స్థానంలో ఆడనుండగా.. అయ్యర్ సూర్య ప్లేస్‌ను భర్తీ చేయనున్నాడు. దీంతో అయ్యర్ రాకతో తిలక్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023లో అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 530 పరుగులు రాబట్టిన ఈ మిడిలార్డర్ బ్యాటర్ వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఇక మూడో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ ప్రసిద్ క్రిష్ణ, ఆవేశ్ ఖాన్‌లపై శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వీరి స్థానంలో కొత్త పెళ్లి కొడుకు ముకేశ్ కుమార్, దీపక్ చహర్ తుదిజట్టులోకి రానున్నట్లు సమాచారం. చదవండి: వరల్డ్ కప్ ముందుంది.. బీసీసీఐ నిర్ణయం సరైంది: గంభీర్ -
తొలిసారి.. ఇక్కడ పోలింగ్ భారమంతా మహిళలదే
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం రాయ్‌పూర్ (నార్త్)లో పోలింగ్ ప్రక్రియ ఆసాంతం మహిళా అధికారులు, సిబ్బంది చేతులమీదుగానే నడిచింది. ప్రిసైడింగ్ అధికారి మొదలుకొని పోలింగ్ అధికారి వరకు మొత్తం 201 పోలింగ్ బూత్‌ల్లో మహిళలకు మాత్రమే బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. ‘సంగ్వారీ (ఉమెన్ ఫ్రెండ్లీ) బూత్‌లకు పూర్తిగా మహిళా అధికారులను నియమించాం. 804 మంది మహిళలకు ప్రత్యక్ష బాధ్యతలు అప్పగించాం. మరో 200 మందిని రిజర్వులో ఉంచాం. ఇక్కడ ఐఏఎస్ అధికారి ఆర్.విమలను పరిశీలకురాలిగా నియమించాం. లయిజనింగ్ అధికారి కూడా మహిళే. చాలావరకు బూత్‌ల వద్ద భద్రతకు మహిళా సిబ్బందినే నియమించాం’అని వివరించింది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మహిళా ఐఏఎస్ రీనా బాబా సాహెబ్ కంగాలె కావడం విశేషమని ఆ ప్రకటనలో వివరించింది. మహిళా అధికారులే పోలింగ్ నిర్వహించిన రాయ్‌పూర్(నార్త్)నియోజకవర్గంలో స్త్రీ, పురుష నిష్పత్తి కూడా 1010:1000గా ఉండటం మరో విశేషమని పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాతే ఒక నియోజకవర్గంలో పోలింగ్ బాధ్యతలను కేవలం మహిళలకే అప్పగించాలన్న ఆలోచన రూపుదిద్దుకుందని రాయ్‌పూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సర్వేశ్వర్ నరేంద్ర భూరె తెలిపారు. ఈ మేరకు చేపట్టిన చర్యలు విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ తమను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రాయ్‌పూర్ సిటీ(సౌత్) నియోజకవర్గంలోని సగం వరకు బూత్‌ల్లోనూ మహిళా అధికారులనే నియమించినట్లు ఆయన వెల్లడించారు. చదవండి: వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు -
ఛత్తీస్‌గఢ్ పరివర్తన్ యాత్ర ముగింపు సభకు ప్రధాని
రాయ్‌పూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధపడే క్రమంలో బీజేపీ పరివర్తన్ మహాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పరివర్తన్ సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యక్రమం ముగింపు సభకు ప్రధాని కానున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో. రెండు పరివర్తన యాత్రల ముగింపు సందర్బంగా బిలాస్పూర్ సైన్స్ కాలేజీ వేదికగా జరుగనున్న సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నట్లు తెలిపారు. అప్పుడు ఘోర పరాజయం.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని తిరిగి చేజికించుకోవాలన్న తాపత్రయంతో ఉంది బీజేపీ. ఆ రాష్ట్రంలో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా పరిపాలన కొనసాగించిన బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 15 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. పరివర్తన్ యాత్ర.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ బీజేపీ పరివర్తన్ మహా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రెండు పరివర్తన యాత్రలను ముగించుకున్న బీజేపీ ముగింపు సభను బిలాస్పూర్లో జరుపుకోనుంది. 3000 కిమీ మేర సాగిన మొదటి రెండు విడతల యాత్రలో మొత్తం 87 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. నక్సల్ ప్రభావిత అసెంబ్లీ స్థానాలను మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించాలన్నది బీజేపీ ప్రణాళిక. కాంగ్రెస్ పని అయిపొయింది.. ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో మాట్లాడుతూ.. ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎగరబోయేది బీజేపీ జెండానే అని ఈరోజు బిలాస్పూర్లో జరగబోయే ప్రధాని సభతో ఆ విష్యం తేటతెల్లమవుతుంది అన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో మొదలై దిగ్విజయంగా సాగిన రెండు యాత్రల్లోనూ దాదాపు 50 లక్షల మంది జనం హాజరయ్యారని ఈరోజు సభకు కూడా అదే స్థాయిలో జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన పరివర్తన్ సంకల్ప యాత్రలను చూసి కాంగ్రెస్ సగం కుంగిపోయిందని వారిలో అప్పుడే ఓటమి భయం మొదలైందని అన్నారు. భారీ భద్రత.. ఇదిలా ఉండగా బిలాస్‌పూర్‌లోని ప్రధాని సభకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు. సభాప్రాంగణానికి చుట్టూ మూడు కిలోమీటర్ల వ్యాసార్ధాన్ని నో ఫలియింగ్ జోన్‌గా ప్రకటించారు. 1500 మంజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపును రంగంలోకి దించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. जोहार मोदी जी।🙏 मां भारती की सेवा में हर पल समर्पित,गरीबों, पिछड़ों,वंचितों के मसीहा,विश्व के सबसे लोकप्रिय राजनेता एवं देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी का छत्तीसगढ़ की न्यायधानी बिलासपुर में हार्दिक स्वागत एवं अभिनंदन।#CGWelcomesModiJi जय छत्तीसगढ़।🚩 pic.twitter.com/BKkLBAxxIB — Arun Sao (@ArunSao3) September 30, 2023 ఇది కూడా చదవండి: వందే భారత్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ -
ట్రెండ్ ఫాలో అవుతున్న రాహుల్ గాంధీ
-
రాహుల్ జన్‌కీ బాత్.. ఈసారి రైలులో..
రాయ్‌పూర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ మధ్య జనాల మధ్య కనిపించడం సాధారణంగా మారింది. తాజాగా ఆయన రైలులో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. సోమవారం బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లే ట్రైన్లో ప్రయాణించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి పల్స్ తెలుసుకోవడంతో పాటు.. సమస్యల్ని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. రైలు ప్రయాణ సేవలు ఎలా ఉన్నాయి? ప్రయాణంలో భాగంగా సాధారణ ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా? తదితర విషయాలపై రాహుల్ గాంధీ ప్రయాణికులతో ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది. రాహుల్ గాంధీ ట్రైన్లో ప్రయాణించిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో ఆయన స్లీపర్ కోచ్‌లో ప్రయాణికుల మధ్య నడుచుకుంటూ కనిపించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. यात्रा जारी है... 🚆 📍 छत्तीसगढ़ pic.twitter.com/K2QKa3MieT — Congress (@INCIndia) September 25, 2023 -
కౌ క్లాత్ స్టోర్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఓ క్లాత్స్టోర్కు గత ఏడు సంవత్సరాలుగా చంద్రమణి డైలీ విజిటర్. అయితే చంద్రమణి అనేది మహిళ పేరు కాదు. ఒక ఆవు పేరు. చంద్రమణి రోజూ క్లాత్స్టోర్లోకి వచ్చి కాసేపు ఉండి పోతుంది. క్లాత్‌స్టోర్ యజమాని పదమ్ డాక్లియా ఎప్పుడూ ఆవును విసుక్కోలేదు. పైగా భక్తిభావంతో పూజిస్తాడు. వస్త్ర దుకాణానికి వచ్చే కొనుగోలుదారులకు ఈ ఆవు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ‘మహాలక్ష్మి క్లాత్ స్టోర్’ అనే పేరు కాస్త ‘కౌ క్లాత్ స్టోర్’గా మారింది. -
ప్రధానిపై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ నేత
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ మాయకత్వంలో ఛత్తీస్‌గఢ్ చాలా అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకముందని అన్నారు. మాకు చాలా ఇచ్చారు.. ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం లక్ష మందికి సికిల్ సెల్ వ్యాధి కౌన్సెలింగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా ఛత్తీస్గఢ్లోఅనేక మేజర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ ప్రధానిని స్వాగతిస్తూ.. మీరు మాకేదో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు చాలా ఇచ్చారు. భవిష్యతులో కూడా మాకు చాలా ఇస్తారని విశ్వసిస్తున్నాను అన్నారు. కేంద్రంలోని మీ నాయకత్వంలో మేమంతా పనిచేశాము. ఇంతవరకు కేంద్రాన్ని ఎలాంటి సాయం అడిగినా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించి రాష్ట్రానికి చాలా చేశారన్నారు. మా రాష్ట్రం కేంద్రం సహాయంతో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళుతుందని ఆశిస్తున్నానన్నారు. Chattisgarh Deputy CM TS Singh Deo praises PM Modi for always supporting Chattisgarh Govt pic.twitter.com/QuavHjfgQD — DR.TEENA KAPOOR SHARMA (@Teenasharma_77) September 15, 2023 ఈ రాష్ట్రం పవర్‌హౌస్.. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో పవర్‌హౌస్ లాంటిదని ఇలాంటి పవర్‌హౌస్‌లు తమ శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తేనే దేశం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నామని అందులో భాగంగానే ఈరోజు కొన్నిటికి శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ సంఫర్బంగా జులైలో రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్, అలాగే రాయ్‌పూర్-ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపన కోసం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. छत्तीसगढ़ देश के लिए पावर हाउस की तरह है, आज दुनिया भारत से सीखने की बात कर रही है! - प्रधानमंत्री श्री @narendramodi जी #विजय_शंखनाद_रैली pic.twitter.com/8BbzdKXz5u — BJP Chhattisgarh (@BJP4CGState) September 14, 2023 అదీ అసలు కారణం.. ఛత్తీస్‌గఢ్‌లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూకుడును పెంచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం రేసులో ఉన్న టీస్ సింగ్ దేవ్‌ను కాదని భూపేష్ బాఘేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి టీఎస్ సింగ్ దేవ్ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. అసలే త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి వైఖరి కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇది కూడా చదవండి: ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి.. -
ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి..
రాయ్‌పూర్: త్వరలో జరుగనున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశం పేరు మార్పు విషయమై సొంత నిర్ణయాలేంటని ప్రశ్నిస్తూనే ఇటీవల అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా దళాలు మృతిచెందినా స్పందించకపోవడంపై ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే పేరు మార్చండి.. ఛత్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇండియా మీ నాన్నగారిది అనుకుంటున్నారా? ఇండియా 140 కోట్ల భారతీయులది. ఇండియా భారతీయుల గుండెల్లో ఉంది. హిందుస్థాన్ భారతీయుల గుండెల్లో ఉందని ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడమని సవాల్ విసిరారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం గతేడాది ఇండియా పేరుమీద అనేక కార్యక్రమాలను జరిపిందని గుర్తుచేశారు. ये 140 करोड़ लोगों का INDIA🇮🇳 है हम सबका INDIA है भारत, इंडिया, हिंदुस्तान - किसी की हिम्मत नहीं कि हमारे देश का नाम बदले। pic.twitter.com/c2gtVTgOJU — Arvind Kejriwal (@ArvindKejriwal) September 16, 2023 నోరు విప్పరేం? ఇక అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత సైనికులు మృతిచెందారు. వారి కుటుంబాన్ని చూసి యావత్ దేశమంతా తల్లడిల్లింది కానీ భారత ప్రధానికి కొంచెమైనా బాధ కలగలేదా అని ప్రశ్నించారు. వారు చనిపోయి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు నోరువిప్పలేదే అని ప్రశ్నించారు. शर्मनाक ‼️ ◆ जब हमारे Army Officers शहीद हुए तब PM, गृहमंत्री और रक्षा मंत्री जश्न मना रहे थे ◆ उनको शहीद हुए 4 दिन हो गए लेकिन PM ने उनके दुख में 2 शब्द नहीं बोले ◆ हर बात पर ट्वीट करने वाले PM और गृह मंत्री इस पर चुप क्यों हैं? क्या आपको दुख नहीं होता?@ArvindKejriwal pic.twitter.com/eOn69skBbT — Ghanendra Bhardwaj🇮🇳 (@GhanendraB) September 16, 2023 విద్యకే ప్రాధాన్యత.. ఛత్తీస్‌గఢ్‌లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యమని చెబుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా విద్య గురించి మాట్లాడింది లేదు. కానీ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించి పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పమని అన్నారు. VIDEO | "Since 75 years of independence, no party or government has ever come and asked for votes to build schools and hospitals. Even after the AAP came into existence, they still don't say this. They have a bad intent," says Delhi CM @ArvindKejriwal addressing a rally in… pic.twitter.com/Z49xoqpqHd — Press Trust of India (@PTI_News) September 13, 2023 300 యూనిట్లు ఫ్రీ.. అంతకుముందు రాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ఛత్తీస్‌గఢ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నగరాల్లోనూ గ్రామాల్లోనూ 24 గంటలూ విద్యుత్ అందిస్తామని హామీనిచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఇది కూడా చదవండి: 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్! -
‘గ్యారంటీ కార్డు’
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కోటలో పాగా వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ శనివారం రాయ్‌పూర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల కోసం 10 ఉచిత హామీ పథకాలను ప్రకటించారు. గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు నిరుద్యోగులకు రూ.3,000 భృతి, స్కూలు విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, నిరుపేద మహిళలకు నెలకి రూ.1,000, తదితర 10 హామీలతో గ్యారంటీ కార్డును విడుదల చేశారు. త్వరలో రైతులకు హామీ ప్రకటిస్తామని చెప్పారు. ఆప్ మొదటి సారిగా 2018 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను 85 స్థానాల్లో పోటీకి దిగి అన్ని చోట్లా «డిపాజిట్లు కోల్పోయింది. -
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్‌పూర్‌లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్‌కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్‌కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్‌పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
అవినీతే కాంగ్రెస్ ఊపిరి
రాయ్‌పూర్/గోరఖ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఊపిరి, ముఖ్య సిద్ధాంతం అవినీతేనని పేర్కొన్నారు. అవినీతి లేకుండా ఆ పార్టీ బతకలేదని విమర్శించారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ ఏటీఎంలా మార్చేసుకుందని వ్యాఖ్యానించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, అవినీతి పరులపై చర్యలకు తనదీ గ్యారెంటీ అని అన్నారు. ‘కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్ ప్రభుత్వం దుష్పరిపాలనకు ఆదర్శంగా మారింది. అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచింది. ప్రజల హక్కుల్ని లాగేసుకుని, రాష్ట్రాన్ని లూటీ చేసి, నాశనం చేసేందుకు పూనుకుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’అని ప్రధాని నిప్పులు చెరిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మద్య నిషేధం తదితర 36 వాగ్దానాలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయింది. మద్య నిషేధానికి బదులుగా కోట్లాది రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడింది. ఈ డబ్బంతా కాంగ్రెస్ ఖాతాలోకే చేరింది. ఒక్క మద్యానికే కాదు. ప్రతి శాఖలోనూ అవినీతే. అవినీతి కాంగ్రెస్‌కు ఊపిరిగా మారింది. అది లేకుండా ఆ పారీ్టకి శ్వాస ఆడదు. అవినీతే కాంగ్రెస్ ముఖ్య సిద్ధాంతం’అని అన్నారు. కాంగ్రెస్ అవినీతికి గ్యారెంటీ అని నేను విమర్శిస్తే కొందరు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానర్థం, అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లే. కాంగ్రెస్ అవినీతికి గ్యారెంటీ అయితే, అవినీతిపై చర్యలకు మోదీ గ్యారెంటీ’అని ఆయన స్పష్టం చేశారు. అవినీతి పరులు, గతంలో పరస్పరం దూషించుకున్నవారు ఇప్పుడు దగ్గరవుతున్నారంటూ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. ఇటువంటి వాటికి భయపడేది లేదన్నారు. ‘తప్పుడు పనుల్లో మునిగి తేలేవారు తప్పించుకోలేరు. నా దగ్గర ఉన్నదంతా మీరు (ప్రజలు), ఈదేశం ఇచి్చనవేనని ధైర్యంగా చెబుతున్నా. నాపై కుట్రలు పన్నుతున్న వారికి, నా సమాధి తవ్వాలని చూస్తున్న వారికి భయపడను. భయపడితే మోదీనే కాను’అని ప్రధాని చెప్పారు. రాష్ట్రం నుంచి నక్సలిజంను లేకుండా చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని తెలిపారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 70కి తగ్గిపోయిందన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంకేర్ జిల్లా అంతగఢ్– రాయ్‌పూర్ రైలుకు వర్చువల్‌గా జెండా ఊపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కార్డులను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న వారికి ఆధునిక సౌకర్యాలు కలి్పంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన రాయ్‌పూర్– ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్, రాయ్‌పూర్–విశాఖపట్టణం ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులతో ఈ ప్రాంత రూపురేఖలే మారనున్నాయన్నారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని శుక్రవారం ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతా ప్రెస్ కేవలం పుస్తకాలను ముద్రించే ముద్రణాలయం కాదు, ప్రజల విశ్వాసం, దేవాలయమని పేర్కొన్నారు. మహాత్మాగాం«దీకి గీతా ప్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గీతా ప్రెస్ ఆధ్వర్యంలో నడిచే కల్యాణ్ మేగజీన్ కోసం ఆయన వ్యాసాలు రాసే వారని చెప్పారు. ప్రధాని రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. అక్కడ రూ.12 వేల కోట్ల 29 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. గత ప్రభుత్వాలహయాంలో ఏసీ గదుల్లో కూర్చుని సంక్షేమ పథకాలను తయారు చేసే, ప్రభావం ఏమిటనే దానిపై అప్పటి నాయకులకు అవగాహన లేదని ప్రధాని అన్నారు. -
ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..!
మనిషికి చావు అనేది అత్యంత విచిత్ర పరిస్థితుల్లో సంభవిస్తుంటుంది. చావును ఎవరూ ముందుగా ఊహించలేరు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఖోపాధామ్‌లో ఒక వ్యక్తి మేకలను బలిచ్చాడు. తరువాత ఆ మేక మాంసంతో వంటకాలు చేయించి అందరికీ వడ్డించి, తానూ తిన్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని మృతికి కారణం ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఊహకందని విధంగా.. మేక కన్ను మనిషి ప్రాణాలను తీస్తుందని ఎవరైనా ఊహించగలరా? అయితే ఇది నిజంగానే జరిగింది. సూరజ్‌పూర్‌లో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. మేక కన్ను తిన్న వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఆలయంలో మేకలను బలి ఇచ్చిన తరువాత వాటి మాంసంతో వంటలు చేయించాడు. అతను ఆ వంటకాలలోని మేక కన్నును తిన్నాడు. అయితే అది అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి, ప్రాణాలు వదిలాడు. జిల్లా ఆసుపత్రికి తరలించగా.. ఈ ఘటన సూరజ్‌పూర్ జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 50 ఏళ్ల బగార్ రాయ్ తన స్నేహితులతోపాటు ప్రముఖ ఖోపాథామ్కు వెళ్లాడు. తన కోరిక నెరవేరిన నేపధ్యంలో అతను అక్కడికి వెళ్లాడు. అక్కడ పూజలు నిర్వహించిన తరువాత మేకలను బలి ఇచ్చి, ఆ మాంసంతో వంటకాలు చేయించాడు. తరువాత వాటిని గ్రామస్తులకు వడ్డించాడు. ఈ నేపధ్యంలో అతను మేక మాసంలోని దాని కన్నును తిన్నాడు. అయితే ఆ కన్ను అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడు. గ్రామస్తులు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణం వారి రోదనలతో నిండిపోయింది. ఇది కూడా చదవండి: ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని.. -
ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే.. కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ఫైర్..
రాయ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల మూడో రోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అదానీకి, మోదీకి సంబంధమేంటని పార్లమెంటులో తాను ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు వత్తాసుపలికేలా మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. అదానీ గురించి పార్లమెంటులో ప్రశ్నించవద్దని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ వాస్తవం ప్రజలకు తెలిసే వరకు తానూ ఈ విషయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు. 'భారత్ జోడో యాత్రలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రజలు, రైతుల సమస్యలు దగ్గరుండి చూశా. కులం, మతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచి జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజలు నాతోపాటు నడిచారు. ఈ యాత్ర నాకు పాఠాలు నేర్పింది. నాలుగు నెలల పాటు ఓ తపస్సులా ఈ యాత్ర సాగింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాము. కానీ బీజేపీ దాన్ని తీసుకెళ్లింది.' అని రాహుల్ వ్యాఖ్యానించారు. జైశంకర్‌పై ఆగ్రహం.. ఆర్థికంగా చైనాను భారత్ అధిగమించలేదని విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఆయనకు ఉన్న దేశభక్తి అని ప్రశ్నించారు. చైనాతో ఫైట్ చేయలేమని ఎలా అంటారని నిలదీశారు. ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పార్టీని మండల, బ్లాక్ స్థాయిలో బలోపేతం చేయాలని, ఇది కాగితాలకే పరిమితం కావొద్దని చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సామాన్యుల పార్టీ అని ప్రజలకు తెలియజేయాలన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ కలిసి ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. కమలం పార్టీని గద్దె దించేందుకు ఎంత ధైర్యం కావాలో తమకు తెలుసన్నారు. దేశ ప్రజల కోసం దాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. చదవండి: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏఐసీసీ పదవులపై చర్చ .. కోమటిరెడ్డికి అవకాశం దక్కేనా? -
Sonia Gandhi: క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై?
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ(76) క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా?. తాజాగా ఆమె చేసిన ప్రసంగం ఆంతర్యం అదేనా?.. రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించే పరోక్షంగా ఆమె ప్రస్తావించారా?. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించడం.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది ఇప్పుడు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో.. రెండవ రోజైన శనివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 15,000 మంది కాంగగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసిన ఆమె.. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపుగా ఆమె అభివర్ణించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ‘‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది. ఈ యాత్రను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు. ప్రత్యేకించి.. రాహుల్ గాంధీకి అని తెలిపారామె. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారామె. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయని ఆరోపించారు సోనియా గాంధీ. బీజేపీ విదేష్వాగ్ని రాజేస్తోందని, మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుంటోందని చెప్పారామె. రాజ్యాంగ నిర్దేశిత విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
అఖిల్ అక్కినేని విధ్వంసం.. తెలుగు వారియర్స్ బంపర్ విక్టరీ
ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ పండగ సందడి చేస్తోంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ షురూ అయింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్.. కేరళ స్ట్రైకర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్కినేని అఖిల్ రెచ్చిపోయారు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఔరా అనిపించారు. మొదట బ్యాటింగ్ దిగిన టాలీవుడ్ స్టార్స్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. యువ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేశారు. హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేరళ స్టార్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు. హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా, నందకిషోర్ ఒక వికెట్ తీశాడు. అత్యధిక పరుగులు చేసినందుకు అఖిల్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ప్రస్తుతం అఖిల్ సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. It's a MASSIVE win for Telugu warriors at Kerala strikers in @ccl 🔥🔥#AGENT aka @AkhilAkkineni8 leading from the front & conquers at Raipur Stadium with his WILD innings of 91 runs in just 30 balls 💪💥💥@TeluguWarriors1 @keralastrikers_ #CCL2023 #CelebrityCricketLeague2023 pic.twitter.com/CtovKs85n0 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 19, 2023 -
టాస్ గెలిచిన టీమిండియా.. ఉమ్రాన్ మాలిక్‌కు మొండిచేయి
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. రెండో వన్డేలో కచ్చితంగా ఆడతాడనుకున్న ఉమ్రాన్ మాలిక్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అటు న్యూజిలాండ్ జట్టు కూడా ఏం మార్పులేకుండానే బరిలోకి దిగుతుంది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్, సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డెవన్ కాన్వే,హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, హెన్రీ షిప్లే ఇక ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్‌పై కన్నేసింది. మరోవైపు తొలి వన్డేలో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న కివీస్ రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో పెద్దగా లోపాలు లేకపోయినప్పటికి బౌలింగ్ అంశం టీమిండియాను కలవరపెడుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కోహ్లి, సూర్యకుమార్, గిల్లు రాణిస్తే టీమిండియాకు డోకా లేదని చెప్పొచ్చు. ఇక తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్‌పై మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బౌలింగ్‌లో సిరాజ్ సూపర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. షమీ ఆరంభ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పటికి డెత్ ఓవర్లలో తేలిపోతున్నాడు. స్పిన్నర్లుగా సుందర్, కుల్దీప్ యాదవ్‌లు తన ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. అటు న్యూజిలాండ్ మాత్రం సీనియర్ల గైర్హాజరీలోనూ మంచి ప్రదర్శన ఇస్తుంది. అయితే తొలి వన్డేలో మైకెల్ బ్రాస్‌వెల్ విధ్వంసం కివీస్‌లో జోష్ నింపింది. ఆల్‌రౌండర్లు ఉండడం జట్టుకు సానుకూలాంశం. బ్యాటింగ్ ఇబ్బంది లేకున్నా.. బౌలింగ్ కాస్త గాడిన పడాల్సిన అవసరం ఉంది. 🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI. Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv — BCCI (@BCCI) January 21, 2023 -
IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం... 60 వేలకు పైగా సామర్థ్యంతో దేశంలోని మూడో అతి పెద్ద క్రికెట్ మైదానం... ఇప్పుడు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై ఆసక్తి పెరిగేందుకు ఇది మాత్రమే కారణం కాదు. బుధవారం హైదరాబాద్ మ్యాచ్ అందించిన వినోదం ఈ సిరీస్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. భారత్ ఏకపక్ష విజయం సాధించి ఉంటే... కివీస్ 131/6 నుంచి గెలుపు అంచుల దాకా వెళ్లకుండా ఉంటే ఈ మ్యాచ్‌కు ఇంత ఆకర్షణ వచ్చి ఉండేది కాదేమో! ఈ నేపథ్యంలో మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారుతుందా అనేది చూడాలి. రాయ్‌పూర్: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్‌ను గెలుచుకునే లక్ష్యంతో భారత జట్టు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ టీమిండియా ఖాతాలో చేరుతుంది. మరోవైపు పట్టుదలకు మారుపేరైన కివీస్ గత మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని అందుకొని సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్ల ఆట, బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయం. ఉమ్రాన్‌కు చాన్స్! ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఒకేసారి ముగ్గురు ‘డబుల్ సెంచూరియన్’లు భారత తుది జట్టులో ఆడబోతుండటం విశేషం. ఇది భారత బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... కోహ్లి ఎప్పుడైనా చెలరేగిపోగలడు కాబట్టి సమస్య లేదు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడటం జట్టుకు కీలకం. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌లో సిరాజ్ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పనికొస్తాడని తొలి వన్డేలో శార్దుల్‌ను తీసుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం చూపలేదు. దానికంటే రెగ్యులర్ బౌలర్‌కే అవకాశం ఇవ్వడం మంచిదని భావిస్తే మూడో పేసర్‌గా ఉమ్రాన్ జట్టులోకి తిరిగొస్తాడు. సోధి ఆడతాడా! న్యూజిలాండ్ పోరాటపటిమ ఏమిటో తొలి వన్డేలోనే కనిపించింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా... అనామకుడు అనుకున్న మైకేల్ బ్రేస్‌వెల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను చూపించాడు. స్పిన్నర్ సాన్‌ట్నర్ కూడా బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు. ఇదే ఆర్డర్‌ను చూసుకుంటే ఎనిమిదో స్థానం వరకు ఆ జట్టులో బ్యాటర్లకు కొదవ లేదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... అలెన్, ఫిలిప్స్ మెరుపు షాట్లతో చెలరేగిపోగల సమర్థులు. కాన్వే, కెప్టెన్ టామ్ లాథమ్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్ గట్టి పోటీనివ్వగలదు. ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన ఫెర్గూసన్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇలాంటి స్థితిలో లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధి గాయం నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది. పిచ్, వాతావరణం స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్‌పై బౌన్స్ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలింగ్‌కూ అనుకూలం. వర్ష సూచన లేదు. భారత జట్టుకు జరిమానా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ జవగల్ శ్రీనాథ్ ప్రకటించారు.