
రాయ్‌పూర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ మధ్య జనాల మధ్య కనిపించడం సాధారణంగా మారింది. తాజాగా ఆయన రైలులో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. సోమవారం బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లే ట్రైన్‌లో ప్రయాణించారు.
ప్రజల మధ్యకు వెళ్లి వారి పల్స్ తెలుసుకోవడంతో పాటు.. సమస్యల్ని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. రైలు ప్రయాణ సేవలు ఎలా ఉన్నాయి? ప్రయాణంలో భాగంగా సాధారణ ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా? తదితర విషయాలపై రాహుల్ గాంధీ ప్రయాణికులతో ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది.
రాహుల్ గాంధీ ట్రైన్‌లో ప్రయాణించిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో ఆయన స్లీపర్ కోచ్‌లో ప్రయాణికుల మధ్య నడుచుకుంటూ కనిపించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.
यात्रा जारी है... 🚆
— Congress (@INCIndia) September 25, 2023
📍 छत्तीसगढ़ pic.twitter.com/K2QKa3MieT
Comments
Please login to add a commentAdd a comment