ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి | Five labourers killed in Chhattisgarh factory explosion | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి

Published Fri, Aug 1 2014 9:28 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

Five labourers killed in Chhattisgarh factory explosion

ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ సమీపంలోని నవభారత్ ఫ్యూజ్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులు రాయపూర్లోని పలు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రాయ్పూర్ సమీపంలో అబన్పూర్ బ్లాక్లోని చోటి ఉర్లా గ్రామంలో డిటోనేటింగ్ ఫ్యూజ్ తయారు చేస్తున్న సమయంలో ఆ పేలుడు సంభవించిందని  వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ పేలుడు చోటు చేసుకుందని చెప్పారు. ఆ పేలుడులో ఫ్యాక్టరీపై భాగం కుప్పకూలిందని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement