
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో భారీ పేలుడు శబ్ధం వినిపించింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అగ్నిమాపక దళం, ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు ఓ పార్క్ సరిహద్దు గోడకు సమీపంలో సంభవించిందని, ఆ ప్రదేశంలో తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని గుర్తించారు అధికారులు. గత నెలలో పాఠశాల సమీపంంలో జరిగిన పేలుడు ప్రదేశంలోనూ ఇదే విధమైన పొడి పదార్థం కనుగొన్నారు.
కాగా ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు జరిగిన ఒక నెల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో పాఠశాల గోడ ధ్వంసమైంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment