fire engine
-
దుమ్ము దుప్పట్లో విలాస నగరం
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధూళి మేఘాలు, నిప్పుకణికల స్వైరవిహారంతో లాస్ ఏంజెలెస్ నగర కొండప్రాంతాలు నుసిబారిపోతున్నాయి. వేల ఎకరాల్లో అటవీప్రాంతాలను కాల్చి బూడిదచేసిన వేడిగాలులు అదే బూడిదను జనావాసాల పైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దమ్ముకొట్టుకుపోయేలా చేస్తున్నాయి. పొగచూరిన వాతావరణంలో సరిగా శ్వాసించలేక లక్షలాది మంది స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో జనం బయట తిరగొద్దని, హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నామని స్థానిక యంత్రాంగం శనివారం ప్రకటించింది. 10,000 భవనాలను కూల్చేసి, 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఇంకా చల్లారకపోగా తూర్పు దిశగా దూసుకుపోతుండటంతో స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమైంది. ఇప్పటికే మూడు లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఆస్తి నష్టం లక్షల కోట్లను దాటి లాస్ఏంజెలెస్ నగర చరిత్రలోనే అత్యంత దారుణ దావాగ్ని ఘటనగా మిగిలిపోయింది. పర్వత సానువుల గుండా వేడి గాలుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించవచ్చన్న భయాందోళనలు పొరుగు ప్రాంతాలైన ఎన్సినో, వెస్ట్ లాస్ఏంజెలెస్, బ్రెంట్వుడ్వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మంటలు ఆపేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఫైరింజన్లకు సరిపడా నీటి సౌకర్యాలు లేకపోవడంపై కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంటా యెంజ్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడంపైనా ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న మంటలకుతోడు కొత్తగా గ్రనడా హిల్స్‌లో అంటుకున్న అగ్గిరవ్వలు ‘ఆర్చర్ ఫైర్’గా విస్తరిస్తూ ఇప్పటికే 32 ఎకరాలను దహించివేసింది. ఈ ప్రాంతంలోనే ఎంటర్టైన్మెంట్ దిగ్గజ కిమ్ కర్దాషియాన్ సోదరీమణుల ఇళ్లు, డిస్నీ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి. కార్చిచ్చులో కళాకారుల కలల సౌధాలు: వెనుక కొండలు, ముందు వినీలాకాశం, కింద సముద్ర తీరంతో అద్భుతంగా కనిపించే లాస్ ఏంజెలెస్‌లో చాలా మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ఇష్టంతో ఇళ్లు కొన్నారు. వాటిల్లో చాలా మటుకు ఇప్పుడు కాలిపోయాయి. 76 ఏళ్ల అమెరికన్ కమేడియన్ బిల్లీ క్రిస్టల్ 1979లో పసిఫిక్ పాలిసేడ్స్‌లో కొనుగోలుచేసిన విలాసవంత భవనం తాజా మంటల్లో కాలిబూడిదైంది. మ్యాడ్ మ్యాక్స్ స్టార్ మేల్ గిబ్సన్, మరో నటుడు జెఫ్ బ్రిడ్జెస్, సెలబ్రిటీ టెలివిజన్ పర్సనాలిటీ ప్యారిస్ హిల్టన్, ‘ప్రిన్సెస్ బ్రైడ్’నటుడు క్యారీ ఎల్వీస్, ప్రముఖ నటుడు మ్యాండీ మూర్, మీలో వెంటిమిగ్లియా, లీటన్ మీస్టర్, ఆడమ్ బ్రాడీ, ఆంటోనీ హాప్కిన్స్, జాన్ గుడ్మాయ్న్, మైల్స్ టెల్లర్, అన్నా ఫారిస్, పాలిసేడ్స్ గౌరవ మేయర్ ఎజీన్ లేవీ, క్రిస్సీ టీగెన్, జాన్ లెజెండ్, మార్క్ మరోన్, మార్క్ హామిల్ల ఇళ్లు సైతం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. లిడియా, హర్స్ట్, ఆర్చర్, ఈటన్, కెన్నెత్, పాలిసేడ్స్ ఫైర్ దావాగ్నులు మొత్తంగా 37,579 ఎకరాల్లో విస్తరించాయి. -
ఢిల్లీలో భారీ పేలుడు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో భారీ పేలుడు శబ్ధం వినిపించింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు ఓ పార్క్ సరిహద్దు గోడకు సమీపంలో సంభవించిందని, ఆ ప్రదేశంలో తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని గుర్తించారు అధికారులు. గత నెలలో పాఠశాల సమీపంంలో జరిగిన పేలుడు ప్రదేశంలోనూ ఇదే విధమైన పొడి పదార్థం కనుగొన్నారు.కాగా ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు జరిగిన ఒక నెల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో పాఠశాల గోడ ధ్వంసమైంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
విశాఖలో భారీ అగ్నిప్రమాదం..
-
జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చెలరేగిన మంటలు
-
అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటాం. నచ్చిన విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. భద్రంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువులు కాలిపోవడంతోపాటు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు పోవచ్చు. ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపు ప్రమాదం మరింత తీవ్రస్థాయికి చేరవచ్చు. అసలే వేసవికాలం ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత రక్షణగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటితోపాటు కంపనీలు, షాపింగ్‌మాల్స్, భవనాల్లో తప్పకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించాలంటున్నారు. వీటికోసం చేసే చిన్నపాటి ఖర్చుతో ఇంటికి మరింత భద్రత కల్పించవచ్చని చెబుతున్నారు. వాటిని ఎంచుకునేముందు కనీస అవగాహన తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు.మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు చాలా రకాలుగా ఉంటాయి.స్టాండర్డ్ వాటర్: కాగితం, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్, కలప, ఫ్యాబ్రిక్‌కు అంటిన మంటలను అదుపు చేయవచ్చు.డ్రైవాటర్ మిస్ట్: నీటి రేణువులను పొడి సూక్ష్మకణాలుగా మార్చి మంటపై చల్లుతుంది.వెట్ కెమికల్: మంటలపై సబ్బు ద్రావణాన్ని చల్లుతుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే మంటలను అదుపు చేయవచ్చు. పౌడర్: పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ నుంచి వచ్చే మంటలు, మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువుల వల్ల ఏర్పడే వాటినిక ఆర్పవచ్చు. కార్బన్ డైయాక్సైడ్: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు తగ్గించవచ్చు.వాటర్ మిస్ట్ టైప్ ఫైర్: వరండాలు, వంట గదిలో వాడుకోవచ్చు. ఇది మంటపై నీటిని స్ప్రే చేస్తుంది. -
అప్రమత్తతే అతి ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు అవకాశాలు పెరిగాయి. అప్రమత్తతతో ఉంటేనే అగ్ని ప్రమాదాలను నియంత్రించడంతోపాటు ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టంతో బయటపడొచ్చు. ఇందుకు ప్రజల్లో అవగాహన అతి ముఖ్యమని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలు చేయనున్నట్టు ఫైర్ డీజీ వై.నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, నివాససముదాయాలు, మల్టీప్లెక్స్, మాల్స్‌లో వీటిని నిర్వహిస్తారు. ఎండల తీవ్రత పెరగడంతో అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ అగ్నిమాపకశాఖ కొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ విషయాల్లో జాగ్రత్త ► వేసవి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లు, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఓవర్‌లోడ్‌తో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైరింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఇంట్లో మంటల వ్యాప్తికి ప్రధాన అంశాల్లో వంటింట్లో మంటలు అంటుకోవడం కూడా.. అందువల్ల వంటగదిలో మంటలు అంటుకునే వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీలైనంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి. ► అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యునిటీలు, బహుళ అంతస్థుల భవనాల్లో ఉండే వారు తప్పకుండా ఫైర్ ఆడిటింగ్ నిర్వహించాలి. అగ్నిమాపక నియంత్రణ పరికరాలు, మంటలార్పేందుకు నీటి పైప్‌లైన్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు పనిచేస్తున్నాయా..ఇలా అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాలి. ► కారు ప్రయాణంలోనూ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పోర్టబుల్ ఫైర్ ఎక్ట్సింగ్విషర్ (మంటలు ఆర్పేది) పెట్టుకోవాలి. ► ఇళ్లలో ఎలక్ట్రికల్ వస్తువులు వాడకపోతే వాటిని వెంటనే స్విచ్ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ► కార్యాలయాల్లో ఫైర్ స్ప్రింక్లర్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు, ఎమర్జెన్సీ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు 2,550 ఫైర్ కాల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అన్ని రకాల ఫిర్యాదులు కలిపి 2,550 ఫైర్ కాల్స్ వచి్చనట్టు అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. గతేడాదిలో 8151 ఫైర్ కాల్స్ వచి్చనట్టు తెలిపారు. ఇందులో 141 తీవ్రమైన ప్రమాదాలు, 175 మధ్యతరహా అగ్నిప్రమాదాలు ఉన్నట్టు తెలిపారు. -
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కోఠీ గుజరాత్ గల్లిలోని ఓ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది సీసీటీవీల గోదాం అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భారీగా సీసీటీవీలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలానికి చేరుకున్నట్టు సమాచారం. మొత్తం మూడు ఫైర్ ఇంజన్లుతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఇళ్లు దగ్ధం?
ముంబైలోని గోవండిలోని బైగన్‌వాడి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 15 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఆ ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. అగ్నిమాపక దళం రాకముందే స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో కనీసం పది నుండి పదిహేను ఇళ్లు దెబ్బతిన్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరకీ ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వాహనాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 27 vehicles gutted in a fire in a parking lot at Borivali in North Mumbai | pic.twitter.com/F88nhYRSul — MUMBAI NEWS (@Mumbaikhabar9) February 16, 2024 -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
ఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బిల్డింగ్‌లో చెలరేగిన మంటల్లో రెండు కుటుంబాలు చిక్కుకున్నాయి. ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో నలుగులు మహిళలు ఉన్నారు. ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి అనుకోకుండా భవనంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రెండు కుటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారని పోలీసులు తెలిపారు. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. భవనంలోకి ప్రవేశించి మృతదేహాలను బయటకు తీశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి -
ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రమాదం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మరోవైపు ఘటన నేపథ్యంలో పంజాగుట్ట ఏరియాలో భారీగా ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. అదే భవనంలో ఆరో అంతస్థులో చికుకున్న ఓ కుటుంబాన్ని శ్రావణ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ రక్షించారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: కొడుకును పొడిచి.. పురుగు మందు తాగి -
కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్నిమాపకశాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించినా వెంటనే అప్రమత్తం అయ్యేలా అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 119 నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫైర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, మంటలు ఆర్పే పరికరాలతో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచినట్టు అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలను తనిఖీ చేసుకున్నారని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు. -
బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని బాణాసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు దగ్దమయ్యాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దీపావళి పండగ వేళ ముందస్తు అనుమతితోనే గోపాల్‌బాగ్ ప్రాంతంలో బాణాసంచా దుకాణాలు వెలిశాయి. పండగ కావడంతో మార్కెట్ జనంతో కిటకిటలాడుతోంది. మొదట ఓ షాప్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న ఏడు దుకాణాలకు ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరగడంతో జనం పరుగులు పెట్టారు. ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ షాక్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంటల్లో పలు వాహనాలు కూడా కాలిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచా అమ్మకాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఢిల్లీ వాసులకు అలర్ట్! -
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు. ప్రమాదానికి కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. -
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం
మహారాష్ట్ర: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థానేలోని షాపింగ్ మాల్లో మంగలవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓరియన్ బిజినెస్ పార్క్, సినీ వండర్ మాల్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరగడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. మెత్తం 10 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు సమాచారం. -
మామిడికుదురు మండలం పాశర్లపూడిలో భారీ అగ్ని ప్రమాదం
-
నాచారం మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
-
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని టిక్రీ కలాన్‌లో ఉన్న పీవీసీ మార్కెట్ శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వివరాల ప్రకారం.. టిక్రీ కలాన్‌లో ఉన్న పీవీసీ మార్కెట్లో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు ఉన్న కారణంగా పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. కిలోమీటర్ దూరంలో కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్కే దువా చెప్పారు. #WATCH | Delhi: Morning visual from Tikri Kalan area where fire broke out in a plastic godown during the early hours today. 25 fire tenders at the spot. No casualties reported so far. https://t.co/yhTyNp2M4y pic.twitter.com/Clr2ul8CmF — ANI (@ANI) April 8, 2023 -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరా తీసిన సీఎం కేజ్రీవాల్!
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వజీర్పూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘటనపై ఆరా తీశారు. వివరాల ప్రకారం.. వజీర్పూర్ పారిశ్రామిక ప్రాంతంలో ధర్మకాంత సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టపొగ అలుముకుంది. అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే 25 అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఘటనపై ఆరా తీశారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిదన్న కారణాలు, ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. #WATCH | Delhi: Fire breaks out in a factory in Wazirpur area. 25 fire tenders rushed to the site. Details awaited. pic.twitter.com/OHQxxxrVTR — ANI (@ANI) March 31, 2023 -
హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. రెండు డీసీఎంలతో పాటు గోదాంలో విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. -
Fire Accident: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా?
సాక్షి, హైదరాబాద్: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా? ప్రమాద సమయంలో కాపాడేందుకు సరైన అగ్నిమాపక వ్యవస్థ నగరంలో అందుబాటులో లేదా?.. అంటే అవుననే నిరూపిస్తున్నాయి అగ్ని ప్రమాద ఘటనలు. సికింద్రాబాద్ పరిధిలోని ‘డెక్కన్ కార్పొరేట్’ గురువారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో మంటల తీవ్రత అధికంగా ఉంది. గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించినా మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో ఫైర్ సిబ్బంది స్పందించడం, తగిన పరికరాలతో రంగంలోకి దిగడం అత్యంత ప్రధానమైంది. అలా చేస్తే మంటలను అదుపులోకి తేవడంతోపాటు ప్రమాద తీవ్రత, నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. అగ్నిమాపక సిబ్బందికి తగిన సమర్థత ఉంటున్నా.. కొన్నిసార్లు అందుబాటులో సరైన పరికరాలు లేకపోవడంతోనూ వారు ఆశించిన రీతిలో స్పందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల కాసుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖలోని కొందరు లంచావతారుల కారణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు అలవోకగా లభిస్తున్నాయి. నగరంలో కేవలం రెండంటే రెండు మాత్రమే బ్రాంటో నిచ్చెనలు ఉన్నాయి. బహుళ అంతస్థుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌లో ఈ నిచ్చెలను అంత్యంత కీలకమైనవి. కింది అంతస్థుల్లో మంటలు, పొగ వ్యాపించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఈ భారీ నిచ్చెనల ద్వారా పై అంతస్తులకు చేరే వీలుంటుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడి వారిని సురక్షితంగా కిందకు చేర్చడంలోనూ ఈ భారీ నిచ్చెనలు ఉపయోగపడాయి. ప్రస్తుతం ఉన్న రెండు బ్రాంటో నిచ్చెనల్లో ఒకటి సికింద్రాబాద్ పరిధిలో, మరోటి మాదాపూర్ ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. మంజూరు మంజూరు చేసినా.. అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న బ్రాంటో నిచ్చెనకు అదనంగా మరో 101 మీటర్ల బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు ప్రభుత్వం మంజూరు లభించింది. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఈ బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు దాదాపు రూ. 25 కోట్ల ఖర్చవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
ఇండిగో విమానంలో మంటలు
-
వావ్.. ఆ వృద్ధురాలి కోసం రంగంలోకి అగ్నిమాపక దళం!
రోడ్డు దాటేందుకు ఓ వృద్ధురాలు అవస్థలు పడుతోంది. కార్లు రాయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఏ ఒక్కరూ ఆమెకు దారివ్వటం లేదు. రోడ్డు మధ్యలో నిలుచుని ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితలో ఇబ్బందులు పడుతోంది ఆ మహిళ. అయితే, ఆమె కోసం ఏకంగా అగ్నిమాపక దళమే రంగంలోకి దిగింది. రోడ్డుకు అడ్డంగా ఫైర్ ఇంజిన్‌ను పెట్టి వాహనాలను ఆపేసి ఆమెను రోడ్డు దాటించారు ఫైర్ ఫైటర్స్. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి సాయం చేసిన ఫైర్ ఫైటర్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. రోడ్డు దాటేందుకు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి ఇలానే సాయం చేయండి. రోడ్డుకు అడ్డుగా మీ కారు ఉంచి దారి ఇవ్వండి అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. మరోవైపు.. దయ, మానవత్వ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని మరో వ్యక్తి పేర్కొన్నారు. అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించారని మరొకరు రాసుకొచ్చారు. Wow 🥰👏🏽👏🏽👏🏽👏🏽 pic.twitter.com/3ahdMoDHqt — How Things Are Manufactured (@fastworkers6) October 9, 2022 ఇదీ చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్ -
Hyderabad: పగటిపూట అగ్గి రాజుకుంటే బుగ్గే!!
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లోని చందన బ్రదర్స్, కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్, బషీర్‌బాగ్‌లోని మొఘల్ కోర్ట్‌లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా, పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్, బోయగూడ స్క్రాప్ గోదాం, తాజాగా సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి.. ఇలా నగరంలో ఇప్పటి వరకు జరిగిన పెద్ద అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి పూటే జరిగాయి. దాంతో అగ్నిమాపక శకటాలు వీలైంనంత త్వరగా ఘటనాస్థలికి రాగలిగాయి. అదే ఈ స్థాయి ప్రమాదాలు పగలు జరిగితే.. ట్రాఫిక్ చక్ర బంధనాల్ని ఛేదించుకుని ఫైరింజన్లు ఘటనాస్థలికి రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ అంశంలో 2016 నాటి ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫారసులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. రాత్రి వేళల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో రోడ్లపై రద్దీ ప్రభావం అగ్నిమాపక యంత్రాలపై పడట్లేదు. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలుతుగున్నాయి. నిబంధనలు.. వాస్తవాలు.. ► నిబంధనల ప్రకారం రాజధానిలో ప్రతి 5 చదరపు కి.మీటర్లకు ఒక అగి్నమాపక శకటం అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో చూస్తే 41 చదరపు కి.మీ.లకు ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. ►50 వేల మంది రక్షణకు ఓ అగంరిమాపక శకటం అవసరం. నగరం విషయానికి వస్తే 2011 అధికారిక లెక్కల ప్రకారం చూసినా గ్రేటర్ పరిధిలో కనిష్టంగా 175 ఫైర్ స్టేషన్లు, దానికి మూడు రెట్ల సంఖ్యలో శకటాలు అవసరం. ప్రస్తుతం నగరంలో ఉన్నవి కేవలం 15 ఫైర్ స్టేషన్లు, 50 లోపు శకటాలు. ఈ లెక్కన సుమారు మూడు లక్షల మందికి ఒకటి అందుబాటులో ఉన్నట్లు. ►అగ్నిమాపక శకటం గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించగలగాలి. కానీ ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20–25 కిమీ మించట్లేదు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగి్నమాపక శకటం అక్కడకు చేరాలి. నగర రోడ్ల పరిస్థితిని బట్టి ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాలు పడుతుంది. ►బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్ ఫైరింజన్ కేవలం సికింద్రాబాద్‌లోనే ఉంది. వీటికి తోడు అగి్నమాపక శాఖలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బందులున్నాయి. 2016లో పార్లమెంట్ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్ టైమ్) ఆధారంగా ఫైర్ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. ► రెస్పాన్స్ టైమ్ నగరాలు, పట్టణాల్లో అయిదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి. -
మంటల్లో కాలిపోతున్న ఇల్లు.. హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్
వాషింగ్టన్: అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యువకుడు చేసిన సాహసాన్ని పోలీసులు సహా స్థానికులు కొనియాడారు. పిజ్జా డెలివరీ బాయ్ హీరో అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అమెరికా లఫయెట్టెలో ఈ ఘటన గతవారం జరిగింది. హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువకుడి పేరు నికోలస్ బోస్టిక్. వయసు 25 ఏళ్లు. పిజ్జాలు డెలివరీ చేసి అర్ధరాత్రి ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు ఓ ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. వెంటనే పెద్దగా అరుస్తూ ఆ ఇంటి బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్లాడు. ఇతని అరుపులు విని ఇంట్లో మొదటి అంతస్తులో నిద్రపోతున్న నలుగురు పిల్లలు లేచారు. బోస్టిక్ వాళ్ల దగ్గరకు వెళ్లి కిందకు తీసుకొస్తుండగా.. మరో ఆరేళ్ల చిన్నారి లోపలే ఉన్నట్లు వాళ్లు చెప్పారు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బోస్టిక్ మంటల్లోనే గదిలోపలికి వెళ్లాడు. అయితే ఆ పిల్లాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఏడుస్తూ కన్పించాడు. దీంతో కిటికీ అద్దాలను చేతితోనే పగలగొట్టి కిందకు దూకాడు బోస్టిక్. ఆరేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ప్రాణాలతో బయటపడ్డవారిలో 18 ఏళ్లు, 13 ఏళ్లు, ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉన్నారు. బోస్టిక్ సహసాన్ని పోలీసులు కొనియాడారు. అతను నిస్వార్థంగా ఆలోచించి ఐదుగురి ప్రాణాలను కాపాడాడని ప్రశంసించారు. అతను రియల్ హీరో అని పొగడ్తలతో ముంచెత్తారు. పోలీసు శాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్లో షేర్ చేశారు. Here’s the video to go along with the story. pic.twitter.com/TvZ5wzCg1f — LafayetteINPolice (@LafayetteINPD) July 15, 2022 చదవండి: రన్ వేపై దిగుతూ మరో విమానాన్ని ఢీకొట్టిన ఫ్లైట్.. నలుగురు మృతి -
ఢిల్లీ గోడౌన్లో మంటలు ఆర్పుతున్న 'రోబో': వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుఝామున 2.18 గంటకు చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఐతే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలుకాలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేయడంలో ఎరుపు రంగు రోబో కీలక పాత్ర పోషించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గత నెలలో రెండు రోబోలను ఆస్ట్రేలియా కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఆ రోబోలో ఒకటి ఈ రెడ్ రోబో. ఈ అగ్నిమాపక రోబోలను ఉపయోగించడం వల్ల త్వరిగతగతిన మంటలు అదుపులోకి తీసుకురాగలమని, సాధ్యమైనంత మేర తక్కువ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇవి సుమారు 100 మీటర్ల దూరం నుంచి కూడా మంటలను ఆర్పగలదు. ఇరుకైన మార్గంలో సంభవించిన ప్రమాదాల్లో సైతం ఈ రోబోలు చాలచక్కగా నావిగేట్ చేసి మంటలను ఆర్పేస్తాయని అంటున్నారు. ఇవి నిమిషానికి దాదాపు 2 వేల లీటర్లు చొప్పున నీటిని విడుదల చేయగలవు. ఇవి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎగిసి పడుతున్న అగ్నికీలల స్థాయిని బట్టి సామర్థ్యం మేర నీటిని విడుదల చేసేలా ప్రత్యేక విభాగం కూడా ఉంది. వీటికి సెన్సార్, కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. ఇవి నాలుగు కిలోమీటర్ల వేగంతో కదలగలవు. Our government has procured remote-controlled fire fighting machines. Our brave fireman can now fight fires from a maximum safe distance of upto 100 meters. This will help reduce collateral damage and save the precious lives. pic.twitter.com/1NjGX3ni3B — Arvind Kejriwal (@ArvindKejriwal) May 20, 2022 (చదవండి: షాకింగ్ ఘటన.. ఆమె చేతులు కట్టేసి భవనం పై నుంచి తోసేసి....: వీడియో వైరల్) -
హైదరాబాద్: స్టేషన్ ఇక్కడ.. ఫైర్‌ఇంజిన్లు అక్కడ!
సాక్షి, హైదరాబాద్: అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తు సమయాల్లో ప్రజలను, వారి ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైర్స్టేషన్లు ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల సరైన సేవలు అందిచలేకపోతున్నాయి. ఫైర్స్టేషన్ను తమ పరిధికి దూరంగా తరలించడంతో ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. ► హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్ 20 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. సొంత భవనం లేకపోవడంతో స్థానిక మండల పరిషత్ ఆవరణలో కొంత కాలం కొనసాగింది. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ప్రభుత్వం స్థలం కేటాయించడంతో అక్కడ సొంత భవనం నిర్మించారు. భవనాన్ని లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో ప్రతి వర్షాకాలంలో ఫైర్ స్టేషన్ మునిగియి సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడేవారు. చదవండి: ఫోన్లో బుకింగ్.. ర్యాపిడోపై డెలివరీ.. మూడోసారి దొరికిన మురుగేశన్ 4 నెలల క్రితం భవన నిర్మాణం షురూ... అగ్నిమాపక సిబ్బంది పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో నాలుగు నెలల క్రితం కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఫైర్ స్టేషన్ కూల్చి వేయడంతో సిబ్బందిని వాహనాలను ఇక్కడికి సుమారు 12 కిలోమీర్ల దూరంలో ఉన్న ఉప్పల్ స్టేషన్ (ఇంకా ప్రారంభం కాలేదు)కు తరలించారు. ► అటు సరూర్‌నగర్ మండలం, ఇటు చౌటుప్పల్, సాగర్రోడ్డలో తుర్కయాంజాల్ వరకు హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాలలో జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఇక్కడి సిబ్బంది వెళ్లాల్సి వస్తోంది. ► ప్రస్తుతం హయత్‌నగర్ ఫైర్ స్టేషన్ ఇక్కడి నుంచి తరలించడంతో ఆయా ప్రాంతాలలో జరిగే ప్రమాదాల నివారణకు సరైన సమయంలో వెళ్లలేక పోతున్నారు. ► ఆటోనగర్‌లో ఇటీవల జరిగిన ప్రమాద స్థలానికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా వచ్చారనే ఆరోపణలు వినిపించాయి. స్టేషన్ పరిధికి సిబ్బంది దూరంగా ఉండటంతో ప్రమాదం జరిగిన తర్వాత బూడిదను ఆర్పడానికే సిబ్బంది వస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అవకాశం ఉన్నా ఉపయోగించలేదు... ఫైర్ సిబ్బంది, వాహనాలు నిలిపేందుకు హయత్‌నగర్‌లో పలు చోట్ల అవకాశం ఉన్నా అధికారులు వాటిని ఉపయోగించుకోలేదని స్థానికులు ఆరోపి స్తున్నారు. మండల పరిషత్ ఆవరణ, పోలీస్టేషన్, రేడియో స్టేషన్, ప్రభుత్వ పాఠశాల, మదర్ డెయిరీతో పాటు పలు ప్రైవేట్ స్థలాల్లో సిబ్బంది ఉండేందుకు అవకాశం ఉంది. ఈ అవకాశాలను కాదని దూరంగా ఉన్న ఉప్పల్ స్టేషన్‌కు తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ సహకరించలేదు ఫైర్ స్టేషన్ సిబ్బందికి, వాహనాలు నిలిపేందుకు అవసరమై వసతులు కల్పించాలని మండల పరిషత్ అధికారులతో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశాం. ఎవరూ సహకరించలేదు. దీంతో సిబ్బందిని ఉప్పల్ స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది. నెల రోజుల్లో ఇక్కడ భవన నిర్మాణం పూర్తవుతుంది. వెంటనే సిబ్బందిని ఇక్కడికి తరలిస్తాం. -శీనయ్య, ఫైర్ స్టేషన్ అధికారి, హయత్‌నగర్ -
బోయిగూడ ప్రమాదంతో మేల్కొనక తప్పదా.. దేశంలో వాడే టెక్నాలజీ ఇదే..
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లోకి వెళ్లడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి రెండు గంటలు పట్టింది. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ఉన్న స్పైరల్ స్టెయిర్ కేస్ (మెట్లు) వేడెక్కిపోవడంతో ఇబ్బందిపడాల్సి వచ్చింది. వేకువజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో మంటలంటుకోగా ఉదయం 8 గంటలకు 8 ఫైరింజన్లు కష్టపడి మంటలార్పాయి. అయితే అగ్ని ప్రమాదాల్లో మంటలను త్వరగా ఆపేందుకు మన దేశంలో అత్యాధునిక పరికరాలేమున్నాయి, ఎలాంటి టెక్నాలజీని వాడి మంటలను అదుపు చేస్తున్నారు, ప్రాణాలను ఎలా కాపాడుతున్నారు? రిమోట్ కంట్రోల్డ్ ఫైర్ ఫైటింగ్ మెషీన్ ప్రస్తుతం ఢిల్లీ అగ్నిమాపక శాఖ దగ్గర ఉంది. తీవ్రమైన వేడి ఉన్నప్పుడు, ప్రమాద స్థలంలోకి వెళ్లే పరిస్థితి లేనప్పుడు రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే మెషీన్లను సులువుగా వాడొచ్చు. 140 హార్స్ పవర్‌తో పని చేసే డీజిల్ ఇంజిన్ ఇందులో ఉంటుంది. నిమిషానికి దాదాపు 2,400 లీటర్ల నీటిని ఇది పంప్ చేస్తుంది. పైగా ఇందులోని ఆటోమైజ్డ్ వాటర్ జెట్.. నీటిని కోట్లాది చిన్న చిన్న నీటి బిందువులుగా మార్చేస్తుంది. అవసరమైన ప్రదేశాల్లో నురగను కూడా ఉత్పత్తి చేసి పంప్ చేస్తుంది. టర్న్ టేబుల్ ల్యాడర్ పెద్ద పెద్ద బిల్డింగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాడటానికి టర్న్ టేబుల్ ల్యాడర్‌ను వాడుతున్నారు. దీని ద్వారా దాదాపు 32 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి మంటలు ఆర్పవచ్చు. నిచ్చెనను జాగ్రత్తగా ఆపరేట్ చేయడానికి కంప్యూటర్ మానిటరింగ్ ఉంది. డిస్ప్లే ఇండికేషన్లు కూడా ఉన్నాయి. మోటార్ సైకిళ్లకు మిస్ట్ సిస్టమ్ ఈ తరహా సిస్టమ్‌ను మోటార్ సైకిళ్లకు బిగిస్తారు. ఇది దాదాపు 40 మైక్రాన్ల స్థాయిలో నీటి అణువులను వెదజల్లుతుంది. చిన్నస్థాయి, ఎలక్ట్రిక్ మంటలను ఆర్పేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో బాగా పని చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి ముందు మంటల తీవ్రతను ఇది తగ్గించగలుగుతుంది. హై ప్రెజర్ హోస్ రీల్ సిస్టమ్ నీటిని సమర్థంగా వాడి మంటలార్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా అత్యధిక ఒత్తిడితో నీటిని, ఇతర మంటలార్పే పదార్థాలు, ద్రావణాలను చల్లుతారు. విదేశాల్లో కొత్త టెక్నాలజీలు ఇవే.. డ్రోన్లతో.. అగ్ని ప్రమాదాల్లో మంటలార్పేందుకు చైనాలో డ్రోన్లను వాడుతున్నారు. ఎంత ఎత్తుకైనా, ఎక్కడికైనా చాలా సులువుగా డ్రోన్లు వెళ్లిపోగలవు. కచ్చితత్వంలో మంటలను ఆర్పగలవు. ఆ మధ్య చైనాలోని చాంగ్‌క్వింగ్‌లో డ్రోన్లతో మంటలార్పే డ్రిల్‌ను కూడా నిర్వహించారు. షాట్ గన్స్.. మంటలార్పే ఇంపల్స్ ఫైర్ ఎక్స్‌టింగ్విషింగ్ సిస్టమ్ షాట్ గన్స్‌లో తక్కువ స్థాయిలో నీటిని వాడతారు. అయితే అత్యధిక వేగంతో మంటలపై దీన్ని ప్రయోగిస్తారు. వీటిలోంచి వచ్చే నీటి బిందువులు సెకనుకు 120 మీ. వేగంతో వెళ్లి పరిసరాలను చల్లబరుస్తాయి. దీంతో మంటలు ఆరిపోతాయి. రోబోటిక్ ఫైర్ ఫైటర్స్ చూడటానికి అచ్చం యుద్ధ ట్యాంకులా ఉంటుంది. ఇది నిమిషానికి 2 వేల నుంచి 20 వేల లీటర్ల నీటిని చల్లుతుంది. దీంట్లో కెమెరాలు, వేడిని గుర్తించే సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా రోబోలు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని దూరం నుంచే అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది.. రోగులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌లను ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేశారు. స్థానికుల సహయంతో అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. చదవండిః ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం! -
Rajasthan: ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
జైపూర్: రాజస్తాన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల ప్రకారం.. జైపూర్‌లోని జామ్వా రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న టర్పెంటైన్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోనికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. Rajasthan | Three children and a man died after a fire broke out at a Turpentine oil factory in Jamwa Ramgarh, Jaipur. The fire was brought under control: CO Shiv Kumar pic.twitter.com/NEfnCgHFzM — ANI (@ANI) January 30, 2022 చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ -
Jammu Kashmir: శ్రీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌బాగ్‌లోని ఒక వాణిజ్య భవనంలో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్సెఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ఫైరింజన్ సహయంతో మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు. ఒక సిలెండర్ పేలడం వలన మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాగా, మంటలను అదుపుచేసే క్రమంలో ఒక ఫైర్ అధికారి గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ఘటన స్థలం వద్ద అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు -
Building Collapses: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ బాంద్రాలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంత మంతా భయానకంగా మారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బెహ్రం నగర్ ప్రాంతానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. బిల్డింగ్‌లో చాలా మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు. పోలీసులు, బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు కూడా సహయక చర్యలను చేపట్టారు. అధికారులు.. ముందు జాగ్రత్తగా ఆరు అంబులెన్స్‌లను, ఐదు ఫైరింజన్లను ఘటన స్థలం వద్ద ఏర్పాటు చేశారు. At least five persons are feared trapped after a 5-storey building collapsed in Behram Nagar locality of Bandra (East), Mumbai. Five fire engines, one rescue van, and 6 ambulances have been rushed to the site: BMC — ANI (@ANI) January 26, 2022 చదవండి: రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం.. -
టైరు పేలి కారు బావిలోకి.. తల్లీతనయుడి సహా మరొకరి మృతి
దుబ్బాక టౌన్: కారులో ఊరికి బయలుదేరిన తల్లీతనయుడిని విధి వక్రించింది. టైరు పేలడంతో కారు వెళ్లి నిండుగా నీళ్లున్న బావిలో పడిపోయి మృతిచెందారు. వాళ్లను ప్రాణాలతో బయటకు తీయడానికి వెళ్లిన ఓ గజ ఈతగాడు కూడా ఆ కారులోనే నీళ్లలో ఇరుక్కుపోయాడు. విగతజీవిగా మిగిలాడు. ఒకే ప్రమాదం రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి (45), ప్రశాంత్ (26) బుధవారం కారులో హుస్నాబాద్ బయల్దేరారు. చిట్టాపూర్ శివారుకు రాగానే మధ్యాహ్నం 1.13కి కారు టైరు పేలి రోడ్డు పక్కన 20 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో బైక్‌పై అటుగా వెళ్తున్న వాహనదారుడు వెనక్కి చూసేసరికి కారు పల్టీలు కొడుతూ బావిలో పడింది. అతనితో పాటు మరికొందరు వాహనదారులు వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం భూంపల్లి పోలీస్ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని కూడవెల్లి పెద్ద వాగు దాటాక చిట్టాపూర్ శివారులో ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో..: పోలీసులు ఫైర్, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ చల్లా దేవారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు, చిట్టాపూర్ సర్పంచ్ పోతనక రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు కనకయ్య, సమీప రైతులతో బావి వివరాలు సేకరించారు. సుమారు 16 గజాల లోతు బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ముందు గజ ఈతగాళ్లతో కలిసి పాతాల గరిగెల (హ్యాంగర్స్)తో గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేదు. నీరు ఎక్కువగా ఉండటంతో రెండు పెద్ద జనరేటర్లు పెట్టి ఎత్తిపోయడం మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా 2 గజాల వరకు నీటినే తోడేయగలిగారు. దీంతో చేగుంట, సిద్దిపేటల నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పించారు. వాటి సాయంతో గజ ఈతగాళ్లు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. క్రేన్ల కొండి బావి లోపల ఉన్న కారుకు చిక్కుకున్నా నీరు ఎక్కువగా ఉండటంతో పైకి లేస్తున్న క్రమంలో కొండ్లు జారుతూ ఇబ్బందిగా తయారైంది. నీటిని తోడుతూ.. గాలిస్తూ..: మరో 4 మోటార్లు పెట్టి బావిలోని నీటిని తొలగిస్తూ క్రేన్లతో కారు వెలికితీతను అధికారులు కొనసాగించారు. సుమారు 7 గంటలు శ్రమించి రాత్రి 8.20కి కారును పైకి తీశారు. కారు నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి, ప్రశాంత్‌గా గుర్తించారు. రాములు లారీ డ్రైవర్ కాగా భార్య లక్ష్మి రోజువారీ పనులకు వెళ్లేది. ప్రశాంత్ ఐటీఐ పూర్తి చేసి రామాయంపేట మండలంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రేవతి డైట్ సెట్‌కు ప్రిపేర్ అవుతోంది. కారులో ఇరుక్కుపోయిన గజ ఈతగాడు బావిలోంచి కారు తీసే క్రమంలో దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింహులు (40) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 3 గంటలకు తోటి గజ ఈతగాళ్లతో కలిసి నర్సింహులు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు క్రేన్ కొండిని తగిలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోటార్లతో రాత్రి 8 గంటల వరకు 5 గజాలకు పైగా నీటిని తోడారు. తర్వాత క్రేన్ కొండిని కారుకు తగిలించేందుకు బావి లోపలికి వెళ్లాడు. కారుకు కొండిని తగిలించి అందులోనే ఇరుక్కుపోయా డు. క్రేన్ సాయంతో కారును పైకి తీస్తుండగా కారుకు, తాళ్లకు మధ్య చిక్కుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు. తాళ్లను కొంత పైకి లాగాక ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటివరకు సహాయక చర్యలో ఉన్న గజ ఈతగాళ్లు కూడా వెళ్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే: పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సింహులు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు, బంధువులు రామాయంపేట–సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు బావిలో దిగకుండా ప్రైవేట్ వ్యక్తులను బావిలోకి దింపి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భారీ అగ్నిప్రమాదం: మంటలను అదుపుచేస్తున్న 20 ఫైరింజన్లు..
గాంధీనగర్: గుజరాత్లో వల్సాద్‌లోని పేపర్ మిల్లులో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు పోలీసులు,ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. 20 ఫైరింజన్లో సహయంతో మంటలను అదుపులోకి తెవడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అగ్నిమాపక అధికారి అంకిత్ లోట్టే తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేవు. దీపావళి సందర్బంగా కార్మికులు పూజలో ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. పేపర్ మిల్కు నిన్న.. సెలవు దినం కావడంతో కార్మికులు ఎవరు రాలేదు. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు లోనయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Gandhi hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
Gandhi hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఈరోజు(బుధవారం) ఉదయం ఏడున్నర గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో ఫ్లోర్లో ఉన్న.. విద్యుత్ ప్యానెల్ బోర్డు రూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో ఆరో ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. కేవలం 40 నిమిషాలలోనే మంటలను అదుపులోకి తీసుకోచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదం తెలిసిన వెంటనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండేంట్ రాజరావు ప్రమాదం జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. సాక్షి టీవీతో గాంధీ సూపరింటెండెంట్ రాజారావు: ఉదయం గాంధీ ఆస్పత్రి ఎలక్ట్రికల్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అన్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కోవిడ్ సమయంలో కొంత మంది సిబ్బందికి ప్రమాదం జరగ్గానే స్పందించాల్సిన తీరుపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఆసుపత్రిలో ఫైర్‌సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయని అన్నారు. కరోనా పాండమిక్ సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాలన్ని ఇక్కడ అమర్చినట్లు తెలిపారు. నార్త్ బ్లాక్‌లో ప్రస్తుతం పెషేంట్లు లేరని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను పక్క వార్డులోకి షిఫ్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్ అల్విన్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: కూకట్‌పల్లిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఆల్విన్ కాలనీలోని ఫ్యాబ్రికేషన్ షాపులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు. -
సీబీఐ ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లోధిరోడ్‌లో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బిల్డింగ్‌లోని, సీజీఓ కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కాగా, వెంటనే 6 ఫైరింజన్లు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. ఈ ప్రమాదం ఉదయం 11 తర్వాత జరిగిందని భావిస్తున్నారు. అయితే, మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్ అధికారి తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. ప్రమాదం తెలిసిన వెంటనే.. పెద్ద ఎత్తున పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, సీజీఓ కాంప్లెక్స్‌లోని సెకండ్ బేస్‌లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దవఖానాల్లో అగ్ని ప్రమాదాలపై సీఎం కేసీఆర్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్గా ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. వేసవి కాలం కావడం, అన్ని ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో నిండి ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి, టిమ్స్ లాంటి పేషెంట్లు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫైర్ ఇంజిన్లు పెట్టాలని సూచించారు. యుద్ధ విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరగడంతో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య కూడా పెరిగిందని, దీంతో టెస్టింగ్ కిట్ల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో కిట్లు ఎక్కడ అందుబాటులో ఉన్నా మన రాష్ట్రానికి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. కిట్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల లేఖలో పేర్కొన్నారు. ప్రతి పేషెంట్‌కు ఐసోలేషన్ కిట్ రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ అందించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని లక్షల మందికైనా హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించడానికి వీలుగా కిట్లను సమకూర్చాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా కరోనా నియంత్రణలో పూర్తి సహకారం అందిం చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ -
ఫైర్ సిబ్బంది సేవలను ప్రశంసించిన హోంమంత్రి
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం నగరంలో హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక పరికరాలను, సిబ్బంది పనితీరును హోంమంత్రి పరిశీలించారు. నూతన ఫైర్ వెహికల్‌ను సుచరిత జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని ఆమె సన్మానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, కంబాల జోగులు, కళావతి, గొర్లే కిరణ్ కుమార్‌లు పాల్గొన్నారు. చదవండి: అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ.. వివిధ కారణాల వల్ల జిల్లాలో 200లకు పైగా అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. అగ్ని ప్రమాదాల వలన దాదాపు రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. అగ్నిప్రమాదాల బారి నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆస్తిని కాపాడటం జరిగిందని, వివిధ అగ్నిప్రమాదాల నుంచి 15 మందిని ప్రాణాలతో కాపాడినట్లు తెలిపారు. ఎక్కడ విపత్తులు జరిగినా ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి సహాయం చేస్తున్నారని, కచులూరు బోట్ ప్రమాదం, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో జరిగిన వరద ప్రమాదాల్లో ఫైర్ సిబ్బంది ఎన్నో సేవలందించారని ప్రశంసించారు. ప్రమాదాల నుంచి మనుషులతో పాటు పశువులను కూడా ప్రాణాలతో కాపాడిన ఘటనలు ఉన్నాయని, ప్రాణాలకు తెగించి విపత్తు సేవలందిస్తున్న ఫైర్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో 84 స్కోచ్ అవార్డులలో మన రాష్ట్ర పోలీస్ శాఖ 48 అవార్డులు దక్కించుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయని ప్రస్తావించారు. చదవండి: రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే హత్య! అగ్నిప్రమాదాలు చాలా వరకు తగ్గాయి ‘పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్లు టెక్నాలజీ సహాయంతో ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా ఫైర్ డిపార్టమెంట్ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఎండాకాలం వచ్చిందంటే పూరి గుడిసెల్లో ఫైర్ ఆక్సిడెంట్లు విపరీతంగా జరిగేవి. ఇప్పుడు అలాంటి అగ్నిప్రమాదాలు చాలా వరకు తగ్గాయని చెప్పొచ్చు. దీనికంతా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి ఫలితమే అని చెప్పాలి. వైఎస్సార్ పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వడం వలన అగ్నిప్రమాదాలు చాలా తగ్గాయి. భవిష్యత్తులో ఫైర్ డిపార్ట్మెంట్ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అడిషనల్ డీజీ మహమ్మద్ అసన్ రేజా, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృప వరం, కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు పాలవలస విక్రాంత్, పిరియా సాయిరాజ్ ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
అగ్నిమాపక శాఖ అనుమతుల్లేవు
సాక్షి, విజయవాడ : కరోనా రోగులకు చికిత్స అందించేందుకు స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేష్ ఆస్పత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్ కోవిడ్ కేంద్రానికి ఏ విధమైన అగ్నిమాపక అనుమతుల్లేవు. హోటల్‌గా వినియో గిస్తున్నట్లయితే 15 మీటర్ల ఎత్తుకు నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) అనుమతులు తీసుకోవాలి. అదే కోవిడ్ సెంటర్‌కు కనీసం 9 మీటర్ల ఎత్తుకు అనుమతులు పొందాలి. కానీ, ఈ రెండు అనుమతుల్లేవని సమాచారం. కోవిడ్ సెంటర్‌కు ఉండాల్సిన సౌకర్యాలు.. ► కోవిడ్ సెంటర్ కానీ ఆస్పత్రి కాని నిర్వహించాలంటే రోగులను అత్యవసర పరిస్థితుల్లో స్ట్రెచ్చర్‌పై తరలించేందుకు వీలుగా ర్యాంపు ఉండాలి. ► అగ్నిప్రమాదం జరిగితే మంటలను వెంటనే అదుపుచేసేందుకు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ► మూడు చదరపు మీటర్లు దూరం వరకు నీటిని చిమ్మే స్ప్రింక్లర్లు ఉండాలి. ► ప్రమాదం జరిగిన వెంటనే నీరు వచ్చేందుకు ఆటోమేటిక్ డిటెక్టరు, పై అంతస్తుల్లో ఉన్న రోగులను అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం ఉండాలి. ► ముఖ్యంగా భవనంపై వాటర్ ట్యాంకును నిర్మించాలి. ఇవేమీ ఈ హోటల్లో లేవు. ► ఆ హోటల్లో కరోనా కేర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ దృష్టికి కూడా తీసుకురాలేదు. చెక్కతో చేసిన అలంకరణతో.. కాగా, గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంది. దాని పక్కనే మెట్లు, లిఫ్ట్ ఉంది. రిసెప్షన్ నుంచే అన్ని గదులకు కేబుల్స్ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్‌వల్ల కేబుల్స్‌లో అంతర్గతంగా (మౌల్డింగ్‌లో ఇంటర్నల్ కంబర్షన్) మంటలు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక అధికారి ఒకరు చెప్పారు. మంటలు బయటకు రాగానే ఆక్సిజన్‌తో కలిసి మంటలు ఒక్కసారిగా ఎగసిపడి ఉంటాయంటున్నారు. రిసెప్షన్ నుంచి రెండో అంతస్తు వరకు (డూప్లెక్స్ తరహాలో) అలంకరణకు చెక్కను బాగా వినియోగించడంవల్లే మంటలు తీవ్రంగా వ్యాప్తిచెందడానికి కారణమైంది. -
తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఫైరింజన్ బోల్తా
సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్ వే పరిశీలనకు వెళ్లిన ఫైరింజన్ అదుపు తప్పి బోల్తా పడింది. అయితే అదే సమయంలో హైదరాబాద్ నుంచి రావాల్సిన ఇండిగో విమానం లాండింగ్‌కు విమానాశ్రయ అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ విమానాన్ని బెంగళూరుకు తరలించారు. మరోవైపు ఫైర్ ఇంజన్ బోల్తాపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కొద్దిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ముంబై షాపింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
-
షాపింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
ముంబై (మహారాష్ట్ర): షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగిన ఘటన ముంబైలోని పశ్చిమ బోరివాలిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో 14 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం ఏమైనా జరిగాయా అన్నదానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు. గత నెలలోనూ దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కువైట్ కార్యకలాపాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రాఫోర్డ్ మార్కెట్లోని పలు దుకాణాల్లో కూడా మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. Maharashtra: A level 4 fire broke out at a shopping centre in Borivali West of Mumbai earlier this morning; 14 fire engines and Police are at the spot. Fire fighting operations are still underway. pic.twitter.com/tRAXr8guSt — ANI (@ANI) July 11, 2020 -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి 12.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రెండు ఎకరాల వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 15వందల ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి ఒంటిగంటకు అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా చెప్పారు. ప్రమాదం సుమారు 1000 - 1200 ఇళ్లు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. అర్థరాత్రి సమయంలో ప్రమాదం సంభవించినప్పటికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. -
అనంతలో భారీ అగ్నిప్రమాదం
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ అనుబంధ స్క్రాప్ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదు వాహనాలు కాలిపోయి భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాన్ని అదుపు చేసే సమయంలో తీవ్ర టెన్షన్‌కు గురై కియా ఫైర్‌స్టేషన్ మేనేజర్ పరంధామ (45) మృతి చెందాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అక్కడి వాహన యజమానులు, కొందరు కూలీలు, గ్రామస్తులు రెండు వాహనాలను బయటకు తరలించగా మిగిలిన ఐదూ దగ్ధమయ్యాయి. సమీపంలోని రైతుల గడ్డివాములు కూడా కాలిపోయాయి. ప్రమాదంలో స్క్రాప్ కేంద్రంలో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లుంటుందని అంచనా. ట్రాన్స్‌కోకు రూ.3లక్షలు నష్టం జరిగిందని ఏఈ పరమేశ్వరరెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి శంకరనారాయణ పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. -
శ్రుతిమించిన కట్నం వేధింపులు
అనంతపురం సెంట్రల్: అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ అదనపు కట్నం కోసం శాడిస్ట్‌గా మారాడు. వేధింపులు భరించలేకపోయిన భార్య.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి వారి ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రాణాలతో కాపాడారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం చిన్నకుంట గ్రామానికి చెందిన అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్ వీరనారాయణకు 2014లో రాప్తాడుకు చెందిన యమున అనే యువతితో వివాహమైంది. కట్నకానుకల కింద రూ. 3 లక్షల నగదు, 16 తులాల బంగారు ఇవ్వడంతో పాటు ఘనంగా వివాహం కూడా జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే కొన్నేళ్లుగా భార్యను అదనపు కట్నం కోసం వీరనారాయణ వేధిస్తున్నాడు. ఎకరా భూమితో పాటు అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురం చేస్తానని రోజూ వేధిస్తుండడంతో భరించలేని ఆమె శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు కుమారులను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నా కోసం ఎవరూ వెతకవద్దు’ అని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పి పెట్టేసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇటుకలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విడపనకల్లు ఎస్ఐ గోపీని అప్రమత్తం చేశారు. స్పందించిన ఎస్ఐ గోపీ తన సిబ్బందిని రంగంలోకి దింపారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలోని చీకలగుర్కి ఎర్రితాతస్వామి దేవాలయం వద్ద బాధితురాలు, పిల్లలతో కలిసి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురక్షితంగా రాత్రికిరాత్రే ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చినా మారని కానిస్టేబుల్ అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ వీరనారాయణ వేధింపులపై భార్య గతంలోనే అప్పటి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్ ఇవ్వగా.. ఇక నుంచి భార్య, పిల్లలను బాగా చూసుకుంటానని రాతపూర్వకంగా తెలిపాడు. కానీ అతనిలో మార్పు మాత్రం రాలేదు. ఎకరాభూమి, అదనపు కట్నం తీసుకురావాలని, లేకుంటే ఇంట్లోకి రావద్దంటూ తెగేసి చెప్పాడు. భర్తతో పాటు, ఆడపడుచు ఈశ్వరమ్మ, అత్త, మామలు నారాయణమ్మ, నాగప్ప కూడా వేధింపులకు పాల్పడటంతో భరించలేక బలవన్మరణానికి పాల్పడబోయింది. వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
లోయలో పడిన ఫైరింజన్; సిబ్బందికి గాయాలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం మల్కాపురం మండలం యారాడ గ్రామం ఆదివారం విషాదం చోటుచేసుకుంది. యారాడ ఘట్‌రోడ్డు పై ఉన్న డాల్ఫిన్ కొండ దిగుతుండగా విశాఖ నావెల్ డక్ యార్డ్‌కు చెందిన ఫైర్ ఇంజన్ బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ఫైరింజన్ అదుపుతప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫైర్ ఇంజన్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమ్మిత్తం వారందరినీ విశాఖలోని ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించారు. నెవల్ డక్‌యార్డ్‌కు చెందిన కొందరు ఉద్యోగులు డాల్పిన్ కొండ మీద ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫైర్‌ఇంజన్‌తో నీళ్లు తీసుకెళుతుండగా బ్రేకులు ఫెయిలయ్యి ఈ ప్రమాదం సంబవించినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. కాగా, గతంలో కూడా అనకాపల్లికి చెందిన రెండు స్కూల్ బస్సులు ఇక్కడే ప్రమాదానికి గురయ్యాయి. ఆ ఘటనలో 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులు రోజు యారాడ నుంచి సిందియా వరకు 8 ట్రిప్పుల మేర తిరుగుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడ ఏర్పాటు చేయాలని అక్కడి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎమ్మెల్యే సారూ.. ఫైర్ స్టేషన్ ఏదీ?
సాక్షి, ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): నియోజకవర్గం కేంద్రంలో ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం) ఏర్పాటుకు దిక్కు లేకుండా పోయింది. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు పలాస, టెక్కలి, ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడిలోని అగ్నిమాపక కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడి నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నియోజకవర్గంలో కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో 140 పంచాయతీలు ఉన్నాయి. అధిక శాతం గిరిజన గ్రామాలే. వేసవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కొత్తూరులో ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి కొత్తూరు, హిరమండలం ప్రజలకు సేవలందుతున్నాయి. ఈ రెండు మండలాలు తప్పితే మిగిలిన మూడు మండలాలకు పక్కన ఉన్న ఆమదాలవలస, టెక్కలి, పలాస నియోజకవర్గాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి నుంచి వచ్చే ఫైర్ ఇంజిన్లే దిక్కవుతున్నాయి. అధికారంలోకి వస్తే పాతపట్నంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఐదేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒడిశా ఫైర్ ఇంజినే దిక్కు.. పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా పక్కనే ఉన్న పర్లాకిమిడి ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేస్తాం. అక్కడ నుంచి అగ్నిమాపక వాహనం వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పలు సందర్భాల్లో పాలకులు హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పాతపట్నంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – కొండాల అర్జునుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు, పాతపట్నం -
నిప్పంటుకుంటే అంతే..
సాక్షి, గన్నేరువరం (కరీంనగర్): వేసవికాలంలో ప్రారంభమైంది. ఈ ఏడాది నిప్పు కొలిమిలా ఎండలు ఉంటాయని ప్రభుత్వం, అధికారులు ముందస్తు ప్రకటనల్లో పేర్కొంటున్నారు. ఏమాత్రం ఏమారుపాటు ఉన్న అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. రానున్న రోజుల్లో ఏప్రిల్, మేనెలల్లో ఎండల తీవ్రత అధిక ఉంటుంది. ఈ సమయాల్లోనూ వరికోతలు ప్రారంభమై ధాన్యం, గడ్డివాములు తరలింపులు ఉంటాయి. అలాగే కొన్నిచోట్ల రహదారుల పక్కనే గడ్డవాములను రైతులు ఏర్పాటు చేసుకుంటారు. రైతులు, వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించడానికి వివిధ ప్రాంతాలకు వాహనాల్లో వాటిని తరలిస్తుంటారు. అంతేకాకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనుకొని ప్రమాదాలు చోటుచేసుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సందార్భాల్లో రైతులకు, ప్రజలకు, వ్యాపారులకు అపార నష్టం జరుగుతుంది. అందుబాటులో ఫైర్ ఇంజిన్లు లేకపోవడంతో పాటు అందుబాటులో నీటివసతి లేక అగ్నిప్రమాదాలను అరికట్టానికి బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు మండలంలోని గుండ్లపల్లి స్టేజీ రాజీవ్ రహదారి పక్కన గల ఎస్బీఐలో 2014లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని నివారించేందుకు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కాని అక్కడి నుంచి ఇక్కడికి ఫైర్ఇంజిన్ వచ్చేవరకూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంత సమయానికి ముందుగా వచ్చిఉంటే నష్టం తగ్గి ఉండేందని స్థానికులు పేర్కొంటున్నారు. ఖాసీంపేటలో ఒక రైతు ట్రాక్టర్లో గడ్డివాముతో వ్యవసాయ బావి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్ లూజ్‌లైన్ల కారణంగా వైర్లు ట్రాక్టర్‌పై ఉన్న గడ్డివాముకు తగిలి మంటలు అంటుకున్నాయి. దగ్గరలో ఫైర్‌స్టేషన్ లేకపోవడంతో కాపాడే పరిస్థితి లేకపోయింది. 2017 ఏప్రిల్‌లో జంగపల్లి గ్రామం గుట్టపై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ప్రారంభమైన సమయంలో ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించారు. కరీంనగర్లో అందుబాటు లేక రాజన్నా సిరిసిల్లా జిల్లా నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చింది. కాని అప్పటికే నష్టం జరిగిపోయింది. ఈ గుట్టపై జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో వేలమొక్కలు నాటారు. ఈ ప్రమాదంలో మొక్కలు మొత్తం మంటలకు బుడిదైపోయాయి. ఇలా మండలంలో ఏడాది పొడవునా అనేక అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడల్లా కరీంనగర్, సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాల కేంద్రాల్లోని అగ్ని మాపకకేంద్రాలకు ఫోన్‌చేస్తే ఫైర్ ఇంజిన్ రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి వచ్చే సరికి ప్రమాదం స్థాయి పెరిగి భారీనష్టం చోటు చేసుకుంటుంది. అయితే రాజీవ్ రహదారి పక్కనే ఉన్న గన్నేరువరం మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రజలు, పాలకులు డిమాండ్ చేస్తున్నా నేటికి అది నేరవేరడం లేదు. అగ్ని మాపక కేంద్రాన్ని మంజూరు చేయాలి మండలంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇటు కరీంనగర్ అటు సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి రావాల్సి ఉంటుంది. ఏటుచూసిన మండలకేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గన్నేరువరం మండలం మెట్టప్రాంతం కావడంతో ఎక్కువ స్థాయిలో పశుగ్రాసాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటా యి. ఈ ప్రమాదాలు జరిగాయంటే క్షణాల్లో బుడిదవుతున్నాయి. ఇళ్లల్లో పత్తి సైతం మం టల్లో కాలిపోలినా ఘటనలు అనేకం ఉన్నాయి. మండలకేంద్రంలో ఇటీవల ఒక పూరిగుడిసెకు మంటలంటుకుని దగ్ధమైంది. ఇందు లో రూ.30వేల నగదుతో పాటు దుస్తువులు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. గతేడాది మండలకేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు సంభవించి 5 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. 40 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ ఇంజిన్లు రావడం అలస్యమవుతుండడంతో వచ్చేలోపు పెద్ద ఎత్తున నష్టం చవిచూడాల్సి వ స్తుందని ప్రజలు వాపోతున్నారు. మండలంలోని పత్తి రైతులు తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామ శివారులోని పత్తి జిన్నింగ్ మిల్లుకు పత్తిని రైతులు తీసుకెళ్తుంటారు. అనుకొని పరిస్థితుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ చేరుకోవడంలో అలస్యమైతే భారీనష్టాలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. మండలంలోని రాజీవ్ రహదారి సమీప గ్రామం గుండ్లపల్లి స్టేజీ కేంద్రంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఇటు బెజ్జంకి, ఇల్లంతకుంట అటు కోహెడ మండలాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మండలకేంద్రానికి అగ్ని మాపక కేం ద్రాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు. -
భువనగిరిలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, భువనగిరి అర్బన్ : కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులోని పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక పారిశ్రామిక వాడలోని మహాసాయి ఫైర్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెయింటింగ్, నెయిల్ పాలీష్, వార్నిష్‌లలో ఉపయోగించే లిక్విడ్‌ను తయారు చేస్తారు. రోజు మాదిరిగా ఆదివారం రాత్రి లిక్విడ్‌ను తయారు చేసే ప్రక్రియను కొనసాగించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక 2.15 గంటల సమయంలో కంపెనీలో లిక్విడ్ కోసం ఉపయోగించే రామెటిరియల్లో ఇథైన్, టోలిన్, మిథైల్ పంపింగ్ చేస్తున్న క్రమంలో మోటారు యంత్రంలో ఏర్పడిన విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు లేచి మంటలుగా వ్యాపించాయి. సమీపంలో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటన సమాచారం అందుకున్న భువనగిరి ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రామన్నపేట నుంచి అగ్ని మాపక యంత్రాలను రప్పించారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో 22 మంది సిబ్బంది కలిసి ఉదయం 7.30 గంటల వరకు మంటలను ఆర్పే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రూ.9 నుంచి రూ.10 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలు పారిశ్రామిక వాడలో పక్కపక్కనే పరిశ్రమలు ఉండడంతో కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాద ప్రభావం సమీపంలోని పరిశ్రమలపై పడింది. కంపెనీలో కెమికల్, ప్లాస్టిక్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఈ క్రమంలో మంటల పక్కనే ఉన్న మ్యాట్రిసెస్ కంపెనీలోకి వ్యాపించాయి. దీంతో మ్యాట్రిస్ కంపెనీ రేకులు, మ్యాట్రిసెస్‌లో వాడే కాయర్, ఫోం పూర్తిగా దగ్ధమైంది. దీంతో కొన్ని రూ.లక్షల వరకు ఆ కంపెనీలో నష్టం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని ఉమ్మడి జిల్లా అ గ్నిమాపక అధికారి వై.నారాయణ, భువనగిరి అర్డీ ఓ వెంకటేశ్వర్లు, ఏఓ మందడి ఉపేందర్‌రెడ్డి, భు వనగిరి అగ్నిమాపక కేంద్రం అధికారి అశోక్, చౌ టుప్పల్ ఫైర్‌స్టేషన్ అధికారి శ్రీశైలం, యాదగిరి గుట్ట సీఐ అంజనేయులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
ఆపద వాహనానికి నీటి కష్టాలు
సాక్షి, వేములవాడరూరల్: ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే గుర్తుకు వచ్చేది అగ్నిమాపక వాహనం. అదే వాహనానికి నీరు లేకపోతే ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పనక్కర్లేదు. వేములవాడ మండల కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నీరు లేక అక్కడ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది అక్షరాలా సత్యం. గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ఈ అగ్నిమాపక కేంద్రంలో మంచినీటి కొరకు బోరు వేయగా ప్రస్తుతం ఆ బోరు నీరు లేక అడుగంటుకుపోయింది. ఇక వాహనంలో నీరు నింపడానికి చెరువులు, బావుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి అక్కడ సిబ్బందికి ఏర్పడుతోంది. అసలే వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రతీరోజు ఎక్కడో ఒక్కచోట అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఈ వాహనంలో 24 గంటలు నీరు ఉండాల్సి ఉండగా నీటి సమస్య ఉండడం వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి చెరువు లేక మల్లారం వెళ్లే బావి వద్ద నీరు తప్పా వారికి ఎలాంటి నీటి సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం కల్పించాలంటూ మున్సిపాలిటీ అధికారులను కోరినప్పటికీ వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సమయంలో ఇలాంటి కష్టం ఉంటే మరికొన్ని రోజుల్లో ఎండలు తీవ్రత పెరిగిన తరువాత ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఇప్పటి నుండి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకొని ఆకాశగంగ పైప్ లైన్ సౌకర్యం అగ్నిమాపక కేంద్రానికి కల్పించాలని వారు కోరుతున్నారు. 6 మండలాలకు ఇదే ఆధారం వేములవాడ ఫైర్ స్టేషన్ వాహనం 6 మండలాలకు ఆధారంగా ఉన్నది. వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా వేములవాడ నుండే వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాహనంలో నీరు అందుబాటులో ఉండాలి. రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో సంఘటన జరిగినా వేములవాడ నుండి వెళ్లాల్సిందే. ఇక్కడ నీరు అందుబాటులో 24 గంటలు ఉండాలి కానీ నీరు లేకపోవడంతో వారు ఉన్న 10 మంది మంది సిబ్బంది కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫైర్‌స్టేషన్ ఇన్చార్జి సతీష్‌కుమార్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో అదే కార్యాలయంలో పని చేస్తున్న పవన్‌కుమార్ నీటి సమస్య మాత్రం తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒక్క ఫైర్ ఇంజిన్.. సరిపోతుందా!
సాక్షి, క్రోసూరు: అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు సమయానికి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడే అగ్నిమాపక యంత్రం, సిబ్బంది అందుబాటులో ఉంటే ప్రజలకు ఎంతో భరోసా ఉంటుంది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు మండలాలకు కలిపి ఒకే ఫైర్ ఇంజిన్ ఉండటంతో దూరాభారం కారణంగా, రోడ్లు బాగోలేకపోవటం, అందుబాటులోని నీటి సౌకర్యాలతో సమయానికి దూరప్రాంతాలకు చేరుకోలేక, అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఫలితంగా అగ్రిప్రమాద బాధితులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. క్రోసూరు మండల కేంద్రలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2004లో అగ్నిమాపక స్టేషన్ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి పరిధిలోని సహాయ అగ్నిమాపక అధికారి రామకృష్ణ నేతృత్వంలో ప్రస్తుతం స్టేషన్లో ఒకే ఒక ఇంజిన్‌తో ఇద్దరు డ్రైవర్లు, 13 మంది ఫైర్ మెన్లు పనిచేస్తున్నారు. అగ్నిమాపక శకటం ద్వారా క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండలో అన్ని గ్రామాలు, అమరావతి, పెదకూరపాడు మండలంలో సగం గ్రామాలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ఈ ఐదు మండలాల్లో కలిపి 110 గ్రామాలున్నాయి. పెదకూరపాడులో సగం అంటే కనీసం 100 గ్రామాలకు ఈ వాహనాన్నే వినియోగించాలి. అయితే ప్రమాదాలు సంభవించినపుడు సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది 100 ప్రమాదాలకు హాజరైతే ఈ ఏడాది ఇంకా ప్రమాదాలు సంభవించలేదు. మండలానికి ఒక ఫైరఇంజిన్ ఏది ఏమైనప్పటికీ భానుడు తీవ్రతకు స్లాబ్ గృహాలే మండిపోతున్నందున పూరిళ్లు, పూరి పాకలు, చిన్నచిన్న షెడ్డులు, నిత్యం పొయ్యి మంటలతో వ్యాపారాలు నిర్వహించే వ్యాపార సంస్థలు, వంటగ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మండలానికి ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం రెండు మండలాలకైనా.. పేదల ఆస్తిపాస్తులు, గడ్డివాములకు వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించి కట్టుబట్టలతో బయట పడిన కుటుంబాలకు తూతూ మంత్రంగా రేషన్ ఇచ్చి, ఐదు వేల నగదు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇది చాలా దారుణం. ప్రమాదాల నుంచి కాపాడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉండి కూడా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవరించడం శోచనీయం. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు సంభవించినపుడు, తక్షణమే ఆదుకునేందుకు కనీసం రెండు మండలాలకు ఒక అగ్నిమాపక శకటం అయినా ఏర్పాటు చేయాలి. కాల్వపల్లి ఏసురెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి, క్రోసూరు -
భారీ అగ్ని ప్రమాదం..!
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కన్నింగ్ వీధిలో ఉన్న బంగారీ మార్కెట్లో గల ఓ భవనంలో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. భారీగా అగ్నికిలల ఎగసిపడుతుండంతో 30కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపినట్లు నగర మేయర్ సోవన్ ఛటర్జీ తెలిపారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మేయర్ ప్రకటించారు. -
సెకండ్ షోకు వెళ్లి.. ప్రాణ భయంతో!
కోల్‌కతా : వీకెండ్ అని సరదాగా సెకండ్ షో మూవీకి వెళ్లిన ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. థియేటర్‌ను మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఎట్టకేలకు సురక్షితంగా బయట పడటంతో కథ సుఖాంతమైంది. నటుడు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అరిజిత్ దత్తాకు దక్షిణ కోల్‌కతాలో ప్రియా థియేటర్ ఉంది. అయితే ఆదివారం రాత్రి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సెకండ్ షో మూవీ చూస్తున్నారు. ఇంతలో థియేటర్లో పొగలు రావడాన్ని గమనించిన ప్రేక్షకులు ప్రాణభయంతో ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రాజెక్టర్ రూమ్ టెక్నీషియన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 5 ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మరోవైపు మెట్లమార్గం ద్వారా ప్రేక్షకులను సురక్షితంగా బయటకు రప్పిస్తూనే.. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. దీంతో థియేటర్ యాజమాన్యంతో పాటు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రాత్రి 10:15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించినా.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా తగిన సమయంలో స్పందించి చర్యలు తీసుకున్న అగ్నిమాపక సిబ్బంది కోల్‌కతా మేయర్ సోవన్ చటర్జీ ప్రశంసించారు. కాగా, థియేటర్ యజమాని అరిజిత్ దత్తా కుటుంబసభ్యులు సైతం ఆ సమయంలో థియేటర్లో ఉన్నారని మేనేజర్ తెలిపాడు. 1959 నుంచి థియేటర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రతలు తీసుకుంటున్నట్లు చెప్పాడు. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు పై అంతస్తులో ఉన్న సినిమా హాల్‌కు వ్యాపించగానే పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు. -
లోయలో పడిన ఆయిల్ ట్యాంకర్
సాక్షి, అరకులోయ : అరకులోయ–సుంకరమెట్ట రోడ్డులోని కొత్తభల్లుగుడ హాస్టల్ సమీపంలోని మలుపువద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. గురువారం రాత్రి 9గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో విద్యుత్ వైర్లు కలిసిపోయి, సమీపంలోని ట్రాన్స్ఫారం వద్ద విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా జరిగి ఉంటే ఈ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి పెద్దప్రమాదం జరిగి ఉండేది. విశాఖపట్నం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఎనిమిది వేల లీటర్ల డీజిల్, నాలుగు వేల లీటర్ల పెట్రోల్‌తో అరకులోయలోని నాయక్ ఆయిల్ బంక్‌కు ట్యాంకర్ బయలుదేరింది. గమ్యస్థానానికి 10 నిమిషాల్లో ట్యాంకర్ చేరుకుంటుందనగా కొత్తభల్లుగుడ హాస్టల్ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయే సమయంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పిన ట్యాంకర్ మలుపులోని రక్షణగోడ, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి లోయలోకి బోల్తా కొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ హరి,క్లీనర్ చిన్నలకు గాయాలయ్యాయి. వీరిద్దర్నీ విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. ఐవోసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు రూ.9 లక్షల ఆయిల్ నేలపాలు ఈ ప్రమాదం కారణంగా రూ.9 లక్షల విలువైన డీజిల్, పెట్రోల్ నేలపాలయ్యాయి. ట్యాంకర్ బోల్తా పడిందన్న సమాచారం తెలుసుకున్న కొత్త భల్లుగుడ,సమీపంలోని గ్రామాల గిరిజనులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వృథాగా పోతున్న పెట్రోల్,డీజిల్‌ను బిందెలు,డబ్బాలతో పట్టుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ కావడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని ట్యాంకర్వద్దకు వెళ్లవద్దని పోలీసులు గిరిజనులను హెచ్చరించారు. ట్యాంకర్ వద్దకు వెళ్లకుండా నిలువరించారు. అందిన సమాచారం మేరకు పాడేరు అగ్నిమాపక వాహనం రాత్రి 11గంటల సమయంలో సంఘటన స్థలానికి వచ్చింది. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు తగిన చర్యలు తీసుకున్నారు. విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో పాటు, వైర్లు తెగిపడడంతో ఈ ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబై వర్లీలోని భిమాండి టవర్స్‌లోని 32వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్చలు ప్రారంభించారు. బిల్డింగ్‌లో ఉన్న 95 మందిని కాపాడామని, మంటలనార్పడానికి 8 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయని తెలిపారు అధికారులు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వారం వ్యవధిలో ముంబైలో మూడో అతిపెద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. దీపిక పదుకోన్ ఇళ్లు ఇక్కడే... ఇదిలా ఉండగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఇళ్లు కూడా ఇదే భవనంలో ఉందని సమాచారం. దీపికా ఈ భవనంలోని 26వ అంతస్తులో ఉంటున్నట్లు సమాచారం.అయితే ప్రమాదం జరిగింది దీపిక ఉన్న అపార్ట్మెంట్లో కాదని, ఆ సమయంలో దీపిక కూడా అక్కడ లేదని ఆమె సన్నిహితులు మీడియాకు తెలిపారు. 2010లో దీపిక ఈ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ను ఆమె తండ్రి ప్రకాశ్ పదుకోన్ పేరున కొన్నట్లు సమాచారం. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
-
9/11 ఎఫెక్ట్.. ఆ హీరో కన్నుమూత
మాన్‌హట్టన్ : 2001 సెప్టెంబర్ 11వ తేదీ.. అమెరికా దేశ చరిత్రలో చీకటిమయమైన దినం ప్రపంచ దేశాలకు కూడా గుర్తుండిపోయింది. బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ కాయిదా ఉగ్రవాదులు అమెరికన్ విమానాలను హైజాక్ చేసి, వాటితో ట్విన్ టవర్స్, రక్షణ కార్యాలయం పెంటగాన్‌లపై దాడులకు పాల్పడ్డారు. అయితే సుమారు 3వేల మందిని బలీతీసుకున్న ఈ మారణ హోమ ప్రభావం ఇప్పటికీ అమెరికాను నీడలా వెంటాడుతూనే ఉంది. 9/11 దాడి.. అరుదైన ఫొటోలు దాడుల తర్వాత పేలుళ్ల పదార్థాల నుంచి వెలువడిన విషవాయువుల ప్రభావంతో దీర్ఘకాలిక వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాటిల్లో చాలా మట్టుకు అంతుచిక్కని వ్యాధులే ఉండటంతో శాస్త్రవేత్తలు సైతం పరిష్కారాలు కనిపెట్టలేక తలలు పట్టుకుంటున్నారు. అదిగో అలాంటి బాధితుల్లో ఒకరైన థామస్ ఫెలాన్ (45) ఇప్పుడు కన్నుమూశారు. ఫెలాన్ ఆషామాషీ వ్యక్తి కాదు. ఆ ఘోర కలి నుంచి వందలాది మందిని రక్షించిన ఓ అధికారి ఆయన. థామస్ ఫేలాన్ న్యూయార్క్ ఫెర్రీ కెప్టెన్. దాడి జరిగిన రోజున విధుల్లో ఉన్న ఆయన అప్రమత్తమై.. మాన్హట్టాన్ దిగువ ప్రాంతం నుంచి వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. ఆయన సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ఆ తర్వాత ఫెర్రీ విభాగం నుంచి ఫైర్ అధికారికిగా ఆయన బదిలీ అయ్యారు. రెండేళ్ల క్రితం ఆయనకు కాన్సర్ సోకినట్లు వైద్యులు వెల్లడించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందారు. ఆ సమయంలో వెలువడిన విషవాయువులతో ఆయనకు కాన్సర్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత వెలువడిన దుమ్ము, ధూళి, ఇతర వాయువుల ప్రభావంతో ప్రత్యక్ష సాక్ష్యులు, సహాయక సిబ్బంది, ఘటన అనంతరం శకలాలను శుభ్రం చేసిన సిబ్బంది.. ఇలా సుమారు 50 వేల మంది ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. In our city’s darkest hour, @FDNY firefighter Thomas Phelan’s heroism saved hundreds of lives. We will never forget his service and his sacrifice. https://t.co/dRn4xVFDza — Bill de Blasio (@NYCMayor) 18 March 2018 -
చల్లార్చేదెలా?
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఉట్నూర్ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా ఆస్తులు బుగ్గిపాలు కావాల్సిందే. అలాగని అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యమో.. పట్టింపులేని ధోరణి అనుకుంటే పొరపాటే. మంటలు ఆర్పడానికి అవసరమైన నీటి సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్య. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం వస్తే చాలు ఫైరింజన్ తీసుకుని నీటి కోసం చెరువు బాట పట్టాల్సిందే. నీటి సమస్య ఒక్కటే కాదు.. అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం లేక, సిబ్బందికి మౌలిక వసతులు కరువై ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రెండు సార్లు నిధులు విడుదల చేసినా స్థల సమస్య కారణంగా వెనక్కి వెళ్లాయి. చెరువే దిక్కు.. అగ్నిమాపక కేంద్రం ఉన్న ప్రాంతంలో ఎలాంటి నీటి వసతులు లేవు. దీంతో ఎక్కడైన ప్రమాదం జరిగిందనే సమాచారం రాగానే నీటి కోసం వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మంటలు ఆర్పడానికి వెళ్లే క్రమంలో ఫైరింజన్ తిరుగు ప్రయాణంలో చెరువు కనిపిస్తే నీటిని నింపాల్సిన దుస్థితి నెలకుంటోంది. 4500 లీటర్ల సామర్థ్యం గల ఫైరింజన్లో నీటిని నింపడానికి సిబ్బంది పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలో సిబ్బంది గాయాల పాలైన సంఘటనలూ ఉన్నాయి. చెరువు నీరు ఫైరింజన్లో నింపే క్రమంలో బురద రాకుండా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన రహదారి వెంట చేతిపంపు నీటితో అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలల ఉపయోగం కోసం కూడా నీటి సౌకర్యం లేదు. అగ్నిమాపక సిబ్బంది తిప్పలు సొంత భవనం లేక తిప్పలు.. సమస్యాత్మక మండలాలైన ఉట్నూర్, నార్నూర్, జైనూ ర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు) మండలాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 2004లో ఏజెన్సీ కేంద్రంగా కుమురం భీం ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయం అధీనంలోని క్వార్టర్స్‌కు మార్చింది. నాటి నుంచి ఐదు మండలాల్లో ఎక్కడ ఏ అగ్నిప్రమా దం జరిగినా ఇక్కడి నుంచి ఫైరింజన్ వెళ్లాల్సిందే. తర్వాత కాలంలో సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలం కోర్టు కేసులో ఉండడంతో అగ్నిమాపక కేంద్రం నిర్మా ణం మరుగునపడింది. క్వార్టర్ శిథిలావస్థకు చేరిందని, అది వెంటనే ఖాళీ చేయాలని ఐదేళ్లుగా ఎంపీడీవో కార్యాలయం నోటీసులు జారీ చేస్తూనే ఉంది. మరోమార్గం లేక కార్యాలయం అందులోనే కొనసాగిస్తున్నారు. ఫైర్ సామగ్రి భద్రపర్చడం, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై కప్పు సరిగా లేక కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో వర్షం వస్తే ఉరువకుండా ఉండడానికి కవర్లు కప్పారు. నిధులు మంజూరు అవుతున్నా.. అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ.35లక్షలు విడుదల చేసింది. గతంలో ఎంపీడీవో కార్యాలయ మైదానంలో కేటాయించిన స్థలం కోర్టు కేసులో ఉండడం, ఇతర చోట్ల స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు విఫలం కావడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. అదీగాక 2015–16 ఆర్థిక సంవత్సరంలో మరోసారి ప్రభుత్వం రూ.70 లక్షలు అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి మంజూరు చేసింది. స్థల సేకరణలో భాగంగా ఉట్నూర్ ఆర్డీవో మండల కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో ఎకరం స్థలం గుర్తించారు. ఆ స్థలాన్ని అగ్నిమాపక కేంద్రానికి కేటాయించాలని ఫిబ్రవరి 2015లో కలెక్టర్‌కు అధికారులు నివేదించారు. ఐబీ ప్రాంతంలో ఉన్న స్థలం ఆర్అండ్బీ శాఖకు చెందినదని, ఆ స్థల కేటాయింపు కలెక్టర్ పరిధిలో ఉండదని తేలడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మంజూరైన రూ.70లక్షలు మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి స్థలం ఎక్కడన్నది తేలకపోవడంతో బోర్‌వెల్స్ వేయడం, ట్యాంకుల నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరైనా ఖర్చు చేయలేని స్థితిలో కేంద్రం అధికారులు ఉన్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిమాపక అధికారుల తిప్పలు నిత్యకృత్యం కానున్నాయి. స్థలం లేక నిధులు వెనక్కి.. ఇప్పటికి అగ్నిమాపక కార్యాలయం నిర్మాణానికి రెండుసార్లు నిధులు మంజురైనా స్థలం లేక వెనక్కి వెళ్తున్నాయి. ఫైరింజన్‌కు కావాల్సిన నీటి కోసం ప్రతి సారి ఎక్కడ నీటి వనరులు ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. నూతన కేంద్రం నిర్మాణానికి ఇటీవల ఐబీ ప్రాంతంలో ఆర్డీవోతో కలిసి ఎకరం స్థలం గుర్తించినా ఫలితం లేకుండాపోయింది. ఎక్కడైనా ఎకరం స్థలం లభిస్తే నూతన భవన నిర్మాణానికి అవకాశం ఉంది. నీటి సమస్య పరిష్కారానికి రూ.10 లక్షలు మంజూరైనా సొంత భవనం లేక ఖర్చు చేయలేకపోతున్నాం. – టి.పరమేశ్వర్, అగ్నిమాపక అధికారి ఉట్నూర్ -
అగ్ని ఆర్పేదెలా..!
భద్రాచలం : వేసవి రానే వచ్చింది. గిరిజన గూడేలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఏటా అగ్ని ప్రమాదాల తీవ్రత అధికంగానే ఉంటుంది. దీనికి తోడు పారిశ్రామిక జిల్లా కావటంతో అగ్నిమాపక శాఖకు వేసవికాలమంతా చేతి నిండా పని ఉంటుంది. ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన తరుణమిది. కానీ జిల్లాలోని అగ్నిమాపక శాఖకు సుస్తి చేసింది. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉండగా, దాదాపు అన్ని చోట్లా సమస్యలు తాండవిస్తున్నాయి. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో స్టేషన్ నిర్వహణ అధికారి పోస్టు ఖాళీగాఉంది. జిల్లాలోని ఏ స్టేషన్లోనూ పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో ఉన్న వారిపైనే పనిభారం పడుతోంది. వాహనాలు సైతం మరమ్మతులకు గురి కావటంతో ప్రమాద ప్రదేశానికి సకాలంలో చేరుకోలేని పరిస్థితి నెలకొంది. పరాయి పంచన పడిగాపులు... అగ్నిమాపక కేంద్రాలకు కొన్ని చోట్ల సరైన వసతి లేదు. భద్రాచలంలో భవన సౌకర్యం లేక బాలికల సదనంలో తాత్కాలికంగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరైనా, పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త భవన నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డును కూల్చివేయటంతో అగ్నిమాపక శకటంతో పాటు, సిబ్బంది సమీపంలోని బాలికల సదనంలోకి వెళ్లారు. అక్కడ కనీస సౌకర్యాలు లేక సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మణుగూరులో మళ్లీ అగ్రిమెంట్ చేస్తేనే... మణుగూరులో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నప్పటకీ, ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేదు. అద్దె ప్రాతిపదికన స్టేషన్‌కు తీసుకున్న వాహనం అగ్రిమెంట్ మార్చితో పూర్తి కావస్తోంది. మళ్లీ గడువు పెంచటమో, లేకుంటే మరో వాహనం సమకూర్చటమో చేయాలి. కానీ దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో మార్చి తర్వాత ఏం చేయాలోనని అక్కడి అధికారులు ఆయోమయంలో పడ్డారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇప్పుడున్న వాహనం కూడా తరచూ మరమ్మతులకు గురవుతోంది. రిపేర్ కోసం ఎలాంటి నిధులు రావడం లేదు. దీంతో ఎక్కడైనా ప్రమాదం జరిగితే సకాలంలో గమ్యం చేరుకోవటం లేదు. మార్గమధ్యలోనే వాహనం మొరాయిస్తుండటంతో సకాలంలో మంటలార్పేందుకు రావటం లేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. సిబ్బంది లేక ఉన్నవారిపైనే ఒత్తిడి... ఒక్కో ఫైర్ స్టేషన్‌కు అగ్నిమాపక అధికారితో పాటు 15 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఒక్క ఇల్లెందులో మినహా మరెక్కడా పూర్తి స్థాయిలో లేరు. భద్రాచలం అగ్నిమాపక శాఖ అధికారిగా పనిచేసిన సరేష్‌కుమార్ పదోన్నతిపై బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ పోస్టు ఖాళీగానే ఉంది. కొత్తగూడెం స్టేషన్ అధికారికే భద్రాచలం స్టేషన్ నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు. భద్రాచలంలో లీడింగ్ ఫైర్‌మెన్ పోస్టులు ఇద్దరికి గాను ఒకరిని మణుగూరుకు డిప్యూటేషన్‌పై పంపించారు. డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు ఉండాలి. కానీ ఇందులో ఒకరిని అశ్వారావుపేటకు పంపించారు. దీంతో ముగ్గురు హోంగార్డులను, ఆర్టీసీ డ్రైవర్ ఒకరిని ఇక్కడికి డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. అశ్వారావుపేటలో లీడింగ్ ఫైర్‌మెన్ 1, ఫైర్‌మెన్ 5, డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. మణుగూరు స్టేషన్లో వివిధ చోట్ల నుంచి డిప్యూటేషనలపై వచ్చిన సిబ్బందితోనే కాలం వెళ్లదీస్తున్నారు. వాస్తవంగా ఒక్కో స్టేషన్లో రోజుకు రెండు షిప్టులు, ఒక్కో షిఫ్టుకు ఎనిమిది మంది చొప్పున పనిచేయాలి. కానీ ఎక్కడా ఇలా జరగటం లేదని, ఖాళీల వల్ల ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తోంది సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల కోసం పరుగులు తీయాల్సిందే... అగ్నిప్రమాదాల సమయంలో సత్వర సహాయక చర్యలు చేపట్టేందుకు నీరే ప్రధానం. స్టేషన్లో ఎప్పుడూ నీటి ట్యాంకర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు స్టేషన్లకు నీటి సౌకర్యం లేదు. భద్రాచలంలో గోదావరి నీరు పుష్కలంగా వస్తున్నందున వాటితోనే ట్యాంకర్‌ను నింపుతున్నారు. మణుగూరులో మోటార్ లేదు. అశ్వారావుపేటలో ఉన్న మోటార్ మరమ్మతుకు గురైంది. దీంతో ఈ రెండు చోట్ల ట్యాంకర్‌ను నీటితో నింపేందుకు వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల వద్ద నింపుకుంటున్నారు. మోటార్ మరమ్మతులకు గురై ఏడు నెలలు కావస్తున్నా, నిధుల లేమితో వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సమస్యలపై సత్వరమే దృష్టి సారించి, అత్యవసర విభాగమైన అగ్నిమాపక శాఖను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. భద్రాచలంలో భవన నిర్మాణ పనుల ఆలస్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రామకృష్ణ, అగ్నిమాపక శాఖ ఇన్చార్జి అధికారి, భద్రాచలం -
ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చర్ల మండలం తిప్పాపురం సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో శనివారం సుమారు గంటసేపు ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ నెల 5వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోలు తారసపడడం తో ఎదురు కాల్పులు మొదలైనట్లు తెలుస్తుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడగా, ఓ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. అయితే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా మావోయిస్టుల నిర్మూలన పేరుతో పాలకులు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా దండకారణ్యం, తెలంగాణలో ఈనెల 5న బంద్ పాటించాలని సీపీఐ(మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్పెషల్ జోనల్ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు వికల్స్, జగన్ పేరిట బుధవారం లేఖ విడుదలైన విషయం తెలిసిందే. -
అంబర్‌పేటలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : అంబర్ పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబర్‌పేటలోని జిందా తిలిస్మత్ రోడ్డులో ఉన్న ఓ పేపర్ మిల్లులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైనట్లు సమాచారం. ఆ వివరాలిలా.. స్థానిక అంబర్‌పేటలోని పేపర్ మిల్లులో తొలుత అకస్మాత్తుగా మొదలైన మంటలు కొంతసమయానికే పూర్తి మిల్లుకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పేపర్ మిల్లు మంటల్లో పూర్తిగా కాలి దగ్దమైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫైర్ ఉన్న ఫైటర్
ఈర్ష్యను మించిన నిప్పు ఉండదు. అందులోనూ మగ అహంకారం నివురుగప్పిన నిప్పు. ఏ మహిళ అయినా ఇలాంటి నిప్పులో దహించుకుపోవాల్సిందే. నిజమే... హర్షిణి కన్హేకర్ ఫస్ట్ ఉమన్ ఫైర్ ఫైటర్. తను కాకపోతే... మరో మహిళ ఫస్ట్ ఫైర్ ఫైటర్ అయ్యే అవకాశం ఉంది. మరి... తన గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం? భవనాలకు అంటుకున్న నిప్పుని ఆర్పడం మహిళలు చేయగలరు.హర్షిణి వ్యవస్థకు పట్టిన జెండర్ నిప్పును ఆర్పింది. మహిళలు ‘దీనిని చేయలేరు’ అని అంటే... దానినే చేసి చూపించింది హర్షిణి. ఒక రగులుతున్న సమస్యను ఆర్పింది. 2005.. దీపావళి రోజు.. న్యూఢిల్లీలోని శాస్త్రినగర్.. బాంబులు, రాకెట్లు, కాకరపువ్వొత్తులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, చిచ్చుబుడ్ల వెలుగులు, జిలుగులు, మోతలతో మారుమోగుతోంది ఆ ప్రాంతం. అందరూ ఆనందంలో మునిగి ఉన్నారు. ఏ టపాకాయ ఎటు వెళుతుందో.. ఏమవుతుందో పట్టించుకునే స్థితిలో లేరెవరు! కాలుస్తున్నామా.. ఆస్వాదిస్తున్నామా అంతే! ఈ సందడిలోనే ఒక రాకెట్ వెళ్లి అక్కడే ఉన్న షూ ఫ్యాక్టరీలోని షూ మెటీరియల్ మీద పడింది. క్షణాల్లో ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. ఆ వేడికి బిల్డింగ్ పగుళ్లు రావడం ప్రారంభించింది. ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. వెంటనే ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. దాదాపు ఆరుగంటలు శ్రమించి మంటలను ఆర్పేశారు. చుట్టుపక్కల వాళ్లంతా ఆ ఫైర్ దళాన్ని, వాళ్లు చూపిస చాకచక్యం, ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. క్యాప్ తీసి చేతిలో పట్టుకుంటూ వస్తున్న ఫైర్దళపతిని అమ్మాయిలైతే అడ్మయిరింగ్‌గా చూడ్డం మొదలుపెట్టారు. కొందరైతే షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఉవ్విళ్లూరసాగారు. పెద్దవాళ్లంతా సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. ఆ పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్కు రీజన్.. అడ్వంచరస్ దళపతి.. స్త్రీ కావడమే. పేరు హర్షిణి కన్హేకర్. మన దేశపు తొలి మహిళా ఫైర్ ఫైటర్! 2002 వరకు ఫైర్ ఫైటర్ ఉద్యోగాలు కేవలం పురుషులకే పరిమితం. ఆ యేటి నుంచే స్త్రీలకు ప్రవేశం దొరికింది. అది ప్రభుత్వం సడలించిన నియమం కాదు! హర్షిణి సృష్టించిన చరిత్ర. సాధారణంగా ఏ రంగంలోనైనా లేదా ఉద్యోగాల్లోనైనా ఆడవాళ్లకు అవకాశం.. ప్రభుత్వం లేదా వాటిని నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాల నియమాలననుసరించి ఉంటుంది. కాని నేషనల్ ఫైర్ సర్వీస్ కమిషన్‌లో మాత్రం దాన్ని బ్రేక్ చేసింది హర్షిణీయే. రోమాంచితంగా ఉందికదా! అందుకే ఆమె బయోగ్రఫీ! దిగులుపడ్డ ఫేజ్ హర్షిణి సొంతూరు మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పుట్టడమే కాదు.. పెరిగింది, చదివింది కూడా అక్కడే. మెరిట్ స్టుడెంట్ ఏమీ కాదు. యావరేజ్. కాని ఆటలు, పాటలు వంటి ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఫస్ట్. ఏ పోటీల్లో పాల్గొన్నా మొదటి బహుమతి ఆమెకే. సాహసక్రీడలంటే ఎగిరి గంతేసేది. ఈ నైజంతోనే హర్షిణి స్కూల్లో పాపులర్ అయింది. పిల్లలకు, టీచర్లకు ఫేవరెట్‌గా నిలిచింది. ఇంత ఉత్సాహం ఇంటర్లో ఆల్ గర్ల్స్ కాలేజ్.. లేడీ అమృతాబాయి కాలేజ్‌లో చేరగానే చప్పున చల్లారిపోయింది. కారణం.. ఆల్ గర్ల్స్ అన్నది ఆమెకు నచ్చకపోవడమే. ఆటలు, పాటలు అన్నీ బంద్. చదువులోనూ పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. బోర్‌గా అనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండే తను.. ఎవరితో మాట్లాడకుండా తనలో తానే ఉండేది. ‘‘నా జీవితంలో నేను దిగులుపడ్డ ఫేజ్ ఏదైనా ఉందంటే అది నా ఇంటర్మీడియేట్ రెండేళ్ల టైమే’’ అంటుంది హర్షిణి. అయితే డిగ్రీకి కూడా అదే కాలేజ్‌లో దరఖాస్తు చేసుకొమ్మని తల్లిదండ్రులు చెప్పడంతో ఇక ఆల్ గర్ల్స్ కాలేజే దిక్కు.. ఉత్సాహంగా ఉండక తప్పదు’అనుకుంది. మళ్లీ ఆటలు, పాటలు, పోటీలు.. మొదలుపెట్టింది. ఉల్లాసానికి చిరునామా అయింది. ఎన్సీసీలో కూడా చేరింది. లక్ష్యాన్ని ఛేదించే శక్తి.. యూనిఫామ్ ఉన్న సర్వీసెస్ అంటే ఇష్టం ఏర్పడింది కూడా అప్పుడే. ఒకరకంగా చెప్పాలంటే ఆమెకు ఒక లక్ష్యాన్ని.. దాన్ని ఛేదించే శక్తి ఎన్సీసీయే. ఆ సమయంలోనే విదర్భకు చెందిన శివాని కులకర్ణి గురించి చదివింది. శివాని కులకర్ణి ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ విమెన్ పైలట్. ఆమె కథనం యూనిఫామ్ సర్వీసెస్పట్ల హర్షిణీకి ఉన్న అభిమానాన్ని ఆరాధనగా మార్చింది. ఆ బాధ్యత, హుందాతనం, ప్రైడ్.. చేస్తే అలాంటి ఉద్యోగమే చేయాలనే నిశ్చయాన్ని కలిగించాయి. ఆర్మీకి దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. డిగ్రీ అయిపోయాక తల్లిదండ్రుల కోరికమేరకు ఏంబీఏలో చేరింది. పేరుకే ఏంబీఏ చదువుతోంది కాని ఆమె చిత్తమంతా ఆర్మీవైపే. అందుకే ఆ పరీక్షలకోసం ప్రిపేర్ అవసాగింది. నేషనల్ ఫైర్ సర్వీస్ కమిషన్ రోజులు చాలా నిరాసక్తిగా గడిచిపోతున్నాయి హర్షిణీకి. ఒకరోజు హర్షిణి స్నేహితురాలు శిల్ప చెప్పింది ఆమెతో.. ‘‘నీకు నచ్చిన సర్వీస్ ఒకటుంది. మొన్ననే దాని గురించి ఓ ఎంప్లాయ్మెంట్ పోర్టల్‌లో చదివా’’ అని చెప్పింది. ‘ఆ.. ఏముంటుందిలే అంత ఎగ్జయిట్మెంట్’ అని మనసులో అనుకొని అదే నిర్లప్తత మాటల్లోనూ వినిపించేలా ‘ఏంటది’ అని అడిగింది. ‘‘నేషనల్ ఫైర్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్. ఇది ఇంచుమించు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్‌తో సమానం తెలుసా’’ అంటూ ఆ ఎంప్లాయ్మెంట్ పోర్టల్‌ను చూపించింది. హర్షిణి కళ్లల్లో ఒక్కసారిగా వెలుగు. ‘‘ఏదీ చూద్దాం’’ అంటూ శిల్ప చేతుల్లోంచి లాక్కుని దాని గురించి సింగిల్ కాలమ్‌లో ఉన్న మ్యాటర్ చదివింది. ‘‘ఈ సర్వీస్‌కు యూనిఫామ్ ఉంటుందా?’’ ఆత్రంగా అడిగింది హర్షిణి తన స్నేహితురాలిని. ‘‘ఊ.. ఉంటుంది. రేపే లాస్ట్ డేట్. 30 సీట్సే ఉంటాయట. బాగా కష్టపడాలి. ఇదిగో అప్లికేషన్. ఈరోజు ఫిలప్ చేసేయ్. రేపు వెళ్లి ఇచ్చేద్దాం’’ అని దరఖాస్తు పత్రం ఇచ్చి వెళ్లిపోయింది శిల్ప. ‘‘యూనిఫామ్ ఉంటుంది’’ అన్న మాట ఆమెలోని నిర్తిప్తతను పటాపంచలు చేసింది. ఆ రాత్రి శ్రద్ధగా దరఖాస్తు పూర్తిచేసింది. ఇది మగవాళ్ల ప్రపంచం.. నాగ్‌పూర్‌లోని నేషనల్ ౖఫైర్ సర్వీస్ కమిషన్ ఆఫీస్. ఎర్రరంగులో చాలా ఆకర్షణీయంగా కనిపించింది ఆ భవనం హర్షిణికి. తనకు సెల్యూట్ చేసి.. ఆహ్వానిస్తున్నట్టనిపించింది. గేట్లోంచి లోపలికి నడుస్తున్నంతసేపు తెలియని ఆనందోద్వేగం ఆమెలో. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లోకి వెళ్లి దరఖాస్తు ఫారాలు ఇచ్చారిద్దరూ. గుమాస్తా వీళ్లను చూసి.. ‘ఇది ఆల్ మెన్స్ కాలేజ్. ఈ రంగం మీకు సరిపడదు. ఏ ఆర్మీకో లేదంటే ఎయిర్ఫోర్స్కో అప్లయ్ చేసుకోండి.. అక్కడైతే అమ్మాయిల కోసం ప్రత్యేక సౌకర్యాలుంటాయి’ అని సలహా ఇచ్చాడు. ఆ మాటలు హర్షిణికి మరింత బలాన్నిచ్చాయి. ఆల్ మెన్స్ కాలేజ్ అన్న పదం ఆమెలో పోటీతత్వాన్ని నిద్రలేపింది. ‘‘అయితే నేను తప్పకుండా చేరాలన్నమాట.. థాంక్యూ ఫర్ గైడింగ్ మీ సర్’’ అని నవ్వుతూ అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చింది హర్షిణి. పరీక్ష రాసింది. ది ఫస్ట్ ఉమన్ ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది ఇంటికి ఎన్ఎఫ్ఎస్సీలో సెలెక్ట్ అయినట్టు. ఆనందం.. ఆశ్చర్యం.. హర్షిణిలో. వెంటనే విచారం.. అసలు తనకు ఈ సర్వీస్ గురించి చెప్పి, పరీక్షరాయడానికి కారణమైన తన స్నేహితురాలు శిల్ప సెలెక్ట్ కాలేదని తెలిసి. ఆ బాధతోనే ఇంటర్వ్యూకి హాజరైంది. మెడికల్ ఎగ్జామినేషన్‌కు వెళ్లినప్పుడు.. ‘ఇది చాలా కష్టమైన సర్వీస్. నువ్వు చేయగలవా?’ అని అడిగారు. తలూపింది. ఫైనల్ ఇంటర్వ్యూలో ప్రశ్నల పరంపర మొదలైంది. ప్యానల్లో కొంతమంది ప్రోత్సహించారు. ఇంకొంతమంది వెనక్కి లాగారు. ఎలాగైతేనేం.. నెగ్గింది. ప్రోత్సాహం అందించిన ప్యానలిస్ట్‌లు ఫైర్ సర్వీసెస్‌లో కిరణ్బేడీవి అంటూ కితాబు ఇచ్చారు. యూనిఫామ్ ఉన్న సర్వీసెస్‌లో తాను పనిచేయబోతున్నానన్న ఆనందంలో నేషనల్ ఫైర్ సర్వీస్ కమిషన్‌కి ఎన్నికైన తొలి మహిళ తనేనన్న ఘనతను గుర్తించలేకపోయింది. ఆ రెడ్ ఆడ్మినిస్ట్రేషన్ సెక్షన్ గుమాస్తా వచ్చి.. ‘‘శభాష్.. బేటా! నువ్వు రికార్డ్ సృష్టించావ్! నేషనల్ ఫైర్ సర్వీస్ కమిషన్‌కు సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ లేడీవి నువ్వే’ అంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు ఆ ఆవరణను పరిశీలించింది. అన్నట్టుగానే అందరూ మగవాళ్లే. ఒక్క స్త్రీ లేదు. గర్వంగా పెదవుల మీదకు వచ్చి చేరింది చిన్న నవ్వు! పాపులారిటీ.. ఫ్రెషర్ ఫైర్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ఉమన్ కీర్తి బాగానే ఉంది. సవాళ్లూ అంతకన్నా బాగా కనిపించాయి. ఇటు హర్షిణికి... అటు ఫైర్ సర్వీసెస్‌కి. ఏడు సెమిస్టర్ల ఫైర్ ఇంజనీరింగ్ కోర్స్ చదవాలంటే ఎన్ఎఫ్ఎస్సి బిల్డింగ్‌లోని రెసిడెన్షియల్‌లోనే ఉండాలి. ఆ కోర్స్ పుట్టినప్పటి నుంచి హర్షిణి సెలెక్ట్ అయ్యేవరకు అందరూ మగవాళ్లే కాబట్టి ఆ కోర్సే కాదు.. ఆ బిల్డింగ్, రెసిడెన్షియల్ అన్నిటినీ పురుషులకు అనుగుణంగానే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆమె ఒక్కదాని కోసం వాటిని మార్చాలి.. సడలించాలి.. ఇది సర్వీసెస్‌కు సవాలు. మగవాళ్లతోపాటు ఆమే రెసిడెన్షియల్‌లోనే ఉండాలన్న నియమాన్ని కఠినంగా అమలుచేస్తూనే సెలవుల్లో ఇంటికి వెళ్లొచ్చు అనే వెసులుబాటునిచ్చారు. దీనికోసం హోమ్‌శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది ఎన్ఎఫ్ఎస్సీకి. ఇందులో ఒక్కో తరగతి ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి తరగతికి ఒక్కో యూనిఫామ్. దాంతో ప్రతి రోజును కొత్తగా ఆస్వాదించసాగింది. డ్రిల్స్, ఎక్సర్సైజెస్, సాహసాలు.. వేటిలోనూ మగవాళ్లకు తీసిపోలేదు. 29 మంది మగవాళ్లలో ఒకే ఒక్క స్త్రీ.. ఎంత పాపులారిటీని తెచ్చిందో అంత ప్రెషర్‌ను పెంచింది. మీడియా అటెన్షన్, పబ్లిసిటీ.. అంతా ఆమె పైనే.. ఆమెదే! ఇది ఆమె క్లాస్‌లోని మగవాళ్లకు కంటకింపుగా ఉండేది. ‘మేం చదివేదే తను చదువుతోంది. మేం చేసే డ్రిల్స్.. అడ్వంచర్సే ఆమే చేస్తోంది. ఇందులో ఆమె ప్రత్యేకతేముంది? ఆమె మీదే ఎందుకంత అటెన్షన్.. ఆమెకే ఎందుకంత పబ్లిసిటీ అని ఉడుక్కునేవాళ్లు. కాని మగవాళ్ల కంచుకోటగా ఉన్న ఎన్ఎఫ్ఎస్సీలోకి హర్షిణి ప్రవేశించడమే పెద్ద బ్రేకింగ్ అనేది వాళ్లకు అర్థంకాలేదు. అదే ఆమె ప్రత్యేకతని వాళ్లు గ్రహించలేదు. భారీ నీటి పైపులను, సక్షన్ పైపులను సంభాళించడం, మోక్ డ్రిల్స్ వంటివి చేయడం దేహదారుఢ్యం ఉన్న మగవాళ్లకు కూడా కష్టం. అలాంటి ఇబ్బందులన్నిటినీ హర్షిణి అధిగమించింది.. ఆ పనిపట్ల ఉన్న భక్తి, గౌరవం, ఆత్మవిశ్వాసంతో! ‘ఏ కొంచెం తప్పు చేసినా.. ఏ పని చేయలేకపోయినా ‘‘ఆడవాళక్లు ఇలాంటి చేతకావు’’ అని ఎక్కడ అంటారో.. ఈ రంగంలో స్త్రీలు పనికిరారు అని ఎక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారోనని కొత్తలో చాలా ప్రెషర్ ఫీలయ్యేదాన్ని. తర్వాత తర్వాత సెల్ప్కాన్పిడెన్స్తో అన్నిటినీ ఓవర్‌కమ్ చేశా’ అని నాటి రోజులను గుర్తు చేసుకుంటుంది హర్షిణి. సిలెండర్ బ్లాస్ట్.. ప్రాక్టికల్ ఇయర్లో తను ఫస్ట్ డీల్ చేసిన ఫైర్యాక్సిడెంట్.. సిలెండర్ పేలిన ఘటనే. ఇది షిరిడీలో జరిగింది. ఆ మంటలు ఆర్పడం చాలా తేలిక. పెద్ద పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తనకు ‘ఆ ఆపరేషన్స్ ఇస్తే బాగుండు..’ అని ఉవ్విళ్లూరేది. ఫైర్ స్టేషన్ కమాండర్‌ను అడిగేది తననెప్పుడు బిగ్ఫైర్స్కి పంపిస్తారు అని. జాయిన్ అయిన మూడేళ్లకు కానీ దొరకలేదు ఆ చాన్స్. ఢిల్లీ, కోల్కత్తా, ముంబైలలో పనిచేసినప్పుడు బిగ్ ఫైర్స్ని డీల్ చేసింది. హర్షిణీ చేసిన పెద్ద ఆపరేషన్ ఢిల్లీ శాస్త్రినగర్‌లో దీపావళి ఘటనే. ఆ మంటలను ఆర్పడానికి దాదాపు ఆరు గంటలు పట్టింది. దాని కోసం ఆ షూ ఫ్యాక్టరీ పక్కనున్న బిల్డింగ్ ఎక్కాల్సి రావడం.. ఆ బిల్డింగ్‌కూ మంటలు అంటుకొని అదీ పగుళ్లు తీస్తుంటే ఆగమేఘాల మీద దిగేసి ఫ్యాక్టరీకి ఇటు పక్కనున్న బిల్డింగ్ గోడ కూల్చి దాని పైకెక్కి మంటలను ఆర్పింది. ఇది హర్షిణీ ధైర్యసాహసాలకు మచ్చుతునక. ఇవే కాక వరదలు వచ్చి నదులు పొంగినప్పుడు, వన్యప్రాణులు ఊళ్ల మీద దాడిచేసినప్పుడు అత్యంత చాకచక్యంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. మనుషుల ప్రాణాలను కాపాడి ఫైర్ ఉన్న ఫైటర్‌గా పేరు తెచ్చుకుంది. ఓఎన్జీసీలో.. 2006లో ఓఎన్జీసీలో చేరింది హర్షిణి. ఈ కంపెనీ ఆమెకు గుజరాత్‌లోని ‘మెహసనా’లో ఉన్న తన ఫైర్స్టేషన్కి ఇన్చార్జిగా పోస్టింగ్ ఇచ్చింది. ఓఎన్జీసీకి చెందిన రెండవ అతి పెద్ద ఆన్‌షోర్ ప్రొడక్షన్ ప్రాంతం అది. హæర్షిణి గురించి ఎరుక ఉన్న ఓఎన్జీసీ 2013లో ఆఫ్‌షోర్ రిగ్స్నూ ఆమెకు అప్పచెప్పింది. అదీ రికార్డే. అప్పటిదాకా ఆఫ్‌షోర్ రిగ్స్‌లో మహిళలకు అనుమతి లేదు. ఆ రూల్‌ని బ్రేక్ చేసిందీ ఆమెనే. ఆఫ్‌షోర్ రిగ్స్ కోసం హెలికాప్టర్లో వెళ్లాలి.. ఆడిటింగ్ చేయాలి.. ఫాలోఅప్‌లు చూసుకోవాలి.. ఇలా బాధ్యత మొత్తం వహించాలి. ఈ పనిని ఎంతో చక్కగా నిర్వహించింది హర్షిణి. బైకర్... ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న హర్షిణికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. లేహ్ నుంచి కార్గిల్ వరకు బైక్ నడిపింది. తన తోటి బైకర్‌నే పెళ్లి చేసుకుంది. ‘నా పెళ్లి క్రిస్మస్ రోజు జరగడం వల్ల పెళ్లికి లీవ్ పెట్టే అవకాశాన్ని కోల్పోయా’ అని జోక్ చేస్తుంది హర్షిణి. ‘నా మీద నమ్మకం ఉంచి.. క్రూషియల్ ఆపరేషన్స్అప్పగించి.. ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్కి కృతజ్ఞురాలిని. ఫస్ట్ ఉమన్ ఫైర్ ఫైటర్ అన్న క్రెడిట్ వల్ల ఎంత గర్వంగా ఉంటుందో అంతే రెస్పాన్స్‌బులిటీ పెరుగుతుంది. అసలు ఆ మాటకొస్తే చేసే పనికి జెండర్ ఏంటి? ఇది మగవాళ్ల పని, ఇది ఆడవాళ్ల పని అంటూ ఏమీ ఉండదు. క్వాలిఫికేషన్.. కేపబులిటీయే ప్రధానం. ఉదాహరణకు బైక్ తీసుకుంటే.. తనను నడుపుతోంది స్త్రీనా? పురుషుడా అని దానికి తెలుస్తుందా? ఆ భేదం ఏమన్నా చూపిస్తుందా? వర్క్ కూడా అంతే! ఏ రంగానికీ స్త్రీ, పురుషులనే జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు. అదొక మిత్. జీవితం ఒకటే... లక్ష్యాన్ని ప్రేమించాలి.. ప్యాషన్‌తో ఛేదించాలి. కలలను సాకారం చేసుకోవాలి.. కలలను కనడం మాత్రం ఆపొద్దు! – హర్షిణీ కన్హేకర్ – శరాది -
హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు
-
హైడ్రామా: ఆత్మహత్యను అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: భర్తతో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను అధికారులు చాకచక్యంగా రక్షించారు. ఈ ఘటన చైనాలోని అన్హుయ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ 15 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది. ఇది చూసిన కొంతమంది పౌరులు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆమెను చాకచక్యంగా రక్షించాలని వ్యూహం రచించారు. అందులో భాగంగా ఓ అధికారి నడుముకు తాడు కట్టుకుని చప్పుడు చేయకుండా నడుచుకుంటూ వెళ్లి.. అంచున ఏడుస్తూ కూర్చున్న ఆమెను ఒక్కసారిగా పట్టుకున్నాడు. అనుకోని సంఘటనతో షాక్‌కు గురైన ఆమె తనను వదిలేయాలని.. చచ్చిపోతానని కేకలు పెట్టింది. అధికారి ఆమెను పట్టుకోగానే పక్కనే ఉన్న బాల్కని నుంచి వచ్చిన మరో నలుగురు అధికారులు ఆమెను సురక్షితంగా పైకి లాగారు. ఈ దశలో ఆమె చేతి నుంచి సూసైడ్ నోట్ జారి కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఎంతో ధైర్యంతో మహిళను రక్షింంచిన ఫైర్ ఫైటర్‌ను నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు. -
వ్యవసాయ పొలాల్లో మంటలు
► ఫైరింజన్లు చేరుకున్నాకే మంటలు అదుపు షాబాద్: ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలాల్లో నిప్పంటుకున్న సంఘటన మండలంలోని కుమ్మరిగూడ– నరెడ్లగూడ గ్రామాల సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐలు మోహన్‌రెడ్డి, రవికుమార్‌ల వివరాల ప్రకారం కుమ్మరిగూడ సమీపంలోని ఫ్రెష్ కో వ్యవసాక క్షేత్రం వద్ద ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు షాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా మంటలు అధికమవ్వడంతో చేవెళ్ల నుంచి రెండు పైరింజన్లు, ఒక మోటర్ ఫైరింజన్‌ను పిలిపించి మంటలార్పారు. మంటలు కుమ్మరిగూడ, నరెడ్లగూడ గ్రామాలతో పాటు షాబాద్ గ్రామ సమీపంలోకి చేరుకోవడంతో ద్విచక్ర వాహనం పైరింజన్పై వెళ్లి మంటలార్పారు. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
లోడ్ లారీ దగ్ధం.. భారీ నష్టం!
విజయవాడ: గొల్లపూడిలోని హోల్‌సేల్ మార్కెట్ వద్ద రోడ్డుపై ఆపి ఉన్న శ్రీ బాలాజీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ దగ్ధమైంది. ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం ఎదుట పార్క్ చేసిన లారీలో ప్లాస్టిక్, స్టీల్ వస్తువులు, కేబుల్ వైర్లు, వస్త్రాల బండిళ్లు లోడ్ చేశారు. వీటిని రాజమండ్రికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఉన్నట్లుండి లారీలో ఉన్న లోడ్ నుంచి పొగలు వెలువడ్డాయి. ఇది గమనించిన ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సామగ్రిని పరిశీలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మంటలు మిగతా వస్తువులకు కూడా అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లారీలో సుమారు రూ.30 లక్షల విలువైన సరకు ఉన్నట్లు ట్రాన్స్పోర్ట్ యజమాని శేఖర్ రెడ్డి చెబుతున్నారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయో తెలియడంలేదని ట్రాన్స్పోర్ట్ సిబ్బంది చెబుతున్నారు. లారీలో లోడ్ చేసిన వస్తువుల్లో రసాయన పదార్థాలుంటే వాటివల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. నష్టం వివరాలను అధికారులు లెక్కిస్తున్నారు. -
కలెక్టరేట్లో ప్రమాదం.. ఉవ్వెత్తున మంటలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కొద్ది సేపట్లోనే మంటల తీవ్రత బాగా పెరిగింది. ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. అయితే, ఈ ప్రమాదం వల్ల నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం
-
పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం
ఢిల్లీ: పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి పార్లమెంట్ భవన్ రూమ్ నెంబర్ 50లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 12 ఫైరింజన్ల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. దీనిపై అధికారులను మీడియా సంప్రదించగా.. సాంకేతిక సమస్య కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది త్వరగా రావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మరుసటిరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టునున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం
హిరమండలం: మండలంలోని కల్లట గ్రామంలో ఆది వారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పలి ఉషకు చెందిన పూరిళ్లు కాలి బూడిదైంది. ఇంటిలోని వస్తు సా మగ్రితో పాటు దుస్తులు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. సు మారు రూ.50 వేలు నష్టం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. బాధితురాలికి బియ్యంతో పాటు రేషన్ సరుకులు అందించారు. ఆయనతో పాటు సర్పంచ్ ఐ.విజయలక్ష్మి, ఆర్ఐ, వీఆర్వో, గ్రామ పెద్దలు నర్సింగరావు తదితరులు ఉన్నారు. -
ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి
నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులు, జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో బలగాలు ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. -
ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి
-
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం..
-
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన గోడౌన్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమతో, గోడౌన్ యజమాన్యం వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
-
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరిగణాల జిల్లాలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. మధ్యంగ్రామ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం వేకువజామున ఈ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి 38 ఫైరింజన్లు చేరుకున్నాయి.కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తోంది. అయితే సహాయక చర్యల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తుండగా ముగ్గురు ఫైర్ సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
-
ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీ: స్థానిక ముంద్కా ప్రాంతంలోని మార్కెట్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 33 ఫైరింజన్లతో సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. థానేలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మొదట ఓ రూమ్‌లో చిన్నగా మంటలు వచ్చాయి. తర్వాత కొంతసేపటికే మంటలు ఫ్యాక్టరీ మొత్తాన్ని వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే దాదాపు ఫ్యాక్టరీలోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. 10 ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోనికి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ఎంతమేరకు నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి
మల్కాన్‌గిరి : ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కూంబింగ్ పార్టీ పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే జంత్రీ అటవీప్రాంతంలో కూంబిగ్ కొనసాగుతోంది. గాయపడి, తప్పించుకున్న మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. కాగా డిసెంబర్ ౩ నుంచి జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్లీనరీని సోమవారం పోలీసులు ముట్టడించడంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 24మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయస్టుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. మల్కాన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో మృతదేహాలను భద్రపరిచారు. మరికాసేపట్లో ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తరలించనున్నారు. కాగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఏపీ డీజీపీ సాంబశివరావు ఏరియల్ సర్వే చేయనున్నారు. -
ముంబయిలో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి!
-
ముంబయిలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి!
ముంబయి : దక్షిణ ముంబయిలోని కఫె పరేడ్ ప్రాంతంలోని మేకర్ టవర్స్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 20 అంతస్తుల భవనంలో ఈ రోజు ఉదయం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడే సరికి టవర్స్‌లోని పలువురు భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే మంటల్లో చిక్కుకున్న 11మందిని సురక్షితంగా రక్షించారు. కాగా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. కాగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ శేఖర్ బజాజ్ ఫ్లాట్ నుంచి ముందుగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘క్లోజ్’వే!
-
‘క్లోజ్’వే!
వట్టిగెడ్డ ఉధతికి కొట్టుకుపోయిన కాజ్వే అదే సమయంలో నది దాటుతున్న ముగ్గురి గల్లంతు సురక్షితంగా బయటకు తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది సాలూరు : పాచిపెంట మండలం మోసూరు వద్ద వట్టిగెడ్డపై నిర్మించిన కాజ్వే గురువారం మధ్యాహ్నం కొట్టుకుపోయింది. అదే సమయంలో గెడ్డదాటుతున్న నలుగురు కొట్టుకుపోగా... వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఈ కాజ్వే కొట్టుకుపోగా... అదే సమయంలో కాజ్వేనుంచి గెడ్డ దాటుతున్న మోసూరుకు చెందిన నలుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న పలువురు సాలూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ సిబ్బంది ఉధతంగా ప్రవహిస్తున్న నదిని దాటుకుంటూ వెళ్లి నలుగురు యువకులనూ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇదిలావుండగా హుద్‌హుద్ తుఫాన్ సమయంలోనే కాజ్వే కొంతమేరకు కొట్టుకుపోయింది. దానికి చేపట్టిన మరమ్మత్తు పనులు తూతూమంత్రంగా జరిపారన్న విమర్శలున్నాయి. ఆ కారణంగానే బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతోlమిగిలిన కాజ్వే కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. -
బుల్లెట్ ఫైరింజన్
కృష్ణాపుష్కరాల సందర్భంగా శ్రీశైలంలో అగ్నిమాపకదళ సిబ్బంది ఏర్పాటు చేసిన అత్యాధునిక బుల్లెట్ ఫైరింజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని గురించి జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘దీనిని మిస్ట్ బుల్లెట్‌గా పిలుస్తారు. జిల్లాలో ఇలాంటివి రెండు ఉన్నాయి. ఎక్కడైనా చిన్న సందుల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఈ బైక్‌పై వేగంగా వెళ్లి మంటలను అదుపు చేస్తోంది. బైక్ వెనుక భాగంలో రెండు సిలిండర్లు అమర్చబడి ఉంటాయి. ఒకSసిలిండర్‌లో తొమ్మిది లీటర్ల నీరు, మరొ సిలిండర్‌లో ఫోమ్ (సబ్బు నురుగు) ఉంటుంది. మొదటి సిలిండర్‌లో ఉన్న నీటితో గుడిసెలు, గడ్డివాములు దగ్ధమైనప్పుడు ఒక చుక్క నీరు 1600 బిందువులుగా విడిపోయి మంటలను అదుపు చేస్తోంది. పెట్రోల్, డీజీల్ వంటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఫోమ్ చల్లడంతో అక్కడ పొర ఏర్పడి ఆక్సిజన్ లేకుండా చేసి మంటలు వ్యాపించకుండా చేస్తోంది. – శ్రీశైలం (బండి ఆత్మకూరు) -
హరితహారంపై కేసీఆర్ సంతృప్తి
హైదరాబాద్ : హరితహారంలో భాగంగా మొక్కలకు నీరు పోయడానికి ఫైరింజన్లు ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో హరితహారంపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం అమలుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు నాటడమే కాదు, సంరక్షించాలని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో మొక్కలకు ట్యాంకర్లతో నీరు పోయాలని కేసీఆర్ ఆదేశించారు. -
రేణిగుంట ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం
తిరుపతి: రేణిగుంట ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లకు సంబంధించిన ఓ కార్మాగారంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫ్యాన్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీవేంకటేశ్వర సహకార సొసైటీ పరిధిలో ఉన్న ఒక ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 9 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పరిశ్రమలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు'
హైదరాబాద్ : నాచారంలోని శాలిస్లైట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న ఆయన హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చన్నారు. ప్రమాదం వెనుక ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. మంటలను అదుపు చేసేందుకు నీటి సమస్య లేకుండా జీహెచ్ఎంసీ ట్యాంకర్లను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అలాగే నగరం మధ్యలో ఉన్న ఫ్యాక్టరీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని మేయర్ తెలిపారు. మంటలార్పేందుకు ఇంకా సమయం పడుతుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని రియాక్టర్లు వరుసగా పేలుతుండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయన్నారు. మంటల దగ్గరకు వెళ్లడం సాధ్యం కావటం లేదని తెలిపారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ఉదయం తొమ్మిది గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని వాచ్మెన్ తెలిపాడు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించి, మంటలు పెరిగాయని పేర్కొన్నాడు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 60 నుంచి 70మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించాడు. కాగా ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నవారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో ఇదే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మంటలార్పేందుకు కావాల్సిన పరికరాలు కూడా ఫ్యాక్టరీలో లేవని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలన్నారు. కాగా ప్రమాదం జరగగానే అందర్ని అప్రమత్తం చేసినట్లు మల్కాజ్గిరి ఏసీపీ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకూ తెలియదని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నాచారం పారిశ్రామికవాడలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో కెమికల్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో సుమారు కిలోమీటరు మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలకు అదుపు చేస్తున్నారు. మంటలు చట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం లేదు. -
మండుతున్న సిలిండర్‌ను పట్టుకొని..
బీజింగ్: గ్యాస్ సిలెండర్ లీక్ అవడం ఎంత ప్రమాదకరమో వేరే చెప్పక్కర్లేదు. కిచెన్‌లో కొంచెం గ్యాస్ లీకైన వాసన తగిలితేనే మనం ఎంతగానో కంగారు పడిపోతాం. అలాంటిది గ్యాస్ లీకై మంటలు వెదజిమ్ముతున్న సిలిండర్‌ను చేతులతో పట్టుకొని ఐదు ఫ్లోర్లు మెట్లు దిగాడంటే ఎంత దైర్యసాహసాలుండాలి. చైనాలో ఓ ఫైర్‌మెన్ చేసిన ఈ సాహసం ఇప్పుడు అందరిచేత ఔరా! అనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని కున్మింగ్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయని సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బిల్డింగ్ ఐదో ఫ్లోర్‌లోని ఓ కిచెన్‌లో ఉన్న సిలెండర్ లీకై మంటలు వెలువడుతుండటాన్ని గమనించిన సిబ్బంది దానిని ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఫైర్‌మెన్ జియోబిన్ మంటలతో ఉన్న సిలిండర్‌ను పట్టుకొని చకచకా ఐదు ఫోర్లు దిగి సిలిండర్‌ను బయటపడేశాడు. అదృష్టవశాత్తు ఆ సిలిండర్ పేలకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది. -
అగ్నియోధుడి అంతరంగం
9/11 దుర్ఘటన నెత్తుటి శిథిలాలు, కన్నీటి శకలాలు ఇప్పటికీ ఎన్నో కథలు చెబుతూనే ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అగ్నియోధుల (ఫైర్‌ఫైటర్స్) గురించి. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో లేచిన అగ్నికీలలలో న్యూయార్క్ ఫైర్ డిపార్ట్మెంట్(ఎఫ్డిఎన్వై)కు చెందిన 343 మంది ఫైర్‌ఫైటర్లు అమరులయ్యారు. ఉద్యోగం అంటే ఉపాధి మాత్రమే కాదని పరుల కోసం చేసే త్యాగమని, మృత్యువుకి చేరువలో ఉన్నవారిని కాపాడటం అని, ఉద్యోగం అంటే ఉక్కు నిబద్ధత అని, అవసరమైతే ఇతరుల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం కూడానని నిరూపించారు ఆ అగ్నియోధులు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రమాదంలో మృత్యు శిఖరపు అంచుల వరకూ వెళ్లి, అదృష్టవశాత్తూ వెనక్కి తిరిగొచ్చాడు కెవిన్ ముర్రే. మన్‌హట్టన్ ఈస్ట్ సెకండ్ స్ట్రీట్‌లోని ఫైర్హౌజ్లో ఫైర్ ఫైటర్‌గా పని చేసే కెవిన్... నాటి సంఘటన గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఇవి. స్థూలదృష్టితో చూస్తే ఫైర్ఫైటర్లందరి సామూహిక అంతరంగమిది. ‘జనం కోసం నేను’ అనే మానవత్వ నినాదానికి నిలువెత్తు రూపమిది. ‘ఆఫీసులోకి అడుగుపెట్టగానే పెద్ద మీసాల మైక్ కెల్టీ అంటున్నాడు... వృత్తి జీవితంలో ప్రతి రోజూ ఒక యుద్దమే’ అని. మోములో లేతదనం ఇంకా పోని కొత్త కుర్రాడు కెమరాట్ నవ్వుతూ వింటున్నాడు. మధ్యలో ఎప్పటిలాగే ఏవో సందేహాలు అడుగుతున్నాడు. ఆ దృశ్యం నాకు తరచుగా కనిపించేది. ఇప్పటికీ కనిపిస్తోంది. కానీ తేడా అల్లా ఒక్కటే. అప్పుడు వాళ్లు జీవించి ఉన్నారు. ఇప్పుడు లేరు. ఈ ఇద్దరు మాత్రమే కాదు... వీరితో పాటు గోడ మీద ఛాయాచిత్రాలుగా మిగిలిన నా నలుగురు సహోద్యుగులు కూడా బతికిలేరు. వరల్డ్‌ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో మంటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించే క్రమంలో కన్నుమూశారు. వాళ్లను తలచుకుంటే నాకు కన్నీరు ఆగదు. అలాగని కర్తవ్యం వెనక్కిపోదు. మామూలుగా అందరూ ‘మంటలకు దూరంగా ఉండాలి’ అని చెబుతుంటారు. మాకు మాత్రం ‘మంటలు ఎక్కడుంటే అక్కడ ఉండండి’ అని శిక్షణ సమయంలో చెప్పారు. మన్‌హట్టన్ ఈస్ట్ సెకెండ్ స్ట్రీట్‌లోని ఫైర్హౌజ్లో పనిచేస్తాను నేను. మా ఆఫీసు గోడలపై, వాహనాలపై ‘లక్కీ ఎలెవన్’ అనే వాక్యం కనిపిస్తుంది. 9/11 ముందు వరకు నేను కూడా అలాగే అనుకున్నాను. ఆరోజు ఉదయం కొలీగ్స్‌తో కలిసి క్యాఫ్టీరియాలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఇంతలో పిడుగుపాటులాంటి వార్త కంట్రోల్‌రూమ్ నుంచి వచ్చింది. డబ్ల్యూటీసీ టవర్లను ఒక విమానం ఢీకొందని! ఇదేదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటన అనుకున్నాంగానీ రెండో విమానం ఢీకొన్న తరువాతే ఇది ఉగ్రవాదుల కుట్ర అనే విషయం తెలిసింది. అప్పటి వరకు ఉన్న ధైర్యం హఠాత్తుగా మాయమైపోయింది. ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. అంతలోనే నార్త్ టవర్లోని 10-15వ అంతస్తుల్లో ఉన్నవారిని రక్షించాల్సిందిగా అధికారుల ఆదేశం. వెంటనే బయలుదేరాం. నా మనసు నిండా ఏవేవో ఆలోచనలు. నా కుటుంబం పదేపదే కళ్ల ముందు కదలాడుతోంది. మా వాహనం వేగంగా దూసుకు వెళుతోంది. ఆ వేగంతో సరిసమానంగా ధైర్యానికి, అధైర్యానికి మధ్య యుద్ధం ఒకటి నాలో జరుగుతోంది. చరిత్రలో ఫైర్‌ఫైటర్ల సాహసాలను, త్యాగాలను గుర్తుచేసుకున్నాను. ‘మంటకు నువ్వు భయపడడం కాదు... మంటే నిన్ను చూసి భయపడి పారిపోవాలి’ అన్నాడు ఒకసారి మా పై అధికారి సరదాగా. అది సరదాగా అన్నా అందులో గొప్ప సత్యం ఉంది. ‘నా ప్రాణాలు అడ్డుపెట్టయినా సరే, ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించాలి’ అనే ధైర్యం మరుక్షణం నా నరనరాల్లోకి ప్రవహించింది. దట్టమైన పొగలు. మంటలు. ఆకాశం నుంచి మనుషులు రాలిపడుతున్నారు. ఎప్పుడూ చూడని దృశ్యం! పని చేయని లిఫ్ట్‌లు... దెబ్బతిన్న కమ్యునికేషన్, వాటర్ పైప్‌లు పగిలిపోయి కాళ్లకు అడ్డం తగులుతున్న నీళ్లు, చెత్తా చెదారం... ముందడుగు వేయడానికి ప్రతిదీ ప్రతికూలంగానే ఉంది. ప్రతి అంతస్తూ ఒకదాన్ని మించి ఒకటి దారుణంగా ఉన్నాయి. మరోపక్క జనాలు అరుస్తున్నారు. భయంతో కేకలు పెడుతున్నారు... ‘ఢీ కొట్టడానికి మూడో విమానం వస్తుంది’ అని. అదెంత వరకు నిజమో మాకు కూడా తెలియదు. కానీ అలాంటిదేమీ లేదని వారికి ధైర్యం చెప్పాం. ఆ చీకట్లో టార్చిలైట్ల వెలుగులో మెట్లమార్గం గుండా జనాలను బయటికి సురక్షితంగా తీసుకువెళ్లడం ప్రారంభించాం. సాంకేతిక వ్యవస్థ కుప్పకూలిపోయి, ఆ శిథిలాలే మాపై గురి పెట్టిన ఆయుధాలైన ఆ సమయంలో... ఇతరులను రక్షించడం మాటేమిటోగానీ, మా బృందంలో ఏ ఒక్కరూ బతికే అవకాశమే లేదని అనిపించింది. 40వ ఫ్లోర్ నుంచి దూసుకువచ్చిన ఒక ఫైర్‌మన్ పెద్దగా అరుస్తూ ‘సౌత్ టవర్‌లాగే ఇదీ (నార్త్ టవర్) కుప్పకూలిపోనుంది’ అన్నాడు హెచ్చరికగా. అధికారుల ఆదేశాలను వినే స్థితిలో అతడు లేడు. ఈలోపు పెద్ద శబ్దం వినిపించింది. నార్త్‌టవర్ నేలమట్టం కావడానికి సిద్ధంగా ఉంది. అందరం వేగంగా కదిలాం. ఓపక్క పక్కవాళ్లను కాపాడాలన్న తపన. మరోపక్క మమ్మల్ని మేము కాపాడుకోగలమా అన్న సందేహం. సకాలంలో బయటపడటం వల్లో, అదృష్టం వల్లో నా ప్రాణాలు మిగిలాయి. కానీ ఎంతోమంది చనిపోయారు. నాతో కలిసి పనిచేసినవాళ్లు ఎంతోమంది అసువులు బాశారు. ఎన్నో ప్రమాదాల్లో అగ్ని కీలలను ఛేదించి నిలబడినవాళ్లు ఈ ప్రమాద కోరల నుంచి తప్పించుకోలేక పోయారు. నాటి దృశ్యాలు... మృత్యువాకిట నిలబడి నిస్సహాయంగా చూస్తూ నిలబడినవారి ముఖాలు... అన్నీ గుర్తొస్తే ఇప్పటికీ నా మనసు కదిలిపోతుంది. నేను ప్రాణాలతో బయటపడ్డాను కానీ దుమ్ము, రసాయనాల వల్ల నా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. నాలాగే ఎంతోమంది ఫైర్ఫెటర్లు చాలాకాలం పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరు క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ పీడకలను మర్చిపోలేక ఇప్పటికీ కొందరు ఉలికులికి పడుతున్నారు. ఇదీ కెవిన్ ముర్రే అంతరంగం. నిజమే. ఫైర్ ఫైటర్ జీవితం అంటే నిప్పుతో చెలగాటం. వాళ్ల పోరాటం మృత్యువుతోటి. గెలుస్తారో ఓడిపోతారో ఎవరికీ తెలియదు. అయినా ప్రతిసారీ మృత్యువుతో తలపడు తుంటారు. సహచరుల్ని కళ్లముందే కోల్పో తున్నా గుండెల్ని రాయి చేసుకుంటారు. తమను కబళించడానికి నిప్పు నాలుకలు చాస్తున్నా ధైర్యంగా ముందుడుగు వేస్తారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి, ఎందరికో ప్రాణభిక్ష పెడుతుంటారు. అలాంటి వీరులందరికీ వందనం! అగ్నిపూలు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మొత్తం మహిళలే. పురు షులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని చెప్పడానికే ప్రభుత్వం ఇలా మహిళల్ని నియమించింది. అగ్నిమాపక విభాగంలో పనిచేయడం అంత తేలిక కాదు. బరువులు ఎత్తాలి. పరుగులు తీయాలి. ఒక్కోసారి ప్రాణాన్ని పణంగా పెట్టాలి. అయినా వీళ్లు తమ సత్తా చాటుతున్నారు. నిప్పుతో చెలగాటం ఆడుతూ... ఆడవాళ్లంటే కుసుమ కోమలమైన వాళ్లే కాదు, అవసరమైతే కఠిన సమయాల్లో తెగువనూ ప్రదర్శించగలమని నిరూపిస్తున్నారు. ఉమెన్ ఫైర్ ఫైటర్లుగా కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే సింబల్ రెడ్, బ్లూ కలగలిసిన రిబ్బన్. సింబల్‌లోని ఎరుపు అగ్నిని, నీలం జలాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే సారాన్ని ఏ మాటలూ లేకుండానే లోకానికి చాటుతుంది ఈ రిబ్బన్. ఫైరున్న ఫైటర్! ఫైర్‌తో ఫైట్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగమే అక్కర్లేదని నిరూపిస్తు న్నాడు బిపిన్ గణత్రా (కోల్‌కతా). పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసే బిపిన్ ముఖ్యమైన పని మాత్రం మంటలను ఆర్పడం. ‘సిటీ ఆఫ్ ఫైర్స్’గా పేరున్న కోల్‌కతాలో అగ్నిప్రమాదాలు ఎక్కువ. ఏ ప్రమాద వార్త తెలిసినా అక్కడికి వెళ్లి మంటలను ఆర్పడంలో సహాయం చేస్తాడు బిపిన్. చిన్నప్పుడు ఫైర్ ఇంజిన్ బెల్లు వినిపించ గానే ఇంట్లో నుంచి పరుగెత్తుకు వచ్చేవాడట. ఫైర్ ఇంజిన్ వెంట పరుగులు తీసి అగ్నిప్రమాదం జరిగిన స్థలానికి చేరుకునేవాడట. అక్కడ చూసిన ఫైర్‌మెన్ కష్టం బాల్యంలోనే అతడి మనసులో ముద్రపడింది. పెద్దయ్యాక ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా వెళ్లడం, తన వంతుగా అగ్నిమాపక సిబ్బందికి సహాయం అందించడం అలవాటైంది. ‘‘ఫైర్ ఫైటింగ్లో శిక్షణ లేకపో వచ్చు కానీ చిత్తశుద్ధి ఉంది. అతడు మా ఫైర్‌మెన్‌కు మార్గదర్శి. ఇలాంటి వాళ్లు అరుదు’’ అని బిపిన్ గురించి ప్రశంసాపూర్వకంగా చెప్తారు కోల్‌కతా సిటీ ఫైర్ సర్వీస్ చీఫ్ ప్రసాద్ ఘోష్. -
సీతారాంబాగ్‌లో భారీ అగ్నిప్రమాదం
♦ ఐదంతస్తుల భవనంలో ఎగసిపడిన మంటలు.. కూలిన బిల్డింగ్ ♦ రూ. కోటి ప్లాస్టిక్ సామగ్రి బుగ్గి హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీతారాంబాగ్ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఉన్న భవనంలో ఉదయం 10.30 గంటలప్పుడు మంటలు చెలరేగాయి. క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించాయి. పోలీసులు ఫైరింజన్లు తెప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ అదుపులోకి రాలేదు. అమర్ అగర్వాల్‌కు చెందిన ఈ ఐదంతస్తుల భవనం మొత్తాన్ని ప్లాస్టిక్ సామగ్రి గోడౌన్‌గా వినియోగిస్తున్నారు. ఇందులోని ప్లాస్టిక్ అగ్నికి బూడిదయ్యింది. దట్టమైన మంటల ధాటికి భవనం కుప్పకూలింది. కలెక్టర్ రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు రాత్రి వేళ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్ల వారిని ఖాళీ చేయించారు. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. భవనమంతా ప్లాస్టిక్ వస్తువులతో నిండి ఉండటం వల్ల మంటలు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాగా, ఈ వార్త విన్న యజమాని అమర్ అగర్వాల్ గుండె నొప్పితో కుప్పకూలినట్టు ఆయన సంబంధీకులు తెలిపారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనంలో మంటలు అదుపు చేయడానికి అధికారులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
ముంబైలోని లోఖండ్ వాలాలో అగ్నిప్రమాదం
ముంబయి: వరుసగా ముంబైలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ముంబయిలోని భీవాండి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం మరిచిపోక ముందే ఇవాళ లోఖండ్ వాలా ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. 13అంతస్తుల నివాస సముదాయం రహేజా క్లాసిక్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో పాటు మూడు వాటర్ ట్యాంకర్లతో మంటలను ఆర్పుతున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాజెడీ... నో రియాల్టీ..
టీవీ షోలకు ఆకర్షితులవుతున్న యువత నిజ జీవితంలో స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదికి గత ఏడాది స్ట్రీట్ ఫైట్... తాజాగా ఫైర్ ఫైట్ సిటీబ్యూరో: కొన్ని సర్పాలతో పాటు కీటకాలున్న గాజు పెట్టెలో చేతులు పెట్టేదొకరు.. అల్లంత ఎత్తులో ఒంటికి నిప్పుపెట్టుకుని కింద నీటిలోకి దూకేది ఇంకొకరు... బైక్‌పై వేగంగా దూసుకుపోతూ నేలపై ఉన్న వస్తువుల్ని తీసేది మరొకరు... ఇటీవల కాలంలో సినిమాలను మించిపోతున్న ఈ సీన్లు టీవీల్లోని రియాల్టీ షోల్లో నిత్యం కనిపిస్తున్నాయి. వీటిని ‘స్ఫూర్తి’గా తీసుకుంటున్న బాలురు, యువత వాటిలో పాల్గొనాలనో, ఆ స్థాయిలో స్టంట్స్ చెయ్యాలనో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా గాయపడటంతో పాటు మృత్యువునూ కొనితెచ్చుకుంటున్నారు. సోమవారం పాతబస్తీలోని ఫలక్‌నుమ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చిన జలాలుద్దీన్ మృతి ఉదంతం ఈ కోవకు చెందినదే. బయటపడుతున్నవి, పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నవి తక్కువే అయినా... ఈ రియాల్టీల ప్రభావం టీనేజర్లపై ఎక్కువగా ఉంటోందని మానసిక నిపుణులు చెప్తున్నారు. పరిపక్వత లేకపోవడమే ప్రధాన కారణం... టీవీ షోల ప్రభావానికి లోనవుతున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉంటున్నారు. ఓ ఛానల్లో ప్రసారమయ్యే రెజ్లింగ్‌తో ప్రేరణ పొందిన కొందరు యువకులు గత ఏడాది మేలో పాతబస్తీలో వీరంగం సృష్టించారు. ఫం జెషా బస్తీలో ఏడుగురు యువకుల మధ్య ప్రారంభమైన పందెం స్ట్రీట్ ఫైట్‌కు దారి తీసింది. ఈ పోరులో 17 ఏళ్ల నబీల్ ప్రాణాలు కోల్పోయాడు. టీనేజ్‌లో ఉన్న యువతలో పరిపక్వత తక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు ఆ వయసులో ఇతరుల్ని, కొన్ని కార్యక్రమాలు చూసి సాహసాలు చేయాలనే ధోరణిలోకి వెళ్లిపోతారు. అందులోనే హీరోయిజం, విజయం ఉన్నాయని భావించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. జలాలుద్దీన్ సైతం కలర్స్ ఛానల్లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ కార్యక్రమంలో భాగమైన ‘ఫియర్ ఫ్యాక్టర్-ఖత్రోంకి ఖిలాడీ’ సిరీస్‌లో పాల్గొనడానికి ‘రిహార్సల్స్’ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడని దక్షిణ మండల పోలీసులు తెలిపారు. అవి చూసే బైక్ రేసులు సైతం... నగరంలోని దక్షిణ మండలంతో పాటు పశ్చిమ మండలంలోని అనేక ప్రాంతాలు ‘రేస్ ఎఫెక్డెడ్’ జాబితాలోకి వస్తాయి. మధ్య మండల పరిధిలో ఉన్న నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ఏరియాల్లోనూ బైక్ రేసింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకరితో ఒకరు పోటీ పడి దూసుకుపోవడం, వీలింగ్ పేరుతో వాహనాన్ని ఉన్న స్థానంలోనే గుండ్రంగా తిప్పడం, ముందు చక్రం పెకైత్తి నడిపిం చడం, వాహనంపై నిల్చోవడం... ఇలా అనేక స్టంట్స్‌కు సినిమాలు, టీవీల్లోని అంశాలే ప్రేరణగా మారుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఓ ప్రాంతంలో నిఘా ఉంచి ‘రేసర్లను’ పట్టుకుంటున్నారు. వారితో పాటు తల్లిదండ్రుల్నీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ చర్యలతో కొన్ని రోజులు మిన్నకుండిపోతున్న యువత... ఆపై ప్లేసులు మార్చి మళ్లీ రెచ్చిపోతున్నారు. అనేక సందర్భాల్లో వాహనాలు ధ్వంసం కావడం, క్షతగాత్రులు కావ డం జరుగుతున్నా వీరిలో ఆశించిన మార్పు రావట్లేదు. అసలు వాస్తవాలు మర్చిపోతున్నారు... సినిమాలు, టీవీలను అనుకరిస్తున్న టీనేజర్లు అసలు వాస్తవాలను గుర్తించలేకపోవడం, గమనించినా పట్టించుకోకపోవడం జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు. వీటికి తోడు ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనలు సైతం యువతను ‘ప్రేరేపించేవిగా’ ఉంటున్నాయి. వాటిలో స్టంట్స్ చేసే వారు నిపుణుల పర్యవేక్షణలోనే సాగిస్తారు. ఇదే అంశాన్ని వాణిజ్య ప్రకటనలు, రియాల్టీ షోల్లో అవి ప్రసారమవుతున్నప్పుడు కింది వైపు చిన్న అక్షరాల్లో ప్రసారం చేస్తున్నారు. నిజజీవితంలో ఎడ్వెంచర్స్కు ప్రయత్నిస్తున్న బాలురు, యువత తల్లిదండ్రులకు సమాచారం లేకుండా చేస్తున్నారు. ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర సమయాల్లో ఉపకరించే పరికరాలు, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ‘రంగం’లోకి దిగుతూ ప్రాణాల పైకి తెచ్చుకుంటూ కన్న వారికి కడుపుకోత మిగుల్చుతున్నారని పోలీసులు వివరిస్తున్నారు. శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం పాతబస్తీలోని యువత, మైనర్లలో ఉన్న కొన్ని ఇబ్బందికర అంశాలను పారద్రోలడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. వేళకాని వేళల్లో రోడ్లపైకి వస్తున్న వారిని, చబుత్రలపై కాలక్షేపం చేస్తున్న వారిని, లేట్ నైట్ రోమియోస్, రహదార్లపై బైక్స్‌తో ఫీట్లు చేసే వారిని నిలువరిస్తున్నాం. వారితో పాటు తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. సినిమాలు, టీవీల్లోని స్టంట్స్ చూసి తమంతట తాముగా స్ఫూర్తి పొందుతూ ప్రాణాల మీదికి తెచ్చే సాహసాలు చేసే టీనేజర్ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. వ్యవస్థీకృతంగా జరిగే వాటిని పోలీసులు ఆపగలిగినా... వ్యక్తిగత అంశాల్లో తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేసే వరకు జోక్యం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. - వి.సత్యనారాయణ, సౌత్ జోన్ డీసీపీ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోల ప్రభావం టీనేజర్లపై ఎక్కువగా ఉంటోంది. బాలలు, యువత ‘ఎడ్వెంచర్స్’ బారినపడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వయసుకు మించిన ప్రదర్శనల్ని చూడటానికి అంగీకరించకూడదు. ఇలాంటి వాటిని పిల్లలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు సైతం పక్కనే ఉండాలి. ఆయా షోల్లో ఫీట్లు పిల్లల్ని ఎంత మేరకు ఆకర్షిస్తున్నాయో గమనించాలి. షో ముగిసిన తర్వాత సైతం తల్లిదండ్రులు కాసేపు పిల్లలతో మాట్లాడాలి. షోలో చూసిన అంశాల పట్ల వారి అభిప్రాయం ఏమిటి? వారూ అలాంటివి చేయాలని ఆశిస్తున్నారా? అనే అంశాలు తెలుసుకోవాలి. ఏమాత్రం ఆ ఛాయలు కనిపించినా వాస్తవాలను వారికి వివరించాలి. అలాంటి ఫీట్లు కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే సాధ్యమని, అలానే జరిగాయనేది అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే అపశృతులకు తావు లేకుండా చూసుకోగలం. - డాక్టర్ అనిత రాయిరాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రిస్ట్ -
నల్లగొండలో గుట్టపై అగ్ని ప్రమాదం
నల్లగొండ క్రైమ్: నల్లగొండ పట్టణంలోని లతీఫ్సాబ్ గుట్టపై ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 ఎకరాల్లో ఉన్న ఈ గుట్టపై చెట్లు ఉండగా... గుట్టకు రెండు వైపుల నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. రెండు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది కింది నుంచే మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు. గుట్టపైకి వెళ్లే అవకాశం లేదు. ఎవరో సిగరెట్ తాగి పడవేయడమో లేక నిప్పు పెట్టడమే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
హోలీ ఆడేందుకు పోలీసులు ఏకంగా...
మొరాదాబాద్: దేశవ్యాప్తంగా గురువారం రంగులపండువ హోలీని సంబంరంగా జరుపుకున్నారు. పార్టీల అధినేతలు, సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు, సామాన్య ప్రజానికం అనే లేకుండా అందరూ రంగుల్లో మునిగితేలారు. ఉత్తరప్రదేశ్ లో మాత్రం అగ్నిమాపక సిబ్బంది కాస్త భిన్నంగా హోలీని జరుపుకుంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెళ్లి సహాయక చర్యలను చేపట్టాల్సిన ఆ సిబ్బంది, తాము విధినిర్వహణలో వాడే ఫైరింజన్ నే హోలీ సంబరంలో భాగం చేశారు. యూపీలోని మొరాదాబాద్ లో పోలీసు సిబ్బంది ఫైరింజన్ వాహనంపై రోడ్లపై చక్కర్లు కొడుతూ హల్ చల్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ వాహనంపై మొరాదాబాద్ లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ హోలీ జరుపుకున్నారు. ఆ పోలీసులు జరుపుకున్న హోలీ సంబరాలను, వాహనంపై వారు తిరగడం, ఫైరింజన్ వాహనం నుంచి నీళ్లను హోలీ కోసం వాడుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. హోలీ జరుపుకునేందుకు ప్రభుత్వ వాహనాన్ని, అందులో విధినిర్వహణకు అత్యవసరంగా అందుబాటులో ఉండాల్సిన వాహనాన్ని అగ్నిమాపక సిబ్బంది పండుగకు వాడటాన్ని చాలా మంది వ్యతిరేకిస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పదే పదే షేర్ చేస్తున్నారు. -
అగ్నిప్రమాదంలో ఐదు గుడిసెలు దగ్ధం
విజయవాడ: క్రిష్ణలంకలోని తారక రామానగర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కరకట్ట మీద ఉన్న ఓ గుడిసె నుంచి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 5 గుడిసెలకు మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నా సమయం కావడం, అందులోనూ ఎండాకాలం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. గుడిసెల్లో దాచుకున్న విలువైన వస్తువులు బూడిదపాలయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ లేదా వంట చేసే సమయంలో నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గుడిసెలు కాలిపోయిన బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. -
చిత్తూరులో వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
- ఎగిసిపడుతున్న మంటలు చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న కుమరన్ శిల్క్స్ వస్త్ర దుకాణంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వస్త్ర దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో దుకాణంలోని సిబ్బంది వీధిలోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దుకాణంలోని వస్త్రాలు కాలి బూడిదవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేడ్చల్‌లో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ.. భారీగా మంటలు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలం కిష్టాపూర్‌లో ఆదివారం ఓ గ్యాస్‌పైప్ లైన్ లీకేజీ అయింది. దాంతో మంటలు అలుమకుని భారీగా ఎగసిపడుతున్నాయి. పరిసరప్రాంతాల్లో నివసించే ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం..
చింతపల్లి(నల్గొండ జిల్లా): చింతపల్లి మండలం కొక్కిరాలతండాలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారీ సైలెన్సర్ నుంచి వచ్చిన అగ్గిరవ్వ ప్రత్తికి అంటుకుని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముంబయి లో భారీ అగ్నిప్రమాదం
ఇవాళ ఉదయం ముంబయి క్రావ్ఫోర్డ్ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోనికి తెచ్చారు. ఈ ప్రమాదంలో 50 నుంచి 60 షాపులు పూర్తిగా దహనమయినట్లు తెలుస్తోంది. కాగా... అగ్నిప్రమాదానికి గల కారణమేంటో తెలియరాలేదు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు అగ్నిమాపక ఉన్నతాధికారులు తెలిపారు. -
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.
-
65 లక్షల టయోటా కార్ల రీకాల్
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ 'టయోటా' 6.5 మిలియన్ వాహనాలను వెనక్కి తీసుకుంటోంది. ఆ సంస్థ వాహనాల తయారీలో చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్ని ప్రమాదం బారినపడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ ప్రక్కగా ఏర్పాటు చేసిన పవర్ విండో మాస్టర్ స్విచ్‌లో సమస్యలు గుర్తించినట్లు టయోటా కంపెనీ తెలిపింది. మాస్టర్ స్విచ్ మెల్ట్ అయి మంటలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వాహనాలను వాపసు తీసుకుంటున్నట్లు టయోటా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ తరహాలో ఎలాంటి ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాకున్నా.. ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు టయోటా తెలిపింది. ఇటీవలి కాలంలో టయోటా వాహనాల 'ఎయిర్ బ్యాగ్'లలో సమస్యలు తలెత్తడంతో 10 మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెనక్కి తీసుకుంటున్న వాహనాలు 2005 నుండి 2010 మధ్య కాలంలో విక్రయించిన యారిస్, కొరోల్లా, కామ్రి లతో పాటు ఆర్ఏవీ4 తరహా మోడల్ వాహనాలు ఉన్నాయి. ఈ మోడల్ వాహనాలను ఎక్కువగా ఉత్తర అమెరికా, బ్రిటన్‌లో విక్రయించినట్లు టయోటా తెలిపింది. -
రసాయనిక పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో ఓ కంపెనీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని గోదాములో నిల్వ ఉంచిన రసాయనాలకు మంటలు అంటుకోవడంతో భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రిజర్వ్ బ్యాంక్ టవర్స్‌లో చెలరేగిన మంటలు
-
రిజర్వ్ బ్యాంక్ టవర్స్‌లో చెలరేగిన మంటలు
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని బాంద్రాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం గమనించిన కొందరు వ్యక్తులు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్బీఐ టవర్స్‌లో మంటలు భారీగా ఎగసి పడుతున్నట్లు తెలుస్తోంది. 8 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రతయత్నిస్తున్నారు. ఈ ఘననకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజుపాళెంలో భారీ అగ్ని ప్రమాదం
గడ్డివాములు,తాటి తోపులు, పూరిల్లు దగ్ధం భయంతో పరుగులు తీసిన ప్రజలు రాజుపాళెం(కలువాయి) : మండలంలోని రాజుపాళెం గిరిజన కాలనీ సమీపంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక మహిళ తన తోటలోని చెత్తను తగులబెట్టడంతో గాలులకు తోట కట్టవకు నిప్పంటుకుంది. దీంతో సుమారు 500 మీటర్ల మేర తాటితోపులు అగ్నికి ఆహుతయ్యాయి. మామిడి తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తోటలకు ఆనుకునే ఉన్న గిరిజన కాలనీలో మల్లికార్జున పూరిల్లు కాలి బూడిదైంది. ఇంటిలోని ఆరు సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 10 వేలు నగదు సహా సర్వం అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిలిగారు. రోడ్డుకు మరో వైపున ఉన్న గుర్నాధం రాజు ఇంటి వద్ద ఐదెకరాల గడ్డివాములు తగలబడ్డాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో కాలనీలోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. సాయంత్రం వరకు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. పొదలకూరు నుంచి వచ్చిన అగ్నిమాపక యంత్రం మంటలను అదుపు చేసింది. అధికారుల పరామర్శ అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ నాగార్జునరెడ్డి, తహశీల్దార్ హమీద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృత్యుంజయులు..ఈ చిన్నారులు అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన మల్లికార్జున, నిర్మల దంపతులకు ప్రసాద్(4), మరో ఏడాది బిడ్డ సంతానం. పసిబిడ్డ ఉయ్యాలలో, ప్రసాద్ ఇంటిలో ఆడుకుంటూ ఉన్నారు. కాలనీ నుంచి వీరి ఇంటికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో మల్లికార్జున గ్రామంలో లేరు. ఇంటి బయట ఉన్న నిర్మల పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పసిబిడ్డలను బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఇల్లు కూలిపోయింది. దీంతో చిన్నారులు మృత్యుంజయులుగా బయటపడ్డారు. -
ఏవీఎమ్ స్టూడియో గోడ కూలి ఒకరి మృతి
చెన్నై: ఏవీఎమ్ స్టూడియోలో గోడ కూలి శనివారం రాత్రి ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని శిధిలాలను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేసవి ‘మంట’
శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు అగ్నికి ఆహుతి అవుతోంది. సూర్యభగవానుడి ప్రతాపానికి నల్లబంగారం బొగ్గవుతోంది. నిన్నా మొన్నటి వరకు వా ర్షిక ఉత్పత్తి లక్ష్య సాధన కోసం పెద్దయెత్తున బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణికి ఇప్పుడు ఆ బొగ్గును కాపాడటం పెద్ద సవాల్‌గా మారింది. అక్కడక్కడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. లక్ష్యం పూర్తయినా.. మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అన్ని గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి అయిన ఈ బొగ్గు సకాలంలో రవాణా కాకపోవడంతో సగం బొగ్గు స్టాక్ రూపంలో ఎక్కడిక్కడ నిలిచిపోయింది. గనులపై, సీహెచ్పీలపై ఉన్న కోల్‌యార్డులో గుట్టలను మరిపించే విధంగా కోల్ స్టాక్ ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలోనే బొగ్గు గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో కలిసి అక్సిడేషన్ అనే రసాయక చర్య జరిపి మండటం సహజ స్వభావం. ఇప్పుడు ఆ రసాయన చర్యకు ఎండలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో వేసవి తీవ్రతకు కోల్యార్డ్లలో అగ్గి రాజుకోవడం మొదలైంది. మే వస్తే మరింత ప్రమాదం ముంచుకొస్తుంది. బొగ్గు కాలిపోతే నాణ్యత పడిపోయి కంపెనీకి నష్టం వచ్చే ప్రమాదం నెలకొంది. ఆర్థిక సంవత్సరానికి మార్చి చివరి నెల కావడంతో అప్పటి వరకు ఉన్న లోటును మొత్తం పూడ్చుకోవడానికి పెద్దయెత్తున ఉత్పత్తి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి అంత కంటే ఎక్కువగానే కష్టపడాల్సి వస్తోంది. బెల్లంపల్లి రీజియన్‌లో 11.28 లక్షల టన్నుల స్టాక్.. బెల్లంపల్లి రీజియన్‌లోని మూడు ఏరియాల్లో 11.28 లక్షల టన్నుల స్టాక్ ఉంది. మొదటి మూడు క్వార్టర్లీ కంటే చివరి క్వార్టర్లలో ఎక్కువగా బొగ్గు వచ్చింది. పూర్తి యంత్ర సామర్థ్యం వినియోగించారు. కొత్త సీఅండ్ఎండీగా శ్రీధర్ వచ్చిన తరువాత మల్టీడిపార్టుమెంట్ కమిటీలు ఏర్పాటు చేసి కార్మికులను చైతన్యం చేయడంతో ఉత్పత్తి కుప్పులు తెప్పలుగా వచ్చింది. యంత్రాల పని గంటలను, మానవ శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా 8 భూగర్భ గనులు ఉన్న శ్రీరాంపూర్ ఏరియాల్లో అన్ని భూగర్భ గనులు 100 శాతం సాధించాయి. ఏరియా మొత్తం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యంలో 104 శాతం సాధించింది. మందమర్రి ఏరియా నిర్దేశించిన లక్ష్యంలో 78 శాతం, బెల్లంపల్లి ఏరియా 69 శాతం ఉత్పత్తి సాధించింది. మార్చి 31 వరకు కంపెనీ లెక్కల ప్రకారం శ్రీరాంపూర్ డివిజన్లో ఉత్పత్తి అయిన బొగ్గులో మొత్తం 5.48 లక్షల టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఇందులో సీహెచ్‌పీ కోల్‌యార్డు వద్ద 1.43 లక్షల టన్నులు, శ్రీరాంపూర్ ఓసీపీ వద్ద 3.76 లక్షల టన్నులు ఉండగా మిగితా భూగర్భ గనుల్లో అక్కడక్కడ కలిపి మొత్తం 36 వేల టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఇక మందమర్రి ఏరియాలో మొత్తం 3.5 లక్షల టన్నుల స్టాక్ ఉంది. ఇందులో ఓసీపీలోనే సుమారు 2.75 లక్షలు ఉండగా.. మిగిలింది అండర్ గ్రౌండ్ గనులు, సీహెచ్‌పీ వద్ద ఉంది. ఇక బెల్లంపల్లిలో 2.30 లక్షల టన్నుల నిల్వ ఉంది. నిల్వలకు కారణం ఎన్టీపీసీ.. స్టాక్ నిల్వలు పేరుకుపోవడానికి ప్రధాన కారణం ఎన్టీపీసీ. రామగుండం ఎన్టీపీసీకి సింగరేణి నుంచి బొగ్గు రవాణా జరుగుతుంది. ఒప్పందం ప్రకారం కంపెనీ సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉంది. అంతకంటే ఎక్కువగా ఎన్టీపీసీకి బొగ్గు అవసరం పడితే టన్నుకు రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జనవరి చివరి వారంలోనే 10 మిలియన్ టన్నుల రవాణా పూర్తయ్యింది. కానీ.. విద్యుత్ కొరత దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి మరింత బొగ్గు ఎన్టీపీసీకి అవసరం ఉంది. ఈ బొగ్గును సింగరేణి నుంచి తీసుకుంటే అదనంగా చెల్లించాల్సిన రూ.వెయ్యి భారం పడుతుండటంతో ఎన్టీపీసీ సింగరేణి బొగ్గును తీసుకోలేదు. సింగరేణి నుంచి సరఫరా చేసే బొగ్గు ధర కంటే ఇండోనేషియా వంటి ఇతర దేశాల నుంచి ఇంత కంటే తక్కువ ధరకు బొగ్గు రవాణా అవుతుండటంతో ఎన్టీపీసీ ఆ బొగ్గునే రెండు నెలలు రవాణా చేసుకుంది. ఫలితంగా రెండు నెలలుగా సింగరేణి ఎన్టీపీసీకీ రవాణా చేసే బొగ్గు నిలిచింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఒప్పందం ప్రకారం బొగ్గు రవాణా జరిగిన అది నామమాత్రంగానే తీసుకుంటున్నారు. దీంతో ఆ బొగ్గు నిల్వ రూపంలో కంపెనీ వద్దే పేరుకుపోయింది. దీనికితోడు శ్రీరాంపూర్ వంటి పెద్ద ఏరియాలో రోడ్డు మార్గాన వెళ్లాల్సిన బొగ్గు కూడా లారీ ట్రాన్స్పోర్టర్ల సమ్మెతో ఆటంకం కలిగింది. బొగ్గు మొత్తాన్ని సీహెచ్‌పీ (కోల్ హాండ్లింగ్ ప్లాంట్)కి తరలించారు. మంటలను అదుపు చేస్తేనే.. స్టాక్ కోల్‌ను వెంటవెంటనే రవాణా చేయడంతోపాటు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం సింగరేణికి ఉంది. పాత బొగ్గును తరలిస్తూ.. కొత్త బొగ్గు స్టాక్ చేస్తే ఫలితం ఉంటుంది. సీహెచ్‌పీ వంటి కోల్‌యార్డులో యార్డుల చుట్టూ నీటి పైపులు, ప్రత్యేక ఫైర్ ఫైటింగ్ సిస్టంతో మంటలు అదుపు చేస్తున్నా సత్ఫలితాల్విడం లేదు. ఎక్కువ కాలం స్టాక్ ఉన్నా, మంటలకు ఆహుతై.. గ్రేడ్ పడిపోయి క్వాలిటీ దె బ్బతిని కంపెనీకి ఆర్థికంగా నష్టం వస్తుంది. తరలింపు కష్టమే..? ఇదిలా ఉంటే ఇప్పుడున్న స్టాక్ రవాణా చేయాలంటే ప్రత్యేక చర్యలే తీసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనందునా ఎన్టీపీసీకి బొగ్గు రవాణా మెగురుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ స్టాక్‌ను వేసవి ముగిసే ముందే తరలించాలంటే సాధ్యమయ్యేలా లేదు. ఎక్కువగా సరుకు రవాణా వేసవిలోనే ఉంటుండడంతో కంపెనీ డిమాండ్‌కు తగ్గట్టు రైల్వే శాఖ రేకులు ఇవ్వదని అధికారులు అంటున్నారు. చివరికి నిన్నా మొన్నటి వరకు బొగ్గు తీయడానికి ఆరాటపడ్డ అధికారులకు.. ఇప్పుడు తీసిన బొగ్గును కాపాడుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. వేసవిలో సహజంగా బొగ్గు ఎక్కువగా అంటుకుంటుంది. దీని నివారణకు ఫైర్‌ఫైటింగ్ సిస్టంను అందుబాటులో ఉంచాం. యార్డుల చుట్టూ పైప్లైన్లు వేయించాం. ఎక్కడైనా బొగ్గు తగలబడిందంటే వెంటనే ఆర్పివేయడంతోపాటు దాన్ని ఎత్తి మరో చోట పోయిస్తున్నాం. ఎన్టీపీసీలో కొత్త ఒప్పందం మొదలవడంతో స్టాక్ వెంట వెంటనే రవాణా చేయాల్సి వస్తోంది. రేకుల సరఫరా పెరిగితే రెండు నెలల్లో ఉన్న స్టాక్ క్లియర్ అవుతుంది. అప్పటి వరకు ఎలాంటి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. - ఎస్డీఎం సుబాని, జీఎం శ్రీరాంపూర్ -
అబలలు కాదు... అగ్గి రవ్వలు
తన పవిత్రతను నిరూపించుకోవడానికి నాడు అగ్నిపరీక్షకు తల వంచింది సీతాదేవి. తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి నేడు రోజూ అగ్నికి ఎదురెళ్తున్నారు జైపూర్ మహిళలు. మగవాళ్లు మాత్రమే చేయగలరు అనుకునే ఫైర్ ఫైటింగ్‌ని తామూ చేయగలమంటూ బరిలోకి దిగుతున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు! ఎక్కడ కాస్త నిప్పు ఎగసినా వెంటనే ఫైర్ స్టేషన్లో ఫోన్ మోగుతుంది. తక్షణం నలుగురైదుగురు పురుషులు ఫైరింజన్‌తో ప్రమాద స్థలానికి పరుగులు తీస్తారు. ఇది ఎన్నో యేళ్లుగా అందరూ చూస్తున్న దృశ్యం. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఓ స్టేషన్లో కూడా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. కానీ అక్కడ పురుషుల స్థానంలో మహిళలు ఉంటారు. కబురు అందిందే తడవుగా అగ్నితో చెలగాట మాడటానికి సమాయత్తమై వెళ్తారు. సాహసమే ఊపిరిగా... ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం 155 మంది ఫైర్ సిబ్బందిని నియమించుకుంది. అయితే వాళ్లందరూ మహిళ లే కావడం విశేషం. మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించి, వారికి జీననభృతిని ఏర్పరచాలనే ఉద్దేశంతో పాటు... తలచుకుంటే మహిళలు ఏ పని అయినా చేయగలరు అని నమ్మడం వల్లే వారిని ఈ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని రాజస్థాన్ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. వారి నమ్మకం నిజమే అయ్యింది. ఫైర్ విభాగంలో నియమితులైన మహిళలంతా తమ సత్తా చాటుతున్నారు. ప్రాణాలకు తెగించి అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. నిజానికి ఫైర్ విభాగంలో పని చేయడం అంత తేలికేమీ కాదు. బరువైన పరికరాలను ఎత్తాల్సి ఉంటుంది. వాటిని పట్టుకుని పరుగులు తీయాల్సి ఉంటుంది. మంటల వేడిని తట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మంటల్లో చిక్కుకుపోతే, వారిని కాపాడేందుకు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో భవంతులు ఎక్కడం, ప్రమాదకర పరిస్థితుల్లో పైనుంచి దూకడం వంటి సాహసాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి. కానీ మహిళలేమో సున్నితత్వానికి ప్రతీకలాయె. అందుకే తొలుత విధులు కాస్త కష్టంగానే ఉండేవి అంటారు సునీత. ‘‘విధులేంటి... అసలు మా శిక్షణే చాలా కఠినంగా అనిపించేది. కొందరైతే ఆయాసపడిపోయేవారు. కష్టంగా ఫీలయ్యేవారు. వదిలేసి వెళ్లిపోదామనుకున్నవారూ ఉన్నారు. కానీ మా విధుల నిర్వహణకు అవసరమైన దృఢత్వాన్ని సంపాదించాలన్నా, మేమేంటో చూపించాలన్నా అలాంటివన్నీ అధిగమించక తప్పదు కదా’’ అంటారామె. నిజమే. అవరోధాలను అధిగమిస్తేనే అనుకున్నది సాధించేది. అలా అధిగమించారు కాబట్టే ఈ మహిళలందరి గురించీ ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటోంది. సీత, సునీత, మనోజ్, నిర్మా, నిర్మల తదితరులను చూసి శభాష్ అంటోంది. ‘‘మా మహిళా ఉద్యోగులంతా ఎంతో చక్కగా పని చేస్తున్నారు. నిజాయతీతో, నిబద్దతతో వ్యవహరిస్తారు. పెద్ద పెద్ద ప్రమాద సమయాల్లో సైతం నిర్భయంగా నడచుకోవడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అంటారు చీఫ్ ఆఫీసర్ ఈశ్వర్. అందుకే కదా మరి... ఈ లేడీ ఫైర్ ఫైటర్స్‌ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా మహిళలకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నాయి! వారి ఆలోచన ఆచరణలోకి వస్తే బహుశా త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా ఫైర్ ఫైటర్స్ దర్శనమి స్తారు. ఆడది అబల కాదన్న నానుడిని బల్లగుద్ది చెబుతారు! -
ఫైర్ ‘సేఫ్టీ’ ఏదీ?
⇒ అగ్నిప్రమాదాల నివారణలో అధికారుల వైఫల్యం ⇒ అరకొర వసతులతో ఫైర్ విభాగం సతమతం ⇒ సకాలంలో స్పందించలేకపోతున్న సిబ్బంది ⇒ 45 కిలోమీటర్ల దూరం నుంచి ఫైరింజన్ల రాక ⇒ అప్పటికే బుగ్గిపాలవుతున్న ఆస్తులు మెహదీపట్నం: అగ్ని ప్రమాదాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. ఎన్నిమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదు. తాజాగా ఆదివారం విజయ్‌నగర్‌కాలనీలోని ఐటీఐ గిల్డ్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఫైర్, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, కార్మిక శాఖ విభాగాల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు. ప్రమాదం చోటుచేసుకోక ముందే ఇలాంటి వర్క్‌షాపుల వద్ద పాటించాల్సిన భద్రతా చర్యలపై ఏ ప్రభుత్వ శాఖ కూడా స్పందించలేదు. గౌడాన్స్లు, వర్క్‌షాపుల యజమానులు పాటించాల్సిన కనీస నిబంధనలను సైతం కనిపెట్టలేకపోయారు. కనీసం ప్రమాదం చోటుచేసుకున్న కొద్ది నిముషాలలో మంటలు ఆర్పేందుకు సరైన వసతులు ఫైర్ విభాగం వద్ద లేవు. చాలిచాలనీ సిబ్బంది, అరకొర ఫైరింజన్లతో కుంటుతున్న ఫైర్ విభాగం దీనస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఫైర్ విభాగానికి సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే తగిన సమయంలో తగిన విధంగా సిబ్బంది స్పందించి వేగవంతంగా మంటలను ఆర్పేస్తారు. ఆదివారం సాయంత్రం 4.45 గంటలకు చిన్నపాటి అగ్నిప్రమాదమే చోటుచేసుకుంది. ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి వచ్చినా, వారివద్ద తగినన్ని వాహనాలు లేకపోవడంతో మంటలను ఆర్పడం కష్టమైంది. ఒక మూలన మంటలను అదుపు చేస్తుంటే మరో వైపునుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రాత్రి 8.45 గంటలకు మంటలు పూర్గిగా అదుపులోకి వచ్చాయి. తగినన్ని ఫైరింజన్లు నగరంలోనే ఉంటే గంట వ్యవధిలో మంటలను అదుపులోకి తేవచ్చు. విజయ్‌నగర్ కాలనీలోని ఘటనా స్థలానికి నగరానికి 45 కిలో మీటర్ల దూరంలో నున్న స్టేషన్ల నుంచి ఫైరింజన్లను రప్పించాల్సి వచ్చింది. నగరం నడిబొడ్డున ఫైరింజన్లు లేకపోవడంతో సనత్‌నగర్, ఇబ్రహీంపట్నం నుంచి కూడా ఫైరింజన్లను రప్పించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రమాదం చోటుచేసున్న నిముషాల వ్యవధిలోనే నాలుగైదు ఫైరింజన్లు వచ్చివుంటే ఇంత పెద్ద భారీ స్థాయిలో ప్రమాదం చోటుచేసుకునేది కాదు. ఇక అదృష్టవశాత్తు ఐటీఐ గిల్డ్‌కు నాలుగు వైపులా రహదారులే ఉన్నాయి. రహదారి దాటిన తరువాతనే కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఐటీఐ గిల్డ్‌కు ఈ బస్తీలు ఆనుకుని ఉంటే నాలుగు గంటల పాటు ఎగిసిన మంటలకు బస్తీలు కూడా బుగ్గిపాలయ్యేవి. ఐటీఐ గిల్డ్‌కు ఆనుకునే చిన్న పిల్లల స్పెషాల్టీ దవాఖానా ఉంది. ఘటన సమయంలో ఇందులో ఉన్న రోగులు బయటికి పరుగులు తీశారు. పొగతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. -
సమస్యల ఫైర్
శీతాకాలం వెళ్లి ఎండాకాలం వచ్చేసింది. భానుడు తన ప్రచండ రూపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో అగ్ని ప్రమాదాలూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అయితే వీటి నివారణకు ప్రభుత్వ పరంగా చర్యలు చాలా తక్కువగా ఉన్నాయి. అధికారులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలన్నీ సమస్యలతో సతమతమవుతున్నాయి.ఫైరింజన్ల కొరత వేధిస్తోంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. సమాచారం అంది సకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నా నీటి ఎద్దడితో నష్టాన్ని తగ్గించలేకపోతున్నారు. కర్నూలు(రాజ్‌విహార్): ‘ఇల్లు కాలిన ఆరు నెలలకు ఫైర్ ఇంజిన్ వచ్చింది’ అన్నట్లు తయారైంది జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల పరిస్థితి. తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతున్నా జిల్లా అధికారులు మేల్కోవడం లేదు. నిబంధనల ప్రకారం 50వేల మంది జనాభకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి. అయితే జిల్లాలో 12 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 15 వాహనాలు, మరో రెండు చిన్న వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 40.40లక్షల జనాభా ఉంది. నిబంధనల ప్రకారం జిల్లాకు 81 అగ్నిమాపక కేంద్రాలు ఉండాలి. కాని ఉన్నవి 12 మాత్రమే. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసినా 54 కేంద్రాలు ఉండాల్సి ఉంది. కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణ కేంద్రాల్లో రెండేసి వాహనాలు ఉండగా శ్రీశైలం, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ పట్టణాల్లో ఒక్కో అగ్ని మాపక కేంద్రం ఉంది. నందికొట్కూరు, కోవెలకుంట్ల పాణ్యం, మంత్రాలయంలో ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించినా ఇప్పటివరకు ప్రభుత్వం మంజూరు చేయలేదు. జిల్లాలో అనుబంధంగా ఎక్కడా ఆంబులెన్స్‌లు లేకపోవడం గమనార్హం. సొంత భవనాల్లోనే కేంద్రాలు ఉన్నప్పటికీ ఆదోని, నంద్యాల స్టేషన్లు శిథిలావస్థకు చేరాయి. ఆలూరు, ఆదోని, ఆళ్లగడ్డలోని వాహనాలు పదేళ్లకు పైబడి సేవలందిస్తూ పాతబడ్డాయి. దీంతో ఈ వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి.జిల్లాలో ఆలూరు, డోన్, పత్తికొండ, శ్రీశైలం, ఆళ్లగడ్డ కేంద్రాల్లో నీటి సమస్య వెన్నాడుతోంది. ప్రమాదం జరిగితే సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని నింపుకొని రావాల్సిన పరిస్థితి. పలు ప్రాంతాల్లో 10కిలో మీటర్లకు పైగా దూరం వెళితేకాని నీరు లభించని పరిస్థితి. నియోజకవర్గ కేంద్రాలైన పాణ్యం, మంత్రాలయం, నందికొట్కూరులో ఫైర్ స్టేషన్లు లేకపోవడం శాపంగా మారింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తులు, ప్రాణాలకు భద్రత ఉండని పరిస్థితి ఉంది. కర్నూలు నుంచి ఆత్మకూరు మధ్యలో 75 కిలోమీటర్లు, కర్నూలు-నంద్యాల మధ్య 72 కిలో మీటర్ల దూరం ఉంది. మధ్యలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయలేదు. మంత్రాలయంతోపాటు గ్రామీణ ప్రాంతాల తాకిడి ఎక్కువగా ఉన్న కోవెలకుంట్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ఎంతైనా ఉంది. - ప్రస్తుతం ఉన్న ఫైరింజన్లకు తగ్గట్లు 155 మంది ఫైర్మెన్లు ఉండాలి. కాని 116 మంది మాత్రమే ఉండడంతో 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 44 మంది డ్రైవర్లకు 38 మంది ఉన్నారు. దీంతో హోం గార్డులతో కాలం సాగదీస్తున్నారు. అన్నిమాపక శాఖలో నిధుల కొతర వేధిస్తోంది. 2014-15 వార్షిక సంవత్సరానికి గాను రూ.80లక్షలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.45.71లక్షలు మాత్రమే ఇచ్చారు. మరో 20 శాతం ట్రెజరీలో ఫ్రీజ్ అయ్యాయి. రూ.23లక్షలు మంజూరు కాకపోవడంతో ఆరు నెలలుగా వేతనాలు అందన హోం గార్డులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సహకారం అవసరం : అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా తీసుకోవాలి. మంట ప్రారంభమైన వెంటనే ఆర్పేందుకు కృషి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆలస్యం చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు మంటలు పెద్దగా వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రం కావచ్చు. ప్రస్తుతానికి ఆలూరు తప్ప అన్ని కొత్త వాహనాలే. నందికొట్కూరు, కోవలకుంట్ల, పాణ్యం, మంత్రాలయంలలో ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. ఎం. భూపాల్‌రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్. -
షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం
మంగపేట(వరంగల్): వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం రాజుపేట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ షాపు దగ్ధమైంది. కెనరా బ్యాంకు పక్కన ఇక్బాల్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు బాధితుడు ఇక్బాల్ తెలిపాడు. -
నంద్యాలలో టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో దుకాణంలో నిల్వ చేసిన టైర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏవోబీలో కూంబింగ్ ముమ్మరం
ఖమ్మం : ఖమ్మం జిల్లా మర్రిమళ్ల అటవీప్రాంతంలో గ్రేహౌండ్స్ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం వద్ద మావోయిస్టులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం దోనుబాయి అటవీప్రాంతంలో గ్రైహౌండ్స్ దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఇటు పోలీసులు... అటు మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో గిరిజనులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా గిరిజన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల రాకపోకలను అధికారులు నిషేధించారు. -
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్
విశాఖ : ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చిత్రకొండ కటాఫ్ ఏరియాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా ఎదురు కాల్ప్లుల్లో ఆంద్రా గ్రేహౌండ్స్, ఒడిశా ఎస్వోటీ పోలీసులు పాల్గొన్నారు. మరోవైపు విశాఖ మన్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ కాల్పుల్లో 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
ఒంగోలు డైరీలో అగ్నిప్రమాదం
ప్రకాశం: జిల్లాలో ఒంగోలు డైరీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఫైర్ ఫైటర్స్
నిప్పురవ్వ తాకితేనే ఒళ్లు చురుక్కుమంటుంది. అలాంటిది ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఎదురొడ్డి నిలబడతారు వాళ్లు. జలఖడ్గంతో అగ్గిబరాటాలపై విరుచుకుపడతారు. మంటల్లో చిక్కుకున్న ప్రాణాలను తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షిస్తారు. అగ్గిలో బుగ్గిపాలవుతున్న ఆస్తిని కాపాడతారు. తరచూ రెస్క్యూ ఆపరేషన్స్‌తో రిస్క్ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది అంటే మనపాలిట ఆపద్బాంధవులు. ఈ ఫైర్ ఫైటర్స్‌ను సాక్షిసిటీప్లస్ తరఫున నటుడు బ్రహ్మాజీ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. బ్రహ్మాజీ: మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పండి..? వెంకన్న: రోజు వందకుపైగా ఫేక్ కాల్స్ వస్తుంటాయి సార్. కొందరు ఆకతాయిలు పదే పదే ఫోన్ చేస్తుంటారు. బ్రహ్మాజీ: ఇంతకన్నా సిగ్గుచేటు విషయం ఇంకోటి లేదండి. ఫేక్ కాల్ చేయడానికి ఇంతకన్నా గొప్ప నంబర్ దొరకడం లేదా జనాలకి. మన ప్రాణాలతో మనమే చెలగాటం ఆడుతున్నాం. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. గురుమూర్తి: మాకు ఇంకో ఇబ్బంది ట్రాఫిక్ సార్. అంబులెన్స్‌కి ఇచ్చినంత సులువుగా మాకు దారి చూపరు. బ్రహ్మాజీ: ట్రాఫిక్ వారికి సమాచారం ఉంటుంది కదా! వారు క్లియర్ చేయొచ్చు కదా! గురుమూర్తి: అంబులెన్స్ వరకూ వారికి సమాచారం ఉంటుంది కానీ మా కోసం ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేకంగా ఏమీ చేయరు. మేం కూడా వేగంగా దూసుకుపోడానికి లేదు. బ్రహ్మాజీ: మీరు పరిగెత్తేది కూడా ప్రాణాలు కాపాడటానికే కదా.. మీకు అలాంటి వెసులుబాటు లేకపోవడం ఏంటి ? గురుమూర్తి: ట్రాఫిక్ సంగతి పక్కన పెట్టండి సార్. ప్రజల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ ఉండదు. మాదాపూర్ ప్రాంతంలో అయితే కుర్రాళ్లు మా వెహికల్స్ ముందు కట్లు కొట్టుకుంటూ వెళ్తుంటారు. బ్రహ్మాజీ: చదువుకున్న వాళ్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. బ్రహ్మాజీ: నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ అంటే చాలా ఇష్టం. ఈ డిపార్ట్మెంట్లో ఫైర్ సర్వీసంటే మరింత మక్కువ. ఈ రోజు ఇలా పలకరించే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వి.నాగార్జునరెడ్డి: మీరు ఎంతో ఇష్టంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మేం కూడా హ్యాపీగా ఫీలవుతున్నాం. బ్రహ్మాజీ: చిన్న డౌట్.. మీ యూనిఫాం, పోలీసుల యూనిఫాం ఒకేలా ఉంటాయి. తేడా ఎలా తెలుసుకోవాలి? వి.నాగార్జునరెడ్డి: మామూలు పోలీసులకు షోల్డర్కప్స్పై స్టార్లు ఉంటాయి. మాకు ఇంప్లాంట్స్ ఉంటాయి. బోరులో నుంచి నీళ్లు తోడేటప్పుడు పైపులో ఉండే ఇంప్లాంట్స్ సింబల్సే మా భుజాలపై కనిపిస్తాయి. బ్రహ్మాజీ: ఓ.. నాకే కాదు చాలామందికి ఈ విషయం తెలియదు. ఫైర్వ్యాన్లో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉంటారు సార్? వెంకన్న: ఐదుగురు వరకూ ఉంటారు. ఒకరు లీడింగ్ ఫైర్‌మెన్ మరో ముగ్గురు ఫైర్మెన్లు, డ్రైవర్ ఉంటారు. ప్రమాద తీవ్రత ఎక్కువున్నప్పుడు రెండు మూడు వాహనాలు వెళ్తాయి. బ్రహ్మాజీ: మీరు డిపార్ట్మెంట్కి వచ్చి ఎన్నాళ్లయింది? యాదగిరి: నేను లీడింగ్ ఫైర్‌మెన్‌గా పనిచేస్తున్నాను. ఇష్టంతో వచ్చినవాళ్లే ఇక్కడ ఎక్కువ రోజులు పనిచేయగలుగుతారు. ప్రాణాలను రక్షించే అవకాశం రావడం అదృష్టంగా భావించాలి. నేను ఇప్పటి వరకూ 200 ఫైర్ ఫైటింగ్స్ చేసి ఉంటాను. బ్రహ్మాజీ: ఫీల్డ్‌లో మీకెదురైన చేదు అనుభవం గురించి చెబుతారా? యాదగిరి: కొన్నాళ్ల క్రితం జీడిమెట్లలో ఒక కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అయింది సార్. మేం చేరుకునే సరికి చాలా నష్టం జరిగింది. ఒక గదిలో ముగ్గురు మృతిచెందారు. రియాక్టర్ సమీపంలో ఉండటంతో శరీరాలు ముక్కలు ముక్కలుగా తెగిపడ్డాయి. ఆ దృశ్యం చూడలేకపోయాను. ఆ రక్తపుముద్దలను తీసి అంబులెన్స్‌లో మార్చురీకి చేర్చాం. బ్రహ్మాజీ: ప్రాణాలు కాపాడిన సందర్భాలు.. పి.నాగభూషణమ్: మొన్నీమధ్యే మాదాపూర్ పరిధిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడికి సమయానికి చేరుకుని మా ప్రాణాలకు తెగించి పన్నెండు మందిని కాపాడాం. వి.నాగార్జునరెడ్డి: నేను జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా చేస్తున్నాను. 2005లో పంజగుట్టలోని ఒక జ్యువెలరీ షాపులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. నాలుగు ఫైర్వ్యాన్లతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. ఐదంతస్తుల బిల్డింగ్. ఒక వైపునే ఓపెన్ ప్లేస్ ఉంది. మిగతా మూడు వైపులా చీమ దూరే సందు కూడా లేదు. ఒకవైపు ఉన్న డోర్స్ బ్రేక్ చేసి నీళ్లు చిమ్ముతున్నాం. ఎన్ని నీళ్లు పోసినా మంటలు అదుపులోకి రావడం లేదు. తెల్లవారే వరకూ నీళ్లు పోస్తూనే ఉన్నాం. తెల్లారాక ఐదో అంతస్తులో ఐదుగురు చనిపోయి కనిపించారు. దగ్గరగా ఉండి కూడా వారి ప్రాణాలు కాపాడలేకపోయామని ఆ క్షణం చాలా బాధపడ్డాం. బ్రహ్మాజీ: అడుగుల దూరంలో మీరు ఉండి కూడా ఏమీ చేయలేకపోడానికి మొదటి కారణం? వి.నాగార్జునరెడ్డి: ఫస్ట్ థింగ్. ఆ బిల్డింగ్ చుట్టూ మా వెహికిల్ తిరిగే ప్లేస్ లేదు. కొద్ది ప్లేస్ ఉన్నా అన్ని కిటికీలు పగలగొట్టేవాళ్లం. లోపల ఉన్నవారి కేకలు వినిపించేవి. కమర్షియల్ కాంప్లెక్స్‌లు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. బ్రహ్మాజీ: పొగ వస్తుంటే మీరు లోపలికి వెళ్లి రెస్క్యూ చేసే అవకాశం ఉండదంటారా? వెంకన్న: ఏ చిన్న అవకాశం ఉన్నా.. వెనుకంజ వేసే ప్రసక్తే ఉండదు. మనిషి ప్రాణాలకు మంట వల్ల ఎంత ప్రమాదమో.. పొగ కూడా అంతే ప్రమాదకారి. బ్రహ్మాజీ: ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో.. ఏమైనా చిట్కాలు చెప్తారా? వి.నాగార్జునరెడ్డి: ముందుగా ఇంట్లో పొగ వస్తే ఎవరూ కూడా నిలబడి ఉండకూడదు. నేలపై పడుకోవాలి. వీలైతే తడిబట్టని ముక్కు దగ్గర పెట్టుకుంటే కార ్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. లేదంటే ఐదు నిమిషాల్లో స్పృహ కోల్పోతారు. బ్రహ్మాజీ: అలాగా.. ఇరుకు సందుల్లోకి మీరు వెళ్లాల్సి వచ్చినపుడు.. ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? ఆర్.ఎ.కురేష్: మామూలుగా ఉండవు సర్ మా పాట్లు. మా వెహికిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. వెళ్లే మార్గాలు నాలుగైదు అడుగుల వెడల్పు కూడా ఉండవు. అలాంటప్పుడు వాటర్ పైపులను జాయింట్ చేసుకుంటాం. బ్రహ్మాజీ: హైదరాబాద్‌లో ఎన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయండి ? ఆర్.ఎ కురేష్: మొత్తం 20 స్టేషన్లు ఉన్నాయి. బ్రహ్మాజీ: అసలు ఎన్ని ఉండాలి? తగరం వెంకన్న: లెక్క ప్రకారం 100 ఉండాలి. నిజాం జమానాలో ఆరు స్టేషన్లు ఉండేవి. ఇప్పుడవి 15కు చేరింది. ఈ మధ్యే మరో ఐదింటిని మంజూరు చేశారు. ఇక వెహికిల్స్ 20 వరకూ ఉన్నాయి. పెద్ద వెహికిల్స్ అంటే బ్రాంటో స్కైలిఫ్ట్ వెహికిల్స్ రెండు ఉన్నాయి. వాటి ప్రత్యేకత పాతిక అంతస్తుల బిల్డింగ్‌ని మొత్తం కవర్ చేయగలవు. బ్రహ్మాజీ: నేను కూడా ఎవరో చెబితే విన్నాను. యాభైవేల మంది జనాభాకి ఒక ఫైర్‌స్టేషన్ ఉండాలట! వెంకన్న: నిజమే. బ్రహ్మాజీ: మరి ప్రమాదం జరిగినప్పుడు జనాలు ఎలా స్పందిస్తుంటారు? గురుమూర్తి: ఇదేముంది సార్, ఫైర్ యాక్సిడెంట్ అయిందని మాకు ఫోన్ చేస్తారా..! మళ్లీ మేం అడ్రస్ తెలుసుకుందామనుకుంటే.. ఆ ఫోన్ ఎంగేజ్ వస్తుంటుంది. మేం ఘటనాస్థలికి చేరుకునే సరికి కనీసం అక్కడ అడ్డంగా ఉన్న కార్లు, బైకులు అయినా తీసి కాస్త దూరంగా పెట్టరు. బ్రహ్మాజీ: నిజమే.. చాలామంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మారాలని కోరుకుందాం. మన ఫైర్ డిపార్ట్మెంట్కి ప్రజల సహకారం, ప్రభుత్వం అండ పూర్తి స్థాయిలో ఉంటుందని ఆశిద్దాం. -
వరంగల్ జిల్లాలో అగ్నిప్రమాదం
వరంగల్: పర్వతగిరి మండలం ఏనిగల్లు శివారులోని పంచరాయి తండాలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ రెండు పూరిగుడెసెలు నిప్పుంటుకుని దగ్ధమైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. -
లంకాపట్నంలో జనపనార గోడౌన్లో అగ్నిప్రమాదం
విజయనగరం: జిల్లాలోని లంకాపట్నంలో జనపనార గోడౌన్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిల్వ ఉంచిన ముడిసరుకు మంటల్లో తగలబడుతున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. -
ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం
-
ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం
పటాన్చెరు : పటాన్చెరు మండలం ముత్తంగి ఎస్బీఐలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు ఎగసిపడటంతో బ్యాంక్‌లోని పలు ఫైళ్లు, కంప్యూటర్లు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. మరోవైపు మంటలు స్టాంగ్ రూమ్‌కు వ్యాపించకపోవటంతో నగదు, ఆభరణాలు, పలు కీలక ఫైళ్లు భద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
పటాన్చెరు ముత్తంగి ఎస్బీఐలో స్వల్ప అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని పటాన్చెరు మండలం ముత్తంగి ఎస్బీఐలో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో బ్యాంక్‌లోని పలు పైళ్లు దగ్ధమైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి భద్రత
నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం: సీఎం కేసీఆర్ ‘కేబీఆర్ కాల్పుల’ ఘటనలో నిందితుడి అరెస్టు హైదరాబాద్: హైదరాబాద్‌లో కేబీఆర్ పార్కు వద్ద జరిగిన కాల్పుల ఘటనలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని కొద్ది గంటల్లోనే గుర్తించి, అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నగరంలో కొద్దిపాటి సీసీ కెమెరాల సాయంతోనే పోలీసులు అనేక కేసులు ఛేదించారంటూ అభినందించారు. హైదరాబాద్‌లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నిఘా కెమెరాల్లో వచ్చే సమాచారాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా నగరంలో అంతర్జాతీయ స్థాయి ‘కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అరబిందో ఫార్మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనను వివరిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. శాంతిభద్రతలపై రాజీపడబోమన్నారు. అందులోని అంశాలివీ.. ‘‘కాల్పుల ఘటనలో ఒక ఆగంతకుడు ఏకే-47 రైఫిల్‌తో అరబిందో ఫార్మా కంపెనీ యజమాని కంభం నిత్యానందరెడ్డిని డబ్బు డిమాండ్ చేసినపుడు జరిగిన పెనుగులాటలో కాల్పులు జరిగాయి. బంజారాహిల్స్ పోలీసు లు ఐపీసీ 307, 364ఏ, 511 సెక్షన్ల కింద, ఆయుధ చట్టం-25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ కేసును సవాలుగా తీసుకొని అతన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. గుర్తించిన 24 గంటల్లోనే నిందితుడిని వెంటాడి కర్నూలులో అరెస్టు చేశారు. అతని పేరు పి.ఓబులేసు. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన అతడు కర్నూలులోని రెండో బెటాలియన్‌లో 1998లో కానిస్టేబుల్‌గా నియమితుడయ్యాడు. 2002 నుంచి 2014 మార్చి 14 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశాడు. అందులో పనిచేస్తున్నపుడే ఏకే-47 రైఫిల్ చోరీ జరిగినట్లు తేలింది. కీలకమైన ఆధారం సీసీటీ వీ ఫుటేజ్ ద్వారా లభించింది. దానిద్వారానే నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత చర్యల్లో భాగంగా నగరమంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చే సేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించి, మంజూరు చేశాం. రూ.150 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పోలీసు వ్యవస్థ, అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించేందుకు త్వరలో పునాది వేస్తాం. కాల్పుల ఘటనలో నిందితుడికి శిక్ష పడేలా పక్కా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ కేసును రికార్డు సమయంలో ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నాం’’ -
వనం.. ఖాకీమయం
కాల్పుల ఘటనతో పోలీస్ అలర్ట్ కేబీఆర్ పార్కు వద్ద భారీ బందోబస్తు రక్షక్, స్పెషల్ వాహనాలలో గస్తీ అడుగడుగునా పోలీసులే... సడలని ధీమా...పార్కుకు తగ్గని రద్దీ బంజారాహిల్స్: కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజు...కేబీఆర్ పార్కులో సీన్ మారింది. నిన్నటిదాకా వందలకొద్ది వాకర్లు మాత్రమే నడిచే వాక్‌వే కనిపించేది. కానీ గురువారం అందుకు భిన్నంగా అడుగడుగునా ఖాకీలు కనిపించారు. బుధవారం ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు ఏకే-47తో కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి భద్రతపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్వ యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలుగజేసుకోవాల్సి వచ్చిం ది. పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాల్‌గా తీసుకున్నారు. నిన్నమొన్నటిదాకా ఒక్క హోంగార్డు కూడా తిరగని ఈ పార్కు వద్ద గురువారం తెల్లవారుజామున నాలుగు గంట ల నుంచే భారీగా పోలీసులను మోహరించారు. హోంగార్డు స్థాయి నుంచి అధికారి వరకు పార్కు చుట్టూ రౌండ్లేశారు. సాయుధ బలగాల మోహరించాయి. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త పోలీసు వాహనాలు సుమారు 12 వరకు పార్కు చుట్టూ రౌండ్లు కొట్టాయి. వీటికి తోడు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా రక్షక్ వాహనాలను రప్పించారు. వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ నాగరాజు, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐలు పార్కు చుట్టూ నిఘా ఉంచారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. పోలీసులకు తగిన సూచనలు జారీ చేశారు. మొత్తానికి కేబీఆర్ పార్కు పోలీసు దిగ్బంధంలో ఉండిపోయింది. నిఘా మధ్య సామాన్యులు, వీఐపీలు, వీవీఐపీలు వాకింగ్ చేయాల్సి వచ్చింది. -
భయం..భయం
బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనపై వాకర్లను భయాందోళనకు గురిచేసింది. పార్కులో సుమారు రెండువేల మంది వాకింగ్ చేస్తున్న సమయంలో ఇది జరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. పార్కు బయట పోలీసు బందోబస్తు లేకపోవడం వల్లనే వాకర్లకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీవీఐపీలు ఈ పార్కులో వాకింగ్ చేస్తుంటారు. కాల్పులు జరిగిన సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, ఆభరణాల వ్యాపారులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్కు లోపల ఉన్నారు. దీనికి తోడు పలువురు సినీ ప్రముఖులు కూడా వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏ మాత్రం భద్రత లేదని...కనీసం మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేసిన పాపానపోలేదని పార్కు నిర్వాహకులపై వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడే పోలీసులు, అధికారులు హడావుడి చేస్తారు తప్పితే భద్రతను గాలికి వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. కేబీఆర్ పార్కు చుట్టూ పలు ప్రాం తాలను ఎంచుకొని నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ దిశలో చర్యలు తీసుకోలేదు. అంతేకాదు పార్కును అటవీ శాఖ నిర్వహిస్తుండగా పార్కు బయట ప్రాం తాన్ని హెచ్ఎండీఏ ఆధీనంలో ఉంచుకుంది. పార్కు బయట రోడ్డును పోలీసులు నియంత్రిస్తున్నారు. ఈ మూడు శాఖల మధ్య ఏ మాత్రం సమన్వయం లేదు. పార్కులోపల పోలీసులను నిఘాలో ఉంచుతామని పలుమార్లు బంజారాహిల్స్ పోలీసులు సూచించినా నిర్వాహకులు మాత్రం అందుకు అనుమతించలేదు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగవని గ్యారెం టీ లేదంటూ వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘూ పెంచాలి.. కేబీఆర్ పార్కు వద్ద భద్రత పెంచాలి. ఈ వ్యవహారంపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. వేలాది మంది వాకర్లు నడిచే పార్కు వద్ద ఏకే 47 గన్‌తో ఒక ఆగంతకుడు కాల్పులు జరిపాడంటే భద్రత ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. - కారుమూరి వెంకట నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే భద్రత లేకుండా పోయింది.. పార్కు బయట అవుట్‌పోస్టు ఉండేది. ఇటీవల దాన్ని తొల గిం చారు. దీంతో ఇక్కడ పోలీసులు లేకుండా పోయారు. ఇటీవల ఇక్కడ కార్లలో దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. పర్సులు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు తస్కరించిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొబైల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అవుట్ పోస్టును పునరుద్దరించాలి. - జయవీర్‌రెడ్డి, కేబీఆర్ పార్కు సెక్రటరీ భయమేస్తోంది.. నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారం మాలో తీవ్ర భయాన్ని రేకెత్తించింది. ఇక్కడ పోలీసు నిఘా ఉండి ఉంటే ఆగంతకుడు దొరికేవాడు. ఉదయం పూట ఈ సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. అందులోనూ ఏకే 47తో ఆగంతకుడు కేబీఆర్ పార్కు వద్ద సంచరించిన విషయం తలుచుకుంటేనే భయమేస్తుంది. - సీఎస్‌రెడ్డి, వాకర్ -
వరంగల్ జిల్లాలో బ్యాంకులో అగ్నిప్రమాదం
వరంగల్: జిల్లాలోని చేర్యాలలోని ఓ బ్యాంక్‌లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులోని పర్నిచర్, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమైయ్యాయి. పోలీస్ పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. బ్యాంకులో నుంచి వస్తున్న మంటలు ఎగసిపడుతుండటంతో పోలీసులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులో తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. -
నిప్పురాజుకుంటే ఫోన్ చేయండి
చిత్తూరు (అర్బన్): దీపావళి పండుగ అంటే అందరికీ ఆనందం. అయితే టపాకాయల మధ్య ఏ చిన్న నిప్పురవ్వ పడ్డా ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. జిల్లాలో 15 చోట్ల అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. వాటి ఫోన్ నెంబర్లు, ఆయా కేంద్రాల అధికారుల పేర్లు ఇలా ఉన్నాయి. కార్యాలయం, అధికారి పేరు ల్యాండ్ లైన్ మొబైల్ నెంబర్ చిత్తూరు -ప్రవీణ్‌కుమార్ 08572 -228101 9963735497 కుప్పం-వెంకటరమణ 08570 -255099 9963736524 మదనపల్లె-శంకరప్రసాద్ 08571 -222101 9963735597 ములకలచెరువు-ఉత్తమరెడ్డి 08582 -232555 9963736976 నగరి -దుర్గాప్రసాద్ 08577 -200101 9963737024 పాకాల-రాజగోపాల్‌రెడ్డి 08585 -222101 9963736957 పలమనేరు -చలపతి 08579 -252399 9963735975 పీలేరు -జిలాన్‌ఖాన్ 08584 -244399 9963736587 పుంగనూరు-హేమంత్‌రెడ్డి 08581 -200399 9963736640 పుత్తూరు-విజయకుమార్ 08577 -221699 9963735763 సత్యవేడు-జయరామ్‌నాయుడు 08576 -226779 9963736383 శ్రీకాళహస్తి-నాగరాజు 08578 -222299 9963735672 తిరుమల 0877 -2277299 9963736293 తిరుపతి-రమణయ్య 0877 -2260101 9963736778 వాల్మీకిపురం-డేవిడ్ 08586 -271199 9963737042 -
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లి నేతాజీనగర్‌లో సోమవారం ఉదయం ఓ ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
బెల్లు కొట్టి చెప్పాల్సిన సత్యం
నవ్వింత: గంట చాలా విశిష్టమైంది. మా చిన్నప్పుడు ఫైరింజన్ గంటలు కొట్టుకుంటూ పోతుంటే ఆ దృశ్యం చూడటానికి గబగబా రోడ్డు మీదకు వచ్చేవాళ్లం. ఫైరింజన్ వెనక నిలబడి గణగణా గంటలు కొట్టేవాడు ఎంత గ్రేటో కదా అనుకునేవాణ్ణి. బుడుగంతటివాడు రైల్వే వింజనుడ్రైవరుకూ, జటకా పెలైటుకూ బీడీలు లంచమిచ్చి వాటిని తోలినట్టే ఒక్కసారైనా ఫైరింజను వాణ్ణి మంచిచేసుకుని వెనకెక్కి గంట కొట్టాలనుకునేవాణ్ణిగానీ, ఆ గంట నా హైటుకు సరిపోదేమో అని తర్కించుకుని దిగులుపడేవాణ్ణి. మళ్లీ చిన్నప్పటి రోజులకే వెళ్దాం. ఆయొక్క బడిగంట తాలూకు లాంగ్బెల్లు ఇచ్చే థ్రిల్లు గురించి చెప్పేదేముంది. గంట కొడుతున్నది చప్రాసీయే అయినా నిర్బంధంలో ఉన్న వేలాది పిల్లల్ని విముక్తి చేస్తున్న దేవదూతలా కనిపించేవాడు. హెడ్మాస్టర్కంటే గొప్పవాడులా అనిపించేవాడు. చప్రాసీ ఏ కారణం వల్లనైనా రాకపోతే గంటకొట్టడానికి విద్యార్థులందర్లోనూ ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇక్కడ ఆరోగ్యకరమైన అన్న మాట ఎందుకంటే... అలా కొట్టడానికి రన్నింగ్ చేయడం వల్ల దక్కే ఆరోగ్యమన్నమాట! మహామహా ఇంగ్లిషు మీడియం విద్యార్థులైనా సరే, వాళ్ల రెండో రైమ్‌గా ‘డింగ్ డాంగ్ బెల్’ చదవాల్సిందే. (మొదటిది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్). చిన్నప్పుడు ఎడ్లబండిలో వెళ్లేప్పుడు ఎడ్లకు గంట లేకపోతే మూకీ సినిమాలా డల్‌గా ఉండేది. అదే ఎడ్లకు గంటలు, మువ్వలు కట్టివుంటే ఆ నడకే వేరు. ఫైటింగ్ సినిమాలా హుషారుగా ఉండేది. ఇక చిన్నప్పటి సినిమాల గురించి చెప్పేదేముంది. రీలుపడిపోయిందేమో అన్న ఆదుర్దాతో మనం పడిపోయినా పర్లేదన్నట్లుగా పడుతూ లేస్తూ వచ్చేవాళ్లం. ఇంకా ట్రైలుపార్టే నడుస్తోందని తెలిపేస్తుంది సినిమాహాల్లో మోగే గంట తాలూకు గర్రుమనే శబ్దం. దాంతో హిచ్‌కాక్ సినిమా చూస్తూ అనుభవిస్తున్న ఉద్విగ్నతా... ఆ తదుపరి సస్పెన్స్ వీడిన రిలీఫునూ ఏకకాలంలో మనకు కలిగించి, గుండెనెంతో తేలిక చేస్తుందా బెల్లు. మా చిన్నప్పుడు చుట్ట అలవాటున్న ముసలాళ్లంతా ఘంట చుట్టే తాగేవాళ్లు. ఇతర బ్రాండులవీ లభ్యమైనప్పటికీ వాటిని కనీసం క్రీ‘గంట’ కూడా చూసేవారు కాదు. ఘంట చుట్ట వెలిగిస్తేనే మందపాటి గంట... సారీ... ఘంట మోగినట్టుగా దాంతాలూకు ఘాటు టంగు... సారీ ఠంగుమనేదట. ఆ చుట్టతాగుతూ ఠంగు ఠంగుమని దగ్గేవాళ్లు. మహాగాయకుడు ఘంటసాల అంతటి పేరుప్రఖ్యాతులు సాధించడానికీ ఆయన గొంతులో మోగే తియ్యటి గంటలు మన చెవికి చేరడమేనని నాలాంటి సంగీతం తెలియని వారికి ఓ దురభిప్రాయం. ఈ ఘంటసాల, పెదగంట్యాడ, చినగంట్యాడ లాంటి ఊళ్ల పేర్లన్నీ గంట పట్ల గౌరవంతో పెట్టుకున్నవేనని నా రీసెర్చీలో తేలిన వాస్తవం. దేవుడి తాలూకు కాలింగ్ బెల్ గంట అని చాలామంది ఇంతకుముందే వాక్రుచ్చారు. దేవుడంటే నమ్మకం లేకపోయినా శ్రీశ్రీకి గంటల పట్ల మాత్రం ఎంతో భక్తీ ఆసక్తి. అంతటివాడు సైతం పట్టణాలలో, పల్లెటూళ్లలో, బట్టబయలునా, పర్వతగుహలా, ఎడారులందూ, సముద్రమందూ, అడవుల వెంటా అగడ్తలంటా ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా గంటలు.. గంటలు.. గంటలు.. గంటలు... గణగణ గణగణ గణగణ గంటలు గంటలు అంటూ కవిత్వం రాశాడు. పైగా తన గంటల మహత్యం ఎంత గొప్పదో చెప్పడానికి అది ఎడ్గార్ అలెన్ పో కవిత్వం కానేకాదనీ, తనదేననీ ఘంటా బజాయించి మరీ చెప్పాడు. గంట మహత్యం ఎంత గొప్పదంటే... హైదరాబాద్‌కు వచ్చిన ప్రతివాడూ సాలార్జంగ్ మ్యూజియానికి వెళ్లి పెద్దగడియారంలోంచి ఓ చిట్టివాడూ, పొట్టివాడూ వచ్చి గట్టిగా గంట కొట్టే దృశ్యాన్ని అబ్బురంగా చూస్తాడు. ఈనాటి సినిమా ఫక్కీలో చెప్పాలంటే... గడియారం దగ్గరికి ఎప్పుడొచ్చావన్నది కాదన్నయ్యా ముఖ్యం... పన్నెండు గంటలు కొట్టే సమయానికి వచ్చావా లేదా అన్నదే పాయింటు. మూఢనమ్మకాలని కొందరు ఒకపట్టాన నమ్మరు గానీ సదరు పేరు పెట్టుకున్నందుకే గ్రాహంబెల్లు తన పేరుకు తగ్గట్టు గంటకొట్టి పిలిచే టెలీఫోన్ కనిపెట్టాడనీ, గోబెల్ అని నామకరణం జరిగినందుకే తన ప్రచారాలన్నీ గంటతో టముకేసినంత గట్టిగా చేయగలిగాడనీ కొందరు న్యూమరాలజిస్టులు నమ్మకంగా చెబుతుంటారు. ఏదైనా విషయం చాలా సేపు సాగిందనడానికి వాడుకగా, ‘అబ్బ గంటసేపు పట్టింది’ అనడం ఒక నుడికారం, తెలుగులో అదో పలుకుబడి. గంట అనేదాంట్లో శబ్దం, ధ్వని లేకపోయినా ఈ ప్రపంచాన్ని ఇరవైనాలుగ్గంటలూ... గంటలే నడిపిస్తున్నాయి. చిన్నప్పుడు బడి వదిలేముందు లాంగ్ బెల్ అనే అప్షన్ జీవితంలో ఉండదని మనకు అనుభవం మీద తెలిసొస్తుంది. పైగా మన బాస్ గదిలోంచి మోగే బెల్లుతో మన గుండె మాటిమాటికీ అవుతుంది గుభిల్లు. దీంతో పాటు ఈ రోజుల్లో గంటమోగే మొబైల్ అనే సాధనాన్ని జేబులో ఉంచుకుంటాడు. యుద్ధగంటలా మోగే ఆ సెల్లుబెల్లుతో ఏ అస్త్రం ఎటువైపు నుంచి వచ్చి బతుకు ఛిద్రం చేస్తుందో, క్షతగాత్రుల్లా మిగులుస్తుందో అన్న చింత ఎల్లరకూ ఉంటుంది. పెద్ద బిల్డింగుల్లో ఏవైనా అగ్నిప్రమాదపు చ్ఛాయలు కనిపించగానే గంటలు గణగణా మోగుతాయట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు చాలా సంప్రదాయాల్లో భవిష్యత్ ప్రమాద వెడ్డింగ్ బెల్స్ మోగిస్తారు! - యాసీన్ -
ఓబీసీ బ్యాంక్ ఏటీఎంలో అగ్నిప్రమాదం
-
ఓబీసీ బ్యాంక్ ఏటీఎంలో అగ్నిప్రమాదం
విజయవాడ : విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓబీసీ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభివించింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఏటీఎం మిషన్‌కు మంటలు వ్యాపించకపోవటంతో నష్టం తప్పింది. కాగా ఏసీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. -
ఫైర్ ఇంజనీరింగ్... పుష్కల అవకాశాలు!
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించి అగ్ని ప్రమాదాల నివారణకు, నియంత్రణకు పాటుపడేదే.. ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యల్లో ఫైర్ ఇంజనీరింగ్ పాత్ర చాలా కీలకం. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి పరిశ్రమలో, భవనాల్లోనూ ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా మారింది. ఫైర్ ఇంజనీరింగ్ రంగంలో నిపుణులకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇటీవల కాలంలో ఫైర్ ఇంజనీరింగ్ కోర్సుల పట్ల విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలతోపాటు సిటీలోని పలు ఇన్స్టిట్యూట్లు ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేషన్లు, బ్యాచిలర్ కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజనీరింగ్‌తో అవకాశాలపై ఫోకస్.. అర్హతలు: ఫైర్ , సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సులను సాధారణంగా ఇంటర్మీడియెట్ అర్హతతో అభ్యసించొచ్చు. పదో తరగతితోనూ సేఫ్టీ సూపర్వైజర్, సేఫ్టీ స్టీవార్డ్, ఫైర్‌మన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్, ఫైర్ ఇంజనీర్, ఫైర్ ఆఫీసర్ కోర్సుల్లో చేరొచ్చు. ఫైర్ ఇంజనీర్‌గా స్థిరపడాలంటే.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. కోర్సుల స్వరూపం: కోర్సులో స్థూలంగా.. ఫైర్ ఇంజనీరింగ్ సైన్స్, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్, ఫైర్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్, సేఫ్టీ మేనేజ్మెంట్, సేఫ్టీ ఇంజనీరింగ్, లాస్‌కంట్రోల్ అండ్ సేఫ్టీ లాస్‌తోపాటు ప్రధానంగా ఫైర్ ఫైటింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌పై శిక్షణ ఇస్తారు. ఫైర్ ఫైటింగ్ అనేది వివిధ విభాగాల్లో ఉంటుంది. ఆయిల్ ఫైర్, గ్యాస్ ఫైర్, మెటల్ఫైర్.. ఇలా ఒక్కోదాన్ని ఆర్పివేయడానికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. ఫైర్ ఇంజనీరింగ్‌లో భాగంగా విద్యార్థులు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ డిజైన్, స్మోక్ డిటెక్టర్స్, హైజిన్ సిస్టమ్స్ ఏ విధంగా అమర్చాల్సి ఉంటుందో అధ్యయనం చేస్తారు. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. నైపుణ్యాలు: ఫైర్ ఇంజనీరింగ్ , సేఫ్టీ మేనేజ్మెంట్ రంగంలో స్థిరపడాలనుకునే వారు... ప్రమాదాలు సంభవించినప్పుడు లిప్తపాటులో స్పందించగలిగే లక్షణాలను కలిగి ఉండాలి. వేగంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలుండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. సూక్ష్మ పరిశీలనా నైపుణ్యాలూ అవసరం. ఉద్యోగాలెక్కడ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఫైర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఫైర్ సర్వీసెస్, ఆర్కిటెక్చరల్ అండ్ బిల్డింగ్ డిజైన్, ఇన్సూరెన్స్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీ, రిఫైనరీస్, బాట్లింగ్ ప్లాంట్స్, టెక్స్టైల్స్, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే, అగ్నిప్రమాదాలకు అవకాశమున్న ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ యూనిట్‌ల్లో ఫైర్ ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. వేతనాలు: ఫైర్ ఇంజనీర్లు, సేఫ్టీ ఇంజనీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, సేఫ్టీ ఇన్స్పెక్టర్లుగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఫైర్ ఇంజనీర్స్కు డిమాండ్ ఎక్కువగా ఉన్న గల్ఫ్ లాంటి దేశాల్లో ఎక్కువ మొత్తాన్నే చెల్లిస్తున్నారు. ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థలు: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడిచే నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్... పలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కూడా ఉంది. అందించే కోర్సులు * సబ్ ఆఫీసర్స్ ఠ స్టేషన్ ఆఫీసర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ * డివిజనల్ ఆఫీసర్స్ * బ్రీతింగ్ అపారెటస్ ఠ ఫైర్ ప్రివెన్షన్ * బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్(ఫైర్) వెబ్సైట్: http://nfscnagpur.nic.in/ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్(యూపీఈఎస్)... నాలుగేళ్ల బీటెక్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. యూపీఈఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 80 శాతం సీట్లును, జేఈఈ మెయిన్ స్కోరు ద్వారా 20 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వెబ్సైట్: www.upes.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్, జైపూర్ జైపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో కలిసి కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతతో ప్రవేశాన్ని కల్పిస్తోంది. కోర్సుల వివరాలు: గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ లెవల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్(పైర్మన్) సబ్ఫైర్ ఆఫీసర్స్ కోర్స్ వెబ్సైట్: www.nifesmindia.net కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఔరంగాబాద్ ఔరంగాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ పలు ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తోంది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ అర్హతలతో ప్రవేశం కల్పిస్తోంది. కోర్సుల వివరాలు... బీఎస్సీ ఫైర్ సేఫ్టీ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ డి ప్లొమా ఇన్ ఫైర్ సర్వీస్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఫైర్ ఇంజనీరింగ్(ఫైర్‌మన్)/ సేఫ్టీ ఇంజనీరింగ్ సివిల్ సూపర్వైజర్ బిల్డింగ్ సైట్ సూపర్వైజర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనే జ్మెంట్ సెక్యూరిటీ అండ్ ఫైర్ ప్రివెన్షన్ వెబ్సైట్: www.fireengg.in హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్... రెగ్యులర్, దూరవిద్యా విధానంలో పలు ఫైర్ కోర్సులను అందిస్తోంది. కోర్సుల వివరాలు... పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ సేఫ్టీ ఆఫీసర్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.hifeindia.in గ్లోబల్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఈ విద్యాసంస్థ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సుల వివరాలు: పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ వెబ్సైట్: www.glifse.com హైదరాబాద్‌లో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సులు.. ఎన్ఐఎఫ్ఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్ట్ మేనేజ్మెంట్): హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 50కి పైగా కేంద్రాల్లో ఈ ఇన్స్టిట్యూట్ ఫైర్ సేఫ్టీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సుల వివరాలు... ఎంబీఏ సేఫ్టీ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ పీజీ డిప్లొమా ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ డిప్లొమా ఇన్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా ఇన్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ బీఎస్సీ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ వెబ్సైట్: www.nifsindia.net/ డిమాండ్‌కు తగిన సిబ్బంది లే రు ‘‘ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్లో అవసరాలకు తగిన సిబ్బంది అందుబాటులో లేరు. దీనికి కారణం విద్యార్థుల్లో ఈ కోర్సులపై తగిన అవగాహన లేకపోవడమే. ప్రస్తుతం అగ్ని ప్రమాదాల నివారణకు దాదాపు అన్ని పరిశ్రమలు ముందస్తు చర్యలను పటిష్టం చేస్తున్నాయి. వాటిని నిత్యం పర్యవేక్షించడానికి అగ్నిమాపక నిపుణులకు అవకాశాలను కల్పిస్తున్నాయి. అలాగే ప్రమాదాలు సంభవించిన ప్పుడు ఈ విభాగంలో శిక్షణ పొందిన వారి అవసరం ఏర్పడుతోంది. కాబట్టి ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో పుష్కలమైన అవకాశాలుంటాయని నిస్సందేహంగా చెప్పొచ్చు’’ - సునీల్ మహంతి, డెరైక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్ట్ మేనేజ్మెంట్ -
ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. మావోయిస్టులు సమావేశం అయినట్లు సమాచారంతో తిర్యాని అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా రొంపి సమీపంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఫార్మా’లో ప్రమాద ఘంటికలు!
కంటితుడుపుగా నివారణ చర్యలు అభ్యంతరాలతో నడుస్తున్న పరిశ్రమలు ఆందోళనలో కార్మికులు, ప్రజలు గ్లోకెమ్ ఘటనతో మరింత బెదురు పరవాడ : జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఔషధ పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు కార్మికులు, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నగరంలోశుక్రవారం గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలు డు ఘటన కళ్ల ముందు కదలాడుతుండగానే ఫార్మాసిటీ గ్లోకెమ్ పరిశ్రమలో ఆ తరహా పేలుడుతో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫార్మాసిటీలో 45 ఔషధ పరిశ్రమల్లో కొన్ని మాత్రమే ఎన్ వోసీలు పొందాయి. మిగిలినవి అనుమతులు తీసుకోకుండా జాప్యం చేస్తూ ఉత్పత్తులు సాగిస్తున్నాయి. ఇలావుండగా గత ఏడాది మే 30న గ్లోకెమ్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.60 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. కార్మికులు భయం తో పరుగులు తీయడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పింది. ఇదే పరిశ్రమలో అంతకు ముందు విద్యుత్ షాక్‌తో ఒ కార్మికుడు ప్రాణా లు కోల్పోయాడు. 2009లో సంభవించిన రియాక్టర్ పేలుడులో ఇద్దరు కార్మికుల ప్రాణా లు గాలిలో కలిసిపోయాయి. స్థానిక ఆవ్రా పరి శ్రమలో 2013 మార్చి 17న జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. అప్ప ట్లో కార్మికులు అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 2012 అక్టోబర్ 8న ఆక్టాస్ పరిశ్రమలోనూ భారీ అగ్ని ప్రమాదం సంభవించిం ది. గ్లోకెమ్ పరిశ్రమలో యుటిలిటీ బ్లాక్‌లో శనివారం జరిగిన ప్రమాదం కూడా అత్యంత తీవ్రమైందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఉత్పత్తిని ప్రారంభించిన గ్లోకెమ్ పరిశ్రమను పీసీబీ రెండేళ్ల క్రితం మూసి వే సిం ది. ఆ తరువాత యాజమాన్యం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పెనాల్టీ రుసుం చెల్లించి మళ్లీ పరిశ్రమను తె రిచింది. కొరవడిన భద్రతా ప్రమాణాలు పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. అవగాహన లేని కార్మికులతో పని చేయించడం, పైపు లైన్లో లీకేజీలు, రసాయనాలను కలపడంలో అ జాగ్రత్త, రియాక్షన్ కలిగిన రసాయనాలను అతి దగ్గరగా ఉంచడం, వాటికి దగ్గరగా విద్యుత్ పరికరాలతో పనులు చేయడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. భద్రత ప్రమాణాలను పాటించని పరిశ్రమలపై అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకొంటున్నారని ఆరోపణలున్నాయి. ఫార్మాసిటీలో అరకొర సౌకర్యాలు ఫార్మాసిటీ ఔషధ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. ఫార్మాసిటీలో ఒకే ఒక్క అగ్నిమాపక శకటం, సిబ్బంది కొరతతో ప్రమాదాల వేళ సమీప అగ్నిమాపక కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాలను నివారించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణకు డ్రై కెమికల్ పౌడర్, ఫోమ్లను అందుబాటులో ఉంచాలి. వీటిపై యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదాలతో బెంబేలెత్తితున్న ప్రజలు పరిశ్రమల్లో ప్రమాదాలతో వాటికి చేరువలో ఉన్న తాడి, తానాం గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పరిశ్రమల్లోని సాల్వెంటు డ్రమ్ములు, రియాక్టర్లు, ట్యాంకుల వల్ల తరచూ సంభవిస్తున్న పేలుళ్లతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు. రాత్రి వేళ పేలుళ్లు జరిగితే కుటుంబాలతో ప్రాణ భయంతో పరుగులు తీయాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన అధికారులు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. -
గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
-
గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
గుంటూరు: గుంటూరు నగర శివారు ప్రాంతమైన రాజగోపాల్ నగర్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్లు పేలటంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ మంటల్లో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. రాగా మంటలును ఆర్పేందుకు ఒక్క ఫైరింజన్ మాత్రమే ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్తా ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్తా ప్లాస్టిక్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున మొదలైన మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. -
ఎంటీఆర్ కంపెనీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంటీఆర్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంపెనీ పూర్తిగా దగ్ధం అయ్యింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. -
అగ్నికీలలపై ఆధునికాస్త్రాలు
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : అగ్నిప్రమాదం జరిగిందంటే చాలు ఠన్.. ఠన్.. ఠన్.. అంటూ వచ్చేస్తుంది గం టల బండి. ఎక్కడ మంటలంటుకున్నా నోట్లో నుంచి వచ్చే మొదటిమాట ‘ఫైరింజన్‌కు ఫోన్ చేయండి..’ అనే. ఇప్పుడు మరింత ఆధునిక అస్త్రాలు సమకూర్చుకుంది అగ్నిమాపక శాఖ. ఎండాకాలమంటేనే..మండేకాలం. అగ్నిప్రమాదాలు ఈ కాలంలోనే ఎక్కువగా చోటుచేసుకుం టుంటాయి. ఈ నేపథ్యంలో నూతన అస్త్రాలను సమకూర్చుకున్న అగ్నిమాపక యంత్రం గురించి..వీటర్ అండ్ ఫోమ్ టెండర్ వాహనం(మేజర్ వెహికిల్) ఇప్పటిక వరకూ వాటర్ టెండర్.. ఫోమ్ టెండర్..విడివిడిగా ఉండేవి. రసాయనాల వల్ల మంటలు చెలరేగితే అదుపుచేయడానికి ఫోమ్, ఇతర కారణాలతో జరిగిన అగ్నిప్రమాదాలకు వాటర్‌ను వినియోగించేవారు. ఇప్పుడు ఒకే వాహనంలో ఈ రెండు సదుపాయాలు వచ్చేశాయి. భారీ అగ్నిప్రమాదాలు జరిగినా చక్కగా పనిచేస్తుంది. ప్రత్యేకతలు 4,500 లీటర్ల నీటిసామర్థ్యం, 4,500లీటర్ల ఫోమ్ దీనిసొంతం, రియర్ మౌంటెడ్ పంప్స్ దీనికి అమర్చారు. డ్రైవర్, సిబ్బంది కూర్చునే క్యాబిన్ పైభాగంలో మానిటర్ ఉంటుంది. దీంతో మామూలు ఫైరింజన్ల కంటే రెట్టింపుస్థాయి ప్రెషర్‌తో నీటిని బయటకు చిమ్ముతుంది. ప్రమాదస్థలికి 20అడుగుల దూరం నుంచే మంటల్ని అదుపు చేయవచ్చు. మానిటర్‌ను 90డిగ్రీల కోణంలో ఏ దిశలో కావలంటే ఆ దిశలో తిప్పుకోవచ్చు. మినిఫైర్ ఇంజిన్(మిస్ట్) చిన్నపాటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు.. ఇరుకైన సందుల్లోకి వెళ్లాల్సి వచ్చినపుడు పెద్ద వాహనంతో కష్టమే. ఇలాంటి చోట్లకు దూసుకెళ్లి.. క్షణాల్లో మంటలను ఆర్పేందుకు వచ్చిన వాహనమిది. ప్రత్యేకతలు 300లీటర్ల నీటి సామర్థ్యం, 50లీటర్ల ఫోమ్ కలిగివుంటుంది. చిన్నసందుల్లో దూసుకెళ్ల గలుగుతుంది. చిన్నదైనా నీ రు, ఫోమ్ కలిగి ఉండటం ప్రత్యేకత. -
బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ బేగంపేటలోని రుక్మిణి టవర్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. వాణిజ్య సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలోని ఓ అనాథాశ్రమంలో అనూహ్య రీతిలో వేకువజామున మంటలు రాజుకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో మహిళ కూడా ఉంది. మృతురాలికి కాలు లేకపోవడంతో, బయటకు పరుగు తీయలేక మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇక్కడ వందల సంఖ్యలో అనాథలు, వృద్ధులు, మానసిక వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు ఆశ్రయం పొందుతున్నారు. మొత్తం పది షెల్టర్స్ ఉండగా .. అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. -
బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం
-
బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : సికింద్రాబాద్ బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. .షాపర్స్ స్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని వ్యాపార సముదాయాల్లో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. బ్యూటీపార్లర్ కావడం, కాస్మోటిక్స్ ఉండడంతో .. అగ్ని కీలలు అదుపు చేయడం కష్టంగా మారింది. ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో పేలుడు, ఇద్దరి మృతి
రెండు భవనాలు కుప్పకూలి ఇద్దరి మృతి న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం సమీపంలోని ఈస్ట్ హార్లెమ్‌లో బుధవారం ఉదయం శక్తిమంతమైన పేలుడు సంభవించి రెండు భవనాలు కుప్పకూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించడంతోపాటు 20 మంది గాయపడ్డారు. మరికొంత మంది ఆచూకీ తెలియడం లేదు. ఉదయం 9 గంటల సమయంలో తొలుత గ్యాస్ లీక్ అయినట్లు వాసన వచ్చిందని, తర్వాత భారీ శబ్దంతో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు, పొగ అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు, అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్లతో సహా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని, ఇది ఉగ్రవాద దాడి కాకపోవచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం
బోర్లం(బాన్సువాడరూరల్), న్యూస్‌లైన్ : బోర్లంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన సందుల పోశయ్య గుడిసె దగ్ధమైంది. పోశయ్య కుటుంబ సభ్యులు రాత్రి వేళ గుడిసె పక్కన ఉన్న ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే బాన్నువాడలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గుడిసెలోని కలప, వంట సామగ్రి, దుస్తులు, నిత్యావసర వస్తువులు, ఎరువులు కాలిబూడిదయ్యాయి. తామంటే గిట్టనివారు గుడిసెకు నిప్పంటించి ఉంటారని బాధితులు ఆరోపించారు. వీఆర్ఓ సంజీవ్ సంఘటన స్థలాన్ని సందర్శించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు. రూ. 60 వేల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పసుపు కుప్ప దగ్ధం రెంజర్ల(బాల్కొండ): రెంజర్ల గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. బుల్లె రాంరెడ్డికి చెందిన పసుపు కుప్ప కాలిపోయింది. వివరాలిలా ఉన్నాయి. రాంరెడ్డి పసుపును ఉడికించడానికి కళ్లం వద్ద కుప్పగా పోశారు. పక్కన మరో రైతు పసుపును ఉడికిస్తుండగా నిప్పు రవ్వలు వచ్చి రాంరెడ్డికి చెందిన పంటపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. రైతులు దీనిని గమనించి మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. 5 ట్రాక్టర్ల పసుపు కొమ్ము కాలిపోయిందని, సుమారు లక్షన్నర రూపాయాల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. -
జేకే-5 ఓసీ ఓబీ క్యాంప్‌లో అగ్నిప్రమాదం
పది షెడ్లు, స్టోర్ రూం దగ్ధం రూ.అరకోటి వరకు ఆస్తి నష్టం వోల్వో కార్మికుడికి తీవ్ర గాయాలు గ్యాస్ సిలిండర్ లీకేజీతో ప్రమాదం ఇల్లెందుఅర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ : ఇల్లెందులోని జేకే-5 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఉపరితలంపై ఉన్న క్యాంప్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు *కోటిన్నర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. వోల్వో కార్మికుడు సైతం గాయపడ్డాడు. ఓబీ పీఆర్ఓ శ్రీనివాసనాయుడు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రాత్రి సుమారు 9.00 గంటల సమయంలో క్యాంప్ కార్యాలయం సమీపంలో కార్మికులు నివసిస్తున్న షెడ్లకు మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. షెడ్లు ఒకదానికోకటి వరుసగా ఉండటంతో సుమారు 10 షెడ్లతోపాటు స్టోర్‌రూమ్ పూర్తిగా కాలిపోయింది. స్టోర్‌రూమ్‌లోని విలువైన డీజిల్, అయిల్, టైర్లు ఇతర సామగ్రి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సింగరేణి సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్లను సైతం ఉపయోగించారు. ఎట్టకేలకు మంటలను అదు పులోకి తెచ్చారు. మంటలను నీటితో చల్లార్చేందుకు ప్రయత్నించిన క్రమంలో వోల్వో ఆపరేటర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదృష్టవశా త్తు ఎలాం టి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంది. షెడ్లలో కార్మికులు వంట చేసుకునే క్రమంలో గ్యాస్ లీకై ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.