దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని బాంద్రాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని బాంద్రాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం గమనించిన కొందరు వ్యక్తులు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్బీఐ టవర్స్లో మంటలు భారీగా ఎగసి పడుతున్నట్లు తెలుస్తోంది. 8 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రతయత్నిస్తున్నారు. ఈ ఘననకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.