
ఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బిల‍్డింగ్‌లో చెలరేగిన మంటల్లో రెండు కుటుంబాలు చిక్కుకున్నాయి. ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో నలుగులు మహిళలు ఉన్నారు. ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి అనుకోకుండా భవనంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రెండు కుటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారని పోలీసులు తెలిపారు. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. భవనంలోకి ప్రవేశించి మృతదేహాలను బయటకు తీశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
Comments
Please login to add a commentAdd a comment