
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి 12.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రెండు ఎకరాల వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 15వందల ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి ఒంటిగంటకు అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా చెప్పారు. ప్రమాదం సుమారు 1000 - 1200 ఇళ్లు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. అర్థరాత్రి సమయంలో ప్రమాదం సంభవించినప్పటికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment