
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
నాచారం పారిశ్రామికవాడలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ పేలుడు సంభవించింది.
హైదరాబాద్ : నాచారం పారిశ్రామికవాడలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో కెమికల్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో సుమారు కిలోమీటరు మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో పరుగులు తీశారు.
మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలకు అదుపు చేస్తున్నారు. మంటలు చట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం లేదు.