nacharam
-
జబల్పూర్ ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
తాడేపల్లి, సాక్షి: మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా సిహోరాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న హైదరాబాద్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు భక్తులు మృతి చెందటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను వెంటనే ప్రభుత్వాలు ఆదుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాచారం నుంచి కొందరు భక్తులు మినీ బస్సుల్లో ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా.. సిహోరా వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రాంగ్ రూట్లో వచ్చిన ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. -
నా చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణం.. యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో యువతి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేయని తప్పునకు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. తన చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణమని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారంలోని బాపూజీనగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రితో వేరుగా దీప్తి రెండు సంవత్సరాల నుండి తన తల్లితో కలిసి ఉంటోంది. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్‌తో పరిచయముంది.అయితే, బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసీటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం, దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. రెండేళ్ల క్రితమే ఈ డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అయితే, తన తండ్రి సంగీతరావు.. అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం దీప్తికి తెలియదు. కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగవద్దని అనిల్‌కు సమాధానం చెప్పింది. ఆయన పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. దీంతో, దీప్తి, సంగీత రావుపై ఛీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు.ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన దీప్తి, బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి దీప్తి మృతి చెందింది. ఆమె ఫోన్ చూడగా సెల్ఫీ వీడియో ఉంది. సెల్ఫీ వీడియో ప్రకారం ఆమె మాటలు.. ‘నేను చనిపోవడానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. మా నాన్న డబ్బులు తీసుకుంటే నన్ను అడిగి నా మీద నకిలీ కేసు పెట్టారు. నా జీవితం నాశనం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావునకు కారణమైన వాళ్లకు శిక్షపడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది. అనంతరం, పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు మీద కేసు బుక్ చేశారు. -
నాచారం ఇండస్ట్రియల్ కారిడార్‌లో భారి బ్లాస్ట్
-
నాచారంలో సెల్ఫీ సూసైడ్
సాక్షి, క్రైమ్ విభాగం: నాచారంలో దారుణం జరిగింది. ఓ వివాహిత ఫేస్బుక్ లైవ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలే అందుకు కారణమని పోలీసులు భావిస్తుండగా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె భర్త, అతని కుటుంబం టార్చర్ భరించలేక తన కూతురు ప్రాణం తీసుకుందని ఆమె తండ్రి వాపోతున్నాడు. ఉద్యోగి అయిన సనా.. తండ్రి ఉంటున్న బిల్డింగ్‌లోనే మరో పోర్షన్లో ఉంటోంది. ఈ క్రమంలో సనాతల్లి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో బద్ధలు కొట్టిచూశారు. సనా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. భర్త, మామల్ని ఫేస్బుక్లో లైవ్‌పెట్టి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె.. తండ్రి సాయంతో కొడుక్కి(3) స్కూల్లో తాజాగా అడ్మిషన్ ఇప్పించింది. అంతా సంతోషంగా ఉందనుకుంటున్న సమయంలో ఆమె ఇలా చేయడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. షాదీ నాటి ఫొటో మతం మార్చుకుని.. వివాహేతర సంబంధంతో.. వివాహేతర సంబంధం.. అల్లుడి కుటుంబం వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని సనా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2019లో రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పుత్ యువకుడు హేమంత్‌తో ఆమె ప్రేమ వివాహం జరిగింది. మతం మారతానని ముందుకొచ్చిన అతను.. ఆమె తండ్రిని ఒప్పించి మరీ వివాహం చేసుకున్నాడు. అయితే.. అతని కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. అందుకే సనాను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చింది. ఈలోపు అతని దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సూఫీ ఖాన్ వచ్చింది. సనా తండ్రి నటిగా పరిచయం చేసుకున్న సూఫీ ఖాన్‌తో సనా భర్తకు చనువు ఏర్పడింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. దీంతో సనాకు, ఆమె భర్తకు మధ్య గొడవలు జరిగాయి. సూఫీఖానాను ప్రేమలో పడి.. తన కూతురిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని.. టార్చర్ పెట్టాడని సనా తండ్రి నాచారం పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. అప్పుడు ఇరుకుటుంబాలు మాట్లాడుకుని గొడవను సర్దుమణిగేలా చేశాయి. ఆపై ఆ భార్యాభర్తలు రాజస్థాన్ వెళ్లిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నారు. ఈలోపు సూఫీఖాన్ విషయంలోనే మళ్లీ ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో కొడుకును తీసుకుని తిరిగి నాచారం వచ్చేసిందామె. అయితే కొడుకును చూసుకుంటూ.. సంతోషంగానే ఆమె ఉందని అంతా భావించారు. ఈలోపే ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టింది సనా. సూఫీఖాన్కు, సనా భర్త మధ్య జరిగిన సంభాషణలు, వాట్సాప్ ఛాటింగ్, వాళ్లు దిగిన ఫొటోలు, వాళ్ల వివాహేతర సంబంధానికి సంబంధించిన అన్నీ సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని సనా తండ్రి అంటున్నాడు. తన కూతురికి న్యాయం చేయాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నాడాయన. భర్త వేధింపులు ఎక్కువ కావడంతోనే ఆమె.. వాళ్లను లైవ్‌లో పెట్టి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. సూఫీఖాన్ బయటకు వస్తే.. మొత్తం అన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారాయన. ఈ మేరకు సనా ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
నాచారం మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
-
చందాదారులకు శుభవార్త.. ఈఎస్ఐలో 24/7 మందులు!
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) చందాదారులకు శుభవార్త. ఇప్పటివరకు కేవలం ఓపీ పనివేళల్లోనే ఈఎస్ఐ నాచారం ఆస్పత్రిలో రోగులకు మందులు లభిస్తుండగా అతిత్వరలో ప్రతిరోజూ 24 గంటలపాటు అక్కడ మందులు లభించనున్నాయి. ఇందుకోసం నాచారం ఆస్పత్రిలో 24 గంటలపాటు మందులు అందించేలా ఒక మెడికల్ స్టాల్‌ను కార్మిక శాఖ ఏర్పాటు చేయనుంది. ఈఎస్ఐ ఖాతాదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్మిక సంక్షేమ, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఇటీవల జరిగిన ఈఎస్ఐ అధికారుల సమావేశంలో వెల్లడించారు. మందుల కొనుగోలుకు ఇప్పటికే రూ. 37 కోట్లు విడుదల చేశామన్నారు. ముందుగా నాచారం ఆస్పత్రిలో 24/7 మందుల పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత మరో రెండు ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ దీన్ని అమలు చేసేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు జ్వరం మొదలు బీపీ, షుగర్, హృద్రోగాలకు సంబంధించిన మందులను ప్రధాన ఆస్పత్రులతోపాటు క్షేత్రస్థాయిలోని డిస్పెన్సరీల్లోనూ ప్రత్యేక కోటా కింద కేటాయించి నిల్వలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని కార్మిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉండగా వాటికి అదనంగా 25 ప్యానెల్ క్లినిక్‌లు ఉన్నాయి. ఈఎస్ఐ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దాదాపు అన్ని రకాల రోగులకు మందులను పంపిణీ చేస్తున్నారు. -
ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ పోషకాహార లోపం లేని తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమన్నారు. దాదాపుగా 30 లక్షల మంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం నడుం బిగించిందని వివరించారు. ఆధునిక సాంకేతికత తో ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్లాంట్ ఆసియాలోనే ఇదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపుతో సంస్థ ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ 1975 లో నిర్మించింది కాబట్టి రానున్న భవిష్యత్ దృష్యా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాంట్ ద్వారా గంటలకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగనుందని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ నూతన ప్లాంట్ ద్వారా ఇప్పుడు సరఫరా చేస్తున్న మన రాష్ట్రం, ఏపీతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు మనం పోషకాహారం అందించవచ్చన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రానున్న మరో 40 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరం మేర పోషకాహారం ఉత్పత్తి జరుగుతుందన్నారు. అంతే కాకుండ సివిల్ సప్లై వారికి అందించే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉత్పత్తి చేసి అందించే సామర్ధ్యం నూతన ప్లాంట్‌కు ఉందన్నారు. సంస్థ ఉత్పత్తి చేసే బాలామృతం, బాలామృతం+, స్నాక్స్ వల్ల తెలంగాణలోని 33 జిల్లాల్లోని 35,699 అంగన్వాడీ సెంటర్ల ద్వారా దాదాపు 15.5 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. అదే విధంగా ఏపీలోని 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మంది పోష్టికాహారం అందుకుంటున్నారని తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు 20 శాతం వేయిజేస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు -
ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్ అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్ అమీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ, దాంతో
సాక్షి, మల్లాపూర్(హైదరాబాద్): కుటుంబ కలహాలతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ కుమార్తెను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం విలేజ్‌కు చెందిన తెలుగు మద్దిలేటి, ఉమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర్‌కు, జమ్మిగడ్డ శ్రీశివసాయినగర్కు చెందిన దీపిక అలియాస్ చందన (27) 2019లో వివాహం జరిగింది. వీరికి రుత్విక(01) కుమార్తె ఉంది. చంద్రశేఖర్ అమీర్‌పేట్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ నెల 4న రుత్విక బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తగారు పాపకు పెట్టిన బంగారు గొలుసు విషయమై భార్యాభర్తల మధ్య తరచు గొడవ జరుగుతున్నట్లు సమాచారం. గురువారం ఉదయం రెండో ఫ్లోర్లో చంద్రశేఖర్ పని చేసుకుంటున్నాడు. మొదటి అంతస్తులో పాప ఏడుస్తుందని కిందకు వచ్చిన దీపిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని పాప మొహంపై దిండుతో అదిమి చంపివేసింది. అనంతరం ఉయ్యాల తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం కిందకు వచ్చిన చంద్రశేఖర్ సోదరుడు డోర్ కొట్టగా ఎంతకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా దీపిక ఉరివేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి హుటాహుటిన తల్లిబిడ్డలను నాచారం ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. చదవండి: సర్కారు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాచారం పోలీసులు మృతురాలి భర్త, మరిది, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె మూర్తి, ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్తే చంపాడు.. చంద్రశేఖర్ తన కూతురిని, బిడ్డను హత్య చేశాడని దీపిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వద్దే చంద్రశేఖర్ కుటుంబసభ్యులపై వారు దాడి చేశారు. -
అమానుషం: నిండు గర్భిణీపైనా.. దయ చూపలేదు
మల్లాపూర్/సుల్తాన్‌బజార్: కరోనా ఉందన్న అనుమానంతో ఏ ఆస్పత్రి కూడా వైద్యం అందించేందుకు ముందుకు రాలేదు. వైద్యం కోసం నగరమంతా.. నాలుగు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఏ డాక్టరూ కరుణించలేదు. బోసినవ్వుల పాపాయికి జన్మనివ్వాల్సిన ఓ నిండు గర్భిణి ఐదు గంటలపాటు నరకయాతన పడి చివరకు అంబులెన్స్‌లోనే ప్రాణం విడిచింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. నాచారం మల్లాపూర్ నాగలక్ష్మినగర్‌కు చెందిన తిరుమలరావు భార్య పావని (22) ఎనిమిది నెలల గర్భిణి. స్వల్ప అస్వస్థతతో గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. సిబ్బంది ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో ఎలా వెళ్లాలో తెలియక చివరకు ఇంటికి వెళ్లిపోయారు. అయితే అదేరోజు రాత్రి పావనికి దగ్గు ఎక్కువ కావడంతో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో మల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది బెడ్స్ ఖాళీ లేవని, మరో ఆస్పత్రి పేరు చెప్పి పంపించేశారు. పావని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మల్లాపూర్ నుంచి హుటాహుటిన అంబులెన్స్‌లో నేరుగా ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బెడ్స్ ఖాళీ లేవని, వేరే ఆస్పత్రికి వెళ్లమంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే సమీపంలో ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా పావనికి వైద్యం అందలేదు. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని, ఇక్కడ వైద్యం అందించడం కుదరదని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండని చెబుతూ బయట నుంచే పంపించేశారు. ఈలోగా పావని పరిస్థితి మరింత విషమంగా మారింది. కూతురు పరిస్థితి వివరించి, ప్రాణం కాపాడాలని ఆస్పత్రి వర్గాలను ఎంత వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. దీంతో చివరకు కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో వారు బయలుదేరగా కోఠి ఆస్పత్రికి చేరుకునే సరికి ఉదయం 11 గంటలు కావచ్చింది. అయితే అక్కడ కూడా సిబ్బంది వెంటనే స్పందించలేదు. దీంతో, ఆస్పత్రి బయటే చాలాసేపు అంబులెన్స్‌లోనే నిండు గర్భిణి కొట్టుమిట్టాడింది. కుటుంబ సభ్యులు వేడుకోవడంతో ఎట్టకేలకు వైద్యులు వచ్చి చూసేసరికి అంబులెన్స్‌లోనే పావని విగత జీవిగా కనిపించింది. తల్లిని ఎలాగో కాపాడుకోలేకపోయాం, కనీసం కడుపులో ఉన్న శిశువునైనా కాపాడాలని ఆస్పత్రి వైద్యులను కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై వేడుకున్నారు. ఇంత జరిగినా వారిలో జాలి కలగలేదు. ఉన్నతాధికారులను సంప్రదించాలని చెబుతూ కాలయాపన చేశారు. సమయం మించిపోవడంతో తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకూడా ప్రాణాలు కోల్పోయింది. అసలు తన కూతురుకు కరోనా నిర్ధారించకుండానే, కేవలం అనుమానంతోనే ఆస్పత్రులు వైద్యం నిరాకరించాయని, ఆస్పత్రులన్నీ తిప్పించి చివరకు తన బిడ్డను దూరం చేశాయంటూ పావని తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే.. తమ కుమార్తెకి కోవిడ్ అన్న అనుమానంతో ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ కోఠి ఆస్పత్రి సిబ్బంది జాప్యం చేశారని, అందువల్లే పావని చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఆసుపత్రికి రాకముందే పావని మరణించిందని సిబ్బంది అంటున్నారు. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కోఠి ప్రసూతి ఆసుపత్రికి తీసుకువచ్చిన గర్భిణికి ఈసీజీ పరీక్ష చేశామని, అప్పటికే ఆమె మృతిచెందిందని డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. తమ ఆసుపత్రిలో అరగంట పాటు వైద్యుల కోసం వేచిచూశారన్నది తప్పుడు ఆరోపణ అన్నారు. ముందు రోజు రాత్రి నుంచే మృతురాలికి దగ్గు, జలుబు ఉండటం, ఉమ్మనీరు తగ్గిపోవడంతో మరణించి ఉండవచ్చన్నారు. చదవండి: Covid-19: ఆస్పత్రిలో బెడ్స్ కావాలా? -
పెళ్లి చేసుకుందాం రమ్మని..
సాక్షి, వర్గల్ (గజ్వేల్): ప్రేమికుడి మాటలు నమ్మింది..పెళ్లి చేసుకుందాం అనగానే ఒంటరిగా గడప దాటింది.. గుడి వద్ద ప్రియుడి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా అతను రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసుల సాయంతో సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో కథ సుఖాంతమైంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌కు చెందిన యువతి (18) అదే జిల్లాలోని మేడ్చల్ సమీప గ్రామానికి చెందిన బాలకృష్ణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 14న ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట దేవాలయంలో పెళ్లి చేసుకుందాం రమ్మని ప్రేమికుడు చెప్పిన మాటలను నమ్మింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నాచారం గుట్టకు చేరుకుంది. చదవండి: భార్య అశ్లీల చిత్రాలు ఫేస్బుక్లో పోస్ట్ రాత్రి 9 గంటలు దాటుతున్నా ప్రేమికుడు రాలేదు. అతడు మొహం చాటేశాడని అర్థమైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురై డయల్ 100కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో వర్గల్ మండలంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న గౌరారం ఏఎస్సై మధుసూదన్‌రావు, బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు దయాకర్, యాదగిరి వెంటనే గుడి వద్దకు చేరుకున్నారు. యువతితో మాట్లాడి వివరాలు తెలుసుకొని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కూతురును అప్పగించినందుకు యువతి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం -
టికెట్ దక్కలేదని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: టిక్కెట్ దక్కలేదని మనస్థాపానికి గురైన బీజేపీ నాచారం డివిజన్ ఆశావాహురాలు అనుముల అశ్వత్థామరెడ్డి భార్య విజయలతారెడ్డి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయలతారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విజయలతారెడ్డి 2016లో బీజేపీ అభ్యర్థిగా నాచారం డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. (అల రాజకీయ ప్రయాణంలో..) కన్నీటి పర్యంతమైన మాజీ కార్పొరేటర్ వఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూసిన మాజీ కార్పొరేటర్ బి.భారతికి నిరాశే ఎదురైంది. పనితీరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మన్ననలు అందుకున్న సిట్టింగ్ కార్పొరేటర్ మన్నె కవిత అభ్యర్థిత్వంవైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో భారతికి టిక్కెట్ దక్కలేదు. బుజ్జగింపు పర్వంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్, అభ్యర్థి మన్నె కవిత, ఇన్చార్జి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లు భారతి ఇంటికి చేరుకొని ఆమెను బుజ్జగించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తమ నేత దానం నాగేందర్ ఎలా చెబితే అలా నడుచుకుంటామని, కవితకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా భారతి స్పష్టం చేశారు. -
నా బిడ్డ నాకు కావాలి...
సాక్షి, హైదరాబాద్ : అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను పోషించలేక ఓ తల్లి పొత్తిళ్లలోనే పసికందును విక్రయించింది. అయితే తన బిడ్డ తనకు కావాలని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాచారం సీఐ కిరణ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పఠాన్‌చెరువు ప్రాంతానికి చెందిన మీనా, వెంకటేష్ దంపతులు నగరానికి వలసవచ్చి నాచారం అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మీనా ఇళ్లల్లో పాచి పని చేసేది. ఆమెకు మొదట ఆడపిల్ల పుట్టి పురిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత ఆమె మరో కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రసుత్తం ఆ పాప వయస్సు 2.5 ఏళ్లు. మూడోసారి గర్భం దాల్చిన మీనా తనకు మళ్లీ ఆడపిల్ల పుడితే ఎవరికైనా అమ్మేస్తానని నాచారం ప్రాంతానికి చెందిన మధ్యవర్తి జీహెచ్ఎంసీ స్వీపర్ జానకికి చెప్పింది. ఈ క్రమంలో గత జూలై 19న మీనా నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే జానకి మీనాకు ఆడ పిల్ల పుట్టిందని అబద్దం చెప్పింది. అంతేగాక సదరు పసికందును హెచ్‌బీ కాలనీ కృష్ణానగర్‌కు చెందిన రాజేశ్వర్‌రావు, నగినా దంపతులకు రూ.లక్షకు ఇప్పించింది. అందుకు సంబందించి ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. దీంతో రాజేశ్వర్‌రావు, నగినా బిడ్డను తీసుకుని వెళ్లిపోయారు. కాగా మళ్లీ డబ్బులు కావాలని మీనా వెంకటేష్ రాజేశ్వర్‌రావు దంపతులను ఒత్తిడి చేయడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. గురువారం రాత్రి మీనా తన కుమారుడిని తనకు ఇప్పించాలని కోరుతూ నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ఆడ పిల్ల పుట్టిందని చెప్పి మోసం చేశారని నా కొడుకును ఇప్పించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిడ్డ్డను స్వాధీనం చేసుకుని శిశు విహార్‌కు తరలించారు. ఈ ఘటనలో ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిశువును అమ్మిన, కొనుక్కున్న వారివురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏటీఎం చోరికి యత్నించిన దుండగులు
సాక్షి, హైదరాబాద్ : నాచారం చౌరస్తాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎమ్ కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు చోరికి పాల్పడుతుండగా మిషన్ లో ఉన్న సెన్సార్ ఆధారంగా చోరీ జరుగుతుందని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. ఏటీఎమ్ లో ఉన్న డబ్బును దొంగిలించడానికి దుండగులు నానా విధాలుగా ప్రయత్నం చేశారు. చోరీ చేసే యత్నంలో ఏటీఎమ్ మిషన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. -
నాచారంలో సేవ్ వాటార్ మారథాన్
-
భార్యబిడ్డలను బిల్డింగ్‌పై నుంచి తోసేసిన భర్త
-
తల్లీబిడ్డలను కలిపిన డీఎన్ఏ
సాక్షి, హైదరాబాద్: ఆ తల్లీ బిడ్డలను డీఎన్ఏ పరీక్ష కలిపింది. ఎవరి పిల్లలు వారికి దక్కడంతో వారం రోజులుగా తల్లడిల్లిన ఆ తల్లుల కళ్లల్లో ఆనందం వ్యక్తమైంది. హైదరాబాద్‌లోని ఏఎస్ఆర్ నగర్‌కు చెందిన శివకుమార్ భార్య అఖిల, ఎల్బీ నగర్‌కు చెందిన మహేశ్ సతీమణి మనీషారాణి ప్రసవం కోసం ఇటీవల నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. నవంబర్ 29న ఒకే సమయంలో వేర్వేరుగా ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చారు. ప్రసూతి విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది శిశువులకు కట్టిన ట్యాగ్‌ను పరిశీలించకుండానే ఒకరి బిడ్డను మరొకరికి అప్పగించారు. బంధువులకు అనుమానం వచ్చి ఆందోళనకు దిగడంతో అప్రమత్తమైన ఆస్పత్రి వైద్యులు అదే రోజు శిశువులకు రక్త పరీక్ష నిర్వహించి, వారి తల్లులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలపై తమకు నమ్మకం లేదని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని శిశువుల తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఆ మేరకు డిసెంబర్ ఒకటో తేదీన శిశువులు, తల్లిదండ్రుల నుంచి రక్తపు నమూనాలు సేకరించారు. బుధవారం ఉదయం డీఎన్ఏ ఫలితాలు వచ్చాయి. రిపోర్టు ఉన్న సీల్డ్ కవర్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ, శిశువుల తల్లిదండ్రుల సమక్షంలో తెరిచి, అందులో ఏముందనేదీ బయటికి చదివి వినిపించారు. ముందస్తుగా అప్పగించినట్లు ఎవరి శిశువు వారి చెంతే ఉన్నట్లుగా రిపోర్టులో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అప్రమత్తమయ్యాం: ఈఎస్ఐ మెడికల్ సూపరింటెండెంట్ ఆస్పత్రి కి ంది స్థాయి సిబ్బంది పొరపాటు వల్ల చిన్నారుల తారుమారు జరిగిందని నాచారం ఈఎస్ఐ మెడికల్ సూపరెండెంట్ డాక్టర్ పద్మజ చెప్పారు. తల్లిదండ్రులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పట్టు పట్టడంతో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఎవరి పిల్లలు వారి వద్దనే ఉన్నట్లు తేలిందని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగరాదు ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు ఘటనపై చిన్న చిన్న పొరపాట్లే తప్పిదాలకు దారి తీస్తుంది. ఈ విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. – ఎమ్మెల్యే ప్రభాకర్ ఎంతో ఆవేదన చెందాం తమకు కొడుకు పుట్టాడని ఎంతో సంతోషపడ్డాము. ఇంతలోనే శిశువుల తారుమారు ఘటన తమను ఎంతో ఆవేదనకు గురిచేసింది. వారం రోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యాం. చివరకు మా పిల్లలు మా దగ్గర ఉన్నారనే విషయం తెలియడంతో సంతోషంగా ఉంది. – అఖిల, మనీషారాణి -
ఆ చిన్నారులు మారలేదు
-
అమ్మ ఒడికి చేరిన ఆ చిన్నారులు!
సాక్షి, హైదరాబాద్: నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చిన్నారులు తారుమారైన వ్యవహారం సుఖాంతమైంది. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ఎవరి చిన్నారులను వారి తల్లిదండ్రులకు అధికారులు బుధవారం అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎవరి పోలికలు ఉన్న పిల్లలు వారికే చెందడం గమనార్హం. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు తారుమారు కావడంతో వివాదం తలెత్తింది. చిన్నారులు తారుమారు కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వివాదానికి తెరదించేందుకు ఆస్పత్రి అధికారులు డీఎన్ఏ పరీక్షలను ఆశ్రయించారు. డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు చిన్నారులను ఈఎస్ఐ ఆస్పత్రి సంరక్షణలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు డీఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చాయి. వీటి ఆధారంగా తారుమారైన ఇద్దరు శిశువుల తమ తల్లుల ఒడికి చేరుకున్నారు. -
పిల్లలకి వెట్టిచాకిరి నుంచి విముక్తి
-
దొంగతనం నాటకంతో అడ్డంగా దొరికిపోయాడు..
హైదరాబాద్: ఓ వ్యక్తి తన వద్దు ఉన్న నగదును ఎవరో దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేసి...అడ్డంగా బుక్కైయ్యాడు. నాచారంలోని ఆకాశ్‌స్టీల్స్‌లో శర్మ అనే వ్యక్తి సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం నేరేడ్మెట్లోని కొనుగోలు దారుల నుంచి సుమారు రూ.3.50 లక్షల నగదును వసూలు చేసుకున్నాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు డబ్బును ఎత్తుకుపోయారని, శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో శర్మను విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. తానే ఆ సొమ్మును దాచినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3.50 లక్షల డబ్బును రాబట్టి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
ఆటోను నెట్టేందుకు యత్నించి..
-
డోరేమాన్ గణేష్
నాచారం: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చిన్నారులకు డోరేమాన్ పేరు వినిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈ ఏడాది ఆ రూపంలోనే గణపయ్య పూజలందుకోనున్నాడు. నాచారం బాబానగర్‌కు చెందిన సూర్య శుభకర విఘ్నవినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది డోరేమాన్ గణేషుడు రూపుదిద్దుకుంటున్నాడు. 2008 నుంచి ప్రతి ఏటా ఒక్కోథీమ్తో పార్వతీ తనయుడ్ని తీర్చిదిద్దుతూ భక్తుల మన్ననల్ని పొందుతోంది ఈ అసోషియేషన్. -
‘చిరు’ వేడుకలో నిహారిక
నాచారం: నాచారంలోని సాధన మానసిక వికలాంగుల పాఠశాలలో ఆదివారం మెగాస్టార్ పుట్టినరోజును వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగబాబు తనయ నిహారిక, హాస్యనటుడు వేణుమాధవ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎం.సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిహారిక కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం, వృద్ధాశ్రమంలో పండ్లు పంచారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తమ పెదనాన్న పుట్టిన రోజును ఇంతమంది మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందని నిహారిక పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జీ బండారి లకా్ష్మరెడ్డి, బస్వరాజ్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి సాయిజెన్ శేఖర్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ తిండి,నిద్ర ఇక అక్కడే
నాచారం: ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ‘సాక్షి’ దినపత్రిక వినూత్న రీతిలో చేపట్టిన ‘సాక్షి జనసభ’ ఫలాలు ప్రజలకు చేరే సమయం ఆసన్నమైంది. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ‘సాక్షి’ జనసభల సందర్భంగా ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రకటించిన మేరకు ‘48 గంటల బస్తీల్లో బస’ కార్యక్రమానికి శనివారం అంకురార్పణ జరుగుతోంది. నాచారం డివిజన్ జనసభ హెచ్ఎంటీ నగర్ కమ్యూనిటీ హాల్లో మే 13న సాక్షి జనసభ జరిగింది. ఆ సందర్భంగా డివిజన్లో 48 గంటలపాటు బస చేసి.. బస్తీల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 48 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రకటించారు. అలాగే నియోజకవర్గం పరిధిలో జరిగిన ప్రతి డివిజన్ జనసభలోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని.. ‘సాక్షే సాక్ష్యం’గా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు నాచారం డివిజన్‌లోనే గడపనున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ స్పష్టం చేశారు. ‘48 గంటల పాటు బస్తీల్లోనే తిండి.. నిద్ర సర్వస్వం’ అని ఎమ్మెల్యే ప్రకటించారు. శనివారం ఉదయం స్నేహపురి కాలనీ పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించి వీఎస్టీ కాలనీ, భవానీగనర్, కార్తికేయ నగర్, ఎర్రకుంట, నాచారం విలేజ్, అంబేడ్కర్ నగర్, సావర్కర్ నగర్ కాలనీల మీదుగా కొసాగుతుందన్నారు. రెండో రోజు ఆదివారం రాఘవేంద్ర నగర్, అన్నపూర్ణ కాలనీ, ఇందిరానగర్, సాయినగర్, బాపూజీనగర్, హెచ్ఎంటీనగర్ కాలనీలలో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. 48 గంటలు నాచారం డివిజన్లో 13 విభాగాల అధికారులతో కలిసి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. -
కెమికల్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
-
'యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు'
హైదరాబాద్ : నాచారంలోని శాలిస్లైట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న ఆయన హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చన్నారు. ప్రమాదం వెనుక ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. మంటలను అదుపు చేసేందుకు నీటి సమస్య లేకుండా జీహెచ్ఎంసీ ట్యాంకర్లను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అలాగే నగరం మధ్యలో ఉన్న ఫ్యాక్టరీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని మేయర్ తెలిపారు. మంటలార్పేందుకు ఇంకా సమయం పడుతుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని రియాక్టర్లు వరుసగా పేలుతుండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయన్నారు. మంటల దగ్గరకు వెళ్లడం సాధ్యం కావటం లేదని తెలిపారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ఉదయం తొమ్మిది గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని వాచ్మెన్ తెలిపాడు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించి, మంటలు పెరిగాయని పేర్కొన్నాడు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 60 నుంచి 70మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించాడు. కాగా ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నవారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో ఇదే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మంటలార్పేందుకు కావాల్సిన పరికరాలు కూడా ఫ్యాక్టరీలో లేవని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలన్నారు. కాగా ప్రమాదం జరగగానే అందర్ని అప్రమత్తం చేసినట్లు మల్కాజ్గిరి ఏసీపీ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకూ తెలియదని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నాచారం పారిశ్రామికవాడలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో కెమికల్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో సుమారు కిలోమీటరు మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలకు అదుపు చేస్తున్నారు. మంటలు చట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం లేదు. -
విద్యార్థినిపై కారుడ్రైవర్ అఘాయిత్యం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన హెడ్మాస్టార్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నాచారంలోని మల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)పై హెడ్మాస్టర్ కారుడ్రైవర్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి అని గుర్తించిన తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి త్వరలో నాచారం తరలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ సనత్‌నగర్ ఆస్పత్రిని నాచారం తరలింపు ఖాయమైంది. ఈ మేరకు ఈఎస్ఐ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గురువారం ఎంవోయూ కుదిరింది. అయితే ఈ విషయాన్ని 12న కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంయుక్తంగా ప్రకటించే అవకాశం ఉంది. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని కార్పొరేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాచారం ఆస్పత్రిని రాష్ట్ర కార్మికశాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు సనత్‌నగర్ ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరలో నాచారం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. -
నాచారంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నాచారంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాట్రిక్స్ పరుపుల గోడౌన్లో మంటలు ఎగిసిపడటంతో.. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. వరుస అగ్ని ప్రమాదాలపై స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
నాచారం: హైదరాబాద్‌లో ఓ పేకాట కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. మల్లాపూర్ సూర్యానగర్‌లో నివాసం ఉండే భవననిర్మాణ కార్మికులు గత కొన్ని రోజులుగా పేకాట ఆడుతున్నారు. దీనిపై పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం సూర్యానగర్‌లోని పేకాట కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 10 సెల్ఫోన్లు, రూ. 9,070 నగదును స్వాధీనం చేసుకుని నాచారం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పోలీసునంటూ రూ.10 లక్షల దోపిడీ
నాచారం (హైదరాబాద్) : బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకుని తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని తాను లోకల్ పోలీస్‌నంటూ ఓ వ్యక్తి అడ్డగించి ఆ నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం కొలుటూరుకు చెందిన రైతు మల్లారెడ్డి (65)... మంగళవారం ఉదయం శామీర్‌పేటలోని సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకున్నాడు. అనంతరం నాచారం హెచ్ఎంటీ కాలనీలోని తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళుతున్నాడు. హబ్సిగూడ దాటిన తర్వాత ఓ వ్యక్తి మల్లారెడ్డిని ఆపాడు. తాను స్థానిక పోలీస్‌నని, బండి కాగితాలు చూపించాలని కోరాడు. దీంతో మల్లారెడ్డి బండిలో ఉన్న కాగితాలను చూపించే పనిలో ఉండగా నగదు బ్యాగుతో ఆ నకిలీ పోలీస్ పరారయ్యాడు. మల్లారెడ్డి లబోదిబోమంటూ నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
నాచారం (హైదరాబాద్) : బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాచారం రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉండే శిరీష(20) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాగా సోమవారం సాయంత్రం ఇంట్లో అందరూ ఉండగానే పడకగదిలోకి వెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూసేసరికి శిరీష సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. కిందికి దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే శిరీష మృతికి గల కారణాలు తెలియరాలేదు. -
డబ్బు పెట్టారు.. తీశారు
‘ఏటీఎం’ సిబ్బంది చేతివాటం నిందితుల రిమాండ్ రూ. 73 లక్షల రికవరీ నాచారం: అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశారు.. ఇటీవల ఏటీఎంలలో డబ్బులు పెట్టే ఉద్యోగులు చోరీకి పాల్పడిన కేసు నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలు వెల్లడిస్తూ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం అల్వాల్ డీసీపీ రమారాజేశ్వరి, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మద్దెల సుధీర్(24), గొల్ల మనోజ్(24), హైదరాబాద్ నేరేడ్మెట్కు చెందిన ముత్త అశోక్(26) చెందిన క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్(సీఎంఎస్) సంస్థలో కస్టోడియన్లుగా ఈసీఐఎల్ రూట్లో విధులు నిర్వహిస్తున్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు ఈ ఉద్యోగులు 23 ఏటీఎంలలో రూ.1.49 కోట్లు మాయం చేశారు. ముంబాయిలోని సీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆడిట్లో ఏటీఎంలలో పెట్టిన డబ్బులకు, డ్రా చేసిన డబ్బులకు భారీగా తేడా రావడంతో గత ఏప్రిల్ 19న నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను నాచారం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి రూ.73 లక్షలు రికవరీ చేశారు. దొంగిలించిన డబ్బుతో స్నేహితులతో కలసి గర్రపు పందేలు, ఇతర జల్సాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. చోరికి పాల్పడింది ఇలా... నిందితులు ఏటీఎంలలో డబ్బులు పెట్టే సమయంలో ఇద్దరు ఉంటారు. వారికి వేర్వేరుగా సీక్రెట్ కోడ్ ఉంటుంది. ఎవరి కోడ్ నెంబర్ వారు ఏటీఎం మిషన్‌లో కొడితే ఈ మిషన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు వారు డబ్బులు పెట్టి వెంటనే సీఎంఎస్ ప్రధాన కార్యాలయానికి మెసేజ్ (ఎస్ఎంఎస్ ) పంపుతారు. జల్సాలకు అలవాటు పడిన సుధీర్ డబ్బులు కాజేయడానికి పథకం రూపొందించాడు. డబ్బులు పెట్టిన అనంతరం ఆ ముగ్గురిలో ఒకరిని ఏటీఎంకు పంపి వారి వద్ద ఉన్న రెండు కోడ్ నంబర్లను చెబుతారు. అతడు మిషన్లను ఒపెన్ చేసి ఇష్టం వచ్చినంత డబ్బును నేరుగా తీసుకుంటాడు.. దర్యాప్తు ప్రారంభించిన నాచారం పోలీసులు నిందితులను వారి నివాసంలో అరెస్ట్ చేశారు. సుధీర్ నుండి 87లక్షలు, అశోక్ నుండి 6 లక్షలు, మనోజ్ నుండి 10లక్షల రూపాయలు రికవరీ చేశారు. ఇంకా 76 లక్షల రూపాలు రికవరీ కావలసి ఉంది. -
నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరచి..
ఉద్యోగి అరెస్ట్ సిటీబ్యూరో: నాచారంలోని ఏపీ ఫుడ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం కథనం మేరకు.. నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన కె.రవికుమార్ (44) నాచారంలోని ఏపీ ఫుడ్స్‌లో పర్సనల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ యూనియన్‌లో ఆధిపత్య పోరు నెలకొనడంతో తన ప్రాబల్యం తగ్గిందని, ఇద్దరు మహిళా ఉద్యోగులపై కక్ష కట్టాడు. హెల్త్ కార్డుల కోసం అక్కడి ఉద్యోగులు పాస్‌పోర్టు ఫొటోలను రవికుమార్‌కు ఇచ్చారు. అందులో ఆ ఇద్దరు మహిళల ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను తెరిచి, అసభ్యకర దృశ్యాలు, వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు సైబర్‌క్రైమ్ అదనపు డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆశిష్‌రెడ్డి నిందితుడిని గుర్తించి శనివారం అరె స్టు చేశారు. -
పేకాట స్థావరాలపై దాడులు, ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ నాచారంలో పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి లక్షా 13వేల రూపాయల నగదుతో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు ఈ దాడి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేకాట స్థావరాలతో పాటు, క్లబ్‌లపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. -
ఇక్కడి సంస్థకు.. అక్కడి అధికారి!
హైదరాబాద్: పునర్విభజన చట్టానికి భిన్నంగా నాచారంలోని ఏపీ ఫుడ్స్ వ్యవహారం సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు బాలామృతం పేరిట పౌష్టికాహారాన్ని ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. విభజన చట్టంలోని 9వ షెడ్యూలులో ఏపీ ఫుడ్స్‌ను చేర్చారు. చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం సంస్థ ఎక్కడ ఉంటే అది ఆ రాష్ట్రానికే చెందుతుంది. ఏపీ ఫుడ్స్‌కు మరెక్కడా యూనిట్లు లేనందున ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. కానీ, ఈ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారిని నియమించలేదు. ఐఏఎస్ అధికారుల కొరతకారణంగా ఈవైపు దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎండీగా ఉన్న విజయ్‌మోహన్ కర్నూలు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని సంస్థ కార్మికసంఘం అధ్యక్షుడు కూడా అయిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కార్మికనేతలు వివరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తెలంగాణ ప్రభుత్వ అధికారిని నియమిం చేలా చూస్తానని నాయిని హామీ ఇచ్చినా ఫలితం లేదు. ఎండీ బదిలీ కాగానే ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న బాలమాయదేవిని ఇన్చార్జ్ ఎండీగా నియమించారు. -
ఒకే ఫ్లాట్ఇద్దరికి రిజిస్ట్రేషన్; నిందితుడి అరెస్టు
హైదరాబాద్: ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి మోసగించిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ వై.శ్రీనివాస్ కుమార్ తెలిపిన ప్రకారం, నాచారం రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్ మజీద్(38), నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ సిరాజుద్దీన్(45) ఇద్దరు స్నేహితులు, రాఘవేంద్రనగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఫ్లాట్‌ను ముందుగా తన స్నేహితుడైన మహ్మద్ సిరాజుద్దీన్‌కు రిజిస్ట్రేషన్ చేశాడు. అతను పూర్తిగా డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ అదే ఫ్లాట్‌ను వేరొకరికి అమ్మి రిజిస్ట్రేషన్ చేశాడు. మొదట రిజిస్ట్రేన్ చేసిన వ్యక్తి మహ్మద్ సిరాజుద్దీన్ ఆ ఫ్లాట్ పేపర్లు, చెరువులో ఉన్న నాలుగు ఓపెన్ ఫ్లాట్స్ పేపర్లు పెట్టి 2012లో బర్కత్‌పురలోని రాజధాని కో ఆపరేటివ్ భ్యాంకులో లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్‌లో కొంత చెల్లించగా, ఇంకా రూ.28 లక్షల వరకు పెండింగులో ఉంది. ఎంతకూ తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో అతను బ్యాంకులో కుదువపెట్టిన ఫ్లాట్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా, నాలుగు ఓపెన్ ఫ్లాట్స్ చెరువులో ఉన్నట్లు, రాఘవేంద్రనగర్‌లోని ఫ్లాట్ వేరేవారికి రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. దీంతో కంగుతున్న బ్యాంకు అధికారులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిలో సయ్యద్ అబ్దుల్ మజీద్‌ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్ సిరాజుద్దీన్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో కారు ఢీ కొని ఇద్దరు మృతి
నాచారం టెలిఫోన్ ఎక్సేంజి సమీపంలో కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకున్న లారీని పక్కన అపి ఆ లారీ డ్రైవర్, క్లీనర్ అడ్రస్ కనుకొనేందుకు రొడ్డుపై ఉన్న స్థానికులను అడుగుతున్నారు. ఆ క్రమంలో వేగంగా వచ్చిన ఓ కారు డ్రైవర్, క్లీనర్లను ఢీ కొట్టింది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే సమీపంలోని నాచారంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో టి.జేఏసీ సమావేశం ప్రారంభం
తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకునేందుకు కార్యచరణ రూపొందిస్తామని టి.జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం వెల్లడించారు. శనివారం నగర శివారులో నాచారంలోని నోమ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. న్యూఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలంగణావాదులకు సూచించారు. ఆ అంశంపై ఈ రోజు సమావేశంలో సమీక్ష జరుపతామన్నారు. అయితే ఈ రోజు జరిగే ఆ సమావేశంలో ఈ నెల 30న నిర్వహించనున్న సదస్సు, హైదరాబాద్ ఉమ్మడి రాజధానితోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఏర్పడిన పరిణామాలపై చర్చించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేకేతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు.